న్యూజెర్సీ : పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ(ఓఎఫ్‌బీజేపీ) కార్యకర్తలు శ్రద్దాంజలిని ఘటించింది. ఓఎఫ్‌బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రదాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ క్రిష్ణా రెడ్డి అనుగుల మాట్లాడుతూ.. వీర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆశించారు.
వైస్ ప్రెసిడెంట్ అడప ప్రసాద్ మాట్లాడుతూ.. పుల్వామా ఉగ్రదాడి ఒక పిరికి పంద చర్య అని.. దీనికి గట్టిగా బదులు చెప్పిన మోదీ ప్రభుత్వాన్ని కొనియాడారు. సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని ఆర్గనైజేషన్ కార్యదర్శి వాసుదేవ్ పటేల్ తెలిపారు. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేశారు. మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుపడినందుకు చైనా సిగ్గుపడాలి అంటూ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment