
సౌత్ ప్లైన్‌ఫీల్డ్ : అమెరికాలో న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతిని ఈ సారి వినూత్నంగా జరిపారు. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులు ఇళ్లకు పరిమితం కావడంతో ఆన్‌లైన్ ద్వారా వారిని ఈ జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేశారు. ఇళ్ల నుంచే హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ రామనామ జపం చేస్తూ భక్తులు పాల్గొన్నారు. జూమ్, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా భక్తులు హనుమాన్ జయంతిని వీక్షిస్తుండగా పీఠంలో, కరోనా నుంచి యావత్ మానవాళిని రక్షించాలని కోరుతూ హనుమాన్ సహస్ర పారాయణం, మన్యసూక్త సహితంగా 108 కలశాలతో అభిషేకం జరిగింది.
వెయ్యికి పైగా అరటి పండ్లు, తమలపాకులు, వడమాలలతో ఆంజనేయుడిని అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాధారణ సమయాల్లో ఎలా హనుమాన్ జయంతి జరుపుతారో అదే విధంగా లాక్‌డౌన్ సమయంలో కూడా వైభోవోపేతంగా ఈ వేడుకలునిర్వహించారు. భక్తులందరూ ఆన్‌లైన్‌లోనే ఈ వేడుకల్లో పాల్గొనేలా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. పూజానంతరం స్వామి వారికి అలంకరించిన అరటి పండ్లను స్థానిక సేవా సంస్థలైన న్యూ బ్రన్స్‌విక్‌లోని రాబర్టువుడ్ జాన్సన్ హాస్పిటల్, ఎడిసన్‌లోని ఓజనమ్ హోమ్ లెస్ షెల్టర్, సౌత్ ప్లైన్‌ఫీల్డ్‌లోని అరిస్టా కేర్ సంస్థలకు, సాయి దత్త పీఠం చారిటీ గ్రూప్ ద్వారా అందించినట్లు సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment