burn fire
-
ప్రియుడిపై అనుమానం.. ఫుల్‌గా తాగి ఇంటినే తగలెట్టేసింది
బ్యాంకాక్: ఓ బంధమైనా నమ్మకం, విధేయత ఉంటే కలకలం కొనసాగుతుంది. చిన్న అనుమానమనే నిప్పు రవ్వ పడితే క్షణాల్లో మాడిపోతుంది. ఓ మహిళ తన ప్రియుడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. మరో ఆలోచన లేకుండా బాయ్‌ఫ్రెండ్ గదినే తగలెట్టేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో వెలుగుచూసింది. పట్టాయా ప్రాంతానికి చెందిన డొన్లాయా నాలీ అనే మహిళ.. తన బాయ్‌ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని అనుమానం పెంచుకుంది. అదే ఆలోచనతో రగిలిపోయింది. అది నిజమేనా, కాదా? అనే ఆలోచన కూడా చేయలేదు. ఫూటుగా మద్యం తాగి మత్తులో తన ప్రియుడి ఇంటికి వెళ్లి అతడు ఉండే గదికి నిప్పంటించింది. ఈ సంఘటన నవంబర్ 26న జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గది మొత్తం కాలిపోయింది. ఇతర రూముల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాట్లాడిన బాధితుడు ‘మరో మహిళతో సంబంధం ఉందనే కోపంతోనే ఇలా చేసింది. నిప్పంటించే ముందే నాపై దాడి చేసింది.’ అని తెలిపాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? అనేది తెలపలేదు. ఇదీ చదవండి: శత్రు డ్రోన్లకు చెక్ పెట్టేలా గద్దలకు శిక్షణ.. కంటపడితే అంతే..! -
భార్యపై కోపంతో.. ఎనిమిదేళ్ల కుమారుడికి నిప్పుపెట్టిన తండ్రి!
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. మనసులు కలిసి, మనుషులు ముడిపడే వరకు ఎంతకైనా తెగిస్తుంది. తల్లిదండ్రులను ఎదురిస్తుంది.. బంధుత్వాలను దూరం చేస్తుంది.. కల సాకారం చేసుకున్నా, ప్రేమను గెలిపించుకున్నా.. కొన్ని జీవితాలే కలకాలం నిలుస్తున్నాయి. ఇంకొన్ని రోజులు గడిచేకొద్దీ బలహీనపడి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. ఈ కోవలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య పెరిగి పెద్దదైన అనుమానం వారి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన కన్న కొడుకునే మంటల్లోకి నెట్టడం ప్రేమ‘కులం’లో కలంకం. భార్యపై కోపం కొడుకుకు శాపమైంది. ఈ రోజు చంపేస్తానని ఉదయం నుంచీ తిట్టిపోశాడు. పోలీసుల భయంతో పినాయిల్ తాపించాడు.. తాగిన మైకంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఒళ్లంతా కాలిన గాయాలు.. ఒకటే మంట.. ప్రాణం నిలుస్తుందో లేదో తెలియదు.. ఇప్పుడు కూడా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికంటే ఆ చిన్నారి మనసు నాన్ననే కోరుకుంటోంది.. చంపేందుకు యత్నించినా ఆ పసి హృదయం నాన్నను చూడాలి, ఎక్కడని రోదిస్తున్న తీరు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. అతను డిగ్రీ పూర్తి చేస్తే.. ఆమె ఇంటర్ చదివింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. సామాజిక వర్గం ఒకటే కావడం.. పైగా బంధువులు, ఇరువైపులా ఎలాంటి పట్టింపులు లేకపోవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కోరుకున్న జీవితం సాకారం కావడంతో ఆ ఇద్దరికీ మరో ఇద్దరు పిల్లలు.. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుమానం పెనుభూతమైంది.. తాగుడు తోడై ఆ కుటుంబంలో చిచ్చు రగిల్చింది.. ఏకంగా కన్న కొడుకునే బలితీసుకునే వరకు వెళ్లింది.. ఈ హృదయ విదారక ఘటనకు బట్టికండ్రిగ( నారాయణపురం) పంచాయతీ ఆదిఆంధ్ర వాడ మౌన సాక్ష్యంగా నిలిచింది. వడమాలపేట: బట్టికండ్రిగ(నారాయణపురం) పంచాయతీ, ఆదిఆంధ్ర వాడకు చెందిన చెంగల్రాయుడు, లక్ష్మమ్మ కుమారుడు రమేష్ పుత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన బుల్లయ్య, రమణమ్మ కుమార్తె ఐశ్వర్య తిరుపతిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఒకే సామాజిక వర్గం, పైగా బంధుత్వం ఉండడంతో.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ జంటకు భవనశ్రీ(9), మహేష్(7) సంతానం. పాప నాలుగో తరగతి చదువుతుండగా, బాబు రెండో తరగతి. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో రమేష్ కళ్లను అనుమాన భూతం కమ్మేయగా.. తాగుడుకు బానిసయ్యాడు. ఐశ్వర్యను మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. ఒకానొక సమయంలో ఆమె ఈ బాధలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు సర్దిచెప్పి పంపడం.. ఆ తర్వాత పలుమార్లు వేధింపులతో ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. భార్య కనిపించకపోవడంతో.. వారం రోజుల క్రితం రమేష్, ఐశ్వర్యల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆమె చేయి విరిగింది. నొప్పికి తాళలేక విషయాన్ని అదే ప్రాంతంలోని తల్లి ఇంటికి వెళ్లి చెప్పుకుంది. ఆమె కూతురిని ఓదార్చి పుత్తూరు సమీపంలోని ఈశలాపురంలో కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్లింది. ఎంతైనా భర్త, పిల్లల మీద ప్రేమ.. ఆదివారం తిరిగి మెట్టింటికి చేరుకుంది. అయితే సోమవారం ఉదయాన్నే రమేష్ ఫూటుగా మద్యం సేవించి ఇంకా వంట చేయలేదని చేయి చేసుకున్నాడు. తన చేయి విరిగిందని, నిదానంగా చేసి పెడతానని బతిమాలినా మద్యం మత్తు చెలరేగింది. విధిలేని పరిస్థితుల్లో కుమార్తెను తీసుకొని తిరిగి పుట్టింటికి వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదుతో.. తన కుమార్తెను అల్లుడు తరచూ చితకబాదడాన్ని తట్టుకోలేకపోయిన ఐశ్వర్య తల్లి జరిగిన విషయాన్ని వడమాలపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు రమేష్‌కు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారు. ఉదయం భార్య వెళ్లినప్పటి నుంచి ఈ రోజు నిన్ను చంపుతానని కొడుకుపై ప్రతాపం చూపించిన రమేష్.. ఇదే సమయంలో పోలీసుల నుంచి ఫోన్ రావడంతో తన కుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడని అప్పటికప్పుడు పినాయిల్ తాపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి పుత్తూరుకు చేరుకున్నాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇద్దరూ ఇంటికొచ్చారు. అప్పటికీ భార్య కనిపించకపోవడంతో స్కూటర్‌పై పిల్లాడితో కలిసి పెట్రోల్ బంకులో ఓ బాటిల్ పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి సమీపంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కుమారునిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. సమీప బంధువు నాగరాజు తేరుకొని తన లుంగీతో మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు తోడై మంటలను అదుపుచేసి 108లో బాలుడిని తిరుపతి రుయాకు తరలించారు. ప్రాణాప్రాయ స్థితిలో నాన్న కోసం.. భుజాలపై మోస్తూ.. బండిపై తిప్పుతూ.. అడిగిందల్లా కొనిస్తూ.. కోరిందల్లా తినిపిస్తూ ఎంతో ప్రేమ చూపించిన నాన్న, ఆ రోజు ఎందుకలా చేశాడో ఆ పసి హృదయానికి ఇప్పటికీ అర్థం కాలేదు. పినాయిల్ తాపించినా తాగేశాడు.. పెట్రోల్ పోసినా ఎందుకని అడగలేదు.. చివరకు నిప్పు పెట్టినా బెదరలేదు.. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఇప్పటి కీ నాన్ననే కలవరిస్తున్నాడు. నాన్న కావాలి, ఎక్కడ ని రోదిస్తున్న తీరుతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. మెరుగైన చికిత్సకు మంత్రి రోజా ఆదేశం ఈ హృదయ విదారక ఘటనతో మంత్రి రోజా చలించిపోయారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై రుయా వైద్యలతో ఆరా తీశారు. శరీరం బాగా కాలిపోయిందని, కొద్ది రోజులు గడిస్తే కాని ఏమీ చెప్పలేమనడంతో మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మండల తహసీల్దార్ రోశయ్య కూడా బాధిత కుటుంబాన్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన విషయమై ఎస్ఐ రామాంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కేవలం భార్యపై అనుమానంతోనే ఇలా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?
A house worth crores of rupees was gutted In USA Know How: ఇంట్లోకి పాములొస్తే సాధాకణంగా ఎవరైనా ఏం చేస్తారు? పాములను పట్టేవాళ్లను పిలవడమో.. ధైర్యముంటే కర్ర సహాయంతో పామును పట్టుకుని ఆరుబయట వదిలెయ్యడమో చేస్తాం! ఐతే ఓ వ్యక్తి పాము నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఇంటికి నిప్పంటించాడు. అసలేంజరిగిందంటే.. అమెరికాలోని మోంట్గోమేరీ కౌంటీలో కోట్ల విలువచేసే ఇల్లును తగులబెట్టాడు. నిజానికి ఇంటి యజమాని ఐడియా ఏంటంటే.. పొగ పెట్టడం ద్వారా పామును బయటికి పంపొచ్చని బొగ్గులను మండించాడు. ఈ మంటలు ఇంట్లోని వస్తువులకు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చిన కాసేపటికే ఇళ్లు మొత్తం పూర్తిగా కాలిపోయిందని పోలీసధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో షేర్చేశారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఐతే ఈ అగ్నిప్రమాదంలో సుమారు పది లక్షలపైనే ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ICYMI (Tuesday 11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) NOTE: non-hydrant area, driveway 3/4 mi long off Big Woods Rd pic.twitter.com/hJ4i4Bz8nL — Pete Piringer (@mcfrsPIO) November 26, 2021 Update (11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs Media Hotline Update 240.777.2442 - no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) https://t.co/6PwIkbRAkf pic.twitter.com/jWlB1HPdKt — Pete Piringer (@mcfrsPIO) November 24, 2021 -
కరీంనగర్లో దారుణం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిరిసేటి సంతోష్(39) అనే వ్యక్తిని.. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దహనం చేశారు. కాగా, అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విలాసాగర్ - పాలయ్యపల్లి గ్రామల మధ్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా నిప్పంటించిన స్థలాన్ని కరీంనగర్ సీపీ సత్యనారాయణ పరిశీలించారు. కాగా, మృతుని భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరు టెక్నికల్ బృందాలను ఏర్పాటుచేశామని పోలీసులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా క్రూరంగా చంపడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి విచారణ చేపట్టామని తెలిపారు. 24 గంటలలో హత్యకు కారకులైన నిందితులను అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. కాగా, మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ఫోరెన్సిక్ బృందాలను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీపీ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: తల్లి ఆత్మహత్యాయత్నం.. బైకుపై బయలుదేరిన కుమారుడు.. అంతలోనే -
తిరుమలలో మళ్లీ మంటలు
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లో శుక్రవారం మళ్లీ మంటలు చెలరేగాయి. తొలుత జాపాలీ తీర్థంలో రోడ్డుమార్గంలోని అటవీ ప్రాంతంలో మంట లు వ్యాపించాయి. పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వరకు విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఇక్కడ సుమారు ఐదెకరాల అడవి కాలిపోయింది. మరోవైపు ఆలయానికి కిలోమీటరు దూరంలోని బాలాజీనగర్ గ్యాస్‌గోడౌన్‌కు సమీపంలోని అడవిలోనూ మంటలు చెలరేగాయి. ఇక్కడ సుమారు ఎకరం మేరకు అడవి కాలిబూడిదైంది. కాగా, శ్రీవారి ఆలయ ఉత్తరమాడ వీధిలో హయగ్రీవ మందిరం పోటుశాలలో గ్యాస్‌లీకై మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.