Maryland America
-
భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
వాషింగ్టన్: భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. ‘మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వమనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతిచోటా వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది’అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకీక్ టౌన్‌షిప్‌లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధా గార్డెన్‌తోపాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. -
వెటా ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు
విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా ముగిశాయి. మే 16 న మేరీల్యాండ్ హానోవర్‌లో నిర్వహించిన వేడుకలకి దాదాపు ఆరువందల మందికి పైగా సభ్యులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లోకల్ బ్యాండ్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు చాలా బహుమతులను అందజేశారు. అలాగే ఆహుతులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు. ఈ మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరిలతో పాటు వెటా మేరీల్యాండ్ చాప్టర్ కార్యవర్గం నిర్విరామంగా కృష్టి చేసింది. ఈ కార్యక్రమంలో వెటా మీడియా నేషనల్ ఛైర్ పర్సన్ సుగుణారెడ్డి, స్థానిక వెటా సభ్యులు ప్రీతీ రెడ్డి, యామిని రెడ్డి , నవ్యస్మృతి , జయలతో పాటు స్థానిక కమ్యూనిటీ లీడర్స్ సుధా కొండెపి, కవిత చల్ల, శ్రీధర్ నాగిరెడ్డి , డాక్టర్ పల్లవి , రామ్మోహన్ కొండా, యోయో టీవీ నరసింహ రెడ్డి అనిత ముత్తోజు , అపర్ణ కడారి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వెటా స్థానిక కార్యవర్గాన్ని ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అభినందించారు. తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసం మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) సంస్థను రెండేళ్ల కిందట ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు. మహిళకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకత (క్రియేటివిటీ)ను పెంచి వారి కలలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలని ఉద్దేశ్యంతో ఝాన్సీరెడ్డి ఈ సంఘం స్థాపించారు. మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తోంది. చదవండి: న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ -
కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?
A house worth crores of rupees was gutted In USA Know How: ఇంట్లోకి పాములొస్తే సాధాకణంగా ఎవరైనా ఏం చేస్తారు? పాములను పట్టేవాళ్లను పిలవడమో.. ధైర్యముంటే కర్ర సహాయంతో పామును పట్టుకుని ఆరుబయట వదిలెయ్యడమో చేస్తాం! ఐతే ఓ వ్యక్తి పాము నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఇంటికి నిప్పంటించాడు. అసలేంజరిగిందంటే.. అమెరికాలోని మోంట్గోమేరీ కౌంటీలో కోట్ల విలువచేసే ఇల్లును తగులబెట్టాడు. నిజానికి ఇంటి యజమాని ఐడియా ఏంటంటే.. పొగ పెట్టడం ద్వారా పామును బయటికి పంపొచ్చని బొగ్గులను మండించాడు. ఈ మంటలు ఇంట్లోని వస్తువులకు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చిన కాసేపటికే ఇళ్లు మొత్తం పూర్తిగా కాలిపోయిందని పోలీసధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో షేర్చేశారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఐతే ఈ అగ్నిప్రమాదంలో సుమారు పది లక్షలపైనే ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ICYMI (Tuesday 11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) NOTE: non-hydrant area, driveway 3/4 mi long off Big Woods Rd pic.twitter.com/hJ4i4Bz8nL — Pete Piringer (@mcfrsPIO) November 26, 2021 Update (11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs Media Hotline Update 240.777.2442 - no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) https://t.co/6PwIkbRAkf pic.twitter.com/jWlB1HPdKt — Pete Piringer (@mcfrsPIO) November 24, 2021 -
డమాస్కస్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మేరిల్యాండ్: అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని మేరిల్యాండ్‌లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని డమాస్కస్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి.వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థసారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ ధనిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు. - వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టి, ప్రతీ పేదవాడికి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా వైఎస్సార్ జయంతి, వర్ధంతిలతో పాటు బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వైఎస్సార్ పేరు మీదుగా మేరిల్యాండ్‌లో జరుపుతున్నామని తెలిపారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే నవరత్నాలకు సీఎం జగన్ రూపకల్పన చేశారని తెలిపారు. - వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది ఈ వేడుకల్లో భాగం కావడం చూస్తుంటే రాజశేఖరరెడ్డి ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. - మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్ మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ సారధిరెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. - వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు పవన్ ధనిరెడ్డి మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ తపన ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ... కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌కు అభిమానులు ఉన్నారని చెప్పారు. పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థ సారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు భాస్కర బొమ్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కొండా, వెంకట్ యర్రం, పవన్ ధనిరెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, రాజశేఖర్ రెడ్డి యరమల, రవి బారెడ్డి, మురళి బచ్చు, రాంగోపాల్ దేవపట్ల, శ్రీనివాస్ పూసపాటి, రామకృష్ణ, వాసుదేవ రెడ్డి తల్లా, గిరిధర్ బండి, సతీష్ బోబ్బా, పూర్ణశేఖర్ జొన్నల, శ్రీనాథ్, వెంకట్ కీసర, శ్రీనివాస్ పూతన, రామచంద్ర యారుబండి, నాగిరెడ్డి, లక్ష్మి నారాయణ, కరుణాకర్ వణుకూరి, అనంత్ పూసపాటి, శివ పిట్టు, శ్రీనివాస్, రాజు గొనె, రవి ముత్తోజు, రరాజు బచ్చు, నవీన్ చింతలపూడి లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఫుడ్‌డ్రైవ్ వైఎస్సార్ జయంతి సందర్భంగా పిక్నిక్ , ఫుడ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దలు వరకు రెండు వందల మందికి పైగా కుటుంబం తో వచ్చి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ లో ఐదు వందల పౌండ్స్ కి పైగా ఫుడ్ ను మన్నా ఫుడ్ సెంటర్‌కి డొనేట్ చేశారు. -
మేరీ ల్యాండ్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్ డి.సి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, ఫ్రెడెరిక్ నగరం లో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం జూలై 11వ తేదీ ఉదయం (ఇండియా కాలమానము - శనివారం రాత్రి) వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వెంకట్ యర్రం ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారందరూ తమకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మూడు రాజధానులు ముద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదాలు చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ, ‘ఈ కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది పాల్గొనడం వల్ల వైఎస్ఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది . ఈ రోజు వరకు కూడా పెద్దాయనను గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి అని అర్థం. పెద్దాయన చేసిన మంచి పనులు మన పిల్లలకు కూడా గుర్తు చేసి వాళ్ళను కూడా భవిష్యత్తులో ఇలా తీర్చి దిద్దాలి’ అని అందరిని కోరారు. చదవండి: వాషింగ్టన్ డి.సిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సుపరిపాలన , పథకాలను గుర్తు చేశారు. ఈ రెండు సమంగా ప్రజల్లోకి తీసుకెళ్లినా ఘనత కేవలం వైఎస్సార్‌కి మాత్రమే దక్కుతుంది అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం లో ఎవరో ఒకరు అయన ప్రవేశ పెట్టిన పథకాలతో తప్పకుండా లాభం పొందారు అని గుర్తు చేశారు. అందుకే ఆయనంటే అందరికి అంత ప్రేమ అని చెప్పారు. వైఎస్ఆర్ గారి పథకాల్ని అయన కుమారుడు మళ్లీ పైకి తీసుకవచ్చి తన నవ రత్నాల్లో ఉంచి కేవలం ఒక సంవత్సరం లోనే ఎనభై శాతం పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత, బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం, చెదిరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం వైఎస్ రాజశేఖరుడు అని అన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ ‘వైఎస్సార్ అంటే ఒక్క వైఎస్సార్ సీపీ పార్టీ వాళ్ళే కాకుండా అన్ని పార్టీలో వాళ్ళు ఆయనకు గౌరవం ఇస్తారు. ముఖ్య మంత్రి అయినప్పుడు అందరికి మంచి చేయాలన్న తపనతో ముందుకు వెళ్లే వ్యక్తి వైఎస్సార్. అలాగే అదే బాట లోనే అయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అందరికి మేలు చేయాలన్న తపన తోనే ముందుకు వెళ్తూ ఉండటం మనం చూస్తూనే వున్నాం. అలాంటి వాళ్లు మనకు ముఖ్యమంత్రిగా రావటం మనం చేసుకున్న అదృష్టం’ అని కొనియాడారు. చదవండి: ఆత్మనివేదనలో అంతరంగం వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు వెంకట్ యర్రం మాట్లాడుతూ ‘వైఎస్సార్ ప్రతి ఒక్క మనిషిని దృష్టిలో పెట్టుకుని అందరికి మంచి చేయాలి అన్న తపన తో మన రాష్ట్రాన్ని బంగారు బాటలో ముందుకు తీసుకెళ్లిన మంచి మనిషి . అయన కుమారుడు కూడా ఎన్నికలకు ముందు తన తండ్రి లాగానే చేస్తాడా అని ఒక సమస్య అందరిలోనూ ఉండేది. కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డినే మరిచిపోయే అంతలా రాబోయే పది సంవత్సరాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారు. జగన్ నవరత్నాల్లో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా వరకు నెరవేరుస్తున్నారు.ఇలా జగన్ గారు చేసిన మంచి పనులు అన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ పార్టీ ని ముందుకు తీసుకువెళ్లడానికి మన వంతు కృషి చేయాలి’ అని అన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు మురళి బచ్చు మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్సార్ గారు ఒక కారణ జన్ముడు. అలాంటి వ్యక్తిని మళ్లీ పుట్టించాలని ఆ దేవుడిని కోరాలి. పెద్దాయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికి కూడా చిరస్మరణీయం. అయన చేపట్టిన వైద్య , విద్య పథకాల ద్వారా ఎంతో మంది పేదలు చాలా లాభపడ్డారు. ప్రతి విషయం లో జగన్ తన తండ్రి ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు వెంకట్ యర్రం, రాజశేఖర్ యరమల, రవి బారెడ్డి, రాంగోపాల్ దేవపట్ల, మురళి బచ్చు, సుదర్శన దేవిరెడ్డి, శ్రీనివాస్ పూసపాటి, నాగిరెడ్డి, లోకేష్ మేడపాటి, నాగార్జున, సతీష్ బోబ్బా, రాజేష్, సోమశేఖర్ పాటిల్, రామకృష్ణ లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు -
మేరీల్యాండ్‌లో వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
మేరీల్యాండ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు జర్మన్ టౌన్ నగరంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ మేరీల్యాండ్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థ బైరెడ్డి మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టేందుకు దిశా చట్టం 2019ని అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, రైతు భరోసా, గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నవరత్నాల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని, మేనిఫెస్టోలోని ప్రతి కార్యక్రమం అమలు దిశగా సాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పవన్ ధనిరెడ్డి, రవి బారెడ్డి, తిప్పారెడ్డి కోట్ల, అశోక్ చిట్టెల, శ్రీనివాస రెడ్డి కాసుల, హితేందర్ సాంరెడ్డి, మధు మజ్జి, నవీన్ చింతలపూడి, రామకృష్ణ, ఝాన్సీ బైరెడ్డి, ప్రవీణ ధనిరెడ్డి, లక్ష్మి కోట్ల, సుజిత చిట్టెల, విష్ణు సాంరెడ్డి, సంగీత మద్ది, శాంతి మజ్జి, శేషు ప్రసన్న కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
పత్రికపై కక్ష.. మారణహోమం
వాషింగ్టన్: ఒక వార్తాపత్రికపై కక్ష పెంచుకున్న వ్యక్తి.. అమెరికాలోని అన్నాపోలిస్ నగరంలో మారణహోమం సృష్టించాడు. పత్రిక కార్యాలయంలోకి చొరబడి స్మోక్ గ్రనేడ్లు విసిరి గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదురుగు మరణించగా.. వారిలో నలుగురు జర్నలిస్టులు. అమెరికా రాజధాని వాషింగ్టన్కు 50 కి.మీ దూరంలో ఉన్న మేరిల్యాండ్ రాష్ట్రం అన్నాపోలిస్‌లోని ‘క్యాపిటల్ గెజిట్’ పత్రికా కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం(భారత కాలమానం శుక్రవారం అర్ధరాత్రి) జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. దుండగుడు జరోద్ వారెన్ రామోస్(38)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్యాపిటల్ గెజిట్ పత్రికకు వ్యతిరేకంగా 2012లో పరువునష్టం దావా వేసిన రామోస్ ఆ కేసులో ఓడిపోవడంతో కక్ష పెంచుకుని ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అంత ఘోరం జరిగినా.. క్యాపిటల్ గెజిట్ సిబ్బంది బాధను దిగమింగుకుని తర్వాతి రోజు పత్రికను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కాల్పుల్లో మరణించిన సహచర సిబ్బందికి నివాళులర్పించారు. ముందస్తు లక్ష్యంతోనే దాడి ‘ముందస్తు లక్ష్యంతోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులు జరిపేందుకు అన్నీ సిద్ధం చేసుకుని పత్రికా కార్యాలయానికి వచ్చాడు’ అని స్థానిక కౌంటీ డిప్యూటీ పోలీసు చీఫ్ విలియం క్రాంఫ్ తెలిపారు. కాల్పుల్లో పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ రాబ్ హియాసెన్, ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్ గెరాల్డ్ పిస్క్మేన్, ఎడిటర్ అండ్ రిపోర్టర్ జాన్ మెక్నమార, స్పెషల్ పబ్లికేషన్స్ ఎడిటర్ వెండీ వింటర్స్, సేల్స్ అసిస్టెంట్ రెబెక్కా స్మిత్‌లు మరణించారని ఆయన వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం.. 2011లో పత్రికలో వచ్చిన ఒక వార్త తనను అపఖ్యాతి పాలు చేసేలా ఉందని రామోస్ పరువునష్టం కేసు వేశాడు. ఆ కేసులో అతను ఓడిపోయాడు. సోషల్ మీడియాలో ఒక మహిళను వేధించిన కేసులో రామోస్ నేరాంగీకార వివరాలు పత్రికలో ప్రచురితమయ్యాయి. విచారణకు సహకరించని నిందితుడు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు బల్ల కింద దాక్కున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే రామోస్‌ను అదుపులోకి తీసుకున్నామని... విచారణకు అతను సహకరించడం లేదని వారు వెల్లడించారు. తన గుర్తింపును కనుగొనకుండా రామోస్ చేతివేళ్లకు గాయం చేసుకున్నాడని.. అయితే అతని ముఖాకృతి ఆధారంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాల్ని పోలీసులు సేకరించారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గెజిట్ పత్రిక విలేకరి ట్వీట్ చేస్తూ.. ‘దుండగుడు న్యూస్‌రూం గాజు తలుపుపై గుళ్ల వర్షం కురిపించి పలువురు ఉద్యోగులపై కాల్పులకు పాల్పడ్డాడు’ అని ఘోరాన్ని గుర్తుచేశారు. ట్రంప్ సంతాపం ఈ సంఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ మాట్లాడుతూ.. సామూహిక కాల్పులు, రోజువారీ తుపాకీ హింస అనేక మంది ప్రాణాల్ని బలి తీసుకుంటుందని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అమెరికన్ కాంగ్రెస్ తక్షణం చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. తుపాకీ హింసపై కాంగ్రెస్ స్పందించాలని భారతీయ సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా డిమాండ్ చేశారు. -
అమెరికాలోని మేరీలాండ్‌లో కాల్పుల కలకలం