
ఇది ప్రపంచంలోనే కారుచౌక ధరకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. అలాగని ఇదేదో మారుమూల నిరుపేద దేశంలోనిది కాదు. అగ్రరాజ్యమైన అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలోని పాంటియాక్‌లో ఉందిది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసుకుంటే, మరీ ఇంత చౌకా అని నోరెళ్లబెడతారు. దీని ధర కేవలం ఒక్క డాలరు మాత్రమే! అంటే, రూ.82.74 అన్నమాట. క్రిస్టఫర్ హ్యూబెల్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ ఇంటిని ఒక డాలరు కనీస ధరకు అమ్మనున్నట్లు ప్రకటన విడుదల చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
ప్రకటన వెలువడిన తర్వాత చాలామంది ఈ ఇంటిని కొనుక్కోవడానికి ముందుకొస్తున్నారని హ్యూవెల్ తెలిపాడు. ఈ ఇంటిని 1956లో నిర్మించారు. ఇరవై ఏళ్ల కిందట ప్రస్తుత యజమాని ఈ ఇంటిని 10వేల డాలర్లకు (రూ.8.27 లక్షలు) కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుల పోటీ వల్ల ప్రస్తుతం ఈ ఇంటికి 40 వేల నుంచి 50 వేల డాలర్ల (రూ.33.09 లక్షల నుంచి రూ.41.36 లక్షల) వరకు ధర పలకవచ్చని హ్యూవెల్ అంచనా.
(చదవండి: తోకతో రికార్డు కొట్టేసింది...)
Comments
Please login to add a commentAdd a comment