
గుంటూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు.. ధైర్యం, భక్తి, విశ్వాసం, సేవా తత్వానికి ప్రతిరూపం. రాష్ట్ర ప్రజలందరిపై ఆంజనేయుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన.
శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు.. ధైర్యం, భక్తి, విశ్వాసం, సేవా తత్వానికి ప్రతిరూపం. రాష్ట్ర ప్రజలందరిపై ఆంజనేయుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.#HanumanJayanti
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2025

ఇక హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా ముస్తాబైన ఆలయాలు (Temples) భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం తెల్లవారు జామునుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.