Man Mistakenly Released From Jail In Just Two Days: కొన్ని అనూహ్యమైన పెద్ద పెద్ద కేసుల్లో కొంత మంది నిందుతులకు కోర్టు పెద్ద శిక్షలనే విధిస్తుంది. ఐతే కొంతమంది తమ పలుకుబడి ఉపయోగించో లేక కొంతమంది అధికారుల అండదండతోనో భలే సులభంగా విడుదలైపోతుండటం చూసి ఉంటాం. కానీ ఇక్కడో నిందుతుడికి నాలుగేళ్లు జైలు శిక్షపడితే ఎలాంటి పలుకుబడి లేకుండానే రెండు రోజుల్లో విడుదలైపోయాడు.
(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..)
అసలు విషయంలోకెళ్లితే... లారాస్ మాటియుసోవాస్ అనే వ్యక్తికి ఒక వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేసిన నేరానికి గానూ నార్త్ లండన్‌లోని వుడ్ గ్రీన్ క్రౌన్ కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఏమైందో ఏమో! తెలియదు గానీ అనుహ్యంగా కేవలం 48 గంటల్లో జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో లారాస్ సంతోషంతో తాను విడుదలైపోయానంటూ... తన స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చాడు. అంతేకాదు అత్యుత్సహాంతా ఆ పార్టీ చేసుకున్న ఫోటోలతో పాటు తాను జైలు నుంచి విడుదలైపోయానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో లారాస్ స్నేహితుల్లోని ఒకరు ఎవరైన ఇలాంటి నేరాల్లో అంత సులభంగా విడుదలవుతారా! ఇది కోర్టులో జరుగుతున్న కుంభకోణం లేక ఏదైన లోపమా అని ఆన్‌లైన్ వేదికగా కోర్టు వైఖరిని ప్రశ్నించాడు. దీంతో వెంటనే అధికారులు లారాస్ ఏవిధంగా విడుదలయ్యాడంటూ విచారించారు. దీంతో ఇది కోర్టు రాత పనుల్లో తలెత్తిన లోపంగా గుర్తించారు. వెంటనే అధికారులు లారాస్‌ని అదుపులోకి తీసుకుని చేశారు. అయితే లారాస్ జైలు శిక్ష నుంచి తప్పించుక్నునాను అని అలా ఆనందపడ్డాడో లేదో మళ్లీ జైలు పాలయ్యాడు.
(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)
Comments
Please login to add a commentAdd a comment