బల్దియా ఎన్నికల నామినేషన్ల ఘట్టం సోమవారం ప్రారంభమైంది. అయితే తొలిరోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు.ఆర్మూర్‌లో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఐదు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలలో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్‌లు దాఖలయ్యాయి.
కార్పొరేషన్, న్యూస్‌లైన్ :
నిజామాబాద్ కార్పొరేషన్‌లో తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయని ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయారు తెలిపారు. 1, 7, 11, 24, 42 డివిజన్ల నుంచి ఒక్కొక్కరు నామినేషన్ వేశారన్నారు.
ఏడో డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ సూదం లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.
ఒకటో డివిజన్‌లో రజని, 11వ డివిజన్‌లో కళావతి, 24వ డివిజన్‌లో రేవతి, 42వ డి విజన్‌లో గోదావరి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌లు వేశారు.
బోధన్‌లో..
బోధన్ టౌన్ : నామినేషన్ల స్వీకరణ కోసం బోధన్ బల్దియా ఆవరణలో 12 కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్స్ వేసే ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ హరినారాయణన్ సందర్శించా రు. అభ్యర్థితోపాటు ప్రతిపాదించే వ్యక్తులు ఇద్దరిని మాత్ర మే బల్దియా ఆవరణలోకి అనుమతించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా చూడాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గడ్డం శంకర్ అనే స్వతంత్ర అభ్యర్థి 32వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వచ్చారు.
బోధన్లో..
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలోని 33 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం 14వ వార్డుకు ఒక నామినేషన్ దాఖలైందని ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ బాలోజీ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వార్డు నుంచి కారంగుల అంజల్‌రెడ్డి కౌన్సిలర్‌గా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని పేర్కొన్నారు.
తొలిరోజు ఏడు
Published Tue, Mar 11 2014 4:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement