ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు గురించి విని ఉంటారు. అలాగే అత్యంత వ్యాపార దిగ్గజాలుగా పేరుగాంచిన వారి గురించి కూడా విని ఉంటారు. కానీ ఇదేంటి అత్యంత ధనిక ఖైదీ. ఖైదీల్లో ధనికులు ఉంటారా..! అని విస్తుపోకండి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే తప్పక ఔనని అంటారు. అతడెవరంటే..
క్రిప్టోకరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోకి యూఎస్ కోర్టు గత మంగళవారమే నాలుగు నెలల శిక్ష విధించింది. దీంతో జావో ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఖైదీగా నిలిచినట్లు యూఎస్ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఆయన గతేడాది యూఎస్ మనీలాండరింగ్‌కి సంబంధించిన నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘింట్లు అంగీకరించడంతో సీటెల్ కోర్టు జావోకు ఈ శిక్షను విధించింది. నిజానికి జావోకు ఈ నేరంలో మూడేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు నుంచి ఒత్తిడిచ్చినా..జడ్డి అతడి అతని దాతృత్వ రికార్డు, ప్రవర్తనను పరిణలోకి తీసుకుని నాలుగు నెలల జైలు శిక్షను మాత్రమే విధించారు.
నాలుగు నెలల జైలు శిక్షఅనుభవిస్తున్న జావో తన బినాన్స్ సంస్థ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల సంపదను కలిగి ఉన్నాడు. దీంతో అతడు అత్యంత సంపన్న ఖైదీలలో ఒకరిగా నిలిచాడు. 47 ఏళ్ల జావో యూఎస్ అధికారిక ఒప్పందంలో భాగంగా గతేడాది బినాన్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ బినాన్స్‌లో ఆయన 90% వాటాను కలిగి ఉండటం విశేషం. పైగా మనీలాండరింగ్ ఆరోపణల పరిష్కారంలో భాగంగా ఫిబ్రవరిలో రూ. 35 వేల కోట్లు చెల్లించడానికి బినాన్స్ సంస్థ అంగీకరించింది.
కాగా,2017లో ఈ బినాన్స్ సంస్థ ఏర్పాటయ్యింది. ఇది చాంగ్‌పెంగ్ జావోను ఒక్కసారిగా బిలియనీర్‌గా మార్చేసింది. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ఛేంజీలను నడుపుతూ.. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోయిందో అప్పటి నుంచి చట్టబద్దతను ఉల్లంఘించి..నష్టాల బాట పట్టింది. చెప్పాలంటే కుప్పకూలిని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ చేసి బిలయన్ డాలర్ల మోసానికి గానూ 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన వారాల తర్వాత జావో నేరం వెలుగులోకి వచ్చింది. జావో అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ ఫండ్‌లలో బిలియన్ డాలర్లను స్వాహ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది.
(మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల మహిళ..!)
Comments
Please login to add a commentAdd a comment