new jersy
-
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు హాజరయ్యారు. మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు. ప్రవాసులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని పలువురు ప్రశంసించారు. అలాగే.. పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగించారని కొనియాడారు.వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యం లో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాద కర వాతావరణంలో నిర్వహించారు. ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైస్సార్ ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్, కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ మరియు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని తెలియచేసారు. రాజేశ్వర్ రెడ్డి గంగసాని మాట్లాడుతూ ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే అంతా కూడా రాజశేఖర రెడ్డి ముందుచూపే కారణం అని తెలియచేసారు. శ్రీకాంత్ పెనుమాడ మాట్లాడుతూ నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.అలాగే భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ వైఎస్సార్ మనమధ్య లేకపోయినా, ఇన్ని సంవత్సరాలు అయినా ఈవిధం గా అందరూ కలసి వనభోజనాలతో వైఎస్సార్ జయంతి జరుపుకోడం ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి ఉయ్యూరు, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, భానోజీ రెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూలె గారిని పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హరి వేల్కూర్, రాజేశ్వర్ రెడ్డి గంగసాని, శివ మేక, శరత్ మందపాటి, శ్రీకాంత్ పెనుమాడ, శ్రీకాంత్ గుడిపాటి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి , లక్ష్మీనారాయణ రెడ్డి, అన్నా రెడ్డి, సహదేవ్ రాయవరం, సంతోష్ పాతూరి, రమణా రెడ్డి దేవులపల్లి, శ్రీధర్ తిక్కవరపు, అంజన్ కర్నాటి, శరత్ వేముల, బాలకృష్ణ భీమవరపు, భానోజీ రెడ్డి, నాగి రెడ్డి ఉయ్యూరు, పద్మనాభ రెడ్డి, వెంకట రెడ్డి కాగితాల, విజయ్ గోలి, వినోద్ ఏరువ, వంశి బొమ్మారెడ్డి, ఉష చింత, రమేష్ చంద్ర, శ్రీనివాస రెడ్డి యన్నం, రాజా బొమ్మారెడ్డి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూలె, బత్తుల శ్రీనివాస రెడ్డి, రఘు అల్లూరి, మనోజ్ చింత, అరుణ్ అయ్యగారి, ప్రణీత్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, పరంధామ రెడ్డి, భీమిరెడ్డి సాంబి రెడ్డి , ఆర్ వీ రెడ్డి (చికాగో) తోపాటు 300 మందికి పైగా వైఎస్సార్‌ఆర్ అభిమానులు పాల్గొని మహానేతకు నివాళుర్పించారు. -
అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్
ట్రెంటన్: అమెరికా న్యూజెర్సీ స్టేట్‌లో హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్బర్గ్ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసు సీఐడీ విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు. -
రాజస్తాన్ రాయల్స్ కొత్త జెర్సీ ఇదే.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. తాజాగా టీమ్ జెర్సీని రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం విడుదల చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్, చాహల్ న్యూ జెర్సీతో ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. అలాగే జెర్సీకి సంబంధించిన ఓ వీడియోను కూడా రాజస్తాన్ విడుదల చేసింది. ఐపీఎల్-2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ ఐపీఎల్ 15 సీజేన్ మే 29 వరకు కొనసాగనుంది. రాజస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్.. ట్రెంట్ బౌల్ట్,షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కెసి కారియప్ప, ఒబెద్ సైని, నవ్‌దీప్ సైని సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డారిల్ మిచెల్ చదవండి: IPL 2022: హార్దిక్‌కు ఫిట్నెస్ టెస్ట్.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా! Pink & blue. But all-new. 💗 The Rajasthan Royals official #IPL2022 match kit has been (express) delivered. 🏍️🔥#HallaBol | #GivesYouWiiings | @IamSanjuSamson | @yuzi_chahal | @ParagRiyan | @redbullindia pic.twitter.com/HW75lGusVN — Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2022 -
న్యూజెర్సీలో నాట్స్ ఆహార పంపిణీ
న్యూ జెర్సీ : అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా న్యూజెర్సీలోని న్యూ బ్రాన్స్విక్లో నిరాశ్రయులకు ఉచితంగా నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేసింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌తో ఇక్కడ నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిత్యావసరాలు కూడా వారికి అందని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో నాట్స్ సేవా భావంతో ముందుకొచ్చింది. వారిని ఆదుకునేందుకు నాట్స్ న్యూజెర్సీ టీం నిత్యావసరాలు, వారికి అవసరమైన ఆహారాన్ని అందించింది. నాట్స్ మాజీ అధ్యక్షడు, బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్ముందు కూడా కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తుందని నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ తెలిపారు. కష్టకాలంలో తమకు సాయం అందించినందుకు నిరాశ్రయులు నాట్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. న్యూజెర్సీ నాట్స్ నాయకులు రమేశ్ నూతలపాటి, రాజ్ అల్లాడ, వంశీ వెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, సూర్య గుత్తికొండ, శేషగిరి కంభంమెట్టు, కుమార్ వెనిగళ్ల తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. -
న్యూజెర్సీలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
న్యూజెర్సీ : అమెరికాలోని న్యూజెర్సీలో తందూరీ ఫ్లేమ్స్ రెస్టారెంట్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ జెర్సీ(టీఏఎన్జే) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్య నిర్వాహకులు అందరి సమక్షంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి వైఎస్ జగన్‌కు తమ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ త్రివిక్రమ బానోజీరెడ్డి, దత్తారెడ్డి, భాస్కర్, జయ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారం
ఎడిసన్ : మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని న్యూజెర్సీ పట్టణంలోని సాయిదత్త పీఠంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధేయవాదం గురించి ప్రసంగించారు. ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారమని న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ప్రపంచంలోని చాలా మంది నాయకులు ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుత విజయాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గాంధీ జయంతిని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవం గా ప్రకటించటం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలను, ఆయన పాటించిన విలువలను జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యూజెర్సీ రాష్ట్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవంగా జరుపుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు, ధార్మిక సంస్థలకు అధికారిక ఉత్తర్వుల ప్రకటన జారీ చేశారు. కార్యక్రమంలో సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
సందడిగా సాయి దత్త పీఠం గురుకుల నాల్గొవ వార్షికోత్సవం
సౌత్ ప్లైన్ఫీల్డ్ : భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం గురుకుల నాల్గొ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భావితరాలకు భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని పరిచయం చేసేందుకు సాయి దత్త పీఠం గత నాలుగేళ్లుగా ఈ గురుకులాన్నినిర్వహిస్తోంది. యోగా, భారతీయ నృత్యం, శ్లోకాలు, ఇలా ఎన్నో మన సంస్కృతికి సంబంధించిన అంశాలు సాయి దత్త పీఠం గురుకులంలో బోధిస్తూ వస్తోంది. నాల్గో వార్షికోత్సవం సందర్భంగా ఐదు నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఐదు నుంచి ఏడేళ్ల లోపు చిన్నారులు యోగా, భజనలు, శ్లోకాలు, జయహో అంటూ చేసిన నృత్యానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శనలు చూసి తన్మయులయ్యారు. రెండో చిన్నారుల బృందం కూడా ఆధ్యాత్మిక ప్రదర్శనలు, యోగాలో వివిధ ఆసనాలను ఒక క్రమ పద్దతిలో వేసిన ఔరా అనిపించింది. మూడో బృందం విష్ణు సహాస్ర నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జపం చేసిన తీరు ఆకట్టుకుంది. యోగా ఆసనాలతో నృత్యంతో మేళవింపు చేసి.. చేసిన ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. ఐకమత్యమే మహాబలం అనే సందేశాన్ని చాటుతూ చిన్నారులు చేసిన ప్రదర్శనకు కరతాళ ధ్వనులతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. అందరు చిన్నారులు మహాలక్ష్మి అష్టకాన్ని అద్భుతంగా పఠించారు. చివరలో గురుకుల ఉపాధ్యాయులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. గురుకుల వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు, వాలంటీర్లను సాయి దత్త పీఠం సత్కరించింది. న్యూ జెర్సీ వాసులైన సంస్కృత ప్రొఫెసర్, స్కాలర్ రాజారావు బండారు, నాట్స్ మాజీ అధ్యక్షులు, డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, ఫౌండర్ అండ్ సీఈఓ క్యూరీ లెర్నింగ్ సెంటర్, రత్న శేఖర్ మూల్పూరు లను సాయి దత్త పీఠం దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎడిసన్ బావార్చి వారు అందించిన స్నాక్స్ మరియు డిన్నర్ అందరి మన్నలను పొందింది. -
న్యూజెర్సీలో ఏక్ మే అనేక్ రూపకానికి అద్భుత స్పందన
న్యూజెర్సీ: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏక్ మే అనేక్ రూపకానికి అద్భుత స్పందన లభించింది. న్యూజెర్సీ ప్లయిన్ పీల్డ్ లో సాయి సమర్పణ్ బృందం, న్యూయార్క్ వారు నిర్వహించిన ఈ ప్రదర్శనకు భక్తజనం భారీగా తరలివచ్చారు. తెలుగువారితో పాటు భారతీయులు చాలామంది ఈ ప్రదర్శనను తిలకించేందుకు పోటీ పడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం... ఇదే సాయి తత్వం. దీనిని మనసులకు కట్టిపడేసే విధంగా సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించిన తీరుకు ప్రశంసల వర్షం కురిసింది. సాయి తత్వాన్ని భావోద్వేగాల మధ్య చక్కటి నేపథ్య సంగీతంతో సాయి సమర్పణ్ బృందం ప్రదర్శించింది. హేమాడ్ పంత్ దాభోల్కర్ రాసిన ఈ నృత్యరూపకం సాయి భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. సాయి దత్త పీఠం నిర్వహకులు రఘు శర్మ శంకరమంచి ప్రణాళికతో వ్యవహరించడంతో ఆధ్యాత్మిక ప్రదర్శన అయినప్పటికి చాలా మంది ఈ ప్రదర్శనకు విచ్చేశారు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఏక్ మే అనేక్ రూపకాన్ని ప్రదర్శించినందుకు సాయి సమర్పణ్ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సాయితత్వాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా రఘుశర్మ శంకరమంచి అన్నారు. ఈ ప్రదర్శనను విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన సాయి దత్త పీఠం సేవా బృందాలను రఘు శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో సాయిదత్త పీఠం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన బోర్డు సభ్యులకు, దత్త పీఠం డైరెక్టర్లైన అశోక్ బడ్డి, చికాగో నుంచి వచ్చిన రాజ్ పొట్లూరి, స్థానికంగా ఉన్న తెలుగు ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన పెద్దలకు, ఉపేంద్ర చివుకులకు, దాతలు, ఎస్డీపీ ఫ్యామిలీ, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. చక్కటి విందు భోజనం అందించిన పెర్సిస్ బిర్యానీ నిర్వాహకులలో ఒకరైన రాజ్, వినయ్ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రఘుశర్మ, సాయి సమర్పణ్ కళాకారులకు దాతలు శాలువా కప్పి జ్ఞాపికలతో సత్కరించారు. -
పుల్వామా ఉగ్రదాడి.. న్యూజెర్సీలో కొవ్వొత్తుల ర్యాలీ
-
పుల్వామా ఉగ్రదాడి.. న్యూజెర్సీలో కొవ్వొత్తుల ర్యాలీ
న్యూజెర్సీ : పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ(ఓఎఫ్‌బీజేపీ) కార్యకర్తలు శ్రద్దాంజలిని ఘటించింది. ఓఎఫ్‌బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రదాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ క్రిష్ణా రెడ్డి అనుగుల మాట్లాడుతూ.. వీర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. వైస్ ప్రెసిడెంట్ అడప ప్రసాద్ మాట్లాడుతూ.. పుల్వామా ఉగ్రదాడి ఒక పిరికి పంద చర్య అని.. దీనికి గట్టిగా బదులు చెప్పిన మోదీ ప్రభుత్వాన్ని కొనియాడారు. సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని ఆర్గనైజేషన్ కార్యదర్శి వాసుదేవ్ పటేల్ తెలిపారు. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేశారు. మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుపడినందుకు చైనా సిగ్గుపడాలి అంటూ విమర్శించారు. -
న్యూజెర్సీలో మెహబూబా టీం సందడి
-
న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు
సౌత్ ప్లయిన్ఫీల్డ్ (న్యూజెర్సీ): అమెరికాలో షిరిడీ సాయి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడీ నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ పీఠం స్థలసేవ పేరుతో న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర 43 రాష్ట్రాలలోని పలు నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ న్యూజెర్సీ చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు భక్త జనం నీరాజనం పట్టింది. ఐదు మైళ్లపాటు జరిగిన ఈ ముగింపు యాత్రలో 100కు పైగా కార్లలో భక్తులు పాల్గొన్నారు. యాత్ర పొడవునా సాయి నాథుడికి నీరాజనాలు పట్టారు. తొలుత న్యూజెర్సీలోని మేడిచెర్ల మురళీ కృష్ణ నివాసంలో సాయి పాదుక పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ దాత కనికిచెర్ల లీలా కృష్ణ నివాసం లో ఆఖరి పాదుకా పూజ నిర్వహించి ఆ తర్వాత అక్కడ నుండి ప్రారంభమైన యాత్రకు సాయి నామ జపంతో భక్తజనం జేజేలు పలికారు. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా దీనికి తమ వంతు సహకారం అందించింది. పాదుక యాత్ర ప్రత్యేకత.. సాయి దత్త పీఠం స్థల సేవకు విరాళాల నిమిత్తం ఈ పాదుకయాత్ర చేపట్టింది. ఆ షిరిడీ నాథుడి పాదాలనే భక్తుల చెంతకు తీసుకెళ్లి అమెరికాలో షిరిడీ నిర్మాణ లక్ష్యాన్ని వివరించింది. పీఠం ప్రధాన నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండేళ్లపాటు అమెరికాలో 43 రాష్ట్రాల్లో 75000 మైళ్ల దూరం ఈ యాత్ర సాగింది. దాదాపు 2వేల ఇళ్లకు చేరుకుని సాయి పాదుక పూజ చేయడంతో పాటు 150 కి పైగా దేవాలయాలను చుట్టివచ్చింది. వందకు పైగా సమన్వయకర్తలు, 500మందికి పైగా స్వచ్చంద సాయి సేవకులు ఈ యాత్రలో తమ విలువైన సేవలు అందిస్తే 1,11,111 మందికి పైగా సాయి భక్తులను పలకరించింది. ఇంటింటికి పిలిచి సాయి పాదుక పూజను చేయించుకుని తరించారు. వైభవంగా సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం భారతీయ సంస్కృతి, సంప్రదయాలను ఆధ్యాత్మిక ప్రవాహాన్ని అమెరికాలో కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. భావి తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రబోదిస్తున్న గురుకులం.. రెండేళ్లు పూర్తి చేసుకుంది. గురుకులంలో చిన్నారులకు శ్లోకాలు, పద్యాలతో పాటు భారతీయ కళలను ఇక్కడ నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పించి వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు. చిన్నారులు చేసిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఔరా అనిపించాయి. -
టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ
ముంబై:టీమిండియా క్రికెటర్లు ధరించే కొత్త జెర్సీని గురువారం ఆవిష్కరించారు. ఈ మేరకు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి, ఒప్పో మొబైల్ ఇండియా అధ్యక్షుడు స్కైలి నూతన జెర్సీని విడుదల చేశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఒప్పోతో బీసీసీఐ ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకుంది. 1,079 కోట్లతో ఒప్పో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఇటీవల జెర్సీ హక్కుల కోసం నిర్వహించిన వేలం స్టార్ ఇండియాను ఒప్పో అధిగమించింది. త్వరలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు కొత్త జెర్సీలో కనిపించనుంది. ఒకవైపు చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనడంపై ఇంకా స్పష్టత లేకపోయినా కొత్త జెర్సీని ఆవిష్కరించడం గమనార్హం. BCCI CEO @RJohri & @oppomobileindia President Mr. Sky Li launch the #OPPO #TeamIndia jersey pic.twitter.com/wpK0CV5Ldu — BCCI (@BCCI) 4 May 2017