
న్యూజెర్సీ : అమెరికాలోని న్యూజెర్సీలో తందూరీ ఫ్లేమ్స్ రెస్టారెంట్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ జెర్సీ(టీఏఎన్‌జే) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్య నిర్వాహకులు అందరి సమక్షంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి వైఎస్ జగన్‌కు తమ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ త్రివిక్రమ బానోజీరెడ్డి, దత్తారెడ్డి, భాస్కర్, జయ్, తదితరులు పాల్గొన్నారు.