కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? | Owner Burns Down House Fighting Snake Infestation In Montgomery County | Sakshi
Sakshi News home page

కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?

Published Sun, Dec 5 2021 3:33 PM | Last Updated on Sun, Dec 5 2021 4:31 PM

Owner Burns Down House Fighting Snake Infestation In Montgomery County - Sakshi

A house worth crores of rupees was gutted In USA Know How: ఇంట్లోకి పాములొస్తే సాధాకణంగా ఎవరైనా ఏం చేస్తారు? పాములను పట్టేవాళ్లను పిలవడమో.. ధైర్యముంటే కర్ర సహాయంతో పామును పట్టుకుని ఆరుబయట వదిలెయ్యడమో చేస్తాం! ఐతే ఓ వ్యక్తి పాము నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఇంటికి నిప్పంటించాడు. అసలేంజరిగిందంటే..

అమెరికాలోని మోంట్‌గోమేరీ కౌంటీలో కోట్ల విలువచేసే ఇల్లును తగులబెట్టాడు. నిజానికి ఇంటి యజమాని ఐడియా ఏంటంటే.. పొగ పెట్టడం ద్వారా పామును బయటికి పంపొచ్చని బొగ్గులను మండించాడు. ఈ మంటలు ఇంట్లోని వస్తువులకు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చిన కాసేపటికే ఇళ్లు మొత్తం పూర్తిగా కాలిపోయిందని పోలీసధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక సిబ్బంది సోషల్‌ మీడియాలో షేర్‌చేశారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఐతే ఈ అగ్నిప్రమాదంలో సుమారు పది లక్షలపైనే ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది.

చదవండి: ఆ మూడే ఒమిక్రాన్‌ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement