ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు హాజరయ్యారు.
మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు. ప్రవాసులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని పలువురు ప్రశంసించారు.
అలాగే.. పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగించారని కొనియాడారు.
వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యం లో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాద కర వాతావరణంలో నిర్వహించారు.
ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైస్సార్ ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్, కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ మరియు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని తెలియచేసారు. రాజేశ్వర్ రెడ్డి గంగసాని మాట్లాడుతూ ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే అంతా కూడా రాజశేఖర రెడ్డి ముందుచూపే కారణం అని తెలియచేసారు. శ్రీకాంత్ పెనుమాడ మాట్లాడుతూ నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
అలాగే భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ వైఎస్సార్ మనమధ్య లేకపోయినా, ఇన్ని సంవత్సరాలు అయినా ఈవిధం గా అందరూ కలసి వనభోజనాలతో వైఎస్సార్ జయంతి జరుపుకోడం ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి ఉయ్యూరు, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, భానోజీ రెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూలె గారిని పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హరి వేల్కూర్, రాజేశ్వర్ రెడ్డి గంగసాని, శివ మేక, శరత్ మందపాటి, శ్రీకాంత్ పెనుమాడ, శ్రీకాంత్ గుడిపాటి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి , లక్ష్మీనారాయణ రెడ్డి, అన్నా రెడ్డి, సహదేవ్ రాయవరం, సంతోష్ పాతూరి, రమణా రెడ్డి దేవులపల్లి, శ్రీధర్ తిక్కవరపు, అంజన్ కర్నాటి, శరత్ వేముల, బాలకృష్ణ భీమవరపు, భానోజీ రెడ్డి, నాగి రెడ్డి ఉయ్యూరు, పద్మనాభ రెడ్డి, వెంకట రెడ్డి కాగితాల, విజయ్ గోలి, వినోద్ ఏరువ, వంశి బొమ్మారెడ్డి, ఉష చింత, రమేష్ చంద్ర, శ్రీనివాస రెడ్డి యన్నం, రాజా బొమ్మారెడ్డి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూలె, బత్తుల శ్రీనివాస రెడ్డి, రఘు అల్లూరి, మనోజ్ చింత, అరుణ్ అయ్యగారి, ప్రణీత్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, పరంధామ రెడ్డి, భీమిరెడ్డి సాంబి రెడ్డి , ఆర్ వీ రెడ్డి (చికాగో) తోపాటు 300 మందికి పైగా వైఎస్సార్‌ఆర్ అభిమానులు పాల్గొని మహానేతకు నివాళుర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment