
మేరీల్యాండ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు జర్మన్ టౌన్ నగరంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మేరీల్యాండ్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థ బైరెడ్డి మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టేందుకు దిశా చట్టం 2019ని అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, రైతు భరోసా, గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నవరత్నాల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని, మేనిఫెస్టోలోని ప్రతి కార్యక్రమం అమలు దిశగా సాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పవన్ ధనిరెడ్డి, రవి బారెడ్డి, తిప్పారెడ్డి కోట్ల, అశోక్ చిట్టెల, శ్రీనివాస రెడ్డి కాసుల, హితేందర్ సాంరెడ్డి, మధు మజ్జి, నవీన్ చింతలపూడి, రామకృష్ణ, ఝాన్సీ బైరెడ్డి, ప్రవీణ ధనిరెడ్డి, లక్ష్మి కోట్ల, సుజిత చిట్టెల, విష్ణు సాంరెడ్డి, సంగీత మద్ది, శాంతి మజ్జి, శేషు ప్రసన్న కొండేటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment