సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ : మానవత్వమే దైవత్వం అని ప్రగాఢంగా విశ్వసించే న్యూజెర్సీ సాయి దత్త పీఠం అదే బాటలో నడుస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కేరళ బాధితులు త్వరగా కోలుకోవాలంటూ అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించింది. ఇప్పటికే సాయిదత్త పీఠం అయ్యప్ప మాలధారణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తోంది. దీక్ష ధారులైన అయ్యప్పల కోసం భజనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
తాజాగా కేరళ వరద బాధితులు త్వరగా కోలుకోవాలంటూ అయ్యప్ప భజనలు నిర్వహించింది. న్యూజెర్సీ అయ్యప్ప భక్త మండలి, వరల్డ్ అయ్యప్ప సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఈ అయ్యప్పపడిపూజను భక్తులు ఘనంగా జరిపారు. అయ్యప్ప భక్తుల భజనలతో సాయి దత్త పీఠం మారు మ్రోగిపోయింది. ఈ ఛారిటీ కార్యక్రమానికి భక్తులు 4556 డాలర్లు విరాళమందించారు. ఈ మొత్తాన్ని వరల్డ్ అయ్యప్ప సేవా ట్రస్ట్ చైర్మన్ పార్ధసారధి గురు స్వామి కి అందించారు. వీరు నేరుగా కేరళ బాధిత కుటుంబాలకు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment