కరీంనగర్‌లో దారుణం.. వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి | Petrol Attack On Man In Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో దారుణం.. వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి

Published Mon, Sep 13 2021 9:35 AM | Last Updated on Mon, Sep 13 2021 1:15 PM

Petrol Attack On Man In Karimnagar - Sakshi

కరీంనగర్: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిరిసేటి సంతోష్‌(39) అనే వ్యక్తిని.. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి దహనం చేశారు. కాగా, అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విలాసాగర్‌ - పాలయ్యపల్లి గ్రామల మధ్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా నిప్పంటించిన స్థలాన్ని కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ  పరిశీలించారు. కాగా, మృతుని భార్య ఫిర్యాదు మేరకు హత్య​ కేసుగా నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరు టెక్నికల్‌ బృందాలను ఏర్పాటుచేశామని పోలీసులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా క్రూరంగా చంపడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి విచారణ చేపట్టామని తెలిపారు. 24 గంటలలో హత్యకు కారకులైన నిందితులను అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. కాగా, మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ఫోరెన్సిక్‌ బృందాలను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీపీ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: తల్లి ఆత్మహత్యాయత్నం.. బైకుపై బయలుదేరిన కుమారుడు.. అంతలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement