Hanuman Jayanti
-
Hanuman Jayanti: ఈ అద్భుత తెలివితేటలే.. శ్రీరామ–సుగ్రీవ మైత్రి కలిసేలా..
భారత దేశంలో అత్యధిక భక్తుల చేత నిత్యం ఆరాధించబడుతున్న దైవం ఆంజనేయ స్వామి. పురాణాల్లో ఏ దేవునికీ లేని ప్రత్యేకత హనుమంతుని సొంతం. హనుమంతుడు గొప్ప వ్యాకరణశాస్త్ర పండితుడు. బాల్యంలో కఠోర దీక్షతో, శ్రద్ధగా సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాలు తెలిసిన వ్యక్తి. ఎదుటివారిని ఆకట్టుకునేలా ప్రసంగించే వాక్చాతుర్యం ఆయన సొంతం.ఈ అద్భుత తెలివితేటలే శ్రీరామ–సుగ్రీవ మైత్రిని కలిసేలా చేసింది. శ్రీరాముణ్ణి యజమానిగా, సుగ్రీవుణ్ణి మహారాజుగా ఇద్దరికీ సమ ప్రాధాన్యత నిచ్చాడు. లంకలో రావణునికి నీతి వచనాలతో హిత బోధ చేశాడు. మనం హనుమంతుని జీవిత చరిత్ర నుండి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని మెప్పించే నైపుణ్యం, యజమాని (మనం పని చేసే డిపార్ట్మెంట్/కంపెనీ) పట్ల పూర్తి విధేయత, నమ్మకం, సంపూర్ణ విశ్వసనీయతతో ఎలా ఉండాలి వంటివి నేర్చుకోవచ్చు.ఇంతేనా... ఆయన నుంచి నేర్చుకోవలసిన సుగుణాలు చాలానే ఉన్నాయి. ఎదుటివారిపట్ల సముచిత గౌరవం, నమ్మిన వారి కోసం ఏమైనా చేసే త్యాగనిరతి, శత్రువుల పట్ల సమ న్యాయబద్ధంగా వ్యవహరించే మాటతీరు, గురువు పట్ల నిస్వార్థ భక్తి భావన, రాజ్యం పట్ల సైనికుడిగా విద్యుక్త ధర్మం, నిరాడంబర జీవనం, అన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస, ధర్మరక్షణ కోసం శ్రమించే వీరత్వం, ఆపద సమయంలో ప్రదర్శించే ఆత్మ విశ్వాసం లాంటివి ముఖ్యమైనవి.తాను ఎంత బలవంతుడైనప్పటికీ అతి సాధారణంగా జీవించడం హనుమంతుడు మనకు నేర్పాడు. సముద్రాన్ని దాటినా, లంకను సగం కాల్చినా, సీతమ్మను తీసుకువచ్చే బలం ఉన్నా... ఎప్పుడూ పొంగిపోలేదు. సుగ్రీవుని వేలాది సైన్యంలో తానూ ఒక సైనికుడిగా రాచకార్యంలో భాగంగానే ఈ పనులు నిర్వర్తించానని భావించాడు. ఇంత చేసి అంత చెప్పుకునే చాలామందికి హనుమాన్ కనువిప్పు. ఆధునిక భావి తరానికి చక్కని మార్గదర్శి. హనుమంతుని జీవనాన్ని అధ్యయనం చేసిన వారికే ఆ గొప్పతనం తెలుస్తుంది. – భైతి దుర్గయ్య (నేడు హనుమాన్ జయంతి) -
నేటి నుంచి తిరుమలలో హనుమజ్జయంతి
తిరుమల: తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో శనివారం నుంచి 5వ తేదీ వరకు హనుమాన్ జయంతి నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశ గంగలోని శ్రీఅంజనాదేవి– శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో 1న మల్లెపూలు, 2న తమలపాకులు, 3న ఎర్ర గన్నేరు, కనకాంబరం, 4న చామంతి, 5న సింధూరంతో అభిõÙకాలు చేయనున్నారు. అలాగే జపాలిలో ప్రతిరోజూ మధ్యా హ్నం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు. 1న హరికథ, 2న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సంకీర్తనలు, 3న పురంధరదాస సంకీర్తనలు, 4న హిందూధర్మ ప్రచార పరిషత్ వారి భజన, 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల హరికథ గానం ఉంటుంది. రోజూ సాయంత్రం వేళ ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి. అదే విధంగా నాద నీరాజనం వేదికపై ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శ్రీ హనుమాన్ జననం, శ్రీ హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధి కాషాయమయమైంది. లక్షలాదిగా తరలివచ్చిన మాలధారులు, సాధారణ భక్తులతో పుణ్యక్షేత్రం రద్దీగా మారింది. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. బుధవారం ఉదయం ఐదు గంటల నుంచే మనరాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడం ప్రారంభమైంది. వీరంతా బుధవారం అర్ధరాత్రి 12గంటల తర్వాత క్యూలైన్ల ద్వారా శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కల్యాణ కట్టకు చేరుకుని మాల విరమణ, దీక్ష విరమణ చేశారు. గురువారం హనుమాన్ చిన్నజయంతి నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుల డేగకళ్లతో పహారా కాస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్ విజయయాత్ర
► హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారహిల్స్ డివిజన్ శ్రీరాంనగర్, ఉదయ్ నగర్, యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లో హనుమాన్ శోభాయాత్రలను సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు చేశారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జంట నగరాల్లో విజయ యాత్రలు ప్రారంభం అయ్యాయి. గౌలిగూడ రామ మందిరం వద్ద ప్రారంభమైన యాత్ర.. సికింద్రాబాద్ తాడ్బన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా విజయ యాత్ర కొనసాగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ►సికింద్రాబాద్‌లో భారీ వర్షం ప్రారంభమైంది హనుమాన్ జయంతి యాత్ర పాల్గొన్న భక్తులు వర్షంలో సైతం ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్‌తో పాటు కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ రాళ్ల వర్షం కురిసింది దారి పొడవున మంచు రాళ్లతో కూడిన వర్షం పడడంతో.. ఫోటోలు తీసుకుంటూ కంటోన్మెంట్ ప్రజలు ఎంజాయ్ చేశారు. హిమాయత్‌నగర్/సుల్తాన్‌బజార్: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు గౌలిగూడ రామమందిర్లో యజ్ఞంతో ప్రారంభమయ్యే ఈ యాత్రకు మొదటి పూజకు హరియాణా గవర్నర్ బండ్డారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు పటిష్ట బందోబస్తుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో వేలాదిమంది హనుమాన్ భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నారు. వీర హనుమాన్ విజయయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. రూట్‌మ్యాప్‌ను వివరిస్తున్న సుధీర్‌బాబు గౌలిగూడ టు తాడ్‌బండ్ ‘శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్ర’కు గౌలిగూడ టూ తాడ్‌బండ్ వరకు ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల సిబ్బంది సైతం ట్రాఫిక్ డ్యూటీలో ఉంటున్నట్లు తెలిపారు. యాత్ర సాగే రూట్లో ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సూచిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్‌ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఏమైనా అర్థం కాకపోయినా, సమస్యలున్నా నేరుగా 040–27852482, 9010203626 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లపై అడిషినల్ సీపీ సుధీర్‌బాబు బుధవారం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. గౌలిగూడ యత్ర ప్రారంభం నుంచి తాడ్‌బండ్ వరకు 12 కి.మీ.మేర యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ ఎక్స్‌రోడ్డు, నారాయణగూడ, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్డు మీదుగా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగుతుంది. -
జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జహంగీర్‌పురిలో మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏమిటని స్థానికులు ఆగ్రçహించారు. బుల్డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అవి తమకందలేదంటూ అధికారులు గంటన్నర పాటు కూల్చివేతలు కొనసాగించారు. దాంతో పిటిషనర్ మళ్లీ సుప్రీం తలుపు తట్టడంతో కూల్చివేతలు ఆగాయి. విచారణ గురువారానికి వాయిదా పడింది. అన్ని పిటిషన్లపై నేడు విచారణ కూల్చివేతలు రాజ్యాంగవిరుద్ధంగా, అనధికారికంగా జరుగుతున్నాయని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిసి మధ్యాహ్నాం ప్రారంభించాల్సిన కూల్చివేతలను ఉదయం 9 గంటలకే అధికారులు మొదలుపెట్టారని ఆరోపించారు. నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూల్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై అన్ని పిటిషన్లను గురువారం విచారించాలని కోరగా జస్టిస్ రమణ అంగీకరించారు. సుప్రీం ఉత్తర్వులను తీసుకొని సీపీఎం సీనియర్ నేత బృందా కారత్ ఘటనా స్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. విలువల విధ్వంసం: రాహుల్ ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో హింస జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వాలు బల్డోజర్లు వాడటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విలువల విధ్వంసమేనని మండిపడ్డారు. పేదలు, మైనార్టీలకు లక్ష్యంగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘విద్వేష బుల్డోజర్లను తక్షణమే ఆపండి. వాటికి బదులు ప్రధాని మోదీ విద్యుదుత్పత్తి ప్లాంట్లను ప్రారంభించాలి. బీజేపీ అధినేత నేతలు వారి హృదయాల్లోని ద్వేషాన్ని కూల్చేసుకోవాలి’’ అంటూ ట్వీట్ చేశారు. జేసీబీ.. జిహాద్ కంట్రోల్ బోర్డ్: బీజేపీ జేసీబీ అంటే జిహాద్ కంట్రోల్ బోర్డ్ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త భాష్యం చెప్పారు. బీజేపీ తీరుపై ఆప్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటిని, బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని, హింసకు కారకులైన బీజేపీ నేతల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలి. అప్పుడే మత హింస, అల్లర్ల నుంచి దేశానికి విముక్తి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం) -
ఢిల్లీ జహంగీర్‌పురిలో మళ్లీ ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జహంగీర్‌పురిలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుల్లో ఒకరి ఇంటికి చెందిన మహిళను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లే క్రమంలో సోమవారం మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. జహంగీర్‌పురిలో శనివారం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా.. మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకుగానూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పటిదాకా 23 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి వాడీవేడిగానే ఉందక్కడ. ఇదిలా ఉండగా.. నిందితుల్లో ఒకడైన సోనూ భార్యను పోలీసులు ఇంటరాగేషన్ పేరిట అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో.. యాభై మంది మహిళలను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. శనివారం అల్లర్లు జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోనే.. తాజా అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం. ఇక శనివారం జరిగిన అల్లర్లకు ఘటనకు సంబంధించి.. దేశీ పిస్టోల్స్‌తో పాటు ఐదు కత్తులను పోలీసులు నిందితుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. నిందితులను సైతం కోర్టు ముందు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా వెల్లడించారు. -
ఢిల్లీ హనుమాన్ జయంతి శోభాయాత్రపై రాళ్ల దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణలు చెలరేగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. వివరాల ప్రకారం.. శనివారం ఊరేగింపు జరుగుతుండగా చోటు చేసుకున్న అల్లర్ల కారణంగా స్థానికులతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఆ ప్రాంతంలోని పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు అదనపు పోలీస్ బలగాలను రప్పించారు. ఘటనపై స్పందిస్తూ.. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఢిల్లీ సీఎం, ఎల్జీ పిలుపునిచ్చారు. అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి తీసుకోవడంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పవన్‌పుత్ర దయతో ప్రతి ఒక్కరి జీవితాలు తెలివితేటలు, విజ్ఞానంతో నిండి ఉండాలి’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. शक्ति, साहस और संयम के प्रतीक भगवान हनुमान की जयंती पर सभी देशवासियों को अनेकानेक शुभकामनाएं। पवनपुत्र की कृपा से हर किसी का जीवन बल, बुद्धि और विद्या से सदा परिपूर्ण रहे। — Narendra Modi (@narendramodi) April 16, 2022 -
ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది : చిరంజీవి
హిందూ పండుగలలో మరో ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి నేడు(ఏప్రిల్ 27), ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకత ఉందని, హనుమాన్ మన వాడే అని, ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసిందని గుర్తుచేశారు. ‘ఈ హనుమజ్జయంతి కి ఓ ప్రత్యేకత ఉంది.హనుమాన్ మన వాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమలతిరుపతి దేవస్థానం రుజువు చేసింది.ఎక్కడివాడు ఎప్పటివాడు అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన సూపర్ మేన్ లార్డ్ హనుమ’ అంటూ భార్త సురేఖతో కలిసి హనుమంతుడి విగ్రహం ముందు దిగిన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, హనుమంతుడు తిరుమల గిరుల్లోని అంజనాద్రిలో జన్మించాడని టీటీడీ ఆధారాలతో సహా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత, తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే -
హనుమజ్జయంతి ప్రత్యేకత ఏంటో తెలుసా?
హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించాడట. కనుక అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, హనుమద్దండకం ఇతర శ్లోకాలతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని అంటారు. చదవండి: తార కథ నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా? -
న్యూజెర్సీలో హనుమాన్ జయంతి వేడుకలు
సౌత్ ప్లైన్ఫీల్డ్ : అమెరికాలో న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతిని ఈ సారి వినూత్నంగా జరిపారు. కరోనా వైరస్‌తో లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు ఇళ్లకు పరిమితం కావడంతో ఆన్లైన్ ద్వారా వారిని ఈ జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేశారు. ఇళ్ల నుంచే హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ రామనామ జపం చేస్తూ భక్తులు పాల్గొన్నారు. జూమ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా భక్తులు హనుమాన్ జయంతిని వీక్షిస్తుండగా పీఠంలో, కరోనా నుంచి యావత్ మానవాళిని రక్షించాలని కోరుతూ హనుమాన్ సహస్ర పారాయణం, మన్యసూక్త సహితంగా 108 కలశాలతో అభిషేకం జరిగింది. వెయ్యికి పైగా అరటి పండ్లు, తమలపాకులు, వడమాలలతో ఆంజనేయుడిని అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాధారణ సమయాల్లో ఎలా హనుమాన్ జయంతి జరుపుతారో అదే విధంగా లాక్డౌన్ సమయంలో కూడా వైభోవోపేతంగా ఈ వేడుకలునిర్వహించారు. భక్తులందరూ ఆన్లైన్లోనే ఈ వేడుకల్లో పాల్గొనేలా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. పూజానంతరం స్వామి వారికి అలంకరించిన అరటి పండ్లను స్థానిక సేవా సంస్థలైన న్యూ బ్రన్స్విక్లోని రాబర్టువుడ్ జాన్సన్ హాస్పిటల్, ఎడిసన్‌లోని ఓజనమ్ హోమ్ లెస్ షెల్టర్, సౌత్ ప్లైన్‌ఫీల్డ్‌లోని అరిస్టా కేర్ సంస్థలకు, సాయి దత్త పీఠం చారిటీ గ్రూప్ ద్వారా అందించినట్లు సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు. -
చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్ కల్యాణ్
హీరో మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయస్వామి వీరభక్తుడనే సంగతి తెలిసిందే. బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయస్వామితో తనకు చాలా అనుబంధం ఉందని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన కొన్ని పోస్ట్‌లు కూడా చేశారు. ‘1962 లో నాకు ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది.. ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి అని అన్నారు’ అని చిరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు తనకు లాటరీలో వచ్చిన ఫొటోను కూడా చిరు పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. తాజాగా ఆ ట్వీట్‌పై చిరంజీవి సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఫొటోకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘మా అన్నయ్య చిరంజీవితో మా ఇంట్లో ఆంజనేయస్వామిని పూజించడం ప్రారంభమైంది. అది కమ్యూనిస్టు, నాస్థికుడైన మా నాన్నను రామ భక్తునిగా మార్చింది. నా టీజేజ్లో కొన్ని సందర్భాల్లో హనుమాన్ చాలీసా 108 సార్లు పఠించేవాడిని. జై హనుమాన్’ అని ట్వీట్ చేశారు. Hanumanji worship came into our home through my brother-Chiranjeevi garu; & that made my father to transform from an atheist& communist to Lord Rama Devotee. I used to recite Chalisa 108 times in certain days of my teen age.Jai Hanuman!🙏 https://t.co/5Kh0oWjnGp — Pawan Kalyan (@PawanKalyan) April 9, 2020 చదవండి : ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి -
ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్కు పరమ భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఆంజనేయస్వామికి మరో పేరైన చిరంజీవిని తన స్క్రీన్ పేరుగా మార్చుకొని ఏ స్థాయికి ఎదిగారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నేడు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షాలు తెలిపారు. అంతేకాకుండా ఆంజనేయస్వామితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో’ ‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా?.. బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?...to be continued pic.twitter.com/TdVKjg05nS — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో.. ..to be continued pic.twitter.com/HnpRnezH8E — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది...#8thApril ...to be continued. pic.twitter.com/m3J6S1ZEMs — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? pic.twitter.com/A2lqoazwcJ — Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020 చదవండి: పెద్దాయన సన్ గ్లాసెస్ వెతకండ్రా రియల్ 'హీరో'ల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
-
అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. శుక్రవారం గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగనుంది. ప్రస్తుతం శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు చేరుకుంది. శోభాయాత్రలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కి.మీ మేర ఊరేగింపు జరగనుంది. హనుమాన్ ఊరేగింపు కోసం పోలీసులు 12 వేల మందితో బందోబస్తు, 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు.. శోభాయాత్రలో పాల్గొంటున్నారు. -
నిఘా నేత్రం
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న శోభాయాత్రకు నగర పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు సాయుధ బలగాలతో భారీ బందోబస్తును వినియోగించనున్నారు. మొత్తం 12వేల మంది విధులు నిర్వర్తించనున్నారు. బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఊరేగింపు మార్గాలను పరిశీలించడంతో పాటు యాత్ర ప్రారంభమయ్యే, ముగింపు జరిగే దేవాలయాలను సందర్శించారు. ప్రధాన ఊరేగింపు నగరంలోని మూడు జోన్లలో 27 కి.మీ మేర జరగనుంది. గౌలిగూడ రామ్‌మందిర్ దగ్గర ప్రారంభమై తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేశాలయం వద్ద ముగుస్తుంది. అదే విధంగా తూర్పు మండలంలోని ఐఎస్ సదన్ నుంచి మరో ఊరేగింపు 3 కి.మీ సాగి గౌలిగూడ రామ్‌మందిర్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. మొత్తమ్మీద 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కి.మీ మేర జరిగే ఊరేగింపును కమ్యూనిటీ, ట్రాఫిక్ సీసీ కెమెరాల ద్వారా బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచి నిత్యం పర్యవేక్షించనున్నారు. అదనంగా 570 తాత్కాలిక, మూవింగ్, వెహికల్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో ఉండే పోలీసులకు మరో 300 హ్యాండీ క్యామ్స్ అందజేస్తున్నారు. ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించిన పోలీసులు... గురువారం రాత్రి నుంచే బారికేడ్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. బందోబస్తును అధికారులు రెండు రకాలుగా విభజించారు. శోభాయాత్ర వెంట ఉండడానికి కొంతమంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యవేక్షించడానికి మరికొంత మందిని కేటాయిస్తున్నారు. ప్రతి జోన్‌కు ఆయా డీసీపీలు బాధ్యత వహిస్తారు. వీరికి తోడు ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఊరేగింపు ముందు, ముగింపులో అదనపు, సంయుక్త పోలీసు కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఊరేగింపుల్లో మొత్తం 2లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. డేగకన్ను... హనుమాన్ జయంతి, శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొత్వాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శాంతిభద్రత విభాగం, టాస్క్‌ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు మైత్రీ, పీస్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులు, గతంలో ఇబ్బందికరంగా మారిన వారిని తమ కార్యాలయాలకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి కొందరిని బైండోవర్ సైతం చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉండే ప్రతి ఒక్క పోలీస్ తమ చుట్టూ ఉన్న 25 మీటర్ల మేర కన్నేసి ఉంచుతారు. అక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ స్మార్ట్ ఫోన్లలో ఉన్న ‘టీఎస్ కాప్’ యాప్ ద్వారా వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తుంటారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే వారి ఫొటోలతో పాటు వివరాలు పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. సర్వం సిద్ధం... సుల్తాన్‌బజార్: హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్‌దళ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న వీర హనుమాన్ విజయ యాత్రకు సర్వం సిద్ధం చేశామని బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాశ్‌చందర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి రెండు లక్షల బైకులతో ర్యాలీ నిర్వహించాలని బజరంగ్దళ్ నాయకులు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11గంటలకు కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో వేలాది మంది సామూహిక హనుమాన్ జయంతి పారాయణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి వినాయక్‌రావు దేశ్‌పాండే హాజరు కానున్నారు. విజయ యాత్ర ఉదయం 10గంటలకు గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమై తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా... హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని సంస్థలు, సంఘాలు శోభాయాత్ర నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, డీఎం అండ్ హెచ్ఎస్ సర్కిల్, రామ్‌కోఠి చౌరస్తా, కాచిగూడ జంక్షన్, వైఎంసీఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్ హౌస్, ఎంజీ రోడ్, బాలంరాయ్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు సాగనుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థితిగతుల నేపథ్యంలో వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కమిషనర్ సూచించారు. మరోపక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వైపు ఎలాంటి వాహ నాలను అనుమతించరు. అవసరమైన పక్షంలో ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లిస్తారు. ♦ అదనపు సీపీలు షికాగోయల్ (క్రైమ్), అనిల్‌కుమార్ (ట్రాఫిక్), డీఎస్ చౌహాన్ (శాంతిభద్రతలు)లు చార్మినార్, సిద్ధి అంబర్‌బజార్ మసీదు, సెంట్రల్‌జోన్ ప్రాంతాలతో పాటు కీలక అంశాలకు నేతృత్వం వహిస్తారు. ♦ శోభాయాత్ర ఊరేగింపు ప్రారంభంలో అదనపు సీపీ ఎం.శివప్రసాద్, ముగింపులో అదనపు సీపీ టి.మురళీకృష్ణ ఉండనున్నారు. ♦ ఐదు జోన్లకు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ఊరేగింపు ఆద్యంతం బందోబస్తు నిర్వహించనున్నాయి. ♦ పోకిరీలకు చెక్ చెప్పడానికి షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ♦ శుక్రవారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. ♦ కమ్యూనికేషన్ పరికరాలు, బైనాక్యూలర్లతో ఎత్తైన భవనాలపై రూఫ్ టాప్ వాచ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. శ్రీవారి దర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతుంది. సర్వదర్శనం స్లాట్‌కి 4 గంటలు సమయం పడుతోంది. కాగా, గురువారం హనుమాన్ జయంతిని పురష్కరించుకుని తిరుమలలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
జ్ఞాన గుణ సాగరుడు
జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరాల మీద నుండి చూసి భయంతో బిగుసుకు పోయాడు సుగ్రీవుడు. అప్పుడు సుగ్రీవునికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ తొలిసారి మనకు రామాయణంలో దర్శనమిస్తాడు హనుమ. ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే మనకు నిర్భయత్వాన్ని అలవరచుకొమ్మన్న పాఠం చెప్పే గురువు. సందర్భోచిత వేషధారణ సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక భిక్షువు వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! సమయోచిత వేషధారణ మాత్రమే కాదు, సమయోచిత సంభాషణా చాతుర్యమూ హనుమకు వెన్నతో పెట్టినవిద్య. అతను మాట్లాడిన నాలుగు మాటలకే మురిసిపోతాడు తానే గొప్ప వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు.బలహీన క్షణాల్లో ఒక్కొక్కసారి ఎంత టి అసాధారణ ప్రజ్ఞావంతులకైనా క్షణం పాటు ‘ఆత్మహత్యతో ఈ బాధకంతా భరతవాక్యం పాడదామా‘ అని అనిపించవచ్చు. కానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలగడం నిజమైన ధీశాలి లక్షణం. లంకానగరమంతా వెదికి సీత జాడ కానరాక హనుమంతుడు అదేస్థితికి చేరుకొంటాడు. ‘సీతమ్మ జాడ దొరికే వరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను’ అనుకున్నాడు హనుమ. కాని వెంటనే ‘ఆత్మహత్య మహాపాపం. జీవించి ఉంటేనే సుఖాలను పొందగలం. కనుక మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను. ఎవడు శోకానికి లొంగిపోడో, ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకానికి లొంగను, మళ్లీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్లీ ఈ లంకాపట్టణం అంతా వెతికేస్తాను‘ అని ఉత్సాహాన్ని పొంది సీతాన్వేషణలో పడతాడు హనుమ. ఇదే సామాన్యులకూ, ధీశాలికీ మధ్య గల తేడా. సిసలైన సంభాషణా చతురుడు సంభాషణా చాతుర్యం అంటే ఊరకే మాట్లాడుతూ వెళ్ళడం కాదు. అవసరమైనపుడు అతి స్వల్పంగా, ముక్కుకు సూటిగా, క్లుప్తంగా, ప్రధాన విషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటం కూడా రావాలి. లంకనుంచి తిరిగి వచ్చిన తరువాత దూరం నించే‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు. అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాత్తుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇది మనం నేర్చుకోవాలి హనుమన్న దగ్గర. అంతేకాదు, సవాళ్లను స్వీకరించి సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అన్న అంశాన్ని నేర్చుకోవడానికి హనుమన్న జీవితమే మనకు పాఠ్యపుస్తకం. సముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమన్న ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ మిడిసి పడలేదు. అవాంతరాలను ఎదుర్కొని కార్యసాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కబెట్టడమెలాగో హనుమ చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి పొమ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధిబలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటిలోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు. ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమయ్య దగ్గర నేర్చుకోవాలి. అంతిమవిజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవతీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి కార్య సాధకుడు. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే ఎంత రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించడం అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగాలి.ఇలా హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాసలక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, మేనేజ్ మెంట్ స్కిల్స్ అని చెప్పుకొనే యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. – రాయపెద్ది అప్పాశేష శాస్త్రి, ఆదోని సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ, అసాధారణ కార్యకుశలత, భయాన్నీ, నిరాశనూ, నిస్పృహనూ దరిచేరనివ్వని ధీశక్తి... వీటన్నిటి కలబోత ఉత్తమవ్యక్తిత్వం అవుతుంది. వీటికి తోడు బుద్ధిబలం, కీర్తిని సాధించాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యంతో కూడిన బలిష్టమైన శరీరం వంటివి మనం కోరదగిన వ్యక్తిత్వంలోని అంశాలు. మన పురాణసాహిత్యాన్ని పరిశీలించినపుడు ఈ గుణాలలో కొన్ని, కొంతమందిలో కనపడవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే సందర్శించ గలమా అని ఆలోచిస్తే హనుమంతుడొక్కడే కానవస్తాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం గొప్ప కళ. అశోకవనంలో సీతతో మాట్లాడుతున్నప్పు్పడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న ఇటువంటి పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి. ఇదీ మనం హనుమ దగ్గర నేర్చుకోవాల్సిన చాతుర్యం. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
-
నేటి నుంచి కల్లు మద్యం, దుకాణాల బంద్
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్) : హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో మద్యం, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న హనుమాన్ జయంతి ఉన్నందున మద్యం, కల్లు దుకాణాలు శుక్రవారం సాయంత్రం 6 నుంచి ఏప్రిల్ ఒకటి ఉదయం 9 గంటల వరకు మూసి ఉంచాలని అన్ని పీఎస్‌లకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. -
వాయుపుత్రుడికి భారీ వడమాల
సేలం: నామక్కల్ ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భారీ వడల మాలతో విశేషంగా అలంకరించారు. నామక్కల్ కోటలోని అతి పురాతనమైన ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఏక శిలా విగ్రహంగా ఉన్న ఆంజనేయ స్వామికి ఏటా మార్గళి నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. వేకువజామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, 5 గంటలకు 1,00,008 వడల మాలను అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. 11 గంటలకు పసుపు, కుంకుమ, నూనె, షీకాయ్, 1008 లీటర్ల పాలు, పెరుగు, వెన్న, తేనె వంటి వస్తువులు(పంచామృతాలు)తో విశేష అభిషేకం చేశారు. తర్వాత ప్రత్యేక అలంకరణ, మహా దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ముత్తంగి అలంకరణ చేశారు. లక్ష మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి రీతిలో అలంకరణ ఏడు కొండలవాడికి బ్రహ్మోత్సవాల సమయంలో నామక్కల్‌కు చెందిన శ్రీ తిరుమల తిరుపతి శ్రీమాన్ నారాయణ నిత్య పుష్ప కైంకర్య సభ ఆధ్వర్యంలో టన్నుల కొలది పుష్పాలను కైంకర్యంగా సమర్పిస్తారు. అదేమాదిరి నామక్కల్ ఆంజనేయుడికి తొలిసారిగా మూడు టన్నుల పుష్పాలు, పండ్లు వంటి వాటిని ఈ సభ కైంకర్యంగా అందించింది. వీటితో శ్రీవారికి మాదిరి ఆంజనేయ స్వామికీ అలంకరించారు. -
హిందూ ధర్మంపై దాడి చేస్తే..
పరిపూర్ణానందస్వామి ఆదోని : హిందూ ధర్మంపై దాడులు చేస్తే వారికి నామరూపాలుండవని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామి అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘ఓ హిందు మేలుకో.. నీ ధర్మం తెలుసుకో’ అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హిందుత్వం మతం కాదని మానవ ధర్మమని పేర్కొన్నారు. హిందూ ధర్మంపై 2200 ఏళ్లపాటు దాడులు జరిగాయన్నారు. అయితే దాడులు చేసిన మహ్మదీయులు, డచ్‌లు, మొగలాయిలు ఇలా ఎందరో.. తమ నామరూపాలు కోల్పోయినా హిందూ ధర్మం నేటికీ పటిష్టంగా ఉందని తెలిపారు. మానవ ధర్మాన్ని కాపాడేవారు దళితులైనా హిందూ ధర్మం దేవతగా పూజిస్తుందని, ఇందుకు మహాయోగి లక్ష్మమ్మవ్వే నిదర్శనమన్నారు. శ్రీ రాముడు దేవుడైతే, ఆంజనేయుడు ఆయన సేవకుడని, అయితే శ్రీరాముడి ఆలయాలు కొన్ని ప్రాంతాల్లో కనిపించకపోయినా ఆంజనేయుడి ఆలయాలు మాత్రం ప్రతి వీధిలోనూ దర్శనమిస్తాయన్నారు. సేవకుడిని దేవుడిగా పూజించే గొప్ప గుణం హిందూ ధర్మానికి ఉందని వివరించారు. నేటి పాలకులు సమాజాన్ని కులాలతో ముక్కలు చేసి హిందూ ధర్మాన్ని కాలరాస్తున్నారని, ఏదో ఒక రోజు ఇలాంటి వారంతా నామరూపాలు కోల్పోక తప్పదని హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షణకు వేదికలుగా ఉన్న ఆలయాలు మన రాష్ట్రంలో దాదాపు 13000 మూత పడ్డాయని, వాటికి పాలకులు పూర్వ వైభవం కల్పించాలని కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ క్రిష్ణరావు హిందూ ధర్మ పరిరక్షణపై మాట్లాడగా కార్యక్రమం ఆహ్వాన సమితి అధ్యక్ష, ఉపాధ్యక్షులు విట్టారమేష్, బసవన్న గౌడు, శ్రీకాంత్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, టీజీ పాండురంగశెట్టి ఆర్గనైజింగ్ కార్యదర్శి రామాంజినేయులు, పట్టణ ప్రముఖులు బుగ్గారమేష్, మాలేకర్ శ్రీనివాసులు, హరియాదవ్, చెన్నబసప్ప, అశోక్, శ్రీనివాస ఆచారి, పీఎస్మూర్తి పాల్గొన్నారు. -
అణువణువూ అనుసంధానం
⇔ ప్రగతి భవన్‌కు గ్రేటర్‌లోని సీసీ కెమెరాలన్నీ లింక్ ⇔కీలక సమయాల్లో సీఎం స్వయంగా పర్యవేక్షించేందుకే ⇔హనుమాన్ జయంతి యాత్రతో మొదలైన లింకేజీ సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతి కీలక ప్రాంతాన్ని ఇకపై ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ నుంచి వీక్షించవచ్చు. నగర వ్యాప్తంగా ఏర్పాటైన ప్రభుత్వ, కమ్యూనిటీ సీసీ కెమెరాలను అనుసంధానించడంతో ఇది సాధ్యమవుతోంది. హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో మంగళవారం ఈ లింకేజ్ పనిచేయడం ప్రారంభమైంది. డీజీపీ కార్యాలయంతోనూ వీటిని లింక్ చేశారు. కీలక సమయాలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగేప్పుడు ముఖ్యమంత్రితో పాటు డీజీపీ సైతం పరిస్థితుల్ని పర్యవేక్షించడం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు అధికారులు చెప్పారు. పది వేలకు పైగా కెమెరాల అనుసంధానం... ప్రజా భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న సిటీ పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ నిఘా, ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు అపార్ట్మెంట్ వాసుల్నీ కలుపుకుంటూ వెళ్తున్న పోలీసులు వారితో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికే నగరంలో 10 వేలకు పైగా సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (సీసీసీ) అనుసంధానించారు. దీంతో పాటు స్థానిక పోలసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాల్లోనూ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయించారు. వీటి నుంచి సీసీ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను పర్యవేక్షించే అవకాశం కల్పించారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, లీకేజీలు తదితరాల పర్యవేక్షణకూ ఇప్పటికే ఈ సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. దీనికోసం ఆయా విభాగాలకూ భాగస్వామ్యం కల్పించారు. ఇకపై వీటన్నింటినీ అవసరమనుకున్నప్పుడు సీఎం ప్రగతిభవన్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. వివిధ ఉత్సవాల సందర్భంగా నగరంలో జరిగే భారీ ర్యాలీల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించడానికి ఇది దోహదపడుతుంది. నిత్యం వీటికి సంబంధించిన సమాచారం సీఎం, డీజీపీ తదితర కార్యాలయాలకు చేరుతుంటుంది. హనుమాన్ ర్యాలీ పర్యవేక్షణ... మంగళవారం జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సీసీసీ నుంచి, డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్లో సీఎం, ఇతర అధికారులు సైతం దీన్ని వీక్షించినట్లు తెలిసింది. దీనికోసం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా భారీ వీడియో వాల్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.