prisioner
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు గురించి విని ఉంటారు. అలాగే అత్యంత వ్యాపార దిగ్గజాలుగా పేరుగాంచిన వారి గురించి కూడా విని ఉంటారు. కానీ ఇదేంటి అత్యంత ధనిక ఖైదీ. ఖైదీల్లో ధనికులు ఉంటారా..! అని విస్తుపోకండి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే తప్పక ఔనని అంటారు. అతడెవరంటే..క్రిప్టోకరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోకి యూఎస్ కోర్టు గత మంగళవారమే నాలుగు నెలల శిక్ష విధించింది. దీంతో జావో ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఖైదీగా నిలిచినట్లు యూఎస్ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఆయన గతేడాది యూఎస్ మనీలాండరింగ్‌కి సంబంధించిన నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘింట్లు అంగీకరించడంతో సీటెల్ కోర్టు జావోకు ఈ శిక్షను విధించింది. నిజానికి జావోకు ఈ నేరంలో మూడేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు నుంచి ఒత్తిడిచ్చినా..జడ్డి అతడి అతని దాతృత్వ రికార్డు, ప్రవర్తనను పరిణలోకి తీసుకుని నాలుగు నెలల జైలు శిక్షను మాత్రమే విధించారు. నాలుగు నెలల జైలు శిక్షఅనుభవిస్తున్న జావో తన బినాన్స్ సంస్థ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల సంపదను కలిగి ఉన్నాడు. దీంతో అతడు అత్యంత సంపన్న ఖైదీలలో ఒకరిగా నిలిచాడు. 47 ఏళ్ల జావో యూఎస్ అధికారిక ఒప్పందంలో భాగంగా గతేడాది బినాన్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ బినాన్స్‌లో ఆయన 90% వాటాను కలిగి ఉండటం విశేషం. పైగా మనీలాండరింగ్ ఆరోపణల పరిష్కారంలో భాగంగా ఫిబ్రవరిలో రూ. 35 వేల కోట్లు చెల్లించడానికి బినాన్స్ సంస్థ అంగీకరించింది.కాగా,2017లో ఈ బినాన్స్ సంస్థ ఏర్పాటయ్యింది. ఇది చాంగ్‌పెంగ్ జావోను ఒక్కసారిగా బిలియనీర్‌గా మార్చేసింది. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ఛేంజీలను నడుపుతూ.. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోయిందో అప్పటి నుంచి చట్టబద్దతను ఉల్లంఘించి..నష్టాల బాట పట్టింది. చెప్పాలంటే కుప్పకూలిని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ చేసి బిలయన్ డాలర్ల మోసానికి గానూ 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన వారాల తర్వాత జావో నేరం వెలుగులోకి వచ్చింది. జావో అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ ఫండ్లలో బిలియన్ డాలర్లను స్వాహ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. (మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల మహిళ..!) -
జైలులో ఖైదీ బర్త్‌డే పార్టీ.. విచారణకు ఆదేశాలు!
పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్‌లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్‌గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇన్స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
ఖైదీని చూడడానికి వెళ్లిన లాయర్ అరెస్టు.. అసలు ట్విస్ట్ ఏంటంటే!
తిరువొత్తియూరు(చైన్నె): చైన్నె పుళల్‌జైలులో ఖైదీని చూడడానికి వెళ్లిన నకిలీ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సెంట్రల్ పుళల్‌లో సుమారు 3 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిని న్యాయవాదులు తరచూ వచ్చి సంప్రదించి వెళుతుంటారు. శుక్రవారం సాయంత్రం రామాపురం పెరియార్ రోడ్డుకు చెందిన సతీష్ కుమార్ (38) అనే వ్యక్తి ఖైదీని చూడడానికి వచ్చాడు. ఆ సమయంలో నడవడికలపై జైలర్‌కు అనుమానం రావడంతో గుర్తింపు కార్డు చూపించమని కోరాడు. అది నకిలీదని, అతను న్యాయవాది కాదని తెలిసింది. అతనిపై జైలు అధికారులు పుళల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతన్ని పుళల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పుళల్ పోలీసు ఇన్స్పెక్టర్ షణ్ముగం సంబంధిత వ్యక్తిని విచారిస్తున్నారు. అతను 2013లో తిరువేర్కాడులో జరిగిన హత్య కేసుకు సంబంధం ఉన్న వ్యక్తి అని తెలిసింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, అతని వద్ద ఉన్న నకిలీ న్యాయవాది ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాది పేరుతో ఇంకా ఎక్కడెక్కడ మోసం చేశాడన్న దానిపై విచారిస్తున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. -
98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు
జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఘనంగా వీడ్కోలు పలకడం చాలా అరుదు. ఒకవేళ మంచి సత్ప్రవర్తన కారణంగానో లేక ఏదైన మంచి పనులు చేసినట్లయితే గనుక వారిని మంచిగా సన్మానించి విడుదల చేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఒక ఖైదీకి జైలు సూపరింటెండెంటే ఏకంగా స్వయంగా కారు వద్దకు తీసుకువెళ్లి ఘనంగా పంపిచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..98 ఏళ్ల రామ్ సూరత్ అనే వృద్ధ ఖైదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు ఐపీసీ సెక్షన్ 452, 323, 352 కింద దోషిగా నిర్థారించి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు జైలు శిక్ష అనంతర విడుదలైన రామ్ సూరత్‌ని తీసుకుని వెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. దీంతో జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా పుత్రావత్ ఘనంగా వీడ్కోలు పలుకుతూ..స్వయంగా ఆయనే ఆ వృద్ధ ఖైదీ వెంట వచ్చి కారు ఇచ్చి మరీ అతని ఇంటికి పంపించారు. వాస్తవాని సూరత్ ఆగస్టు8న విడుదల కావాల్సి ఉంది. కానీ మే 20, 2022న కోవిడ్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో 90 రోజులపాటు పెరోల్‌పై ఉన్నారు. అందుకు సంబంధించిన ఘటనను ఉత్తరప్రదేశ్ డీజీ ప్రిజన్స్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు 98 ఏళ్ల వృద్ధుడిని జైలులో ఉంచడం మానవత్వం అని ఫైర్ అవుతుండగా, మరికొందరూ మాటలు రావడం లేదు ఎంత ఘనంగా పంపిచారంటూ జైలు సిబ్బందిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB — DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023 (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య) -
పరీక్షలు రాయాలి.. బెయిల్ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య
యశవంతపుర(బెంగళూరు): బెయిల్ మంజూరైన విషయం తెలియక గదగ సబ్ జైల్లో ఒక విచారణ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదగ్ తాలూకా అడవి సోమాపుర తండా నివాసి రాజు లమాణి(19) ద్వితీయ పీయూసీ చదివేవాడు. అదే కాలేజీలో ప్రథమ పీయూసీ చదివే విద్యార్థినిని ప్రేమించాడు. ఇటీవల ఇద్దరూ బెంగళూరు, గోవా వెళ్లారు. అమ్మాయి కనిపించలేదని తల్లిదండ్రులు గదగ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజు లమాణిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి గదగ సబ్ జైల్‌కు తరలించారు. పరీక్షలు రాయటానికి బెయిల్ వస్తుందని ఎదురు చూశాడు. గురువారం సాయంత్రం బెయిల్ దొరికింది. ఈ విషయాన్ని న్యాయవాది జైలు అధికారులకు చెప్పేందుకుఫోన్ చేశారు. అయితే అక్కడ ఎవరూ ఫోన్ ఎత్తలేదు. బెయిల్ మంజూరు విషయం తెలియక రాజు లమాణి మనో వేదనతో శుక్రవారం తెల్లవారుజామున కిటికీకి టవల్‌తో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: వివాహేతర సంబంధం..భార్య, అత్త, ప్రియుడు, మరో మిత్రుడితో కలిసి.. -
నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..
Man Mistakenly Released From Jail In Just Two Days: కొన్ని అనూహ్యమైన పెద్ద పెద్ద కేసుల్లో కొంత మంది నిందుతులకు కోర్టు పెద్ద శిక్షలనే విధిస్తుంది. ఐతే కొంతమంది తమ పలుకుబడి ఉపయోగించో లేక కొంతమంది అధికారుల అండదండతోనో భలే సులభంగా విడుదలైపోతుండటం చూసి ఉంటాం. కానీ ఇక్కడో నిందుతుడికి నాలుగేళ్లు జైలు శిక్షపడితే ఎలాంటి పలుకుబడి లేకుండానే రెండు రోజుల్లో విడుదలైపోయాడు. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) అసలు విషయంలోకెళ్లితే... లారాస్ మాటియుసోవాస్ అనే వ్యక్తికి ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసిన నేరానికి గానూ నార్త్ లండన్‌లోని వుడ్ గ్రీన్ క్రౌన్ కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఏమైందో ఏమో! తెలియదు గానీ అనుహ్యంగా కేవలం 48 గంటల్లో జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో లారాస్ సంతోషంతో తాను విడుదలైపోయానంటూ... తన స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చాడు. అంతేకాదు అత్యుత్సహాంతా ఆ పార్టీ చేసుకున్న ఫోటోలతో పాటు తాను జైలు నుంచి విడుదలైపోయానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో లారాస్ స్నేహితుల్లోని ఒకరు ఎవరైన ఇలాంటి నేరాల్లో అంత సులభంగా విడుదలవుతారా! ఇది కోర్టులో జరుగుతున్న కుంభకోణం లేక ఏదైన లోపమా అని ఆన్లైన్ వేదికగా కోర్టు వైఖరిని ప్రశ్నించాడు. దీంతో వెంటనే అధికారులు లారాస్ ఏవిధంగా విడుదలయ్యాడంటూ విచారించారు. దీంతో ఇది కోర్టు రాత పనుల్లో తలెత్తిన లోపంగా గుర్తించారు. వెంటనే అధికారులు లారాస్ని అదుపులోకి తీసుకుని చేశారు. అయితే లారాస్ జైలు శిక్ష నుంచి తప్పించుక్నునాను అని అలా ఆనందపడ్డాడో లేదో మళ్లీ జైలు పాలయ్యాడు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
తీహార్ జైల్లో గ్యాంగ్‌స్టర్ ప్రాణం తీసిన చెంపదెబ్బలు
సాక్షి, న్యూఢిల్లీ: తీహార్ జైల్లో అధికారులు గ్యాంగ్‌స్టర్ అంకిత్ గుజ్జర్‌ను కొట్టి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నరేందర్ మీనా, ఇద్దరు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఓ వార్డెన్‌ను డైరెక్టర్ జనరల్ (ఢిల్లీ జైళ్లు) సందీప్ గోయల్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అంకిత్ గుజ్జర్(29) ఉత్తర ప్రదేశ్ బాగ్‌పత్‌లోని ఖేలా గ్రామానికి చెందినవాడు. అతడిపై హత్య, దోపిడీతో సహా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. చదవండి: లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం ఏం జరిగింది? తీహార్ జైలు సూపరింటెండెంట్ నరేందర్ మీనాతో అంకిత్ గుజ్జర్ గొడవ పడినట్లు సమాచారం. దీంతో అతడిని జైలులో వేరే గదికి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు చెంపదెబ్బ కొట్టుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. దీంతో నరేందర్ మీనా, ఇతర జైలు అధికారులు కలిసి అంకిత్ గుజ్జర్, ఇద్దరు సహచర ఖైదీలను 50 కర్రలతో కొట్టారు. అంకిత్ గుజ్జర్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతడిని డీడీయూ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ జైలు సూపరింటెండెంట్ అతడిని అక్కడికి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. అంకిత్ గుజ్జర్‌కి పెయిన్ కిల్లర్ ఇవ్వడంతో.. అతడు మరణించినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. కానీ అతని శరీరం మీద తీవ్రమైన గాయాలు ఉన్నట్లు శవపరీక్షలో తేలింది. ఇక నిందితుడు ముందుగానే సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: మహిళపై అత్యాచారం.. భర్తను వదిలిపెట్టాలని ఒత్తిడి -
పెరోల్‌పై వెళ్లిన ఖైదీ అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఫార్లో పెరోల్‌పై వెళ్లి తిరిగి రాని జీవిత ఖైదీ ఒకరిపై జైలు అధికారులు పోలీసు కేసు నమోదు చేశారు. శోభన్‌బాబు అనే జీవిత ఖైదీ 18 రోజుల క్రితం పెరోల్‌పై విడుదలయ్యాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో చర్లపల్లి జైలు అధికారులు అతనిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ హత్య కేసులో పన్నెండేళ్లుగా చర్లపల్లి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. క్షమాభిక్ష లభించదని మనస్తాపానికి గురై అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఇతను నార్త్ లాలగూడకు చెందినవాడు. -
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన కుమ్మరి సత్యం అలియాస్ చిన్న సత్యంకు ఓ హత్య కేసులో పూనె కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఈ క్రమంలో అతను బాత్రూంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. గత నెల 29న కూడా ఇతనికి ఇక్కడ చికిత్స చేయించారు. కాగా, గత ఏడాది మార్చి 9న మహారాష్ట్ర కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. -
జీవితఖైదీతో మహిళా కానిస్టేబుల్ లవ్
సాక్షి, బెంగళూరు : కొంతకాలంగా సంచలనాలకు వేదికవుతున్న బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీ కానిస్టేబుల్ మధ్య ప్రేమ పురాణం చర్చనీయాంశమైంది. మహిళ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శివకుమార్... ఒక మహిళా కానిస్టేబుల్ ప్రేమలో పడడం, వారిద్దరూ నగరంలో షికార్లు కొట్టిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శివకుమార్ బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. 2005లో కాల్ సెంటర్ ఉద్యోగిని ప్రతిభను హత్య చేశాడు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. జైల్లోనే పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం పెరిగి ప్రేమ వరకు వచ్చినట్లు తెలిసింది. అనారోగ్యం పేరుతో శివకుమార్ పెరోల్ పొంది మహిళా కానిస్టేబుల్‌తో బెంగళూరులోని పెద్ద పెద్ద హోటళ్లు, మాల్‌లలో తిరుగుతూ తీసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై పరప్పన అగ్రహార జైలు అధికారులు నోరు మెదపడం లేదు. -
అనారోగ్యంతో రిమాండ్ ఖైదీ మృతి
కాకినాడ క్రైం:నల్లమందు అక్రమ రవాణా కేసులో పోలీసులకు పట్టుబడి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాంyŠ లో ఉన్న ఖైదీ అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. విశాఖజిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కిన్నెర్లకాలనీకి చెందిన వనగల శ్రీను (27) ఆరు నెలల క్రితం నల్లమందు అక్రమ రవాణా కేసులో రాజమండ్రిలో బొమ్మూరు పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయగా, కోర్టు రిమాండ్ విధించింది. ఆరునెలలుగా అతను రాజమండ్రి సెంట్రల్ జెల్లో ఉంటున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని శ్రీను చెప్పగా జైలు సిబ్బంది ఎస్కార్ట్‌తో తొలుత రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఇదే విషయాన్ని శ్రీను భార్య వెంకటలక్షి్మకి బుధవారం ఉదయం తెలిపారు. ఆ వెంటనే సుమారు 16 మంది బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు చేరుకున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన జైల్ అధికారులతో వారు వాగ్వాదానికి దిగి మీ నిర్ల్లక్ష్యం వల్లే కారణంగానే శ్రీను చనిపోయాడని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాకినాడ ఒన్‌టౌన్ ఎస్సై ఈ.అప్పన్న ఆర్డీవో అంబేద్కర్ సమక్షంలో గురువారం శవ పంచనామా జరుగుతుందని, అక్కడ చెప్పాలని వారికి సూచించారు. పది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా వైద్యం చేయించలేదు ‘ఈనెల 26వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నా భర్తను కలుసుకున్నాను. పదిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పి, కాళ్లు, చేతులు వాచిపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని జైల్ అధికారులను కోరినా పట్టించుకోవడంలేదని శ్రీను తనతో చెప్పాడు. ఈ విషయమై జైల్ అధికారులకు ఫిర్యాదు చేశాను.’ అని శ్రీను భార్య వెంకటలక్షి్మ వాపోయింది. మృతదేహాన్ని అప్పగిస్తారనుకుంటే ఆర్డీవో అందుబాటులో లేరు, గురువారం దాకా వేచిచూడండంటూ పోలీసులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్త మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి, జైల్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.