జైలు అనగానే సినిమాలే గుర్తోస్తాయి. వాటిల్లో చూపించనంత అందంగా ఏమి ఉండవు. కానీ ఇప్పుడూ ఆ జైళ్లనే ఖైదీలలో పరివర్తన వచ్చేలా గొప్ప కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే వారి శిక్షకాలం పూర్తి చేసుకున్న తదుపరి హాయిగా జీవించేలా నైపుణ్యాలు సంపాదించుకునేలా చేసేందుకు శ్రీకారం చుట్టింది బ్రిటన్ ప్రభుత్వం. మరోసారి ఎటువంటి నేరాలకు దిగకుండా ఉండి, వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దకునేలా చేస్తున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అని "హెచ్‌ఎంపీ ఫోస్సే వే" అనే పేరుతో అత్యాధునికి జైలుని నిర్మిస్తున్నారు.
ఇందులో దగ్గర దగ్గరగా దాదాపు వెయ్యిమందికి పైగా అంటే 1,715 మంది దాక ఖైదీలు ఉండేంత స్థలం ఉంటుంది. ఖైదీలకు పునరావసం కల్పించడం తోపాటుగా ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడేందుకు ఈ కొత్త జైలుని ప్రారంభించారు. ఈ కొత్త జైలు నిర్మాణంలో 71 మంది ఖైదీలు, ఇద్దరు మాజీ నేరస్తులు పనిచేయాలనే ఒక నిబంధన కూడా ఉంది. ఇక్కడ మొత్తం 24 వర్కషాప్‌లు ఉంటాయి.
నేరస్తులు ఇక్కడ నిర్మాణ వాహనాలను ఎలా నడపాలి, అద్దాలను ఎలా తయారు చేయాలి, జైలు నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్ విభాగాలు, లైటింగ్ పరికరాలు తదితరాలకు సంబంధించిన పనులు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో ఉన్న ఆరు అత్యాధునికి జైళ్లలో ఇది రెండోది. ఈ జైలుని.. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. అలాగే యూకేలో ఇప్పటి వరకు నిర్మించిన పచ్చటి జైలు కూడా అదే.
బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నాలుగు బిలియన్ పౌండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ అత్యాధునిక జైలుని నిర్మించింది. అలాగే ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తి అయిన వెంటనే ఉపాధిని వెతుక్కోవడం ఈజీ అవ్వడమే గాక సమాజంలో ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా బతకగలగుతారని చెబుతున్నారు బ్రిటన్ అధికారులు.
(చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం)
Comments
Please login to add a commentAdd a comment