న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు | sai datta peetham will construct shirdi sai temple in new jersey | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు

Published Tue, Jun 6 2017 5:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు

న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు

సౌత్ ప్లయిన్ఫీల్డ్ (న్యూజెర్సీ): అమెరికాలో షిరిడీ సాయి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడీ నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ పీఠం స్థలసేవ పేరుతో న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర 43 రాష్ట్రాలలోని పలు నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ న్యూజెర్సీ చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు భక్త జనం నీరాజనం పట్టింది.

ఐదు మైళ్లపాటు జరిగిన ఈ ముగింపు యాత్రలో 100కు పైగా కార్లలో భక్తులు పాల్గొన్నారు. యాత్ర పొడవునా సాయి నాథుడికి నీరాజనాలు పట్టారు. తొలుత న్యూజెర్సీలోని మేడిచెర్ల మురళీ కృష్ణ నివాసంలో సాయి పాదుక పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ దాత కనికిచెర్ల లీలా కృష్ణ నివాసం లో ఆఖరి పాదుకా పూజ నిర్వహించి ఆ తర్వాత అక్కడ నుండి ప్రారంభమైన యాత్రకు సాయి నామ జపంతో భక్తజనం జేజేలు పలికారు. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా దీనికి తమ వంతు సహకారం అందించింది.

పాదుక యాత్ర ప్రత్యేకత..
సాయి దత్త పీఠం స్థల సేవకు విరాళాల నిమిత్తం ఈ పాదుకయాత్ర చేపట్టింది. ఆ షిరిడీ నాథుడి పాదాలనే భక్తుల చెంతకు తీసుకెళ్లి అమెరికాలో షిరిడీ నిర్మాణ లక్ష్యాన్ని వివరించింది.  పీఠం ప్రధాన నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండేళ్లపాటు అమెరికాలో 43 రాష్ట్రాల్లో 75000 మైళ్ల దూరం ఈ యాత్ర సాగింది. దాదాపు 2వేల ఇళ్లకు చేరుకుని సాయి పాదుక పూజ చేయడంతో పాటు 150 కి పైగా దేవాలయాలను చుట్టివచ్చింది.  వందకు పైగా సమన్వయకర్తలు, 500మందికి పైగా  స్వచ్చంద సాయి సేవకులు ఈ యాత్రలో తమ విలువైన సేవలు అందిస్తే 1,11,111 మందికి పైగా సాయి భక్తులను పలకరించింది. ఇంటింటికి పిలిచి సాయి పాదుక పూజను చేయించుకుని తరించారు.

వైభవంగా సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం
భారతీయ సంస్కృతి, సంప్రదయాలను ఆధ్యాత్మిక ప్రవాహాన్ని అమెరికాలో కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. భావి తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రబోదిస్తున్న గురుకులం.. రెండేళ్లు పూర్తి చేసుకుంది. గురుకులంలో చిన్నారులకు శ్లోకాలు, పద్యాలతో పాటు భారతీయ కళలను ఇక్కడ నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పించి వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు. చిన్నారులు చేసిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఔరా అనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement