ఖరీఫ్‌పై నీలి నీడలు
-
మొరపెట్టుకున్నా కరుణించేవారేరీ?
-
ఈ ఏడాది జూ¯ŒS 15 తరువాతనే సాగునీరు
-
సాగు సమ్మెలో డిమాండ్‌నూ పట్టించుకోని వైనం
-
బ్రిటిష్ కాలంలో పద్ధతిగా నీళ్లిచ్చేవారు
-
ఆ ప్రణాళిక అమలు చేయాలంటే పట్టించుకోని వైనం
-
మండిపడుతున్న డెల్టా రైతులు
అమలాపురం :
బ్రిటిష్ పాలనా కాలంలో మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇచ్చేవారు. జూ¯ŒS 15 నాటికి రైతులు నాట్లు పూర్తి చేసేవారు. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తయి అన్నదాతలంతా ఆనందంతో గడిపేవారు. ఆ తరువాత అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వచ్చిన అల్ప పీడనం, తుపాన్ల బారి నుంచి బయటపడేవారు.
మే 15వ తేదీన కాకుండా ఓ నెల ఆలస్యంగా అంటే జూ¯ŒS 15 తరువాత నీరు విడుదల చేస్తున్నారు. దీంతో తుపాన్లలో చిక్కి చేతికొచ్చే పంటా వరదపాలయ్యేది. 2011లో సాగు సమ్మె ఉధృతంగా జరిగింది. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి 2012 మే 25న సాగునీరు విడుదల చేశారు. ఆ తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో గత ఖరీఫ్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు.
‘బ్రిటీష్ కాలంలో ఇచ్చినట్టుగా మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇవ్వాలి. అలా ఇస్తే జూ¯ŒS 15 నాటికి నాట్లు పూర్తి చేస్తాం. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తవుతాయి. అప్పుడే మా పంట మాకు దక్కుతుంది. ఆలస్యమైతే అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వస్తున్న అల్ప పీడనలు, తుపాన్లకు పంట నష్టపోవడం పరిపాటిగా మారింది’ అని డెల్టా రైతులు మొరపెట్టుకుంటున్నారు. 2011లో జరిగిన సాగు సమ్మె ఉద్యమ సమయంలో ఇదే ప్రధాన డిమాండ్. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లలో ఇదొకటి. సాగుసమ్మె జరిగిన తరువాత ఏడాది 2012 మే 25న సాగునీరు ఇచ్చిన ఇరిగేష¯ŒS అధికారులు తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో డెల్టా రైతులు పంటను నష్టపోతున్నారు. దీనికి నిరసనగా గత ఖరీఫ్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా జూ¯ŒS 15 తరువాతే మధ్య డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించడం ఇక్కడ గమనార్హం.
‘కనీస సదుపాయాలు కల్పించండి ... పంట పండించి దేశానికి ధాన్యరాశులు అందిస్తాం’ రైతులు చేస్తున్న డిమాండ్ ఇదీ. డెల్టాలో సాగవ్వాల్సిన 40 వేల ఎకరాలను బీడుగా పెట్టి ప్రాధేయపడుతున్న వేడుకోలు ఇది. అయినా పాలకులు పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించడంతో అన్నదాతలుఅల్లాడిపోతున్నారు. మే రానే వచ్చింది. మళ్లీ రైతన్న పిడికిలి బిగుస్తోంది.
అన్ని అనర్థాలకూ ఇదే కారణం...
lసాగునీరు ఆలస్యంగా ఇవ్వడమే మధ్య డెల్టాలో సాగు నష్టపోవడానికి కారణమవుతోంది. జూ¯ŒS 15 నాటికి నీరు విడుదల చేయడం వల్ల అక్టోబరు 20 తరువాత తుపాన్లబారిన పడి పంట నష్టపోవడంతో రైతులు కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు.
l
తుపాన్ల నుంచి పంటను రక్షించుకునే ఉద్ధేశంతో కొంతమంది రైతులు సాగు ఆలస్యం చేసి ఆగస్టు మొదటివారంలో నాట్లు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల డిసెంబరు నెలాఖరు నాటికి కాని కోతలు పూర్తి కావడం లేదు. దీంతో రబీసాగు ఆలస్యమవుతోంది.
రబీ నాట్లు సంక్రాంతి తరువాత కూడా పడడం వల్ల ఏప్రిల్ 10 వరకు సాగునీరు విడుదల చేయాల్సి వస్తోంది. తమకు ఈ నెల 20 వరకు సాగునీరు విడుదల చేయాలని కొంతమంది రైతులు కోరుతుండడం చూస్తుంటే సాగు ఎంత జాప్యమవుతోందో అర్ధం చేసుకోవచ్చు.
ఖరీఫ్, రబీ ఆలస్యం కావడం వల్ల మూడో పంట అపరాలు సాగు లేకుండా పోతోంది. దీనివల్ల రైతులు అదనపు ఆదాయం కోల్పోవడమే కాకుండా భూసారాన్ని పెంచి పచ్చిరొట్ట ఎరువులకు దూరమవుతున్నారు.
కాలువలను ఆలస్యంగా మూసివేయడం వల్ల అటు ఇరిగేష¯ŒS శాఖాధికారులు సైతం ఆధునికీకరణ పనులను ఆశించిన స్థాయిలో చేయడం లేదు.
ఈ అనర్ధాల నుంచి గట్టెక్కాలంటే మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లోను కష్టాలు తప్పేటట్టు లేవు.