నేడే ఈద్-ఉల్-ఫితర్ | ramzan celebrations | Sakshi
Sakshi News home page

నేడే ఈద్-ఉల్-ఫితర్

Published Tue, Jul 29 2014 1:46 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

ramzan celebrations

ఈద్ ముబారక్
బాన్సువాడ : 29 రోజుల ఉపవాసాలు ముగిశాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండగ (ఈద్-ఉల్-ఫితర్) రంజాన్, షవ్వాల్ మాసంలోని మొదటి రోజు వస్తుంది. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో మంగళవారం నాడు రంజాన్ పండగను జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. ఈ పండగ జిల్లా లో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈద్-ఉల్-ఫిత ర్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూ ర్,  కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోని ఈద్‌గాహ్‌లలో ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement