kama reddy
-
‘వాటిని మేనిఫెస్టోలో చేర్చండి.. లేదంటే 200 మంది నామినేషన్ వేస్తాం’
కామారెడ్డి జిల్లా: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి సమాయత్తమవుతోంది తెలంగాణ అమరుల ఐక్యవేదిక. దీనిలో భాగంగా రెండొందల మంది అమరుల కుటుంబ సభ్యులు నామినేషన్ పత్రాల కోసం కామారెడ్డికి వచ్చినట్లు తెలంగాణ అమరుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన రఘుమారెడ్డి.. తెలంగాణలో 1345 మంది తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైతే కేవలం 400 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొంతమందికి నాల్గవ తరగతి ఉద్యోగాలు ఇవ్వగా, మరికొంతమందికి ఐదేళ్ల తర్వాత రూ. 10 లక్షల చొప్పున ఇచ్చారన్నారు. ‘రైల్ రోకో, బస్ రోకో చేసిన సమయంలో 175 మంది వికలాంగులుగా మారారు.. వీరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. చదువుకున్న వారికి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. చదువుకోని వారికి ఒక్క కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాలి. తమ డిమాండ్లు ఈ నెల 9 మధ్యాహ్నం 12:30 లోపు కేసీఆర్ తమను పిలిచి మేనిఫెస్టోలో చేర్చాలి. లేకపోతే ఆ రోజు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేసిన మరుక్షణమే 200 మంది అమరుల కుటుంబాలు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. కామారెడ్డితో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో కూడా నామినేషన్స్ వేస్తాం’ అని హెచ్చరించారు. నేను కందిపప్పు అయితే నువ్వు గన్నేరు పప్పు: కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్ -
కామారెడ్డిలో పోటీపై షబ్బీర్ అలీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తాను నియోజవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని షబ్బీర్ ఆలీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కామారెడ్డి వచ్చారన్నారు. తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనని షబ్బీర్ ఆలీ తేల్చిచెప్పారు. ‘కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నాను. కామారెడ్డికి రండి.. ఇద్దరం పోటీలో ఉందాం. ఇద్దరం ప్రజాక్షేత్రంలో తలబడదాం. మీ నిజాయితీని నిరూపించుకోండి. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ప్రజలే నిర్ణయిస్తారు. అంతే కానీ నీవు అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరు’ అని తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థిగా కేసీఆర్‌ఉండటంతోనే పోటీకి షబ్బీర్ ఆలీ విముఖత వ్యక్తం చేస్తారనేది ఆ రూమర్ల సారాంశం. కేసీఆర్‌పై పోటీకి దిగితే అది తన పొలిటికల్ కెరీర్‌పై పడుతుందంటూ వార్తలు వ్యాపించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని తాజాగా ఖండిస్తూ తన పోటీ కామారెడ్డి నుంచేనని స్పష్టం చేయడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
కేసీఆర్‌తో కలిసి నడిచాడు, కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యే: కేటీఆర్
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని అన్నారు. పైసలు, పదవుల కోసం సురేందర్ రాజకీయల్లోకి రాలేదని, తెలంగాణ రావాలని కేసీఆర్‌తో కలిసి నడిచారని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌ను, మంత్రులను సురేందర్ ఎప్పుడు కలిసినా మా నియోజకవర్గం వెనుకబడింది, నిధులు కేటాయించాలని అడుగుతారని కేటీఆర్ గుర్తు చేశారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.20 కోట్ల 31లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే అత్యధికంగా 1లక్షా 3 వేల మందికి రైతు బంధు అందుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం రైతులు అవస్థలు పడ్డారని విమర్శించారు. కరెంట్ లేక సాగునీరు కోసం రైతులు అడుక్కోవాల్సి వచ్చిందన్నారు. విత్తనాలు, ఎరువు పోలీస్ స్టేషన్లో పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 10 సార్లు ఓటేస్తే రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీవి నీతి లేని మాటలని కేటీఆర్ ధ్వజమెత్తారు. హిందూ, ముస్లిం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదని ఫైర్ అయ్యారు. రాబంధులు రావాలా రైతు బంధు కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కుంభకోణాలేనని విమర్శించారు. హస్తం పాలనలో దుర్భిక్షం.. బీఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలమని తెలిపారు. కాగా 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసిన సురేందర్ సమీప టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్) అభ్యర్థిపై 31,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకముందు మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను కేటీఆర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. -
పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు
సాక్షి, కామారెడ్డి: పెళ్లి రిసెప్షన్లో కొందరు యువకుడు వీరంగం సృష్టించారు. తుపాకీలు, కత్తులు చేతపట్టి డ్యాన్స్ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 10వ తేదీ రాత్రి మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కొడుకుతోపాటు మరికొందరు యువకులు తల్వార్, గన్లతో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వీడియోలను కొందరు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వరుడితోపాటు స్నేహితులనుఅదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
మామూలు మోసం కాదిది
-
ప్రజా యుద్ధంతోనే సమాజానికి రక్షణ: కూర రాజన్న
సాక్షి, కామారెడ్డి: ప్రజాయుద్ధంతోనే సమాజానికి రక్షణ ఉంటుందని సీపీఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న అన్నారు. భూస్వాములను, దొరలను ప్రభుత్వాలు, పోలీసులు రక్షిస్తున్నాయని పేర్కొన్నారు. తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని, తాను పారిపోయినట్లు పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. పదిహేను సంవత్సరాల క్రితం సాగర్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, కానీ ఆ వ్యక్తిని కూడా తమతో కలిపి కేస్ చేయడం సరికాదన్నారు. బీడీ కంపెనీలు రక్షణ కోసం ఫండ్ ఇవ్వడం ఆనవాయితీ అని, కానీ కావాలనే డబ్బులు డిమాండ్ చేసినట్లు తప్పుడు కేసు పెట్టారని కూర రాజన్న పెట్టారు. పెట్టిన కేసును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. కామారెడ్డిలో చందాల వసూళ్ల కేసులో రాజన్న బెయిల్ మంజూరు కావడంతో 10 నెలల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
కామారెడ్డి.. ఎల్లారెడ్డి.. కుమ్ములాటకు రెడీ
ఇందూరు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్దం జరుగుతోందా? కొందరు నేతలు టిక్కెట్ల కోసం పాము, ముంగిసల్లా కాట్లాడుకుంటున్నారా? వీళ్ళ వ్యవహారం జిల్లా నుంచి ఢిల్లీ దాకా పాకిపోయిందా? గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో కొందరి కారణంగా పుట్టి మునిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎడమ చేయి vs కుడి చేయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీని కాంగ్రెస్ స్థానిక నేతలు చేతులారా దెబ్బ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఎవరికి వారు పోటీ పడుతూ.. కొట్లాడుకుంటున్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గానికి... ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్‌రావు ఓ కొరకరాని కొయ్యలా మారాడు. ఎల్లారెడ్డి టిక్కెట్‌ను ఇప్పటికే సుభాష్ రెడ్డి అనే నేత ఆశిస్తున్నారు. అయితే మదన్ మోహన్ చేసుకుంటున్న ప్రచారంతో... సుభాష్ రెడ్డితో పాటు...షబ్బీర్ అలీకి దిక్కుతోచని పరిస్థితులేర్పడ్డాయి. పైగా సుభాష్ రెడ్డీకి షబ్బీర్ అలీ మద్దతుగా ఉంటున్నందుకు...మదన్మోహన్ ఆయనకు కూడా ఎర్త్ పెడుతున్నాడు. అప్పుడప్పుడు టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ను తీసుకొచ్చి... అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి తాను బరిలోకి దిగుతానంటూ స్టేట్ మెంట్స్ కూడా ఇప్పిస్తుండటంతో.. షబ్బీర్ వర్గీయుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడిన్టవుతోంది. ఈ క్రమంలోనే...పీసీసీ చీఫ్ రేవంత్ పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య మరోసారి బాహాబాహీకి తెరలేచింది. నీ గుట్టు నేను విప్పుతా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించే రచ్చబండ కార్యక్రమాల సమయంలో.. ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్, సుభాష్ రెడ్డి గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎల్లారెడ్డిలో రేవంత్ సభ జరిగిన సమయంలో కూడా రచ్చ జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కార్ల కాన్వాయ్ ఒకటి వచ్చి సుభాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం.. సదరు ఎమ్మెల్యే స్టిక్కర్ కారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి,. మదన్ మోహన్ స్వయానా ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు. మంత్రి స్టిక్కర్ కార్ల కాన్వాయ్ ఘటనతో మదన్ మోహన్ పై కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఏఐసీసీ స్థాయిలో ఉన్న తన పలుకుబడితో మదన్ మోహన్ సస్పెన్షన్ అమలవకుండా చేసుకోగలిగారు. ఇటవంటి ఘటనలన్నీ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. అంతేకాదు, ఒకసారి కామారెడ్డిలో మదన్ మోహన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన అజారుద్దీన్... అధిష్ఠానం ఆదేశిస్తే తాను కామారెడ్డి బరిలో ఉంటానని..ఇంకోసారి ఎల్లారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పారు. ఇలా షబ్బీర్ వర్గానికి వ్యతిరేకంగా మదన్ మోహన్ వర్గం జిల్లాలో సీరియస్‌గా పనిచేస్తోంది. అటు షబ్బీర్‌కు, ఇటు సుభాష్‌రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి తీసుకువస్తున్నారు మదన్మోహన్. తగ్గేదే లేదట.! కామారెడ్డి, ఎల్లారెడ్డి చూసుకుంటానని చెప్పడానికి షబ్బీర్ అలీ ఎవరని ప్రశ్నిస్తూ మదన్మోహన్ కామారెడ్డిలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏడుసార్లు ఓటమి పాలైన షబ్బీర్ ముందు కామారెడ్డిలో గెలిచి.. ఎల్లారెడ్డి సంగతి చూడాలని సూచించారు. టిక్కెట్లు పంపిణీ చేసేందుకు.. షబ్బీర్ అలీ టీపీసీసీ అధ్యక్షుడో, ఏఐసీసీ అధ్యక్షుడో కాదంటూ మదన్ మోహన్ కామెంట్ చేశారు. కచ్చితంగా తాను ఎల్లారెడ్డి నుంచి బరిలో ఉంటానని తేల్చి చెప్పిన మదన్ మోహన్.. ప్రజలు తిరస్కరిస్తే ఓ కార్యకర్తలా పనిచేయడానికీ సిద్ధమేనంటూ తన మనోగతాన్ని వివరించారు. అదే సమయంలో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా తన గళాన్ని గట్టిగా వినిపించాడు. దీంతో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది: రేవంత్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌పై రైతులంతా తిరుగుబాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మనఊరు మనపోరు’ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో ప్రతిరైతు సంతోషంగా ఉంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న కేసీఆర్.. రైతులకు ఆ మాత్రం చేయలేరా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. పంజాబ్, హర్యానా రైతులకంటే నిజామాబాద్ రైతులు చైతన్యవంతులని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ముఖ్యమంత్రి కూతురు కవితను ఓడించారని గుర్తు చేశారు. గెలిపిస్తే పసుపు బోర్డ్ తెస్తామని హామీ ఇచ్చి మరచిన ఎంపీని కూడా ఓడించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. -
రైలుబండెక్కి వచ్చెత్త పా..! ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా..
బతుకుదెరువు కోసం తెలంగాణ పల్లెల నుంచి ముంబయికి వలసలు కొత్తకాదు. దశాబ్దాల కాలంగా ముంబయి నగరం ఎందరికో బతుకునిచ్చింది. ఇప్పటికీ ఎందరో వెళుతుంటారు. అప్పట్లో అక్కడకు వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చాల్సి వచ్చేది. బస్సుల్లో అవస్థల ప్రయాణం ఆపై అడ్డగోలు చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అయితే సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా రైలు నడపడంతో ఈ ప్రాంత ప్రజలకు ముంబయి వెళ్లి రావడం సులువైంది. మూడు దశాబ్దాల నాడు అంటే 1992లో ‘దేవగిరి’ ఎక్స్‌ప్రెస్ పేరుతో ముంబయికి రైలు మొదలైంది. ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా నడుస్తోంది. మొన్నామధ్య లాక్డౌన్ సమయంలో కొంతకాలమే రైలు నిలిచింది. తరువాత యథావిధిగా నడుస్తోంది. కాగా తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేల కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. అలాగే ఉన్నత చదువుల కోసం, ఉద్యోగరీత్యా వెళ్లినవారూ ఉన్నారు. బంధుత్వాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా ముంబయితో ఎంత అనుబంధం ఉందో, దేవగిరి ఎక్స్ప్రెస్తోనూ ప్రజలకు అంతే అనుబంధం పెరిగింది. – సాక్షి, కామారెడ్డి రైలు ఆగేచోటల్లా ఎక్కేస్తారు.. సికింద్రాబాద్ నుంచి ముంబయికి 878 కిలోమీటర్లు దూరం కాగా, దేవగిరి ఎక్స్‌ప్రెస్ దాదాపు 17 గంటల నుంచి 18 గంటల పాటు నడుస్తుంది. సికింద్రాబాద్‌తో పాటు మెదక్ జిల్లాలోని మిర్జాపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముథ్కేడ్, నాందేడ్ స్టేషన్ల మీదుగా రైలు ముందుకు సాగుతుంది. కాగా కామారెడ్డి రైల్వే స్టేషన్ సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లా వాసులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ముంబయి వెళ్లేవారంతా కామారెడ్డికి వచ్చి రైలు ఎక్కి వెళతారు. ముంబయి నుంచి వచ్చే వారు కూడా కామారెడ్డి స్టేషన్లో దిగి ఇక్కడి నుంచే సొంతూళ్లకు వెళతారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ వచ్చిందంటే చాలు కనీసం వంద మంది దిగుతారు. రోజూ వెయ్యి మందికి పైగా.. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు ఉండగా, అందులో రెండు మూడు మాత్రమే జనరల్ బోగీలు కాగా, మిగతావి రిజర్వేషన్‌వి. ముంబయి వెళ్లేవారంతా రిజర్వు చేసుకుని వెళతారు. దాదాపు వెయ్యి మంది రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణం చేస్తుండగా, ఇతర స్టేషన్లు దిగేందుకు, జనరల్ బోగీల్లో మరో వెయ్యి మంది వరకు వెళతారని అంచనా. కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ల ద్వారా ముంబయి నగరానికి ప్రతిరోజూ కనీసం వంద మంది వెళ్లినా సంవత్సరానికి 30 వేల మంది వెళుతుంటారు. ముప్పై ఏళ్ల కాలంలో పది లక్షల మంది వెళతారు. తిరుగు ప్రయాణంలో కూడా అదే స్థాయిలో వస్తుంటారు. ఈ లెక్కన మూడు దశాబ్దాల కాలంలో దాదాపు 20 లక్షల మంది తిరిగినట్టు అంచనా. దేవగిరితో ఎంతో అనుబంధం.. మూడు దశాబ్దాలుగా నడుస్తున్న దేవగిరితో ఈ ప్రాంత ప్రజలకు అనుబంధం ఏర్పడింది. రైల్లో ఏ నంబరు బోగీ ఎక్కడ వస్తుందో ఇట్టే చెప్పేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకోవడం, బెర్త్, టూ టైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ తదితర రిజర్వేషన్ల గురించి కూడా చాలా మందికి అవగాహన కలిగింది. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట, రామారెడ్డి, సదాశివనగర్, బీబీపేట, మెదక్ జిల్లాలోని రామాయంపేట, మెదక్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. కొందరైతే నెలకోసారైనా సొంతూళ్లకు వచ్చి వెళుతుంటారు. పెళ్లిళ్ల సీజన్ ఉందంటే చాలు బంధువుల పెళ్లిళ్ల కోసం ముల్లేమూటలతో వచ్చి వారం, పదిరోజులు ఉండి వెళతారు. పండుగల సమయంలో కూడా వచ్చి వెళ్తారు. దీంతో దేవగిరితో ఆ కుటుంబాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. పదేళ్లుగా.. మాకు ముంబయిలో వ్యాపా రాలున్నాయి. మా అమ్మా, నాన్న అక్కడే ఉంటారు. నేను కూడా చాలా కాలం అక్కడే ఉండేవాన్ని. పదేళ్లుగా ఇక్కడికి వచ్చి ఉంటున్నా. వందల సార్లు దేవగిరిలో ముంబయికి వెళ్లాను. మాకు ముంబయికి ఎంత అనుబంధమో, దేవగిరికి కూడా అంతే అనుబంధం ఉంది. –రాఘవేందర్, వ్యాపారి, కామారెడ్డి రెగ్యులర్‌గా వెళతాం దుస్తుల కొనుగోళ్ల కోసం ముంబయికి ప్రతీసారి దేవగిరిలోనే వెళతాం. తిరిగి రావడం కూడా అదే రైలులోనే. ఏళ్ల తరబడిగా అందులో ప్రయాణిస్తున్నాం. దేవగిరి రైలు కామారెడ్డి ప్రాంత ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంది. ఉదయం కల్లా ముంబయిలో దిగి పనులు చేసుకుని, తిరిగి రాత్రి రైలెక్కుతాం. - సుధాకర్, వ్యాపారి, కామారెడ్డి ముంబయి తొవ్వలో దేవగిరి ఎక్స్‌ప్రెస్ ∙మూడు దశాబ్దాలుగా సేవలు ∙ఉమ్మడి జిల్లావాసులకు అనుకూలం ∙రైలుతో విడదీయలేని అనుబంధం ముంబయికి వెళ్లేందుకు దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎక్కుతున్న ప్రయాణికులు -
కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కామారెడ్డిలోని మంగళవారం ఉదయం ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి ఘటన అంతా డ్రామాగా తేలింది. కానీ ఏ వ్యక్తి కూడా ఆమెపై కత్తితో దాడి చేయలేదని, తనకు తానే బ్లేడుతో గొంతు కోసుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిషాక్ ఫిర్దౌసి అనే మహిళ.. ఎవరో గొంతు కోశారంటూ హై డ్రామా నడిపింది. సీన్లోకి రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ సేకరించారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. విచారణ జరిపి అసలు నిజాన్ని బయట పెట్టారు. తనే గొంతు కోసుకుని డ్రామా ఆడిందని పోలీసులు వెల్లడించారు. నిషాక్ వింత ప్రవర్తనతో అత్తమామలు షాక్ అయ్యారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని.. రెండు నెలల క్రితం ఉరివేసినట్లుగా నిషాక్ పడిపోయినట్లుగా సమాచారం. ఎవరో తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ఇవీ చదవండి: వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..! -
భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
గాంధారి (ఎల్లారెడ్డి): భార్య మహిళా కానిస్టేబుల్.. ఆమె ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై ఎన్నిసార్లు వారించినా ఆమె పట్టించుకోలేదు. పైగా ఎస్సైతో దాడి చేయించింది. దీన్ని భరించలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు నిందితులను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నాచేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాం ధారి మండలం మాధవపల్లిలో చోటుచేసుకుంది. పోలీస్తుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర దెగులూర్ తాలూకాలోని షాకూర్ గ్రామానికి చెందిన శివాజీరావు 15 ఏళ్ల క్రితం మాధవపల్లికి చెందిన రైతు బాజారావు ఇంటికి ఇల్లరికం వచ్చాడు. బాజారావుకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రజితను శివాజీరావుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు పుట్టిన రెండేళ్లకు అనారోగ్యంతో రజిత మృతి చెందింది. దీంతో బాజారావు రెండో కూతురు సంతోషితో శివాజీరావుకు రెండో పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం సంతోషికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి కామారెడ్డికి కాపురం మార్చారు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో సంతోషికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శివప్రసాద్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భర్తను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన శివాజీరావు ప్రవర్తన మార్చు కోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో సంతోషి, ఎస్సై కలిసి శివాజీరావును మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి నుంచి మాధవపల్లికి వచ్చిన శివాజీరావు తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. గాంధారి ఎస్సై శంకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల ధర్నా సమాచారం అందుకున్న సంతోషి కామారెడ్డి నుంచి గ్రామానికి చేరుకుంది. శివాజీరావు బంధువులు పెద్ద సంఖ్యలో మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి వచ్చారు. అతని చావుకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని పట్టుపట్టారు. పోలీసులు ఎవరి కంట పడకుండా సంతోషిని దొడ్దిదారిన పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోపోద్రిక్తులైన మృతుని బంధువులు ప్రధాన రహదారిపై రాళ్లు అడ్డంగా వేసి ధర్నా చేశారు. బుధవారం ఉదయం 10 వరకు ఆందోళన కొనసాగింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు చెప్పడంతో ఆందోళన విరమించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కామారెడ్డి జిల్లా: చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
-
చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి నీటి కోసం గ్రామ శివారులోకి రాగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు ఎలుగుబంటిని తరిమికొట్టగా గ్రామ శివారులో గల నీళ్లు లేని బావిలో పడింది. దాంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా వలల సహాయంతో ఎలుగుబంటిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తుల అరుపులు కేకలతో ఓ సందర్బంలో దాడి చేయడానికి ఎలుగుబంటి ప్రయత్నించి అడవిలోకి పారిపోయింది. చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుమీదే -
ఈ భాషలన్నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొట్టిన పిండి!
సాక్షి , కామారెడ్డి: ‘ఆ ఎమ్మెల్యే మరాఠీ మాట్లాడే గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన వారినల్లా ‘కసే అహత్’ అంటూ మరాఠీలో వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. కన్నడ మాట్లాడే గ్రామాలకు వెళితే ‘నీవు హేగిద్దిరే’ అంటూ కన్నడలో మాట్లాడి వారి కష్టసుఖాలను కనుక్కుంటారు. అలాగే తెలుగు మాట్లాడే గ్రామాలకు వెళితే ‘బాగున్నరా..’ అంటూ తెలుగులో మాట్లాడతారు. ఆయనే బహు భాషల సమ్మేళనమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హన్మంత్ సింధే. ఆయనకు పలు భాషలు వచ్చు. అందుకే నియోజకవర్గంలో ఏ భాషవాళ్లు కలిస్తే వారి భాషలో మాట్లాడతారు. నియోజకవర్గంలో గిరిజనుల జనాభా కూడా ఎక్కువే. లంబాడీ భాషలో కూడా ఆయన అనర్గళంగా మాట్లాడతారు. అలాగే అధికారుల దగ్గరకు వెళ్లినపుడు ఇంగ్లీషు భాషను ఉపయోగిస్తారు. హిందీ మాట్లాడే అవకాశం ఉంటే హిందీలో మాట్లాడతారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వారితో ఆయా భాషల్లో మాట్లాడాల్సిందే. ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధేకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు కన్నడ, మరాఠీ భాషలు కూడా వచ్చు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఏ భాష మాట్లాడితే ఎమ్మెల్యే కూడా వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామం దాటితే కర్ణాటక రాష్ట్రం వస్తుంది. దీంతో జుక్కల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చాలా వరకు కన్నడనే మాట్లాడతారు. అలాగే మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. ఇక్కడ చాలా వరకు మరాఠీ మాట్లాడుతారు. పలు గ్రామాల్లో మరాఠీ మీడియం స్కూళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలా జుక్కల్ నియోజకవర్గం మూడు భాషల సంగమంలా ఉంటుంది. ఎమ్మెల్యే సింధే ఎన్నికల సమయంలో ప్రచారంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడుతారు. ప్రతి సభలో ఆయన మూడు భాషలలో మాట్లాడి ఆకట్టుకుంటారు. దీంతో ప్రజలు కూడా ఆయనంటే అభిమానం చూపిస్తారు. ఎమ్మెల్యే వివిధ భాషల్లో మాట్లాడడాన్ని కొత్తవారు ఆసక్తిగా చూస్తుంటారు. చదవండి: నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ ‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్లో సోడా పోశాడు’ -
బయటపడ్డ భర్త బాగోతం.. చితకబాదిన మొదటి భార్య
సాక్షి, కామారెడ్డి : గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుని కామారెడ్డి అశోక్‌నగర్ కాలనీలో మకాం పెట్టిన ఓ భర్తను పట్టుకొని మొదటి భార్య దేహశుద్ది చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా ముఠా కొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య ధనలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వ్యాపారం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరశురాం మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా కామారెడ్డికి చెందిన ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది. దీంతో సోమవారం బంధువులతో కలిసి వచ్చి, పరశురాంను పట్టుకుని చితకబాది తమ వెంట తీసుకెళ్లారు. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని రెండో భార్య కవిత ఆరోపించింది. చదవండి : అంగట్లో ఆడపిల్ల: ఏడు నెలల్లో ఏడు సార్లు ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక -
ప్రియుడి మోజులో పడి.. ముక్కలుగా నరికి
నిర్మల్ : వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మహిళ ప్రియుడితో కలిసి çకట్టుకున్నవాడిని నిర్ధాక్షిణ్యంగా చంపింది. మిస్టరీగా మారిన హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా మామడ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని మో ర్తాడ్‌కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ (45)ను భార్య యాస్మిన్‌బేగం, ఆమె ప్రియుడు మహ్మాద్ అథాఉల్లాలు కలిసి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మామడ మండలం బూరుగుపల్లి జాతీయరహదారి సమీపంలో రోడ్డు పక్కన పడవేశారు. ఈ క్రమంలో గత డిసెంబర్ 25న రహదారి పక్కన పొదల్లో మూట కనిపించగా గ్రామస్తులు విప్పి చూశారు. అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవాన్ని గుర్తించారు. స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించగా సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో కొన్ని ఆధారాలు సేకరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన భర్త అబ్దుల్ సమద్ పైసల్ కనిపించడం లేదని అతడిభార్య యాస్మిన్‌బేగం మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. మామడ పోలీసులు ఆ దిశగా విచారణ జరిపారు. పైసల్ భార్య యాస్మిన్‌ను పిలిపించి కుళ్లిన స్థితిలో ఉన్న శవం ఫొటోల ను చూపించగా తన భర్త ఆనవాళ్లు కావని చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు పైసల్ అక్క, స్నేహితులను పిలి పించి శవానికి సంబంధించిన ఆనవాళ్లు చూపించారు. వారు సమద్ పైసల్‌గా గుర్తించారు. అనుమానంతో పోలీసులు యాస్మిన్‌తోపాటు ప్రియుడు మహ్మద్ అథాఉల్లాను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో నిజాలు బయటపడ్డాయి. ప్రియుడి మోజులో పడి.. మోర్తాడ్‌కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, భార్య యాస్మిన్ బేగం బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఆటోడ్రైవర్ మహ్మద్ అథాఉల్లాతో యాస్మిన్ బేగంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్త పద్ధతి మార్చుకోవాలని భార్యకు చెప్పడంతోపాటు కమిటీ సభ్యులకూ ఫిర్యాదు చేశాడు. కమిటీ సభ్యులు మహ్మాద్ అథాఉల్లాను హెచ్చరించి పైసల్ ఇంటికి వెళ్లరాదని సూచించారు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు పడుతున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రణాళిక రూపొందించారు. గతనెల 16న రాత్రి సమయంలో అబ్దుల్ సమద్ పైసల్‌ను ఇంట్లోనే కర్రతో అథాఉల్లా దాడి చేయగా అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం యాస్మిన్ ప్రియుడితో కలిసి భర్త మెడకు తాడు బిగించి చంపివేశారు. 17న శవాన్ని ఇంట్లోనే ఉంచి కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి పడేద్దామని అనుకుని కాలును తొలగించి ముక్కముక్కలుగా చేశారు. శరీరం ముక్కముక్కలుగా చేయడం ఆలస్యం అవుతుందని కిరోసిన్‌తో ముఖం ఆనవాలు ఏర్పడకుండా కాల్చివేశారు. అనంతరం శరీరాన్ని సంచులలో బ్లాంకెట్‌లో చుట్టి డిసెంబర్ 18న ఆటోలో తీసుకువచ్చి నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన పొదలో పడేసి వెళ్లిపోయారు. మృతుడిని ఎవరూ గుర్తు పట్టకుండా దుస్తుల లోగోను తొలగించారు. హత్య చేసేందుకు వాడిన ఆటో, కత్తి, సెల్ఫోన్లు, తాడు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యాస్మిన్‌బేగం, మహ్మద్ అథాఉల్లాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్, పోలీసులు శంశుల్‌హక్, రఫి, భీమన్నను ఎస్పీ విష్ణువారియర్ అభినందించారు. -
ఊరు మొత్తం ఖాళీ, మళ్లీ రాత్రికే..
సాక్షి, కామారెడ్డి : కరోనా మహమ్మారి పీడ పూర్తిగా విరగడ అయిపోవాలని కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మొత్తం వింత ఆచారాన్ని పాటించింది. ఒకరోజు ఊరంతా ఖాళీ చేసి గ్రామస్తులందరూ వన భోజనాలకు వెళ్లారు. ఈ సంప్రదాయం బీబీ పేట మండల కేంద్రంలో కనిపించింది. కరోనా నేపథ్యంలో ఆదివారం కూడా జనాలు అందరూ ఊరు విడిచి బయట ఉండాలని నిర్ణయించారు. కరోనా నియంత్రణలోకి రావాలనే ఉద్దేశ్యంతో గ్రామ దేవతలకు పూజలు ఘనంగా పూజలు చేశారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపులు తీశారు. అనంతరం వన భోజనాలకు వెళ్లారు. మళ్లీ రాత్రిలోగా ఊళ్ళోకి రావాలని తీర్మానించుకున్నారు. ఎలా చేయడం ద్వారా గ్రామ దేవతలు తమ గ్రామాన్ని చల్లగా చూస్తారని, కరోనా లాంటి వ్యాధులు దరి చేరకుండా దేవతలు ఆశీర్వదిస్తారని బీబీ పేట గ్రామస్తుల విశ్వాసం. కామారెడ్డి జిల్లాలో మరో రెండు గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామం లోనూ ఇలాంటి కట్టుబాట్లే కనిపించాయి. -
ఈ ఐదక్షరాల శాసనం వయసు 2,200 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్ : ఇదో శాసనం.. శాసనమంటే వాక్యాల సమాహారం కాదు, కేవలం ఐదక్షరాల పదం. ఆ పదానికి స్పష్టమైన అర్థం వెతకాల్సి ఉంది. అది చెక్కింది నిన్న మొన్న కాదు, దాదాపు 2,200 ఏళ్ల క్రితం. అంటే.. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దమన్నమాట. ఇది ఇంతకాలం ఓ గుండుపై అనామకంగా ఎదురుచూస్తూ ఉంది. మరి ఆ మాటకు స్పష్టమైన అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. అసలు అది మన తెలుగు భాష, లిపి కాదు. అచ్చమైన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉంది. అది కూడా అప్పుడప్పుడే శాతవాహన యుగం మొదలవుతున్న తరంనాటిది. అంటే.. అశోకుడి హయాంలో వాడిన లిపిలో ఉండటమే దీనికి తార్కాణం. వెరసి తెలంగాణ లో ఇప్పటివరకు వెలుగు చూసిన శాసనాల్లో ఇదే అతిపురాతనమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం కృష్ణా, గోదావరి నదుల తీరాల్లో శాసనాలు ఎన్నో వెలుగుచూడగా, ఇది మంజీరా పరీవాహక ప్రాంతంలో బయటపడటం గమనార్హం. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో... కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో ఈ అపురూప లఘు శాసనం తాజాగా వెలుగుచూసింది. ఆదిమానవుల జాడ మొదలు ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఉన్న ఈ గ్రామంలో ఇంత పురాతన చెక్కడం బయటపడటం విశేషం. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలతోపాటు బౌద్ధ ఆధారాలున్న ధూళికట్ట, కొండాపూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో క్రీ.శ. ఒకటో శతాబ్దానికి చెం దిన శాసనాలు గతంలో వెలుగు చూసిన విష యం తెలిసిందే. కానీ, అంతకు కనీసం 200 ఏళ్ల పూర్వం నాటి శాసనం ఇప్పుడు ఇక్కడ బయటపడింది. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో పెద్ద బండరాయిపై ఈ అక్షరాలు చెక్కి ఉన్నాయి. ‘మాధవచంద’ అంటే.. ‘‘తెలుగులో ఈ శాసనం అర్థం ‘మాధవచంద’. ఇది వ్యక్తి పేరో, ప్రాంతం పేరో, వీటికి సంబం ధంలేని మరే అర్థమో అయి ఉండవచ్చు. దాని పై ఇంకా స్పష్టత లేదు. ఆ ఒక్క పదమే ఇక్కడ ఎందుకు చెక్కి ఉందో కనుగొనాల్సి ఉంది. ఎన్నో చారిత్రక ఆధారాలకు నెలవుగా ఉన్న ఆ గ్రామంలో దీనిపై మరింత పరిశోధన జరిపితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ, తొలి శాతవాహన కాలం నాటి గుర్తులు ఇక్కడ ఉన్నాయనేది ఈ శాసనంతో స్పష్టమైంది’’అని ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు ఎం.ఎ.శ్రీనివాసన్ పేర్కొ న్నారు. సర్వేయర్‌గా ఉంటూ చరిత్ర పరిశోధనలో ఆసక్తి చూపుతున్న శంకర్‌రెడ్డి దీన్ని తొలుత గుర్తించారు. హెరిటేజ్ తెలంగాణ విశ్రాంత అధికారి వై.భానుమూర్తితో కలసి తాను పరిశీలించినట్టు వెల్లడించారు. ఆ అక్ష రాల నిగ్గు తేల్చేందుకు తాను సంప్రదించగా, అవి తొలి శాతవాహన కాలం నాటి లిపితో ఉన్నాయని ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం సంచాలకులు పేర్కొన్నట్టు శ్రీనివాసన్ వెల్లడించారు. -
గురుకుల ప్రిన్సిపాల్‌పై వేధింపుల కేసు
మద్నూర్(జుక్కల్): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ అదే పాఠశాల స్టాఫ్‌నర్స్ సునీత సోమవారం మద్నూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతేడాది నుంచి తనను వేధిస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడని, ప్రతిఘటించడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ తన భర్త శంకర్‌తో వచ్చి బోరున విలపించింది. గతంలో తనను హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో తీసుకెళ్లి అసభ్యకరం గా ప్రవర్తించాడని పేర్కొంది. తనతో పాటు అక్కడి మహిళా సిబ్బందికి ఇబ్బందులు పెడుతున్నా భయంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారని వివరించింది. చెప్పినట్టు చేయకపోతే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు’
కామారెడ్డి క్రైం: టెక్నాలజీని వాడుకుని ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడంతోనే టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఓటమి ఎదురైనందుకు తాను ఇలా మాట్లాడటం లేదన్నారు. సాంకేతికతపై అవగాహన ఉన్నందునే మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్‌కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తాను నియోజకవర్గంలో 45 రోజలు పాటు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చే శానన్నారు. అలాగే ప్రజలు అన్నిచోట్ల నుంచి బీజేపీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఓట్లు వేసినా ట్యాంపరింగ్ చేయడంతోనే సీట్లు రాలేదన్నారు. లేదంటే ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎన్ని సీట్లు వస్తాయో సీఎం కేసీఆర్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీస్‌శాఖలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందన్నారు. నీతి, నిజాయితీలు, అవినీతి రహిత పాలనే అజెండాగా ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు మహేశ్‌గుప్తా, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం : బాణాల తాడ్వాయి: ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉండి వారి సమస్యలను తీ ర్చేలా కృషి చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అద్యక్షడు బా ణాల లక్ష్మారెడ్డి అన్నారు. తా డ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి గ్రామంలో శుక్రవా రం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఏఒక్క గ్రామానికి నిధులు రాలేదని, కేంద్రం నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి 13, 14ఆర్థిక నిధుల క్రింద రూ.157కోట్లు వచ్చాయని తెలిపారు. మోదీ ప్ర భుత్వం భారత దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి రూ.కోట్లల్లో నిధులు విడుదల చేస్తే రాష్ట్రప్రభుత్వం తమ నిధులని చెప్పుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 16న జుక్కల్, 17న బాన్స్వాడ, 18న కామారెడ్డి నియోజక వర్గాలలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు మరింత కష్టపడి రాబోయే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు మర్రి రాంరెడ్డి, నాయకులు వెంకన్న, బాలకిషన్, సురెందర్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకట్రావు, సాయిబాబా, నర్సింహారెడ్డి, సతీష్, రవీందర్రావు, ఏడు మండలాల అ«ధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూతు కమిటి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాహుల్ తలచుకుంటే షబ్బీర్ అలీనే సీఎం..!
సాక్షి, కామారెడ్డి : రాహుల్ గాంధీ తలచుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం షబ్బీర్ అలీనే అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కునూర్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్లొన్న రేవంత్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఎన్నికల్లో ఓడిపోతున్నా షబ్బీర్ అలీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ అసలు కామారెడ్డిలో ఒక్కసారైన కనిపించారా అని ప్రశ్నించారు. కామారెడ్డి ప్రజలకు షభ్బీర్ అలీ ముత్యం లాంటి వ్యక్తి అని ఆయనే రేపు కాబోయే ఉప ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తలుచుకుంటే ఆయనే సీఎం కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ప్రశ్నించిన వారిపై కేసీఆర్ అక్రమంగా కేసుల పెడుతున్నారని.. వాటికివ్వరు బయపడేది లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పెదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లాంటి ఒక్క పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టడానికి తాను రోడ్ షోలు చేస్తున్నట్లు రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు డబ్బులిస్తే తీసుకోండని.. అవి మీ డబ్బులే కాబట్టి తీసుకుని ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టండని పిలుపునిచ్చారు. అక్రమ ఫైల్స్ దొరికాయని నాపై దాడులు చేశారు.. చివరికి కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని మండిపడ్డారు. -
వైన్స్ నిల్.. ‘బెల్ట్’ ఫుల్
సదాశివనగర్(ఎల్లారెడ్డి)/బీబీపేట(కామారెడ్డి) : మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బెల్టు షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతోంది. అధికారుల కన్నుసైగలలోనే ఈ తంతు కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెతి చూడడం లేదు. కామారెడ్డి జిల్లాలో 37 వైన్స్ దుకాణాలు, మూడు బారులు కొనసాగుతున్నాయి. అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారని తెలుస్తోంది. ప్రతి నెల ముడుపులు అందడంతో వారు బెల్టు దుకాణాలపై దృష్టి సారించడం లేదని స్పష్టమౌతుంది. మద్యం షాపుల ప్రతి నెల రూ.30 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. వైన్స్లలో మద్యం సేవించ రాదు, బార్లలో సీల్డ్ మద్యం అమ్మరాదు. వైన్స్‌కు సంబంధించి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలు, బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటలవరకు అమ్మకాలు చేపట్టాలి అనే నిబంధనలు విధించారు. ఇవి కాకుండా బయట ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా ఆ నిబంధనలు నిర్వాహకులు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు సంపాదన మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బెల్టు షాపులకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు. అధిక ధరలకు విక్రయాలు.. మద్యం ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. దీంతో ప్రజారోగ్యానికి చిల్లు పడుతోంది. బెల్టు షాపుల్లో ప్రతి క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు, ఒక్కో బీరు సీసా మీద రూ. 20 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు బాగా పెరిగాయి. వాటిలో కూడా కల్తీ మద్యం కలుపుతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే.. అనేక మంది పేరుకు కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బస్టాండ్లలోనే బెల్టు షాపులు నిర్వహిస్తుండటం, రాత్రయితే అక్కడ పండుగ వాతావరణంలా కనపడుతూ చుట్టు పక్కల ఉన్న కాలనీవాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు పెట్టుకొని మరీ విక్రయిస్తుండడం చాలా ఉన్నాయి. మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మద్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మహారాష్ట్ర నుంచి కల్తీ మద్యం తెప్పించి అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంచుమించూ ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎన్ని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు అనే పూర్తి సమాచారం ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్నా ఇప్పటివరకు ఏ బెల్టు షాపుపై దాడులు చేసిన దాఖలాలు లేవు. బెల్టు షాపుల నిర్వాహకుల దగ్గర మామూళ్లు తీసుకోవడంతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వెలుస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే బైండోవర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ మద్యం విక్రయాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండెవర్ చేస్తున్నాం. బెల్టు దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. చట్టానికి ఎవరూ అతీతులు కారు. –శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెల్టు షాపులకు అనుమతులు లేవు గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. ఒకవేళ అమ్ముతున్నారని ఎవరైనా సమాచారం అందిస్తే బెల్టు షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐ, దోమకొండ -
నమో వేంకటేశా..
కామారెడ్డి రూరల్ : మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వరకు సుబ్రహ్మణ్య శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవతామూర్తులప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 30న ఉదయం 7:30కు ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 1న శిఖర ప్రతిష్ఠ, ధాన్యాది, శయ్యాది, పుష్పాది, ఫలాధివాసముులు, హోమం, 2న అవాహిత దేవతా పూజలు, బలిప్రదానం, గర్త సంస్కారము కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. అనుగ్రహ భాషణం ప్రతిష్ఠాపనోత్సవాల్లో తోగుట రామాపూరం శ్రీ మధనానంద పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ మధవానంద సరస్వతీతో యంత్ర ప్రాణ ప్రతిష్ఠా కళాన్యాసము, మహాభిషేకం, కుంభాభిషేకం, స్వామీజీ అనుగ్రహాభాషనం ఉంటాయ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు అన్నదానం, సాయంత్రం సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పూలు, పండ్లు, పూజ సామగ్రి నవధాన్యాలు, పగడాలు, ముత్యాలు, నవరత్నాలు, యంత్రం కింద వేయడానికి తీసుకురావచ్చన్నారు. 2న దేవదాయశాఖ మంత్రి రాక విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగం గా ఏప్రిల్ 2న నిర్వహించనున్న కార్యక్రమాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు హాజరవుతారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ విశిష్టత లింగాపూర్ గ్రామంలోగల శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయం భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే వెంకన్నగా పేరుంది. కాల క్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలతిరుపతి దేవస్థానం నిత్య ధూపదీప నైవెద్య పథకం కింద సహాయం అందించింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్) కింద రూ.30 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేసింది. టీటీడీ దేవతామూర్తుల విగ్రహాలను అందించింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఐక్యంగా ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చి సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. -
నీకోసం నీవే చదివి ఎదగాలి
నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): నీ కోసం నీవే చదివి జీవితంలో ఎదగాలని, అమ్మానాన్నల కోసమో, స్నేహితుల కోసమో, బంధువుల కోసమో, చుట్టు పక్కల వారికోసమో చదవొద్దని మోటివేషన్ స్పీచ్ నిపుణుడు, ఉత్తమ యువసారథి అవార్డు గ్రహీత బ్రదర్ షఫీ సూచించారు. ప్రపంచంలో కేవలం ఒకశాతం మందిమాత్రమే లక్ష్యాలను సాధిస్తున్నారని, మిగతా 99శాతం మంది కారణాలు చూపుతూ లక్ష్యసాధనను పక్కనపెడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో గురువారం రాత్రి మైనారిటీ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కీ – సక్సెస్’ సదస్సుకు ఆయన హాజరై విద్యార్థులు, నగరవాసులనుద్ధేశించి ప్రసంగించారు. సృష్టిలో అన్ని జన్మలకంటే మానవ జన్మ గొప్పదని, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి నిరంతరం సాధన చేయాలన్నారు. ఈ ప్రపంచంలో విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంతో మంది మహనీయులు నిరూపించారన్నారు. సమస్యలు ఎదురవగానే జీవితం ఇంతే అని అనుకోకూడదని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారని, మైనారిటీ గురుకులాల ఏర్పాటు అభినందనీయమన్నారు. షఫీ కూతురు తంజీలా ప్రసంగిస్తూ నీవు చెప్పదలుచుకున్న విషయం నిజమైతే ఎవరికి భయపడవల్సిన అవసరం లేదన్నారు. సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆర్డీవో వినోద్‌కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ అలీం, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.