British
-
Chandrashekhar Azad: ‘నా పేరు ఆజాద్.. స్వాతంత్ర్యం నా తండ్రి’
చంద్రశేఖర్ ఆజాద్(Chandrashekhar Azad).. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు. 1906, జూలై 23న మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని భాబ్రాలో జన్మించిన ఆయన 1931, ఫిబ్రవరి 27న కన్నుమూశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిపడిన యువకెరటంగా పేరొందిన ఆయన వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని జీవితంలోని ప్రముఖ ఘట్టాలను గుర్తుచేసుకుందాం.చంద్రశేఖర్ చాలా చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్య పోరాటం(freedom fight)లో భాగస్వామ్యం వహించారు. 1922లో చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ తన ఉద్యమాన్ని ఉపసంహరించడంతో ఆజాద్ కాంగ్రెస్ తీరుపై నిరాశచెందారు. దీని తరువాత ఆయన 1924లో పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ సన్యాల్, యోగేష్ చంద్ర ఛటర్జీ ఏర్పాటు చేసిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరారు. దీనిలో చంద్రశేఖర్ తొలుత రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో 1925లో కాకోరి ఘటనలో చురుకుగా పాల్గొన్నారు.చంద్రశేఖర్ 1928లో లాహోర్‌లో బ్రిటిష్ పోలీసు అధికారి ఎస్పీ సాండర్స్‌ను కాల్చి చంపి, లాలా లజపతి రాయ్(Lala Lajpati Roy) మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది విజయవంతం కావడంతో చంద్రశేఖర్ బ్రిటిష్ ఖజానాను దోచుకుని, హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు నిధులు సమకూర్చారు. వీటిని విప్లవాత్మక కార్యకలాపాలకు వినియోగించేవారు. ఈ సంపద భారతీయులదని,దీనిని బ్రిటిష్ వారు దోచుకున్నారని చంద్రశేఖర్ తరచూ అనేవారు.‘ఆజాద్’ పేరు వెనుక..చంద్రశేఖర్‌కు ‘ఆజాద్’ అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆయన 15 ఏళ్ల వయసులో ఏదో ఒక కేసులో న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. అక్కడ, న్యాయమూర్తి అతనిని పేరు అడిగినప్పుడు.. ‘నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు ఇండిపెండెన్స్, నా ఇల్లు జైలు’ అని చెప్పారు. ఈ మాట విన్న న్యాయమూర్తి ఆగ్రహించి, చంద్రశేఖర్‌కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ పేరు ఆజాద్ అయ్యింది. చంద్రశేఖర్ జీవితాంతం స్వేచ్ఛను కోరుకున్నారు.బ్రిటిషర్లతో పోరాడటానికి చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌లో సుఖ్‌దేవ్, అతని ఇతర సహచరులలో కలిసి ఒక పార్కులో కూర్చుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం బ్రిటిష్ పాలకులకు తెలిసింది. దీంతో బ్రిటిష్ పోలీసులు అకస్మాత్తుగా చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఆజాద్ పోలీసుల తూటాలకు తీవ్రంగా గాయపడ్డారు. తాను బ్రిటిషర్లకు ఎప్పటికీ పట్టుబడనని, వారి ప్రభుత్వం తనను ఏనాటికీ ఉరితీయలేనని గతంలో ఆజాద్ పేర్కొన్నారు. అందుకే తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకుని, మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించారు ఆజాద్. ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి -
ఈ రైల్వే స్టేషన్లు.. చరిత్రకు ఆనవాళ్లు
నిజాం కాలంనాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలో కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. దేశంలోని పలు రైల్వే స్టేషన్లను అభివృద్ది చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వే స్టేషన్ల పురాతన కట్టడాలను కూల్చివేసి, నూతన నిర్మాణాలను చేపడుతోంది. భారతీయ రైల్వే ప్రస్తుతం ఏడు వేలకుమించిన రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. వీటి మీదుగా 13 వేలకు మించిన ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. భారతదేశంలో రైల్వే వ్యవస్థ బ్రిటిష్ పాలనలో ప్రారంభమయ్యింది. ఆ సమయంలో పలు స్టేషన్లను నిర్మించారు. వాటిలోని కొని స్టేషన్లు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఆయా రైల్వే స్టేషన్లు ఎక్కడున్నాయనే విషయంలోనికి వెళితే.. హౌరా రైల్వే స్టేషన్ఇది పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో గల ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి మొదటి రైలు 1854 ఆగస్టు 15న నడిచింది. ఇది హౌరా-హుబ్లీ లైన్లో ఉంది. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం 23 ప్లాట్‌ఫారాలున్నాయి. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌గా హౌరా పేరుగాంచింది.రాయపురం రైల్వే స్టేషన్చెన్నై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లోని వాలాజాపేట విభాగంలో ఉన్న రాయపురం రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ పాలకులు నిర్మించారు. దక్షిణ భారతదేశంలో ఇక్కడి నుంచి మొదటి రైలు 1856లో ఇక్కడి నుంచి నడిచింది.పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ఈ రైల్వే స్టేషన్‌ను గతంలో మొఘల్సరాయ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. తరువాత పేరు మార్చారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్. వారణాసికి నాలుగు మైళ్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ 1862లో నిర్మితమయ్యింది.ఛత్రపతి శివాజీ టెర్మినస్ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ భారతదేశంలోని ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. దీని నిర్మాణం 1878లో ప్రారంభమై, 1887లో పూర్తయింది దీనికి తొలుత క్వీన్ విక్టోరియా అనే పేరు పెట్టారు. 1996లో ఛత్రపతి శివాజీగా మార్చారు.డెహ్రాడూన్ రైల్వే స్టేషన్డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ రైల్వే స్టేషన్. దీనిని 1897-1899 మధ్య బ్రిటిష్ వారు నిర్మించారు. ఈ రైల్వే లైన్‌కు 1896లోనే ఆమోదం లభించినా, నిర్మాణ పనులు 1900లో ప్రారంభమయ్యాయి.లక్నో చార్బాగ్ రైల్వే స్టేషన్లక్నోలోని ఐదు రైల్వే స్టేషన్లలో చార్బాగ్ రైల్వే స్టేషన్ ప్రముఖమైనది. దీని నిర్మాణం 1914లో మొదలై, 1923 లో పూర్తయ్యింది. అప్పట్లో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చయింది. స్టేషన్ ముందు భాగంలో ఒక పెద్ద పార్కు ఉంది. ఈ స్టేషన్ రాజ్‌పుత్, అవధి, మొఘల్ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్అజ్మేరీ గేట్ - పహార్గంజ్ మధ్య ఉన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆమోదించింది. 1931లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యింది. ఈ స్టేషన్లో 16 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. వందలాది రైళ్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి.ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
అతి పెద్ద ఐస్‌బర్గ్... మళ్లీ కదిలింది!
ఏ23ఏ. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్‌బర్గ్. తాజా కొలతల ప్రకారం దాని విస్తీర్ణం 3,672 చదరపు కిలోమీటర్లు! చూపు తిప్పుకోనివ్వని ఆర్చిలు, అందమైన గుహలతో పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది 1986లో ఫిల్క్నర్ రోన్ మంచుఫలకం నుంచి విడివడింది. కొన్నాళ్లపాటు కాస్త దూరం కదిలాక అంటార్కిటికాలోని వెడ్డెల్ సముద్ర ఉపరితలంపై సెటిలైపోయింది. 30 ఏళ్లపాటు అక్కడే స్తబ్ధుగా ఉండిపోయింది. అందులోని అందమైన గుహలను, దాని పొడవునా ఏర్పడే రకరకాల ఆకృతుల మంచు ఆర్చిలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పర్యాటకులు పోటెత్తుతుంటారు. అలాంటి ఏ23ఏ 2020లో స్వల్పంగా కరిగిపోవడంతో మళ్లీ కదలడం మొదలు పెట్టింది. అంటార్కిటికాలోని టైలర్ కాలమ్‌లో ఉపరితలానికి తాకడంతో కొద్ది నెలలుగా అక్కడే నిలిచిపోయింది. మంచు కరుగుతుండటంతో కొద్ది రోజులుగా అది మళ్లీ కదలడం మొదలుపెట్టినట్టు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) బృందం వెల్లడించింది. ‘‘ఏ23ఏ ఐస్‌బర్గ్ సముద్ర ప్రవాహాల తాకిడికి క్రమంగా వెచ్చని జలాలవైపు సాగుతోంది. సౌత్ జార్జియాలోని మారుమూల దీవుల గుండా వెళ్తూ క్రమక్రమంగా కరిగి కొన్నాళ్లలో పూర్తిగా కనుమరుగవుతుంది’’అని ప్రకటించింది. దాంతో సైంటిస్టులందరి దృష్టీ దానిమీదే కేంద్రీకృతమైందిప్పుడు. ఏ23ఏను సైంటిస్టులు 1986లో తొలిసారిగా గమనించారు. అప్పట్లో అది 3,900 చ.కి.మీ. పై చిలుకు విస్తీర్ణంతో ఉండేది. నాటినుంచీ చాలాకాలం పాటు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్బర్గ్గా నిలుస్తూ వచ్చింది. మధ్యలో దానికంటే పెద్ద పరిమాణంలో ఏ68 (2017లో), ఏ76 (2021లో) వంటివి పుట్టుకొచ్చినా అవన్నీ చూస్తుండగానే కరిగి చిన్నవైపోయాయి. ఏ23ఏ దర్జా మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. తాజా కదలికల పుణ్యమా అని అది ఇక మూణ్నాళ్ల ముచ్చటేనంటున్నారు సైంటిస్టులు. అయితే అది కరగడం వల్ల సముద్రమట్టం పెరగడం వంటి ముప్పు ఉండకపోవచ్చని వాళ్లు చెబుతున్నారు. ఏ23ఏ కరుగుదలకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణమని వాపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..
ఒకప్పుడు మన దేశ రాజధాని కలకత్తా..తనదంతర కాలంలో అది ఢిల్లీకి మారింది. చరిత్రలో నిలిచిపోయే ఈ ఘటన ఈరోజు (డిసెంబరు 12)న జరిగింది. నాటి బ్రిటీష్ పాలకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దేశరాజధాని కలకత్తా కాదు.. ఢిల్లీ అంటూ ఎందుకు ప్రకటించారు?అది.. 1911 డిసెంబర్ 11.. బ్రిటీష్ పాలకులు ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఢిల్లీ దర్బార్‌లో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని జార్జ్ వీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు నాటి బ్రిటీష్ అధికారులంతా సమ్మతి తెలిపారు. ఈ నేపధ్యంలో 1911, డిసెంబరు 12న ఉదయం 80 వేల మందికి పైగా ప్రజల సమక్షంలో బ్రిటన్ రాజు జార్జ్ వీ ఇకపై ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.రాజధాని మార్పు వెనుక రెండు కారణాలుఅయితే దీనిని అధికారికంగా అమలు చేయడం ఆంగ్లేయులకు అంత సులభం కాలేదు. ఎట్టకేలకు 1931 మార్చి నాటికి, బ్రిటీష్ హైకమాండ్ పూర్తిస్థాయిలో ఢిల్లీని రాజధానిగా అంగీకరించింది. ఈ విషయాన్ని బ్రిటీషర్లు యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఆంగ్లేయులు కలకత్తాను పక్కనపెట్టి, ఢిల్లీని రాజధానిగా చేయడం వెనుక రెండు ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు ముందు పలు సామ్రాజ్యాలు ఢిల్లీ నుంచి పాలన సాగించాయి. రెండవది భారతదేశంలోని ఢిల్లీ భౌగోళిక స్వరూపం. ఈ రెండు కారణాలను పరిగణలోకి తీసుకున్న ఆంగ్లేయులు ఢిల్లీ నుంచి దేశాన్ని పాలించడం సులభమని భావించారు.ఈస్ట్ ఇండియా కంపెనీ బలహీనపడటంతో..కాగా బెంగాల్ విభజన తర్వాత కలకత్తాలో పెరిగిన హింస, అల్లర్లతో పాటు బెంగాల్లో స్వరాజ్యం కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా బ్రిటీషర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నిపుణులు చెబుతుంటారు. బ్రిటీష్ వారు మొదట ఆశ్రయం పొందిన భూమి బెంగాల్ అని, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది అక్కడేనని, అయితే కంపెనీ బలహీనపడటంతో వారు దేశరాజధానిని ఢిల్లీ మార్చారనే వాదన కూడా వినిపిస్తుంటుంది. రాజధానిని మార్చేందుకు వ్యూహాత్మకంగా భారీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, రాజధాని మార్పు నిర్ణయం భారత్‌లోని అందరికీ అనుకూలమేనని బ్రిటీషర్లు ప్రకటించారు.1911 ఆగస్టులో అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ లండన్‌కు పంపిన లేఖలో భారత్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలంటూ పేర్కొన్నారు. 1931లో నాటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఢిల్లీని అధికారికంగా రాజధానిగా ప్రకటించారు. తరువాత వారు బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్లకు ఢిల్లీ రూపకల్పన బాధ్యతను అప్పగించారు.తరగని వైభవందేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఢిల్లీని 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అయితే 1991లో 69వ సవరణ ద్వారా ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంతం హోదాను కల్పించారు. ఢిల్లీ చరిత్ర కథ మహాభారత కాలంలో ఇంద్రప్రస్థ ప్రస్తావనతో ముడిపడివుంది. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉంది. తదనంతరకాలంలో సామ్రాజ్యాలు మారాయి. పాలకులు మారారు. చివరికి ప్రభుత్వాలు కూడా మారాయి. అయితే దేశ చరిత్రలో ఢిల్లీకి ఘనమైన స్థానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు -
ఈ సూప్ తయారీకి మూలం బ్రిటిష్ అధికారులట..!
దక్షిణ భారతీయ సూప్‌గా పేరుగాంచిన 'ముల్లిగటావ్నీ సూప్' రెసిపీని తీసుకొచ్చింది బ్రిటిష్ అధికారులట. వాళ్ల కారణంగా మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు ఈ సూప్ తయారీని కనుగొన్నారట. అంతకముందు వరకు ఈ సూప్ తయారీ గురించి ఎవ్వరికి తెలియదట. కాలక్రమేణ అదే అందరూ ఇష్టంగా ఆరగించే ఫేవరెట్ సూప్‌గా మన భారతీయ వంటకాల్లో భాగమయ్యిందని చెబుతున్నారు పాకశాస్త నిపుణులు. భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో ఈ సూప్ ఉద్భవించిందట. అదెలా? బ్రిటిష్ వాళ్లు మనలా మసాలాలు, పప్పు, కూరగాయలు అంతగా తినరు కదా..మరీ వాళ్లెలా ఈ సూప్ తయారీకి కారణమయ్యారంటే..ముల్లిగటావ్నీ సూప్‌ని బ్రిటిష్ వలస రాజ్యల పాలనా కాలంలో ఉద్భవించిందట. చెప్పాలంటే ఈ రెసిపీని సాంస్కృతిక మార్పిడిగా పేర్కొనవచ్చు. తమిళ పదాలు మియాగు(మిరియాలు, టాన్నీర్(నీరు) మీదుగా దీని పేరు వచ్చింది. దీన్ని దక్షిణ భారతీయ పులసుగా చెప్పొచ్చు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం వచ్చి మనపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరి భారతీయులను నానా బాధలకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇక్కడ ఉండే కొందరు బ్రిటిష్ అధికారులు వారి సంప్రదాయ భోజనం అనుసరించి ముందుగా ఏదో ఒక సూప్‌తో భోజనం ప్రారంభించేవారు. అలాంటి భోజనశైలి భారత్‌లో ఉండదు. దీంతో వాళ్లు తినేందుకు సూప్ కోసం అని మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు కూరగాయాలతో చేసే పులుసునే వాళ్ల కోసం కొద్దిపాటి మాంసం వంటి వాటిని చేర్చి సూప్ మాదిరిగా తయారు చేసి అందించారు. దీని రుచికి ఫిదా అయిన బ్రిటిష్ అధికారులు..వాళ్ల పబ్‌లోనూ, రెస్టారెంట్లలోనూ ఈ వంటకం ఉండేలా ఏర్పాటు చేశారు. అంతలా ఈ సూప్‌ని బ్రిటిష్ వాళ్లు అమితంగా ఇష్టపడేవారట. అయితే ఈ సూప్‌ని తయారు చేసింది ఆంగ్లో ఇండియనే అని చెబుతుంటారు. తయారీ విధానంతేలిక పాటి కూరగాయలు, అన్నం, మిరియాలు, మాంసాలతో తయారు చేస్తారు. చివరగా క్రీమ్ మాదిరిగా అందంగా కనిపించేలా చివర్లో కొబ్బరి పాలు వేసి సర్వ్ చేస్తారు. దీనిలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాలకు వంటి వాసనతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే భారతదేశంలో శాకాహారులు ప్రోటీన్ల కోసం చేసుకునే ఈ కూరగాయ పులుసునే ఇలా కొద్దిపాటి మార్పులతో బ్రిటిష్ వాళ్ల రుచికి అనుగుణంగా ఈ సూప్‌ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అదే అందరికీ ఇష్టమైన సూప్‌గా ప్రజాధరణ పొందడం విశేషం.(చదవండి: ఏడు ఖండాలను చుట్టువచ్చిన వందేళ్ల బామ్మ..!) -
రిహాన్నా నుంచి అమీ జాక్సన్ దాకాముద్దుగుమ్మల సందడి మామూలుగా లేదుగా (ఫోటోలు)
-
112 ఏళ్లకు రైల్వే లైన్ సర్వే పూర్తి.. సాకారమైతే చైనా, నేపాల్ చెంతకు..
పితోర్‌గఢ్(ఉత్తరాఖండ్): బ్రిటీష్ హయాంలో 112 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక రైల్వే లైన్ సర్వే ఎట్టకేలకు పూర్తయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గానికి సంబంధించిన సర్వే పూర్తయింది. ఈ సర్వే ప్రకారం 170 కి.మీ పొడవైన రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ.49 వేల కోట్లు ఖర్చుకానుంది. ఈ రైలు మార్గం ఉనికిలోకి వస్తే భారతీయ రైల్వే అటు చైనా ఇటు నేపాల్ సరిహద్దులను చేరుకోగలుగుతుంది. ఉత్తరాఖండ్‌లోని కుమావోన్‌లోని నాలుగు పర్వతప్రాంత జిల్లాలు తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గం కోసం దశాబ్దాలుగా కలలు కంటున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో తొలిసారిగా ఈ రైలు మార్గం కోసం రూపకల్పన చేసింది. ఈ రైల్వే లైన్ కోసం మొదటి సర్వే 1912లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు మ్తొతం ఏడు సర్వేలు జరిగాయి. రెండేళ్లపాటు సాగిన సర్వేలో తుది నివేదికను స్కై లై ఇంజినీరింగ్ డిజైనింగ్ సంస్థ తాజాగా రైల్వేశాఖకు అందజేసింది.ఈ తుది సర్వే ప్రకారం తనక్‌పూర్- బాగేశ్వర్ మధ్య రైలు మార్గం ఏర్పడితే మొత్తం 12 రైల్వే స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ స్టేషన్లు 170 కిలోమీటర్ల రైల్వే లైన్ మార్గంలో నిర్మించాల్సి ఉంటుంది. అలాగే ఈ రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని కూడా సేకరించాల్సి ఉంది. దీనిలో 27 హెక్టార్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది.తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్‌గా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైన్లో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్‌పూర్ నుండి పంచేశ్వర్ వరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అల్మోరా, పితోర్‌గఢ్, చంపావత్ , బాగేశ్వర్ జిల్లాలకు ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.అంతే కాదు పర్వతప్రాంతాలకు వెళ్లే మార్గం సులభతరం కావడంతో పాటు, పర్యాటక రంగానికి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. చైనా, నేపాల్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ రైలు మార్గానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ మార్గంపై తుది సర్వే నివేదికను అందుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రైలు మార్గాన్ని ఎప్పుడు నిర్మిస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెన -
జైలర్ కన్నా ఖైదీల ఆదాయమే ఎక్కువ!
బ్రిటన్ జైళ్లలో అధికారుల కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారు. రక్షణ కల్పించే అధికారులు, సెకండరీ టీచర్లు, బయో కెమిస్టులు, సైకోథెరపిస్టులు తదితరుల కంటే కూడా వారి ఆదాయం చాలా ఎక్కువట! అక్కడి కొన్ని బహిరంగ జైళ్లలో ఖైదీలను బయటికి వెళ్లి పని చేయడానికి కూడా అనుమతిస్తారు. అలా పనికి వెళ్లిన ఓ ఖైదీ గతేడాది ఏకంగా 46 వేల డాలర్ల (రూ.39 లక్షల) వార్షిక ఆదాయం ఆర్జించి రికార్డు సృష్టించాడు. మరో 9 మంది ఖైదీలు కూడా ఏటా 28,694 డాలర్ల (రూ.24 లక్షల) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖైదీలకు పునరావాసంతో పాటు విడదలయ్యాక సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కలి్పంచడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడి జైళ్లలో ఖైదీలు పలు ఉద్యోగాలు చేస్తారు. లారీ డ్రైవర్లుగా చేసేవారి సంపాదన ఎక్కువ. కొందరు శిక్షాకాలం ముగియకముందే తాత్కాలిక లైసెన్సు సంపాదించేస్తారు. ఈ ఖైదీల్లో పలువురు ఆదాయపన్ను కూడా చెల్లిస్తుండటం విశేషం. కొందరు సేవా కార్యక్రమాలకు విరాళాలూ ఇస్తారు! బ్రిటన్‌లో జైలు గార్డుల సగటు వేతనం 35,000 డాలర్లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
Birsa Munda Jayanti: చిన్న వయసులో ఆదివాసీ యోధునిగా ఎదిగి..
నాడు బ్రిటీషర్ల అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతి నేడు. తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన బిర్సా ముండా చిన్నవయసులోనే కన్నుమూసినా, పది కాలాల పాటు అందరూ గుర్తు పెట్టుకునేలా బ్రిటీషర్లతో పోరాటం సాగించాడు. ఆనాటి బ్రిటీష్ దాష్టీకాల్ని ఎండగట్టాడు. ఆదివాసీలను సమీకరించి, వారిని చైతన్యవంతులను చేశాడు. ఆదివాసీల సమూహాన్ని ఏర్పాటు చేసి, అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా బిర్సా ముండా పేరొందాడు.అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూముల హక్కులను పరిరక్షించే చట్టాలను ప్రవేశ పెట్టాలంటూ బిర్సా ముండా పోరాటం సాగించాడు. కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ ఆదివాసీ యోధుడు గిరిజన నాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా గుర్తింపు పొందాడు. బీహార్, జార్ఖండ్ చుట్టు పక్కల నివసించిన ఈయన జాతీయ ఉద్యమంపై ఎనలేని ప్రభావం చూపాడు. బిర్సా ముండా పుట్టిన రోజున 2000లో ఆయనకు తగిన గౌరవాన్ని అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.1875, నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ బిర్సాముండా 1886 నుండి 1890 వరకూ మిషనరీకి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. గిరిజనులకు తగిన శిక్షణ ఇచ్చి, వారిని బ్రిటీషర్లపై పోరాడే యోధులుగా తీర్చిదిద్దాడు. 1900, మార్చి 3న బిర్సా ముండా జామ్ కోపాయ్ అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిని అరెస్ట్ చేశారు. బిర్సాముండాను జైలులో పెట్టిన కొద్ది రోజులకే కన్నుమూశాడు. ఇది కూడా చదవండి: మొసళ్ళతో మాట్లాడేవాడు.. -
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
చరిత్రను చెరగనివ్వని ద్వీపాలు!
అండమాన్, నికోబార్ ద్వీపవాసులు ‘పునరుద్ధరణ’ను ఆశ్రయించకుండా, చరిత్రను తిరగ రాసుకోవాలని ఉరకలెత్తకుండా తమ గాయపడిన గతాన్నే వాస్తవ వర్తమానంగానూ స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, స్వాతంత్య్ర సమర యోధులు తమ పోరాట ఫలితాలకు ప్రతీకాత్మకమైన ఆ ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించారు.ఎందుకంటే చరిత్రలో రెక్కల కూల్చివేతా ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే... దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాల్లో తమది కూడా ఒకటిగా ఉండేలా చేసింది. కానీ, మితిమీరిన జాతీయవాదంతో ఇప్పుడు అభివృద్ధి కన్నా పేర్ల మార్పుపై దృష్టి పెట్టడం విషాదం.దేశభక్తి గురించి లేదా ‘భిన్నత్వంలోఏకత్వం’ అనే రాజ్యాంగ భావన గురించి దేశం మొత్తంలో ఎలాంటి పాఠాలూ, ప్రబోధాలూ అవసరం లేని ప్రదేశం ఏదైనా ఉందీ అంటే అవి... అండమాన్, నికోబార్ దీవులే. ఆ దీవుల జనాభాలో ఎక్కువ భాగం (సుమారు ఐదు లక్షల మంది) బ్రిటిష్ వారు ఖైదు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం కలిగి ఉన్నవారే. ఆ తర్వాతి స్థానంలో ఈ ప్రాంతంలో స్థిరపడిన వారు, నెగ్రిటో జరావాస్, ఒంగెస్, గ్రేట్ అండమానీస్, సెంటినెలీస్ (బయటి ప్రపంచంతో సంబంధం లేని చివరి రక్షిత తెగ) లేదాషాంపెన్, నికోబారీస్ వంటి మంగోలాయిడ్ తెగలకు చెందిన స్థానిక తెగల సభ్యులు ఉన్నారు.‘భారతదేశ భావన’కు ఆధారభూతమైన ఈ సుదూర కేంద్రం నేడు భారతదేశంలోని అనేక వైవిధ్యాల అధివాస్తవిక సమ్మేళనం. స్వాతంత్య్ర పోరాటం, ‘కాలా పానీ’ అపఖ్యాతి (కఠిన శిక్షల విధింపు, సెల్యులార్ జైలు మొదలైనవి) బెంగాల్, పంజాబ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ నుండి ఖైదీలను ఎక్కువగా ఇక్కడికి రప్పించాయి. వారిలో చాలామంది జాతీయ నిర్మాణంలో గుర్తింపునకు, ప్రశంసలకు నోచు కోకుండా మిగిలిపోయారు. వారి గర్వించదగిన వారసుల కోసం మతాలు, ప్రాంతాలు, జాతులకు అతీతంగా విచిత్రమైన ‘హిందూ స్థానీ’ మాండలికాన్ని ఉపయోగించడం ద్వారా మత సామరస్య భావం నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి. బెంగాలీలు, తమిళులు, పూర్వాంచలీలు, పంజాబీలు... భారత ప్రధాన భూభాగాన్ని కబళి స్తున్న విషపూరితమైన విభజన, రాజకీయ ‘విభజన’ విధానాలచెంప చెళ్లుమనిపిస్తూ ఇక్కడ తమ బతుకు తాము జీవిస్తున్నారు. దూరంగా (చెన్నై లేదా కోల్‌కతా నుండి 1,200 కి.మీ), ప్రధాన భూభాగంలో సాగుతున్న ‘దారుణమైన’ రాజకీయాలు అంటకుండా ఉండటం అనేది ఈ దీవులు ఆదర్శవంతమైన ‘మినీ–ఇండియా’ను తలపించేందుకు దోహదపడింది. నిజానికి ‘మేము–వారు’ అనే ఆధిపత్య ధోరణి మతాలు లేదా జాతుల మధ్య కాదు... సామూహిక ‘ద్వీపవాసులు వర్సెస్ ప్రధాన భూభాగవాసుల మధ్య కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రధాన భూభాగ స్థులను దోపిడీదారులుగా చూస్తారు. ప్రధాన భూభాగంలోని సాధా రణ అవగాహన కంటే ద్వీపాలలో చరిత్రపై అభిప్రాయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు జపనీయులతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన మూడేళ్ల పొత్తు గురించి ఇక్కడ మిశ్రమ భావాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు బ్రిటిష్ వారిని మించిన క్రూరత్వంతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి.ఈ శాంతియుత ద్వీపవాసులు పునరుద్ధరణ వాదాన్ని ఆశ్రయించలేదు. లేదా చరిత్రను తిరగరాయలేదు. సంక్లిష్టమైన, గాయపడిన చరిత్రనే తమ వాస్తవ గుర్తింపుగా స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధులు తమ బాధను సూచించే ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఎందు కంటే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కూడా సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాలలో వారు ఒకటిగా ఉండేలా చూసింది.2006లో ఆ ప్రాంతానికి ఒక అడ్మినిస్ట్రేటర్‌గా, గవర్నర్‌గా నియ మితుడనయ్యాను. 2004 డిసెంబర్ నాటి ఘోరమైన సునామీ కార ణంగా నష్టపోయిన ద్వీపాలలో ఉపశమనం, పునరావాసం నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన సామాజిక ఆర్థిక విధ్వంసాల నుండి మనం కోలుకున్న ప్పుడు, సమాజం కలిసి ఉండే విధానం వల్ల నేనెంతో ఉపకారంపొందాను. ఒక మాజీ పోరాట యోధుడిగా, నేను సామాజిక అనుకూ లత, శాశ్వతమైన దేశభక్తి, ఇంకా లేహ్ ప్రాంతంలోని సుదూర సరి హద్దు ప్రాంతాలు, కశ్మీర్ ఎతై ్తన ప్రాంతాలు లేదా లోతట్టు ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేకమైన ఒక పెద్ద జాతీయ ప్రయోజనాన్ని చూశాను. తక్కిన ‘భారతదేశం’లో ఇది కనిపించలేదు. చాలా సాధించినా, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ ద్వీపాల వ్యూహాత్మక స్థానం (మలక్కా జలసంధి వద్ద చైనీస్ ‘చౌక్ పాయింట్’ మినహా) – అలాగే హానికి లేదా దాడికి గురయ్యే గిరిజనులకురక్షణగా ఉన్న భౌగోళిక స్థితి, వీటితో పాటుగా... సహజమైన గ్రీన్ కవర్ అభివృద్ధి కోసం గోవా, కేరళ మార్గాల్లో సాంప్రదాయికతకు తలుపులు ‘తెరవడం’పై కొన్ని పరిమితులు అవసరం. ప్రైవేట్ అభివృద్ధి లేనప్పుడు ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. మౌలిక సదుపా యాలు, పౌర సౌకర్యాలు, ఉపాధి అవకాశాల కొరత కూడా ఒక సవాలు. అయినప్పటికీ ఈ భారతదేశ ‘షైనింగ్ ఔట్ పోస్ట్’ దాని ప్రత్యేక మార్గాలకు, చరిత్రకు కట్టుబడి ఉంది.ప్రధాన భూభాగపు గాలులు, స్వచ్ఛమైన సహజ ద్వీపాలకు చేరు కోవడానికి ఎంతో కాలం పట్టదు. జాతీయవాదాన్ని ప్రోత్సహించ డానికి ప్రముఖ స్థలాల పేర్లను మార్చడం అటువంటి దిగ్విషయా లలో ఒకటి. హ్యావ్లాక్, నీల్, రాస్ దీవులకు వరుసగా స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. ద్వీపాలు టూరిజంపై ఎక్కువగా ఆధారపడటం, పర్యాటక ‘బ్రాండ్’ లను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లను మార్చటం తగదని మార్కెటింగ్ జ్ఞానం సలహా ఇస్తుంది. అన్నింటికంటే, వాడుకకు చెందిన స్థిరత్వం, నామకరణపు క్లుప్తత, దీర్ఘకాల గుర్తింపును నిర్మించడం అనేది సాధారణ భావన. అయినప్పటికీ, స్థానికులు కోరుకున్నందున పేర్లు మార్చడం జరగలేదు, కానీ మితి మీరిన జాతీయవాదం ఫార్ములా కారణంగా వీటి పేర్లు మార్చారు. ఈ పేరు మార్పు వెనుక చోదకశక్తిగా ఉన్నవారు నేతాజీ మనవడుచంద్ర కుమార్ బోస్. అయితే దిగ్గజ స్వాతంత్య్ర యోధుడి భావ జాలాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ నుండి తనకు మద్దతు లభించ లేదంటూ తర్వాత ఆయన పాలకవ్యవస్థ నుండి వైదొలిగారు.తరువాత, జనావాసాలు లేని 21 ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు మార్చారు. భారతదేశపు అర్హులైన వారసులకు నివాళి గనక, ఆచరణాత్మక చిక్కులు కూడా లేవు గనక ఈ పేర్ల మార్పును అంగీకరించడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడులు, ఇంకా చాలా అంశాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అండమాన్, నికోబార్ దీవులకు సరికొత్త జాతీయవాద ఔన్నత్య ‘వైభవం’ సంప్రా ప్తించింది. రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు ఇటీవల ‘శ్రీ విజయపురం’ అని పేరు పెట్టారు. ఇది ‘వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయ డానికి’ జరిగిందంటున్నారు. ఆర్చిబాల్డ్ బ్లెయిర్ (ఈయన పేరునే పోర్ట్ బ్లెయిర్‌కు పెట్టారు) బొంబాయి మెరై¯Œ లో సాపేక్షంగా అసంగ తమైన నావికా సర్వేయర్ అని పట్టించుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియా అతని గురించి తీవ్రమైన దూషణలతో నిండిపోయింది. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చడం గురించి కొంతమంది ద్వీప వాసులకు చేసిన కాల్స్ ఉదాసీనత, ఉద్రేకాలతో మిశ్రమ స్పందనను రేకెత్తించాయి. ద్వీపవాసులకు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టకుండా, ఇలాంటి కసరత్తులు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. ఇది తప్పు కాదు కానీ ప్రత్యేకించి దేశంలోని మిగిలిన ప్రజలకు గౌరవప్రదమైన దేశభక్తి (అత్యంత తీవ్రమైన జాతీయవాదం కాదు), కలుపుగోలుతనం, లౌకికవాదం గురించి ఒకటి లేదా రెండు విష యాలు చెప్పVýæలవారికి ఇది ఉన్మాద రాజకీయాల పునరావృతమే. పేర్లు మార్పు సరే... అర్థవంతమైన అభివృద్ధి మాటేమిటి? అది జరిగే సూచనలు కనిపించటం లేదు. - వ్యాసకర్త రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్- భోపిందర్ సింగ్ -
ఛారిటీ కోసం ఇంగ్లిష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!
చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించేందుకు ఇంగ్లిష్ ఛానెల్‌ని ఈదింది 16 ఏళ్ల భాతర సంతతి విద్యార్థి ప్రిషా తాప్రే. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఉత్తర లండన్‌లోని బుషే మీడ్స్ స్కూల్లో చదువుతున్న ప్రిషా తాప్రే 12 ఏళ్ల వయసులో ఈ ఇంగ్లీష్ ఛానెల్ గురించి తెలసుకుని ఈదాలనే ఆసక్తిని పెంచుకున్నట్లు తెలిపింది. అందుకోసం నాలుగేళ్ల కఠిన శిక్షణ అనంతరం గత వారమే ప్రిషా ఇంగ్లాండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్‌నెజ్ వరకు దాదాపు 34 కిలోమీటర్ల ఈతని 11 గంటల 48 నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రిషా ఈ లక్ష్యాన్ని సోలోగా పూర్తి చేయడం విశేషం. ప్రిషా యూకేలోనే జన్మించగా, ఆమె తల్లిందండ్రులు మహారాష్ట్రాకు చెందినవారు. ఆమె యూకేకి చెందిన అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ(పిల్లల ఆకలిని తీర్చే సంస్థ) కోసం దాదాపు రూ. 4 లక్షలు సేకరించింది. ఈ స్వచ్ఛంద సంస్థనే ప్రిషా ఎంచుకోవడానికి కారణం ఇది ఇంగ్లండ్, భారతదేశంలోని పిల్లలకు సహాయపడుతుండటమేని ఆమె చెబుతోంది. (చదవండి: అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు) -
సాలీళ్లు బాబోయ్! సాలీళ్లు! ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి..
ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి. సాలీడు పేరు చెబితేనే బ్రిటిష్ ప్రజలు భయంతో వణుకుతున్నారు. సాలీళ్లలో ‘ఫెన్ రాఫ్ట్ స్పైడర్’ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లల్లోకి చొరబడి గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ, జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు. ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటాయి. బ్రిటన్‌లోని సఫోక్, ససెక్స్, నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలీళ్ల బెడద కొద్దిరోజులుగా ఎక్కువైంది. నీటి ఉపరితలంలోను, నేల మీద కూడా జీవించగలిగే ఫెన్ రాఫ్ట్ స్పైడర్ సాలీళ్లలో అరుదైన జాతి. జలాశయాల పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాలీళ్లు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇదివరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి. ఇప్పుడివి ఇళ్లల్లోకి కూడా చొరబడటమే బెడదగా మారింది.నల్లులతో నానా యాతన..!అగ్రరాజ్యం అమెరికాను నల్లులు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నల్లుల బెడద విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల ఇళ్లు, హోటళ్లు తదితర ప్రదేశాల్లోని మంచాలు, కుర్చీలు, సోఫాల్లోకి చేరిన నల్లులు జనాలను కుట్టి చంపుతున్నాయి.అమెరికాలో ఎక్కువగా ‘ఆసియన్ లాంగ్హార్న్డ్ టిక్’ జాతికి చెందిన నల్లులు కొద్దికాలంగా విజృంభిస్తున్నాయి. అమెరికాలో ఈ జాతి నల్లులను తొలిసారిగా 2017 సంవత్సరంలో ఓక్లహామాలో గుర్తించారు. వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నల్లులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది. ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నల్లి కాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై, దాదాపు 15 శాతం మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. -
బ్రిటీష్ టెలికంలో భారతి గ్లోబల్ పాగా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ అంతర్జాతీయ పెట్టుబడుల విభాగం భారతి గ్లోబల్ తాజాగా బ్రిటన్ సంస్థ బీటీ (బ్రిటీష్ టెలికం) గ్రూప్‌లో 24.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. డీల్ విలువను నిర్దిష్టంగా ప్రకటించనప్పటికీ బీటీ వేల్యుయేషన్ సుమారు 15 బిలియన్ డాలర్లు ఉంటుందని, దాన్ని బట్టి చూస్తే ఒప్పంద విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33,600 కోట్లు) ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారతి గ్లోబల్ ప్రకటన ప్రకారం కంపెనీ ముందుగా ఆల్టిస్ సంస్థ నుంచి బీటీ గ్రూప్‌లో 9.99 శాతం వాటాను తక్షణం కొనుగోలు చేస్తుంది. నియంత్రణ సంస్థ అనుమతులు వచ్చాక మిగతా వాటాను తీసుకుంటుంది. బీటీని పూర్తిగా దక్కించుకోవడంపై గానీ బోర్డులో స్థానం తీసుకోవడంపై గానీ ఆసక్తి లేదని భారతి గ్లోబల్ పేర్కొంది. బీటీ గ్రూప్ బ్రిటన్‌లో అతి పెద్ద బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. దానికి గతంలో 1997 నుంచి 2001 వరకు భారతి ఎంటర్ప్రైజెస్ టెలికం విభాగమైన భారతి ఎయిర్‌టెల్‌లో 21 శాతం వాటాలు ఉండేవి. బీటీ గ్రూప్‌లో బిలియనీర్ ప్యాట్రిక్ డ్రాహీకి చెందిన పెట్టుబడి సంస్థ ఆల్టిస్ 2021లో ముందుగా 12 శాతం వాటాలు తీసుకుని తర్వాత దాన్ని 24.5 శాతానికి పెంచుకుంది. భారతి గ్లోబల్ పెట్టుబడులు తమ గ్రూప్ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై నమ్మకానికి నిదర్శనమని బీటీ సీఈవో అలిన్ కిర్క్‌బీ పేర్కొన్నారు. టాటా, మహీంద్రాల సరసన భారతి.. → తాజా డీల్‌తో బ్రిటన్ కంపెనీలను కొనుగోలు చేసిన టాటా, మహీంద్రా, వెల్స్పన్, టీవీఎస్ వంటి దిగ్గజ సంస్థల సరసన భారతి ఎంటర్ప్రైజెస్ కూడా చోటు దక్కించుకోనుంది. → టాటా గ్రూప్‌లో భాగమైన టాటా టీ 2000లో బ్రిటన్ సంస్థ టెట్లీ టీని కొనుగోలు 271 మిలియన్ పౌండ్లకు చేసింది. అప్పట్లో టెట్లీతో పోలిస్తే టాటా టీ పరిమాణం చాలా చిన్నది. అయినప్పటికీ 1995 నుంచి దాన్ని కొనుగోలు చేసేందుకు సుదీర్ఘంగా ప్రయత్నాలు చేసింది. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కూడా రంగంలోకి దిగారు. చివరికి 2000లో టాటా గ్రూప్ దాన్ని సొంతం చేసుకుని అప్పట్లో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలు డీల్‌ను నమోదు చేసింది. → ఆ తర్వాత ఆరేళ్లకు 2006 జూలైలో టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా, బ్రిటన్‌కి చెందిన టెర్రీ టవల్ బ్రాండ్ క్రిస్టీ మాతృ సంస్థ సీహెచ్టీ హోల్డింగ్స్‌లో 85 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 132 కోట్లు వెచి్చంచింది.→ టాటా గ్రూప్ తన దూకుడును కొనసాగిస్తూ ఆ మరుసటి ఏడాది 2007లో ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్ గ్రూప్‌ను దక్కించుకుంది. ఇందుకోసం టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. దానికి కొనసాగింపుగా 2008లో టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లతో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ మోటర్ నుంచి దక్కించుకుంది. → ఇక 2016 అక్టోబర్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటన్‌కు చెందిన ద్విచక్ర వాహనాల సంస్థ బీఎస్ఏ కంపెనీని రూ. 28 కోట్లకు తీసుకుంది. → 2020 ఏప్రిల్‌లో బైక్‌ల తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను టీవీఎస్ మోటర్ కంపెనీ 16 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. భారతి, బీటీలకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉంది. దిగ్గజ బ్రిటన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మాకు ఒక గొప్ప మైలురాయిలాంటిది – సునీల్ భారతి మిట్టల్, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ -
ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది?
పుస్తకాలు చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందంటారు. పుస్తకాలు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా చెబుతారు. పుస్తకాలు మనకు తెలియని ఎన్నో విషయాలను నేర్పుతాయి. అలాంటి పుస్తకాలకు నిలయం లైబ్రరీ. మరి ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? పుస్తకాలు మనిషికి మంచి మిత్రుని లాంటివని పెద్దలు చెబుతుంటారు. ఒంటరితనాన్ని పోగొట్టే దివ్య ఔషధం పుస్తకమేనని కూడా అంటారు. నచ్చిన పుస్తకాలను చదివేందుకు పుస్తకప్రియులు లైబ్రరీకి వెళుతుంటారు. కొంతమంది లైబ్రరీలో గంటల తరబడి ఉండేందుకు ఇష్టపడతారు. మన దేశంలో లైబ్రరీలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో ఉంది. దీనిని బ్రిటిష్ లైబ్రరీ అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 20 కోట్ల పుస్తకాలు, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ 1973, జూలై ఒకటిన నెలకొల్పారు. ఈ లైబ్రరీ గతంలో బ్రిటిష్ మ్యూజియంలో భాగంగా ఉండేది. ఈ లైబ్రరీకి వెళ్లి ఎవరైనా అక్కడి పుస్తకాలు చదువుకోవచ్చు. -
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్‌లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
150 ఏళ్ల నాటి నిధి, వాటాలకోసం జగడం..చివరికి..?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న కూలీలకు ఊహించని పరిణామం ఎదురైంది. 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి నిధి వారి కంటపడింది ఇంటి నిర్మాణం కోసం (మంగళవారం మార్చి 5న) గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు లభ్యమైనాయి. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి వివాదానికి దారి తీసింది. సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి కూలీలను పెట్టుకున్నాడు. ఈ క్రమంగా అక్కడ తవ్వుతుండగా ఇద్దరు కార్మికుల వెండి నాణేలు లభించాయి. ఈ సంగతి సంజయ్ పాల్ పొరుగువారికి తెలియడంతో వివాదం రేగింది.త మకూ వాటా కావాలని పట్టుబట్టడంతో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సంజయ్ కుమారుడు హరీష్ జంగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాటా అడిగిన ఇంటి పొరుగువారితో పాటు ఇద్దరు కార్మికులను అరెస్టు చేస్తామని చెప్పారు. కొన్ని వెండి నాణేలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి వివరాలను సేకరించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు ప్రకటించారు. కాగా ఇంటి పునాదిని తొలగిస్తుండగా నిధి కనిపించిందని, కూలీలకు 40-50 నాణేలు లభించాయని తమకు సమాచారం అందిందనీ, తాము అక్కడికే చేరుకునే సరికి అక్కడ ఎవరూ లేరని, వాటిని కార్మికులో తీసుకుని ఉంటారని హరీష్ తెలిపాడు. -
మిట్టల్‌కు నైట్‌హుడ్ పురస్కారం
లండన్/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు. -
‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్‌కు పోతారు’
యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్‌లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది. ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది. ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్‌లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించారు. ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్‌లో ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఉన్న కన్వర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అపోలో టైర్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్ హబ్ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్ హబ్ భారత్‌లోని హైదరాబాద్‌లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్‌కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్‌గా కొనసాగుతోంది. -
‘లాలా’ కోసం భగత్‌సింగ్ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి?
బ్రిటీషర్ల బానిసత్వ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కల్పించడంలో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ విశేష కృషి చేశారు. ఆయన నిష్ణాతుడైన రాజకీయవేత్త, చరిత్రకారుడు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. లాలా లజపతిరాయ్ కాంగ్రెస్‌లో అతివాద గ్రూపు నేతగా, పంజాబ్ కేసరిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా విప్లవకారులకు లాలా లజపతిరాయ్ అంటే ఎంతో గౌరవం. యువతను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడేలా లాలా లజపతిరాయ్ పురిగొల్పారు. నేడు లాలా లజపతిరాయ్ జయంతి. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని అగర్వాల్ కుటుంబంలో 1865, జనవరి 28న లాలా లజపతిరాయ్ జన్మించారు. 1928, అక్టోబర్ 30న సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో భారీ ప్రదర్శన జరిగింది. దీనిలో లాలా లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో, లాలా మాట్లాడుతూ ‘నా శరీరంపై పడే ప్రతీ లాఠీ దెబ్బ.. బ్రిటిష్ ప్రభుత్వ శవపేటికపై దిగబడే మేకులా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. 1927, నవంబరు 8న భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి సైమన్ కమిషన్ అనే పేరు పెట్టింది. దీనిలో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. భారతీయులకు దానిలో స్థానం దక్కలేదు. మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల పరిశీలనకు ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3న భారతదేశానికి వచ్చింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్‌తో సహా దేశమంతా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘సైమన్ కమిషన్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పంజాబ్‌లో జరిగిన ఈ నిరసనకు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఎ స్కాట్ నేతృత్వంలో లాఠీ ఛార్జ్ జరిగింది. లాలా తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు 1928 నవంబర్ 17న కన్నుమూశారు. లాలా లజపతి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భగత్ సింగ్‌తో సహా పలువురు విప్లవకారులు బ్రిటిష్ అధికారి జేమ్స్ ఎ. స్కాట్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగి, 1928, డిసెంబరు 17న భగత్ సింగ్, రాజ్గురులు బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ పి. సాండర్స్‌ను కాల్చిచంపారు. ఆ సమయంలో సాండర్స్ లాహోర్ ఎస్పీగా ఉన్నారు. లాలా లజపతిరాయ్ మృతి విషయంలో దేశం మౌనంగా ఉండదని, బ్రిటిష్ వారికి తగిన సమాధానం చెప్పాలని భావించిన విప్లవకారులు బ్రిటిష్ వారికి ఇటువంటి సందేశం ఇచ్చారు. -
భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ
ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్ మిస్సైల్ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్ నేవీ వచ్చింది. #IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24. The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo — SpokespersonNavy (@indiannavy) January 27, 2024 ‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్ నేవి ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొంది. -
బొమ్మ కోసం ఆర్డర్.. భారీ విగ్రహం డెలివరీ!
తల్లితండ్రులు తమ పిల్లలపై చూపే ప్రేమకు హద్దులంటూ ఉండవు. పిల్లల కోర్కెలు తీర్చేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుమారునిపై తండ్రికి ఉన్న ప్రేమకు పరాకాష్ఠగా నిలిచింది ఈ ఉదాహరణ. నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఎలాగైనా తెచ్చివ్వాలని తండ్రి భావించాడు. ఈ బొమ్మ కోసం కొడుకు పట్టిన మంకుపట్టు ఆ తండ్రికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకపోగా, అదొక ఛాలెంజ్‌గా అనిపించింది. కుమారుడు కోరిన బొమ్మ అత్యంత భారీగా ఉండటంతో దానిని ఇంటికి తెచ్చేందుకు తండ్రి క్రేన్‌ను కూడా బుక్ చేయాల్సివచ్చింది. ‘మిర్రర్’ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్కు చెందిన ఆండ్రీ బిస్సన్ను అతని నాలుగేళ్ల కుమారుడు థియో.. తనకు డైనోసార్ బొమ్మకావాలని కోరాడు. ఆ పిల్లాడు ఆడుకునేందుకు అనువైన బొమ్మను అడిగినప్పటికీ అతని చెంతకు అత్యంత భారీ విగ్రహం చేరింది. కుమారుడు కోరిన విధంగా ఆండ్రీ బిస్సన్ ఆన్లైన్లో డైనోసార్ బొమ్మను ఆర్డర్ చేశాడు. అయితే అతను ఆర్డర్ చేసింది ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేటుగా తెలిసింది. ఆండ్రీ బిస్సన్ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో రూ. ఒక లక్షా 5 వేల మొత్తానికి కొనుగోలు చేశాడు. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు క్రేన్ అవసరమయ్యింది. ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్‌లో ఆండ్రీ ఈ విగ్రహాన్ని కనుగోలు చేశాడు. ఈ ఉదంతం గురించి ఆండ్రీ బిస్సన్ మీడియాతో మాట్లాడుతూ ఈ బొమ్మ ఇది 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పు ఉంటుందని తాను అనుకున్నానని, అయితే, ఆ బొమ్మ ఐదు మీటర్ల ఎత్తు ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. డెలివరీ కంపెనీ ఆండ్రీ బిస్సన్కు ఫోన్ చేసి, లారీలో విగ్రహం సరిపోదని, అది రెండు టన్నులు ఉండడంతో జేసీబీలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఆ డైనోసార్ విగ్రహం చాలా బరువు ఉన్నందున అది ఆండ్రీ బిస్సన్ ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. -
పీఓకేలో పాక్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటన.. భారత్ తీవ్ర అభ్యంతరం
‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ లో (పీఓకే) ఇస్లామాబాద్ బ్రిటన్ రాయబారి పర్యటించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేన్ మారియట్ పర్యటన అత్యంత అభ్యంతరకరమని పేర్కొంది. ఇది ‘భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య’గా అభివర్ణించింది. కాగా పాకిస్థాన్‌లోని బ్రిటన్ హైకమిషనర్ జేన్ మారియట్ ఈనెల 10న పీఓకేలోని మీర్పూర్ను సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను `ఎక్స్`లో పోస్ట్ చేశారు. ఆమె పర్యటనపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ పీవోకేలో పర్యటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘణపై విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్ అధ్యక్షుడు -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
'మైండ్ బ్లోయింగ్ ఆర్ట్'! ఏకంగా సూది రంధ్రంలోని బబుల్‌పై కళాఖండం!
ఎన్నో ఆర్ట్‌లు చూసి ఉంటాం. ఇలాంటి నెవ్వర్ బీఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఆర్ట్‌ని చూసి ఉండటం అసాధ్యం. ఎందుకంటే..? ఇంతలా సూక్షంగా వేయడం ఒక ఎత్తైతే..పైగా బబుల్ పగిలిపోకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా వేయడం అనితర సాధ్యం. సుసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ అసాధారణ వ్యక్తి. ఇతనేం అందరిలాంటి వ్యక్తి కాదు కూడా. ఎందుకంటే? ఇతను చిన్నతనంలో ఆటిజంతో బాధపడిన వ్యక్తి. తస ఆర్ట్‌తో అందర్నీ విస్మయపరచడమే కాదు శభాష్ అని ప్రసంశలు అందుకున్నాడు. ఆ వ్యక్తి ఆర్ట్ జర్నీ ఎలా సాగింది? అనితర సాధ్యమైన ఆర్ట్ ఎందుకు వేశాడో అతని మాటాల్లో తెలుసుకుందామా! విల్లార్డ్ విగాన్ ఇంగ్లాండ్‌లోని వెడ్నెస్ఫీల్డ్లోని అష్మోర్ పార్క్ ఎస్టేట్‌కు చెందిన బ్రిటిష్ శిల్పి. అతడు సూక్ష్మ శిల్పాలను రూపొందిస్తాడు. చాలామంది ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మ శిల్పలు రూపొందిస్తారు కానీ అతడు కేవడం సూదీ తల భాగంలో లేదా రంధ్రంలో వేస్తాడు. ఈసారి సూదీ రంధ్రంలో ఓ బబుల్‌పై ముగ్గురు వ్యక్తులు ఒంటెలపై ప్రయాణిస్తున్నట్లు వేశాడు. బబుల్ పగలకుంటా అత్యంత జాగ్రత్తగా వేయాలి. అందుకోసం అతడు రోజూకు 16 గంటలకు పైగా శ్రమను ఓర్చీ మరీ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. దీన్ని వేసేందుకు కంటి రెప్ప వెంట్రుకలతో తయారు చేసిన పెయింట్ బ్రెష్‌ని వినియోగించడం విశేషం. నిజం చెప్పాలంటే ప్రతి నిమిషం ఉత్కంఠంగా ఊపిరి బిగబెట్టి గుండె లయలను వింటూ వేయాల్సింది. ఎందుకంట? ఆ ఆర్ట్ వేస్తున్నప్పుడూ ఏ క్షణమైన బబుల్ పగిలిందే మొత్తం నాశనమైపోతుంది. పడిన శ్రమ వృధా అయిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆర్ట్ అనితరసాధ్యమైన ఫీట్ అనే చెప్పాలి. ఆ ఆర్ట్‌లో ఒంటెలను నైలాన్‌తో రూపొందించగా, వాటిపై రాజుల్లా ఉన్న వ్యక్తుల కిరిటీలను 24 క్యారెట్ల బంగారంతో మెరిసేట్లు రూపొందించాడు. సూదీ రంధ్రంలో బుడగ పగిలిపోకుండా ఆధ్యంతం అత్యంత ఓపికతో శ్రమతో వేశాడు. చూసిన వాళ్లు సైతం ఇది సాధ్యమాఝ అని నోరెళ్లబెట్టేలా వేశాడు విల్లార్డ్ విగాన్. ఈ అసాధారణ కళా నైపుణ్యానికి గాను విల్లార్డ్ని 2007లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ సభ్యుడిగా నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. విల్లార్డ్ సుమారు 5 ఏళ్ల ప్రాయంలోనే చీమలకు ఇళ్లను కట్టే మైక్రో శిల్పాన్ని వేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఆర్ట్ వైపుకి ఎలా వచ్చాడంటే.. విల్లార్డ్ ఆటిజం కారణంగా చిన్నతనంలో అన్నింటిలోనూ వెనుకబడి ఉండేవాడు. దీంతో స్నేహితులు, టీచర్లు పదేపదే ఎగతాళి చేసేవారు. ఈ అవమానాల కారణంగా అతడి చదువు సరిగా కొనసాగలేదు. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు చదవడం, రాయడంలో చాలా వెనబడి ఉంటారు. ఈ రకమైన పిల్లలకు బోధించడం టీచర్లకు కూడా ఓ పరీక్ష లేదా సవాలుగానే ఉంటుంది. ఇక్కడ విల్లార్డ్ ఈ అవమానాలకు చెక్‌పెట్టేలా ఏదో ఒక టాలెంట్‌తో తానెంటో చూపించాలి. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని బలంగా అనుకునేవాడు. ఆ జిజ్ఞాశే విల్లార్డ్ని మైక్రో ఆర్ట్ వైపుకి నడిపించింది. చిన్న వయసు నుంచే ఈ మైక్రో ఆర్ట్‌లు వేసి టీచర్లను తోటి విద్యార్థులను ఆశ్చర్యపరిచేవాడు. దీంతో క్రమంగా వారు కూడా అతడిని అవమానించటం, ఎగతాళి చేయటం మానేశారు. ఈ కళ అతడికి మంచి పేరునేగాక అందరీ ముందు విలక్షణమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. మనకు కొన్ని విషయాల్లో రోల్ మోడల్స్ ఉండాలి గానీ నాలాంటి వాళ్లకు రోల్‌మోడల్స్ ఉండరు. అందుకుని వారికీ తాను స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా ఉండాలనుకున్నాను. అని చెబుతున్నాడు విల్లార్డ్. మనం నిత్యం ఎన్నో సమస్యలు, బాధలతో సతమతమవుతాం. దాన్ని మనలో దాగున్న ఏదో నైపుణ్యంతో వాటిని పారద్రోలాలి. ఆ స్కిల్ తెయకుండానే.. మీకు ఎదురైన చేదు అనుభవాలను సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకు తానే ప్రేరణ అని విల్లార్డ్ చెబుతుంటాడు. అంతేగాదు ప్రపంచానికి సరికొత్త వెలుగునిచ్చేందుకు తాను ఈ కష్టతరమైన మైక్రో ఆర్ట్ వైపుకి వచ్చానంటున్నాడు. ఈ ఆర్ట్ ప్రతి ఒక్కరిలో ఆశ అనే ఒక మ్యాజికల్ కాంతిని, శాంతిని అందజేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు విల్లార్డ్. దీని అర్థం చిన్న చిన్న సమస్య లేదా పర్వతం లాంటి సమస్య అయినా నువ్వు తల్చుకుంటే సాధ్యమే! అని విల్లార్డ్ తన ఆర్ట్‌తో చెప్పకనే చెబుతున్నాడు కదా!. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
మిస్సింగ్ కేసుని చేధించిన ఆ 'ఎమోషనల్ ఫేస్బుక్ సందేశం"
ఈ రోజుల్లో పొరపాటున పిల్లలు తప్పిపోతే దొరకడం చాలా కష్టం. పోలీసులు చుట్టు తిరిగినా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలను ఎత్తకుపోయే ముఠాలు, మానవ అక్రమ రవాణ తదితరాల కారణంగా ఆచూకి అంత ఈజీ కాకుండా పోయింది. ఐతే ఈ ఆధుననిక టెక్నాలజీ ఈ విషయంలో సహకరిస్తుందని చెప్పాలి. ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ సెకన్లలో చేరి ఏదో రకంగా వాళ్ల ఆచూకీ లభించి కుటుంబ చెంతకు చేరిన ఎన్నో ఉదంతాలు చూశాం. అలాంటి ఆశ్చర్యకర ఉదంతమే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యూకేకి చెందిన అలెక్స్ బట్టీ ఆరేళ్ల వయసులో తప్పిపోయాడు. స్పెయిన్‌లో ఉండగా సెలవుల్లో తన అమ్మ, తాతయ్యలతో కలిసి ఊరికి వెళ్తుండగా తప్పిపోయాడు. అప్పటి నుంచి అతడి మిస్ కేసింగ్ కేసు పరిష్కారం కానీ కేసుగా ఉండిపోయింది. ఇంటర్నెట్లో అతడి ఆచూకీ కోసం ఓ ప్రకటన కూడా ఉంది. అయితే ఆ చిన్నారి అలెక్స్ ఇప్పుడూ అనూహ్యంగా 17 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ పర్వాతాల్లో ఓ వాహనదారుడికి కనిపించాడు. దీంతో అతను ఆ టీనేజర్ని ఇక్కడ ఎందుకు ఉన్నావని ఆరా తీయగా నాలుగు రోజుల నుంచి ఈ పర్వతాల నుంచే నడుచుకుంటూ వస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అతడు ఆ బాలుడి పేరుని ఇంటర్నెట్లో టైప్ చేసి చెక్‌చేయగా అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. దీంతో అతను వెంటనే ఆ టీనేజర్ని పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. అంతేగాదు అలెక్స్ ఆ వాహనదారుడి ఫోన్ సహాయంతో ఫేస్బుక్లో యూకేలో ఉన్న తన అమ్మమ్మ తాతయ్యల కోసం ఓ సందేశం పెట్టాడు. ఆ సందేశంలో "హలో అమ్మమ్మ నేను అలెక్స్. నేను ఫ్రాన్స్ టౌలౌస్‌లో ఉన్నాను. మీకు సందేశం చేరుతుందని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను ఇంటికి రావాలనుకుంటున్నా".అని ఉద్వేగభరితంగా సందేశం పెట్టాడు. ఇది వారికి రీచ్ అవ్వడమే గాక ఒక్కసారిగా ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆ టీనేజర్ తొలిసారిగా తన అమ్మమ్మను కలుసుకోనున్నాడు. ప్రస్తుతం ఆ టీనేజర్ టౌలౌస్‌లోని ఒక యువకుడి సంరక్షణలో ఉన్నాడని ఏ క్షణమైన నగరానికి రావొచ్చని పోలీసులు తెలిపారు. అదృశ్యమయ్యే సమయానికి అలెక్స్ వసయు 11 ఏళ్లు కాగా ఆరేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోనున్నాడు. ఐతే ఈ ఆరేళ్లలో ఎక్కడ ఉన్నాడు, ఎలా మిసయ్యాడు అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
అనూష షా...విల్ పవర్ ఉన్న సివిల్ ఇంజనీర్
‘నా వృత్తిలో నేను రాణిస్తే చాలు. అదే పదివేలు’ అని సంతృప్తి పడి, సర్దుకుపోయేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. ‘నా వృత్తి వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని జరుగుతోంది?’ అని ఆలోచించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి... అనూష షా. పచ్చటి ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన అనూషకు పర్యావరణ విలువ తెలుసు. సివిల్ ఇంజనీర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అనూష వృత్తి విజయాలను చూసి ΄÷ంగిపోవడం కంటే వృత్తికి సామాజిక బాధ్యతను జోడించడానికే అధికప్రాధాన్యత ఇచ్చింది. తన వంతుగా వివిధ వేదికలపై పర్యావరణ హిత ప్రచారాన్ని విస్తృతం చేసింది. తాజాగా... బ్రిటన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఐసీయి)కి అధ్యక్షురాలిగా ఎంపికైంది అనూష షా. రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ‘ఐసీయి’ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయురాలిగా అనూష షా చరిత్ర సృష్టించింది... ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో అనూష షాకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. డిజైనింగ్, మేనేజింగ్లో, ప్రాజెక్ట్స్–ప్రొగ్రామ్‌లను లీడ్ చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ‘నిర్మాణం వల్ల నిర్మాణం మాత్రమే జరగడం లేదు. ప్రకృతికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది’ అనేది ఒక సామాజిక సత్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృత్తికి సామాజిక బాధ్యత కూడా జోడించి ముందుకు వెళుతోంది అనూష. ‘నా వృతి వల్ల నాకు ఆర్థికంగా మేలు జరగడం మాట ఎలా ఉన్నా, చేటు మాత్రం జరగవద్దు’ అంటోంది అనూష. అందుకే తన వృత్తిలో పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తోంది. ‘సివిల్ ఇంజనీరింగ్‌ను పీపుల్–పాజిటివ్ ప్రొఫెషన్‌గా చూడాలనేది నా కల. మౌలిక వసతులు, ప్రకృతికి మధ్య ఉండే అంతఃసంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మొదట్లో మేము విఫలమయ్యాం. ఆ తరువాత మాత్రం ప్రకృతికి హాని జరగని విధానాలను అనుసరించాం’ అంటుంది అనూష. అందమైన కశ్మీర్లో పుట్టి పెరిగిన అనూషకు ప్రకృతి విలువ తెలుసు. కశ్మీర్‌లోని దాల్ సరస్సు సంరక్షణ కోసం దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో కన్సల్టింగ్ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తరువాత కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌తో బ్రిటన్ వెళ్లి ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో ఎంఎస్సీ చేసింది. ‘΄్లాన్ ఫర్ ఎర్త్’ అనే క్లైమెట్ ఛేంజ్ కన్సెల్టెన్సీని మొదలు పెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వివిధ పరిశ్రమలకు సంబంధించిన ‘నెట్‌జీరో అండ్ క్లైమెట్ ఛేంజ్’ బృందాలతో సమావేశమై విలువైన సూచనలు ఇచ్చింది. చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నా, వ్యాసాలు రాసినా, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా, సమావేశాల్లో ఉపన్యాసం ఇచ్చినా...ప్రతి అవకాశాన్ని పర్యావరణ హిత ప్రచారానికి ఉపయోగించుకుంది. ‘మన గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించాలి. ఉన్నతమైన విలువలతో ప్రయాణించినప్పుడే మన గమ్యస్థానం చేరుకోగలం’ అంటుంది అనూష. ‘క్లైమెట్ చేంజ్ ఇన్ ఇంజనీరింగ్’ అంశానికి సంబంధించి అనూష చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు గానూ ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్’ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించింది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి ముంబైకి వచ్చింది అనూష. ఆ సమయంలో తన స్వస్థలం కశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇది అనూషను బాగా కదిలించింది. ‘విషాదం నుంచి కూడా నేర్చుకోదగినవి చాలా ఉంటాయి. ఇది అలాంటి విషాదమే’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనూష. ‘ముందుచూపు, ముందు జాగ్రత్త ఉన్న వాళ్ల వైపే అదృష్టం మొగ్గు చూపుతుంది’ అనేది అనూష షాకు బాగా ఇష్టమైన మాట. ‘మన వల్ల ఏమవుతుంది అనే భావన కంటే ఔట్ ఆఫ్ బాక్స్‌లో ఆలోచించి, ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఎక్కువ మేలు జరుగుతుంది. సంకల్పబలం ఉన్న చోట అద్భుతమైన ఫలితాలు వస్తాయి’ అనేది ఆమె బలంగా చెప్పే మాట. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
షేక్స్పియరే తన పవర్
‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు. వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్ ఇండియా’ పుస్తకం. ఫ్రొఫెసర్ నందిని దాస్ రాసిన ‘కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్–2023 గెలుచుకుంది... ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్‌కు షేక్స్పియర్ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి. అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో నందిని దాస్ ప్రొఫెసర్. షేక్స్పియర్ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్ ఇన్ షేక్స్పియర్ స్టడీస్’ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్‌షిప్‌పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్ రిసెర్చ్‌లోకి వచ్చింది. ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్ ఇండియా’ యూరోపియన్ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్ రాజకీయాలను ఆవిష్కరించింది. ‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్ అకాడమీ బుక్‌ప్రైజ్– ఛైర్ ఆఫ్ ది జ్యూరీ ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్. -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు?
ప్రపంచంలోని ప్రతి దేశానికి సొంత జాతీయ జెండా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జెండాలు ఇతర దేశాల జెండాలకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ జెండాలలో ఓ ప్రత్యేకత ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలకు ఒక మూలన బ్రిటిష్ జెండా కనిపిస్తుంది. ఈ విధంగా ఏ దేశ జాతీయ జెండా కూడా ఉండదు. మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జెండాలు ఎందుకు ఇలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాల మూలన యూనియన్ జాక్ ఎందుకు కనిపిస్తుందంటే..ఈ రెండు దేశాలు బ్రిటిష్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. ఇవి బ్రిటిష్ కామన్వెల్త్ దేశంలో భాగంగా ఉన్నాయి. యూనియన్ జాక్ దీనికి చిహ్నంగా నిలుస్తుంది. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. యూనియన్ జాక్ అనేది న్యూజిలాండ్ చారిత్రక పునాదిని గుర్తిస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ జెండాలో ఆరు తెల్లని నక్షత్రాలు ఉన్నాయి. న్యూజిలాండ్ జెండాలో నాలుగు ఎరుపు నక్షత్రాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని యూనియన్ జాక్‌ను మొదటిసారిగా 1770, ఏప్రిల్ 29న కెప్టెన్ కుక్ స్టింగ్రే హార్బర్లో ఎగురవేశారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలు బ్రిటన్ను పోలివుంటాయి. ఇది కూడా చదవండి: చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది? -
వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?
ఈ డిజిటల్ ప్రపంచంలో దేని గురించి అయినా సమాచారం కావాంటే వెంటనే గూగుల్‌లో సర్చ్ చేస్తాం. ఔనా! వెంటనే ముందుగా వికీపీడియా ఆ తర్వాత మిగతా సైట్ల నుంచి దానికి సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తాయి. కానీ వికీపీడియా ప్రతిదాని గురించి సమాచారం ఇచ్చింది గానీ మహిళా శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను చాలా తక్కువగానే అందించింది. ఆ లోటు భర్తి చేసేలా మహిళా శాస్రవేత్తలు బయోగ్రఫీని వికీపీడియాలో ఉంచి అందరికీ తెలిసిలే చేసింది. ఈ రంగంలో మహిళలు ఎక్కువమంది వచ్చేలా ఇన్ఫర్మేషన్ ఉంచింది ఓ మహిళా. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరామె? ఎలా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించింది? బ్రిటన్‌కి చెందిన జెస్సికా వేడ్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో భౌతిక శాస్త్ర విభాగం మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత అందులోనే పీహెచ్డీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు మహిళలు పీహెచ్డీ దాక వచ్చే వాళ్లే అరుదని అర్థమైంది. ఆ తర్వాత ఆమె భౌతిక శాస్త్రవేత్తగా, టెలివిజన్లు, సోలార్ ప్యానెల్లు వంటి ఆప్టికల్ ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా పనిచేసేలా కార్బన్-ఆధారిత సెమీ-కండక్టర్లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తుంది. తన పరిశోధనలకు సంబంధించి 15 మంది విస్తృత బృందంలో ఓ ఐదుగురు వ్యక్తుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుండగా అందులో తన తోపాటు మరొక మహిళా శాస్త్రవేత్త తప్పించి మిగతా అంతా పురుషులే. అప్పుడే ఆమెకు అస్సలు మహిళా శాస్త్రవేత్తలు ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న మెదిలింది. దీనికి తోడు వికీపీడియాలో కూడా మహిళా శాస్త్రవేత్తల గురించి ఆశించినంత స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతగా లేకపోవడం ఆమెను బాధించింది. అసలు దీనికి ప్రధాన కారణంగా తల్లిదండ్రలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే ఏదో రకంగా డిగ్రీ సంపాదించి సెటిల్ అయితే చాలనుకుంటారు. పైగా వారే ఈ రంగంలోకి రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు గమనించింది. ఆ జిజ్క్షాశ జెస్సికాను మహిళా శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్ని వికీపీడియాలో ఉంచే ప్రాజెక్టును చేపట్టాలే చేసింది. ఇలా సుమారు వెయ్యికిపైగా మహిళా శాస్త్రవేత్తల ప్రొఫెల్స్‌ను అందించింది. ఇప్పటి వరకు ఆమె స్వయంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) తదితన నేపథ్యాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా శాస్త్రవేత్తలే కాకుండా ఉనికిలో లేని మహిళా శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోగ్రఫీని కూడా ఉంచింది. సైన్సు వంటి రంగాల్లో మహిళలు లేరంటూ గగ్గోలు పెట్టడం కాదు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించి వారిని ఆన్లైన్లో కనపడేలా చేయాలి. దీన్ని చూసైనా యువత ఈ రంగాల్లో రావడానికి ఆయా మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా ఎంచుకోవచ్చు లేదా అందుకు దోహదపడొచ్చు అనే లక్ష్యంతోనే ఇలా శోధించి మరీ రాస్తున్నాను అని చెప్పుకొచ్చింది జెస్సికా. ఒక్కో ప్రొఫైల్ అందించాలంటే కొన్ని గంటల సమయం పడుతున్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఎజెండాతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపింది. ఈ కృషికిగాను జెస్సికాను వికీపీడియా ఎన్నో అవార్డులు, పతకాలతో సత్కరించింది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమరవీరులు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వీరేకాదు షాజహాన్‌పూర్ చీమలు కూడా బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు యుద్ధం చేసి, విజయం సాధించాయి. ఈ ఘటన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ సమయంలో జరిగింది. చీమల దండు జరిపిన దాడి కారణంగా బ్రిటీషర్లు షాజహాన్పూర్లో స్థాపించిన కేరు అండ్ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా రచించిన ‘షాజహాన్‌పూర్ కా ఇతిహాస్ 1857’ పుస్తకంలోని వివరాల ప్రకారం బ్రిటీష్ వారు 1805లో కాన్పూర్‌లో కేరు అండ్ కంపెనీని తొలిసారిగా స్థాపించారు. దానిలో క్రిస్టల్ షుగర్, స్పిరిట్, రమ్ తయారు చేసేవారు. ఈ ఉత్పత్తులను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. కాన్పూర్‌లో ఈ వ్యాపారం విజయవంతం కావడంతో బ్రిటీషర్లు 1811లో షాజహాన్‌పూర్‌లోని రామగంగా సమీపంలో మరో యూనిట్ ఏర్పాటు చేశారు. 1834లో బ్రిటీషర్లు.. రౌసర్ కోఠి వద్ద మరో యూనిట్‌ను స్థాపించారు. షాజహాన్‌పూర్‌లోని రౌజర్ కోఠి ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో చెరకు సాగయ్యేది. దీనికితోడు గర్రా, ఖన్నాత్ నదుల నుండి వాణిజ్యానికి నౌకాయాన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి. 1857లో విప్లవ తిరుగుబాటు సమయంలో విప్లవకారులు ఫ్యాక్టరీని కొల్లగొట్టి, తగలబెట్టారని డాక్టర్ వికాస్ ఖురానా తెలిపారు. ఈ నేపధ్యంలో కంపెనీ యజమాని జీబీ కెరు ఇక్కడ నుండి తప్పించుకొని మిథౌలీ రాజు సహాయంతో లక్నోకు తరలివెళ్లిపోయాడు. అక్కడ అతను హత్యకు గురయ్యాడు. తిరుగుబాటు ఆందోళనల తర్వాత ఫ్యాక్టరీ పునఃప్రారంభించారు. వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. అయితే ఆ సమయంలో చీమలు ఆ కంపెనీపై దాడి చేశాయని చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా, సాహితీవేత్త సుశీల్ తెలిపారు చెప్పారు. కాగా చీమలను తరిమికొట్టేందుకు కంపెనీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. అయితే ఆ ప్రయత్నాలు వృథాగా మారాయి. చివరికి బ్రిటీషర్లు కెరుగంజ్లో కంపెనీ పనులను నిలిపివేయవలసి వచ్చింది. కాగా కంపెనీ ఇక్కడ భారీ మార్కెట్‌ను సృష్టించిందని డాక్టర్ ఖురానా తెలిపారు. నేటికీ షాజహాన్‌పూర్‌లోని కెరుగంజ్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి, వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు
జెరూసలేం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి దాడి అంశంలో ఇజ్రాయెల్ వాదనకు మద్దతు తెలిపారు. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చిన్నాభిన్నమైన గాజాకు ఆహారం, నీటిని రాఫా సరిహద్దు గుండా సరఫరా చేయడానికి అనుమతించారు. గాజాలో ఆస్పత్రిపై రాకెట్ దాడులు జరిపింది హమాస్ దళాల పనే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బహిర్గతం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వాదనలకు అమెరికా మద్దతుగా నిలిచింది. అటు.. గాజా ఆక్రమణ దిశగా ఇజ్రాయెల్ ఆలోచన సరైంది కాదని తెలుపుతూనే యుద్ధంలో కాల్పుల విరమణ వైపు ఆలోచించాలని అమెరికా కోరింది. ఆ తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మంది మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇదీ చదవండి: బైడెన్ చొరవ.. ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్.. గాజాకి అందనున్న మానవతా సాయం -
బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? ప్రధాని రిషి సునాక్ ప్లాన్ ఏమిటి?
బ్రిటన్ కొత్త ప్రతిపాదిత చట్టం ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాలలో బ్రిటన్‌లో ధూమపానం సమర్థవంతంగా నిర్మూలనకానుంది. 2040 నాటికి బ్రిటన్ ‘పొగ రహిత’ దేశంగా మారుతుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ తర్వాత రాబోయే తరం ధూమపానం చేయకుండా నిరోధించడానికి చట్టం చేసిన రెండవ దేశం బ్రిటన్. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది. ధూమపానం కారణంగా లెక్కలేనంతమంది క్యాన్సర్‌తోపాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2040 నాటికి దేశాన్ని ధూమపాన రహితంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం బ్రిటన్‌లో కొత్త చట్టాలను రూపొందించడంపై చర్చ జరుగుతోంది. బ్రిటీష్ వయోజనులలో 12.9 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. 8.7 శాతం మంది ప్రతిరోజూ ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారు. నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా 2075 నాటికి 1.7 మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. యూకేలో అమలుకానున్న కొత్త చట్టం జనవరి 1, 2009న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు. ప్రస్తుతం ధూమపానం చేసే వయస్సు 18 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయస్సును పెంచడం అనేది సమీక్ష ముఖ్య సిఫార్సులలో ఒకటి. ధూమపానం అనేది గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అంగస్తంభన, గర్భస్రావం వంటి 50 అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం సంవత్సరానికి 76,000 మందిని పొట్టనపెట్టుకుంటోంది. కేఫ్‌లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ధూమపానాన్ని నిషేధించిన ఏకైక దేశం న్యూజిలాండ్. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా న్యూజిలాండ్ తరహాలో దేశంలో ధూమపానాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? -
గాంధీ హత్యకు బ్రిటీష్ అధికారి కుట్ర? ఒక వంటవాడు ఎలా భగ్నం చేశాడు?
అది 1917.. బీహార్‌లోని బెట్టియా జిల్లా గౌనాహాలోని పర్సౌని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం చరిత్ర తెలిసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్ముని ప్రాణాలను కాపాడిన ఆ దేశభక్తుని పేరు బత్తక్ మియా. ఆయన బ్రిటీష్ వారి కుట్రను భగ్నం చేసి, జాతిపిత ప్రాణాలను కాపాడారు. నేడు ఆ దేశభక్తుని మూడవతరం వారు కటికపేదరికంలో జీవించవలసి వస్తున్నది. వారి కుటుంబం మరో రాష్ట్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకునే దీనపరిస్థితి నెలకొంది. కాగా గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు గాను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. బత్తక్ మియా పేరిట అందించిన రివార్డు కూడా వీరి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందలేదు. 1917లో మోతీహరిలో ఉంటున్న బ్రిటిష్ ఇండిగో ఫ్యాక్టరీ మేనేజర్ ఇర్విన్.. మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడు. గాంధీజీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు అందించే పాలలో విషం కలపాలని ఇర్విన్ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో బత్తక్ మియా.. ఇర్విన్ దగ్గర వంటవానిగా పనిచేసేవాడు. బత్తక్ మియా మనుమడు కలాం అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం అతను తన తాతను చూడలేకపోయినప్పటికీ, అతని తండ్రి జాన్ అన్సారీ తెలిపిన వివరాలను గుర్తుచేసుకున్నాడు. గాంధీజీ 1917లో చంపారన్‌కు వచ్చినప్పుడు, ఒక బ్రిటిష్ అధికారి.. గాంధీజీకి పాలలో విషం ఇవ్వాలని బత్తక్ మియాను ఆదేశించాడు. అయితే ఆ అధికారి బెదిరింపులకు బత్తక్ మియా లొంగలేదు. అయినా ఆ అధికారి పట్టువీడక బత్తక్ మియాను విషం కలిపిన పాలతో గాంధీ వద్దకు పంపించాడు. బత్తక్ మియా.. మహాత్మాగాంధీకి పాలు ఇస్తూ.. అందులో విషం ఉందని చెప్పడంతో గాంధీజీ వాటిని తాగకుండా పారేశారు. ఆ తర్వాత ఒక పిల్లి ఆ పాలు తాగి చనిపోయింది.ఈ సంఘటనకు నాటి స్వాతంత్ర్య సమరయోధుడు రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరికొందరు సాక్షులగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత బత్తక్ మియాను ఆ బ్రిటీష్ అధికారి జైలుకు పంపించాడు. దీనితోపాలు అతనికి చెందిన 5 గేదెలతో పాటు పలు భూములను వేలం వేసి విక్రయించాడు. దీంతో బత్తక్ మియా ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. 1950లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మోతీహరి వచ్చినప్పుడు బత్తక్ మియాకు 24 ఎకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అతనికి కేటాయించిన భూమిని తదనంతర కాలంలో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బత్తక్ మియా వారసులు అత్యంత దీనస్థినతిలో బతుకువెళ్లదీస్తున్నారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
లాహోర్ భారత్‌లో భాగం.. అయినా పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు?
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే దీనికిముందే భారత్, పాకిస్తాన్ విభజనకు సన్నాహాలు మొదలయ్యాయి. 1937, ఆగష్టు 3న లార్డ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్య ప్రణాళికను సమర్పిస్తూ, భారతదేశం స్వతంత్ర దేశం కానున్నదని, అలాగే దేశం రెండు భాగాలుగా విడిపోతుందని స్పష్టంగా తెలిపారు. లార్డ్ మౌంట్ బాటన్ అందించిన ప్రణాళికను జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా అంగీకరించారు. అయితే విభజనను అమలు చేయడం అంత సులభం కాలేదు. విభజన అంత సులభం కాలేదు భారతదేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, దేశంలోని ఏ భాగాన్ని భారతదేశంలో ఉంచాలి? పాకిస్తాన్‌కు ఏ ప్రాంతం ఇవ్వాలో నిర్ణయించడం కష్టంగా మారింది. పలు తర్జనభర్జనల తర్వాత మత ప్రాతిపదికన విభజన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ హిందూ-ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉన్న అనేక ప్రాంతాల విషయంలో విభజన అంత సులభం కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ విభజన బాధ్యతను సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే సిరిల్ రాడ్‌క్లిఫ్ గతంలో భారతదేశాన్ని సందర్శించలేదు. అలాగే భారతదేశలోని విభిన్న జనాభా గురించి అతనికి తెలియదు. సిరిల్ రాడ్‌క్లిఫ్ ఎవరు? రాడ్‌క్లిఫ్ వృత్తిరీత్యా న్యాయవాది. బ్రిటన్‌లోని వేల్స్ నివాసి. అతని తండ్రి ఆర్మీ కెప్టెన్. రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌లోని హాలీ బెర్రీ కాలేజీలో చదువుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువును పూర్తి చేసిన తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డాడు. ప్రముఖ కేసులను చేపట్టడం వలన బ్రిటన్‌లో పాపులర్ అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అతను సమాచార మంత్రిత్వ శాఖలో చేరాడు. 1941లో డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యాడు. 1945లో తిరిగి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. విభజన రేఖ ఎలా గీశారు? భారత స్వాతంత్ర్య చట్టం ఆమోదం పొందిన తరువాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య విభజనకు రేఖ గీసే బాధ్యత సిరిల్ రాడ్‌క్లిఫ్ చేతికి వచ్చింది. అతను రెండు సరిహద్దు కమిషన్లకు చైర్మన్‌గా నియమితుడయ్యాడు. అతనికి ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లిం లాయర్లు సహాయం అందించారు. 1947, జూలై 8 న సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశానికి చేరుకున్నాడు. 5 వారాల్లో విభజన రేఖను గీసే బాధ్యత అతనికి అప్పగించారు. జనాభా పరంగా బెంగాల్, పంజాబ్‌లను విభజించడం అంత సులభం కాలేదు. రెండు చోట్లా హిందూ-ముస్లిం జనాభా సమానంగా ఉండేది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ రాడ్‌క్లిఫ్ తన పనిని 12 ఆగస్టు 1947న పూర్తి చేశాడు. ఈ విభజన రేఖను అధికారికంగా 1947, ఆగస్టు 17న బహిరంగపరిచారు. దీనికి రాడ్‌క్లిఫ్ లైన్ అని పేరు పెట్టారు. లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు? హిందూ జనాభా ఎక్కువగా ఉన్న లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఇస్తారా లేదా అనే దానిపై చర్చ జరిగింది. ఒక ఇంటర్వ్యూలో సిరిల్ రాడ్‌క్లిఫ్ మాట్లాడుతూ విభజనకు సన్నాహక సమయంలో తాను లాహోర్‌ను భారతదేశంలోనే చేర్చానని, అయితే పాకిస్తాన్లో పెద్ద నగరం లేదని గమనించి, లాహోర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ విధంగా లాహోర్ స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజుల వరకూ భారతదేశంలో భాగంగా ఉంది. తరువాత అధికారిక ప్రకటనతో అది పాకిస్తాన్లో చేరింది. సరిహద్దును పరిష్కరించిన తర్వాత వలసలు ప్రారంభమయ్యాయి. భారతదేశం నుండి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్ నుండి భారతదేశానికి కోట్ల మంది ప్రజలు తరలివెళ్లారు. విభజన తర్వాత రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత ఎప్పుడూ భారతదేశానికి రాలేదు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు. నిజానికి దీనిని ముద్రించి, విడుదల చేసినప్పుడు దీని ఖరీదు ఒక సెంటు (నాలుగు పైసలు) మాత్రమే! ఇప్పుడు దీని ధర ఏకంగా 8.5 మిలియన్ డాలర్లు (రూ.70.33 కోట్లు). అవాక్కయ్యారా? దీని ప్రాచీనత కారణంగానే ఇప్పుడు దీనికి ఇంత రేటు పలుకుతోంది. బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు 1856 నాటిది. బరువు ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు. ఈ స్టాంపు బరువు 40 మిల్లీగ్రాములు. ఇదే బరువు గల నాణ్యమైన వజ్రం ధర దాదాపు 700 డాలర్లు (రూ.58 వేలు). ఇదే బరువు గల ఖరీదైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీ ధర దాదాపు 5000 డాలర్లు (రరూ.4.13 లక్షలు). ఈ లెక్కన బ్రిటిష్ గయానాకు చెందిన ఈ ఒక సెంటు తపాలా స్టాంపు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ స్టాంపు ఇప్పటి వరకు తొమ్మిదిమంది యజమానుల చేతులు మారింది. ఇటీవల జరిగిన వేలంలో స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ దీనిని సొంతం చేసుకుంది. (చదవండి: చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు) -
సెప్టెంబర్ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం
సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్, బీజేపీ తరపును విద్యాసాగర్‌రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి. BRS : పునరుజ్జీవనం : ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది. ‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు. చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్’ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్‌కు 2015 జూన్ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం. కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్‌ను కొల్లాపూర్ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్ ప్రజలకి అంకితం చేస్తున్నారు. నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్‌లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది. నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్ - వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు ------------- BJP : విమోచనం : హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది. హైదరాబాద్ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం. ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్ ఖాన్ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్ ఖాన్‌ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్ అండమాన్ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్ పట్టణంలో మఱి -
ప్రిన్సెస్ డయానా స్వెటర్ ధర రూ. 9.14 కోట్లు
లండన్: దివంగత బ్రిటిష్ యువరాణి డయానా ధరించిన స్వెటర్ ఒకటి వేలంలో రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు పలికింది. రాజ కుటుంబానికి చెందిన వస్తువుకు అంచనాకు మించి ఇంతటి ధర పలకడం ఇదే మొదటిసారి. ప్రముఖ సోథ్‌బీ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రూ.9,14,58,510కి ఈ స్వెటర్‌ను సొంతం చేసుకున్నారు. గురువారం ఆఖరి రోజు చివరి 15 నిమిషాల వరకు ఈ స్వెటర్‌కు అత్యధికంగా 1.90 లక్షల డాలర్ల వరకు పలికింది. చివరి నిమిషాల్లో ఒక్కసారిగా 11 లక్షల డాలర్లకు బిడ్ వేశారని సోథ్‌బీ తెలిపింది. జనవరిలో సోథ్‌బీ సంస్థ నిర్వహించిన డయానా ధరించిన బాల్ గౌన్ సైతం రూ.5 కోట్లకు పైగా పలకడం గమనార్హం. -
బ్రిటిష్ వారు 'తెలుగు భాష'కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం. ఆ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చెయ్యం. ఆ భాషకు మహోన్నత స్థానం ఇచ్చేలా చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. కనీసం నాటి కవులను తలుచుకోం. పోనీ}.. తెలుగు మాష్టర్లని గౌరవిస్తామా అంటే లేదు వారంటే చులకన!. కానీ అవకాశం వస్తే మాత్రం తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టేస్తాం. మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటిష్ వాళ్లే నయం. పరాయి వాళ్లైన మన భాషకు ఇచ్చిన విలువ చూసైనా సిగ్గుపడతారేమో చూద్దాం. ఇంతకీ వాళ్లు మన భాషకు ఎలా పట్టం కట్టారో తెలుసా..! మన నాణెం పై తెలుగు భాష. (బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య” ను సభ దృష్టికి తెచ్చారు. "పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు ఎగతాళిగా! వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ అండ్ తెలుగులోనూ ‘ఒక అణా‘ అని రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారత దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "నాణెంపై తెలుగుభాషలో 'ఒక-అణా' అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?" అంటూ చురక వేశారు. గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కాని వారు కూడా ఆశ్చర్య పోయారు. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు?
జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కలుసుకున్నారు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని మోదీని యువరాజు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌ను ఎవరు నిర్మించారో తెలుసా? సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో సుమారు 560 సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానానికి వాటి రాజులు, రాచరిక రాష్ట్రాలు, నవాబులు, నిజాంలు ఉండేవారు. నాటి రోజుల్లో స్థానికుల సమస్యలను వినేందుకు, వారితో సమన్వయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1920లో 'ది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్'ను ప్రారంభించింది. ఈ ఛాంబర్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుండేవి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే వారికి తగినట్లు అక్కడ సరైన ఏర్పాట్లు ఉండేవి కాదు. ఎకరా భూమి రూ.5000 చొప్పున కొనుగోలు ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానానికి నిజాంగా ఉండేవాడు. ఆయన ఢిల్లీలో తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో భూమి కోసం అన్వేషణ ప్రారంభించారు. వైస్రాయ్ హౌస్ (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్) సమీపంలోని 8.2 ఎకరాల స్థలాన్ని నిజాం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి కొద్దిగా తక్కువగా ఉందని భావించి, దానికి ఆనుకునివున్న ఓ భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లో నిజాం ఈ భూమిని ఎకరా రూ.5000 చొప్పున కొనుగోలు చేశారు. ‘వైస్రాయ్ హౌస్’ను పోలివుండేలా.. భూమిని కొనుగోలు చేసిన తర్వాత భవన నిర్మాణ మ్యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని బాధ్యతను నిజాం.. నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్‌కు అప్పగించారు. లుటియన్స్ ‘హైదరాబాద్ హౌస్’ కోసం ‘సీతాకోకచిలుక’ ఆకారంలో డిజైన్‌ను సిద్ధం చేశారు, ఇది దాదాపు ‘వైస్రాయ్ హౌస్’ను పోలి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం ‘హైదరాబాద్ హౌస్’కు తొలుత రూ.26 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచారు. ఆ రోజుల్లో బర్మా (ప్రస్తుతం మయన్మార్)కు చెందిన టేకు చెక్క నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. నిజాం ఈ భవన నిర్మాణానికి అవసరమైన కలపను అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు,ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి ఆర్డర్ చేశారు. ఇంటీరియర్ డెకరేషన్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు ఆ రోజుల్లో, లండన్‌లోని హాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్, వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన సంస్థలు. నిజాం ఈ రెండు కంపెనీలకు ‘హైదరాబాద్ హౌస్’ను అలంకరించే బాధ్యతను అప్పగించారు. అలంకారానికి లోటు రాకుండా ఉండేందుకు 1921లో ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులందరి నుంచి దాదాపు 17 పెయింటింగ్స్‌కు ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ పెయింటిగ్స్ ధర రూ.10,000 నుండి 20,000 వరకు ఉండేది. లాహోర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహ్మాన్ చుగ్తాయ్ తీర్చిదిద్దిన 30 పెయింటింగ్‌లను కూడా ఆర్డర్ చేశారు. వాటి విలువ రూ. 12,000. 'హైదరాబాద్ హౌస్' కోసం కార్పెట్లను ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించారు. నిజాం హోదాకు తగినవిధంగా ఉండేలా ఒకేసారి 500 మంది అతిథులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వెండి ప్లేట్లు, కత్తులు, ఇతర వస్తువులను ఆర్డర్ చేశారు. భవనాన్ని చూసిన నిజాం ఏమన్నారు? 1928 నాటికి ‘హైదరాబాద్ హౌస్’ పూర్తయింది. యూరోపియన్, మొఘల్ శైలిలో నిర్మితమైన ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. అందులో నాలుగు గదులు ‘జనానా’ అంటే మహిళలకు సంబంధించినవి. దాదాపు 10 ఏళ్లకు పూర్తయిన ఈ ‘హైదరాబాద్ హౌస్’లోకి అడుగుపెట్టినప్పుడు నిజాం ఎంతో బాధపడ్డారుట. నిజాంకు ఈ ‘హైదరాబాద్ హౌస్’ అస్సలు నచ్చక దానిని ‘గుర్రపుశాల’తో పోల్చారు. రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ‘హైదరాబాద్ హౌస్’ అనేది కొన్ని చౌక భవనాల కాపీ మాత్రమే అని నిజాం పేర్కొన్నారట. ‘హైదరాబాద్ హౌస్’ ఇప్పుడు ఎవరిది? స్వాతంత్ర్యం సిద్ధించాక సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘హైదరాబాద్ హౌస్’ని లీజుకు తీసుకుంది. ఇందుకు ప్రతిగా 1970ల వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తూ వచ్చింది. అనంతరం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం, రాష్ట్ర మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో ‘హైదరాబాద్ హౌస్’ కేంద్రానికి సొంతమయ్యింది. ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హౌస్‌ను పర్యవేక్షిస్తోంది. -
దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది?
1947లో భారతదేశ స్వాతంత్ర్య ప్రక్రియలో మనదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కీలకపాత్ర పోషించారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి, జూన్ 1948 లోపు ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చేలా దేశంలో అధికార మార్పిడి ప్రక్రియను నిర్ధారించడానికి 1947 ఫిబ్రవరిలో లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి పంపించారు. ఈ నేపధ్యంలో దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్రణాళికను రూపొందించారు. అయితే దేశ విభజనకు లార్డ్ మౌంట్ బాటన్ ఎంతవరకు కారణమనే ప్రశ్న కొందరు మేథావులలో తలెత్తెతుంటుంది. మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే.. మౌంట్‌బాటన్ 1900, జూన్ 25న విండ్సర్‌లో జన్మించారు. బ్రిటీష్ నావికాదళంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. అతనికి బ్రిటిష్ రాజకుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే భారతదేశ విభజనకు పునాది పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు భారీ నష్టాలను చవిచూశారు. యుద్ధం ముగిసే సమయానికి వారు భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అనేక ప్రణాళికలు రూపొందించారు. వీటిలో వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్లు భారతదేశంలో తిరస్కరణకు గురయ్యాయి. భారతదేశంలో హిందూ-ముస్లిం విభజన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే తీవ్రమైంది. ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్‌లోని నూతన బ్రిటిష్ ప్రభుత్వం 1947, ఫిబ్రవరి 20న లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి కొత్త వైస్రాయ్గా నియమించింది. విభజనను వీలైనంత వరకు అడ్డుకోవాలని మౌంట్ బాటన్‌కు బ్రిటీష్ ప్రభుత్వం సూచించింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే స్వేచ్ఛ కూడా అతనికి అప్పగించారు. అయితే 1948 జూన్ నాటికి, బ్రిటిష్ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మౌంట్ బాటన్ 1947, మార్చి 22న భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు తలెత్తాయి. భారత్‌లో ఉన్నామా?.. పాకిస్తాన్లో ఉన్నామా? పరిస్థితులకు అనుగుణంగా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం జరిగితే, అంతర్యుద్ధం చెలరేగవచ్చునని మౌంట్ బాటన్ గ్రహించారు. విభజన లేకుండా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని తొలుత మౌంట్ బాటన్ అనుకున్నారు. కానీ ముస్లిం లీగ్ పట్టుదల కారణంగా మౌంట్ బాటన్ విభజన నిబంధనతో 1047 జూన్ 3 ప్రణాళికను సమర్పించవలసి వచ్చింది. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టడానికి తొందరపడ్డారని, ఇందుకు మౌంట్ బాటన్ ఉద్దేశాలు కారణమని చెబుతుంటారు. మౌంట్ బాటన్ ప్రతిపాదన ప్రకారం, బ్రిటీష్ పార్లమెంట్ 1947 జూలై 4న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా ఆగస్టు 15ని నిర్ణయించింది. దీనితోపాటు భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించి, ఆగస్టు 17న లైన్ ప్రకటించారు. అప్పటి వరకు సరిహద్దుకు ఇరువైపున గల ప్రజలు భారత్‌లో ఉన్నామా, లేక పాకిస్తాన్లో ఉన్నామా అనేది తెలియని స్థితిలో ఉన్నారు. ఈ కారణంగా తలెత్తిన అల్లర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదిఏమైనప్పటికీ మౌంట్‌బాటన్ విభజన విషాదాన్ని తగ్గించారా లేదా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇది కూడా చదవండి: చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది? -
ఆర్యవర్త, భరతవర్ష, ఇండియా.. ఈ పేర్లు ఎలా వచ్చాయి? ‘సిం’ని ‘హిం’ అని ఎవరన్నారు?
మన దేశాన్ని ఇండియా అని పిలవాలా లేక భారతదేశం అనాలా అనే విషయంపై అటు రాజకీయ పార్టీల మధ్య, ఇటు ప్రజల మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగంలో ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, వివిధ క్రీడలు, ప్రపంచ వేదికలపై ఇండియా అనే పేరు ప్రబలంగా ఉంది. అయితే మన దేశాన్ని వివిధ కాలాల్లో పలు పేర్లతో సంబోధించేవారనే విషయం మీకు తెలుసా? వీటిలో జంబూద్వీపం, ఆర్యవర్త, భరతవర్ష, హింద్, హిందుస్థాన్ మొదలైనవి అత్యంత ప్రాచుర్యం పొందిన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు వచ్చాయి? ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్యవర్త ఆర్యులు మన దేశాన్ని స్థాపించారని చెబుతారు. ఆర్య అంటే ఉత్తమమైనది. ఈ ప్రాంతంలో ఆర్యుల నివాసం ఏర్పరుచుకున్న కారణంగా మన దేశానికి ఆర్యవర్త అని పేరు వచ్చింది. ఆర్యవర్త సరిహద్దులు కాబూల్‌లోని కుంభా నది నుండి భారతదేశంలోని గంగా నది వరకు, అలానే కశ్మీర్ మైదానాల నుండి నర్మదా నది ఆవలి వైపు వరకు విస్తరించి ఉన్నాయి. ఆర్యుల నివాసానికి సంబంధించి పలువురు చరిత్రకారులలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జంబూద్వీపం మన దేశాన్ని పూర్వకాలంలో జంబూద్వీపం అని కూడా పిలిచేవారు. భారతదేశంలో జామున్(నేరేడు) చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు. అదేవిధంగా జంబూ చెట్టు.. ఏనుగంత పరిమాణంలో భారీ ఫలాలను ఇస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ పండ్లు పర్వతం మీద పడినప్పుడు వాటి రసం నుండి నది ఏర్పడిందని చెబుతారు. ఈ నది ఒడ్డున ఉన్న భూమిని జంబూద్వీపం అని పిలవసాగారు. భరతవర్ష మన భూభాగం పేరు ఎంతో ప్రజాదరణ పొందింది. మహారాజు దుష్యంతుడు, శకుంతల దంపతుల కుమారుడైన భరతుని పేరు మీదుగా దేశానికి భారత్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అదేవిధంగా గురువు రిషభదేవుడు తన రాజ్యాన్ని తన కొడుకు భరతునికి అప్పగించాడని, అందుకే మన దేశానికి భరతవర్ష అని పేరు వచ్చిందని అంటారు. దశరథుని కుమారుడు, శ్రీరాముని సోదరుడు భరతుని ప్రస్తావన కూడా ఇదేవిధంగా కనిపిస్తుంది. అలాగే నాట్యశాస్త్రంలో కూడా భరతముని ప్రస్తావన ఉంది. దేశానికి ఆయన పేరు పెట్టారని కూడా అంటారు. పురాణాలలో కూడా భారతదేశ సరిహద్దులు సముద్రానికి ఉత్తరం నుండి హిమాలయాల దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. హిందుస్థాన్ పురాతన కాలంలో భారతదేశంలోని సింధు లోయ నాగరికత ఇరాన్, ఈజిప్ట్‌తో వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉంది. ఇరానియన్లో ‘సిం’ని ‘హిం’ అని సంబోధించారట. ఫలితంగా సింధు కాస్తా హిందూగా మారిందని అంటారు. తరువాతి కాలంలో ఈ భూమి హింద్ పేరుతో ప్రసిద్ధి చెంది, చివరికి హిందువులుంటున్న ప్రదేశం కనుక హిందుస్థాన్ అయ్యిందని చెబుతారు. భారతదేశం మన దేశానికి ఈ పేరు బ్రిటిష్ వారు పెట్టారని అంటారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు సింధు లోయను తొలుత ఇండస్ వ్యాలీ అని పిలిచేవారు. దీనితో పాటు భారత్ లేదా హిందుస్థాన్ అనే పదానికి బదులుగా ఇండియా అనే పదాన్ని ఉపయోగించసాగారు. అది వారికి పలికేందుకు చాలా సులభంగా అనిపించిందట. చాలామంది ఇండియా అనేది బ్రిటిష్ యుగానికి చిహ్నమని, అందుకే ఈ పేరులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. ఇది కూడా చదవండి: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? -
ఇది దేనికి సంకేతం?
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న మోదీ సర్కారు అతి త్వరలో మన దేశం పేరును కూడా భారత్‌గా మార్చే ఆలోచనలో ఉందా? జీ 20 దేశాధినేతలకు తాజాగా కేంద్రం లాంఛనంగా పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి హోదాను ఇంగ్లీష్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశం పేరు మార్పు దిశగా కేంద్రం నుంచి త్వరలో రానున్న ప్రకటనకు ఇది కచ్చితమైన ముందస్తు సంకేతమేనని అనుమానిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి జీ 20 దేశాధినేతలకు పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం పేర్కొనడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. కానీ మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న చర్చ నిజానికి చాలాకాలంగా జరుగుతున్నదే... కేంద్రంలో మోదీ సారథ్యంలోని – బీజేపీ సర్కారు కూడా దీన్ని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తూనే వచ్చింది, వస్తోంది. బ్రిటిష్ వలస వాసనలను సమూలంగా వదిలించుకోవాల్సిందేనని పదేపదే చెబుతోంది. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోంది. 150 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ వంటి బ్రిటిష్ జమానా నాటి పేర్లకు భారత్ పేరు చేరుస్తూ తీసుకున్న తాజా నిర్ణయం అలాంటిదే. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లులు ప్రవేశపెడుతూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న మోదీ సర్కారు, మెజారిటీ ఓటర్ల భావోద్వేగాలతో ముడిపడ్డ ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని పరిశీలకులు అప్పుడే అభిప్రాయపడ్డారు. ఆ అంచనాలు సత్య దూరం కాదనేందుకు తాజా ’ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ ఆహ్వానాలే నిదర్శనమని భావిస్తున్నారు. ఒకటో అధికరణాన్నే మార్చేయాలి! ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని తొలి అధికరణే మన దేశాన్ని ’ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్య’ అని స్పష్టంగా పేర్కొంటోంది. అంటే, ఇండియా, భారత్ రెండింటినీ మన దేశ అధికారిక నామాలుగా ఒకటో అధికరణే గుర్తిస్తోందన్నది ఇక్కడ ఆసక్తికర అంశం. ఇప్పుడు వాటిలోంచి ఇండియాను తొలగిస్తూ, భారత్‌ను మాత్రమే ఏకైక అధికారిక నామంగా గుర్తించాలని కేంద్రం భావిస్తోందా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. అలా జరగాలంటే ఆ మేరకు ఒకటో అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది. నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు ‘భారతా? ఇండియానా? మన దేశాన్ని భారత్ అని పిలుచుకుంటారా? భేషుగ్గా పిలుచుకోండి.అదే సమయంలో ఎవరన్నా ఇండియా అని పిలవాలని అనుకుంటే అలాగే పిలవనివ్వండి‘– 2016లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్య గట్టిగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న యోచనను సుప్రీంకోర్టు గట్టిగా వ్యతిరేకించడం విశేషం. ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్‌ను నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టింది. 2020లో కూడా ఇలాంటి మరో పిల్‌ను తిరస్కరించింది. దాన్ని విజ్ఞాపనగా మార్చి సరైన నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నాటి సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సూచించారు. జంబూ ద్వీపం నుంచి ఇండియా దాకా.. అతి ప్రాచీనమని భావించే జంబూ ద్వీపం మొదలుకుని భారత్, హిందూస్తాన్ నుంచి ఇండియా దాకా. ఎన్నో, మరెన్నో పేర్లు. మన దేశానికి ఉన్నన్ని పేర్లు ప్రపంచంలో మరే దేశానికీ లేవేమో! ఇంగ్లీష్ వాడకంలో మన దేశాన్ని ఇండియా అని, స్థానికులు భారత్ అని అంటారు. పాలక వర్గం ఇండియా అని, పాలిత (సామాన్య) వర్గం భారత్ అని అంటారు. జంబూ ద్వీపం పురాణాలు, ప్రాచీన గ్రంథాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అన్నారు. జంబూ అంటే నేరేడు పండు. అప్పట్లో మన దేశంలో ఆ చెట్లు విస్తారంగా ఉండేవి గనుక ఆ పేరు వచ్చిందని అంటారు. నాటి మన సువిశాల దేశపు ఆకృతి కూడా నేరేడు ఫలం మాదిరే ఉండేదని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ కూడా మన దేశాన్ని అదే పేరుతో ప్రస్తావించడం విశేషం. ‘జంబూ ద్వీపం ఉత్తరాన విశాలంగా, దక్షిణాన సన్నగా ఉంటుంది. అక్కడి ప్రజల ముఖాలు అలాగే ఉంటాయి‘ అని తన యాత్రా చరిత్రలో రాసుకొచ్చాడు. హిందూస్తాన్, ఇండియా బ్రిటిష్ వలస పాలన దాకా మనకు హిందూస్తాన్ అనే పేరు వాడుకలో ఉండేది. తర్వాత బ్రిటిష్ వారు మన దేశం పేరును ఇండియాగా మార్చారు. ఈ రెండు పేర్లూ సింధు నది నుంచి వచ్చి నట్టు చెబుతారు. నాటి భారత ఉప ఖండానికి సింధు నది సరిహద్దుగా ఉండేది. దానికి ఈవలి వైపున ఉన్న దేశం అనే అర్థంలో తొలుత తురుషు్కలు ముఖ్యంగా పర్షియన్లు మనను హిందూస్తాన్ అని పిలిచారు. సింధులో ‘స’ అక్షరాన్ని వాళ్లు ‘హ’గా పలుకుతారు గనుక అలా పేరు పెట్టారు. అలా సనాతన ధర్మం పేరు హిందూ మతంగా మారింది. భారత్ భరతుడనే పౌరాణిక చక్రవర్తి పేరిట మన దేశానికి భారత్ అని పేరు వచ్చి నట్టు ఐతిహ్యం. విశ్వామిత్రుడు, మేనక సంతానంగా పుట్టి ముని కన్యగా పెరిగిన శకుంతలకు, మహారాజు దుష్యంతునికి పుట్టినవాడే భరతుడు. -
సాంకేతిక సమస్యతో యూకేలో నిలిచిన విమానాలు
లండన్: సాంకేతిక సమస్య కారణంగా యూకేకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి ఇతరదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో, వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో సమస్య ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో భద్రతా నిర్వహణ కోసం ట్రాఫిక్‌పై నియంత్రణలను విధించినట్లు యూకే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తెలిపింది. అయితే, సమస్యకు కారణం, ఎప్పటివరకు పరిష్కారమవుతుందనే విషయం సంస్థ తెలపలేదు. సమస్యను సాధ్యమైనంత త్వరంగా పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని తెలిపింది. యూకే గగనతలాన్ని మాత్రం మూసివేయలేదని స్పష్టతనిచ్చింది. -
కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి 240 బంగారు నాణేలు లభ్యమవగా వాటిని దొంగిలించిన ఆరోపణలపై ఒక ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పోలీసులను మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో కూలీలు రామ్‌కు భయ్‌డియా అతని మేనకోడలు బవారి తవ్వకాలు చేస్తుండగా వారికి ఒక కాసుల మూట కనిపంచిందని.. చడీ చప్పుడు చేయకుండా ఆ మూటతో సహా గుజరాత్ సరిహద్దులో వారు నివాసముండే సోండ్వా గ్రామానికి చేరుకున్నారని.. వారు 20 నాణేలను తీసుకుని మిగిలినవాటిని వారి ఇంట్లోనే పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ నోటా ఈ నోటా వార్త చేరి మెల్లగా ఊరంతా వ్యాపించింది. ఇదే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు జులై 19న రామ్‌కు భయ్‌డియా ఇంటికి చేరుకున్నారని గ్రామస్తులు తెలపగా నిధిని తవ్వించి మొత్తంగా వారి వద్ద నుండి మొత్తం 239 నాణేలను లాక్కుని తమకి ఒకే ఒక్క నాణెం ఇచ్చారని రామ్‌కు తెలిపాడు. ఆ మరుసటి రోజే రామ్‌కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరి ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం తతంగంలో ఇప్పటికింకా ఆ బంగారు నాణేల ఆచూకీ తెలియకపోవడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య -
రిషి సునాక్‌పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ
లండన్: బ్రిటిష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ప్రధాని రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా చేసినప్పుడే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంది కానీ అప్పుడు ఆమె రాజీనామా చేయనందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేసిన ఆమె రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారీ లేఖను రాశారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితురాలైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నాడైన్ డోరీస్ చాలా కాలంగా రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రధాని జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయనకు ఎటువంటి రాజకీయ ముందుచూపు లేదన్నారు. రిషి సునాక్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఆర్ధిక పరమైన కుంభకోణాలతో పాటు మరికొన్ని కుంభకోణాల కారణంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుండి తప్పుకున్నారు. మాజీ ఆర్ధిక మంత్రి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన రిషి సునాక్ పార్టీ నాయకత్వ పోటీలో నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి కావడంతో ప్రధానిగా నియమితులయ్యారు. ఎంపీ రాసిన రాజీనామా లేఖ సంగతి అటుంచితే రిషి సునాక్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వెంటిలేటర్‌పైనే ఉండాలి చెప్పాలి. కొద్దీ రోజుల క్రితం ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాలను కోల్పోగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన చోట మాత్రం గెలిచింది. ప్రధాని రిషి సునక్ తన సాంకేతిక నాయకత్వాన్ని ఉపయోగించుకుని పార్టీ విశ్వసనీయతను కాపాడుకంటూ వస్తున్నారు. కానీ అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక స్తబ్దత, పారిశ్రామిక అస్థిరత ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో జాప్యం వంటి కారణాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ కారణాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థి లేబర్ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. -
చంద్రయాన్-3 సక్సెస్: సోషల్‌మీడియాలో 45 ట్రిలియన్ డాలర్ల మోత
Chandrayaan-3 VS 45 Trillion చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండింగ్ అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ తరువాత ఇస్రో ఇంజనీర్ల ఘనతను పలు దేశాలు అభినందించాయి. అయితే బ్రిటీష్ మీడియాలో జెలసీతో అనూహ్య వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. దీంతో ఇండియానుంచి బ్రిటిష్ వలసపాలకులు కొల్లగొట్టిన 45 ట్రిలియన్ డాలర్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. (చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్) సోషల్ మీడియాలో,ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. భారత ఘనతపై అక్కసు వెళ్లగక్కుతున్న జర్నలిస్టు పాట్రిక్ క్రిస్టీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూన్ మిషనను అభినందిస్తూనే చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాలుగా యూకే నుంచి 2.5 బిలియన్డాలర్లను విదేశీ సహాయాన్ని వెనక్కి ఇవ్వాలంటూ పాట్రిక్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు న్యాయవాది శశాంక్ శంకర్ ఝా భారతీయులనుంచి దోచుకున్న45 ట్రిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వాలంటూ కౌంటర్ ఇచ్చారు. India has become the first country to successfully land a spacecraft near the south pole of the moon so why did we send them £33.4 million in foreign aid which is set to rise to £57 million in 24/25 Time we get our money back. — Sophie Corcoran (@sophielouisecc) August 23, 2023 అలాగే అంతరిక్షంలోని రాకెట్లను పంపించేందుకు ఇక దేశాలకు యూకే సాయం అందించకూడదు అంటూ సోఫియా కోర్కోరన్ ట్వీట్ చేశారు. అంతేకాదు తమ డబ్బు తిరిగి తమకు కావాలని కూడా ఈమె పేర్కొన్నారు. దీంతో భారతీయ యూజర్లు మండిపడుతున్నారు. భారతదేశం నుండి దోచుకున్న సొమ్ము 45 ట్రిలియన్ డాలర్లు అని కమెంట్ చేస్తున్నారు. మా కొహినూర్ మాకిచ్చేయండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు భారత్ 2015నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదంటూ పేర్కొన్నారు. ‘Britain, give us back our $44.997 TRILLION!’ Hi @PatrickChristys, @GBNEWS Thank you for reminding about the grant. Now ‘as a rule, salute us & return $45 TRILLION you’ve looted from us’ Britain gave, as you say, £2.3 BILLION i.e. $2.5 BILLION. Deduct it & return the… pic.twitter.com/9lSfwpvoWn — Shashank Shekhar Jha (@shashank_ssj) August 23, 2023 కాగా 1765 -1938 మధ్య కాలంలో బ్రిటన్ భారతదేశం నుండి దాదాపు 45 ట్రిలియన్డాలర్ల మొత్తాన్ని దోచుకుందని ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ కొలంబియా యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన పరిశోధన తర్వాత తొలుత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్ పన్ను మరియు వాణిజ్యంపై దాదాపు రెండు శతాబ్దాల వివరణాత్మక డేటాను విశ్లేషించిన తర్వాత ఈ డేటాను వెల్లడించారు.అయితే ఈ ఏడాది మార్చిలో ది గార్డియన్ నివేదిక ప్రకారం, భారతదేశానికి యూకే సహాయం 2015లో ఆగిపోయింది. అయితే ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ సమీక్ష ప్రకారం సుమారు 2.3 బిలియన్లు పౌండ్లు (రూ. 23,000 కోట్లు) 2016 -2021 మధ్య భారతదేశానికి అందాయి. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. దశాబ్దాలు పాటు భారత్‌ను పాలించిన బ్రిటీషర్లుమనదేశంలోని ఎనలేని సంపదను దోచుకుపోయారు. బంగారం, వజ్ర వైడూర్యాలు లాంటి ఎంతోఘనమైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. ఇండియా నుంచి బ్రిటీషర్లు తమ దేశానికి తరలించిన సంపద.. ప్రస్తుత విలువలో దాదాపుగా 45 ట్రిలియన్ డాలర్లకు సమానం. -
బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. యజమాని ఎవరు? బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్‌గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్‌గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది. డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్ కామ్ 2001లో ప్రారంభమమైంది. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్
లండన్: భారత్ దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాణ్ని పురస్కరించుకుని వేడుకల్లో మునిగిన వేళ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన రామకథా కార్యక్రమానికి హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ నేను ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ మొరారి బాపు మాట్లాడుతూ.. ఒక సాధారణ వ్యక్తిలా రిషి గారు ఇక్కడికి వచ్చారు. మీకు నా ప్రేమ పూర్వక స్వాగతం. దేవుడి ఆశీస్సులు మీపైనా బ్రిటీష్ ప్రజలపైనా మెండుగా ఉంటాయని ఆశీర్వదిస్తూ ప్రధానికి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరుగుతున్న మొరారి బాపు రామ కథా కార్యక్రమానికి హాజరుకావడం గౌరవం గానూ సంతోషంగానూ భావిస్తున్నానని, ఈరోజు ఇక్కడికి ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా వచ్చినట్లు తెలిపారు. మత విశ్వాసమనేది వ్యక్తిగతమైనది. నా జీవితంలో ఆ విశ్వాసమే నాకు తోడుండి నడిపిస్తోంది. ఒక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం ఏమంత సులువు కాదు. నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఆ నమ్మకమే నాకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తోందని అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దేవుడు నాకు నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్బంగా రిషి సునాక్ సౌతాంఫ్టన్ లో తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి అక్కడ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తూ ఉండేవాళ్లమని అన్నారు. తాము కూడా సాంప్రదాయ హిందూ కుటుంబం లాగే హోమయజ్ఞాది పూజలను నిర్వహించేవారమని తెలిపారు. మా సోదరులు, సోదరీమణులతో కలిసి అన్న ప్రసాదాలను కూడా వడ్డించేవాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు బాపు జీవితం విలువలతో కూడుకున్నదని ఆయన భక్తి, నిస్వార్ధమైన సేవాతత్వ దృక్పధం అందరికీ మార్గదర్శకమని అన్నారు. బాపు గారు చెప్పిన రామాయణం, భగవద్గీత, హనుమాన్ చాలీసా స్మరించుకుంటూ వెళ్తున్నానని జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి వినయపూర్వక పరిపాలనతో నిస్వార్దమైన సేవలందించడంలో శ్రీరామచంద్రుడే నాకు స్ఫూర్తి అని సునాక్ చెప్పారు. ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 35 మంది మృతి -
తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు
తుమ్ములు రావడం సర్వసాధారణం. కొంతమంది త్ముమ్మడానికి సిగ్గుపడి ఆపుకుంటుంటారు. మీటింగ్ సమయంలో లేదా ఏదైనా సీరియస్ కార్యక్రమంలో చాలామంది తుమ్ము వస్తున్నా ఏదోలా ఆపేస్తారు. ఇలా ఆపడం వల్ల ఒక్కొసారి ప్రాణాంతకం అవుతుంది. ముక్కు నరాలు చిట్లడం వంటివి జరగుతాయి కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చేసి ఏకంగా గొంతునే కోల్పోయాడు. అసలు తమ్మును ఆపొచ్చా! ఆపితే ఇక అంతేనా!..దాని గురించే ఈ కథనం. 34 ఏళ్ల బ్రిటీష్ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మేందుకు సిగ్గుపడి నాసికా రంధ్రాలను గట్టిగా అదిమి, నోటిని కూడా మూసేశాడు. దీంతో ఒక్కసారిగా ముక్కు లేదా నోటి నుంచి గాలి వెళ్లే మార్గం లేక గాలి బుడగల రూపంలో ఛాతిపై ఒత్తిడి చూపడంతో మెడ చుట్టు ఉన్న నరాలు పొంగి పగలిపోయే స్థితికి వచ్చేశాయి. ఆ తర్వాత గొంతులో రంధ్రం ఏర్పడి ఇక మింగే అవకాశం లేకుండా పోయింది. ఇక నెమ్మది నెమ్మదిగా స్వరాన్ని కూడా కోల్పోయాడు. గొంతులో రంధ్రం ఎలా ఏర్పడిందంటే.. గొంతులో ఉండే ఫారింక్స్ అంత సులభంగా చీలిపోదు. పదేపదే వాంతులు, దగ్గు లేదా బాహ్య గాయం కారణంగా మాత్రమే చీలీపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి విషయంలో గాలి బయటకు వెళ్లే మార్గం లేక గాలి బుడగలు అతని ఛాతీలోని కణజాలం, కండరాలలో స్థిరపడటం ప్రారంభించాయి. దీంతో మెడ అంతటా పాపింగ్, పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు వైద్యులు. ఇది తమకే చాలా షాకింగ్ అనిపించిందన్నారు. గొంతులోని పక్కటెముక నొప్పితో పాటు అతని గొంతు ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం అతనికి ఫీడింగ్ ట్యూబ్ ఏర్పాటు చేశామని, దాని సాయంతో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. యాంటీబయోటిక్స్ మందులతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడని అన్నారు వైద్యులు. Em caso raro, homem rompe garganta e tem dificuldade para falar após segurar espirro https://t.co/KyYpmX91A0 #G1 pic.twitter.com/7h9ApBJUvW — g1 (@g1) January 16, 2018 అసలు ఎందుకు తుమ్ము వస్తుందంటే.. ధూళి, పుప్పొడి, పోగ వంటి ఇతరత్ర కణాలు నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చికాకు కలిగించడంతో తుమ్ము రావడం జరుగుతుంది. ముక్కులోని డెస్ట్ క్లియర్ చేసేందుకు శరీర ధర్మంగా వచ్చేదే ఈ తుమ్ము అని వైద్యులు చెబుతున్నారు. ఇది ముక్కుకి బాక్టీరియా, బగ్‌ల దాడి నుంచి రక్షణ ఇచ్చే ఒక సాధనం లాంటిది. మనం తుమ్మగానే కొద్దిపాటి తేమతో కూడిని గాలి బయటకు బలంగా వస్తుంది. దీని వల్ల గాల్లోకి సూక్ష్మ జీవులు ఈజీగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగానే ఫ్లూ వంటి కొన్ని రకాల అంటువ్యాధులు ఈజీగా వ్యాప్తి చెందుతాయి. అందుకే కాస్త చేయి అడ్డుపెట్టుకుని తుమ్మండి అని చెబుతుంటారు. అదేపనిగా వచ్చే తుమ్ములతో చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని రకాల సీజన్లలో మరి ఎక్కువగా ఉంటుంది. గట్టిగా తుమ్మితే ఒక్కొసారి ముక్కు నుంచి రక్తం కారడం కూడా జరగుతుంది. చాలావరకు తుమ్ములు ఆందోళన కలిగించేవి కాకపోయిన తుమ్మును ఆపుకోకుండా ఉంటేనే మంచిదంటున్నారు వైద్యులు. తుమ్ము అనేది మానవ శరీర ధర్మం. గనుక పదిమందిలో తుమ్మేందుకు సిగ్గుపడి, లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవద్దు అని అంటున్నారు వైద్యులు. ఇది అందరికీ కామన్ కాబట్టి లేనిపోని రిస్క్‌లు కొని తెచ్చుకోకండి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: కడుపులో కణితి.. ఇలాంటివి ప్రాణాంతకమా? కాదా?) -
6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్‌లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట!
ఒక బ్రిటీష్ మహిళ బిడ్డకు జన్మనిచ్చేందుకు 4000 మైళ్లు(6437 కిలోమీటర్లు) ప్రయాణించింది. ప్రకృతి సిద్ధమైన అందమైన సముద్ర తీరంలో బిడ్డకు జన్మన్వివ్వాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడింది. ఆ గర్భిణి కలను సాకారం చేసేందుకు ఆమె భర్త కూడా ఎంతో సహకారం అందించాడు. ఎట్టకేలకు ఆమె దక్షిణ కొరియా దేశమైన గ్రెనడా సముద్రతీరంలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇలా బిడ్డకు జన్మనిచ్చిందో లేదో, వెంటనే ఆ దంపతులను సమస్యలు చుట్టుముట్టాయి. జనన ధృవీకరణ పత్రం కోసం చిక్కులు బిడ్డకు జన్మనిచ్చినది మొదలు నాలుగు నెలలుగా.. అంటే ఇప్పటికీ ఆ దంపతులు గ్రెనడా తీరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆ బిడ్డకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రం అడగడమే ఆ దంపతులకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ నేపధ్యంలో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. యూకేలో చిక్కుకుపోయిన పెద్ద కుమార్తె ఆ బ్రిటీష్ మహిళ పేరు యూలియా గుర్జీ(38). ఆమె యోగా ట్రైనర్. ఆమె భర్త పేరు క్లైవ్(51). వారికి ఇప్పటికే 8 ఏళ్ల ఎలిజబెత్ అనే కుమార్తె ఉంది. ఆమెను వారు యూకేలో ఉంచారు. ఎలిజబెత్ పాస్‌పోర్టు రివ్వ్యూ కాకపోవడంతో వారు ఆ చిన్నారిని తమతోపాటు తీసుకురాలేకపోయారు. కాగా ఆ దంపతులు యూకే నుంచి యూలియా సముద్ర తీరం చేరుకునేందుకు 6437 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. యూలియా ఏప్రిల్ 23న సాగరతీరంలో బేబీ లూయిస్‌కు జన్మనిచ్చింది. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసి.. క్లైవ్ మీడియాతో మాట్లాడుతూ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్.. తాము ఆ నవజాత శిశువుకు తల్లిదండ్రులమైనట్లు తగిన రుజువు చూపించాలని కోరుతున్నదన్నారు. తాము రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు సమర్పించి, కొంతకాలం వేచి చూశామన్నారు. ఎంతకీ తమకు బర్త్‌సర్టిఫికెట్ అందకపోవడంతో తిరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అధికారులను అడగగా, ఆ బిడ్డ ఆసుపత్రిలో జన్మించలేదని, అలాగే ఆ చిన్నారి ఎక్కడ జన్మించిందనే వివరాలు లేవని, అందుకే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పేశారన్నారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా.. తాము కింగ్ యూరోపియన్ యూనియన్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి సిబ్బంది తాము ఆ శిశువు జననానికి సంబంధించిన వివరాలు నమోదు చేయలేమన్నారు. బిడ్డపుట్టిన 24 గంటల తరువాత రిజిస్ట్రేషన్ కోసం వచ్చినందున తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పేశారని క్లైవ్ తెలిపారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా బిడ్డ జననానికి సంబంధించిన రుజువులు లేనందున తామేమీ చేయలేమని తెలిపారు. దీంతో క్లైవ్ యూకేలోని సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించగా, వారు డిఎన్ఏ టెస్టు చేయించాలని కోరారు. దీనికి సంబంధించిన రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని క్లైవ్ తెలిపారు. ‘చేతిలో చిల్లిగవ్వ లేదు’ ఇప్పటివరకూ తన కార్డులోవున్న 6,000 పౌండ్లు ఖర్చయిపోయాయని, తమ దగ్గర ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేదని క్లైవ్ తెలిపారు. తాము యూకే నుంచి సహాయం అర్థిస్తుండగా, ఇంతవరకూ ఎటువంటి సమాధానం లేదన్నారు. యూలియా మాట్లాడుతూ తాము ఈ దేశంలో బందీ అయిపోయామని, యూకే తిరిగి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. యూకేలో ఉండిపోయిన తమ పెద్ద కుమార్తె తమకు తరచూ గుర్తుకువస్తున్నదని, బంధువుల ఇంటిలో ఆమె ఎలా ఉన్నదో తమకు తెలియడం లేదని యూలియా కన్నీరుపెట్టుకుంది. ఇది కూడా చదవండి: ‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్‌లో 105 ఏళ్ల వృద్ధుని రోదన! -
శాండ్విచ్ కట్ చేసి, తినేలోపు ఊహించని షాక్.. ఈ రెస్టారెంట్‌కి వెళ్లకూడదు బాబోయ్!
సాధారణంగా రెస్టారెంట్లో తిన్నాక ఆర్డర్ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్లో చూస్తాం. ఏ హాటల్‌కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్ మాత్రమే కాదు ప్లేట్స్‌కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. రెండు పీసులకే ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్న ఓ బ్రిటీష్ టూరిస్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్ రాగానే శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు. శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌తో వాదించకుండా బిల్ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్‌లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్లో రెస్టారెంట్‌కు ఒక స్టార్ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది. -
యాదాద్రిని సందర్శించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
నల్గొండ: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మొక్కను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరును హై కమిషనర్‌కు కలెక్టర్ పమేలా సతప్పతి వివరించారు. అనంతరం బ్రిటీష్ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్ యాదగిరిగుట్టకు వెళ్లి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్
లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగసంపర్కులైన సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. సైన్యంలోకి వారిని తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యమని అన్నారు. దయచేసి క్షమించండి.. రిషి సునాక్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000 సంవత్సరానికి ముందు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా స్వలింగ సంపర్కులైన సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం. స్వలింగ సంపర్కులను సైన్యం నుండి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల పైనా వారి కుటుంబాలపైనా ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేము అర్ధం చేసుకున్నాము. ఆరోజున వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. మీరు కూడా మిగతా సైన్యంలాగే దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహాసాలను తలచుకుని గర్వపడాలన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు. యూకే డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ.. 1967-2000 మధ్యలో అనుభవజ్ఞులైన ఎందరో స్వలింగసంపర్కులైన సైనికులు చాలా వివక్షకు గురయ్యారు. సైన్యంలోకి వారిని నిషేధించడంతో వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. బ్రిటీష్ సాయుధ దళాల చరిత్రలోనే అదొక అవమానకరమైన సహించరాని పొరపాటని అన్నారు. On a historic day, the Prime Minister @10DowningStreet has apologised on behalf of the British state for the treatment of veterans who were affected by the ban on LGBT personnel before 2000.https://t.co/FHIu0baTEU pic.twitter.com/3a8trpaJgI — Office for Veterans' Affairs (@VeteransGovUK) July 19, 2023 ఇది కూడా చదవండి: ప్రపంచ కప్ టోర్నమెంటుకు ముందు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి -
ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే..
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగివుంది. ఈ విషయంలో భారతీయ రైల్వే నాల్గవ స్థానంలో ఉంది. వీటిలో కొన్ని రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలంలో నిర్మితమయ్యాయి. అవి ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం. భారతీయ రైల్వే ప్రస్తుతం 7 వేలకుపైగా రైల్వే స్టేషన్లను కలిగివుంది. వీటి మీదుగా 13 వేలకు మించిన రైళ్లు నడుస్తుంటాయి. దీనితో పాటు ఈ రూట్లలో గూడ్సు రైళ్లు కూడా నడుస్తుంటాయి. భారత్‌లో రైల్వే వ్యవస్థ.. బ్రిటీషర్లు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏర్పడింది. నాడు నిర్మితమైన రైల్వే స్టేషన్లు ఇవే.. హౌరా రైల్వేస్టేషన్ హౌరా రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పట్టణంలోని ప్రముఖ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి తొలి రైలు 1854 ఆగస్టు 15న తన రాకపోకలు ప్రారంభించింది. ఈ రైలు హౌరా-హుబ్లీల మధ్య నడిచేది. ఇది మన దేశంలో ఏకంగా 23 ప్లాట్‌ఫారాలు కలిగిన అతిపెద్ద రైల్వే స్టేషన్. రాయ్‌పూర్ రైల్వేస్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ పరిధిలోని వాలాజాపేట విభాగంలో ఉన్న రాయపూర్ రైల్వేస్టేషన్‌ను బ్రిటీషర్లు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి 1856లో దక్షిణభారతానికి చెందిన తొలి రైలు నడిచింది. ప్రస్తుతం ఇది దక్షిణ మరాఠా- మద్రాస్‌కు కేంద్ర కార్యాలయంగా ఉంది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్‌ను గతంలో ముగల్‌సరాయ్ రైల్వే స్టేషన్ పేరుతో పిలిచేవారు. తరువాతి కాలంలో దీని పేరు మార్చారు. ఇది యూపీలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. బెనారస్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. ఈ స్టేషన్ 1862లో నిర్మితమయ్యింది. ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్ భారత్‌లోని ప్రముఖ రైల్వే స్టేషన్. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. దీని నిర్మాణం 1978లో ప్రారంభమయ్యింది. తొలుత ఈ రైల్వే స్టేషన్‌కు మహారాణి విక్టోరియా పేరు పెట్టారు. తరువాత 1996లో దీని పేరు ఛత్రపతి శివాజీ టర్మినస్‌గా మార్చారు. డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ రైల్వేస్టేషన్. దీని నిర్మాణం 1897-1899 మధ్యకాలంలో బ్రిటీషర్ల సారధ్యంలో సాగింది. ఈ రైల్వే లైన్‌కు 1896లో అనుమతి లభించింది. 1900 మార్చి 1న ఈ రైలు ప్రారంభమయ్యింది. లక్నో చార్బాగ్ రైల్వేస్టేషన్ లక్నోలోని ఐదు రైల్వే స్టేషన్లలో చార్బాగ్ రైల్వే స్టేషన్ ఒకటి. దీని నిర్మాణం 1914లో మొదలయ్యింది. 1923 నాటికి ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ స్టేషన్ డిజైన్‌ను బ్రిటీష్ ఆర్కిటెక్ జె. హెచ్ రూపొందించారు. ఈ స్టేషన్ నిర్మాణంలో భారత ఇంజినీరు చౌబె ముక్తా ప్రసాద్ కీలక బాధ్యతలు వహించారు. నాటిరోజల్లో ఈ స్టేషన్ నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చయ్యాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అజ్మరీ గేట్- పహాడ్‌గంజ్ మధ్య ఉన్న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నిర్మాణానికి 1826లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతినిచ్చింది. 1931 నాటికి ఈ రైలు ప్రారంభానికి నోచుకుంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో మొత్తం 16 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ప్రతీరోజూ కొన్ని వందల రైళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తాయి. నంది హాల్ట్ రైల్వే స్టేషన్ నంది హాల్ట్ రైల్వే స్టేషన్ బెంగళూరులోని యలువహళ్లిలో ఉంది. ఇది 108 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ? -
నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు
జైలు అనగానే సినిమాలే గుర్తోస్తాయి. వాటిల్లో చూపించనంత అందంగా ఏమి ఉండవు. కానీ ఇప్పుడూ ఆ జైళ్లనే ఖైదీలలో పరివర్తన వచ్చేలా గొప్ప కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే వారి శిక్షకాలం పూర్తి చేసుకున్న తదుపరి హాయిగా జీవించేలా నైపుణ్యాలు సంపాదించుకునేలా చేసేందుకు శ్రీకారం చుట్టింది బ్రిటన్ ప్రభుత్వం. మరోసారి ఎటువంటి నేరాలకు దిగకుండా ఉండి, వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దకునేలా చేస్తున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అని "హెచ్ఎంపీ ఫోస్సే వే" అనే పేరుతో అత్యాధునికి జైలుని నిర్మిస్తున్నారు. ఇందులో దగ్గర దగ్గరగా దాదాపు వెయ్యిమందికి పైగా అంటే 1,715 మంది దాక ఖైదీలు ఉండేంత స్థలం ఉంటుంది. ఖైదీలకు పునరావసం కల్పించడం తోపాటుగా ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడేందుకు ఈ కొత్త జైలుని ప్రారంభించారు. ఈ కొత్త జైలు నిర్మాణంలో 71 మంది ఖైదీలు, ఇద్దరు మాజీ నేరస్తులు పనిచేయాలనే ఒక నిబంధన కూడా ఉంది. ఇక్కడ మొత్తం 24 వర్కషాప్‌లు ఉంటాయి. నేరస్తులు ఇక్కడ నిర్మాణ వాహనాలను ఎలా నడపాలి, అద్దాలను ఎలా తయారు చేయాలి, జైలు నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్ విభాగాలు, లైటింగ్ పరికరాలు తదితరాలకు సంబంధించిన పనులు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో ఉన్న ఆరు అత్యాధునికి జైళ్లలో ఇది రెండోది. ఈ జైలుని.. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. అలాగే యూకేలో ఇప్పటి వరకు నిర్మించిన పచ్చటి జైలు కూడా అదే. బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నాలుగు బిలియన్ పౌండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ అత్యాధునిక జైలుని నిర్మించింది. అలాగే ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తి అయిన వెంటనే ఉపాధిని వెతుక్కోవడం ఈజీ అవ్వడమే గాక సమాజంలో ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా బతకగలగుతారని చెబుతున్నారు బ్రిటన్ అధికారులు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ కూడా ఉద్యోగాల తీసివేతకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. జెట్ ఇంజిన్ల తయారీదారు రోల్స్ రాయిస్ ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది ఉద్యోగులను తొలగిస్తోందని వార్త మీడియాలో పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే కంపెనీ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. టైమ్స్ నివేదికల ప్రకారం లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 3,000 మంది నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా ఈ తొలగింపులను చేపట్టనుంది. వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్వహణ మార్పులతో సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఇటీవల రోల్స్ రాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టుఫాన్ ఎర్గిన్బిల్జిక్ ప్రకటించారని కూడా నివేదించింది. రోల్స్ సివిల్ ఏరోస్పేస్, మిలిటరీ ,పవర్ సిస్టమ్స్ విభాగాల తయారీయేతర వ్యాపారాలను కలపాలని కార్పొరేషన్ భావిస్తోందన్న అంచనాలు వెలువడ్డాయి. అవన్నీ ఊహాగానాలే: రోల్స్ రాయిస్ అయితే ఈ వార్తలను బ్రిటీష్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల కోతల వార్తలన్నీ ఊహాగానాలేనని ఈ సందర్బంగా ది సండే టైమ్స్ క్లెయిమ్‌లను కంపెనీ తోసిపుచ్చింది. దీర్గకాల సక్సెస్, ఉద్యోగుల శ్రేయస్సే తమ ప్రాధాన్యత అని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా ప్రపంచవ్యాప్త విమానయాన పరిశ్రమ విడి భాగాలు, నిపుణుల కొరతతో ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది, అలాగే విమాన ఇంజిన్లకు టైటానియం వంటి పదార్థాలను సరఫరా చేసే రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతోంది. -
Amritpal Singh: భార్య అరెస్టు అవుతుందనే భయంతో లొంగిపోయాడా?
ఖలీస్తానీ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ నెలరోజులుగా పరారీలో ఉండి ఈరోజు(ఆదివారం) అనుహ్యంగా అరెస్టవ్వడం పలు అనుమానాలను రేకెత్తించింది. అతను పంజాబ్ నుంచి నేపాల్ అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్న వేళ..అనుహ్యంగా పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రత్యక్షమవ్వడం అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. అదీకూడా అతడి భార్య కిరణదీప్ కౌర్ అతన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైన రెండు రోజుల్లోనే అమృత్‌పాల్ అరెస్టు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతను మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి అతనిపై అణిచివేత ప్రారంభమైంది. ఆ క్రమంలోనే అతడి భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై పంజాబ్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో నివశిస్తున్నారు. అదీగాక ఆమె వీసా గడువు ఈ జూలైలో ముగుస్తోంది. సరిగ్గా ఆమె అమృత్‌పాల్ కోసం వేట కొనసాగిస్తున్న తరుణంలోనే లండన్ వెళ్లేందుకు యత్నించింది. ఐతే ఆమె విమానం ఎక్కి వెళ్లిపోతుందనంగా..చివరి నిమిషంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని లుక్ఔట్ నోటీసులు జారీ చేసి ఆమెను దేశం విడిచి వెళ్లొద్దని చెప్పారు. దీంతో కిరణ్ కౌర్ అరెస్టు ఖాయమని వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి ఆమెను దేశం నుంచి సురక్షితంగా దాటించేయాలనకున్నాడు. అది బెడిసికొంటింది. మరోవైపు తాను పారిపోయేందుకు సాయం చేసినందుకు గానూ తన భార్య అరెస్టు ఖాయమన్న భయం కూడా అమృత్‌పాల్‌ని వెంటాడింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి ఉండవచ్చనని అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్ పౌరసత్వ కలిగి ఉన్న అతడి భార్య ద్వారా కిరణ్ దీప్ కౌర్ యూకేకి నిధులు మళ్లించినట్లు సమాచారం. దీంతో ఈ విషయం ఎక్కడ బయటపడుతుందన్న భయం కూడా అమృత్పాల్లో మొదలైంది. ఈ కారణాల రీత్యా అతను పంజాబ్‌లో తన సొంత మోగా జిల్లాలో ప్రత్యక్షమై లొంగిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కిరణ్‌దీప్ కౌర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి కోసం ఇండియాకు వచ్చింది.ఆమె పెళ్లి అమృత్‌పాల్ స్వస్థలమైన జల్లుపూర్ ఖేరా గ్రామంలో జరిగింది. పోలీసుల అతడి ఆచూకి కోసం సాగిస్తున్న వేటలో అమృత్‌పాల్ తల్లి తోపాటు ఆమెను కూడా విచారించారు. (చదవండి: గర్వంగా ఉంది! అమృతపాల్ తల్లిదండ్రుల స్పందన..) -
136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధి..పోలీసులకు అప్పగించిన కూలీ
ఒక దినసరి కూలీ 136 ఏళ్ల బ్రిటీస్ కాలం నిధిని పోలీసులకు అప్పగించాడు ఓ కార్మికుడు. అయితే అతను తన స్థలం నుంచి చెప్పకుండా పట్టుకెళ్లాడని ఆరోపించింది ఆ భూ యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లితే మరో విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రధేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీ కి ఓ ఇంటి కింద 136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధిని కనుగొన్నాడు. ఆ కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హలీ అహిర్వార్లోని దామోహ్ జిల్లాలోని ఇంటి తవ్వకంలో ఈ నిధిని గుర్తించాడు. అందులో సుమారు 240 వెండి నాణేలను కనుగొన్నాడు. వాటి విలు సుమారు రూ. 1.92 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆ కూలీ తొలుత తన ఇంటికి తీసుకెళ్లి.. చివరికి బాగా ఆలోచించి పోలీసులకు అప్పగించేశాడు. ఐతే ఆ స్థలం యజమానురాలు మీనాక్షి ఉపాధ్యాయ్ మాత్రం ఆ నిధిని తన స్థలంలోనే బయటపడిందని, ఆ కూలి తనకు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు చేసింది. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపి వేయించారు. పురావస్తు శాఖకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నాణేలను అప్పగించారు. అంతేగాదు ఆ స్థలంలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ..అక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు గుర్తించింది. అక్కడ ఇంకా తవ్వకాలు జరిపి నిశితంగా దర్యాప్తు చేస్తే.. విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, ఎవరైనా పురాతన వస్తువు లేదా నిధిని కనుగొన్న వ్యక్తి దానిని 24 గంటలలోపు భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ లేదా అధీకృత అధికారికి నివేదించాలి. అలా చేయనట్లయితే ఆ వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. (చదవండి: దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్': న్యాయశాఖ మంత్రి) -
‘కోహినూర్‌ను బ్రిటన్ దొంగిలించింది’
బ్రిటన్ రాజకుటుంబ కథనాలంటే ఇప్పటికీ ఆసక్తికరమే. పైగా ప్రిన్స్ హ్యారీ దూకుడుగా వెలువరించిన ‘స్పేర్’ చదవడానికి మరింత ఆకర్షణీయం. తల్లి డయానా నాటకీయ మరణం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్నీ, తానొక ‘స్పేర్’గా ఊరికే అలా పక్కనుండాల్సిన స్థితినీ రాశాడు. అలాగే అనేక ఇబ్బందికర విషయాలను పంచుకున్నాడు. అయితే కోహినూర్ వజ్రం గురించిన హ్యారీ ఆలోచనలు మాత్రం భారతీయులకు సంతోషం కలిగిస్తాయి. బ్రిటన్ రాకుమారుడు హ్యారీ రాసిన ‘స్పేర్’ పుస్తకం చదివినప్పుడు మనకు కొట్టొచ్చినట్టు కనబడేది దాన్ని రాసిన విధానమే. శైలి బిగువుగా, ఉద్రిక్తభరితంగా, ఒక్కోసారి అసంగతంగానూ ఉంటుంది. చెప్పాలంటే ఒక థ్రిల్లర్‌లా ఉంటుంది. కాబట్టే ఇది చదవడానికి ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇందులోని భాషలో లోతు తక్కువ. విషయం వదులుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈటన్ స్కూల్, అఫ్గానిస్తాన్‌లలో హ్యారీ గడిపిన సమయాల గురించి వివ రిస్తున్నప్పుడు పైపైన సాగుతుంది. అప్పుడు నిస్సారంగా ఉండి, చికాకు కలిగిస్తుంది కూడా. తప్పనిసరిగా కనబడేవి మరో రెండు అంశాలు. తన తల్లి (డయానా) నాటకీయ మరణం కలిగించిన వేదన నుంచి హ్యారీ బయటపడలేదు. ఈ పుస్తకం మొత్తంగా ఇదే మానసిక స్థితి కొన సాగు తుంటుంది. అయితే ఇది అర్థం చేసుకోదగినదే. అర్థం కానిదల్లా ఏమి టంటే, తానొక ‘స్పేర్’(అలా పక్కన అందుబాటులో ఉండటం)గా ఉండాల్సిన వాస్తవం గురించి ఇంకా సమాధాన పడక పోవడమే. 38 సంవత్సరాల వయస్సులో కూడా ఏ హోదా లేదు. తన సోదరుడు విలి యమ్‌తో బాంధవ్యంపై ఇది స్పష్టమైన ప్రభావం చూపుతూ వచ్చింది. ఈ కారణంగానే స్కూల్లో విల్లీ (విలియమ్‌ను హ్యారీ ఇలాగే పిలు స్తాడు) తన పట్ల పట్టనట్టుగా ఉన్నాడని హ్యారీ నమ్మకం. పుస్తకంలోని మూడో అంశం ఏమిటంటే – రాజ కుటుంబానికీ, వెంటాడే ఫొటోగ్రాఫర్లకూ (పాపరాజ్జీ) మధ్య సాగిన అంతులేని పోరాటం. ‘‘ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, ఎప్పుడూ వివరణ ఇవ్వ వద్దు’’ అనేది రాజ కుటుంబ నినాదంగా ఉండేది. హ్యారీ ఈ విషయంలో ఒకడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తుంది. పబ్‌లో రాత్రంతా గడిపిన తర్వాత తన కారు డిక్కీలో దాక్కునే వాడినని చెప్పాడు. డయానా కూడా అలాగే చేసివుంటుందని హ్యారీ అంటాడు. ఈ పుస్తకం చాలా విషయాలను వెల్లడిస్తుంది. వాటిలో చాలా వరకు తీవ్రమైనవి, కొన్ని మనోహరమైనవి. బాక్సర్ షార్ట్స్‌లో శీర్షాస నాలు వేసే అతడి తండ్రి, బ్రిటన్ రాజు చార్లెస్ ‘డార్లింగ్ బాయ్’ అని హ్యారీని పిలుస్తారు. ఇక విలియమ్ అతడిని ‘హెరాల్డ్’ అంటాడు. కానీ అలా ఎందుకంటాడో పుస్తకంలో ఎక్కడా ఉండదు. అయితే, ‘‘నాతో వ్యవహరించినప్పుడల్లా ఏ మార్పూ లేకుండా’’ అదే ‘‘సుపరి చితభ్రుకుటి’’ అని మాత్రం చెబుతాడు. ఇక బాల్మోరల్ రాజమందిరంలో పిల్లలుగా ఉన్నప్పుడు, క్వీన్ విక్టోరియా విగ్రహాన్ని ఎప్పుడు దాటు కుని వెళ్లినా వారు ప్రతిసారీ వంగి నమస్కరించేవారు. ఈ పుస్తకంలోని చాలా వివరాలు అనవసరం. పైగా అవి ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటన్నింటినీ హ్యారీ ఎందుకు పంచు కున్నాడని మీరు ఆశ్చర్యపడతారు కూడా. ఉదాహరణకు, హ్యారీ తనకు తడి అయిందనీ (స్ఖలనం), దాన్ని దాచిపెట్టడానికి సముద్రంలోకి దూకేశాననీ చెబుతాడు. మేగన్ మెర్కెల్‌తో తన తొలి డేట్‌కు కొద్ది గంటల ముందు అలా జరిగింది. రాజకుటుంబీకులు, వారి స్కాటిష్ సంప్రదాయాలకు కాలం చెల్లిపోయిందని అనిపించే ఒక కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది. హ్యారీ తొలిసారి ఒక మగజింకను కాల్చినప్పుడు అతడి గైడ్ అయిన శాండీ ఆ మృతకళేబరపు చర్మాన్ని చీల్చి, యువరాజు హ్యారీని మోకాళ్లపై కూర్చో బెట్టి, అతడి తలను అందులోకి దూర్చాడట. ‘‘దీంతో ఉదయం నేను తిన్న ఫలహారం కడుపులోంచి బయటకు వచ్చేసింది’’ అని హ్యారీ రాస్తాడు. ‘‘నేను దేన్నీ వాసన పీల్చలేకపోయాను. ఎందుకంటే నేను శ్వాస పీల్చలేకపోయాను’’ అని చెబుతాడు. ‘‘నా నోరు, ముక్కు పూర్తిగా రక్తంతో, పేగులతో నిండిపోయాయి. ఒక తీవ్రమైన అసౌక ర్యపు వెచ్చదనం’’ అని చెబుతాడు. ఈ ఆచారం ముగియగానే, హ్యారీ ముఖంపై పడిన జింక రక్తాన్ని తుడవవద్దని శాండీ చెప్పాడట. ‘‘దాన్ని అలాగే ఎండిపోనీ, కుర్రాడా, అలాగే ఎండిపోనీ!’’ అన్నాడట. బ్రిటిష్ రాజకుటుంబంలో ఇద్దరు సభ్యులను హ్యారీ అంగీకరించలేకపోయాడు. ఒకరు మార్గరెట్ (ఎలిజబెత్ రాణి చెల్లెలు). ఆమెను అతడు ఆంట్ మార్గో అని పిలుస్తాడు. ఒకసారి ఆమె క్రిస్మస్కు మామూలు బాల్‌పాయింట్ పెన్ ఇచ్చిందట. అయినా వాళ్లిద్దరూ కలిసి సాగాల్సి వుంది. ఎందుకంటే, హ్యారీ నొక్కిచెప్పినట్టుగా ఆమె కూడా తనలాగే ఒక స్పేర్. ఇక హ్యారీ అంగీకరించని మరొకరు కెమిల్లా. ఆమెను పెళ్లాడవద్దని హ్యారీ, విలియమ్ ఇద్దరూ తమ తండ్రి చార్లెస్‌కి చెప్పారు. ఆమెను ‘ప్రమాదకారి’గా హ్యారీ పరిగణిస్తాడు. తన ఇమేజ్ను పెంచుకునే క్రమంలో ఆమె మీడియాకు పలు కథనాలు బహిర్గతం చేశారంటాడు. రెండు విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ పుస్తకంలో దోడీ ఫయీద్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. అతడిని హ్యారీ అంతటా ‘మమ్మీ బాయ్‌ఫ్రెండ్’ అనే రాశాడు. ఇంకా తనకు ‘పాకీ’ అంటే జాతి వివక్షా పదమనీ, అవమానించినట్టనీ తెలియదని పేర్కొన్నాడు. అంతిమంగా, గూర్ఖాల పట్ల హ్యారీకి ఉన్న ఆత్మీయతకు భార తీయ పాఠకులు సంతోషపడతారు. లెఫ్టినెంట్ వేల్స్ అని హ్యారీని సంబోధించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఎల్లప్పుడూ ‘సాబ్’ అనేవారు. ‘‘రాజరికం పట్ల వాళ్లకు గంభీరమైన పూజ్యభావం ఉంది. వారి దృష్టిలో రాజు అంటే దైవం. కాబట్టి రాజకుమారుడు కూడా దైవా నికి మరీ దూరం కాదు’’. ఇక కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కలిగివుండటంలోని న్యాయ సమ్మతిని హ్యారీ ప్రశ్నించడం మన ప్రభుత్వానికి సంతోషం కలిగించే విషయం. ‘‘బ్రిటిష్ సామ్రాజ్యం తన ఉచ్చదశలో దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకో ఆలోచన, దొంగిలించింది’’ అని అంటూ ఇలా కొన సాగిస్తాడు. ‘‘అది శాపగ్రస్తమైందని నేను విన్నాను.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇళ్లల్లో నివాసం, అబ్బే కిక్కు లేదని.. అందులో ఉంటున్నాడు!
ఇళ్లల్లో నివాసం ఉండటంలో విశేషం ఏముంది? విమానాన్నే నివాసంగా మార్చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాడు ఓ బ్రిటిష్ పెద్దాయన. వెతికి వెతికి ఒక కాలంచెల్లిన బోయింగ్ విమానాన్ని కారుచౌకగా– కేవలం 82 వేల పౌండ్లకు (రూ.81.82 లక్షలు) కొనుగోలు చేసి, దానినే తన నివాసంగా మార్చుకుని ఇటీవల వార్తలకెక్కాడు. బ్రూస్ కాంప్‌బెల్ (73) ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేసేవాడు. ‘విమానాలంటే నాకు చిన్నప్పటి నుంచి తగని పిచ్చి. కాలంచెల్లిన విమానాలు ప్లేన్ బోన్యార్డుల్లో (విమానాల షెడ్లు) పడి ఉండటంపై అడపా దడపా వార్తలు చూసేవాణ్ణి. అలాంటి వాటిలో ఒక విమానాన్ని సొంతం చేసుకోవాలని అనుకునేవాణ్ణి. ఇన్నాళ్లకు ఒక విమానాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడు దీనినే నా ఇల్లుగా మార్చుకున్నాను. నివాసం ఉండటానికి ఇది నాకెంతో బాగుంది’ అని కాంప్‌బెల్ మీడియాకు చెప్పాడు. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జె.ఎఫ్.కెన్నెడీ భార్య జాకీ కెన్నెడీని పెళ్లాడిన అరిస్టాటిల్ ఒనాసిస్ ఒకప్పుడు ఉపయోగించిన ‘బోయింగ్–727’ విమానం 1999 నుంచి గ్రీస్‌లో పడి ఉన్నట్లు తెలుసుకుని, దీనిని కొనుగోలు చేశాను’ అని కాంప్‌బెల్ వివరించాడు. విమానం ధర 82 వేల పౌండ్లు అయినా, గ్రీస్ నుంచి తాను నివాసం ఉంటున్న ఓరెగాన్‌కు దీనిని తరలించడానికి 99 వేల పౌండ్లు (రూ.98.83 లక్షలు) ఖర్చు కావడం విశేషం. చదవండి: స్టార్టప్‌లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు! -
‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!
కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరాని తనం నుండి విముక్తి పొందడానికి మహార్ పీడిత కులానికి చెందిన ఐదు వందలమంది సైనికులు 1818 జనవరి ఒకటవ తేదీ నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున రెండవ బాజీరావు పీష్వా సైన్యంతో భీమానది ఒడ్డున వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. ఈ విజయానికి సూచనగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కోరేగావ్ వద్ద మహార్ అమరవీరుల స్థూపాన్ని నిర్మించి, ఆ స్థూపంపై యుద్ధంలో చనిపోయిన 22 మంది మహార్ వీరుల పేర్లను చెక్కించారు. భీమా నది ఒడ్డున నిర్మించిన మహార్ వీరుల స్మారక విజయ స్తంభాన్ని 1927లో డాక్టర్ అంబేడ్కర్ సందర్శించే వరకు భీమా కోరేగావ్ చరిత్ర... స్వతంత్ర పోరాటం పేరుతో వక్రీకరణకు గురైంది. అక్కడ జరిగిన యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా మరా ఠాలు చేసిన స్వాతంత్య్ర పోరాటంగా కుహనా చరిత్రకారులు చిత్రించారు. నిజానికి చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే... మహార్ వీరులు ఆ యుద్ధంలో తమ పట్ల పీష్వాలు అనుసరిస్తున్న అంటరానితనం, అణచివేతలకు వ్యతిరేకంగా... తమ విముక్తి కొరకే పాల్గొన్నా రనేది వాస్తవం. అంబేడ్కర్ భీమాకోరేగావ్ వద్ద విజయాన్ని మరాఠా పీష్వాల రాజ్యంలో ‘బ్రాహ్మణీయ అణచివేతపై దళిత ఆత్మగౌరవ ప్రతీకగా’ ప్రకటించడంతో అసలు చరిత్ర వెలుగు లోకి వచ్చింది. మరాఠా సామ్రాజ్యంలో నిజానికి పీష్వాలు దళితులపై చేస్తున్న కుల అణచివేత, ఆగడాలు అంతా ఇంతా కాదు. నడుముకు చీపురు, మూతికి ముంత కట్టించారు. దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆయుధాలు నిరాకరించి పశువుల కన్నా హీనంగా చూస్తున్న పీష్వాల పాలనలో పోరాటం తప్పితే మరేమీ మిగల్లేదు. యుద్ధానికి ముందు మహార్ల నాయకుడైన సిఖ్ నాయక్... పీష్వా సైన్యాధికారిని యుద్ధం జరగకుండా ఉండాలంటే... తమను మనుషులుగా గుర్తించి, అంటరానితనం పాటించడం నిలిపివేసి కనీస హక్కులు ఇవ్వాలని అడిగాడు. ‘మీరు యుద్ధం చేసి గెలిచినా కూడా అస్పృశ్యులే, మీ అంటరానితనం పోదు. మీరు ఎప్పుడూ మా కాళ్ళకింద ఉండేవారే’ అని కండకావరంతో సైని కాధికారి మాట్లాడటంతో యుద్ధం అనివార్యమైంది. అత్యంత బలస్థులూ, పోరాట యోధులైన మహర్ యువకులు ఆ మాటలతో ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. రెండు రోజులు కాలినడకన ప్రయాణం చేశారు. వెంట తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి. అయినా ఆకలితో ఉండి కూడా భీమా నది ఒడ్డున 1818 జనవరి ఒకటవ తేదీనాడు 20 వేల అశ్వికదళం, 8 వేల పదాతిదళం కలిగినన పీష్వాల సైన్యంతో పోరాడి విజయం సాధించారు. ఇది ముమ్మాటికీ కుల పీడనపై ‘ప్రతిఘటన’గానే మనం చూడాలి. నేడు కుల వ్యవస్థ ఆధునిక రూపాలు సంతరించుకొని గ్రామాల నుండి పట్టణాల వరకూ, పాఠశాలల నుండి యూని వర్సిటీల వరకూ, చిన్న పని ప్రదేశాల నుండి కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల వరకూ రాజ్యమేలుతోంది. రోజురోజుకు బలోపేతం అవుతున్న హిందూత్వ ఫాసిజం మనుస్మృతిని అధికారికంగా నెలకొల్పే దిశగా పయనిస్తున్నది. దళిత బహుజనుల నీడ, గాలి సోకకుండా వారి మానవ హక్కు లన్నింటినీ నిషేధించిన పీష్వాల అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతి రేకంగా సాగిన భీమా కోరేగావ్ పోరాటాన్ని ఎత్తి పడుతూ అంబేడ్కర్ ఆ పోరాటాన్ని ఆత్మగౌరవ ప్రతీక అని ప్రకటించి, దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు. అనంతరం ఈ దేశ రాజ్యంగంలో దళితులకు హక్కులను పొందుపర్చడంతో పాటు కుల వర్గ పీడన అంతం కావాలని ఆశించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన మహిళలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలతో కూడిన బహుజన సమాజపు విముక్తికై వినూత్న మార్గంలో పోరాడారు. అయినా కొత్త పీష్వాలు అధికారాన్ని చలాయిస్తున్న సందర్భంలో మళ్లీ మనువాదం పూర్తి స్థాయిలో జడలు విప్పుకునే అవకాశం ఉంది. అందుకే బహుజన సమాజం అప్రమత్తతతో ఉండాలి. – కోట ఆనంద్, కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ‘ 96523 57076 (నేడు భీమా కోరెగావ్ పోరాటం జరిగిన రోజు) -
భారత్ నుంచి ఒకే ఒక్కడు ‘కింగ్ ఖాన్’.. గొప్ప నటుడిగా ఆ జాబితాలో చోటు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత ప్రతిభావంతులైన 50 మంది నటీనటుల జాబితాలో షారుక్ ఖాన్‌కు చోటు దక్కింది. బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్ ‘ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ లిస్ట్’ పేరుతో మంగళవారం తమ మ్యాగజైన్లో ప్రచురించింది. ఈ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క నటుడిగా షారుక్ ఖాన్ పేరు ఉండటం విశేషం. ప్రముఖ హాలీవుడ్ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హ్యాంక్స్, ఆంథోని మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాల సరసన షారుక్ నిలిచాడు. ఈ సందర్భంగా ఎంపైర్ మ్యాగజిన్ తన ఆర్టికల్‌లో షారుక్ చేసిన పాపులర్ రోల్స్, సినిమాలను పేర్కొంది. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న ఈ ‘కింగ్‌ఖాన్’ విజయాల పరంపర, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు షారుక్ నటించిన ఓ చిత్రంలో చెప్పిన ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్‌ని ఆర్టికల్‌లో పేర్కొంటూ అతడి కెరియర్లోనే ఇది ఉత్తమైన డైలాగ్‌గా కొనియాడింది. దేవదాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతా హై వంటి సినిమాల్లో అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు కురిపించింది. కాగా ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్ -
చిరంజీవి పై బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు
-
JJ Hospital: ఆస్పత్రిలో 132 ఏళ్ల నాటి సొరంగం
ఒక ఆస్పత్రి భవనం పునాది కింద 132 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి సొరంగం బయటపడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లాలో చోటుచేసుకుంది. ముంబైలోని జేజే ఆస్పత్రి అండ్ గ్రాండ్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఈ టన్నెల్‌ని కనుగొన్నట్లు ఆస్పత్రి యజామాన్యం తెలిపింది. ప్రస్తుతం దీన్ని నర్సింగ్ కాలేజ్‌గా మార్చనున్నారు. కాలేజ్‌లో నీరు లీకేజీ అవుతుందంటూ ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఆస్పత్రి 1890లో నిర్మించినట్లు పునాదిరాయిపై కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ మెడికల్ కాలేజ్ 1843 మార్చి 30న గ్రాండ్ మెడికల్ కాలేజ్ భవనానికి శంకు స్థాపన చేసినట్లు అధికారలు తెలిపారు. రెండేళ్లలోనే భవనం పూర్తి అయ్యి 1845లో ప్రారంభించబడినట్లు పేర్కొన్నారు. ఈ కాలేజీ వ్యవస్థాపకుడు సర్ జంషెట్జీ జేజీబోయ్ రూ లక్ష రూపాయ విరాళంతో స్కూల్ ఆఫ్ ప్రాక్టీస్ ఏకకాలంలో ఏర్పాటైందని చెప్పారు. ఒక వైద్యురాలు ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం గురించి తెలుసుకునే క్రమంలో ఈ సోరంగం ఆచూకి బయటపడినట్లు తెలిపారు. ఈ సోరంగంపై తదుపరి దర్యాప్తు విషయమై కలెక్టర్ కార్యాలయానికి, పురావస్తు శాఖకు తెలియజేసి ప్రాథమిక వివరాలను నివేదించనున్నట్లు జేజే ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. (చదవండి: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు) -
UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు నామినేషన్ కోసం అవసరమైన 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఆయనకు ఇప్పటికే సమకూరిందని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన లండన్ తిరిగొచ్చారు. ఆయనకు కూడా 100 మంది ఎంపీల మద్దతు సమకూరిందని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. రిషి, జాన్సన్ ఇప్పటిదాకా తాము రేసులో ఉన్నట్టు వెల్లడించలేదు. ఎంపీల మద్దతుపై కూడా ఏమీ మాట్లాడలేదు. పెన్నీ మోర్డంట్ మాత్రమే పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నానికల్లా 100 మంది ఎంపీల మద్దతు సాధించిన వారి మధ్య తదుపరి పోటీ ఉంటుంది. రిషికి పెరుగుతున్న మద్దతు రిషిని సమర్థిస్తున్న మంత్రులు, పార్టీ ఎంపీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు దేశ పౌరులకు విశ్వాసం కల్పించగల నేత ప్రస్తుతం రిషి మాత్రమేనని మాజీ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ అభిప్రాయపడ్డారు. మళ్లీ వెనకటి రోజులకు వెళ్లేమని బోరిస్నుద్దేశించి అన్నారు. అయితే మళ్లీ ప్రధాని కావాలని తహతహలాడుతున్న బోరిస్ పోటీ లేకుండా నెగ్గేలా వ్యూహాలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా రిషిని తప్పుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. -
మహీంద్రా, బీఐఐ రూ.4,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభా గం కోసం మహీంద్రా గ్రూప్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్(బీఐఐ) రూ.4,000 కోట్లు పెట్టు బడి చేయాలని నిర్ణయించాయి. మహీంద్రా ఈవీ విభా గం అయిన ఈవీ కో కంపెనీలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్ర ణాళికాబద్ధమైన ఉత్పత్తులకు 2023–24 నుంచి 2026–27 మధ్య నూతన ఎలక్ట్రిక్ వాహన కంపెనీ మొత్తం రూ.8,000 కోట్ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. వ్యాపారాన్ని పటిష్టం చేయడం కోసం ఈవీ కో కంపెనీలోకి మరింత మంది పెట్టుబడిదార్లను తీసుకు వస్తామని మహీంద్రా గ్రూప్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాటా 25 శాతం.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఎక్స్‌యూవీ 400 మోడల్‌ను మహీంద్రా ఇటీవలే ఆవిష్కరించింది. అయిదు రకాల ఈ–ఎస్‌యూవీలను భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం పరిచయం చేస్తామని యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌యూవీతోపాటు బీఈ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ బ్రాండ్ శ్రేణి లో ఈ నూతన మోడళ్లను పరిచయం చేయనుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు లేదు. అయితే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహ న విభాగంలో సంస్థకు ఏకంగా 70% వాటా ఉంది. 2027 నాటికి సంస్థ విక్రయించే అన్ని ఎస్‌యూవీల్లో ఎలక్ట్రిక్ వాటా 25% ఉంటుందని భావిస్తోంది. -
ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?
ఎలిజెబెత్ రాణి మృతి, వారసుడిగా కింగ్ ఛార్లెస్ ప్రవేశం అనేవి మరోసారి గ్రేట్ బ్రిటన్ గురించి మనం తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా చేశాయి. యూరప్ తీర ప్రాంతంలోని ఒక చిన్న దీవి అయిన బ్రిటన్ రాజకీయాధికారం క్షీణిస్తూ, ఆర్థిక వ్యవస్థ కుంగిపోతూ ఉండ వచ్చుగాక... కానీ ఇప్పటికీ పెర్త్, ఫీనిక్స్, ముంబై, మాసే లేదా కేప్ టౌన్, కోపెన్హాగన్ వంటి సుదూర ప్రాంతాల్లోని ప్రజలను కూడా కట్టిపడేస్తూ ఈ రోజుకీ ఆకర్షిస్తూనే ఉంది. ఇది ఏకకాలంలో ప్రహస నంగానూ, బ్రిటన్ ప్రభావానికి తిరుగులేని సూచికగానూ ఉంటోందని చెప్పవచ్చు. రాణి తన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఆమె అర్థవంతమైన శక్తిగా లేరు. కానీ ఆమె ప్రపంచం దృష్టిని ఇప్పటికీ తనవైపు తిప్పుకోగలరు. కాబట్టి ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న ఈ రాజదండాన్ని కలిగిన ద్వీపం లక్షణాలు ఏమిటి? మొట్టమొదటి లక్షణం నిస్సందేహంగా దాని రాచరికమే అని చెప్పాలి. ఈజిప్ట్ రాజు ఫారూఖ్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు, ఓ సుప్రసిద్ధమైన మాట చెప్పారు: ఏదో ఒక రోజు ప్రపంచంలో అయిదుగురు చక్రవర్తులు మాత్రమే ఉంటారనీ, వారు స్పేడ్, క్లబ్, హార్ట్స్, డైమండ్స్తోపాటు ఇంగ్లండ్ చక్రవర్తి అనీ అన్నారు. తొలి నాలుగు పేకాటలో ముఖ్యమైన ముక్కలు అని తెలిసిందే. ఈ ప్రపంచం బ్రిటిష్ రాచరికాన్ని విశిష్టమైనదిగా పరిగణి స్తుందనే సత్యాన్ని ఈజిప్టు రాజు పేర్కొన్నారు. బ్రిటన్ రాచరికానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే నా వద్ద కచ్చితమైన సమాధానం లేదు. కానీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ‘ది క్రౌన్’ వెబ్ సిరీస్‌కి ఉన్న ప్రజాదరణే దానికి రుజువుగా నిలుస్తుంది. బహుశా బ్రిటన్ ప్రదర్శనా సామర్థ్యం, దాని పురాతన సంప్రదాయాలు, ఆచారాలను ఆ సిరీస్ చక్కగా చూపించింది కాబోలు. అవి మనం కోల్పోయిన, మర్చి పోయిన ప్రపంచాన్ని మనకు గుర్తు చేస్తాయి. లేదా బహుశా రాజులు, రాణులు ఆకర్షణీయంగా మనలో శృంగార భావనలను వెలిగించి ఉండవచ్చు. కానీ, డచ్, స్కాండినే వియన్ లేదా జపనీస్ రాచరికం మనల్ని ఉద్వేగపర్చని కాలంలో బ్రిటిష్ రాచరికం పట్ల మనం ఇంత ఆసక్తి ఎందుకు చూపుతున్నట్లు? వాస్తవం ఏమిటంటే బ్రిటిష్ రాచరికాన్నే కాదు... ఎలిజెబెత్ రాణిని ప్రజలు ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తుండటమే. బ్రిటిష్ రాణి చనిపోయినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బ్రిటిష్ ప్రజలను ఉద్దేశించి ప్రసం గించారు. ‘‘మీకు ఆమె ‘మీ రాణి’గా ఉండేవారు. మాకు మాత్రం ఆమె ‘రాణి’గా(‘ద క్వీన్’– రాణి అంటే ఆమె మాత్రమే గుర్తొస్తుంది అన్న అర్థంలో) ఉండేవారు అన్నారాయన. బ్రిటిష్ రాణి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇలా మాట్లాడటమే అద్భుతమైన విషయం. మెక్రాన్ చాలా నిజాయతీగా ఆ మాటలన్నారు. దానికి ఫ్రాన్స్‌లో ఎవరూ ఆయన్ని తప్పుపట్టలేదు. ఇక రెండో లక్షణం ఏమిటంటే, బ్రిటన్ తన భాష ద్వారా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించింది. చాలామందికి ఇంగ్లిష్ అందరూ ఆకాంక్షించే ఒక భాష మాత్రమే కాదు, అది సెకండ్ లాంగ్వేజిగా అందరూ ప్రాధాన్యం ఇచ్చే భాషగా ఉంటోంది. అది బ్రిటిష్ సామ్రాజ్యం కారణంగానా? సరిగ్గా ఉచ్చరించకపోయినా అమెరికా ఆ భాషను పంచు కుంటున్నందునా? లేదా ఏ ఇతర భాషకూ లేని గుణాలు ఇంగ్లిష్‌కి ఉండటం మూలంగానా? ఇది కూడా నాకు తెలీదు. కానీ షేక్స్పియర్ని ప్రపంచమంతా సుప్రసిద్ధుడైన రచయితగా ఎందుకు గుర్తి స్తోంది అనే అంశాన్ని ఇంగ్లిష్ భాషలోని పటుత్వం, దాని సమ్మోహన శక్తి స్పష్టంగా చెబుతాయి. డాంటే, హోమర్, పుష్కిన్, కాళిదాసు వంటి మహా రచయితలు, కవుల గురించి మీరు ఆలోచించవచ్చు. కానీ ‘గాయక కవి’ అని మనం పిలుచుకునే షేక్స్పియర్ ముందు వీరంతా తేలిపోతారు. బ్రిటన్ ప్రభావం బీబీసీ అంత అతి విస్తృతమైన ప్రభావంతో ఎందుకుందో మూడో కారణం కూడా చెబుతాను. సీఎన్ఎన్ అంత వనరులు బీబీసీకి లేకపోవచ్చు. బ్రిటిష్ ప్రజలే దాన్ని విమర్శిస్తూ ఉండవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వాలే బీబీసీని మూసివేయాలని తరచుగా ప్రయత్నించాయి. కానీ బయటి ప్రపంచంలో సమగ్రత, నిర్దిష్టత రీత్యా బీబీసీకి ఎనలేని గుర్తింపు ఉంది. 1984లో తన మాతృమూర్తి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారన్న విషయాన్ని ఆమె ప్రభుత్వమే రాజీవ్‌గాంధీకి తెలియ జేసినప్పటికీ, దాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆయన బీబీసీని చూశారు. (క్లిక్ చేయండి: మన నిశ్శబ్దం చేసిన గాయం) బ్రిటిష్ ఆకర్షణ శక్తిని వివరించడానికి నేను మరో కారణాన్ని జత చేస్తాను. అదేమిటంటే బ్రిటిష్ వారి హాస్య చతురత. అది కేవలం సున్నితమైంది మాత్రమే కాదు, దాన్ని తక్కువ చేసి చెప్పలేం. మరోలా చెప్పాలంటే బ్రిటిష్ హాస్యచతురత తనను చూసి తానే నవ్వుకుంటుంది. బ్రిటిష్ జోక్స్‌కి తరచుగా రాచకుటుంబమే బలవుతూ ఉంటుంది. ప్రత్యేకించి అందరికంటే ఎక్కువగా ప్రిన్స్ చార్లెస్ కూజా చెవులు, విపరీతమైన అభిరుచులు, చాదస్తపు పద్ధతులపై మరింత ఎక్కువగా జోకులు ఉండేవి. అదే భారతదేశంలో అయితే ప్రధానమంత్రిపై లేక రాష్ట్రపతిపై మీరు పేరడీలు కడితే మీ మీద రాజద్రోహ ఆరోపణలు తప్పవు. హాస్యం లోనే ప్రజాదరణ, దాంతోపాటు అభిమానం కూడా పుట్టుకొస్తాయని బ్రిటిష్ వారు గుర్తించారు మరి. ‘ఎస్, ప్రైమ్ మినిస్టర్’, ‘ది టూ రోనీస్’ వంటి కామెడీ షోలు, లేదా ఇంకా వెనక్కువెళ్లి ‘లారెల్ అండ్ హార్డీ’లను తల్చుకోండి. బ్రిటిష్ వారి హాస్య చతురత తక్కిన ప్రపం చాన్నే నవ్వించింది అంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండ లేరు. ఫ్రెంచ్ ప్రజలు, జర్మన్లు, ఆస్ట్రేలియన్లు లేదా అమెరికన్ల గురించి మీరు ఇలా చెప్పలేరు. (క్లిక్ చేయండి: ప్రజాస్వామ్యంలో రాజరికమా?) విక్టోరియా మహారాణిని మననం చేసుకోవడం ద్వారా నన్ను ఇక సెలవు తీసుకోనివ్వండి. పైకి గంభీరంగా కనిపించే విక్టోరియా రాణికి హాస్యపు నరం లోపించింది. ఎప్పుడూ ఆమె ఉల్లాస రహితంగా, వినోదం అంటే పట్టని వ్యక్తిగా ఉండేవారు. ‘మేం నవ్వడం లేదు’ అనే జాలిగొలిపే పదబంధాన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాను అనే విషయం కూడా విక్టోరియా బహుశా గుర్తించకపోయి ఉండ వచ్చు. ఈ పదబంధం ఇవాళ వ్యంగ్య ప్రధాన చతురతకు మారుపేరుగా ఉంటోది మరి! - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..
రెడీ ఫర్ రిషి అంటూ బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి... ► కోవిడ్–19 పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు. ► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్ డొమిసైల్ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి. ► తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు. ► రిషీ అమెరికా గ్రీన్ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీరూ కావచ్చు, బ్రిటిష్ హైకమిషనర్!
సాక్షి, హైదరాబాద్: భారతీయ యువతుల్లారా.. ఒకరోజు కోసమైనా సరే, బ్రిటిష్ హైకమిషనర్ హోదాను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. అంతర్జాతీయ బాలికల దినోత్సవాల్లో భాగంగా భారతీయ మహిళకు ఒకరోజుపాటు హైకమిషనర్ హోదా కల్పించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం, వేర్వేరు వర్గాలవారితో చర్చలు జరపడం, భారత్ –యూకే భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలగడం ఈ కార్యక్రమం ప్రత్యేకతలు. ఈ పోటీలో పాల్గొనేందుకు 18– 23 మధ్య వయసు గల యువతులు అర్హులు. ‘‘హైకమిషనర్ ఫర్ ద డే’’పోటీలో పాల్గొనదలచినవారు ‘ప్రజాజీవితంలో మీకు స్ఫూర్తినిచ్చే మహిళ ఎవరు? అందుకు కారణాలేమిటి?’’అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఒక నిమిషం వీడియో ద్వారా తెలపాల్సి ఉంటుంది. వీడియోను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో @UKinIndia"‘ను ట్యాగ్ చేస్తూ ‘# DayoftheGir‘ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ షేర్ చేయాలి. ఆసక్తి కలవారు సెప్టెంబర్ రెండోతేదీ వరకూ వీడియోలను పంచుకోవచ్చు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’జరుపుకుంటున్న ఈ తరుణంలో ఒక భారతీయ యువతిని ఒకరోజు హైకమిషనర్‌గా నియమించే అవకాశం దక్కడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం యునైటెడ్ కింగ్డమ్తోపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రా«థమ్యాల్లో ఒకటి. ఈ దేశ యువతులు సత్తాచాటేందుకు ఇదో మంచి అవకాశం. దేశం నలుమూలల నుంచి యువతులు ఈ పోటీలో పాల్గొంటారని ఆశిస్తున్నా’’అని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఇల్లిస్ పేర్కొన్నారు. -
106 రోజుల్లో 106 మారథాన్లతో గిన్నిస్ రికార్డు
Guinness World Record for the most consecutive days to complete a marathon: కేట్ జేడెన్ అనే బ్రిటిష మహిళ వరుసగా అత్యధిక రోజులు మారథాన్ పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసింది. ఈ మేరకు ఆమె 106 రోజుల్లో 106 మారథాన్లను చేసింది. అత్యథిక రోజులు మారథాన్ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కింది. ఆమె గతేడాది డిసెంబర్ 31, 2021 నుంచి ఏప్రిల్ 15, 2021 వరకు చాలామైళ్లు మారథాన్ పూర్తి చేసింది. అలిస్సా క్లార్క్ పేరిట ఉన్న 35 రోజుల మునపటి రికార్డును బ్రేక్ చేసింది. ఆమె ఈ మారథాన్‌ని నిధులు సేకరణ కోసం చేస్తోంది. మానసిక ఆరోగ్య సేవలకు, శరణార్థుల మానవతా సాయానికి విరాళాలు ఇచ్చేందుకు ఆమె ఈ నిధులు సేకురిస్తోంది. ఈ క్రమంలో జేడెన్ తన ఇన్‌స్టాగ్రాంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంబంధించిన పోస్ట్‌లను నెటిజన్లుతో పంచుకున్నారు. దీంతో నెటిజనలతో మీరు అద్భుతమైన విజయం సాధించారంటూ అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఆమె మొదట్లో వంద రోజుల్లో 100 మారథాన్లు పూర్తి చేయాలని భావించింది. ఆమె మారథాన్ చేసిన ప్రదేశాలు అలెప్పో, సిరియా, యునైటెడ్ కింగ్డమ్ మధ్య దాదాపు 2620 మైళ్ల దూరం ఉంటుంది. వాస్తవానికి ఈ మార్గం ఆశ్రయం శరణార్థులు తరచూ ప్రయాణించే మార్గం కావడం విశేషం. (చదవండి: భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రికి బెదిరింపులు..
లండన్: బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్(57)కు పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్‌చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడన్నారు. -
ఆగస్టు 2: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు!
స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1858 ఆగస్టు 2 గురించి భారతీయులు ఇప్పటికీ ఈ మాటే అనుకుంటారు! ఆ ముందు ఏడాదే దేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఎవరి మీద తిరుగుబాటు అంటే.. ఆప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న ‘బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ’ మీద. పాలిస్తే బ్రిటన్ పార్లమెంటు పాలించాలి గానీ, వ్యాపారం చేసుకోడానికి ఇండియా వచ్చిన బ్రిటన్ కంపెనీ (ఈస్టిండియా) పాలించడం ఏంటి? ఏంటంటే.. పాలించుకొమ్మని బ్రిటన్ పార్లమెంటే ఈస్టిండియా కంపెనీకి ఆమోదముద్ర వేసింది! అప్పట్నుంచీ ఇండియాలో ఈస్టిండియాది ఇష్టారాజ్యం అయిపోయింది. సిపాయిల తిరుగుబాటు మొదలయ్యాక, ఇక అది ఆగదని బ్రిటన్ ప్రభుత్వం గ్రహించి భారత పాలనా పగ్గాలను ఈస్టిండియా కంపెనీ నుంచి లాగేసుకుంది. అలా లాగేసుకుని, తను తీసేసుకున్న రోజే ఆగస్టు 2. అంటే ఈస్టిండియా కంపెనీ అనే పెనంలోంచి, బ్రిటన్ అనే పొయ్యిలోకి భారతీయులు వచ్చిపడ్డారు. ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858’ అనే చట్టం ద్వారా ఈ అధికార సంక్రమణ జరిగింది. -
లిజ్ ట్రస్‌కే 90 శాతం విజయావకాశాలు
లండన్: బ్రిటిష్ ప్రధానమంత్రి పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీ నేతలు రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇరువురు తమ పార్టీ సభ్యుల మద్దతు పొందడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే లిజ్ ట్రస్‌కే పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. సర్వేల్లో ఆమె ముందంజలో ఉన్నట్లు తేలింది. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానంటూ ట్రస్ ఇస్తున్న హామీ వైపు అందరూ ఆకర్శితులవుతున్నట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఉన్నాయని ప్రఖ్యాత బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ ‘స్మార్కెట్స్’ తాజాగ ప్రకటించింది. రిషి సునాక్‌కు కేవలం 10 శాతం అవకాశాలే ఉన్నాయని స్పష్టం చేసింది. ట్రస్‌కు తొలుత 60 శాతం విజయావకాశాలు ఉండగా, అది ఇప్పుడు 90 శాతానికి చేరడం ఆసక్తికరంగా మారింది. ఇక రిషి విజయావకాశాలు 40 శాతం నుంచి 10 శాతానికి పడిపోయాయి. పరిస్థితులు మొత్తం ట్రస్‌కు క్రమంగా సానుకూలంగా మారుతున్నాయని స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్స్ అధినేత మాథ్యూ షాడిక్ చెప్పారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ టీవీ చర్చా కార్యక్రమాల్లో రిషి కంటే లిజ్ ట్రస్ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. తాను వెనుకంజలో ఉన్నా చివరి దాకా పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని రిషి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మహోజ్వల భారతి: ‘నల్లదొరతనం’ పై రాయనన్న దేశభక్తుడు
సహాయ నిరాకరణోద్యమ స్ఫూర్తితో గరిమెళ్ల సత్యనారాయణ వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఎంతలా జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడించుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు. అంతటి మనిషికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పాలకుల వల్ల ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రబలిన అవినీతికి విసిగి వేసారిన గరిమెళ్ల మిత్రుల్లో కొందరు ఆయనను ‘మాకొద్దీ నల్లదొరతనము..’ అంటూ కొత్త పాట రాయాల్సిందిగా కోరారు. అయితే, నరనరానా దేశభక్తిని జీర్ణించుకున్న ఆయన అందుకు అంగీకరించలేదు. దుర్భర దారిద్య్ర పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 52 ఏళ్ల వయసుకే తుదిశ్వాస విడిచారు. నేడు గరిమెళ్లవారి జయంతి. 1893 జూలై 14న ఆయన శ్రీకాకుళంలోని నరసన్నపేటలో జన్మించారు. -
సేవకుల తయారీ విధానమది
వారణాసి: బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా గురువారం వారణాసిలో ఆయన పర్యటించారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుపై ఏర్పాటైన మూడు రోజుల ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’ సమ్మేళనాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్ల విద్యావిధానంలో స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులు జరిగినా చాలా వరకు పాతవే కొనసాగుతున్నాయన్నారు. కేవలం డిగ్రీ హోల్డర్లను తయారు చేయడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడమే విద్యావిధానం లక్ష్యం కావాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని క్యాంపస్‌లలో కల్పించాలి. విద్యావిధానం ద్వారా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యువతను సంసిద్ధులను చేయడమనే గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. ‘వినూత్నమైన, నవీనమైన కొత్త ఆలోచనలను ఈ వేదికపై చర్చించాలి. వర్సిటీకి 50–100కిలోమీటర్ల పరిధిలోని సమస్యలను, వనరులను గుర్తించి, వాటికి పరిష్కారాలను కనుగొనాలి. ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి’ అని విద్యార్థులకు ప్రధాని సూచించారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనల ద్వారా ఆధార సహిత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా పర్యటించిన ప్రధాని..అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాలను ప్రారంభించారు. ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌లో లక్ష మంది విద్యార్థులకు భోజనం తయారు చేసేందుకు వీలుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని రూ.1,774 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంపూర్ణానంద స్టేడియంలో ఏర్పాటైన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..అభివృద్ధి అంటే పైపై మెరుగులు కాదు..పేదలు, అణగారిన, గిరిజన వర్గాల సాధికారతేనని అన్నారు. ‘ఎంపీగా సేవచేసేందుకు కాశీ నాకు ఒక అవకాశమిచ్చింది. స్వల్పకాలిక పనులతో కొందరు లాభపడి ఉండొచ్చు. కానీ, అలాంటి వాటితో దేశం అభివృద్ధి చెందదని కాశీ ప్రజలు కోరుకున్నారు. వారి ముందుచూపువల్లే ప్రస్తుతం వారణాసిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ మొత్తం ప్రాంతం దీనివల్ల ప్రయోజనం పొందుతోంది. దివ్య, నవ్య, భవ్య కాశీ అనే రీతిలో ఎనిమిదేళ్లుగా అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని చెప్పారు. మీ ప్రతిభ అమోఘం జాతీయ విద్యావిధానం సమ్మేళనానికి హాజరైన ప్రధాని మోదీ స్కూలు విద్యార్థుల ప్రతిభాపాటవాలను చూసి ముగ్ధులయ్యారు. ఆయన చుట్టూ చేరిన స్కూలు పిల్లలు ఒకరు శివతాండవ స్తోత్రమ్ ఆలపించగా మరొకరు డ్రమ్ వాయించారు. ఒకరు యోగాసనాలు వేసి చూపించగా మరొకరు స్వచ్ఛతా కార్యక్రమం ప్రాముఖ్యంపై పాట పాడారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంది. మీ అందరూ చాలా ప్రతిభావంతులైన చిన్నారులు’అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి రోజూ పరిశుభ్రత పాటిస్తున్నారా? వ్యాయామం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా వారంతా అవునని సమాధానమిచ్చారు. -
రికార్డులు తిరగరాసేసింది
ఐదేళ్ల వయసు... ఆల్ఫాబెట్స్‌ను కూడా స్పష్టంగా పలకడం రాదు కొందరికి. కానీ ఆ వయసులో పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అంతేనా అందులోని బొమ్మలు సైతం తానే గీసింది. ‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 జనవరి 2022నాటికి ఆమె వయసు సరిగ్గా ఐదేళ్ల 211 రోజులు. జనవరిలో పబ్లిష్ అయితే... రికార్డుకు ఎందుకు లేటయ్యిందంటే... గిన్నిస్ టైటిల్ గెలవాలంటే కచ్చితంగా అది వెయ్యి కాపీలు అమ్ముడవ్వాలనేది సంస్థ నియమం. యూకేలోని వేముత్లో 2016 జూలై 14న పుట్టిన బెల్లా జె డార్క్ పుస్తకం రాస్తానని చెప్పినప్పుడు పిల్ల చేష్టలు అనుకున్నారు వాళ్లు. 32 పేజీల పుస్తకం రాసి ముందు పెడితే షాకయ్యారు. పుస్తకాన్ని ఫెయిర్ చేయడంలో బెల్లాకు తల్లి చెల్సీ సైమ్ సహకరించింది. కథేంటంటే.. తల్లిదండ్రులు వెంట లేకుండా బయటికి వెళ్లిన బాలిక తనకు ప్రియమైన పిల్లిని పోగొట్టుకుంటుంది. అది పోయినందుకు ఆమె పడిన బాధ, వెంట ఎవరూ లేకుండా అలా వెళ్లకూడదన్న సందేశం ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పింది బెల్లా తల్లి చెల్సీ. సినిమాలకేనా పార్ట్ వన్, పార్ట్ టూలు... ద లాస్ట్ క్యాట్ 2 చదవడానికి సిద్ధంగా ఉండండంటున్నారు బెల్లా తల్లిదండ్రులు. -
అరుదైన కరెన్సీ నోటు వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా!
ఒక చారీటీ దుకాణంలో దొరికిన బ్యాంకు నోటు ఆన్లైన్ వేలంలో అత్యంత అధిక ధరకు అమ్ముడుపోయింది. ఆ నోటు విలుకంటే అధిక రెట్లు అమ్ముడుపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఏంటా కరెన్సీ నోటు? ఆ నోటుకి ఉన్న ప్రత్యేకత ఏంటో అనే కదా! వివరాల్లోకెళ్తే....పాలస్తీనాలోని ఎసెక్స్‌లో ఆక్స్‌ఫామ్ వాలంటీర్ పాల్ అనే వ్యక్తి బ్రెంట్వుడ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు 100 పౌండ్ల కరెన్సీ నోటు దొరికింది. అది 1927 ఏళ్ల నాటి బ్రిటిష్ మాండేట్ సమయంలో ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసిన నోటు. ఆ నోటును పాల్ తన ఇంటి అరమారలో ఉంచాడు. ఆ తర్వాత దాన్ని అలా ఉంచకూడదని లండన్‌లోని స్పింక్ వేలం హౌస్‌లో వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆ నోటుని ఆన్లైన్లో వేలానికి ఉంచగానే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 1.3 కోట్ల రూపాయలు పలికింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి ఆనోటు విలువ కేవలం రూ. 29 లక్షలు కానీ వేలంలో ఊహించని విధంగా అధిక ధర పలకింది. ఈ మొత్తం ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెళ్తుందని బ్రిటిష్ మీడియా తన నివేదికలో పేర్కొంది. ఇంతకీ ఈ ఆక్స్‌ఫామ్ సంస్థ తూర్పు ఆఫ్రికాలో కరువు పీడిత ప్రజలకు, ఉక్రెయిన్ నుండి వచ్చిన శరణార్థులను అక్కున చేర్చుకుని సేవలందిస్తోంది. (చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది) -
హైదరాబాద్‌లో హష్మత్‌గంజ్ గేటు.. పట్టించుకోపోతే అంతే!
సాక్షి, హైదరాబాద్: ఇదో గేటు.. ఓ రాజప్రాసాదం ప్రవేశ ద్వారం. దీని వయసు దాదాపు 217 ఏళ్లు. బ్రిటిష్ పాలకులు నిర్మించారు. అందుకే దీని శిఖర భాగంలో ఇప్పటికీ రెండు సింహాలతో కూడిన నాటి ఈస్టిండియా కంపెనీ చిహ్నం కనిపిస్తుంది. కానీ ఈ గేటు ఇప్పుడు తప్పిపోయింది. భవనమెక్కడో.. ఈ ద్వారమెక్కడో అన్నట్టు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. ఇలా ఒంటరిగా ఇరుకు సందుల్లో ఇరికిపోయింది. వందల ఏళ్లనాటి డంగుసున్నపు నిర్మాణం కావటంతో పట్టించుకునేవారు లేకున్నా పటిష్టంగా నిలిచి ఉంది. కానీ మరమ్మతులు చేయకపోతే మాత్రం ఇక నిలవలేనంటోంది. దీన్ని హష్మత్‌గంజ్ గేటు అని పిలుస్తారు. ఎందుకు తప్పిపోయింది.. ఏంటా కథ హైదరాబాద్‌కు ఐదో రెసిడెంట్‌గా వ్యవహరించిన కిర్క్ పాట్రిక్ 1805లో బ్రిటిష్ రెసిడెంట్ కోసం రాజప్రాసాదం నిర్మించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ శైలితో అచ్చుగుద్దినట్టు అదే డిజైన్‌తో, అదే సమయంలో ఈ రెసిడెన్సీ నిర్మితమైంది. ప్రస్తుతం దీన్ని కోఠి మహిళా కళాశాలగా పిలుస్తున్నారు. ఈ రెసిడెన్సీకి వివిధ మార్గాల్లో ద్వారాలు నిర్మించారు. ప్రస్తుతం సుల్తాన్‌బజార్–బడీచౌడి మార్గంలో ఉన్న హష్మత్‌గంజ్ గేటు కూడా వీటిల్లో ఓ ద్వారం. అప్పట్లో రెసిడెన్సీ చుట్టూ చిన్న ప్రహరీ తప్ప పెద్ద కోటగోడ లేదు. 1857తో తిరుగుబాటులో భాగంగా బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి జరగడంతో చుట్టూ భారీ గోడ నిర్మించారు. ప్రస్తుత ఆంధ్రాబ్యాంకు ప్రధాన రహదారిని 1950 ప్రాంతాల్లో నిర్మించారు. ఆ సమయంలో మధ్యలో దారి రావడంతో భవనానికి, ఈ ద్వారానికి మధ్య అనుంబంధం తెగిపోయింది. ఆ తర్వాత భవనంలో మహిళా కళాశాల ఏర్పాటు చేశారు. దీని బాగోగులను ఉస్మానియా విశ్వవిద్యాలయం, పురావస్తు శాఖలు చేపడుతూ రాగా క్రమంగా ఈ గేటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలోకి వెళ్లిపోయింది. ఇక ఆలనాపాలనా నిలిచిపోయింది. భారీగా నిధులొచ్చినా.. వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ నుంచి రూ. కోట్ల నిధు లు రావటంతో రెసిడెన్సీ భవనంలోని ప్రధాన దర్బార్ హాలుతో పాటు మరికొన్ని భాగాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పునర్ వైభవం కల్పించా రు. కానీ ఆ భవనంలో భాగంగా నిర్మితమైన ఈ ద్వారానికి నయా పైసా కేటాయించలేదు. బడీచౌడి రోడ్డులోని చిరు వ్యాపారులు ఈ ద్వారం గోడలకు మేకులు దింపి వస్తువులు తగిలించుకోవడానికి వాడుతున్నారు. పట్టించుకునేవారు లేక ఈ కట్టడం క్రమంగా శిథిలమవుతోంది. పట్టించుకుంటే.. పర్యాటక ప్రదేశమవుతుంది ఈ ద్వారం ఎంతో ప్రత్యేకమైంది. దీని చుట్టూ నిర్మాణాలు తొలగించి గేటును విడిగా చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. లైటింగ్ బిగించి కట్టడం వివరాల బోర్డులు ఏర్పాటు చేస్తే అద్భుత పర్యాటక ప్రదేశమవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి – తురగ వసంత శోభ, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ -
హైదరాబాద్ డాక్టర్‌కు బ్రిటిష్ అత్యున్నత అవార్డు
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ రెండో అత్యున్నత ర్యాంకింగ్ అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్–2021’ను ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. లండన్ దగ్గర్లోని విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన వేడుకలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్‌లో రొమ్ము కేన్సర్ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్ ఈ అవార్డును పొందారు.కిమ్స్ఆస్పత్రిలోని సహో ద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భార తీయ శస్త్ర చికిత్స డాక్టర్లకు ఈ అవార్డును అంకి తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రఘురామ్ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్ నేషనల్ అవార్డును అప్ప టి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. -
భారత్‌పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్‌పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్‌కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్‌ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్‌ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్‌గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్‌లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన చైనా -
ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!
British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్‌లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్‌లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. (చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!) అయితే ఆమె జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది. అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్‌లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్ ప్రీతీ" క్యాప్షన్‌ని జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ మేరకు బ్రిటీష్ సైన్యం ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు. (చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు) View this post on Instagram A post shared by Preet Chandi (@polarpreet) -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్‌వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్‌వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్‌వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!
Pilots False Positive Covid Report: కొన్ని ప్రయాణాలు మనం మధురానుభూతుల్ని ఇస్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేయడమే కాక మళ్లీ ఇంకెప్పుడు ప్రయాణాలు చేయకూడదనే భావం కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలోని ప్రయాణీకులకు ఎదురైంది. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) అసలు విషయంలోకెళ్లితే.....బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల బృందం ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయింది. వారు పయనిస్తున్న విమాన పైలట్‌కి కరోనా పాజిటివ్ రావడంతో లండన్ నుండి బార్బడోస్‌కు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్‌కు ముందు బ్రిటిష్ ఎయిర్వేస్ నిలిపివేసింది. అయితే అప్పటికప్పుడు మరో పైలెట్‌ని నియమించడం ఆలస్య అవుతుందని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించడమే కాక ప్రయాణికులను విమానంలోంచి దింపేసింది. నిజానికి ఆ విమానం అప్పటికే రెంగు గంటలు ఆలస్యం. అయితే విమానం బయలుదేరడానికి సిద్ధం అయ్యిందో లేదా మళ్లీ ఈ కారణంగా మరింత ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురైయ్యారు. అంతేకాదు ఆ ప్రయాణికులదరికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఆహారాన్ని అందజేసింది. అయితే ఐదు గంటల తర్వాత ప్రయాణికులందర్నీ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పైలట్‌కి కోవిడ్ అని తప్పుడు రిపోర్ట్ వచ్చింది అంటూ ఎయిర్వేస్ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమపణలు మాత్రమే కాదు మాకు చక్కగా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు అని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు తెలియజేసింది. పైగా బార్బడోస్‌లో దిగినప్పుడు ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ ప్రయాణికులకు కరేబియన్ రమ్ బాటిళ్లను అందజేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
లిప్టన్ గ్లోబల్ టీ వ్యాపారాన్ని వేల కోట్లకు అమ్మేసిన యూనిలీవర్ పిఎల్సీ
ప్రముఖ బ్రిటిష్ కంపెనీ యూనిలీవర్ పిఎల్సీ తన గ్లోబల్ టీ వ్యాపారాన్ని సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ కు 4.5 బిలియన్ యూరోలకు(సుమారు రూ.37 వేల కోట్లు) విక్రయించడానికి అంగీకరించింది. రెండు సంవత్సరాలకు పైగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. లిప్టన్, పిజి టిప్స్, పుక్కా హెర్బ్స్, టిఏజెడ్ఒతో సహా వంటి 34 టీ బ్రాండ్లు ఎకాటెర్రా కింద ఉన్నాయి. ఈ కంపెనీ 2020లో 2 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఉత్పత్తి చేసింది. అయితే, యూనిలీవర్ తన భారతదేశం, ఇండోనేషియా టీ కార్యకలాపాలను అలాగే పెప్సికో(పెప్) కింద ఉంచుకుంది. 2022 ద్వితీయార్ధంలో ముగిసే ఈ ప్రక్రియలో నగదు, రుణ రహిత ప్రాతిపదికన ఎకాటెర్రాను సీవీసీ క్యాపిటల్ ఫండ్ కు విక్రయించనున్నట్లు యూనిలీవర్ గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్ టీ డిమాండ్ క్షీణించడం, వినియోగదారుల అభిరుచులు మారడంతో అనేక సంవత్సరాలుగా నష్టాలు వస్తున్న వ్యాపారం నుంచి యూనిలీవర్ కు ఉపశమనం లభిస్తుంది. ఈ వ్యాపారం వల్ల మొత్తం కంపెనీ మీద ప్రభావం పడుతుంది. పెరిగి పోతున్న ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి కష్టపడుతోంది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇదే అతిపెద్ద ఆదాయ వనరు. (చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!) -
సీఎం జగన్‌ను కలిసిన బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్
-
సీఎం జగన్‌ను కలిసిన బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్
సాక్షి, తాడేపల్లి: బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ టీంను కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్ టీం సీఎం జగన్‌కు వివరించింది. అనంతరం సీఎం జగన్.. డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. -
కరోనాను జయించి.. కనకంతో మెరిసి..
టోక్యో: బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్ టామ్ డియాన్ ఒకటి కాదు... రెండు సార్లు కరోనా వైరస్ బారిన పడ్డాడు. స్వదేశంలోనే అతనిపై ఏమాత్రం అంచనాలు లేవు. కరోనాతోనే సరిపోతుంది... టోక్యోదాకా ఏం వెళతాడులే! అని కొందరంటే... అతనికి ఈ నేషనల్ ట్రయల్సే ఎక్కువని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ టామ్ డియాన్ అలాంటి అభిప్రాయాలను, అనుమానాలను పటాపంచలు చేశాడు. అంచనాల్ని తారుమారు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో టామ్ బంగారు పతకం గెలుపొందాడు. గత సెప్టెంబర్‌లో తొలిసారి అతనికి కోవిడ్ సోకింది. మళ్లీ నాలుగు నెలలకే ఈ జనవరిలోనూ వైరస్ బారిన పడ్డాడు. ఈసారి కరోనా అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు ఓ పట్టాన తగ్గనేలేదు. అందుకే అతనిపై ఎవరికీ నమ్మకం లేకపోయింది. కానీ ఇక్కడ మాత్రం అతనే విజేత! పోటీని టామ్ అందరికంటే ముందుగా 1ని:44.22 సెకన్లలో ముగించాడు. అతని సహచరుడు డన్కన్ స్కాట్ (1ని:44.26 సెకన్లు) రజతం, బ్రెజిల్ స్విమ్మర్ ఫెర్నాండో (1ని:44.66 సెకన్లు) కాంస్యం గెలిచాడు. వందేళ్లలో బ్రిటన్ స్విమ్మర్లు ఒకే ఈవెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలవడం కూడా ఇదే మొదటిసారి. 1908 లండన్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ స్విమ్మర్లు స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. ఆ తర్వాత తాజాగా టోక్యోలోనే దీన్ని పునరావృతం చేశారు. -
2030లో గాల్లో ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
బ్రిటీష్ కు చెందిన ఫరాడైర్ అనే సంస్థ కొత్తగా హైబ్రిడ్ ట్రైప్లేన్‌ను అభివృద్ధి చేస్తున్నది. 2030 నాటికి ప్రయాణికులను తరలించే స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తున్నది. ఈ విమానం ద్వారా స్వల్ప దూరాలకు ప్రయాణికులను, సరుకులను వేగవంతంగా తరలించే అవకాశం ఉంటుంది. 18 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్ధ్యంతో విమానాన్ని రూపొందిస్తున్నారు. హైబ్రిడ్ ట్రైప్లేన్ గరిష్టంగా 5 మెట్రిక్ టన్నులను మోసుకెళ్లే సామర్ధ్యంతో కేవలం 15 నిమిషాల్లో కార్గో విమానంగా మార్చుకునేలా దీనిని సిద్ధం చేస్తున్నారు. బయో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఎయిర్‌క్రాఫ్ట్(బీఈహెచ్ఏ) అని పిలువబడే ఈ మోడల్ లో ఇంధనంగా పేరుకు తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ - బయో ఫ్యూయల్ ఇంధనాన్ని వాడుతున్నారు. పర్యావరణ అనుకూల విమానాన్ని తయారు చేయడం తమ ఉద్దేశ్యమని సంస్థ పేర్కొంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తక్కువ ఖర్చుతో వేగంగా స్వల్ప దూర బాగా ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. బీఈహెచ్‌ఏలోని రెక్కలు మెరుగైన పనితీరును అందించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇంకా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బ్యాటరీలు అందుబాటులో లేవని వారు పేర్కొన్నారు. జీకేఎన్ ఏరోస్పేస్ అనే సంస్థ ఇప్పటికే 50 మంది ప్రయాణికులను తీసుకొళ్లేలా ఒక కాన్సెప్ట్ సిద్ధం చేస్తుంది. చదవండి: కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్! -
War of the Golden Stool: సరిగ్గా ఇదే రోజు రగిలింది విప్లవాగ్ని...
బ్రిటీష్‌వారి కన్ను గోల్డ్‌కోస్ట్ (ఈనాటి ఘనా)పై పడింది. యుద్ధానికి కాలుదువ్వారు. అయితే బ్రిటిష్ ప్రభువులకు అంత తేలిగ్గా ఆ రాజ్యం చేజిక్కలేదు. నాలుగో ప్రయత్నంలో మాత్రమే గోల్డ్కోస్ట్ను స్వాధీనపరుచుకోగలిగారు. అయితే వారి దృష్టి బంగారు సింహాసనంపై పడింది (పేరుకే ఇది సింహాసనం. పీట సైజులో ఉంటుంది. అందుకే గోల్డెన్ స్టూల్ అని పిలిచారు) ‘నువ్వెక్కడైనా రాజేకానీ ఇక్కడ మాత్రం కాదు. ఈ సింహాసనంపై కూర్చోడానికి వీలులేదు’ అని ఎదురు తిరిగి ఆ సింహాసనంపై తమకు ఉన్న పవిత్రభావాన్ని, సెంటిమెంట్‌ను చాటుకున్నారు జనాలు. ‘ఆరునూరైనా కూర్చొని తీరుతాను’ అని ఆవేశపడ్డాడు బ్రిటీష్ గవర్నర్. అంతే...జనం కోసం సైనికులు కాదు జనమే సైనికులై జంగ్ సైరన్ ఊదారు. మార్చి 28,1900 లో యుద్ధం మొదలైంది. ఆరునెలల పాటు కొనసాగింది. ఎంతోమంది చనిపోయారు. బలమైన బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తి ముందు వారు నిలవలేక పోవచ్చు. కానీ ఆ సింహాసనాన్ని బ్రిటిష్‌వారికి దక్కకుండా, మూడో కంటపడకుండా దాచడంలో విజయం సాధించారు. ఆ తరువాత కాలంలో మాత్రం ఈ సింహాసనంపై ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించారు బ్రిటిష్ పాలకులు. చరిత్రలో సామాన్యుడి పోరాటానికి పట్టం కట్టిన ఈ యుద్ధం ‘గోల్డెన్స్టూల్ వార్’గా ప్రసిద్ధి పొందింది. -
‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే
మార్చి 8 మహిళాశక్తి బర్త్ డే! బాయ్స్ అండ్ బిగ్ బాయ్స్.. ఆరోజు మీరు మీ మహిళకు.. మీ బాస్, మీ కొలీగ్, మీ టీచర్, మీ మదర్, వైఫ్, సిస్టర్ .. వారెవరైనా సరే.. శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకండి. ‘మేడమ్ మీవల్లే’ ‘అమ్మా నన్ను కన్నందుకు’ ‘సోదరీ తోడున్నావు’ ‘సహచరీ నీడవయ్యావు’ కృతజ్ఞతగా ఒక్కమాట. ఒక్క ప్రణామం. ప్లస్.. వాళ్లను రెస్పెక్ట్ చేస్తూ ఒక ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్! బార్బీ బొమ్మల తయారీ కంపెనీ ‘మటెల్’ కూడా ఈ ఏడాది ఉమెన్స్ డే కి మహిళాశక్తిని రెస్పెక్ట్ చేస్తూ డీజే క్లారా గా ఒక కొత్త బార్బీని మార్కెట్ లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా బ్రిటిష్ రేడియో ప్రెసెంటర్. ‘పవర్ గర్ల్’ బార్బీ, ‘సూపర్ ఉమన్’ క్లారా ప్రతి మహిళలోనూ ఉంటారు. మహిళే మన రోల్ మోడల్. అమ్మాయిలూ.. (లేదా) మహిళలూ.. మీరొక సెలబ్రిటీ అనుకుందాం. ‘అనుకోవడం ఏంటీ! నేను సెలబ్రిటీనే’ అంటారా! మరీ మంచిది. ‘ఉమెన్స్ డే’ కి మీకు రెండు గిఫ్టులు. అయితే రెండూ కాదు. ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలి. మొదటిది: ఆస్కార్ అవార్డు. రెండోది: మీ తెలివి తేటలతో, మీ రూపలావణ్యాలతో, మీ ప్రొఫెషనల్ ప్రతిభా సామర్థ్యాలతో, అచ్చంగా మీలా ఉండే బార్బీ డాల్ మీ పేరిట మార్కెట్లో రిలీజ్ అవడం. రెండిట్లో ఏది కోరుకుంటారు? పైకి చెప్పక్కర్లేదులెండి. డీజే క్లారా సంతోషాన్ని చూసినవాళ్లు ఎవరైనా ఏమంటారంటే.. మీరసలు ఆస్కార్ వైపే చూడరని! ‘ఎలా చెప్పగలరు మీరలా!’.. అంటారా? డీజే క్లారా ప్రస్తుతం ఆకాశం పట్టనంత సంతోషంగా ఉన్నారు. ఆమెను రోల్ మోడల్‌గా చూపుతూ.. బార్బీ బొమ్మలు తయారు చేస్తుండే ప్రపంచ ప్రసిద్ధ ‘మటెల్’ టాయ్స్ కంపెనీ ‘డీజే క్లారా బార్బీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ‘ఒక మహిళకు ఇంతకన్నా గౌరవం ఏముంటుంది?’ అంటున్నారు క్లారా. తన రూపంలో ఉన్న ఆ కొత్త బార్బీ డాల్‌ను రెండు చేతులతో అందుకుని అపురూపంగా చూసుకుంటూ ఆమె మురిసిపోతున్నారు. 36 ఏళ్ల క్లారా యాంఫో (ఆమె పూర్తి పేరు) ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ. లండన్‌లో బి.బి.సి. రేడియో ప్రెజెంటర్. బి.బి.సి టెలివిజన్ లో వ్యాఖ్యాత. క్లారాయాంఫో డాట్ కామ్‌లోకి వెళ్లి చూస్తే ఆమె గురించి అంతా తెలిసిపోతుంది. అంత ఓపిక లేకపోతే క్లారా బార్బీ డాల్‌ను చూసినా సరే. క్లారా బాహ్య సౌందర్యాన్ని, ఆమె అంతఃశక్తిని ప్రతిఫలించేలా ఉంది క్లారా బార్బీ. కంగ్రాట్స్ క్లారా. మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ∙∙ బార్బీ ‘గర్ల్ పవర్’ అయితే, క్లారా ‘సూపర్ ఉమెన్’, ఇద్దరూ కలిసిన ‘పవర్ ఉమన్’.. మహిళ. ఫలానా మహిళ అని కాదు. ప్రతి మహిళా! మన మేడమ్, మన కొలీగ్, మన టీచర్, మన సహోద్యోగి, స్నేహితురాలు, అమ్మ, సోదరి, జీవిత సహచరి.. చుట్టూ ఎంత శక్తి! మనల్ని బతికిస్తున్న, మనల్ని నడిపిస్తున్న, మనిషంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్న శక్తులు. ఆ శక్తులకు, సామర్థ్యాలకు ప్రతీకలే క్లారా, క్లారా బార్బీ. క్లారా మొదట డాన్సర్. తర్వాత డీజే (డిస్క్ జాకీ). బి.బి.సి. టీవీలో ‘స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్’ అనే డాన్స్ పోటీల ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఇప్పటికీ వస్తోంది. ‘స్ట్రిక్ట్లీ’ అంటారు షార్ట్‌కట్‌లో. ఆ ప్రోగ్రామ్ కంటెస్టెంట్‌గా వచ్చి, బి.బి.సి.లోనే రేడియో ప్రెసెంటర్‌గా ప్రసిద్ధి చెందారు క్లారా. అయితే బార్బీగా ఆమె అవతరించడానికి అదొక్కటే కారణం కాదు. జాతి వివక్షకు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తన జాతి హక్కుల కోసం నిలబడ్డారు. గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా బ్రిటన్‌లో జరిగిన అనేక సభల్లో ఆమె ప్రసంగించారు. బి.బి.సి.లో ఉద్యోగం పోతుందనీ, ఉద్యోగం పోతే గుర్తింపు ఉండదని అనుకోలేదు. ఆమె నిబద్ధతని బ్రిటన్ గుర్తించింది. ‘ది ఫేసెస్ ఆఫ్ హోప్’ అంటూ బ్రిటిష్ ‘వోగ్’ పత్రిక 2020 సెప్టెంబర్ సంచిక కోసం తను ఎంపిక చేసిన 40 మంది సామాజిక కార్యకర్తల్లో ఒకరిగా క్లారాకు స్థానం కల్పించింది. బార్బీగా కూడా ఇప్పుడు స్థానం పొందడాన్ని క్లారా తన అదృష్టంగా భావిస్తున్నారు. ‘‘నా ప్రొఫెషనల్ లైఫ్‌కు లభించిన గౌరవమిది. శక్తికి, ఆత్మవిశ్వాసానికి ఆదర్శవంతమైన ఒక బార్బీని అవడం కన్నా అదృష్టం ఏమంటుంది!’’ అంటున్నారు క్లారా ఎంతో గర్వంగా. ‘మిల్క్ హనీ బీస్’ అని లండన్‌లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నల్లజాతి మహిళలకు, బాలికలకు సృజనాత్మక రంగాలలో చేదోడుగా ఉంటుంది. ఆ సంస్థకు చేదోడుగా కూడా క్లారా ఉంటున్నారు. కలలకు రూపం బార్బీ ప్రపంచంలో ఎన్ని రంగాల్లోనైతే మహిళలు రాణిస్తున్నారో అన్ని రంగాల మహిళలకూ బార్బీలో రోల్ మోడల్స్ వచ్చేశాయి. ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) సహా దాదాపు 200 జాబ్ ఫీల్డ్స్‌లో బార్బీ బొమ్మలు ఉన్నాయి. ఆడపిల్లల ఆశలకు, వాస్తవాలకు మధ్య ఉండే ‘డ్రీమ్ గ్యాప్’ను చెరిపేయడానికే బార్బీ ఆవిర్భవించింది. తొలి బార్బీ 1959లో ఫ్యాషన్ డాల్‌గా అమెరికన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ బార్బీ సృష్టికర్త రూత్ హ్యాండ్లర్ అనే మహిళ. ఆగమనంతోనే ఆడపిల్లలకు ఆత్మీయనేస్తం అయింది బార్బీ. తోబుట్టువు పుట్టినంతగా సంతోషించారు. ఆడపిల్లల్ని కనుక మనం సంతోషంగా ఉంచగలిగితే వాళ్లు ఏదైనా సాధించగలరు అని మార్లిన్ మన్రో అంటుండేవారు. ఒక బార్బీని కొనిచ్చినా వారు ఏదైనా సాధించగలరు. అయితే వారు కోరుకున్న బార్బీని మాత్రమే. ఎడ్యుకేషన్, మెడిసిన్, మిలటరీ, పాలిటిక్స్, ఆర్ట్స్, బిజినెస్, సైన్స్.. ఏ రంగలోని బార్బీని కోరుకుంటే ఆ బార్బీ. ‘స్పెషల్లీ ఏబుల్డ్’ బార్బీలు కూడా ఉన్నాయి. గత ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి (అక్టోబర్ 11) మానసి జోషీ బార్బీ విడుదలైంది. మానసి ప్యారా–బాడ్మింటన్ ప్లేయర్. అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి గత ఏడాది వచ్చిన తన రోల్ మోడల్ బార్బీతో మానసి జోషి -
ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..!
లండన్: ప్రస్తుత కాలంలో మార్కెట్లో మనకు భిన్న రకాలైన కేకులు అందుబాటులోకి వస్తున్నాయి. మనకు ఎలా కావాంటే ఆ రూపంలో కేకులను తయారు చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఆడ వస్తువులు, మనం ధరించే దుస్తులు, చెప్పుల నుంచి ఆఖరికి వంటింట్లో వాడే కూరగాయల వరకూ ఇలా విభిన్నమైన కేకులు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో మరి వింతగా పెంపుడు జంతువుల రూపంలో కూడా కేకుల వీడియోలు, సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హాస్పిటల్ బెడ్‌పై నవ్వుతున్న ఓ వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి బెడ్‌పై ఒరిగి ఉండగా.. అతడి బెడ్ పక్క టెబుల్‌పై మందులు, క్యాండిల్‌తో పాటు పక్కనే ఓ మహిళ చేతితో కేకు పట్టుకుని అతడికి తినిపించేందుకు రేడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆశ్చర్యంగా ఆ వ్యక్తి కాళ్లు, చేతులు, ముక్కులు ముక్కలుగా కట్ చేసి ఉన్నప్పటికి ఆ వ్యక్తి నవ్వుతూనే కనిపిస్తున్నాడు. దీంతో అదేంటి ఈ వ్యక్తి అలా ఎలా నవ్వుతున్నాడంటు పరీక్షించి చూడగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు. బ్రిటిష్‌కు చెందిన ఓ కేకుల తయారి నిపుణుడు బెన్ కూల్లేన్ వినూత్న ఆలోచన ఇది. ‘ది బేక్ కింగ్’ గా పిలిచే బెన్ వివిధ రూపంలో కేకు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈ క్రమంలో అతడు మరింత భిన్నంగా ఆలోచించి ఏకంగా మనిషి రూపంలో హైపర్ రియలిస్టిక్ కేక్ తయారు చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిజంగా మనిషిలా కనిపిస్తున్న ఈ కేకు మనిషిని చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బెడ్ పడుకున్న వ్యక్తి రూపంలో కేకు తయారు చేసిన అతడి సృష్టికి అవాక్కవుతూ కొంతమంది ప్రశంసిస్తూంటే.. ఇలా హాస్పిటల్ బెడ్‌పై పెషెంట్ వ్యక్తి రూపంలో కేకు తయారు చేయడమెంటో విడ్డూరం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: జాత్యహాంకార వ్యాఖ్యలు: రాజీనామా..) (గాల్లో ఎగిరే దోశలు.. వీడియో వైరల్) -
భారతీయ తంత్రజ్ఞాన పరిచయకర్త
సర్ జాన్ ఉడ్రోఫ్ అనే ఈ పేరు ప్రస్తుత తరానికి ఎంత వరకు తెలుసో మనం ఊహించడం కష్టమే..! కానీ ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన బ్రిటిష్ జాతీయుడు ఈయన. భారతదేశంలో వర్ధిల్లిన తంత్రశాస్త్ర జ్ఞానాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన రచయిత, న్యాయ నిపుణుడైన ఉడ్రోఫ్ దాదాపుగా 20 గ్రంథాల్ని రచిం చాడు. 1915 వరకు కలకత్తా హైకోర్ట్‌లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఈయన భారతీయ తంత్ర శాస్త్రాన్ని శోధించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్నది తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. కలకత్తా హైకోర్ట్‌లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఓ కేసు విషయమై తీర్పు వెలువరించే ప్రక్రియలో తనకెదురైన కొన్ని సంఘటనలు ఆయనలో భారతీయ తంత్రశాస్త్రంపై గొప్ప ఆసక్తిని కలిగిం చాయి. శివచంద్ర విద్యారణ్య భట్టాచార్య అనే గురువు వద్ద దీక్ష తీసుకున్నారు. ఎన్నో ఏళ్ళు సాధనలో గడిపారు. సంస్కృత భాషలో ఉన్న ఎన్నో గ్రంథాల్ని ఇంగ్లిష్ భాషలోకి అనువదిం చారు. చాలావరకు తంత్రశాస్త్ర రహస్యాలు లిఖిత రూపంలో కంటే గురు శిష్య పరంపరగా కొనసాగుతున్నట్లు చెప్పారు. తన సాధనలో అనుభవాని కొచ్చిన ఎన్నో విషయాల్ని తను రాసిన గ్రంథాల్లో పదిలపరిచారు. బౌద్ధ, జైన, హిందూ శాస్త్రాల పరంగా తంత్ర జ్ఞానాన్ని విశదీకరించారు. Introduction to the Tantra Sastra, Ta-ntra of great liberation (Maha nirvana Tantra), Hymns to Goddess, Shakti and Shakta, The Serpent power, Hymn to Kali: Karpuradi Strotra, The World as Power, The Gar-land of letters, Principles of Tantra ఇలా అనేక రచనలు వెలువరించారు. పైగా Arthur Avalon అనే కలం పేరుతో కొన్ని రాశారు. అటల్ బిహారీ ఘోష్ అనే మిత్రుడు ఈ ప్రయత్నంలో తనకు ఎంతో సహకరించినట్లు తెలిపారు. భారతీయ తంత్రశాస్త్రాన్ని మొదటిసారిగా బయట ప్రపంచానికి తన రచనల ద్వారా తెలిపిన ఘనత సర్ జాన్ ఉడ్రోఫ్కే దక్కుతుంది. రిటైరైన తర్వాత బ్రిటన్‌కి వెళ్ళి అక్కడ ఆక్స్ఫర్డ్ యూని వర్శిటీలో బోధించారు. అటు తరువాత ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి Beausoleil అనే ఓ గ్రామంలో స్థిరపడి అక్కడే 1936 జనవరి 16న మరణించారు. ఆ మహానుభావుని జ్ఞప్తికి తెచ్చుకోవడం మన బాధ్యత. – మూర్తి కె.వి.వి.ఎస్., రచయిత, అనువాదకుడు 78935 41003 -
విక్టోరియా భవంతి.. ఆసక్తికర విషయాలు
కళలకు, అపురూపమైన శిల్ప సంపదకు అనంతపురం జిల్లా ప్రసిద్ధి చెందింది. జిల్లాలో అలనాటి ఎన్నో అపురూప కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా నిలిచాయి. నాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా అలరారుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే 75 నుంచి 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పురాతన కట్టడాల పరిరక్షణకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ఇందులో జిల్లా కేంద్రంలోని పాతూరు సీడీ ఆస్పత్రి ఒకటి. తొలి ప్రసూతి కేంద్రంగా ఖ్యాతి గడించిన ఈ ఆస్పత్రిని అప్పట్లో ‘క్వీన్ విక్టోరియా ఆస్పత్రి’గా పిలిచేవారు. చరిత్రకు సాక్షీభూతమై నిలుస్తూ నేటికీ అదే రాజసాన్ని ఒలకబొస్తున్న ‘ది క్వీన్ విక్టోరియా’ పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, అనంతపురం: అనంత జిల్లా ఏర్పాటు వెనుక సుదీర్ఘ చరిత్రనే ఉంది. అశోకుడి మొదలు.. నొలంబులు, గంగరాజులు, చోళులు, హోయసలలు, యాదవులు, రాయలు, మొఘలలు, నిజాముల వరకూ అందరి పాలనను చవిచూసిన ఈ ప్రాంతాన్ని 1800వ సంవత్సరంలో సైనిక సహకార పద్ధతి కారణంగా బ్రిటీష్ వారికి నిజాం నవాబు అప్పగించారు. అలా బళ్లారి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో తొలుత బ్రిటీష్ వారు కాలు పెట్టారు. తర్వాత 1882లో అనంతపురం జిల్లాను ఏర్పాటు చేశారు. వారి హయాంలో నిర్మించిన అపురూప కట్టడాలు ఎన్నో ఈ జిల్లాలో నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయ. అందులో ఒకటి విక్టోరియా ఆస్పత్రి. నేటి తరానికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ ఆస్పత్రి నిర్మాణంలో దాగి ఉన్నాయి. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన అనంతపురంలో 1901 నాటి వరకు పట్టణ జనాభా కేవలం 8వేలు మాత్రమే ఉండేది. పేరుకు జిల్లా కేంద్రమైనా.. గర్భిణులకు సరైన వైద్య చికిత్సలు అందేవి కావు. పురుడు పోసుకోవాలంటే సరైన ఆస్పత్రులు లేవు. చాలా మంది ఇంటి వద్దనే మంత్రసాని సాయంతో పురుడు పోసుకునేవారు. దీంతో అప్పటి బ్రిటీష్ అధికారి మెక్లాడ్... అనంతపురంలోని చెరువు కట్టకు సమీపంలో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1903లో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆ రోజుల్లో లేడీ హాస్పిటల్‌గా పిలిచే ఈ భవంతిని అప్పటి గవర్నర్ ఆఫ్ మద్రాస్‌గా ఉన్న హామ్టిల్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఎంతో పటిష్టంగా నిర్మించిన ఈ విశాల భవంతి తొలిరోజుల్లో విక్టోరియా జనరల్ హాస్పిటల్‌గా, 1903లో మెటర్నటీ హాస్పిటల్‌గా, 1913లో కోషా హాస్పిటల్‌గా రూపాంతరం చెందుతూ వచ్చింది. ప్రస్తుతం సీడీ హాస్పిటల్ (ప్రస్తుతం తాడిపత్రి బస్టాండు సమీపంలో)గా ఖ్యాతి గడించింది. ఆయూష్ విభాగానికి కేటాయించిన గదులు, నూటా ఇరవై ఏళ్లు దాటిన చెక్కుచెదరని ఆస్పత్రి పాలక భవనం 1961లో ప్రస్తుతమున్న ప్రభుత్వ సర్వజనాసుపత్రి నిర్మాణం జరిగే వరకూ క్వీన్ విక్టోరియా ఆస్పత్రినే ప్రధాన ఆస్పత్రిగా ఉండేది. తర్వాతి రోజుల్లో దీనిని టీబీ హాస్పిటల్‌గా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ జనరల్ ఓపీతో పాటు హోమియో, ఆయూష్ వైద్య సేవలనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొంత కాలం కోవిడ్ కేర్సెంటర్గానూ సేవలందించారు. ప్రతి రోజూ వంద మంది ఓపీతో రద్దీగా ఉండే ఈ చారిత్రక కట్టడంలో కొంత భాగంలో త్వరలో 60 పడకలతో భారీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ప్రధాన పరిపాలన భవంతితో పాటు మిగిలిన పురాతన కట్టడాలకు తన సొంత ఖర్చుతో పూర్వ వైభవాన్ని తీసుకువస్తామంటూ ప్రభుత్వాన్ని చరిత్ర పరిశోధకుడు ఏజీ అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యర్థించారు. దీంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పాత కట్టడాల పరిరక్షణకు సిద్దమైంది. వాసరత్వ సంపదగా 75 నుంచి వందేళ్లు దాటిన చరిత్రాత్మక కట్టడాలు ఎక్కడున్నా అవి పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయి. ఇందులోనూ కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు వేర్వేరుగా పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో భాగంగా ఇంటాక్ (భారతీయ వాసరత్వ పరిరక్షణ సంస్థ) ఎంపిక చేసిన కట్టడాల పరిరక్షణకు పురావస్తుశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వ శాఖల సమన్వయలోపం కారణంగా రెండేళ్ల క్రితం (గత టీడీనీ ప్రభుత్వ హయాంలో) నగరంలోని ఎంతో చరిత్ర కల్గిన బ్రిటీష్ కాలం నాటి తాలూకా ఆఫీసును ఎన్ఓసీ తీసుకోకుండానే కూల్చేశారు. అప్పటి నుంచి అధికారులు మరింత అప్రమత్తమై ప్రాచీనకట్టడాల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. తొలి ఎంపీ వారసుల దాతృత్వం.. 1951లో తొలి ఎంపీ (రాజ్యసభ) రహంతుల్లాతో పాటు ఆయన సోదరులు ఖాన్ సాహెబ్ అమాముద్దీన్, అమీరుద్దీన్, ముస్తాఫా సంయుక్తంగా పది ఎకరాల భూమితో పాటు ప్రసూతి కేంద్రం అభివృద్ధికి అవసరమైన రూ.1,250 నగదును విరాళంగా అందజేశారు. ఈ హాస్పిటల్ ఎదురుగా కమ్మూరు గ్రామానికి వెళ్లే చెరువు తూముండేది. ఈ తూము పరిధిలో రహంతుల్లా వారసులకు వందల ఎకరాల భూములు ఉండేవి. అందులో కొంత బ్రిటీష్ వారి కోరిక మేరకు విరాళంగా అందజేసినట్లు ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో కనిపిస్తోంది. విక్టోరియా భవంతిని కాపాడుకుంటాం ప్రాచీన కట్టడాలు, శిల్ప సంపద, శాసనాల పరిరక్షణ బాధ్యత సాధారణంగా పురావస్తుశాఖ, టూరిజం, దేవదాయశాఖ పరిధిలో ఉంటాయి. వారసత్వ ప్రాధాన్యత కల్గిన పురాతన కట్టడాల పరిరక్షణ బాధ్యత ఎక్కడున్నా మేమే తీసుకుంటాం. ఇందులో ప్రభుత్వ శాఖల సహకారం చాలా అవసరం. జిల్లాలోని విక్టోరియా హాస్పిటల్‌కు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. త్వరలో అధికారికంగా ఈ కట్టడాన్ని మా పరిధిలోకి తెచ్చుకుంటాం. – రజిత, సహాయ సంచాలకులు, పురావస్తుశాఖ -
రిపబ్లిక్ డే అతిథిగా బ్రిటన్ ప్రధాని జాన్సన్
సాక్షి, న్యూఢిల్లీ : భాతర గణతంత్ర దినోత్సవ వేడుకలకు(జనవరి 26, 2021) ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. నవంబర్ 27న జాన్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఫోన్ సంభాషణల్లో ఆయన్ను రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరుకావాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఈ సారి 50 శాతం మేర వీక్షకుల పాస్‌లను తగ్గించింది. పాఠశాల విద్యార్థులకు వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు. అలాగే ఆయా రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తగ్గించింది. కరోనా కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. -
2030లోనే ఆ వాహనాల అమ్మకాలపై బ్యాన్!
లండన్: పదేళ్ల తర్వాత బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు ఇక కనుమరుగు కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2030 నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాల అమ్మకంపై నిషేధం విధించనున్నట్లు వచ్చే వారం బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం 2040 నుంచి వీటి అమ్మకాలపై నిషేధం విధించాలనుకుందట. అయితే గ్రీన్‌హౌజ్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు బోరిస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా సమాచారం. దీంతో ప్రధాని నిషేధం గడువు కాలాన్ని తగ్గించినట్లు అక్కడి ఫైనాన్స్ టైమ్స్ మీడియా పేర్కొంది. పర్యావరణ విధానంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వాహనాల అమ్మకాల నిషేధాన్ని 2030కే అమలు చేయాలని నిర్ణయించినట్లు సదరు మీడియా పేర్కొంది. (చదవండి: బ్రిటన్ ప్రధాని నోటి వెంట రాముడు.. సీత) అయితే ఎలక్ట్రిక్, శిలాజ ఇంధన చోదక మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేసే కొన్ని హైబ్రిడ్ కార్లకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, ఇంకా 2035 వరకు ఈ వాహనాలను విక్రయించవచ్చని స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త కార్ల అమ్మాకాల్లో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు 73.6 శాతం ఉండగా ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కేవలం 5.5 శాతం మాత్రమే ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలలో వెల్లడైంది. (చదవండి: దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!) -
సింగపూర్ సూపర్ పెంటహౌజ్ అమ్మకం
కౌలాలంపూర్: సింగపూర్‌లోనే అంత్యంత ఎత్తైన, ఖరీదైన మూడు అంతస్తుల భవన పెంటహౌజ్‌ను బ్రిటిష్ బిలియనీర్ జేమ్స్ డైసన్ ఆయన భార్య అమ్మకానికి పెట్టారు. బ్యాగ్‌లెస్ వ్యక్యూమ్ క్లీనర్ ఆవిష్కకర్తే జెమ్స్ డైసన్. అంత్యంత ఖరీదైన భవనానం పెంటహౌజ్‌ను డైసన్ గతేడాది 74 మిలియన్సింపూర్ డాలర్(యుఎస్ డాలర్. 54 మిలియన్)లకు కొనుగొలు చేశారు. అయితే ఈ పెంటహౌజ్‌ను డైసన్ 62 మిలియన్ల సింగపూర్ డాలర్‌కు ఆమెరికాకు చెందిన వ్యాపారవేత్తకు అమ్ముతున్నట్లు డైసన్ సంస్థ ప్రతినిధి అక్కడి మీడియాకు వెల్లడించారు. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో) అయితే దీనిని డైసన్ కొనుగొలు చేసిన దానికంటే 15 శాతం నష్టానికి అమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. ఈ పెంట్‌హౌజ్‌ను ఇండోనేషియాకు చెందిన అమెరికా పౌరుడు లియో కొగువాన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. లియో కొగువాన్ అమెరికా ఇన్పోటెక్ ప్రోవైడర్, ఎస్హెచ్ఐ ఇంటర్నేషనల్ చైర్మన్, సహా వ్యవస్థాపకుడు. టాంజోంగ్ పగర్ సెంటర్, ఐదు పడక గదులతో సూపర్ పెంట్ హౌజ్‌గా పేదొందిన ఈ భవనం విలువ ఒకప్పుడు 100 మిలియన్ యుఎస్ డాలర్‌గా ఉండేది. ఈ సూపర్ పెంటహౌజ్‌లో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, జాకుజీతో పాటు విలాసవంతమైన ప్రైవేటు గార్డెన్ ఉంది. (చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్) -
ఇడ్లీని అంతమాట అంటాడా
‘మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది’ అని సామెత. నాలుక మీద అదుపును కోల్పోవద్దని చెప్పడమే ఈ సూక్తి ఉద్దేశం. అలా అదుపు కోల్పోయాడు బ్రిటన్‌లో ఒక ప్రొఫెసర్. అంతే... ఇడ్లీప్రియులు సంఘటితం అయ్యారు. దక్షిణ భారతావని శక్తి ఏమిటో తెలుసుకుంటున్నాడు ప్రొఫెసర్. ఇడ్లీ తన చావుకు తెచ్చిందని విచారిస్తున్నాడు. ఇంతకీ ఆ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఆండర్సన్ గారు అన్న మాట ఏంటంటే... ‘ప్రపంచంలో ఇడ్లీ అంతటి బోర్ కొట్టే పదార్థం మరొకటి ఉండదు’ అని. అంతే! సోషల్ మీడియాలో ఏకంగా యుద్ధమే మొదలైంది. ‘జీవితంలో ఎప్పుడైనా ఇడ్లీ తిన్నావా బాసూ’ అని ఒకరు, ‘ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా’ అని ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘వేడి వేడి మినీ ఇడ్లీ మీద నెయ్యి, కారం పొడి చల్లి తిని చూడు బ్రదర్’ అని ఒకరు సూచన విసిరారు. ‘ఇడ్లీ రుచి తెలిసేటంతటి నాగరకత అలవడడం కష్టమే. ఆ ప్రొఫెసర్ ఇడ్లీ రుచి ఎలా ఉంటుందో తెలియకుండా జీవించేశాడు పాపం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కొడుకు ట్వీట్‌కు జతకలుపుతూ ప్రొఫెసర్ పట్ల జాలి ప్రకటించారు. ‘ఇడ్లీ మీద సాంబార్ పోసి జారుడుగా తినవచ్చు. చట్నీతో గట్టిగా తినవచ్చు. యాపిల్ సాస్‌తో కూడా తినవచ్చు. తక్కువ సమయం లో తయారు చేసుకోగలిగిన బలవర్ధకమైన ఆహారం ఇడ్లీ. ఇడ్లీ మీద వచ్చిన విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి, ఇడ్లీ ప్రాధాన్యతను కాపాడుకోవడానికి తమిళ రక్తం సిద్ధమవుతోంది’ అని మనస్విని రాజగోపాలన్ అనే నెటిజన్ ఓ హెచ్చరికను జారీ చేసింది. ‘మెత్తటి ఇడ్లీలను మటన్ షోరువాతో తిని చూడు’ అని నవీన్ చమత్కరించాడు. ‘ఇడ్లీని సాంబార్, కొబ్బరి చట్నీ, మటన్ ఖీమా, చికెన్ కర్రీ దేనితోనైనా సరే ఎనిమిది నుంచి పది ఇడ్లీల వరకు తింటాను. నా దగ్గరకు రా... ఇడ్లీ ఎలా తినాలో చూపిస్తాను. ఇడ్లీ చేయడం చేతరాని వాళ్లంతా ఇడ్లీని విమర్శించే వాళ్లయ్యారు’ అని కోపగించుకున్నాడు ఓ తంబి. ‘లండన్‌లో కూర్చుని మాట్లాడడం కాదు, కోయంబత్తూర్కొచ్చి అన్నపూర్ణ హోటల్లో రాత్రి ఏడు గంటలకు సాంబార్ ఇడ్లీ తిని అప్పుడు చెప్పమనండి’ అని శుభ విసుక్కుంది. తమిళులతోపాటు కన్నడిగులు కూడా ఈ ఇడ్లీ మద్దతు బృందంలో చేరిపోయారు. కర్ణాటక లో చేసే రకరకాల సాంబార్లు, బాంబూ ఇడ్లీ వంటి ప్రయోగాల గురించి తెలుసుకోకుండా ఏదో అనేస్తే ఎలా... ప్రదీప్ అనే మైసూరు నెటిజన్ గొంతు కలిపాడు. రెండు రాష్ట్రాలు ఏకమై పోరాడుతుంటే మనం చూస్తూ ఊరుకోవడం ఏమిటని ‘ఆంధ్రాలో ఇడ్లీలోకి ఎన్ని రకాల చట్నీలు చేస్తారో తెలుసుకోండి. ఒక్కో చట్నీతో ఒక్కోరకమైన రుచినిచ్చే ఇడ్లీని ఇంత మాట అంటారా’ అని అనిరుథ్ భృకుటి ముడివేశాడు. జ్యోతి మెనన్ అందుకుంటూ ‘నార్త్ మలబార్లో చేసే సాంబార్‌తో ఇడ్లీ తినండి’ అని ఆండర్సన్‌ను ఒక పోటు పొడిచింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆండర్సన్ ‘నాకు సౌతిండియన్ ఫుడ్‌లో దోశె, ఆప్పం చాలా ఇష్టం. ఇడ్లీ అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు’ అని సవరించుకున్నాడు. అయినా ఆ రెండో మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదటి మాట వేడి ఇంకా తగ్గనే లేదు. ఈ బృందం మరింత మందితో బలోపేతం అవుతూనే ఉంది. ఒక జాతిని ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఓ చిన్న మాట చాలు... అని ఇప్పుడు ఇడ్లీ నిరూపించింది. ఈ టీ కప్పులో తుపానుకు కారణం జొమాటో. ‘జనం ఎందుకు అంతగా ఇష్టపడతారో అర్థం కాని ఒక వంటకం పేరు చెప్పండి’ అని అడిగింది. అప్పుడు ఎడ్వర్డ్ ‘ఇడ్లీ’ అని నోరు జారాడు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో అమ్మ ఇడ్లీ పెడితే... ‘నాన్నా! ఈ రోజు డెడ్లీ బ్రేక్‌ఫాస్ట్’ అని ఇడ్లీ పట్ల నిరసన వ్యక్తం చేసే పిల్లలు మన ఇళ్లలోనూ ఉంటారు. ఇదే పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చే సరికి వేడి వేడి ఇడ్లీ పెడితే ఆవురావురుమని తింటారు. ఇడ్లీని ఇడ్లీలా తినవచ్చు, ఉప్మాగా మార్చుకోవచ్చు.. ఇడ్లీని పొడవు ముక్కలుగా కట్ చేసి కార్న్‌ఫ్లోర్‌లో కానీ మంచూరియా మిక్స్‌లో కానీ ముంచి నూనెలో వేయించి కరకరలాడే స్నాక్‌గా తినవచ్చు. ఎన్ని రకాలుగా తిన్నా ఆ రుచికి మరేదీ సాటి రాదు. ఈ సంగతి తెలియక పాపం ఆండర్సన్ ఇలా చిక్కుకుపోయాడు. -
రాజనీతి కథ
స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్లు దాటింది. తెల్లదొరల రాజ్యం వెళ్లి నల్లదొరల రాజ్యం వచ్చింది. కానీ రాజనీతి ఒక్క లాగే సాగుతోంది. సామాన్యుడి రెక్కలాట డొక్కలాట ఒక్కలాగే నడుస్తోంది. ఏ యుగంలో అయినా రాజ్యాధికార చెలా యింపు ఏకపక్షంగానే ఉంటుంది. ద్వాపర యుగంలో ఏకఛత్రపురం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికో రాజున్నాడు. రాజుకి భోగాలన్నీ ఉన్నాయ్. ఉన్నట్టుండి రాజ్యానికి వుపలాయం వచ్చింది. ఓ బ్రహ్మరాక్షసుడు రాజ్యం పొలిమేరలో విడిది చేశాడు. వాడి పేరు బకా సురుడు. వాడి గురించి విన్న రాజుకి వణుకు పుట్టింది. బతికుంటే బలుసాకు తిని బతకవచ్చనే నిర్ణయానికి వచ్చి వెర్రి సాహసాలేవీ చెయ్యలేదు. మీసాలు దించి, కుదించి రాక్షసుడికి రాయబారం పంపాడు. నీ ఆకలి సంగతి నేను కనిపెట్టి ఉంటాను. నువ్వు ఇష్టారాజ్యంగా స్త్రీ, బాల, వృద్ధుల్ని ఎప్పుడంటే అప్పుడు పీక్కుతినద్దు. ఓ క్రమశిక్షణ పాటిద్దాం. రోజూ ఠంచన్‌గా సూర్యుడు నడి నెత్తికి వచ్చేసరికి, నీకు సన్నబియ్యం కూడు ఓ బండెడు, దానితోపాటు వచ్చిన జత దున్నపోతులు ఆహారంగా ఉండిపోతాయ్ అన్నాడు రాజు. ‘నాకు నర మాంసం లేనిదే ముద్ద దిగదే’ అని అరిచాడు బకాసు రుడు. దానికంతంత రంకెలెందుకు, సాయలాపాయ లాగా పరిష్కరించుకోవచ్చుగా అన్నాడు రాజు అనున యంగా. అసురుడు నవ్వి నీలాంటి సాత్వికుణ్ణి నేనింత వరకు కనలేదు, వినలేదు అన్నాడు మిక్కిలి అభినందన పూర్వకంగా. ‘సరే, అఘోరించావులే’ అన్నాడు లోలో పల రాజు. అనుకున్న మాట ప్రకారం బండి నడుస్తోంది. రాజుగారి వంటశాలలో గుండిగలూ వార్పులూ పెరిగాయి. ఓ జత దున్నపోతులు సంతల నించి, అంగళ్లనించి వస్తున్నాయి. సమస్య లేదు. ఇక మిగిలింది బండితోపాటు వెళ్లాల్సిన మనిషి. రాజు తలుచుకుంటే మనుషులకు కొరతా? రాజ్యంలో చాటింపు వేయిం చాడు. మంత్రులు, దండనాయకులు ఊరి మీదపడి తిథులవారీగా మనుషుల్ని నిర్ణయించి ఖాయం చేశారు. ఆ రోజు సుష్టుగా భోంచేసి వేళకు సిద్ధంగా ఉండాలని రాజాజ్ఞ జారీ చేశారు. కాదని తిరస్కరిస్తే ఆ మనిషిని కోట గుమ్మంమీద ఉరితీస్తారని హెచ్చరిక జారీ చేశారు. ‘ఏదైతే ఏమైంది, కనీసం అక్కడికి పోతే బ్రహ్మ రాక్షసుణ్ణి కళ్లారా చూడనైనా చూడవచ్చు, అదే బాగు’ అనుకు న్నారు పురజనం. మాట తేడా రాలేదు. రాజు హ్యాపీ, రాక్షసుడు హ్యాపీ! కొడవటిగంటి కుటుంబరావు తన కథలో ఏమంటారంటే– పాలక వర్గానికి రకరకాలుగా సమాజాన్ని దోచుకునే వెసులుబాటు ఉంటుంది. రక్షిం చాల్సిన రాజు హాయిగా ఓ ఒప్పందం చేసుకుని తాంబూ లాలిచ్చేశాం, మీ చావు మీరు చావండన్నారు. ఆయన భోగాలు తరగలేదు. ఆయన స్వజనం ఎవరూ బలికి వెళ్లరు. అంతా సవ్యంగా, పద్ధతిగా చికాకు లేకుండా కథ నడిచింది. కరోనా ఉపద్రవం వచ్చినప్పుడు నాకు బకాసురుడి కథే గుర్తుకొచ్చింది. ఉన్నఫళంగా లాక్డౌన్ విధించారు రాజుగారు. ఒక్క ప్రయాణసాధనం లేదు. ఎక్కడివారు ఎక్కడెక్కడో చిక్కుకుపోయారు. లక్షలాదిమంది పిల్లా పెద్దా, ఆడామగా పరాయి ప్రాంతంలో చిక్కడిపో యారు. మరోవైపు మృత్యుభయం. ఏంచేస్తారు పాపం, రోడ్డునపడ్డారు. అసలే మనది రామరాజ్యం కదా. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అనుకుంటూ సొంత నేలకు పయనమయ్యారు. అదొక దుఃఖపూరిత సన్ని వేశం. దేశం యావత్తూ కంటతడి పెట్టింది. అవకాశం ఉన్న తల్లులు తలోముద్ద అన్నం పెట్టారు. జాలిపడ్డారు. రాజుగారు సాయపడుతున్న వారికి దణ్ణాలు పెట్టిం చారు. గంటలు మోయించి జేజేలు చెప్పించారు. దీపాలు వెలిగించి హారతులు ఇప్పించారు. కరోనాతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. దాంతో కలిసి జీవించడం అనివార్యం అన్నారు. జనం బిక్కమొహాలు వేసుకున్నారు. బయటకు రాకండి, సుఖంగా ఇంట్లోనే బతికె య్యండి అంటూ రాజుగారు భరోసా ఇచ్చేశారు. అదే వన్నా అంటే మహా మహా దేశాలు నిస్సహాయంగా చూస్తూ ఊరుకున్నాయ్. మనమెంత అంటూ నిట్టూ ర్చారు. జనం ప్రతిగా నిస్పృహతో నిట్టూర్చారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆధునిక మానవుడు గొప్ప వాడు, చాలా గొప్పవాడు. బకాసురుణ్ణి మంత్రాంగాన్ని, కరోనాని కట్టడి చేసే వ్యాక్సిన్‌ని కనిపెడతాడు. మనిషి అసహాయ సూరుడు! జై హింద్!! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
భౌతిక దూరం కోసం కంటోన్మెంట్
‘భారతీయులు, కుక్కలకు నిషేధం’ఇలా రాసి ఉన్న బోర్డులు కంటోన్మెంట్ ప్రాంతంలో విరివిగా కనిపించేవి. ప్రధాన ద్వారం, ఆసుపత్రి, క్లబ్, క్రీడా ప్రాంగణం, ఈత కొలను, చర్చీలు.. ఇలాంటి అన్ని చోట్ల ఈ బోర్డులు ఉండేవి. స్థానికులతో కలిస్తే వ్యాధులు సోకుతాయన్న భయం. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే స్థానికులతో భౌతిక దూరాన్ని పాటించాలనేది నాటి నిబంధన. తాము పెంచుకున్న కుక్కలు తప్ప, స్థానిక కుక్కలు రాకుండా చూసుకునేవారు. ఇది 1865 సమయంలో రూపుదిద్దుకున్న కంటోన్మెంట్ కథ’ సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ‘మందు’భౌతిక దూరం పాటించటమే.. ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తున్న విధానం ఇదే. ఈ సూత్రం తెలియకపోవటం వల్లే వందేళ్ల కింద స్పానిష్ ఇన్ఫ్లుయెంజా విసిరిన పంజాకు మన దేశంలో ఏకంగా కోటిన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. మన దేశంలో అన్ని మరణాలు సంభవించినా.. ఇక్కడ పాలనా పగ్గాలు పట్టుకుని ఉన్న బ్రిటిష్ వాళ్లు మాత్రం అంత ఎక్కువ సంఖ్యలో చనిపోలేదు. దానికి కారణం.. భౌతిక దూరాన్ని పాటించటమే. సిఫారసులు ఇలా.. ► భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్న బ్రిటిష్ సిబ్బంది, స్థానిక భారతీయులతో మెసలకుండా ప్రత్యేకంగా నివాసం ఉండాలి. ► స్థానికుల ద్వారా వారికి అంటువ్యాధులు సోకుతున్నాయి. అవి వారి మరణానికి కారణమవుతున్నాయి. ► బ్రిటిష్ సిబ్బందికి విశాలమైన ప్రాంతంలో దూరం దూరంగా ఉండేలా కార్యాలయాలు, నివాస సముదాయాలు నిర్మించాలి. ► వారికి శుద్ధి చేసిన నీరు అందించాలి. మంచి భవనాలు నిర్మించాలి. నీరు నిలిచిపోని విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. ఈగలు, దోమలు లేకుండా చూడాలి. ► ఆ ప్రాంగణాల్లోకి భారతీయులను అనుమతించొద్దు. సికింద్రాబాద్ క్లబ్ కంటోన్మెంట్ అందుకే.. సికింద్రాబాద్‌లో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం.. ఈ భౌతిక దూరం సూత్రంపైనే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో చరిత్రకారులు నాటి బ్రిటిష్ వారి దూరాలోచనను గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కంటోన్మెంట్ ప్రాంతాలున్నాయి. ఇవన్నీ నాటి ఆంగ్లేయులు నిర్మించినవే. అన్నింటి ఉద్దేశం ఒకటే. స్థానిక భారతీయులతో ‘సామాజిక’దూరాన్ని పాటించటం. 40 శాతం మంది చనిపోతుండటంతో.. ఇది 1850 నాటి సంగతి.. మన దేశంలో పాలన కోసం 10 వేల మంది బ్రిటిష్ సిబ్బంది ఉండేవారు. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు. కానీ వీరిలో ఏకంగా 40 శాతం మంది అంటురోగాలు, ఇతర వ్యాధులతో చనిపోయేవారు. మూడింట ఒక వంతు మంది వ్యాధులతో ఎప్పుడూ చికిత్స పొందుతుండేవారు. ఐదారేళ్లు కాగానే 30 శాతం మంది సిబ్బందే మిగిలేవారు. దీంతో ఎప్పటికప్పుడు కావాల్సినంత మందిని ఇంగ్లండ్ నుంచి రప్పించాల్సి వచ్చేది. ఇది ఆ దేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. దీంతో దీనికి కారణాలు కనుక్కుంటూ పరిష్కారాలు చూపాల్సిందిగా ఆదేశిస్తూ ఆ దేశం రాయల్ శానిటరీ కమిషన్‌ను నియమించింది. 1863 ప్రాంతంలో ఈ కమిషన్ నివేదిక సమర్పించింది. వెంటనే కంటోన్మెంట్ నిర్మాణం హైదరాబాద్ ప్రాంతం నిజాం కేంద్రంగా ఉండగా, సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిషర్స్ తమకు వీలుగా వాడుకునేవారు. అందుకే సికింద్రాబాద్‌లో ప్రత్యేకంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని నిర్మించుకున్నారు. వేల ఎకరాల సువిశాల ప్రాంతంలో వారికి కార్యాలయాలు, నివాసాలు, రీక్రియేషన్ కేంద్రాలు, ఆట మైదానాలు, చర్చీలు, ఉద్యానవనాలు వెలిశాయి. అవన్నీ భౌతిక దూరం పద్ధతిలో దూరం దూరంగా నిర్మించారు. కంటోన్మెంట్ నిర్మాణం తర్వాత బ్రిటిష్ సిబ్బందిలో మరణాల రేటు తగ్గిపోయింది. వారికి ప్రత్యేకంగా మంచినీటి వసతి ఉండటం, నిరంతరం పారేలా మురుగునీటి వ్యవస్థ ఏర్పడటం, మానసిక శారీరక ఉల్లాసానికి ఏర్పాట్లు ఉండటం, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటం, మంచి వైద్య సేవలు అందుబాటులో ఉండటం, రోగాలతో బాధపడే స్థానికులకు దూరంగా ఉండటం వెరసి వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనిపించింది. ‘1918లో ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన స్పానిష్ ఇన్ఫ్లుయెంజా ప్రభావం మన దేశంలోని కంటోన్మెంట్లలో భద్రంగా ఉన్న బ్రిటిష్‌వారిపై అంతగా ప్రభావం చూపలేదు. ఆ వ్యాధి సోకిన భారతీయులతో వారు భౌతిక దూరాన్ని పాటించడమే దీనికి కారణం. అందుకు కంటోన్మెంట్ ఉపయోగపడింది’అని చరిత్ర పరిశోధకులు డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. అప్పట్లోనే 500 పడకలతో ఆసుపత్రి కంటోన్మెంట్ ప్రాంతంలో 1870 నాటికి కంబైండ్ మిలిటరీ హాస్పిటల్‌ను నిర్మించారు. దీన్ని 1920 నాటికి 500 పడకల స్థాయికి పెంచారు. ఇందులో బ్రిటిష్ నుంచి ఎప్పుడూ నైపుణ్యం ఉన్న వైద్యులు, నర్సులను కావాల్సినంత మందిని ఉంచేవారు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా, బ్రిటిష్ వారికి వెంటనే నాణ్యమైన వైద్యం అందేది. ప్రస్తుతం సికింద్రాబాద్ క్లబ్‌గా వాడుకుంటున్న క్లబ్‌ను అప్పట్లో బ్రిటిష్ వారి కోసమే వినియోగించేవారు. జింఖానా క్రికెట్ మైదానం ఉన్న చోట వారికి క్రీడా సదుపాయాలుండేవి. -
క్లాప్స్ ఫర్ బోరిస్..భారీ స్పందన
-
బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్
-
బ్రిటీష్ జడ్జిమెంట్!
-
జాన్సన్ జయకేతనం
లండన్/బ్రస్సెల్స్: పదేపదే వస్తున్న ఎన్నికలతో విసిగిన బ్రిటిష్ ఓటర్లు ఈసారి నిర్ణాయక తీర్పునిచ్చారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. ఈ చారిత్రక విజయంతో వచ్చే జనవరి ఆఖరులోగా యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి వైదొలిగేందుకు అవకాశం లభించిందని బోరిస్ జాన్సన్(55) తెలిపారు. ‘బ్రెగ్జిట్ పూర్తి చేసుకుందాం’ అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జాన్సన్..1980వ దశకంలో ప్రధాని మార్గరెట్ థాచర్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేశారు. జెరెమి కార్బిన్ నేతృత్వంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కేవలం 203 సీట్లను సాధించింది. అక్టోబర్ 31వ తేదీలోగా బ్రెగ్జిట్ అమలే లక్ష్యంగా జూలైలో థెరిసా మే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్, పార్లమెంట్లో మెజారిటీ లేకపోవడంతో అనుకున్నది సాధించలేక ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే, గత అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత శీతాకాలంలో గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓట్లేశారు. పార్లమెంట్(కామన్స్ సభ)లోని 650 సీట్లకు గాను కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాలను సాధించింది. విజయోత్సవ ర్యాలీలో బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్‌కు ఇది మరో శుభోదయం. గడువులోగా బ్రెగ్జిట్ సాధిస్తాం. ప్రతిష్టంభనను తొలగిస్తాం. ఓటర్ల నమ్మకాన్ని వమ్ముచేయను’ అని ప్రకటించారు. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయంపై ఈయూ వెంటనే స్పందించింది. బ్రిటన్‌తో బ్రెగ్జిట్‌పై తదుపరి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. -
‘థామస్ కుక్’ దివాలా...
లండన్: ప్రముఖ బ్రిటిష్ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కుక్ దివాలా తీసింది. దీంతో దాదపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన లక్షన్నరకు పైగా యాత్రికులు వివిధ దేశాల్లో చిక్కుకు పోయారు. వీరందరినీ స్వదేశానికి తరలించడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వానికి భారీగానే వ్యయం కానున్నది. బల్గేరియా, క్యూబా, అమెరికా, టర్కీ తదితర దేశాల నుంచి ఈ యాత్రీకుల తరలింపునకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్రభుత్వం అత్యవసర ప్రణాళికలను ప్రకటించింది. ఆపరేషన్ మ్యాటర్‌హార్న్ పేరుతో ఈ తరలింపును తక్షణం ప్రారంభించింది. దీని కోసం డజన్ల కొద్దీ చార్టర్ విమానాలను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సంఖ్యలో బ్రిటీషర్లను స్వదేశానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 9,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 22 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. వేరే దారి లేక దివాలా.. 178 ఏళ్ల చరిత్ర గల ఈ కంపెనీ భారీ రుణ భారంలోకి కూరుకుపోయింది. ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ యత్నాలు విఫలమవడంతో దివాలా తీసినట్లుగా సోమవారం ప్రకటించింది. కంపెనీ వాటాదారులకు, కొత్తగా రుణాలివ్వడానికి ముందుకు వచ్చిన సంస్థలకు మధ్య అవగాహన ఒప్పందం కుదర్చడంలో శతథా ప్రయత్నాలు చేశామని, అవన్నీ విఫలమయ్యాయని పేర్కొంది. వేరే దారి లేక తక్షణం దివాలా తీసినట్లుగా ప్రకటిస్తున్నామని వెల్లడించింది. ఆన్లైన్ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడం, బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా హాలిడే ట్రిప్పులు, ప్యాకేజీల బుకింగ్స్ పడిపోవడం థామస్ కుక్ కష్టాలను మరింతగా పెంచింది. 2007లో మై ట్రావెల్ సంస్థను థామస్ కుక్ విలీనం చేసుకోవడం ఆ కంపెనీ పుట్టి మునగడానికి గల కారణాల్లో ఒకటి. వ్యయాలు తడిసి మోపెడై భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. 1841 నుంచి కార్యకలాపాలు.. 1841లో థామస్ కుక్ తన పేరు మీదనే ఈ పర్యాటక సంస్థను స్థాపించాడు. ఆరంభంలో ఇంగ్లాండ్‌లోని రైల్వే ప్రయాణికులకు పర్యాటక సేవలందించిన ఈ సంస్థ, ఆ తర్వాత విదేశీ యాత్రలను నిర్వహించడం మొదలు పెట్టింది. . పర్యాటకానికి సంబంధించి వివిధ రంగాల్లోకి విస్తరించింది. వార్షిక టర్నోవర్ 1,000 కోట్ల పౌండ్లు, ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందికి పర్యాటక సేవలందించే ఘనతలున్నప్పటికీ, భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. ఒకప్పుడు లండన్ స్టాక్ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన ఈ కంపెనీ షేరును ఇటీవలే తొలగించారు. గోవా పర్యాటకంపై దెబ్బ థామస్ కుక్ దివాలా ప్రకటన గోవా పర్యాటకంపై తీవ్ర ప్రభావమే చూపించనున్నది. గత టూరిస్ట్ సీజన్లో దాదాపు 30 వేలమంది బ్రిటీషర్లు గోవా వచ్చారు. వీరంతా థామస్ కుక్ ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానాల ద్వారా వచ్చిన వాళ్లే, రోజుకు 300 మందిని ఇంగ్లాండ్ నుంచి గోవాకు థామస్ కుక్ తీసుకువచ్చేది. ఒక్కో బ్రిటీషర్ గోవాలో సగటున రెండు వారాలు పాటు ఉంటారని అంచనా. ఇక థామస్ కుక్ దివాలా తీయడంతో ఇంగ్లాండ్ నుంచి వచ్చే పర్యాటకులు సగం మేర తగ్గుతారని విశ్లేషకులంటున్నారు. కాగా థామస్ కుక్ భారత కార్యకలాపాలను 2012లో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసింది. థామస్ కుక్ యూకేకు, థామస్ కుక్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదిన థామస్ కుక్ ఇండియా స్పష్టం చేసింది. -
దివాలా అంచుల్లో థామస్ కుక్
లండన్: బ్రిటిష్ పర్యాటక సంస్థ, థామస్ కుక్ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి. థామస్ కుక్కు తగిన నిధులు అందకపోతే, ఈ లక్షన్నర మంది పర్యాటకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి భారీగానే ఖర్చు కానున్నది. తక్షణం 25 కోట్ల డాలర్లు అవసరం... కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్ కుక్ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, థామస్ కుక్ కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు ఎలాంటి తోడ్పాటు నందించేందుకు సుముఖంగా లేవని ది టైమ్స్ పత్రిక పేర్కొంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రావచ్చని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల సంఘం, టీఎస్ఎస్ఏ(ట్రాన్స్పోర్ట్ శాలరీడ్ స్టాఫ్స్ అసోసియేషన్) కోరుతోంది. మోనార్క్ ఎయిర్‌లైన్స్ మునిగిపోయినప్పుడు.. ప్రస్తుతం థామస్ కుక్ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్ ప్రభుత్వానికి 6 కోట్ల పౌండ్ల ప్రభుత్వ సొమ్ములు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు పోయాయి. బ్రెగ్జిట్, ఆన్లైన్ పోటీతో భారీగా నష్టాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి. -
వినేదీ నేనే అనుకుంటా!
అలనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ గొప్ప ఉపన్యాసకుడు. ఓమారు ఆయనను కలిసిన ఒకరు – వేదికపై అంత సరళంగా తేలికగా ఎలా మాట్లాడగలుగుతున్నారు. మీ మాటల్లో తడబాటు కానీ భయం కానీ కనిపించవు. కారణమేంటీ అని అడిగారు. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు.... ‘‘నేను వేదిక ఎక్కినప్పుడే కాదు ఏదైనా సభలోనో సమావేశంలోనో నేను మాట్లాడటం మొదలుపెట్టడంతోనే నా ముందున్న వారందరూ తెలివిలేని వారని అనుకుంటాను. దాంతో నాకు మాట్లాడుతున్నప్పుడు భయం అనిపించదు అని చెప్పారు చర్చిల్.ఇటువంటి ప్రశ్ననే ఓసారి ఓ జెన్ గురువుని ఒకరడిగారు. ఎందుకంటే ఆయన కూడా ఎవరితో అయినా సరే ఏ మాత్రం తొణక బెణకక మాట్లాడుతారు. తననడిగిన ప్రశ్నకు ఆ జెన్ గురువు ఇలా జవాబిచ్చారు....నేను మాట్లాడుతున్నప్పుడల్లా నా ఎదుట నేనే కూర్చున్నట్లు భావిస్తాను. ప్రేక్షకులందరినీ నేనే అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు ఇక నాకెందుకు భయం కలుగుతుంది. ఏ మాత్రం జంకూ బొంకూ లేకుండా చెప్పదలచుకున్నది చెప్పేస్తాను. చెప్పేదీ నేనే వినేదీ నేనే అని అనుకున్నప్పుడు ఇక భయాలెందుకుంటాయి అని ఆయన ఎదురు ప్రశ్నించారు.... ప్రాక్ పశ్చిమ దేశాలలో ఉన్న తేడా ఇదే. ఎదుటివారిని తెలివిలేనివారిగా అనుకోవడానికీ, అంతా తానే అనుకోవడానికి మానసికంగా ఎంత తేడా ఉందో కదూ.... – యామిజాల జగదీశ్ -
ప్రేమ వ్యవహారం.. యువతికి వినూత్న శిక్ష
లండన్ : ప్రేమించినవాడు దక్కలేదన్న అక్కసుతో ఓ బ్రిటిష్ సిక్కు యువతి మూర్ఖంగా ప్రవర్తించి జైలు పాలయింది. దాదాపు అయిదేళ్లుగా మాజీ ప్రియుడినీ, అతని కుటుంబ సభ్యులను టార్చర్ చేస్తున్న అమన్‌దీప్ ముధార్ (26).. ఆమె ఫ్రెండ్ సందీప్ డోగ్రా (30)కు ఇంగ్లండ్‌లోని సీన్డన్ క్రౌన్ కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. జాతివివక్ష, మత విశ్వాసాలు, సామాజిక సంబంధాల పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు వారిద్దరికీ రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష అమలు చేయాలని స్వీన్డన్ క్రౌన్ కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. కోర్టు తెలిపిన వివరాలు.. ముధార్, కృపాకర్ (పేరుమార్చాం) అనే హిందూ యువకుడు 2012లో ప్రేమలోపడ్డారు. అయితే, కొన్నాళ్లపాటు కలిసున్న అనంతరం మతాలు, సంప్రదాయాల విషయంలో మనస్పర్థలతో వారిద్దరు విడిపోయారు. ఇక అప్పటినుంచి యువకుడిపై పగ పెంచుకున్న ముధార్ తన మిత్రుడు సందీప్‌తో కలిసి కృపాకర్‌పై కక్ష సాధింపు మొదలు పెట్టింది. అతని కుటుంబ సభ్యులను మతం, జాతి పేరుతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టింది. కృపాకర్ చెల్లెల్లను రేప్ చేయిస్తానని బెదిరింపులకు గురిచేసింది. వారి మత విశ్వాశాలు దెబ్బతినేలా ప్రవర్తించింది. కృపాకర్ కుటుంబం వెళ్లే దేవుడి సన్నిధిలో సైతం దుర్భాషలాడింది. అంతటితో ఆగక వాళ్లింట్లో పశు మాంసం పారవేసింది. ఇంకా... కృపాకర్ చెల్లెలి కొడుకుని స్కూల్లో మరో పిల్లాడితో కలిసి వేధింపులకు గురిచేసింది. రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష మాత్రమే కాకుండా.. మత విశ్వాశాలపై దాడి చేసినందుకు 100 గంటల ధార్మిక సేవ, కోర్టు ఫీజుల కింద 750 పౌండ్ల జరిమానా విధించింది. కాగా, ముధార్ చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగానే మొండితనం, పెంకితనం వచ్చాయనీ ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తల్లి సంరక్షణలో వేధింపులకు గురికావడంతోనే అలా తయారైందని విన్నవించారు. అతని వాదనలతో ఏకీభవించని కోర్టు ఈ వినూత్న శిక్షతో ముధార్ ప్రవర్తనలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు.. లండన్‌లోని సిక్కు కమ్యునిటీ కూడా ముధార్, సందీప్ చర్యలపై మండిపడింది. వారికి ఎటువంటి సాయం చేయబోమని ప్రకటించింది. సస్పెండెడ్ జైలు శిక్ష అనగా.. సాధారణ జైలు శిక్ష విధించే క్రమంలో ముద్దాయిలకు ఒక అవకాశంగా సస్పెండెడ్ జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షా కాలంలో ముద్దాయి ప్రవర్తనపై నిఘా ఉంచుతారు. విపరీత మనస్తత్వం కలిగిన సమూహంలో వారిని విడిచిపెడతారు. అక్కడ వారు మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో శిక్షా కాలం పూర్తి చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా సస్పెండెడ్ జైలు శిక్ష కాలంలో కూడా నేరాలకు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వాటిపై విచారణ చేసి మునుపటి జైలు శిక్ష.. తాజా శిక్షను విధించి కటకటాల వెనక్కి పంపుతారు. -
బైనేరు బ్రిడ్జి ఆత్మఘోష
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం : ఓపిక ఉన్నంత వరకు నిలబడ్డాను. మీ సేవలో తరించాను. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లేందుకు మీకు అడ్డుగా ఉన్న బైనేరు వాగుపై నేను వారధినై నిలిచా. వయసు మీద పడుతున్నా మీ సేవే నా భాగ్యం అనుకుంటూ ఇన్నేళ్ళు తరించా. వయసుడిగి పోయింది. ఆటుపోట్లకు తట్టుకోలేక మొన్ననే నేలకొరిగిపోయాను. ఇంతకీ నేనెవరని అనుకుంటున్నారా. మీ అందరికీ తెలిసిన దానినే. అదే మీ బైనేరు బ్రిడ్జినండీ.. ఆత్మఘోష చెప్పుకుంటే నా మనసు కుదుటపడుతుంది. అందుకే చెబుతున్నా. 1913లో నా జీవన ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి బ్రిటీష్ కాలంలో నన్ను (బ్రిడ్జి) నిర్మించారు. బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇంజినీర్లు ఈబీ ఎల్విన్ ఇష్క్, వీటీ జాన్‌లు కొవ్వూరు నుంచి పోలవరం వరకు గోదావరి గట్టు నిర్మించేందుకు వచ్చారు. ఆ సమయంలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం గ్రామాలను కలిపేందుకు జంగారెడ్డిగూడెం రెవెన్యూ సర్వే నెంబర్ 250లో నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. గ్రేట్ బ్రిటన్ (స్కాట్లాండ్)లోని ఐనార్క్ స్టీల్ కంపెనీ తయారుచేసిన స్టీల్ గడ్డర్లను ఇక్కడకు తీసుకువచ్చి బైనేరు వాగుపై ఎటువంటి స్తంభాలు లేకుండా స్టీల్ గడ్డర్ బ్రిడ్జిగానే నన్ను నిర్మించారు. నా పొడవు 39 మీటర్లు, వెడల్పు 12 అడుగులండి. 105 ఏళ్ల పాటు కోట్లాది వాహనాలకు, ప్రయాణికులకు ఎన్నో సేవలందించాను. మొదట్లో నేను చాలా పటిష్టంగా ఉండేదానిని. రాను రాను వయసు మీద పడటంతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాను. అనారోగ్యానికి (మరమ్మతులు) గురైనప్పటి నుంచి వైద్యం చేయించాలని ఎన్నోసార్లు అధికారులను కోరాను. అధికారులు కూడా నాకు వైద్యం (రిపేర్లు) చేయించడం కోసం ప్రతిపాదనలు పంపారు. పనులు చేపడుతామని చెప్పడమే తప్పండి, కనీసం నన్ను పట్టించుకోలేదు. భారీ వాహనాలు, ఎత్తయిన వాహనాలు తగిలి నా తల(స్టీల్ గడ్డర్లు) పై భాగంలో గాయాలు(విరిగినా) తగిలినా చూసీచూడనట్లు వదిలేశారు. నా కాళ్ల కింది నేల బైనేరు వాగు వరద తాకిడికి కోతకు గురైనా.. నా ఉనికికి ప్రమాదం వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఏం చేయను ఎంతకాలం నిలబడి సేవలందించగలను. మొన్నొచ్చిన బైనేరు వరదను నా శక్తి మేరకు తట్టుకున్నా. కొద్ది కొద్దిగా నా బలాన్ని పిండేస్తుంటే ఓపిక లేక ఓడిపోయి ఒరిగిపోయాను. ఇక సెలవు.. -
బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్‌తో సాక్షి ఇంటర్వ్యూ
-
సౌదీలో ప్రమాదం: నలుగురు బ్రిటిషర్ల మృతి
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బ్రిటిష్ జాతీయులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర మక్కాకు 30 మైళ్ల దూరంలో ఉన్న అల్ ఖలాస్ పట్టణంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన 12 మంది కూడా బ్రిటిష్ జాతీయులేనని సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని మక్కాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ సౌదీ అంబాసిడర్ మహ్మద్ బిన్ నవాఫ్ ట్వీట్ చేశారు. -
నన్ను అలా చూడకండి.. ప్లీజ్ : ప్రీతి
లండన్: తనను ఒక వెనుకబడిన మైనారీటి వర్గానికి చెందిన మహిళగా గుర్తించడం నచ్చట్లేదని, అది ప్రజలను కించపరిచడమేనని బ్రిటిష్ మాజీ కేంద్ర మంత్రి, భారత సంతతి మహిళ ప్రీతి పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున బ్రిటిష్ కేబినెట్లో చోటుదక్కించుకున్న మొదటి భారతీయ మైనారీటి మహిళగా గుర్తింపు పొందిన ప్రీతి పాటిల్ తనను ఒక వర్గానికి పరిమితం చేసి మాట్లాడటం.. ఆ వర్గాన్ని అవమానించే విధంగా ఉందని, అది ప్రజలను మోసం చేసి లబ్ధి పొందేవిధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను బ్రిటిష్లోనే పుట్టి పెరిగాను, నన్ను మొదట బ్రిటిష్ మహిళగా గుర్తించండి’ అని ఆమె కోరారు. బ్రిటిష్ కేబినెట్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పదవిలో ఆమె సేవలందించారు. గత ఏడారి నవంబర్‌లో తన మీద వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తనను అలా చూడడం ఏంతో ఉద్వేగానికి గురిచేసిందని, సహచర కేబినెట్ మంత్రులకు, పార్టీ ఎంపీలందరికీ తనని మొదట బ్రిటిష్ మహిళగానే చూడాలని, తనను ఒక వర్గానికి పరిమితం చేసి వేరుగా చూడొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
‘అమ్మ’కు విముక్తి కలిగించేందుకు...
సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళామణులదీ విశేషపాత్ర. వారిలో కొందరు తమకే సొంతమైన ధీరత్వంతో చరిత్రకెక్కారు. భూమాత‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించేందుకు తమ వంతు కృషి చేసిన కొందరు మహిళా మూర్తులను మరోసారి స్మరిద్దాం.. తరిద్దాం.. జై భరతనారీ.. ఝాన్సీ లక్ష్మీబాయి భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి. బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సరోజిని నాయుడు భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. కస్తూర్బా గాంధీ భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. -సుష్మారెడ్డి యాళ్ళ -
దేశానికి రెక్కలిచ్చినవాడు
1920 నాటి మాట. లూయీ బ్లీరియో ఫ్రాన్స్‌లోనే ప్రఖ్యాత పైలట్. ఇంగ్లిష్ చానెల్ మీది గగనతలంలో మొదటిసారి విమానం నడిపి చరిత్ర ప్రసిద్ధుడైన వ్యక్తి ఆయనే. ఆయన నివాసం దగ్గరే ఉండేది ఫ్రెంచ్ దేశపు కోటీశ్వరులలో ఒకరి ఇల్లు. ఆ కుటుంబానికి చెందిన పదిహేనేళ్ల కుర్రాడు బ్లీరియోను ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉండేవాడు. పైగా వేసవి, ఇతర సెలవుల సందర్భంలో ఆ కోటీశ్వరుల కుటుంబంతో గడిపేవాడు. తను కూడా ఎప్పటికైనా విమానాలు నడపాలని ఆ పిల్ల కోటీశ్వరుడు కోరుకునేవాడు. అలాంటి సమయంలోనే బ్లీరియో కో–పైలట్ ఆ కుర్రవాడిని తనతో పాటు విమానంలో తిప్పాడు. తరువాత నిజంగానే అతడు పైలట్ అయ్యాడు. ఒక దేశపు గగనయాత్రా చరిత్రకు ఆద్యుడిగా నిలిచాడు. నిజం చెప్పాలంటే ఆ దేశానికి సొంత రెక్కలు ఇవ్వాలని కలగన్నాడు. తర్వాతి కాలంలో దానిని నిజం చేశాడు. ఇదంతా భారతదేశం బ్రిటిష్ వలసగా ఉన్న కాలంలో జరిగింది. ఆ పైలట్ పేరు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా. రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఘనుడు. ఫ్రాన్స్ ఇచ్చే అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ ఆనర్, భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా ఆయన స్వీకరించారు. జేఆర్డీ తండ్రి బొంబాయి పార్సీ. తల్లి ఫ్రెంచ్ జాతీయురాలు. ఆయన బాల్యం ఫ్రాన్స్‌లోనే ఎక్కువగా గడిచింది. 1932లో జేఆర్డీ టాటా(జూలై 29, 1904– నవంబర్ 29, 1983) టాటా ఎయిర్‌లైన్స్‌ను స్థాపించారు. ఇండియాలో ఆరంభమైన తొలి వాణిజ్య, పౌర విమానయాన సంస్థ అదే. అప్పటికి గగనతలం విమానాలతో రద్దీగా మారిపోలేదు. బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్ వంటి దేశానికి విమానయానం అంటే అక్షరాలా గగనకుసుమమే. అలాంటి సమయంలో సాహసించి జేఆర్డీ విమానయాన సంస్థను నెలకొల్పారు. మద్రాసు– కరాచీ మధ్య మొదటి సర్వీసు తిరిగింది. కేవలం గాగుల్స్‌తో ఎలాంటి ప్రత్యేక దుస్తులు లేకుండా ఆ తొలి విమానాన్ని ఓ పైలట్ నడిపారు. అంత సాహసం చేసినవారు ఎవరో కాదు, జేఆర్డీ. ఈ విమానయాన సంస్థ తొలి ఏటి లాభం రూ.60వేలు. బ్రిటిష్ జాతీయులు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి తిరిగి వెళ్లిపోయిన సమయంలో కొన్ని రంగాలకు అద్భుతమైన వ్యక్తుల నాయకత్వం లభించింది. పారిశ్రామిక రంగం వరకు అలాంటి వ్యక్తి జేఆర్డీ. టాటా ఎయిర్‌లైన్స్, టాటా స్టీల్ వంటి కీలక పరిశ్రమలను స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అభివృద్ధి చేసి దేశానికి ఆధునికతను అద్దిన వ్యక్తి జేఆర్డీ. టాటా కుటుంబంలో స్ఫూర్తిమంతమైన సాహసం ఉంటుందని చెప్పేవారు britishగాంధీజీ. అలాంటి ఖ్యాతిని కుటుంబానికి తెచ్చినవారు జేఆర్డీ అయి ఉండాలి. పాతికేళ్ల వయసులో ఆయనను తండ్రి ఇండియాకు పిలిపించారు. 14 కంపెనీలతో కూడా టాటా అండ్ సన్స్ సామ్రాజ్యాన్ని ఆయనకు అప్పగించారు. జేఆర్డీలో మొదటి అక్షరం జహంగీర్‌ను సూచిస్తుంది. జహంగీర్ అంటే విశ్వ విజేత. టాటాల పారిశ్రామిక సామ్రాజ్యాన్ని జేఆర్డీ 14 కంపెనీల నుంచి ఆ 95 కంపెనీలకు విస్తరింపచేశారు. భారతదేశ పారిశ్రామికరంగ చరిత్రలోనే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగంలోనే జేఆర్డీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విలువలు ఉన్న పారిశ్రామికవేత్త కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఆయన వృత్తికి పారిశ్రామికవేత్త. కానీ ఆయనలో ఒక ద్రష్ట ఉన్నాడు. సామాన్యుల జీవితాలలోకి తొంగి చూసిన శ్రేయోభిలాషి కూడా ఉన్నాడు. కార్మికుల సంక్షేమంతోనే పారిశ్రామక ప్రగతి ఆధారపడి ఉందని విశ్వసించినవారు జేఆర్డీ. సంపాదన, సంతోషం వేర్వేరు స్థితులని గ్రహించి చెప్పినవారాయన. పారిశ్రామిక రంగాన్ని తాత్విక దృష్టితో చూసినవారు జేఆర్డీ. అప్పటికి దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఐదు దశాబ్దాల పాటు నిర్వహించారాయన. ‘నీవు నాయకుడివి కావాలంటే మానవులను ప్రేమతో నడిపించాలి’ అన్నారాయన. సంస్థ నిర్వహణలో, విస్తరణలో జేఆర్డీ అనుసరించిన ఒక పద్ధతి ఉంది. కొత్త కొత్త పరిశ్రమలు స్థాపనలో గాని, కాలానికి అనుగుణమైన ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకోవడంలో గానీ, మళ్లీ తన కుటుంబ గతం నుంచే ఆయన ప్రేరణ పొందేవారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు హౌస్ ఆఫ్ టాటాస్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటానే ఆయన ఆదర్శంగా తీసుకునేవారు. తనకు ప్రేరణ అవసరమైతే జంషెడ్జీ జీవిత చరిత్రనే కొద్దిసేపు చదువుకునేవారు. ప్రజలే కాదు, పరిశ్రమలు కూడా ముందంజ వేయాలంటే గతంతో లంకె అత్యవసరమని నిరూపించారాయన. తమ పారిశ్రామిక సామ్రాజ్యంలో సైనికులు, అంటే కార్మికుల సంక్షేమం కోసం జేఆర్డీ తీసుకున్న చర్యలు కూడా జంషెడ్జీ నుంచి పొందిన ప్రేరణతో అమలు చేసినవే.1880–1890 మధ్య అత్యధిక పెట్టుబడులు పెట్టి బొంబాయిలో పరిశ్రమలను విస్తరించిన జంషెడ్జీ ఆ కాలంలోనే ప్రమాద బీమా అమలు చేశారు. పింఛను నిధిని ఏర్పాటు చేశారు. పనిచేసే చోట వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చేశారు. జేఆర్డీ మరో అడుగు ముందుకు వేశారు. దేశంలో తొలిసారిగా సిబ్బంది వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. బోనస్‌గా లాభాలలో వాటా ఇవ్వడం, సంయుక్త సలహా మండలి ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. తమ సంక్షేమం, భద్రతల గురించిన విధానాల రూపకల్పనలో కార్మికులకు తప్పనిసరిగా భాగస్వామ్యం ఉండాలన్నది కూడా జేఆర్డీ నిశ్చితాభిప్రాయం. పరిశ్రమలను స్థాపించడానికి పట్టణాలు, నగరాలే తగినవన్న భావన సరికాదని 1969లో ఇచ్చిన ఒక ఉపన్యాసంలోనే జేఆర్డీ చెప్పారు. గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడానికి అన్ని రంగాల నిపుణులు కూడా – ఇంజనీర్లు, డాక్టర్లు, సాంకేతిక నిపుణులు, మేనేజర్లు అంతా గ్రామాలకు వెళ్లి అక్కడి బాగోగులు చూడవలసిన అవసరం ఉందని చెప్పిన వారు జేఆర్డీ. గ్రామాలూ, పట్టణాలూ మధ్య పెరిగి పోతున్న అంతరాలు, ఉద్యోగావకాశాలు, ఆర్థిక ప్రయోజనాల విషయంలో పెరిగిపోతున్న ఆగాధం గురించి జేఆర్డీ ఆలోచించారన్నమాట. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సయోధ్య అనివార్యమన్నదే జేఆర్డీ సిద్ధాంతం. దీని గురించి ఈ దేశంలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. టాటా ఎయిర్‌లైన్స్‌ను ఇదే సిద్ధాంతం మేరకు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ (1946 నుంచి) పేరుతో నిర్మించారు కూడా. ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రయోగంతో నడిచిన మొదటి విజయం, ఆఖరి విజయం కూడా ఎయిర్ ఇండియా ప్రయోగమేనని చెబుతారు. ఆయన ప్రభుత్వం దగ్గరకు ఎప్పుడు వెళ్లినా భారత పారిశ్రామిక రంగ ప్రతినిధిగానే వెళ్లారని ఎందరో రాశారు. అంతే తప్ప టాటా కంపెనీ ప్రతినిధిగా ఆయన వెళ్లలేదు. తన సంస్థల కోసం ప్రత్యేక రాయితీలు అడిగినవారు కాదు జేఆర్డీ. పన్ను ఎగవేతకు ఏనాడూ పాల్పడలేదు. అలాగే రాజకీయ పార్టీలకు చాటుగా విరాళాలు ఇవ్వలేదు. జేఆర్డీ వాణిజ్యం జాతిహితాన్నీ, సామాజిక ప్రయోజనాన్నీ ఆశించడంతో పాటు, విశాల దృష్టిని కూడా కలిగి ఉందని ఒక సందర్భంలో పీవీ నరసింహారావు అన్నారు. ఒక దేశం లేదా సమాజం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోలేని, లేదా వారి అవసరాలకు అక్కరకు రాని ఏ ఆవిష్కరణ అయినా, పరిశ్రమ అయినా విజయాన్ని సాధించడం సాధ్యం కాదని ఒక సభలో జేఆర్డీ చెప్పారు. ఒక ప్రాంతంలో పెట్టే పరిశ్రమ స్థానికులకు ఉపయోగపడక పోతే ఎదరయ్యే ప్రతిస్పందన ఇప్పుడు దేశంలో అన్నిచోట్లా గమనిస్తూనే ఉన్నాం. పారిశ్రామికవేత్త అయినప్పటికీ పర్యావరణ కాలుష్యంలో పరిశ్రమల వాటాను జేఆర్డీ నిజాయితీగానే గమనించారు. ‘ది క్రియేషన్ ఆఫ్ వెల్త్’ అన్న పుస్తకానికి ముందుమాటలో ఆ విషయం ఉంది. ‘‘ప్రస్తుతం పారిశ్రామికవేత్తల బాధ్యత ప్రజల శ్రేయస్సు అనే పరిధిని దాటాలి, పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విషయాన్ని తగినంతగా గుర్తించినా, మన సేవలు మనుషుల పరిధి దాటి నింగీనేల, అడవులకు, నీటి రక్షణకి, భూమ్మీద ఉండే జంతుకోటికి కూడా విస్తరించాలి’’ అని రాశారాయన. ప్రఖ్యాత ఐటీ నిపుణుడు, పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తన జీవితంలో జరిగిన ఒక గొప్ప అనుభవాన్ని ఒక సందర్భంలో వివరించారు. మొదట ఆమె టాటా సంస్థలలో పనిచేసేవారు. ఒకసారి ఆమె ఒక్కరే కార్యాలయం ఆవరణలో కనిపించారు. ఆమెను చూస్తే ఎవరి కోసమో ఎదురు చూస్తున్న సంగతి అర్థమవుతోంది కూడా. అప్పటికే చీకట్లు పడుతున్నాయి. అంతా ఖాళీ అవుతోంది. అప్పుడు ఒక కారు వచ్చి ఆమె దగ్గర ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తి సాక్షాత్తు జేఆర్డీ. సుధామూర్తి కొంచెం కంగారు పడ్డారు. చీకటి పడుతుండగా ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నారని జేఆర్డీ టాటా అడిగారు. తన భర్త వస్తారని (అప్పటికి ఇన్ఫోసిస్ ఆవిర్భవించలేదు) చెప్పింది. నిమిషాలు గడుస్తున్నాయి. ఆయన నిలబడే ఉండిపోయారు. అది మరింత ఇబ్బందిగా అనిపించిందామెకు. చెప్పిన సమయం కంటే కొంచెం ఆలస్యంగానే నారాయణమూర్తి వచ్చారు. అప్పుడు జేఆర్డీ తిరిగి కారు ఎక్కుతూ, ‘‘భార్యకు వేచి ఉండే పరిస్థితి ఇంకెప్పుడు కల్పించనని నీ భర్త దగ్గర హామీ తీసుకో’ అని వెళ్లిపోయారు. ఒక ఉద్యోగి, అందునా మహిళా ఉద్యోగి పట్ల ఆయన చూపిన బాధ్యతాయుతమైన ధోరణి నిజంగా అసాధారణమే. సుధామూర్తి పెద్ద చదువులు చదివిన ఇంజనీరు. ఆమె విషయంలోనే కాదు, తన కారు డ్రైవర్ విషయంలో కూడా జేఆర్డీ మానవతా దృక్పథంతో ఉండేవారు. ఒకసారి ఒక సమావేశంలో పాల్గొన్న జేఆర్డీ తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు దాటిపోయింది. డ్రైవర్ని భోజనం చేశావా అని అడిగారాయన. లేదని చెప్పాడతడు. కొంచెం నొచ్చుకున్నారు జేఆర్డీ. తరువాత మళ్లీ ఒకసారి ఆయన కారు దిగి లోపలికి వెళ్లిన వారే వెనక్కి వచ్చి, కారు డ్రైవర్‌ను పిలిచి, ‘ఇవాళ నాకు ఆలస్యమవుతుంది. నీవు వెళ్లి భోజనం చేసి వచ్చేయ్’ అని చెప్పి మళ్లీ లోపలికి వెళ్లారు. 1992లో భారత ప్రభుత్వం టాటాను భారతరత్నతో సత్కరించింది. ఆ సమయంలో ఆయనను టాటా కంపెనీల ఉద్యోగులు సత్కరించారు. ఆ సమయంలో అన్నమాట చాలా గొప్పది. ‘అమెరికా ఆర్థిక నిపుణుడు భవిష్యత్తులో భారతదేశం ఆర్థిక సూపర్‌పవర్ అవుతుందని జోస్యం చెప్పాడు. కానీ నేను భారతదేశం సుఖసంతోషాలతో వర్ధిల్లే దేశంగా ఉండాలని అనుకుంటాను’ అన్నారు. జేఆర్డీ భారత గగనయాన సేవలకు పితామహుడని పేరు. కానీ ఆయన ఆకాశానికే పరిమితం కాలేదు. నేల మీద మాత్రమే నడవగలిగేవారి గురించి కూడా ఆలోచించారు. - డా. గోపరాజు నారాయణరావు -
కొత్త బంగారం
కుమావ్ పర్వతాలని ఆధారంగా చేసుకుని, నమితా గోఖలే రాసిన హిమాలయన్ ట్రయోలొజీకి ఆఖరి భాగం అయిన నవల, ‘థింగ్స్ టు లీవ్ బిహైండ్’. ఇది మూడు తరాల బ్రిటిష్ పాలకుల గురించీ, స్థానికుల గురించీ రాసినది. కథాకాలం 1840–1912. మొదటి ప్రపంచ యుద్ధమప్పటి తిరుగుబాటు కాలం గురించి చెప్తూనే, ఒక చిన్న అస్పష్టమైన కథలాంటిది కూడా అల్లుతారు రచయిత్రి. ప్రధాన పాత్రల్లో ఒకరైన తిలోత్తమ(తిల్లీ)కి బంధువైన బద్రీ దత్ 1857 విద్రోహంలో ఉరితీయబడతాడు. తల్లి మరణిస్తుంది. ఈ రెండు కారణాల వల్లా తిల్లీకి 19 ఏళ్ళు వచ్చేవరకూ పెళ్ళి అవదు. దాంతో వెసులుబాటు దొరికి కొంచం చదువు అబ్బుతుంది. ఈ పాత్ర ద్వారా, 19వ శతాబ్దంలో స్వతంత్రంగా ఆలోచించే స్త్రీల కష్టాలని రచయిత్రి చూపిస్తారు. నైన్ చంద్‌తో పెళ్ళయ్యాక, తిల్లీ ఇంటిపనులు చేయడానికి ఇష్టపడదు. బద్రీ దత్ చెప్తూ ఉండే, ‘ఎప్పుడూ భయపడకు. నీకిష్టం అయినది కాక, నీక్కావలిసినది చెయ్యి’ అన్న సలహానే పాటిస్తుంటుంది. తిల్లీ గర్భవతి అయినప్పుడు ఇంగ్లిష్ నేర్చుకోవడం వంటి పనులతో ఖాళీ లేకుండా ఉంటుంది. బొల్లితో పుట్టిన కూతురు దియొకీని తన కజిన్ తరిణికి దత్తతకిస్తుంది. భర్తకి రహస్య ప్రేమిక దొరుకుతుంది. ఆధునిక ఆలోచనలూ, బ్రిటిష్ అమ్మాయి రోస్ మేరీ పట్ల ప్రేమా ఉన్న జయేష్ చంద్ పంత్‌తో దియొకికి పెళ్ళవుతుంది. అతను క్రైస్తవం పుచ్చుకుని, జయేశ్ జోనాస్ పంత్‌గా పేరు మార్చుకుంటాడు. బ్రాహ్మణురాలైన తిల్లీ, కూతురి చేతుల్లో బైబిల్ కుక్కి, దియొకిని డియానాగా మార్చి, అల్లుడి వద్ద వదిలిపెడుతుంది. దేశంలాగానే కుమావ్ కూడా కల్లోలానికి గురయినప్పటి కాలంలో, అప్పటి కుమావనీ సూక్ష్మప్రపంచం కనబడుతుంది పుస్తకంలో. స్థానికులు– బ్రిటన్నీ భారతదేశాన్నీ వేర్వేరుగా చూసినప్పటికీ, వలసదారుల చపలత్వం పట్ల మాత్రం విధేయతతో ఉంటారు. ‘యూరోపియన్ల కోసమూ, గుర్రాల కోసమూ మీది మాల్ రోడ్డూ, కుక్కలకీ, నౌకర్లకీ, ఇతర భారతీయులకీ కేటాయించినది కింది మాల్ రోడ్డూ్డ’ అన్న నియమాన్ని ప్రశ్నించరు. కథ ‘బ్రిటిష్ రాజ్’ కాలాన్ని కళ్లకి కట్టేలా చూపిస్తుంది. అప్పుడున్న కుల వ్యవస్థా, తెల్లవారికీ స్థానికులకీ మధ్యనుండే పరస్పర వైరాలూ, బ్రిటిష్ వారి జాత్యహంకారం, ఆ కాలంలో స్త్రీల పరిస్థితీ, గుడ్డినమ్మకాలూ, స్వాతంత్య్ర పోరాటం గురించీ రాసిన ఈ నవల ఆసక్తికరంగా సాగుతుంది. బ్రిటిష్ కాలవ్యవధిని అనుసరిస్తూ– విషయాలకి ఒక ప్రామాణిక అర్థాన్నీ, చారిత్రకతనీ ఆపాదించడానికి నమితా గోఖలే– పదాల, స్థలాల అక్షర క్రమాలని అలాగే ఉంచారు. ఉదా: ‘నైనీతాల్’. ఇది చారిత్రక రూపంలో ఉన్న కాల్పనిక నవల. పుస్తకపు రెండవ భాగం ‘మోడర్న్ టైమ్స్’లో మరింత ఉత్తరదేశపు చరిత్ర ఉంటుంది. ఈ భాగానికీ, ఆఖరిదైన మూడవ భాగానికీ మధ్యన–అనవసరమైన పాత్రలూ, వివరాలూ, పిట్టకథలూ అస్తవ్యస్తంగా పరిచయం చేయబడతాయి. ఈ పుస్తకం వచ్చినది నవంబర్ 2016లో. అక్టోబర్ 2017లో రచయిత్రికి అసోమ్ సాహిత్య సభలో మొట్టమొదటి ‘సెంటినరీ అవార్డ్ ఫర్ లిటరేచర్’ అవార్డ్ ప్రదానం చేశారు. - క్రిష్ణవేణి -
రన్నరప్ నీల్ జోషి
బర్మింగ్హమ్: బ్రిటిష్ ఓపెన్ జూనియర్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు నీల్ జోషి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన బాలుర అండర్–15 సింగిల్స్ ఫైనల్లో నీల్ జోషి 8–11, 16–14, 0–11, 12–14తో టాప్ సీడ్ సామ్ టాడ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. అండర్–17 బాలుర సెమీఫైనల్లో తుషార్ సహాని 11–9, 2–11, 3–11, 8–11తో టాప్ సీడ్ ఒమర్ టోర్కీ (ఈజిప్ట్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
పేర్లు, పిలుపులలో అసమానులు
ఆదిత్య హృదయం ఇది క్రిస్మస్ పండుగ. ఇప్పుడు నేను ఇంగ్లండ్‌లో ఉంటూ బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఖుషీగా ఉన్నాను. అది సంభాషణ కావచ్చు, తిండి తినడానికి ఉపయోగించే కత్తులూ, కఠార్లూ కావచ్చు, క్యూని పాటించడం లేదా ప్రశ్నిం చడంకావచ్చు... పబ్బులూ, పదాలతో ఆడుకోవడాలూ వంటి అన్నింటిలో బ్రిటిష్ పౌరులు తమ సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూంటారు. పురాతన గతంలోకి తొంగిచూస్తూ, వాటికి మార్మికత్వం ఆపాదిస్తూ, మరింత సంక్లిష్టంగా మారుస్తూనే ఆ సంప్రదాయాలను ఇప్పటికీ శ్రద్ధగా, కచ్చితంగా తాము పాటిస్తున్నామని చెబుతుంటారు. దీనికి సంబంధించి బ్రిటిష్ నామకరణ పద్ధతి ఒక అద్భుత చిత్రణను అందిస్తుంది. చిన్న ఉదాహరణతో చర్చను మొదలెడతాను. ఒకప్పుడు యోధుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి సర్ క్రిస్టియన్ హోదాలోకి మారతాడు కానీ అతడి భార్య మాత్రం మహిళకు చెందిన ఇంటిపేరునే కలిగి ఉంటుంది. కాబట్టే బ్రిటన్ పేర్లలో సర్ జార్జ్ ఉంటారు కానీ సర్ బ్రౌన్ ఉండరు. కానీ దీనికి కాస్త గందరగోళాన్ని చేర్చుతూ ఒక మహిళ లేడీ బ్రౌన్గానూ ఉండవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో లేడీ సారాగా కూడా ఉండవచ్చు. ఏది సరైంది అనేది ఆమె పుట్టి పెరిగిన ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లేడీ బ్రౌన్ స్పష్టంగా ఒక వీరయోధుడి భార్యగా ఉంటుంది. లేడీ సారా ఒక డ్యూక్, మార్క్యూస్ లేదా ఎర్ల్ కుమార్తె అవుతుంది. ఆమె గుర్తింపు భర్త పేరిట కాకుండా తండ్రి పేరుమీద వస్తుంది. కులీనుడిగా మారినప్పుడు మీరు ప్రభువు హోదాలోకి మారవచ్చు. ఇంకా కొంతమంది లార్డ్ క్రిస్టియన్ని ఇంటిపేరుగా పిలిచే సంపన్న ప్రభువర్గీయులు ఉన్నారు. కాకపోగా ఇది డ్యూక్ లేదా మార్క్యూస్ చిన్న కుమారుడిని పిలిచే సరైన పద్ధతి. పెద్ద కుమారుడు తండ్రి రెండో పేరుకు వారసుడై మర్యాదకోసం మార్క్యూస్గా మారతాడు. నిజానికి ఒక వ్యక్తి పేరు అతడి లేక ఆమె సొంతానిదా లేక పెళ్లి, వారసత్వం ఫలితంగా వచ్చిందా అని నిర్ధారించడంలో ఈ వ్యత్యాసాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే పేర్ల విషయంలో అత్యంత కచ్చితత్వం అవసరమవుతుంది. ఉదాహరణకు మేఘన్ మర్కెల్ అనే మహిళను వివాహం అయిన తర్వాత ఎలా పిలవాలి అనే విషయం నన్ను ఆలోచనలో పడేసింది. ఆమె ఎన్నటికీ రాకుమారి మేఘన్ కాలేదు. ఎందుకంటే ప్రిన్సెస్ క్రిస్టియన్ అనే పేరు రాజకుమారికి ఉద్దేశించినది. ఆమె ఒక రాజకుమారిగానే పుట్టి ఉంటుంది. మేఘన్ మాత్రం వివాహం ద్వారానే రాకుమారి అవుతుంది. అందుచేత ఆమె సరైన పేరు ప్రిన్సెస్ హెన్రీ ఆఫ్ వేల్స్ అవుతుంది. ఆ లెక్కన యువరాణి డయానా ఎన్నటికీ ఆమె నిజ నామం కాదు. ఎందుకంటే ఆమె రాచపుట్టుక పుట్టలేదు. ఆమె భర్త వేల్స్ యువరాజు కాబట్టి ఆమె వేల్స్ యువరాణి అవుతుంది. బ్రిటన్ రాజకుమారుడు విలియమ్స్ సతీమణి కేట్ విషయంలోనూ ఇదే నిజం. ఆమె వాస్తవానికి కేట్ యువరాణి కాదు. ఆమె అసలు హోదా ప్రిన్సెస్ విలియం ఆఫ్ వేల్స్ అన్నమాట. ఇçప్పుడు ఈ సరైన లేక అసలు పేర్లు కాస్త మోటుగా ఉన్నాయి కాబట్టి, విలియమ్ పెళ్లి సందర్భంగా బ్రిటన్ రాణి అతడికి డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి (కేంబ్రిడ్జ్ ప్రభువు) అనే హోదాను ప్రసాదించారు. అందుచేత, ఈ దంపతులను ఇప్పుడు హెచ్ఆర్హెచ్ (హిస్ రాయల్ హైనెస్, హర్ రాయల్ హైనెస్) ప్రిన్స్ విలియం అనీ, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ (కేంబ్రిడ్జ్ ప్రభుపత్ని) అని వ్యవహరిస్తారు. నిస్సందేహంగా ఇదే ప్రభువు హోదాని హెన్రీకి కూడా కట్టబెడతారు. కాబట్టి ఈ లెక్కన మేఘన్ యువరాణి హెన్రీ అనే పిలుపునకు నోచుకోదు కానీ ఎవరో ఒకరి ప్రభుపత్ని (డచ్చెస్)గా మారుతుంది. ఇదంతా మిమ్మల్ని అయోమయంలో, గందరగోళంలోనూ ముంచెత్తినట్లయితే, మీకు మంచి సాహచర్యం ఇస్తున్నట్లే మరి. యోధులు, వారి మహిళలను ఎలా ప్రస్తావిస్తారు అన్నది మినహాయిస్తే బ్రిటన్ పౌరులు సముద్రం వద్ద మాత్రం ఇప్పుడు అంతా సమానులుగానే ఉంటారు. కానీ కోర్టు, పార్లమెంటు, పురాతన పత్రికలు వంటి బ్రిటన్ వ్యవస్థలు మాత్రం ఈ పవిత్ర సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తుంటాయి. ఒక చివరి ఆసక్తికరమైన విషయం ఉంది. బ్రిటన్ పార్లమెంటులో ఎంపీలు ప్రతి ఒక్కరినీ గౌరవనీయులుగా సంబోధిస్తుంటారు. మరీ ప్రత్యేకించి ప్రతిపక్ష సభ్యుల విషయంలో ఈ సంబోధనలను తప్పనిసరిగా చేస్తుంటారు. ఇది భాషను మృదువుగా వాడటం కాకుండా వారి నిజమైన ఉద్దేశాన్ని తెలిపే స్వరాన్ని మాత్రమే సూచిస్తుంది. అందుకే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ కాలేజీల వద్ద ఆగ్రహంతో కూడిన కాపలాదార్లు అక్కడి పచ్చికపై నడిచే డిగ్రీ స్టూడెంట్లపై ఆగ్రహంతో ఇలా అరుస్తుంటారు. ‘ఆ దిక్కుమాలిన పచ్చికనుంచి బయటకు రండి సర్!’. అలాగే సంప్రదాయానుసారం కాలేజీ సిబ్బంది కూడా డిగ్రీ స్టూడెంట్లను సర్ అనే గౌరవంగా పిలుస్తుంటారు. వారి ఉద్దేశం అది కాకపోయినా ఈ గౌరవపదం మాత్రం వాడుకలో కొనసాగుతోంది. క్రిస్మస్ శుభాకాంక్షలు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, కరణ్ థాపర్ ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
‘నాతో అలాంటి వీడియోలు లేవు’
లండన్ : తన కంప్యూటర్లలో ఎలాంటి పోర్న్ వీడియోలు లేవన్న బ్రిటీష్ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డామియన్ గ్రీన్.. తనపై వచ్చిన ఆరోపణలను మరోసారి ఖండించారు. 2008లో కన్జర్వేటీవ్స్ ప్రతిపక్షంలో ఉండగా అధికారి డామియన్ కార్యాలయంపై కౌంటర్ టెర్రరిజం విభాగం ఆకస్మిక దాడులు చేపట్టింది. డామియన్ పర్సనల్ కంప్యూటర్లలో పోర్న్ వీడియోలు లభ్యమైనట్లు అప్పటి సీనియర్ పోలీస్ అధికారి బాబ్ క్విక్ మీడియాకు వెల్లడించారు. రాజకీయ కారణాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని గతంలోనే బాబ్ క్విక్పై డామియన్ మండిపడ్డారు. పోర్న్ వీడియోలు, ఫొటోలు కలిగి ఉన్నాడన్న దానిపై కేబినెట్ ఆఫీసు విచారణ చేపట్టిందని హోం సెక్రటరీ అంబర్ రుడ్ తెలిపారు. తనపై డామియన్ అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడులకు యత్నించారని ఓ మహిళా ఉద్యోగి తాజాగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పై నమోదైన అన్ని కేసులపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేశారని, తాను ఎలాంటి తప్పులు చేయలేదని డామియన్ చెబుతున్నారు. మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించారన్న అరోపణల నేపథ్యంలో ఎంపీలు సమావేశం కావడంతో.. బ్రిటీష్ రక్షణశాఖ కార్యదర్శి మైఖెల్ ఫాల్లన్ తన పదవికి రాజీనామా చేశారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించిన మైఖెల్.. క్షమాపణలు చెప్పారు. -
బీమా జేవీని సొంతం చేసుకున్న కోటక్ బ్యాంక్
డీల్ విలువ రూ.1,292 కోట్లు ముంబై: కోటక్ మహీంద్రా – ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్లో భాగస్వామి వాటాను కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ జేవీలో బ్రిటిష్ భాగస్వామి, ఓల్డ్ మ్యూచువల్‌కు ఉన్న 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు కోటక్ గ్రూప్ ప్రెసిడెంట్(అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్) గౌరంగ్ షా చెప్పారు. ఈ వాటా కొనుగోలుతో ఈ జేవీలో వంద శాతం వాటా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఉంటుందని పేర్కొన్నారు. ఈ డీల్ విలువ రూ.1,292 కోట్లు. డీల్ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ఈ జేవీ రూ.300 కోట్ల నికర లాభం ఆర్జించిందని, గత నాలుగేళ్లలో లాభాలు ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందాయని గౌరంగ్ షా తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంస్థ నెట్‌వర్త్ రూ.1,825 కోట్లు. 1.50 కోట్ల మంది వినియోగదారులున్నారు. డీల్ వార్తల కారణంగా బీఎస్ఈలో కోటక్ బ్యాంక్ షేర్ 1.4% క్షీణించి రూ.901 వద్ద ముగిసింది. -
బాత్రూమ్ కిటికీ నుంచి జంప్
నకిలీ పాస్‌పోర్టు కేసులో తప్పించుకున్న బ్రిటిషర్ ఢిల్లీ కోర్టు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా ఘటన సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు, చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న బ్రిటన్ దేశస్తుడు మహ్మద్ అలీ రాష్ట్ర పోలీసుల కళ్లుగప్పి ఢిల్లీలోని రైల్వే స్టేషన్ బాత్రూమ్ కిటీకి నుంచి పరారయ్యాడు. స్కాట్లాండ్ పోలీసులకు పలు చీటింగ్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అలీ నాలుగేళ్ల క్రితం నకిలీ పాస్పోర్టుతో హైదరాబాద్ వచ్చి బస చేశాడు. అప్పుడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అలీని అరెస్ట్ చేసి సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడిని ఢిల్లీలోని పాటియాల కోర్టులో పీటీ వారెంట్‌పై బుధవారం రాష్ట్ర సీఐడీ పోలీసులు హాజరు పరిచారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. బాత్రూమ్కు వెళ్లాలని చెప్పడంతో మహ్మద్ అలీని ఎస్కార్ట్ పోలీసులు తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన అతడు... బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు దూకి తప్పిం చుకున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో అతడిని పట్టుకొనేందుకు సీఐడీ రెండు బృందాలను రంగంలోకి దింపింది. ఎస్కార్ట్‌గా వెళ్లిన నగర పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని సిటీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వేషాలు మార్చడంలో దిట్టయిన మహ్మద్ అలీని పట్టుకొనేందుకు ఢిల్లీ పోలీసులతో కలిసి రాష్ట్ర పోలీసులు వేట సాగిస్తున్నట్టు తెలిసింది. -
ఖరీఫ్‌పై నీలి నీడలు
మొరపెట్టుకున్నా కరుణించేవారేరీ? ఈ ఏడాది జూ¯ŒS 15 తరువాతనే సాగునీరు సాగు సమ్మెలో డిమాండ్‌నూ పట్టించుకోని వైనం బ్రిటిష్ కాలంలో పద్ధతిగా నీళ్లిచ్చేవారు ఆ ప్రణాళిక అమలు చేయాలంటే పట్టించుకోని వైనం మండిపడుతున్న డెల్టా రైతులు అమలాపురం : తెల్లవారి పాలనలో... బ్రిటిష్ పాలనా కాలంలో మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇచ్చేవారు. జూ¯ŒS 15 నాటికి రైతులు నాట్లు పూర్తి చేసేవారు. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తయి అన్నదాతలంతా ఆనందంతో గడిపేవారు. ఆ తరువాత అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వచ్చిన అల్ప పీడనం, తుపాన్ల బారి నుంచి బయటపడేవారు. మనవారిపాలనలో... మే 15వ తేదీన కాకుండా ఓ నెల ఆలస్యంగా అంటే జూ¯ŒS 15 తరువాత నీరు విడుదల చేస్తున్నారు. దీంతో తుపాన్లలో చిక్కి చేతికొచ్చే పంటా వరదపాలయ్యేది. 2011లో సాగు సమ్మె ఉధృతంగా జరిగింది. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి 2012 మే 25న సాగునీరు విడుదల చేశారు. ఆ తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో గత ఖరీఫ్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు. ‘బ్రిటీష్ కాలంలో ఇచ్చినట్టుగా మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇవ్వాలి. అలా ఇస్తే జూ¯ŒS 15 నాటికి నాట్లు పూర్తి చేస్తాం. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తవుతాయి. అప్పుడే మా పంట మాకు దక్కుతుంది. ఆలస్యమైతే అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వస్తున్న అల్ప పీడనలు, తుపాన్లకు పంట నష్టపోవడం పరిపాటిగా మారింది’ అని డెల్టా రైతులు మొరపెట్టుకుంటున్నారు. 2011లో జరిగిన సాగు సమ్మె ఉద్యమ సమయంలో ఇదే ప్రధాన డిమాండ్. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లలో ఇదొకటి. సాగుసమ్మె జరిగిన తరువాత ఏడాది 2012 మే 25న సాగునీరు ఇచ్చిన ఇరిగేష¯ŒS అధికారులు తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో డెల్టా రైతులు పంటను నష్టపోతున్నారు. దీనికి నిరసనగా గత ఖరీఫ్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా జూ¯ŒS 15 తరువాతే మధ్య డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించడం ఇక్కడ గమనార్హం. ‘కనీస సదుపాయాలు కల్పించండి ... పంట పండించి దేశానికి ధాన్యరాశులు అందిస్తాం’ రైతులు చేస్తున్న డిమాండ్ ఇదీ. డెల్టాలో సాగవ్వాల్సిన 40 వేల ఎకరాలను బీడుగా పెట్టి ప్రాధేయపడుతున్న వేడుకోలు ఇది. అయినా పాలకులు పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించడంతో అన్నదాతలుఅల్లాడిపోతున్నారు. మే రానే వచ్చింది. మళ్లీ రైతన్న పిడికిలి బిగుస్తోంది. అన్ని అనర్థాలకూ ఇదే కారణం... lసాగునీరు ఆలస్యంగా ఇవ్వడమే మధ్య డెల్టాలో సాగు నష్టపోవడానికి కారణమవుతోంది. జూ¯ŒS 15 నాటికి నీరు విడుదల చేయడం వల్ల అక్టోబరు 20 తరువాత తుపాన్లబారిన పడి పంట నష్టపోవడంతో రైతులు కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు. l తుపాన్ల నుంచి పంటను రక్షించుకునే ఉద్ధేశంతో కొంతమంది రైతులు సాగు ఆలస్యం చేసి ఆగస్టు మొదటివారంలో నాట్లు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల డిసెంబరు నెలాఖరు నాటికి కాని కోతలు పూర్తి కావడం లేదు. దీంతో రబీసాగు ఆలస్యమవుతోంది. రబీ నాట్లు సంక్రాంతి తరువాత కూడా పడడం వల్ల ఏప్రిల్ 10 వరకు సాగునీరు విడుదల చేయాల్సి వస్తోంది. తమకు ఈ నెల 20 వరకు సాగునీరు విడుదల చేయాలని కొంతమంది రైతులు కోరుతుండడం చూస్తుంటే సాగు ఎంత జాప్యమవుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ ఆలస్యం కావడం వల్ల మూడో పంట అపరాలు సాగు లేకుండా పోతోంది. దీనివల్ల రైతులు అదనపు ఆదాయం కోల్పోవడమే కాకుండా భూసారాన్ని పెంచి పచ్చిరొట్ట ఎరువులకు దూరమవుతున్నారు. కాలువలను ఆలస్యంగా మూసివేయడం వల్ల అటు ఇరిగేష¯ŒS శాఖాధికారులు సైతం ఆధునికీకరణ పనులను ఆశించిన స్థాయిలో చేయడం లేదు. ఈ అనర్ధాల నుంచి గట్టెక్కాలంటే మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లోను కష్టాలు తప్పేటట్టు లేవు. -
ఉన్మాదితో రోడ్డు ట్రిప్.. యువతి జీవితం బలి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ బ్రిటన్‌కు చెందిన యువతిపై దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఆమెను దాదాపు రెండు నెలలపాటు బందించి చిత్రహింసలకు గురిచేశాడు ఓ ఉన్మాది. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమె శరీరంపై కత్తిగాట్లు పెట్టాడు. నిరంతరం చావుదెబ్బలు కొడుతూ ఊపిరి ఆడకుండా చేసి ఉన్మాదం చూపించాడు. మంగళవారం బాధితురాలిని ఆస్ట్రేలియా పోలీసులు ఈ ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేశారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడే తనకు ఓ యువకుడితో పరిచయం అయింది. ఆ తర్వాత అతడిని నమ్మి రోడ్డు ట్రిప్‌కు ప్లాన్ చేసుకుంది. అలా మొదలుపెట్టిన ప్రయాణమే ఆ యువతి పాలిట శాపంగా మారింది. తిరిగి వెళ్లడాన్ని అడ్డుకున్న ఆ యువకుడు తొలుత ఆమెకు ఇష్టం లేకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బంధించి జనవరి 2 నుంచి మార్చి 5వరకు ఆయా ప్రాంతాలకు తిప్పాడు. ఈ క్రమంలో పలుచోట్ల అత్యాచారం పరంపర కొనసాగించాడు. సిగరెట్లతో కాల్చడం, కత్తితో కోయడం, విపరీతంగా కొట్టడంలాంటి వికృతచేష్టలతో ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఇలా మార్చి 6న(సోమవారం) కూడా ఆమెను వేరే చోటుకు తీసుకెళుతుండగా దారిలో పోలీసులు ఉన్నది గమనించాడు. తాను వెనుక సీట్లో దాక్కుంటానని, కారును పోనియ్యాలని బాధితురాలిని భయపెట్టాడు. అదృష్టవశాత్తు పోలీసులు చూసి ఆమె ముఖంపై గాయాలు గుర్తించి అనుమానంతో కారులో నుంచి బయటకు లాగేశారు. అనంతరం కారు వెనుకాలే ఉన్న 22 ఏళ్లు పైబడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ యువకుడిపై దాదాపు పదుల సంఖ్యలో ఈ తరహా కేసులు నమోదుచేశారు. రోడ్ ట్రిప్ వెళ్లేందుకు ఆస్ట్రేలియా చాలా అద్బుతంగా ఉంటుంది. ప్రతి ఏటా ఇక్కడకు ఈ కారణంతోనే దాదాపు ఆరులక్షలమంది పర్యాటకులు వస్తారని అంచనా. -
ఆకుపచ్చ సూర్యోదయం
మే నెల 7, 1924 ఎండ– వలసదేశంలో బ్రిటిష్ జెండాలా చెలరేగిపోతోంది తూర్పు కనుమల మీద.నిప్పుల ముసుగు లాంటి ఆకాశం కింద పూర్తిగా ఆకు రాల్చిన కొన్ని చెట్లు పతాకాలను అవనతం చేసిన కొయ్యలను గుర్తుకు తెస్తున్నాయి. విశాఖమన్యంలో ఆ రోజు, ఆమారుమూలకు గ్రామం కృష్ణదేవిపేటలో జరగబోతున్న ఓ ఘోరకలి పతాక సన్నివేశాన్ని ముందే ఊహిస్తున్నట్టున్నాయి.అదిగో! దావాగ్నిలో ఓ చిరు నాలుక వంటి ఈ నాందీవాక్యం ఆ సన్నివేశంలోదే......‘‘శ్రీరామరాజొస్తన్నాడ్రా... శ్రీరామరాజు... రండి ...! పాలూ పళ్లూ పట్టుకురండి...! హారతులివ్వండి!’’అకస్మాత్తుగా పొలికేకలు, వీధి మొగలో.కానీ, పేలిన తూటాలు చెవిని తాకుతూ వెళ్లినట్టయింది. అంత భయపెట్టాయి, ఆ కేకలు.అక్కడంతా భయమే. ఒక్కొక్కటిగా వచ్చి వాలిపోతుంటే, పెరిగిపోతున్న రాబందుల గుంపును చూసి సగం చచ్చిన గొడ్డు కళ్లల్లో అలుముకుంటున్న భయం లాంటి భయం.అదిరిపడి అటే చూశారందరూ.చింతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే ఆ కానిస్టేబుల్ గొంతు నుంచే వచ్చాయా కేకలు. వెర్రికేకలు.అరుపులతో ఉబ్బిన అతడి కంఠనాళాలు ఇంకా అలాగే ఉన్నాయి. అంతులేని కసితో, గొంతు పగిలేలా అరిచాడు.ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతమే అయినా రోహిణి ఎండ చురచురలాడిస్తోంది. వడగాలీ చెలరేగిపోతోంది. ఇసుకరేణువుల బరువుతో భారంగా కదులుతున్నాయి ఎండుటాకులు. ఎర్రకొండల ధూళి సుడులు సుడులుగా ఊరంతా స్వైరవిహారం చేస్తోంది. థక్...థక్...థక్...థక్... థక్.. థక్... కొండలలో మట్టిబాట మీద బూటు కాళ్ల అడుగుల సవ్వడి.కర్కశమైన, కర్ణకఠోరమైన ఆ శబ్దం నెల తరువాత నెల పెరిగిపోతూనే ఉంది. అది పెరుగుతూ భయాన్నీ పెంచింది. ఒకటి కాదు, రెండు కాదు... ఇరవైమూడు నెలలుగా.... నాలుగు దిక్కులూ తుపాకీ పేలుళ్లతో పగలూ రాత్రీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.నిన్న తెల్లవారు జామునే... బ్యాటరీ లైట్లు, పెట్రోమాక్స్ లైట్ల వెలుగులలో పరుగులు తీస్తూ పోలీసులు పెట్టిన ఆ పెడబొబ్బలూ, అరుపులూ ఊరివాళ్ల చెవులలో ఇప్పటికీ గింగురుమంటూనే ఉన్నాయి, ‘శ్రీరామరాజు దొరికిపోయాడు, దొరికిపోయాడు.. శ్రీరామరాజు దొరికిపోయాడు’ అంటూ.వణికిపోయింది కృష్ణదేవిపేట. కానీ పది నిమిషాలలోనే అంతా గప్‌చుప్.వేటాడిన జంతువును తెచ్చినట్టు ఒళ్లంతా గాయాలతో ఉన్న ఓ గడ్డం మనిషిని మోటారుబండిలో పడేసి తెచ్చారు. వెంటనే రాజవొమ్మంగి తీసుకుపోయారని చెప్పుకున్నారు. ఆపై ఏమైందో తెలియలేదు.ఎవరో అగ్గిరాజట, శ్రీరామరాజే అనుకుని అతడిని బంధించి తీసుకువచ్చారట.ఇది జరిగి ఇరవైనాలుగు గంటలైనా గడవలేదు. మళ్లీ ఈ బీభత్సం....లాఠీలతో ఇద్దరు చింతపల్లి పోలీసులూ, వారి వెనుకే భుజాల మీద 303 తుపాకులతో ఐదుగురు అస్సాం రైఫిల్స్ దళ సభ్యులూ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు, నడివీధిలో.ప్రపంచ యుద్ధంలో పనిచేశామన్న పొగరు ఆ ఐదుగురి నడకలో. జర్మనీ యుద్ధోన్మాదంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం తునాతునకలైపోకుండా తామే రక్షించామన్న అతిశయం ఆ ముఖాల నిండా. ఆ గతంతో పాటు, ప్రస్తుతం కళ్లెదుట కనిపిస్తున్న క్రూరత్వం జనాన్ని వణికిస్తున్నాయి. గ్రామచావడి, రామాలయం ఉన్న ఆ వీధిలోనే వడివడిగా అడుగులేస్తున్నారు ఆ ఏడుగురు. ఊరి శివార్లలో ఉన్న దలే బెన్నయ్య సారా దుకాణంలో పది నిమిషాల క్రితం రెండేసి డ్రాముల వంతున తాగిన సారా కైపెక్కించడం ఆరంభించినట్టుంది.అప్పుడే, పూనకం వచ్చినట్టు నాలుగు అంగలు లంఘించి, లాఠీ సహా కుడిచేయి పైకెత్తి ఉన్మాద స్థితిలోకొచ్చేసి అరవడం మొదలుపెట్టాడా చింతపల్లి పోలీసు.‘‘మీ సీతారామరాజొస్తన్నాడ్రోయ్....! శ్రీశ్రీశ్రీ అల్లూరి శ్రీరామరాజు గారొస్తన్నారరేయ్... !!’’ ఆపకుండా అరుస్తూనే ఉన్నాడతడు.‘‘కేడీపేట జనులారా! మీ దేవుడు.. మీ రామరాజు... నిజంగా దొరికిపోయాడొహోయ్!’’ తుపాకీ మోత వినపడిన పక్షుల గుంపులా, గ్రామ చావడిలో కూర్చుని మాట్టాడుకుంటున్న ఆ ఎనిమిదిమంది నడివయస్కులు వాళ్ల కంట పడకుండా తప్పించుకునేందుకు ఒక్క ఉదుటన దూకారు. మళ్లీ పెనుకేక, హిందీలో..... వాళ్లని ఉద్దేశించే – ‘‘టైరో...!’’ ఆగలేదు ఆ గ్రామీణులు.‘‘టైరో... టైరో....ఠైరో..ట్టయ్రో, బద్మాష్ ....!’’ వెనుక నుంచి అస్సాం దళసభ్యుల కేకలు, మండుతున్న దుంగలు ఒరుసుకుంటున్నట్టు.‘‘ఆగండెహె!’’ అస్సాం రైఫిల్స్ సభ్యుల కరకు ఆదేశాన్ని చింతపల్లి పోలీసులలో ఒకడు అనువదించాడు. ఈ నాలుగయిదు మాసాల సాహచర్యంతో అబ్బిన హిందీ ముక్కల ప్రభావం.కన్నుమూసి తెరిచేలోగానే అలా జరిగిపోయింది – మొదట కేకపెట్టిన అస్సాం రైఫిల్స్ సభ్యుడే దుమ్ము రేపుకుంటూ, కొద్దిగా తూలతున్నా కూడా అత్యంత లాఘవంగా దూసుకెళ్లి ఆ గ్రామీణలకు అడ్డంగా నిలబడ్డాడు. భుజం మీద ఉన్న ఆ రైఫిల్‌ని ఎప్పుడు ఎలా తీశాడో మరి, దానినే వాళ్లకి అడ్డం పెట్టాడు. పడగెత్తిన నాగుపాముని చూసినట్టు రెండడుగులు వెనక్కి వేశారు వాళ్లు, తుపాకీని చూసి.రెండు సెకన్ల తరువాత తుపాకీ భుజం మీద వాల్చి, ఒక్కసారిగా అటెన్షన్లోకొచ్చి నిలబడ్డాడు. కుడి బూటుకాలిని బలంగా నేలకు తాడించి సెల్యూట్ చేశాడు.గుండెలదిరిపోయాయి వాళ్లకి.‘‘అస్సాం రైఫిల్స్.... ఈ పేరు విన్నార్రా? మేమెవరమో తెలుసురా బాడ్ఖోవ్. మహాయుద్ధంలో... ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాడిని ఉచ్చ పోయించినవాళ్లం..’’పళ్లు పటపట కొరుకుతూ, కోపంతో ఊగిపోతూ అన్నాడు హిందీలో. గుప్పుమంది సారా వాసన. మత్తుతో నాలుక మడతపడుతోంది. మాట మాటకీ పెరుగుతోంది ఆవేశం. ఆవేశం గొంతును పెంచుతోంది. కళ్లలో ఎరుపు కూడా పెరిగిపోతోంది. అప్పటికి మిగిలిన పోలీసులు కూడా ఆ గ్రామీణులని చుట్టుముట్టారు.ఖాకీచొక్కాలు పూర్తిగా తడిసిపోయాయి, చెమటతో. ముదురుతున్న ఎండతో ముఖాలన్నీ చెమట పట్టేసి, ఇంకాస్త భయపెడుతున్నాయి, ఆ ఎర్రటి దుమ్ము పేరుకుని. కురుచ జుట్టు మీద పెట్టుకున్న బిగుతు టోపీలో నుంచి ధారలుగా కారుతోంది చెమట. గాడ్పులకి వాడిపోయి ఉన్నాయి వాళ్ల ముఖాలన్నీ. సగమే తెరిచినట్టు కనిపిస్తూ చింత నిప్పుల్లా ఉండే అస్సాం రైఫిల్స్ వాళ్ల కళ్లు మానుతున్న కత్తిగాట్లలాగే ఉన్నాయి, తెల్లటి ముఖాల మీద. ఆ గుంపును ఆపినవాడే, పెద్ద రహస్యం చెబుతున్నట్టు నెమ్మదిగా మొదలు పెట్టి ఒక్కసారిగా రెచ్చిపోయాడు.‘‘తిరుగుబాటు చేస్తార్రా?! ఫితూరీలు చేస్తార్రా, ఫితూరీలు?! లోడ్ చేయని గన్ని చూస్తేనే కాళ్లు తడుపుకుంటారు, మీర్రా తిరగబడేది... లంజాకొడకల్లారా!’’ తుపాకీ మడమలతో గొడ్లను బాదినట్టు బాదడం మొదలుపెట్టారు ఆ గ్రామస్థులని, అస్సాం రైఫిల్స్ వాళ్లు.. ‘‘మాకేం తెలీదు దొరా! ఫితూరీ మాదికాదు...కొండోళ్లది దొరా! నిజం దొరా!’’ ఏడుస్తూనే చెబుతున్నారు గ్రామీణులు. అదేమీ వినకుండా ప్రతాపం చూపిస్తున్నారు పోలీసులు. వాళ్లు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే మోకాళ్ల మీద బూటుకాళ్లతో బలం కొద్దీ తన్నుతున్నారు. చర్మం పగిలి రక్తం కారుతోంది కొందరికి. గుండెలవిసిపోయేలా రోదించడం మొదలుపెట్టారు. ఆ ఏడుపులతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం ప్రతిధ్వనిస్తోంది. అక్కడికి కొంచెం దూరంలోనే అప్పటిదాకా అరుగు మీద కూర్చుని ఉన్న ఆ కుటుంబ సభ్యులు – ఆడా, మొగ ఒక్క ఉదుటన లోపలికి ఉరికి తలుపులు బిగించుకున్నారు. మరుక్షణంలో ఆ వీధిలో ఉన్న ఇళ్ల తలుపులన్నీ పెనుగాలికి ఎడా పెడా కొట్టుకున్నట్టు కొట్టుకుని, చివరికి మూసుకున్నాయి.దెబ్బలు తిన్నవాళ్లు ఆ చిన్న సందు దాటి, మునసబు లగుడు సత్యనారాయణ ఇల్లు ఉన్న వీధిలోకి వచ్చి పడ్డారు. మెదళ్లు మొద్దుబారిపోయాయి– అక్కడా అదే దృశ్యం.ఇక్కడ అస్సాం రైఫిల్స్ సాయుధులు. అక్కడ మలబార్ స్పెషల్ పోలీసులు. కూరలు తరుగుతూ వదిలేసిన గిన్నీ, కత్తిపీట, ఎవరో విసురుకున్న తాటాకు విసినెకర్ర, పక్కనే నీళ్లతో ఉన్న మరచెంబు... అన్నింటినీ బలంకొద్దీ తన్నుతూ రంకెలు వేస్తున్నారు– మలయాళీ ప్రభావంతో, తెలుగులోనే.‘‘మీ రాజు.... శ్రీరామ్‌రాజు వస్తుంది... తళుపుళు వేస్తారేం? రాండి... చూడ్డానికి రావాళి.... పళ్లూ, పూళూ, తేనె పట్కరావాళ్రా. జేజేలు కొట్టాళి...!’’అక్కడ రెండు నిమిషాలు బీభత్సం సృష్టించి పక్క ఇంటివైపు నడిచారు.ఇక్కడ– రామాలయానికి కొంచెం దగ్గరగా, ఓ ఆర్తనాదం హృదయ విదారకంగా. అది కూడా మహిళ గొంతు నుంచి.ఆ ఎనిమిది మందిని వదిలాక ఈమెను పట్టుకున్నారు అస్సాం రైఫిల్స్ పోలీసులు.ఒకడు ఆమె జుట్టు ఒడిసి పట్టుకుని ముఖంలో ముఖం పెట్టి హిందీలో అడుగుతున్నాడు.‘‘రామమందిరానికా?’’ పూజా సామాగ్రి పెట్టుకున్న పూలసజ్జతోనే రెండు చేతులూ జోడించి నిస్సహాయంగా బావురుమన్నదా మధ్యవయస్కురాలు. ఆపాదమస్తకం వణికిపోతోంది. ‘‘చుప్....! మందిర్కేనా?’’ మళ్లీ అరిచాడా సాయుధుడు, జుట్టు మరింత గుంజుతూ. తలూపిందామె, ప్రాణం పోతుందేమోనన్నంత భీతితో. అప్పుడు పూలసజ్జ కేసి చూస్తూ ఆదేశం ఇస్తున్నట్టు అన్నాడు. ‘‘హారతి కర్పూరం మాత్రం వెలిగించకు. మీ దేముడొస్తున్నాడు. వాడికి హారతివ్వాలి.’’ అంతలోనే ఆవేశంతో పెచ్చరిల్లిపోతూ, జుట్టు ఇంకాస్త గట్టిగా బిగించి ఒక రాక్షసానందంతో అన్నాడు, ‘‘మీ రామ్రాజ్ వస్తున్నాడు, తెలుసా?!’’ స్పృహ కోల్పోతున్నట్టు కూలిపోయిందామె అక్కడే. ఆమెను అలాగే వదిలేసి అక్కడికి కొద్దిదూరంలోనే ఉన్న గ్రామ పెద్ద చిటికెల భాస్కరనాయుడిగారింటి వైపు నడిచారంతా. అక్కడ నుంచి మూడు నిమిషాల నడక.అప్పటికే ఆ వీధిలో ఉన్న ఇళ్ల తలుపులన్నీ మూసుకుపోయాయి.ఆగి ఆగి వీస్తోంది వడగాలి. «థక్.. థక్... థక్.. £ý క్... ఆ హోరులో బూట్ల అడుగుల సవ్వడి.బాట పక్కగా కొంచెం దిగువన ఉంది భాస్కరనాయుడిగారి ఇల్లు. పెద్ద లోగిలి.ఆ ఇంటి తలుపులు కూడా మూసేసి ఉన్నాయి.చింతపల్లి కానిస్టేబుల్ పెద్ద పెద్ద అంగలతో వెళ్లి, చేత్తోనే తలుపు తట్టాడు, అసహనంగా.జవాబు లేదు.ఈసారి లాఠీతో మోదాడు తలుపు మీద. అయినా జవాబు రాలేదు.‘‘భాస్కరనాయుడు! మీరు లోపలే ఉన్నారు. మాకు తెలుసు. తలుపు తీయాలి!’’ అరిచాడు.అప్పుడు తెరుచుకున్నాయి తలుపులు.బయటకొచ్చారు భాస్కరుడుగారు. నుదుటి మీద తిరునామం. పసుపురంగు పంచె కట్టుకొని, తెల్ల చొక్కా మీద కాషాయ ఉత్తరీయం నిండుగా కప్పుకుని ఉన్నారు. నలభయ్ సంవత్సరాలుంటాయి. ఏం జరిగినా భగవదేచ్ఛ అన్న నిర్వికార భావన మొహంలో.అనిష్టంగానే అన్నారాయన, ‘‘నమస్కారం!’’ తలుపు చాటునే నిలబడి భయం భయంగా చూస్తోంది భాస్కరుడిగారి తల్లి సోమమ్మ.కొంచెం తగ్గి అన్నాడు కానిస్టేబులు. ‘‘నమస్కారం. గ్రామపెద్దలు కూడా ఇలా చాటుమాటుగా ఉంటే కష్టం నాయుడుగారు! మీరు దొరతనం వారికి సహకరించాలి. సరే, ఇవాళ మీరు ఇంట్లోనే ఉండంyì ! డిప్యూటీ æతాసీల్దార్ మూర్తెన్నపంతులు దొరవారు మీకు చెప్పిరమ్మన్నారు. స్పెషల్ కమిషనర్ దొరవారు కూడా వస్తున్నారు. పెద్ద దొరవారు కబురెడతారు, మీరు వెంటనే హాజరు కావాలి. మళ్లీ మేం చెప్పేదాకా మీరు అందుబాటులో ఉండాలి. మునసబు లగుడు సత్యనారాయణగారికి కూడా కబురు వెళ్లింది.’’ మత్తు మత్తుగా వస్తున్నా, ఆ గొంతులోని దర్పం భయపెడుతోంది. అందుకే చిన్న గొంతుతో అన్నారు భాస్కరుడు, ‘‘స్పెషల్ కమిషనర్ దొరవారిని రెండో తేదీనే కలుసుకున్నాను.....మళ్లీ...’’ ‘‘ఇప్పుడెందుకంటారా?’’ అందుకుని అన్నాడు కానిస్టేబుల్. ‘‘ఎంత అమాయకులండీ తమరు? శ్రీరామరాజుగారొస్తన్నారండీ! తీసుకొస్తన్నారండీ బాబూ! మరి, గ్రామపెద్దలు. తమరు లేకపోతే ఎలాగ?!’’ వంకర నవ్వు నవ్వుతూ ఎగాదిగా చూస్తూ బాటమీదకు వచ్చాడు ఆ కానిస్టేబులు.పోలీసులంతా వెనుదిరిగారు, వేగంగా.వాళ్లు వెళ్లినవైపే చూస్తున్నారు భాస్కరుడు గారు నిర్వికారంగా.‘‘ఏయ్ ముసలీ! పాలు తీసుకుపోతున్నావా?! తీస్కపో. ఇంట్లో ఉట్టె మీద భద్రంగా పెట్టు. మీ రాజుగోరు వస్తన్నారు. తాగించుదూ గానీ....’’ చింతపల్లి పోలీసువాడిదే అరుపు, కొంచెం దూరంగా.రెండు నిమిషాల తరువాత ఇంటి వెనుక నుంచి భాస్కరుడిగారికి వరసకు తమ్ముడు– నారాయణమూర్తి, ఇంటి చాకలి గంజేటి నూకాలు వచ్చి నిలబడ్డారు. వాళ్ల ముఖాల నిండా అంతులేని కలవరం.సోమమ్మ కూడా గడప దాటి బయటకొచ్చి, కొడుకు సమీపంగా నిలబడింది మౌనంగా.అదేం గమనించలేదు భాస్కరుడు. అవే అవే ప్రశ్నలు బుర్ర నిండా–‘రామరాజు వస్తున్నాడా? ఎలా?! అరెస్టు చేసి తీసుకువస్తున్నారా?అంటే...దొరికిపోయినట్టేనా?’ఆధ్యాత్మిక చింతన అతడిని ఈ కొండల దగ్గరికి నడిపించుకుంటూ వచ్చింది.అనూహ్యంగా ఆయుధం పట్టి కొండలలోకి వెళ్లిపోయాడు, ఇక్కడ నుంచే.‘దొరికితే ప్రాణాలతో ఉంచుతారా.....?’ అంతకు మించి ఆలోచించలేకపోయారు భాస్కరుడు.అక్కడే ఉన్న పేము కుర్చీలో కూలబడ్డారాయన.ఉదయం నుంచి ఏవేవో సంగతులు వింటున్నా ఒక పోలీసు నోటి నుంచి అదే నేరుగా వినడంతో కాళ్ల కింద భూమి తప్పుకున్నట్టయింది.నారాయణమూర్తి స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు. నూకాలు చూరు కిందే చేతులు కట్టుకుని నిలబడి ఉండిపోయాడు.ఇరవై నిమిషాల గడిచిపోయాయి– ఎవరితో ఎవరూ మాట్లాడుకోలేదు. అంతా మౌనం.అక్కడ ఆ ఏడుగురు పోలీసులు ఆ గుడారాలలో ఒకదానిలోకి వెళ్లారు. లోపల కొందరు పోలీసులు యూనిఫారాలలోనే హడావుడిగా కనిపిస్తున్నారు. కృష్ణదేవిపేట పోలీస్ ఠాణా అధిపతి ఫర్బీస్ కూడా ఉత్కంఠతో వైర్లెస్ సెట్ ముందే కూర్చుని ఉన్నాడు.రామరాజు అరెస్టయిన సంగతిని ఇప్పటికీ వాళ్లలో చాలామంది నమ్మలేకపోతున్నారు.ఆ గుడారంలోనే ఉంది వైర్లెస్ సెట్. ఆగి ఆగి మోగుతోంది.‘‘హలో– కేడీపేట క్యాంప్– ఓవర్’, ‘హలో–కేడీపేట క్యాంప్ – ఓవర్’’ గట్టిగా అన్నాడుఫర్బీస్.నాలుగైదు సెకన్ల తరువాత అవతల నుంచి వినిపించింది.‘‘ఎస్... హలో.... నర్సీపట్నం హెడ్‌క్వార్టర్స్.. ఓవర్’’ ఆ కంఠం విశాఖపట్నం డీఎస్పీ ట్రేమన్హేర్ది.‘‘మిస్టర్ ట్రేమన్‌హేర్ .... నేను, ఫర్బీస్..కేడీపేట క్యాంప్.... ఓవర్.’’‘‘అర్థమైంది. ఆపరేషన్ మొత్తం కేడీపేట కేంద్రంగా జరగాలని స్పెషల్ కమిషనర్ ఆర్డర్. ఓవర్.’’‘‘అద్భుతం! ఆ రామరాజు కథ ఇక్కడే మొదలైంది. ఇక్కడ నుంచే వాడు కథంతా నడిపాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎంతమంది ఎలాంటి కథలు, ఎక్కడ మొదలుపెట్టినా వాటికి ముగింపు మనమే ఇస్తాం. కదా!. ఓవర్.’’అవతల బిగ్గరగా నవ్వు.‘‘అక్కడే ఉండి సమన్వయం చేసే బాధ్యత మిమ్మల్ని తీసుకోమని చెప్పారు స్పెషల్ కమిషనర్. ఓవర్.’’‘‘ఎస్...ఎస్.... ఆ పనిలోనే ఉన్నాను. ఓవర్.’’ ఉత్సాహంగా చెప్పాడు ఫర్బీస్.చిన్న శబ్దంతో వైర్లెస్ కట్ అయింది. వైర్లెస్ వాడుకలోకి తెచ్చిన మాటే– ‘కేడీపేట’.అరగంట గడిచింది. పోలీసు డేరాలలో హడావుడి విరామం ప్రకటించుకుంది. స్వచ్ఛంద నిషేధాజ్ఞలని ప్రకటించుకుందేమోనన్నంత నిశ్శబ్దం ఊరంతా.ఇక్కడ– పదిహేను నిమిషాల తరువాత ఇక్కడ భాస్కరుడు గారి ఇంటి లోగిలిలోకి ఒక్కరొక్కరే రావడం మొదలుపెట్టారు, భయం భయంగానే. నరాలను పిండేస్తున్న ఉత్కంఠ ఇళ్లల్లో ఉండనివ్వడం లేదు. అంతా మౌనం.ఆ మౌనాన్ని భరించే శక్తి ఇక లేదన్నట్టు నోరు విప్పి, చిన్న గొంతుతోనే అంది సోమమ్మ,‘‘ఎక్కడో పుట్టాడు మారాజు! ఇంత దేశం ఉండగా ఇక్కడకే ఎందుకొచ్చాడో?! అసలు ఈ ఇంటికే ఎందుకు పంపాడో మానాయన్ని– ఆ భగవంతుడు!? ఇప్పుడు ఈ అల్లరేంటో? అంతా లీల...!’’ డగ్గుత్తికతో అంటూనే లోపలికి వెళ్లిపోయిందామె.రాజుకున్న అడవిలా, ఆ క్షణంలో ఆ ఊరి హృదయం జ్ఞాపకాలతో దహించుకుపోకుండా ఉండడం ఎలా? ఆధ్యాత్మిక చింతన అతడిని ఈ కొండల దగ్గరికి నడిపించుకుంటూ వచ్చింది. అనూహ్యంగా ఆయుధం పట్టి కొండలలోకి వెళ్లిపోయాడు, ఇక్కడ నుంచే. ‘దొరికితే ప్రాణాలతో ఉంచుతారా.....?’ అంతకు మించి ఆలోచించలేకపోయారు భాస్కరుడు. అక్కడే ఉన్న పేము కుర్చీలో కూలబడ్డారాయన. ఉదయం నుంచి ఏవేవో సంగతులు వింటున్నా ఒక పోలీసు నోటి నుంచి అదే నేరుగా వినడంతో కాళ్ల కింద భూమి తప్పుకున్నట్టయింది. -
బ్రిటీషోళ్లకన్నా ఘోరం
సర్కారు తీరుపై టీపీసీసీ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిటీషువారికన్నా ఘోరంగా నిర్బంధానికి పాల్పడుతోందని టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో మల్లన్నసాగర్ భూసేకరణపై పోరాటం, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణపై చర్చించారు. అనంతరం సమావేశం వివరాలను పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియాకు వివరించారు. మల్లన్నసాగర్ విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ రైతులను బెదిరిస్తోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీశ్‌రావు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కర్ణాటక, పాండిచ్చేరి సీఎంల రాక ఈ నెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లో టీపీసీసీ నిర్వహించనున్న పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధుల శిక్షణ శిబిరాలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరు కానున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, కార్యదర్శి ఆర్.సి.కుంతియా తదితరులు హాజరవుతారని ఉత్తమ్ చెప్పారు. -
ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం.. చపాతీ!
గతమంతా చరిత్ర. కానీ, చరిత్ర అంతా పుస్తకాల్లోకి ఎక్కలేదు. అందుకే చరిత్రలోని కొన్ని సంఘటనలు నేటికీ ప్రపంచానికి తెలియరాలేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆందోళనకు గురి చేసే ఎన్నో ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. వాటన్నిటినీ చరిత్రకారులు గ్రంథస్థం చేశారు. ఒక్క చపాతీ ఉద్యమాన్ని తప్ప! అవును, భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయులను గోధుమ పిండితో తయారైన చపాతీలు ఒకప్పుడు తీవ్రంగా భయపెట్టాయి. తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలియని అయోమయంలోకి నెట్టాయి..! 1857, మార్చి.. ఈస్టిండియా కంపెనీలో పనిచేసే మిలిటరీ వైద్యుడు డా.గిల్బర్ట్ హాడో బ్రిటన్‌లో ఉంటున్న తన సోదరికి ఓ లేఖ రాశాడు. ‘‘ఇక్కడేదో జరుగుతోంది. కానీ, అదేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. సువిశాల భారతదేశం మొత్తం మీదా ఇదే జరుగుతోంది. ఇది ఉద్యమమో, రహస్య సమాజమో అర్థం కావడం లేదు. దీన్ని ఎవరు ప్రారంభించారో.. ఎందుకు, ఎక్కడ మొదలైందో కూడా ఎవరికీ తెలీదు. భారతీయ పత్రికల్లో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని పేరు చపాతీ ఉద్యమం..!’’ అని భారతదేశంలోని అనుమానాస్పద వాతావరణాన్ని లేఖ రూపంలో ఆమెకు తెలియచేశాడు గిల్బర్ట్. ఒక్క గిల్బర్టే కాదు.. ఆనాటి బ్రిటిష్ అధికారులు, ఉద్యోగులు.. దాదాపు అందరూ ఇదే తరహా అనుభవాలను ఎదుర్కొన్నారు. చాప కింద నీరులా చల్లగా తన పనితాను చేసుకుపోతోన్న ‘చపాతీ’ ఉద్యమాన్ని చూసి భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎవరికీ ఏ హానీ తలపెట్టని ఈ ఉద్యమం తొలిసారిగా బ్రిటిష్ అధికారుల దృష్టికి వచ్చింది మథురలో..! ఆ పట్టణానికి మెజిస్ట్రేట్‌గా పనిచేస్తోన్న మార్క్ థోర్న్హిల్ దీన్ని గుర్తించారు. ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ వాచ్‌మన్ ఒకరోజు నాలుగు చపాతీలు పట్టుకుని వచ్చాడు. వాటిని థోర్న్హిల్కు చూపించి, ‘‘సార్! ఎవరో అడవి నుంచి వచ్చి నా చేతిలో ఈ చపాతీలు పెట్టారు. ఇలాంటివి మరిన్ని తయారు చేసి పొరుగూరిలో పంచమన్నారు. నేను మరిన్ని వివరాలు అడిగేలోగా తిరిగి అడవిలోకి వెళ్లిపోయారు..’’ అంటూ వివరించాడు. దీంతో థోర్న్హిల్లో అనుమానం మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తులు చపాతీలు ఎందుకు పంచమంటున్నారు..? అని లోలోపలే ప్రశ్నలు వేసుకున్నాడు. వెంటనే ఆలస్యం చెయ్యకుండా విచారణకు ఆదేశించాడు. అలా కొద్ది రోజుల పాటు పట్టణంలో రాత్రి పూట ఏం జరుగుతోందో తెలుసుకున్నాడు. ఎవరో ఎక్కడి నుంచో వస్తున్నారు. చపాతీలు పంచుతున్నారు. మరిన్ని చపాతీలు తయారు చేసి పక్కవారికి పంచమని సందేశాలు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని పై అధికారులకు నివేదించాడు థోర్న్హిల్. వారు కూడా విచారణలు జరిపారు. ఈ క్రమంలో బట్టబయలైన సమాచారం వారికి నిద్రపట్టనివ్వలేదు. భారతదేశమంతా ఈ తంతు జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక్క రాత్రిలోనే దాదాపు 300 కిలోమీటర్ల దూరం చపాతీలు ప్రయాణిస్తున్నాయని తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. తమ పోస్టల్ సర్వీసు కూడా అంత వేగంగా సమాచారం బట్వాడా చేయలేకపోతోందని గ్రహించారు. మనుషులే గొలుసులుగా ఏర్పడి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి ఒకే రాత్రిలో చపాతీలు చేరవేయడం మామూలు విషయం కాదు కదా! ఇదే బ్రిటిష్‌వారిలో లేనిపోని భయాలను సృష్టించింది. చపాతీలు మాత్రమే కాకుండా.. దాంతో పాటే మరేదో రహస్య సమాచారం కూడా బట్వాడా అవుతోందని వారు భావించారు. తమ పోలీసు వ్యవస్థ సహాయంతో ఎందరినో ప్రశ్నించారు. కానీ, ఎవరికీ తాము ఎందుకు చపాతీలు పంచుతున్నామో, ఎవరికోసం పంచుతున్నామో కూడా స్పష్టత లేదు. అలాగని, చపాతీలపై ఎలాంటి రహస్య సమాచారం గానీ, కోడ్లు గానీ లేవు. 1857 నాటికి తమ పాలనపై భారతీయుల్లో అసంతృప్తి ఉందన్న సంగతి బ్రిటిషర్లకు తెలుసు. ఇది ఉద్యమంగా మారనుందా..? చపాతీల సాయంతో భారతదేశం నలుమూలలా బ్రిటిష్ వ్యతిరేక భావజాలం పాకుతోందా..? వారికి అర్థం కాలేదు. అదే జరిగితే 25 కోట్ల మంది భారతీయులను తమ లక్షమంది సైన్యం నిలువరించలేదు. ఓ రకంగా చెప్పాలంటే.. ఇదో మానసిక యుద్ధంలా మారిపోయింది. చపాతీలు దేన్నో మోసుకెళ్తున్నాయని వారు విశ్వసించారు. కొందరు అధికారులు ఇవి తూర్పున ఉన్న కలకత్తా నుంచి వస్తున్నాయని, మరికొందరు ఉత్తర భారతదేశంలోని అవధ్ నుంచి బయలుదేరుతున్నాయని, ఇంకొందరేమో మధ్య భారతదేశానికి చెందిన ఇండోర్ నగరమే వీటికి జన్మస్థలమనీ.. ఇలా రకరకాలుగా తీర్మానించేశారు. చివరకు ఎలాగో ఆ ఏడాది గడిచేసరికి చపాతీ ఉద్యమం పూర్తిగా చల్లబడిపోయింది. బ్రిటిష్ చరిత్రకారులకు మాత్రం ఆ ఉద్యమ కారణాలు నేటికీ స్పష్టంగా తెలియరాలేదు. ఆంగ్లేయులు భయపడినట్టుగా అవి స్వతంత్ర సాధన కోసం కాదని, కలరా బాధితులను ఆదుకునేందుకే ఎవరో మొదలు పెట్టిఉంటారని కొందరి రచయితల భావన. ఈ ‘చపాతీ ఉద్యమం’ ఎందుకు, ఎక్కడ, ఎలా పురుడుపోసుకుందో పక్కనబెడితే.. బ్రిటిష్‌వారికి ముచ్చెమటలు పట్టించడం మాత్రం గొప్ప విషయమే..! -
భారత కంపెనీలో విదేశీ ఐటి సంస్థ విలీనం
బ్రిటిష్ ఐటి కంపెనీ ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ తన వ్యాపార భాగస్వామి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ బీఎస్ఎల్ తో విలీనమైంది. ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఆర్ఎస్కె గుర్గావ్ కు చెందిన భారతీయ కంపెనీతో విలీనమై ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ గా అవతరించింది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు కన్సల్టెన్సీ సర్వీసులను సంయుక్తంగా అందించనున్నట్టు పేర్కొన్నాయి. ఈ విలీనం పట్ల రెండు కంపెనలు సంతోషం వ్యక్తం చేశాయి. తమ వ్యాపార అభివృద్ధి, ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి ఉపయోగాలని అభిలషించారు. తమ సేవల విస్తృతికి, నూతన, ప్రస్తుత ఖాతాదారులకు, హై లెవల్ కస్టమర్ సర్వీసు, అధిక నాణ్యతతో కూడిన ఔట్ పుట్ ఇవ్వడానికి తమ విలీనం దోహదపడుతుందని నూతన యాజమాన్య సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డానీ బర్డ్ తెలిపారు తమ విలీనం మెరుగైన సేవలకు, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రవీణ్ జోషి చెప్పారు. ఆన్ సైట్ కన్సల్టెన్సీ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్సేవలను ఆర్ఎస్ కె ,టెక్నికల్ రిపోర్సెస్, బ్యాక్ ఆఫీస్ సేవలు, రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ రంగాల్లో బీఎస్ లిమిటెడ్ సేవలు అందించింది. యూకే, యూరోపియన్, అమెరికా మార్కెట్లలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అలాగే ఈ కొత్త పరిణామం నేపథ్యంలో సిబ్బంది ఉద్యోగ ఒప్పందాలు, నిబంధనలు, ఖాతాదారుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించాయి. -
'ఈయూలోనే ఉండాలి'
లండన్: బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన అధికశాతం ఓటర్లు బ్రిటన్ యూరోపియన్ యూనియన్లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. దీనిపై జూన్ 23న రెఫరెండం జరగనుంది. బ్రిటిష్ ఎలక్షన్ సర్వే ప్రకారం.. 51.7 శాతం మంది భారత సంతతి ఓటర్లు బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని, 27.74 శాతం మంది వైదొలగాలని కోరుతున్నారు. -
అంతరిక్షంలోకి మొదటిసారి బ్రిటిష్ మహిళ
లండన్ః అంతరిక్షంలోకి మొట్ట మొదటిసారి బ్రిటిష్ మహిళ పయనమైంది. తన రష్యన్ క్రూ మేట్స్ తో కలసి శుక్రవారం స్పేస్ ఫ్లైట్ ఎక్కిన హెలెన్ షర్మాన్.. ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళా వ్యోమగాముల్లో 12వ మహిళగా చరిత్ర సృష్టించారు. సోయూజ్ టిఎమ్12 వ్యోమ నౌకలో.. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నతన రష్యన్ క్రూమేట్స్ తో కలసి హెలెన్ అంతరిక్షంలోకి వెళ్ళారు. 1991 మే 20న మిర్ స్పేస్ స్టేషన్ నుంచి మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన తన ఇద్దరు క్రూ మేట్స్ అయిన రష్యన్ వ్యోమగాములు అనటోలి అర్ట్సెబర్స్ కీ, సెర్జీ క్రికలెవ్ ల తో కలసి హెలెన్ స్పేస్ ప్రయాణం ప్రారంభించారు. ఆరు రోజుల పాటు అంతరిక్షంలో గడపనున్న హెలెన్ బృందం అనేక శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. అంతరిక్ష నౌకను ఎక్కేందుకు ధరఖాస్తు చేసిన మొత్తం 13,000 మంది అభ్యర్థుల్లో హెలెన్ షర్మాన్ స్పేస్ ప్రయాణానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం హెలెన్... ప్రముఖ లండన్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన ఇంపీరియల్ కాలేజ్ లో రసాయన శాస్త్ర విభాగానికి ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెలెన్ తో పాటు స్పేస్ లోకి ప్రయాణమైన క్రికలేవ్ ఇప్పటికే ఎన్నోసార్లు అంతరిక్షంలోకి వెళ్ళి, వ్యోమగామిగా ఎంతో అనుభవాన్ని పొందారు. ఆయన మొత్తం 803 రోజుల అంతరిక్షంలో గడిపారు. అంతేకాక అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన రెండవ ప్రముఖ వ్యోమగామిగా ఆయన పేరొందారు. -
ఈ ఫోన్ రేటు చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
జెరుసలేం: మనకు తెలిసిన మామూలు ఫోన్ల రేట్లు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. మరి సోలారిన్ పేరుతో విడుదలకు సిద్ధమైన ఈ ఫోన్ రేటు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే... ఈ మొబైల్ ఖరీదు అక్షరాల 20 వేల డాలర్లు(13.3 లక్షలు) ఇంత రేటు కలిగిన మొబైల్స్ సాధారణంగా వజ్రాలు, బంగారంతో డిజైన్లు చేసి ఉంటాయనుకుంటున్నారా? అయితే సోలారిన్ ... సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ మాదిరిగానే ఉండబోతోందని కంపెనీ తెలిపింది. ఇంతకీ ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటా..? అని అనుకుంటున్నారా....ఈ మొబైల్‌ను తయారు చేస్తున్న బ్రిటీష్, ఇజ్రాయెల్‌లకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ... ఉద్యోగ నిపుణులను దృష్టిలో ఉంచుకుని తామీ ఫోన్ తయారు చేస్తున్నట్లు తెలిపింది. కాస్త రేటు ఎక్కువగా అనిపించినా సోలారిన్ మిలటరీ గ్రేడ్ సెక్యూరిటీతో వినియోగదారులకు లభిస్తుందనీ, దీనివల్ల సమాచారాన్ని హ్యాక్ కాకుండా కాపాడుకునేందుకు ఎక్కువ వెచ్చించాల్సిన పని లేదని కంపెనీ వివరించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టెక్నాలజీకి ఈ ఫోన్ ఫీచర్స్ మూడు సంవత్సరాల ముందుకు ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు చెప్పారు. యూరప్, అమెరికా దేశాల్లో హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవాలని చూసే వారందరూ ఈ మొబైల్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతారని వారు వివరించారు. ప్రస్తుతం ప్రపంచ లగ్జరీ ఫోన్ల మార్కెట్ విలువ 1.1 బిలియన్ డాలర్లుగా ఉందని వారు తెలిపారు. -
కోహినూర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు
వజ్రాన్ని తిరిగి తీసుకురాలేమని కేంద్రం సంకేతం ♦ ఆనాటి పంజాబ్ పాలకులు బ్రిటన్‌కు బహుమతిగా ఇచ్చారు ♦ అది కావాలంటే.. మన దగ్గరున్న విదేశీ చారిత్రక సంపదను తిరిగి ఇవ్వాల్సి రావొచ్చన్న సాంస్కృతిక శాఖ ♦ వజ్రాన్ని తీసుకురావాలన్న పిటిషన్‌ను కొట్టేయలేమన్న సుప్రీం న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్) నుంచి భారత్‌కు తిరిగి తీసుకురావాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) కొట్టివేయటానికి సుముఖంగా లేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలా చేస్తే కోహినూర్ వజ్రంపై భారతదేశపు న్యాయమైన హక్కును బ్రిటన్ నిరాకరించటానికి దారితీయొచ్చని, భవిష్యత్తులో దాన్ని వెనక్కితెచ్చే ప్రయత్నాలకు అవరోధంగా మారే అవకాశముందని పేర్కొంది. కోహినూర్ తోపాటు టిప్పుసుల్తాన్ ఉంగరం, కత్తి వంటి అమూల్యమైన వారసత్వ సంపదను తిరిగి భారత్‌కు రప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆలిండియా హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ ఫ్రంట్ సంస్థలు పిల్ వేయడం తెలిసిందే. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. స్పందన తెలపాల్సిందిగా ఇంతకుముందే కేంద్రాన్ని ఆదేశించింది. తాజాగా సోమవారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ వివరణ ఇచ్చారు. ‘‘కోహినూర్ బలవంతంగా తీసుకెళ్లారనో, దొంగతనానికి గురైందనో చెప్పలేం. సిక్కు యుద్ధాల్లో తమకు సహకరించినందుకు 1849లో మహరాజా రంజిత్‌సింగ్ వారసులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ వజ్రాన్ని ఇచ్చారు. ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలని పార్లమెంటులోనూ, బయటా చాలా సార్లు డిమాండ్లు వచ్చాయి. కానీ కోహినూర్ లాంటి సంపదను వెనక్కివ్వాలని మనం కోరితే.. మన దేశంలోని మ్యూజియాల్లో ఉన్న విదేశీ చారిత్రక సంపద, కళాఖండాలను తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆయా దేశాలు కోరతాయి. అప్పుడు మన మ్యూజియాల్లో ఏమీ మిగలవు’’ అని చెప్పారు. తద్వారా ఆ వజ్రాన్ని వెనక్కు తీసుకురాలేమని సంకేతాలిచ్చారు. దీనిపై ధర్మాసనం పై విధంగా స్పందించింది. తాము ఈ పిల్‌ను కొట్టివేసినట్లయితే.. భవిష్యత్తులో భారత్ ఆ వజ్రాన్ని అడిగినప్పుడు ‘మీ సుప్రీంకోర్టు పిల్‌ను కొట్టివేసింది’ అన్న కారణం చూపుతూ నిరాకరించేందుకు అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఈ అంశంలో విదేశాంగశాఖ ఇంకా తన అభిప్రాయాన్ని, వివరణను సమర్పించాల్సి ఉండటంతో.. కోహినూర్‌పై హక్కు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సమగ్రమైన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని నిర్దేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. కోహినూర్‌ను వెనక్కి తీసుకొచ్చే అంశంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టబోదని ఆ శాఖ మంత్రి మహేశ్‌శర్మ చెప్పారు. అది దౌత్యపరమైన అంశమని.. దానిపై కేంద్ర, విదేశాంగశాఖలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. గుంటూరు నుంచి బ్రిటన్ వరకూ..! ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లో కోహినూర్ ఒకటి. వంద శాతం స్వచ్ఛత గల ఈ వజ్రం బరువు 108 క్యారెట్లు. దీని విలువ రూ.6,600 కోట్ల పైమాటేనని అంచనా. అసలు కోహినూర్ అంటే పర్షియన్ భాషలో ‘కాంతి శిఖరం’ అని అర్థం. 14వ శతాబ్దంలో గుంటూరు సమీపంలో ఈ వజ్రం దొరికినట్లు ప్రచారంలో ఉంది. అప్పట్లో ఏకంగా 793 క్యారెట్ల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం అది. ఔరంగజేబు హయాంలో దానికి మెరుగుపెట్టించే ప్రయత్నంలో.. 186 క్యారట్లకు తగ్గిపోయింది. బ్రిటిషర్ల వద్ద మరింత చిక్కిపోయింది. తొలుత కాకతీయుల చేతిలో ఉన్న ఈ వజ్రం ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది. మొఘలుల చేతిలో నుంచి నాదిర్షా దండయాత్ర సమయంలో పర్షియాకు మారింది. అనంతరం క్రమంగా పంజాబ్ పాలకుడు మహరాజా రంజిత్‌సింగ్ వద్దకు చేరింది. సిక్కు యుద్ధాల సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రంజిత్‌సింగ్ వారసులకు సహాయపడడంతో.. వారు బ్రిటిష్ వారికి అప్పగించారు. అలా ఆ వజ్రం చివరికి బ్రిటన్ మహారాణి కిరీటంలోకి చేరింది. ఈ వజ్రం తమదంటే తమదని భారత్‌తోపాటు పాకిస్తాన్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లు కూడా వాదిస్తున్నాయి. కోహినూర్ వజ్రం పురుషులెవరికీ కలసి రాదనే నమ్మకం ఉంది. బ్రిటిష్ రాచకుటుంబంలోనూ ఆ నమ్మకం కొనసాగి.. క్వీన్ విక్టోరియా కిరీటంలో భాగమైంది. -
కోహినూర్ ఇక ఎప్పటికీ భారత్‌కు తిరిగి రాదా?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రఖ్యాత వజ్రమైన కోహినూర్ ఇక ఎప్పటికీ భారత్‌కు దక్కకపోవచ్చు. మన చారిత్రక సంపద అయిన ఈ వజ్రాన్ని తిరిగి భారత్‌కు తీసుకొచ్చే విషయమై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇదే సంకేతాలను ఇచ్చింది. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాల్సిందిగా యునైటెడ్ కింగ్డమ్ను బలవంతపెట్టలేమని, ఎందుకంటే ఈ వజ్రాన్ని బ్రిటన్ దొంగలించడం కానీ, బలవంతంగా తీసుకుపోవడంగానీ చేయలేదని, ఆ దేశానికి కానుకగా ఇచ్చామని కేంద్రం న్యాయస్థానానికి విన్నవించింది. స్వాతంత్ర్యానికి పూర్వం దేశం ఆవలకు తరలిపోయిన ప్రాచీన సంపదను ప్రభుత్వం తీసుకురాకూడదంటూ 43 ఏళ్ల కిందట తీసుకొచ్చిన చట్టాన్ని ఉటంకిస్తూ కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ సోమవారం వాదనలు వినిపించారు. 1849నాటి సిక్కు యుద్ధంలో ఓడిపోయిన నేపథ్యంలో మహారాజా రంజిత్ సింగ్ 105.602 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని ఈస్టిండియా కంపెనీకి అందజేశారని ఆయన సుప్రీంకోర్టుకు నివేదించారు. ఆంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ చట్టం 1972 ప్రకారం దేశం నుంచి అక్రమంగా తరలిపోయిన ప్రాచీన సంపదను మాత్రమే ఆర్కియాలిజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తిరిగి తీసుకొచ్చే అవకాశముంటుందని తెలిపారు. కోహినూర్ వజ్రంతోపాటు భారత్ నుంచి తీసుకుపోయిన ప్రాచీన సంపదను తిరిగి తీసుకురావాల్సిందిగా బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ అఖిల భారత మానవ హక్కులు, సామాజిక న్యాయం సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని విచారణకు చేపట్టిన న్యాయస్థానం గతంలో కేంద్రం సమాధానం కోరిన సంగతి తెలిసిందే. -
తాతగారి పచ్చబొట్టు
తిక్క లెక్క పచ్చబొట్లు తాతల కాలం నుంచే ఉన్నాయి కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? కచ్చితంగా ఉంది. పచ్చబొట్టు పొడిపించుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ బ్రిటిష్ తాతయ్య పేరు జాక్ రేనాల్డ్స్. వయసు 104 ఏళ్లు. చెస్టర్‌ఫీల్డ్‌లో ఉంటాడు. ఇన్నాళ్లూ ‘మచ్చ’లేని జీవితం గడిపేసిన ఈ తాతయ్యకు ఉన్నట్టుండి పచ్చబొట్టు పొడిపించుకోవాలనిపించింది. ఈ వయసులో తట్టుకోలేవంటూ ఎందరు వారించినా వినకుండా, సూదిపోటుకు సిద్ధపడ్డాడు. కోరుకున్న విధంగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతిపెద్ద వయసులో తొలి పచ్చబొట్టు పొడిపించుకున్న వృద్ధుడిగా గిన్నెస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. -
జాతి గుండెపై మానని గాయం..
భారత దేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన ‘జలియన్ వాలాబాగ్’ మారణకాండ. బ్రిటీష్‌వారి దురహంకారానికి వెయ్యిమందికి పైగా భారతీయులు బలయ్యారు. దేశంలో ఆంగ్లేయుల పాలన ఎన్ని ఆకృత్యాలతో కూడి ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగి నేటితో 97 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకుందాం.. ఎక్కడ, ఎలా.. ఏప్రిల్ 13, 1919 ఆదివారం రోజున ఉత్తర భారత దేశంలోని అమృత్సర్ పట్టణంలో ఉన్న జలియన్ వాలా బాగ్ అనే తోటలో ఈ ఘటన జరిగింది. ఆరోజు సిక్కులకు ఎంతో ఇష్టమైన వైశాఖి పండుగ. ఈ సందర్భంగా దాదాపు 20వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటకు చుట్టూ గోడలు, చిన్నచిన్న ద్వారాలు మాత్రమే ఉన్నాయి. వైశాఖి పండుగ సందర్భంగా సమావేశమయినప్పటికీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలని వారంతా నినదించారు. ఇలా వేల మంది ఒకేచోట సమావేశమై శాంతియుతంగా ప్రసంగిస్తుండగానే అనూహ్యంగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కాల్పులు.. ఈ సమావేశం గురించి సమాచారం అందుకున్న అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు. సాయుధులైన సైన్యం జలియన్ వాలాబాగ్ గేట్లకు ఎదురుగా నిలబడ్డారు. వెంటనే అక్కడివారిపై కాల్పులు జరపాల్సిందిగా డయ్యర్ ఆదేశించాడు. దీంతో వారు విచక్షణారహితంగా అమాయకులైనవారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఏకధాటిగా పది నిమిషాలపాటు విచక్షణారహితంగా సైన్యం కాల్పులు కొనసాగించింది. దాదాపు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకుల్లోని తూటాలు అన్నీ అయిపోయేంత వరకు ఈ కాల్పులు కొనసాగాయి. చివరకు మందుగుండు అయిపోవడంతో సైన్యం కాల్పులు ఆగిపోయాయి. ఎటూ వెళ్లలేక.. ఈ అనూహ్య ఘటనతో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. బుల్లెట్ల దాడినుంచి రక్షించుకునేందుకు తలోదిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. తోటలోని గేట్లవైపు వెళ్లి బయటపడదామని చూశారు. కానీ గేట్లు మూసి ఉండడం, తెరిచి ఉన్న ద్వారాల దగ్గర నిలబడి సైన్యం కాల్పులు జరపడంతో వారంతా తూటాలకు బలయ్యారు. మరోవైపు బయటికి వెళ్లేందుకు దారిలేక, లోపలే ఉండి ప్రాణాలు కాపాడుకోలేక కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. దీనివల్ల కూడా కొందరు మరణించారు. ఇలా ఓ వైపు తూటాలకు కొంతమంది, మరోవైపు బావిలోదూకడం వల్ల, తొక్కిసలాట వల్ల మరికొందరు మరణించారు. అప్పటివరకు శాంతియుతంగా సాగిన సమావేశం రక్తసిక్తమైంది. వెయ్యి మందికిపైగా మృతి.. ఈ కాల్పుల్లో 379 మంది మాత్రమే మరణించినట్లు బ్రిటిష్ అధికారులు తేల్చారు. వారి అంచనా ప్రకారం 1,100 మంది గాయపడ్డారు. అయితే అసలు అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ దాదాపు 1,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. వేల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో చిన్న పిల్లల దగ్గరినుంచి వృద్ధుల వరకు ఉన్నారు. వారిలో ఆరువారాల చిన్నారి కూడా ఉండడం మరో విచారకర అంశం. కానీ ఈ వాస్తవాల్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను తక్కువగా చూపి ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. డయ్యర్ కారణంగానే.. ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడు బ్రిగేడియర్ జనరల్ డయ్యర్. ఆయన దురహంకారపూరిత నిర్ణయం మూలంగానే ఈ మారణకాండ చోటుచేసుకుంది. సమావేశమైన ప్రజల్ని అణచి వేయడానికి అక్కడికి చేరుకున్న డయ్యర్ కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సమావేశం శాంతియుతంగా జరుగుతోందని, వారంతా నిరాయుధులని తెలిసినా అమాయకులపై కాల్పులు జరపమని ఆదేశించి డయ్యర్ ఈ మారణహోమానికి ప్రధాన నిందితుడిగా నిలిచాడు. ఈ ఘటనపై డయ్యర్ స్పందిస్తూ తాను ఈ సమావేశాన్ని ఆపేందుకే వెళ్లానని, అయితే అంతమందిని అదుపులో పెట్టడం కష్టం కాబట్టి కాల్పులకు ఆదేశించానని వ్యాఖ్యానించాడు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ డయ్యర్ ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అందని సాయం.. కాల్పుల్లో వందలాది మంది మరణించడంతోపాటు, వేలాది మంది గాయపడ్డప్పటికీ వారికి వెంటనే ఎలాంటి వైద్య సాయం అందలేదు. కాల్పులు జరిపిన అనంతరం డయ్యర్, అతడి సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డయ్యర్ ప్రయత్నించలేదు. దీనిపై డయ్యర్ మాట్లాడుతూ వారికి వైద్య సేవలు అందించడం తన కర్తవ్యం కాదు కాబట్టి ఆ పని చేయలేదని చెప్పాడు. డయ్యర్ చర్యను కొందరు బ్రిటిష్ పాలకులు సమర్ధించారు. కానీ ఈ చర్యను ఖండిస్తూ బ్రిటీష్ పార్లమెంటు తీర్మానం చేసింది. విన్స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యపై విచారణ సాగుతుండగానే డయ్యర్ ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. స్మారక చిహ్నం ఏర్పాటు.. వందలాది మంది మృతికి కారణమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్వాతంత్య్ర ఉద్యమం మరింత విస్తృతమయ్యేందుకు ఈ ఘటన దోహదపడింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల జ్ఞాపకార్థం 1961 ఏప్రిల్ 13న స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఇదేరోజు స్థూపంవద్దే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు జలియన్ వాలాబాగ్ మృతులకు నివాళులర్పిస్తారు. -
బాలీవుడ్ గాలాకు ప్రిన్స్ విలియం దంపతులు
లండన్: బ్రిటిష్ రాయల్ జంట త్వరలో భారత్ లో పర్యటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబై లో నిర్వహించనున్న బాలీవుడ్ గాలా తిలకించేందుకు ప్రత్యేక అతిథులుగా వారు హాజరుకానున్నారు. సినీస్టార్ల ఉత్సవానికి హాజరైన సందర్భంలో వారం రోజులపాటు ఇండియాలో గడపనున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలోని స్టార్ నటులతో ఓ చల్లని సాయంత్రాన్ని ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఆస్వాదించనున్నారు. వీధిబాలల సహాయార్థం నిధులను సమకూర్చే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ముంబైలోని ఓ హోటల్ లో ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు. ఆర్థిక రాజధాని ముంబైలో 2008లో ఉగ్రవాదులు దాడి చేసిన హోటలే.. ప్రస్తుతం రాజదంపతులకు ఆవాసం కల్పించనుంది. బాలీవుడ్ కార్యక్రమానికి హాజరయ్యే రాయల్ కపుల్.. వారం రోజుల భారత్ , భూటాన్ సందర్శనలో భాగంగా ముంబై మురికి వాడల్లోని పిల్లలను పలుకరించనున్నారు. అనంతరం ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని అద్భుత కట్టడం తాజ్ మహల్ ను సందర్శిస్తారు. -
వివాదంలో సర్దార్ సింగ్
లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బ్రిటిష్ హాకీ ప్లేయర్ ఆరోపణ న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. రెండేళ్ల కిందట తనతో నిశ్చితార్థం చేసుకొని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని భారత సంతతికి చెందిన బ్రిటిష్ హాకీ ప్లేయర్ అష్పాల్ కౌర్... సర్దార్‌పై లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని గతేడాది బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. అప్పట్నించి పెళ్లి మాట ఎత్తితే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం అయ్యిందని, అదే ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని క్రీడాకారిణి తెలిపింది. అప్పట్నించి కలిసి జీవిస్తున్నామని చెప్పింది. అయితే అష్పాల్ చేసిన ఆరోపణలను సర్దార్ సింగ్ ఖండించాడు. క్రీడాకారిణితో పరిచయం ఉన్న మాట వాస్తవమే అయినా... తామిద్దరికి ఎలాంటి నిశ్చితార్థం జరగలేదని స్పష్టం చేశాడు. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలకు త్వరలోనే సమాధానమిస్తానన్నాడు. ‘ఆ అమ్మాయి నాపై చాలా సీరియస్ ఆరోపణలు చేస్తోంది. సరైన సమయంలో వాటన్నింటికీ సమాధానం ఇస్తా. ప్రస్తుతం నేను హాకీ ఇండియా లీగ్ మ్యాచ్‌లపై దృష్టి పెట్టా. మంగళవారం రాత్రి మ్యాచ్ తర్వాత ఈ ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. గురువారం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దాని తర్వాత మా లాయర్‌తో సంప్రదించి జవాబిస్తా’ అని సర్దార్ సింగ్ వ్యాఖ్యానించాడు. -
వందేళ్ల కిందటే సెల్ఫీలు...
లండన్: ఈ మధ్య సెలబ్రెటీ కనిపిస్తే సెల్ఫీ ప్లీజ్ అని అడిగేస్తున్నాం. అలాగని సెల్ఫీ ట్రెండ్ లేటెస్ట్ అనుకుంటే పొరపాటే. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ సముద్ర తీర ప్రాంతంలోని ఓ పట్టణంలో సెల్ఫీ తీసుకున్నట్లు ఇటీవల గుర్తించారు. 1915 నాటి సెల్ఫీల్లో కొంతమంది యువతీ యువకులు సిగరెట్ పెట్టుకుని ఫోజులిస్తూ కనిపించారు. -
నితీష్ సర్కార్‌పై కాంగ్రెస్ గుస్సా!
న్యూఢిల్లీ: బిహార్‌లోని నితీశ్‌కుమార్ సర్కార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ చిక్కుల్లో పడేసింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిపాలన బ్రిటీష్ పాలకుల కంటే ఘోరంగా ఉందంటూ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రచురించడం నితీశ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారును ఇబ్బందుల్లో పడేసింది. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ కథనంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. బిహార్ చరిత్ర కథనంలో భాగంగా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ నియంతృత్వ, అణచివేత పాలన కొనసాగించారని, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ సాగించిన ప్రజాస్వామిక పోరాటం మళ్లీ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాదులు వేసిందని వెబ్సైట్లో పేర్కొనడం సంకీర్ణ పక్షాల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఈ కథనంలో ఇందిరాగాంధీకి సంబంధించిన వ్యాఖ్యలను తాము ఎంతమాత్రం ఆమోదించబోమని కాంగ్రెస్ నేత చందన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయం సీఎం నితీశ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బిహార్ కాంగ్రెస్ చీఫ్, విద్యాశాఖ మంత్రి అశోక్ కుమార్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మరోవైపు అధికార జేడీయూ మాత్రం వెబ్‌సైట్‌లోని చారిత్రక అంశాల్లో ఎలాంటి తప్పు లేదని, చారిత్రక అంశాలను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడం సరికాదని చెప్తోంది. -
అప్పీలుకు బామ్మగారి 'అల్లికల' పాట్లు!
మరణ శిక్షనుంచి బయట పడేందుకు ఓ బామ్మగారు పడరాని పాట్లు పడుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తూ తన నైపుణ్యంతో శిక్షను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాబీగా ఉన్న అల్లికలను అమ్మకానికి పెట్టి, తోటి ఖైదీలకు నేర్పుతూ శిక్ష నుంచి బయటపడేందుకు ఆ బ్రిటిష్ బామ్మ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ఫేస్ బుక్, ట్విట్లర్ వంటి సామాజిక మాధ్యమాలను కూడ వినియోగించుకుంటోంది. ఇండోనేషియాలోని బాలీకి కొకైన్ అక్రమ రవాణాకు పాల్పడిందన్న కేసులో 2013 లో చెల్తెన్ హామ్ కి చెందిన 59 ఏళ్ళ లిండ్సీ శాండిఫోర్డ్ కు మరణ శిక్ష విధించారు. అయితే ఆ బామ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తోందని, అది తగ్గించేందుకు అంతా సహకరించాలంటూ ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలోనూ ఆమె పరిస్థితిని వివరిస్తూ ప్రచారం జోరందుకుంది. లిండ్సీ శిక్షను తగ్గించుకోవాలంటే అప్పీల్ చేసుకునేందుకు వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది. అందుకు తనకు చేతనైన స్వెట్టర్లు, షాల్స్, బొమ్మలు మొదలైన వివిధ రకాల ఊలు అల్లికలను అమ్మకానికి పెట్టింది. జైల్లోని మరో ఇరవైమంది మహిళలకు అల్లికలు కుట్లు నేర్పుతూ.. షాల్స్, స్వెట్టర్లు, ఉలెన్ టెడ్డీబేర్లు వంటి వాటిని ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా ఆస్ట్రేలియాలోని చర్చి గ్రూపులకు అమ్మకాలు నిర్వహిస్తోంది. వచ్చిన డబ్బుతో అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటిదాకా జరిపిన అమ్మకాలతో ఏడువేల యూరోలు సంపాదించింది. తాను శిక్ష నుంచి బయట పడాలంటే న్యాయవాదులకు మరో 15 వేల యూరోలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఆ ఫీజు చెల్లించలేకపోతే ఆమెకు ఈ సంవత్సరంలో మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇండోనేషియా ప్రస్తుతం ఆమె మరణదండన పై తాత్కాలిక విరామాన్ని ఇచ్చింది. బామ్మగారి పరిస్థిపై ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బ్రిటిష్ యాంటిక్ డీలర్ జూలియన్ పాండర్ ఆమెతో బలవంతంగా ఈ నేరం చేయించాడని బ్రిటన్ ఇప్పటికే చెప్పిందని.. కెరోబోకన్ జైల్లో ఉన్న శాండిఫోర్డ్ చెప్తోంది. అల్లికలు అంటే తనకు పిచ్చి అని, ఖాళీ సమయాల్లో అల్లికలతోనే కాలం గడిపే తనను... తన నైపుణ్యమే శిక్షనుంచి రక్షిస్తుందని శాండిఫోర్డ్ నమ్ముతోంది. అయితే తన అవసరం కోసం కాక జైల్లోని ఇతర మహిళలు సైతం అల్లికలు నేర్చుకోవడం వల్ల.. నైపుణ్యం పెరగడమే కాక, సంపాదించిన డబ్బుతో జైలునుంచి బయట పడగల్గుతారని ఆమె చెబుతోంది. -
అంతరిక్షం నుంచి రాంగ్ కాల్...!
మొబైల్ ఫోన్ల వాడకం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా రాంగ్ కాల్స్ రావడం మామూలై పోయింది. ఒకరికి చేరాల్సిన కాల్ మరొకరికి చేరడమూ... ఒక కాల్ మాట్లాడుతుండగా మధ్యలో ఇంకొకరి మాటలు వినిపించడమూ సర్వ సాధారణమైపోయింది. అయితే ఇతర నగరాలు, రాష్ట్రాలు, దేశాలే కాదు... ఇటీవల స్పేస్ సెంటర్ కు వెళ్ళిన ఆస్టోనాట్ కూ అదే అనుభవం ఎదురైందట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం... ఇటీవల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి పలువురు సభ్యుల బృదం తరలి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరందరినీ కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ కాప్సూల్ ద్వారా ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం ఆరు నెలల పాటు ఉండే అంతరిక్ష యాత్రకు ఈ వ్యోమగాములు వెళ్ళారు. అయితే ఈ బృదంలోని బ్రిటన్ కు చెందిన ఆస్టోనాట్ టిమ్ పీక్ కు ఇదే తొలి స్పేస్ జర్నీ. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి బ్రిటన్ దేశస్థుడు కూడ ఆయనే. ఆరునెలల పాటు అంతరిక్షంలో విధులు నిర్వహించనున్న టిమ్ పీక్ భూమిపై ఉన్న అధికారులు, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆయన ఫోన్ చేస్తే... అది... నంబర్ తప్పు డయల్ కావడంతో రాంగ్ కాల్ వెళ్ళిందట. ''ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అంటూ అడిగిన కిమ్ కు ఆశ్చర్యం కలిగిందట. అట్నుంచి ఓ మహిళ స్వరం వినిపించడంతో '' హలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అని మరోసారి అడిగారట. తీరా తర్వాత అసలు విషయం అర్థమైందట. పొరపాటున రాంగ్ నంబర్ చేశానని కిమ్ గ్రహించారు. ఓ తప్పు సంఖ్య డయల్ చేయడం రాంగ్ కాల్ కు కారణమైందని, ఆ మహిళకు క్షమాపణలు చెప్తూ కిమ్ పీక్ ట్వీట్ చేశారు. 43 ఏళ్ళ హెలికాఫ్టర్ పైలట్ అయిన కిమ్ పీక్ ఈ యాత్ర కోసం సుమారు 28నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా 173 రోజులు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు నిర్వహించనున్నారు. -
కెనడా...
పేరులో నేముంది మనకు ఒక కెనడా ఉంది. కెనడాలో వలే విశాలమైన రహదారులతో ఉన్న ఊరు కాబట్టి ‘కో కెనడా’ అయ్యి అది కాస్తా ‘కాకినాడ’ అయ్యిందని అంటారు. మరి కెనడాకు ఆ పేరు ఎలా వచ్చింది. కెనడాలో ఉన్న మూలవాసుల తండాలను నాటి ఫ్రెంచ్ పాలకుల హయాంలో ‘కెనటా’ అని అనేవారట. ‘కెనటా’ అంటే పల్లె, గూడెం అని అర్థం. ఆ తర్వాత ఆ కాలనీలకు బ్రిటిష్‌వారు వచ్చి పాలించారు. ఆ సమయంలో ఏదో ఒక ఊరు, పల్లె కాకుండా మొత్తం ప్రాంతమే ‘కెనడా’గా రూపాంతరం చెందింది. ఇంకొకటి కూడా చెబుతారు. నాటి స్పానిష్ పోర్చుగీసువారు ఈ ప్రాంతంలో బంగారం కోసం, వెండి కోసం తెగ వెతుకులాడి ఏమీ దొరక్క అందరికీ ‘కా నడా’ (నథింగ్ హియర్) అని చెప్పడం మొదలుపెట్టారు. అలా కూడా ఈ ప్రాంతం కెనడా అయి ఉండొచ్చని అంటారు. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశంలో ఉన్న జనాభా కేవలం మూడున్నర కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా కంటే తక్కువమన్నమాట. -
అప్పట్లోనే ఓటుకు నోటు
ఇటీవలి రాజకీయాల్లో ఓటుకు నోటు వ్యవహారాలు షరా మామూలే అయినా, నోట్లు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయడం రెండు శతాబ్దాల కిందటే ఉండేది. జాన్ మేటన్ అనే బ్రిటిష్ పెద్దమనిషి ఈ పద్ధతికి ఆద్యుడు. ఘనమైన రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబంలో జన్మించిన మేటన్ దొరగారికి లెక్కలేనంత తిక్క ఉండేది. ఈయనగారి తలతిక్క కారణంగానే జనాలు ఈయనను ‘మ్యాడ్ జాక్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. పెద్దల ప్రోద్బలంతో, కుటుంబ రాజకీయ వారసత్వ పరంపర కొనసాగించే సదుద్దేశంతో మేటన్ దొరగారు 1819లో నార్త్ ష్రాప్షైర్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో టోరీ పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రచార సభల్లో ప్రసంగాలు, ప్రజలకు వాగ్దానాలు చేయడం వంటి చిల్లర వ్యవహారాలన్నీ నచ్చని మేటన్ దొరగారు ఓటర్లందరికీ పది పౌండ్ల నోట్లు ధారాళంగా పంచిపెట్టాడు. నోట్లు పుచ్చుకున్న ఓటర్లందరూ కృతజ్ఞతతో ఆయనగారికి ఓట్లు గుద్దేశారు. ఆ విధంగా ఆయనగారు బ్రిటిష్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లోకి అడుగుపెట్టారు. ‘అనుభవించు రాజా...’ అనే రీతిలో మందు విందు చిందుల్లో ఓలలాడే మేటన్ దొరగారికి పార్లమెంటు బొత్తిగా నచ్చలేదు. సభలో ఆయన గడిపింది కేవలం అరగంట మాత్రమే. ఆ తర్వాత ఎన్నడూ ఆయన సభలో అడుగుపెట్టిన పాపాన పోలేదు. అయితే, ఆయన మొదలుపెట్టిన ‘ఓటుకు నోటు’ పద్ధతిని మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులు అందిపుచ్చుకున్నారు. ఈ పద్ధతిని చట్టాలు ఒప్పుకోకున్నా, ఇప్పటికీ దీనిని ఎవరి శైలిలో వాళ్లు కొనసాగిస్తూ ఆ విధంగా ముందుకు పోతున్నారు. - పన్యాల జగన్నాథ దాసు -
నేడు 9 అక్టోబర్, 1962
బుగాండా టు ఉగాండా స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ ఉక్కుచెర నుంచి బయటికి వచ్చిన ఉగాండా స్వాతంత్య్రదేశంగా స్వేచ్ఛాపతకాన్ని ఎగరేసింది. 1894కు ముందు... ఉగాండా అనేది అనామక ప్రాంతం. ‘ఈ ప్రాంతాన్ని కాపాడడానికి వచ్చిన రక్షకులం మేము’ అంది బ్రిటన్. చరిత్ర మాత్రం ఈ సత్యాన్ని పెద్దగా ధ్రువీకరించలేదు. ఏది ఏమైనా... ఒక స్వాతంత్య్ర దేశంగా స్వేచ్ఛావాయువుల రుచి చూసిన ఈ ప్రాంతం- ‘హో! ఉగండా... ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ అని జాతీయగీతం పాడుకుంది. పచ్చని కొండల అందాలు, తేయాకు తోటల ఘుమ ఘుమలు... ఉగాండా ఒక అద్భుత చిత్ర దృశ్యం. ‘బుగాండా రాజ్యం’ నుంచి ‘ఉగాండా’ పేరు వచ్చింది. దేశపాలకులు ‘ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ విశేషణంతోనే సంతృప్తిపడకుండా ఉండి ఉంటే, దేశ అభివృద్ధి కోసం కష్టపడి ముందస్తు ప్రణాళికలు వేసుకొని ఉంటే... ప్రపంచంలోని పేద దేశాలలో ఉగాండా ఒకటయ్యేది కాదు. సరే, ఈ ఆర్థిక పేదరికం మాట ఎలా ఉన్నా... ప్రకృతి సంపద, సాంస్కృతిక, పురా చారిత్రక సంపద... ఆ దేశాన్ని సంపద్వంతం చేస్తూనే ఉన్నాయి. -
చర్చిల్ దొరగారి వింతభయం
ఇరవయ్యో శతాబ్దిలో ప్రపంచంలోనే పేరెన్నిక గల వక్తల్లో ఒకరిగా అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ దొరగారికి గొప్ప పేరుప్రఖ్యాతులు ఉండేవి. చరిత్రలోని గొప్ప వక్తల్లో ఒకరిగా చర్చిల్ పేరును ఇప్పటికీ చాలామంది ప్రస్తావిస్తారు. వక్తృత్వంలో అంతటి పేరు ప్రఖ్యాతులున్న చర్చిల్ దొరగారికి ఒక వింతభయం ఉండేది. అదేమిటో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే! బహిరంగ వేదికలపై ప్రసంగించాలంటే చర్చిల్ దొరగారికి చచ్చేంత భయంగా ఉండేదట. చర్చిల్ దొరగారు తన 29వ ఏట బ్రిటన్ ప్రతినిధుల సభలో ఒకసారి ప్రసంగించడానికి ప్రయత్నించారు. సభాపతి అనుమతించగానే, మాట్లాడటానికి లేచి నిల్చున్నా, నోట మాట పెగల్లేదు. మూడు నిమిషాలు అలాగే గడిచిపోయాయి. సిగ్గుతో ముఖాన్ని చేతుల్లో కప్పుకుని, అలాగే తన స్థానంలో కూర్చుండిపోయాడు. జీవితంలో ఇంకెప్పుడూ తనకు ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని తీర్మానించుకున్నాడు. కఠిన సాధన చేసి, క్రమంగా తన వాగ్ధాటితోనే ప్రపంచంలో పేరుప్రఖ్యాతులు పొందాడు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు -
చేజారిన కాంస్యం
బ్రిటన్ చేతిలో భారత్ ఓటమి హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్‌వర్ప్ (బెల్జియం): రక్షణపంక్తి పేలవ ప్రదర్శన కారణంగా భారత పురుషుల హాకీ జట్టు మరో భారీ పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం ముగిసిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో సర్దార్ సింగ్ బృందం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 1-5 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. కాంస్య పతకం నెగ్గిన బ్రిటన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో ఆతిథ్య బెల్జియం చేతిలో 0-4తో ఓడిన భారత్... ఈ మ్యాచ్‌లోనూ నిరాశాజనక ఆటతీరును కనబరిచింది. భారత రక్షణపంక్తిలోని లోపాలను సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ ఆటగాళ్లు బ్రాగ్‌డన్ (11వ ని.లో), గ్రిఫిత్ (27వ ని.లో), యాష్లే జాక్సన్ (37వ ని.లో), డిక్సన్ (42వ ని.లో), మిడిల్టన్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు రూపిందర్ పాల్ సింగ్ (59వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. -
కోర్టులో గాంధీ...
స్వాతంత్య్ర సమరయోధులపై బ్రిటిష్‌వారు అసంఖ్యాకంగా కేసులు పెట్టేవారు. వారికి చాలాసార్లు జైలుశిక్షలు పడేవి. అయితే కొన్నిసార్లు న్యాయమూర్తులు శిక్షలు వేయకుండా ‘వదిలేస్తే బుద్ధిగా మసులుకుంటామనే’ హామీని తీసుకొని విడుదల చేసేసేవారు. ఒకసారి బొంబాయి హైకోర్టులో గాంధీ మీద ఇలాంటి కేసే వచ్చింది. ‘శిక్ష వేయను. బయటకు వెళ్లాక బుద్ధిగా నడుచుకుంటారా’ అని న్యాయమూర్తి అడిగారు. అందుకు గాంధీజీ జవాబు- ‘బయటకు వెళ్లాక నేను బుద్ధిగా నడుచుకోను. బ్రిటిష్‌వారిని తిడతాను. మళ్లీ జైల్లో పెట్టండి. మళ్లీ బయటకు వచ్చి తిడతాను. ఈ దేశం నుంచి బ్రిటిష్‌వారు వెళ్లిపోయేవరకు వారిని తిడుతూనే ఉంటాను’. అదీ గాంధీ సత్యమార్గం. -
గ్రామకంఠాలపై జీవో
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి మినహాయిస్తూ ఉత్తర్వు హైదరాబాద్: ప్రజల ఉమ్మడి అవసరాలకు ఉద్దేశించిన గ్రామ కంఠం భూములు ఇక మాయం కానున్నాయి. గ్రామ ఉమ్మడి అవసరాల నిమిత్తం బ్రిటిష్ కాలంలోనే గ్రామ కంఠాలను ఏర్పాటు చేయగా వీటిని రక్షించాల్సిన ప్రభుత్వం భక్షించేందుకు మార్గం సుగమం చేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి గ్రామ కంఠం భూములను మినహాయిం చాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ బుధవారం జారీ చేసిన జీవో 187 ఇందుకు నిదర్శనం. గ్రామ కంఠం భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ నుంచి మినహాయిస్తూ గత ఫిబ్రవరి 16వ తేదీ జీవో 56 జారీ చేసింది. -
మళ్లీ కామెరానే బ్రిటిష్ ప్రధాని
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీగా సాగిన పోరులో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరోసారి ప్రధాని పీఠాన్నిఅధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ ఇప్పటికి 326 సీట్లను గెల్చుకుంటే, ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ 230 సీట్లు సాధించింది. 643 స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. మరో 7 సీట్లకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగానే కన్సర్వేటివ్స్ విజయం ఖాయమైపోయింది. సాధారణ మెజారిటీకి కావల్సిన 326 మ్యాజిక్ మార్కును సాధించారు. ఎగ్జిట్ పోల్స్‌కు అంచనాలకు కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డేవిడ్ కామెరాన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకోసం ఆయన బ్రిటిష్ రాణిని అనుమతి కోరారు. స్కాటిష్ నేషనల్ పార్టీ సంచలన విజయాలను నమోదు చేసింది. 56 సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఒక విధంగా వీరి ఫలితం ప్రధాన ప్రతిపక్షాన్ని బాగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. మొత్తం కాగా మొత్తం 650 స్థానాలకు ఇప్పటివరకు ఫలితాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 326 లేబర్ పార్టీ 230 స్కాటిష్ నేషనల్ పార్టీ 56 లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 8 డియూపి 8 ఇతరులు 15 రాణి ఎలిజబెత్ అధికారిక ప్రకటన అనంతరం ఈ నెల 27న కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది. కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీ, ప్రతిపక్షం లేబర్ పార్టీ 239 స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. విపక్షనేత రాజీనామా బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత ఎడ్ మిలిబాండ్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఇక ఓటమిని అంగీకరించక తప్పలేదు. మోదీ అభినందనలు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను అభినందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు అభినందనలు తెలిపారు. 'ఫిర్ ఏక్ బార్.. కామెరాన్ సర్కార్' (మరోసారి కామెరాన్ ప్రభుత్వమే) అంటూ తన ఎన్నికల సమయం నాటి నినాదాన్ని గుర్తుచేశారు. అప్పట్లో 'అబ్ కీ బార్ మోదీ సర్కార్' అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. Congratulations @David_Cameron. As you rightly pointed out- its "Phir Ek Baar, Cameron Sarkar!" My best wishes. pic.twitter.com/xf5tJfW0SE — Narendra Modi (@narendramodi) May 8, 2015 -
అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉంది. నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తన స్థానాలను నిలబెట్టుకుంటోంది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. అధికార పార్టీ 218 సీట్లను గెల్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం 200 సీట్లు సాధించింది. అయితే తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఫలితాలపై కామెరాన్ ట్విట్ చేశారు. 'ఒకే జాతి.. ఒకే రాజ్యం...మరోసారి దేశప్రధానిగా ఎన్నికయితే.. ప్రజలకు సేవచేసే అవకాశం దొరకడం నా అదృష్టం' అంటూ ఆయన ట్విట్ చేశారు. ముందుంది మంచి కాలం అన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత, లేబర్ పార్టీ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎడ్ మిలిబాండ్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత నిక్‌క్లెగ్, యునైటెడ్ కింగ్డమ్ ఇండిపెండెన్స్ పార్టీ నికెల్ ఫరాగ్, స్కాటిష్ నేషనల్ పార్టీ అధిపతి నికోలా స్టర్జన్ తదితరులు విజయాన్ని సాధించినవారిలో ఉన్నారు. ఆరు లక్షలకు పైగా భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో నిర్ణాయశ శక్తిగా మిగలడం విశేషం. ఫలితాలను రాణి ఎలిజబెత్ అధికారికంగా ప్రకటించిన అనంతరం ఈ నెల 27న ఆమె ప్రసంగంతో కొత్త పార్లమెంటు కొలువుదీరనుందని సమాచారం.