![CM YS Jagan Mohan Reddy Ramzan Wishes To Muslims - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/2/Ramzan.jpg.webp?itok=LpH3muny)
కదిరిలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేస్తున్న సీఎం జగన్
ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి అర్బన్/బత్తలపల్లి: అందరికీ మేలు జరగాలని, ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు (అడ్వాన్స్‌డ్ ఈద్ ముబారక్) తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సోమవారం సాయంత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు.
ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడారు. విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, జఖియాఖానమ్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, కదిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బీఎస్ మక్బుల్, సీనియర్ నేతలు వజ్రభాస్కర్‌రెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment