Sai Datta Peetham
-
ఎడిసన్, సాయిదత్త పీఠంలో శ్రీ అయ్యప్ప స్వామి పూజ
-
యూఎస్‌లోని సాయి దత్తపీఠం ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ
అమెరికాలోని సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం దుస్తుల పంపీణీ కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజ సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం యునీకో(UNICO) సౌత్ ప్లెయిన్ఫ్లీల్డ్ చొరవతో విజయవంతమయ్యింది. దీనికి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం డైరెక్టర్ సుభద్ర పాటిబండ్ల, డెబ్బీ బాయిల్, క్రిస్టీన్ల తదితరులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ నిస్వార్థ ప్రయత్నాలు నిరుపేద కుటుంబాలకు మంచి ప్రయోజనం చేకూర్చడమే గాక కావాల్సిన దుస్తులు ఉపకరణాలను పొందగలుగుతారు.ఆయా సంఘం నుంచి వచ్చిన విశేష స్పందన ఫలితంగా దుస్తులతో నిండిన ట్రక్కులు తరలివచ్చాయి. ఈ పంపిణీకి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉపేంద్ర చివుకుల, కమిషనర్ ఎమిరిటస్, మురళి మేడిచర్ల పూర్తి సహాయసహకారాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతను, సమాజ స్ఫూర్తి ప్రాముఖ్యతలను నొక్కి చెబుతాయని ఈ కార్యక్రమ నిర్వాహకులు అన్నారు. (చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!) -
అమెరికా, న్యూజెర్సీలో కార్తిక మహోత్సవాలు
-
న్యూజెర్సీ, సాయిదత్త పీఠంలో దీపావళి వేడుకలు
-
న్యూజెర్సీలో వ్యాక్సినేషన్ డ్రైవ్
న్యూజెర్సీలో సాయి దత్త పీఠం వుడ్ లేన్ ఫార్మసీ తో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించిందిది. న్యూజెర్సీలోని వుడ్ లేన్ ఫార్మసీ (ఓల్డ్ బ్రిడ్జి) దగ్గర జరిగిన ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. కోవిడ్ రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చారు. అమెరికాలో మన వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు సాయి దత్త పీఠం ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. ప్రశంసలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో దాదాపు 250 మందికి పైగా తెలుగువారు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ సెనేట్, అసెంబ్లీ తరఫున స్టెర్లే ఎస్ స్టాన్లీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో స్థానిక సాయిదత్త పీఠం, వుడ్ లేన్ ఫార్మసీ, ఓల్డ్ బ్రిడ్జి న్యూజెర్సీలు చేపట్టిన కమ్యూనిటీ సేవాదృక్పధాన్ని కొనియాడారు. ప్రశంసా పత్రాన్ని అందించారు. కృతజ్ఞతలు ఈ వ్యాక్సినేషన్లో పాల్గొన్న ఫార్మసిస్ట్ రవి, డాక్టర్ విజయ నిమ్మ, డాక్టర్ ప్రసాద్ సుధాన్షు, నర్సులు శిరు పటేల్, సలోని గజ్జర్‌లతో పాటు వాలంటీర్లు గీతావాణి గొడవర్తి, మృదుల భల్లా, అంజలిబుటాలా, రావు ఎలమంచిలి, వికాస్, అన్షు, పల్లవి వీరికి సహాకరించిన పాటు ఇషిత్ గాంధీ, కిరణ్ తవ్వాలకు సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, బోర్డు సభ్యులు వెంకట్ మంత్రిప్రగడ, దాము గేదెల, మురళీ మేడిచెర్ల, సుభద్ర పాటిబండ్ల, వంశీ గరుడలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ పబ్లిక్యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల సహకారం అందించారు. -
న్యూజెర్సీలో హనుమాన్ జయంతి వేడుకలు
సౌత్ ప్లైన్ఫీల్డ్ : అమెరికాలో న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతిని ఈ సారి వినూత్నంగా జరిపారు. కరోనా వైరస్‌తో లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు ఇళ్లకు పరిమితం కావడంతో ఆన్లైన్ ద్వారా వారిని ఈ జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేశారు. ఇళ్ల నుంచే హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ రామనామ జపం చేస్తూ భక్తులు పాల్గొన్నారు. జూమ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా భక్తులు హనుమాన్ జయంతిని వీక్షిస్తుండగా పీఠంలో, కరోనా నుంచి యావత్ మానవాళిని రక్షించాలని కోరుతూ హనుమాన్ సహస్ర పారాయణం, మన్యసూక్త సహితంగా 108 కలశాలతో అభిషేకం జరిగింది. వెయ్యికి పైగా అరటి పండ్లు, తమలపాకులు, వడమాలలతో ఆంజనేయుడిని అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాధారణ సమయాల్లో ఎలా హనుమాన్ జయంతి జరుపుతారో అదే విధంగా లాక్డౌన్ సమయంలో కూడా వైభోవోపేతంగా ఈ వేడుకలునిర్వహించారు. భక్తులందరూ ఆన్లైన్లోనే ఈ వేడుకల్లో పాల్గొనేలా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. పూజానంతరం స్వామి వారికి అలంకరించిన అరటి పండ్లను స్థానిక సేవా సంస్థలైన న్యూ బ్రన్స్విక్లోని రాబర్టువుడ్ జాన్సన్ హాస్పిటల్, ఎడిసన్‌లోని ఓజనమ్ హోమ్ లెస్ షెల్టర్, సౌత్ ప్లైన్‌ఫీల్డ్‌లోని అరిస్టా కేర్ సంస్థలకు, సాయి దత్త పీఠం చారిటీ గ్రూప్ ద్వారా అందించినట్లు సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు. -
సందడిగా సాయి దత్త పీఠం గురుకుల నాల్గొవ వార్షికోత్సవం
సౌత్ ప్లైన్ఫీల్డ్ : భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం గురుకుల నాల్గొ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భావితరాలకు భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని పరిచయం చేసేందుకు సాయి దత్త పీఠం గత నాలుగేళ్లుగా ఈ గురుకులాన్నినిర్వహిస్తోంది. యోగా, భారతీయ నృత్యం, శ్లోకాలు, ఇలా ఎన్నో మన సంస్కృతికి సంబంధించిన అంశాలు సాయి దత్త పీఠం గురుకులంలో బోధిస్తూ వస్తోంది. నాల్గో వార్షికోత్సవం సందర్భంగా ఐదు నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఐదు నుంచి ఏడేళ్ల లోపు చిన్నారులు యోగా, భజనలు, శ్లోకాలు, జయహో అంటూ చేసిన నృత్యానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శనలు చూసి తన్మయులయ్యారు. రెండో చిన్నారుల బృందం కూడా ఆధ్యాత్మిక ప్రదర్శనలు, యోగాలో వివిధ ఆసనాలను ఒక క్రమ పద్దతిలో వేసిన ఔరా అనిపించింది. మూడో బృందం విష్ణు సహాస్ర నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జపం చేసిన తీరు ఆకట్టుకుంది. యోగా ఆసనాలతో నృత్యంతో మేళవింపు చేసి.. చేసిన ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. ఐకమత్యమే మహాబలం అనే సందేశాన్ని చాటుతూ చిన్నారులు చేసిన ప్రదర్శనకు కరతాళ ధ్వనులతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. అందరు చిన్నారులు మహాలక్ష్మి అష్టకాన్ని అద్భుతంగా పఠించారు. చివరలో గురుకుల ఉపాధ్యాయులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. గురుకుల వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు, వాలంటీర్లను సాయి దత్త పీఠం సత్కరించింది. న్యూ జెర్సీ వాసులైన సంస్కృత ప్రొఫెసర్, స్కాలర్ రాజారావు బండారు, నాట్స్ మాజీ అధ్యక్షులు, డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, ఫౌండర్ అండ్ సీఈఓ క్యూరీ లెర్నింగ్ సెంటర్, రత్న శేఖర్ మూల్పూరు లను సాయి దత్త పీఠం దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎడిసన్ బావార్చి వారు అందించిన స్నాక్స్ మరియు డిన్నర్ అందరి మన్నలను పొందింది. -
న్యూజెర్సీలో ఏక్ మే అనేక్ రూపకానికి అద్భుత స్పందన
న్యూజెర్సీ: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏక్ మే అనేక్ రూపకానికి అద్భుత స్పందన లభించింది. న్యూజెర్సీ ప్లయిన్ పీల్డ్ లో సాయి సమర్పణ్ బృందం, న్యూయార్క్ వారు నిర్వహించిన ఈ ప్రదర్శనకు భక్తజనం భారీగా తరలివచ్చారు. తెలుగువారితో పాటు భారతీయులు చాలామంది ఈ ప్రదర్శనను తిలకించేందుకు పోటీ పడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం... ఇదే సాయి తత్వం. దీనిని మనసులకు కట్టిపడేసే విధంగా సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించిన తీరుకు ప్రశంసల వర్షం కురిసింది. సాయి తత్వాన్ని భావోద్వేగాల మధ్య చక్కటి నేపథ్య సంగీతంతో సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించింది. హేమాడ్ పంత్ దాభోల్కర్ రాసిన ఈ నృత్యరూపకం సాయి భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. సాయి దత్త పీఠం నిర్వహకులు రఘు శర్మ శంకరమంచి ప్రణాళికతో వ్యవహరించడంతో ఆధ్యాత్మిక ప్రదర్శన అయినప్పటికి చాలా మంది ఈ ప్రదర్శనకు విచ్చేశారు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఏక్ మే అనేక్ రూపకాన్ని ప్రదర్శించినందుకు సాయి సమర్పణ్ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సాయితత్వాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా రఘుశర్మ శంకరమంచి అన్నారు. ఈ ప్రదర్శనను విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన సాయి దత్త పీఠం సేవా బృందాలను రఘు శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో సాయిదత్త పీఠం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన బోర్డు సభ్యులకు, దత్త పీఠం డైరెక్టర్లైన అశోక్ బడ్డి, చికాగో నుంచి వచ్చిన రాజ్ పొట్లూరి, స్థానికంగా ఉన్న తెలుగు ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన పెద్దలకు, ఉపేంద్ర చివుకులకు, దాతలు, ఎస్డీపీ ఫ్యామిలీ, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. చక్కటి విందు భోజనం అందించిన పెర్సిస్ బిర్యానీ నిర్వాహకులలో ఒకరైన రాజ్, వినయ్ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రఘుశర్మ, సాయి సమర్పణ్ కళాకారులకు దాతలు శాలువా కప్పి జ్ఞాపికలతో సత్కరించారు. -
అమెరికాలో శ్రీలంక ఉగ్ర దాడి అమరులకు నివాళి
సౌత్ ప్లైన్ఫీల్డ్ : ‘ఈస్టర్ పండగ రోజున గత ఆదివారం (ఏప్రిల్ 21) శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబోలో 8 చోట్ల బాంబులు పేల్చడంతో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబుల దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్టీటీఈ తుడిచిపెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన పొరుగు దేశంలో అసువులు బాసిన వారికి ప్రగాఢ సంతాపం తెలియ చేయాల్సిన సమయమిది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధిద్దాము. ప్రేమ, సర్వ మత సమానత్వంకై బాబా బాటలో నడవాలి’ అని రఘు శర్మ పిలుపు నిచ్చారు. న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు అమరులకు ఘన నివాళులర్పించారు.శ్రీలంకకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హచ్ఛి మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని అందరూ, అన్ని మతాలవారూ ఖండించాలని కోరారు. సుమారు 200 మంది భక్తులు కొవ్వొత్తి దీప ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. -
సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ
సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ : మానవత్వమే దైవత్వం అని ప్రగాఢంగా విశ్వసించే న్యూజెర్సీ సాయి దత్త పీఠం అదే బాటలో నడుస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కేరళ బాధితులు త్వరగా కోలుకోవాలంటూ అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించింది. ఇప్పటికే సాయిదత్త పీఠం అయ్యప్ప మాలధారణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తోంది. దీక్ష ధారులైన అయ్యప్పల కోసం భజనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా కేరళ వరద బాధితులు త్వరగా కోలుకోవాలంటూ అయ్యప్ప భజనలు నిర్వహించింది. న్యూజెర్సీ అయ్యప్ప భక్త మండలి, వరల్డ్ అయ్యప్ప సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఈ అయ్యప్పపడిపూజను భక్తులు ఘనంగా జరిపారు. అయ్యప్ప భక్తుల భజనలతో సాయి దత్త పీఠం మారు మ్రోగిపోయింది. ఈ ఛారిటీ కార్యక్రమానికి భక్తులు 4556 డాలర్లు విరాళమందించారు. ఈ మొత్తాన్ని వరల్డ్ అయ్యప్ప సేవా ట్రస్ట్ చైర్మన్ పార్ధసారధి గురు స్వామి కి అందించారు. వీరు నేరుగా కేరళ బాధిత కుటుంబాలకు అందించనున్నారు. -
సాయిదత్త పీఠంలో వీనులవిందుగా కర్నాటక సంగీతం
సౌత్ ప్లెన్ఫీల్డ్ (న్యూజెర్సీ) : అమెరికాలో భారతీయ ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠం కర్నాటక సంగీత కచేరి ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక సంగీతాన్ని పంచేందుకు ప్రముఖ కర్నాటక సంగీత ప్రావీణ్యులను సాయిదత్త పీఠానికి ఆహ్వానించింది. గాయనీ గుమ్మలూరి శారదా సుబ్రమణియన్, వయోలిన్ విద్వాంసులు శ్వేతా నరసింహాన్, మృదంగ విద్వాంసులు శబరినంద రామచంద్రన్ చేసిన సంగీత కచేరి ఆధ్యాత్మిక సంగీత ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. సిద్ధి వినాయకం, మోక్షం గలదా, శ్రీ వరలక్ష్మి సామజవరగమన, వందేశంభూం ఉమాపతి, భో.. శంభో, గోవింద బోలో, గోపాల బోలో వంటీ గీతాలు, శ్లోకాలతో పాటు సాయిభజనతో సాయి దత్త పీఠం మారుమ్రోగిపోయింది. కర్నాటక సంగీతంలో చక్కటి భక్తి సంగీత కచేరీని నిర్వహించిన శారదా సుబ్రమణియన్, శ్వేతానరసింహాన్, శబరినంద రామచంద్రన్‌లను సాయిదత్త పీఠం ప్రత్యేకంగా అభినందించింది. ఇదే సంగీత కార్యక్రమంలో స్వరరాగ సుధ కళా అకాడమీకి చెందిన ఉష, మణి ఆకెళ్లలకు స్వర సుధ కళా ప్రపూర్ణ పురస్కారాన్ని సాయిదత్తపీఠం ప్రదానం చేసింది. -
న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు
సౌత్ ప్లయిన్ఫీల్డ్ (న్యూజెర్సీ): అమెరికాలో షిరిడీ సాయి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడీ నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ పీఠం స్థలసేవ పేరుతో న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర 43 రాష్ట్రాలలోని పలు నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ న్యూజెర్సీ చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు భక్త జనం నీరాజనం పట్టింది. ఐదు మైళ్లపాటు జరిగిన ఈ ముగింపు యాత్రలో 100కు పైగా కార్లలో భక్తులు పాల్గొన్నారు. యాత్ర పొడవునా సాయి నాథుడికి నీరాజనాలు పట్టారు. తొలుత న్యూజెర్సీలోని మేడిచెర్ల మురళీ కృష్ణ నివాసంలో సాయి పాదుక పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ దాత కనికిచెర్ల లీలా కృష్ణ నివాసం లో ఆఖరి పాదుకా పూజ నిర్వహించి ఆ తర్వాత అక్కడ నుండి ప్రారంభమైన యాత్రకు సాయి నామ జపంతో భక్తజనం జేజేలు పలికారు. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా దీనికి తమ వంతు సహకారం అందించింది. పాదుక యాత్ర ప్రత్యేకత.. సాయి దత్త పీఠం స్థల సేవకు విరాళాల నిమిత్తం ఈ పాదుకయాత్ర చేపట్టింది. ఆ షిరిడీ నాథుడి పాదాలనే భక్తుల చెంతకు తీసుకెళ్లి అమెరికాలో షిరిడీ నిర్మాణ లక్ష్యాన్ని వివరించింది. పీఠం ప్రధాన నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండేళ్లపాటు అమెరికాలో 43 రాష్ట్రాల్లో 75000 మైళ్ల దూరం ఈ యాత్ర సాగింది. దాదాపు 2వేల ఇళ్లకు చేరుకుని సాయి పాదుక పూజ చేయడంతో పాటు 150 కి పైగా దేవాలయాలను చుట్టివచ్చింది. వందకు పైగా సమన్వయకర్తలు, 500మందికి పైగా స్వచ్చంద సాయి సేవకులు ఈ యాత్రలో తమ విలువైన సేవలు అందిస్తే 1,11,111 మందికి పైగా సాయి భక్తులను పలకరించింది. ఇంటింటికి పిలిచి సాయి పాదుక పూజను చేయించుకుని తరించారు. వైభవంగా సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం భారతీయ సంస్కృతి, సంప్రదయాలను ఆధ్యాత్మిక ప్రవాహాన్ని అమెరికాలో కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. భావి తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రబోదిస్తున్న గురుకులం.. రెండేళ్లు పూర్తి చేసుకుంది. గురుకులంలో చిన్నారులకు శ్లోకాలు, పద్యాలతో పాటు భారతీయ కళలను ఇక్కడ నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పించి వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు. చిన్నారులు చేసిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఔరా అనిపించాయి. -
'అమెరికాలో షిరిడీ' నిర్మాణంలో మరో ముందడుగు
షిరిడీ నిర్మాణ ఆకృతుల కోసం లగాన్ ఆర్ట్ డైరెక్టర్ సౌత్ ప్లైన్ఫీల్డ్(న్యూజెర్సీ): న్యూజెర్సీలో సాయిదత్త పీఠం 'అమెరికాలో షిరిడీ' నిర్మించాలనే మహాసంకల్పాన్ని చేపట్టింది. రెండు సంవత్సరాల క్రితం సరిగ్గా జూన్ 3న తలపెట్టిన సాయి పాదుకా యాత్ర ముగింపు దగ్గర పడుతుండటంతో షిరిడీ నిర్మాణ ఆకృతులపై దృష్టి పెట్టింది. దీని కోసం భారతీయ ప్రఖ్యాత కళా దర్శకులు నితిన్ చంద్రకాంత్ దేశాయ్‌ను అమెరికాకు రప్పించింది. జోథా అక్బర్, లగాన్, దేవదాస్ లాంటి గొప్ప చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన నితిన్ దేశాయ్ ఇప్పుడు 'అమెరికాలో షిరిడీ' నిర్మాణానికి ఆకృతులు ఇవ్వనున్నారు. దీని కోసం అమెరికాలో స్థానిక ఆర్కిటెక్ట్ కిషోర్ జోషితో కలిసి నితిన్ దేశాయ్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. సాయి దత్త పీఠాన్ని సందర్శించిన నితిన్ దేశాయ్ షిరిడీ నిర్మించే ప్రదేశానికి వెళ్లి స్థలాన్ని చూసి సంబంధించిన దృశ్యరూప చిత్తు ప్రతిని కూడా చూపించారు. సాయి దత్త పీఠం బోర్డు డైరక్టర్లతో చర్చించి ఆకృతులపై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అందరి అభిప్రాయాలను పరిశీలించి వినూత్నంగా.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. ఆకృతులు అందిస్తానని దేశాయ్ తెలిపారు. "అమెరికాలో షిరిడీ" అనే మహాసంకల్పానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. షిరిడీ నిర్మాణంలో నితిన్ దేశాయ్ భాగస్వాములు కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.