water problem
-
‘పాలమూరు’పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నీలినీడలు కము్మకున్నాయి. ప్రాజెక్టుకి నీటి కేటాయింపులను ప్రశ్నిస్తూ తాజాగా డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తిప్పిపంపడంతో ప్రాజెక్టు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇప్పటికే తీవ్ర ఉల్లంఘనల ఆరోపణలతో పర్యావరణ అనుమతులిచ్చేందుకు కేంద్రం ససేమిరా నిరాకరిస్తుండగా, దీనికి నిధులు, పెండింగ్ బిల్లుల సమస్య తోడుకావడంతో ప్రాజెక్టు నిర్మాణం నీరసించిపోయింది. తాజాగా నీటి కేటాయింపుల అంశం తెరపైకి రావడంతో ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ట్రిబ్యునల్ ఏమంటుందో..? పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే అవకాశాన్ని దశాబ్దాల కిందట గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలు తమవేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ 45 టీఎంసీలకు తోడుగా మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీల జలాలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దీనిని ఏపీ వ్యతిరేకిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీల జలాల వినియోగంపై ఏ రాష్ట్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు పోలవరం నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు గతేడాది కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేయడంతో ట్రిబ్యునల్ తీసుకోనున్న నిర్ణయంపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. పనులు నత్తనడక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో ‘పాలమూరు’ను చేర్చింది. ఏటా రూ.6 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసి వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ప్రస్తుత ఏడాది (2024–25)లో రూ.6130 కోట్లు, వచ్చే ఏడాది (2025–26) రూ.6313 కోట్ల పనులు చేయాలని నిర్దేశించుకుంది. అయితే గత ఏడాది కాలంలో రూ.4743 కోట్లు విలువైన పనులు మాత్రమే జరగడంతో నిర్దేశిత గడువు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల్లో రూ.1500 కోట్లు చెల్లించినప్పటికీ మరో రూ.1437 కోట్ల మేర బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఒక్క ఎకరాకూ అందని నీరు శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల జలాలను తరలించి నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.35,200 కోట్ల అంచనాలతో 2015 జూన్ 10న ప్రాజెక్టుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, తర్వాత అంచనా రూ.55,086 కోట్లకు ఎగబాకింది. గత ప్రభుత్వం రూ.27,554 కోట్ల విలువైన పనులు చేయగా, మొత్తం రూ.32,297 కోట్లు విలువైన పనులు పూర్తిచేసినా, ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. ప్రాజెక్టుకు మరో రూ.22,789 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఉద్దండాపూర్ పనులను అడ్డుకుంటున్న రైతులు... స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్టు ఆరు రిజర్వాయర్లలో ఒకటైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు 2023 నవంబర్ నుంచి నిలిచిపోయాయి.ముంపునకు గురైన ఉద్దండాపూర్, వల్లూరు, పొలేపల్లి గ్రామాలతో పాటు శామగడ్డ, ఒంటిగుడిసె, చిన్నగుట్ట, రాగడిగుట్ట తండాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తక్షణం రూ.30 కోట్ల పరిహారంగా చెల్లిస్తేనే పనుల పునరుద్ధరణ జరగనుంది. కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై మీమాంస గత ప్రభుత్వం ఉద్దండాపూర్ సహా 5 రిజర్వాయర్ల పనులను మాత్రమే ప్రారంభించింది. చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని విరమించుకుని ప్రత్యామ్నాయ మార్గంలో ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లభించని పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతుల్లేకుండానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను పర్యావరణ పరిహారంగా రూ.528 కోట్లను చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ ప్రాజెక్టుకు పలు షరతులతో పర్యావరణ అనుమతులు జారీ చేయాలని గతేడాది సిఫారసులు చేసింది.పర్యావరణ పునరుద్ధరణకు రూ.153 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పీసీబీ కేసును ఫైల్ చేసింది. తీవ్ర పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలుండడంతో, ఈఏసీ సిఫారసులు చేసినా కేంద్రం పర్యావరణ అనుమతులివ్వడం లేదు. -
హైదరాబాద్‌లోని ఇందిరా నెహ్రూ నగర్లో నీటి సమస్య
-
Telangana: నీళ్లు కష్టం..సాగు నష్టం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పాలారం, గోండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగలి తండాల్లోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. నాలుగైదేళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు శివారులో ఉన్న కిష్టాపురం మేజర్ కాలువ నిర్వహణ లోపంతో కంపచెట్లు, ఇతర మొక్కలు, పూడికతో నిండిపోయింది. ఈ కాలువ కింద మొత్తం 3,361 ఎకరాల ఆయకట్టు ఉండగా నీళ్లు కిందకు రాకపోవడంతో గూడూరు, బోట్యానాయక్ తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 1,800 ఎకరాల్లో సాగు కష్టమవుతోంది.ఖమ్మం జిల్లాలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ కింద బోనకల్ మండలంలోని కలకోట, పోలంపల్లి, లక్ష్మీపురం, రాపల్లిలో మేజర్ కాల్వలు, మరో 16 మైనర్ కాల్వలున్నాయి. వీటి కింద 26 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే బ్రాంచ్ కెనాల్ పరిధిలో రెండు కి.మీ. మేర లైనింగ్ సక్రమంగా లేదు. పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరి కాల్వ కోతకు గురైంది. పోలంపల్లి కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. జాలిముడి, చిరునోముల ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ కాల్వతో పాటు ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల కాల్వలో చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి.సాక్షి ప్రతినిధులు నల్లగొండ/ఖమ్మం: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కాలువల కింద చివరి భూములకు నీరందడం కష్టంగా మారుతోంది. చివరి భూములకు సైతం నీరందిస్తామని ప్రజా ప్రతినిధులు పదేపదే ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.నల్లగొండ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్లు పెరిగి కాలువలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. రెండు జిల్లాల్లోనూ పూడిక సమస్య ఉంది. దీంతో అనేకచోట్ల చివరి భూములకు నీరందడం లేదు. మరికొన్ని చోట్ల రావాల్సిన నీళ్లు రావడం లేదు. దీంతో పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఉమ్మడి నల్లగొండలో..నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఎడమకాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.కాల్వలు సరిగా లేకపోవడంతో ఒక్కొక్క మేజర్‌కు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ కాల్వ కట్టలు బలహీనంగా ఉండి పూడిక, కంపచెట్లు పేరుకుపోవడంతో ప్రస్తుతం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. 2010లో దాదాపు రూ.4,444కోట్లతో ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా, నిధులు సరిపోక అన్ని మేజర్లు, లింక్ కాల్వలకు లైనింగ్, ఫ్లోరింగ్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువల నిర్వహణ లేకపోవడంతో 2022లో నిడమనూరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడగా ఇటీవల హాలియా సమీపంలోని మారెపల్లి వద్ద వరద కాలువకు గండిపడి కిందకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల మేర సాగర్ ఆయకట్టు ఉండగా.. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు రైతాంగం పంట చేతికి వచ్చే సమయాన నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.జిల్లాలో సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో సాగర్ కాల్వలు ఉండగా, కొన్ని కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు మొక్కలు మొలిచాయి. ఓఅండ్ఎం పనులు అంతంతే..ఏటా వానాకాలం సీజన్‌కు ముందు కాల్వల్లో జలవనరుల శాఖ అధికారులు ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులు చేపట్టాలి. చెత్తా చెదారం, మొక్కలు, పూడిక తొలగించాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. రైతుల అవసరాలతో పాటు సంబం«ధిత ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనల మేరకు పనుల అంచనాలు రూపొందిస్తారు. అయితే ఈ ఓఅండ్ఎం పనులు సరిగా సాగడం లేదు. 2023–24లో ఖమ్మం జిల్లాలో 106 పనులకు రూ.20.14 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన 35 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక 2024–25లో ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.నారుమడి ఎండిపోయేలా ఉందికాల్వలు పూడుకునిపోయి కంప చెట్లు మొలిచాయి. మరమ్మతులు లేక బలహీ నంగా ఉన్న కాల్వ కట్టలు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. నాకున్న ఏడెకరాల పొలానికి నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వేసిన నారుమడి ఎండిపోయే దశకు వచ్చింది. – మేక రాంబాబు, కిష్టాపురం, ఉమ్మడి నల్లగొండ జిల్లాచెత్తా చెదారంతో నీళ్లు రావడం లేదులింగగరి మేజర్ కాలువ చెత్తా చెదారంతో నిండి పోయింది. కంపచెట్లు పెరగ డంతో నీరు సరిగా రావడం లేదు. ప్రస్తు తం వదిలిన సాగర్ నీరు ఈ కాలువలోకి వచ్చే సరికి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీంతో కింది గ్రామాల పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. – రామిశెట్టి రాము, రైతు, హుజూర్నగర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాగత ఏడాది రూ.50 వేల నష్టంమాకు మీనవోలు రెవెన్యూలో ఆరు ఎకరా ల భూమి ఉంది. గతేడాది పత్తి సాగు చేశాం. సాగర్ నీరు చుక్క కూడా రాకపో వడంతో దిగుబడి తగ్గి రూ.50 వేలకు పైగా నష్టం వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగుకు సిద్ధమయ్యాం. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా గంటల సమయం వేచి ఉన్నా నీరు వచ్చే పరిస్థితి లేదు. –రామిశెట్టి సుజాత, రైతు, మీనవోలు, ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా -
భారీ వర్షాలతో ఢిల్లీ ఆగమాగం.. ఆరుగురి మృతి
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన హస్తీనా వాసులకు చల్లగాలులు, వర్షంతో ఉపశమనం లభించినప్పటికీ.. ఊహించని స్థాయిలో పడిన కుండపోత వర్షాలు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దేశ రాజధానిలో శుక్రవారం ఒక్క రోజే 228.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఢిల్లీలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షం కురవడం 88 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.అయితే మరో రెండు రోజులు(జూన్ 1) భారీ వర్షాలు, అయిదు రోజులు తేలికపాటి వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో విద్యుత్తు సరఫరాకు, మంచి నీటి సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వర్షం, వరదలు కారణగా దేశ రాజధానిలో ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు.వీరిలో 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో వర్షపు నీరు నిండిన కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. వీరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది శనివారం బయటకు తీశారు. షాలిమార్‌బాగ్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో ఓ వ్యక్తి మునిగిపోయాడు.“दिल्ली की जनता को थोड़ी तमीज़ होनी चाहिए, यें कोई जगह है गाड़ियाँ पार्क करने की।”😏 pic.twitter.com/qOBE6r8HxC— Dr. Atishi || AAP || CM, Delhi 2024 || Parody || (@atishi_maarlena) June 28, 2024 ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న పైకప్పు కూలిన టెర్మినల్-1ను నేడు కూడా మూసివేశారు. శుక్రవారం పైకప్పు కూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలసిందే. మరో నలుగురురికి గాయాలయ్యాయి. ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓ అండర్‌పాస్‌లో వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది.గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ నగరం.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయిందిఇక నేడు (శనివారం) ద్వారకా, పాలం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గుర్గావ్, ఫరీదాబాద్, మనేసర్‌తో సహా ఢిల్లీ-ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఢిల్లీ వాటర్ కష్టాలు
-
ఢిల్లీలో నీటి సంక్షోభం.. నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా
-
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
చేతి కర్రతోనే పొలం బాట
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్ రూరల్ / సిరిసిల్ల: సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దూంపూర్‌లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్‌సింగ్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. -
మళ్లీ పాత తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్ స్కాలర్షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్ అన్నారు. నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు. సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు పులులై తరిమి కొడతరు ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్ఎస్ అధినేత హెచ్చరించారు. మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజధానిలో ట్యాంకర్లా? ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్‌భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్‌భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్‌బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్‌సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్‌బోర్డు చెబుతోంది. -
నీటి వినియోగంపై ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
జనగామ/ తుంగతుర్తి/ సూర్యాపేట రూరల్: ‘‘పంట ఎండిపోయిందని అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అధికారులు వచ్చినప్పుడు నష్టం వివరాల ను రాయించుకోండి. మేం అండగా ఉంటాం’’అని రైతులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఎండిన పంట పొలాల పరిశీలనలో భాగంగా.. ఆదివారం జనగా మ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారంతండా, మొండికుంట తండా, సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎంత పెట్టుబడి పెట్టారు. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది. కాలువల ద్వారా నీళ్లొస్తున్నాయా. బోర్లలో నీళ్లు ఉన్నాయా.. రైతుబంధు వచ్చిందా..’’ అని అడిగి తెలుసుకున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ.. కేసీఆర్‌కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొట్టదశకు వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనగామ జిల్లా ధరావత్ తండాలో మహిళా రైతు అముగోతు సత్తెమ్మ మాట్లాడుతూ.. ‘‘సారూ.. ఎనిమిది ఎకరా ల్లో వరి వేసినం. రూ.3 లక్షలకుపైగా పెట్టుబడులు అయినయి. కాలువ నీళ్లు రాక.. రూ.1.80 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోర్లు వేయించినం. వాటిలోనూ నీళ్లు సరిగా పడలేదు. పంటంతా ఎండిపోతోంది. ఇక మాకు దిక్కెవరు..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుమారుడి పెళ్లి పెట్టుకున్నామని, అప్పులు కూడా పుట్టట్లేదని వాపోయింది. దీంతో ‘‘బిడ్డా బాధపడకు.. మళ్లీ వచ్చేది మనమే. బాధలన్నీ తీరుతయి. అందాక రూ.5లక్షల చెక్కు పంపిస్తా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెచ్చిస్తరు’’ అని భరోసా ఇచ్చారు. సాగు నీళ్లు రావడం లేదంటూ.. తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలోని సింగారం, మొండికుంట తండాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులు దయ్యాల వెంకటనారాయ ణ, ధరావత్ సురేశ్, భూక్యా శ్రీను, ఆంగోతు హర్జా, గుగులోతు సుశీలతో మాట్లాడారు. ఈ రెండు తండాల్లో 250 ఎకరాల వరకు వరి వేయగా.. పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గత ఐదారేళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలా లు రావడంతో.. పంటలు బాగా పండాయన్నారు. ఈ యాసంగి సీజన్ మొదట్లో కాల్వల ద్వారా నీళ్లు వదలడంతో.. వరి వేశామని, కానీ ఇప్పుడు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోయాయని వాపోయారు. రోజులో 16 గంటలే కరెంట్ వస్తోందని.. అదికూడా 16 సార్లు ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. ప్రభు త్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ సూర్యాపేట మండలం ఎర్కారం చేరుకున్నారు. మళ్లీ అప్పుల పాలవుతున్నాం.. ఎర్కారం గ్రామంలో రైతు కొదమగుండ్ల వెంకటయ్య, సరోజనమ్మ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో సరోజనమ్మ కేసీఆర్ వద్దకు వచ్చి విలపించింది. ‘‘మీరు సీఎంగా ఉన్నప్పుడు సాగునీళ్లు వచ్చేవి. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కాలువ నీళ్లు రావట్లేదు. ఐదెకరాల్లో వరి ఎండింది. మళ్లీ అప్పుల పాలు అవుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతా రైతుల గోడు ఆలకించిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ఏ రైతును పలకరించినా కన్నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని.. ఎండిన వరి పొలాలకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా మళ్లీ 24 గంటల కరెంట్‌ను సాధించుకుందామన్నారు. -
ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు
సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు, నాలుగు నెలలుగా ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు.. యాత్రలు చేస్తున్నాడే తప్ప రైతుల బాధలు చూడట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో నీరు లేక ఎండిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల పొలాలు నీరు లేక ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కానీ, మంత్రులు కానీ పొలాల దిక్కు చూసిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో కాళేశ్వరంపై, కేసీఆర్‌పై కడుపు మంటతో మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను రిపేరు చేయకుండా.. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా పొలాలను ఎండబెట్టారని ఆరోపించారు. గతంలో గోదావరి నీళ్లను ఎత్తిపోసి కాల్వల ద్వారా చెరువులు నింపి పొలాలు ఎండిపోకుండా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. సారంపల్లిలో పొలాలను చూస్తుంటే.. మేతకు తప్ప కోతకు పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి అప్పులు కడతారా.. చస్తారా.. అన్నట్లుగా వేధిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల ఖజానా నింపుతున్నారు యాసంగి సీజన్లో రైతుబంధుకు రూ.7వేల కోట్లు సిద్ధం చేస్తే.. రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తూ వాళ్ల ఖజానా నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రయోజనాల కోసం రైతులను గోసపెడుతోందన్నారు. రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, రైతుల పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అడ్డుకాకుండా ఈసీకి లేఖ రాసి రుణమాఫీని ప్రకటించాలన్నారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలని, పంటలు ఎండిన రైతులను, కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు ఇచ్చిందని, ఇప్పుడు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ధైర్యం నింపి వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పొలాలను సందర్శించాలని కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. నిరుడు చెరువుల్లోకి కాల్వనీరు వచ్చి పొలం పారిందని, ఈసారి పది ఎకరాల్లో వరి వేస్తే మొత్తం ఎండిపోయిందని కేటీఆర్‌కు పర్శరాములు అనే కౌలు రైతు చెప్పారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. -
వారికి మెగాస్టార్ చిరు సలహా.. ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో చిరు సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో అవలంభించిన పద్ధతులను వివరించారు. తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను పంచుకున్నారు. అంతే కాకుండా తన ట్వీట్లో కన్నడ భాషలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే?) కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ... ಬಹಳ ಮುಖ್ಯ. ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024 -
తడారిన తండాలు ..ఏజెన్సీ ప్రజల పాట్లు
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ నీరు వారం, పది రోజులకోసారి సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వేకువనే కాలినడకన వెళ్లి తెచ్చుకోవలసిన దుస్థితి. పూనగూడ గ్రామస్తులు ఎడ్లబండిపై నాలుగైదు కి.మీ. దూరంలోని చెరువు, బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారం వేకువజామున కనిపించిన దృశ్యాలివి. – ఆదిలాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
నీటి పాట్లు.. పెళ్లికి అగచాట్లు
బనశంకరి: బెంగళూరు నగరంలో వేసవి నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. అలాగే యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితునికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని సోమవారం ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు. ఇందుకు నీటి సమస్యే కారణమని చెప్పాడు. తన పోస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేశాడు. రాహుల్‌గాంధీ గారు.. దయచేసి మీరు బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించాలి. ఐటీ ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడు వధువు కోసం ఎంతగానో గాలించినా ప్రయోజనం లేదు. ఐటీ సిటీలో నీటి సమస్య వల్ల అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని నా స్నేహితుడు బాధపడినట్లు తెలిపాడు. మొత్తం మీద ఈ ఎండాకాలం సిలికాన్ సిటీకి చుక్కలు చూపిస్తోంది. గత నెలరోజుల నుంచి బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. నీటి బొట్టుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం, బెంగళూరు జలమండలి శ్రమిస్తున్నాయి. లక్ష బోర్లు ఎండిపోయాయి. నగరంలో 257 ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. -
రాష్ట్రంలో కరువు పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఏడాదిగా సరైన వర్షపాతం లేక రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనిని అంతా కలసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. బుధవారం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ జిల్లాల రైతులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పండిస్తున్న పంటలు, అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కరువు పరిస్థి తులు ఉన్నాయి. వచ్చే ఎండాకాలంలో తాగునీటికి కష్టా లు రాకుండా చూడాల్సిన అవ సరముంది. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలంటూ కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాలు ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడు తుంది. రైతులు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. ఎప్పుడూ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలి. అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మా ప్రభుత్వం రైతుల తో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలను చేపడు తుంది. విత్తనాలు, ఎరువుల సరఫరా, ఏ పంట వేయాలనేది మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకు నేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో మా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతుభరోసా, రుణమాఫీ, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యక్రమాలన్నీ చేపడుతోంది. పంట మార్పిడితో అధిక దిగుబడులు రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉన్నా యి. రైతులు కేవలం వరి, పత్తి, మిర్చి పంటలకే పరిమితం కావొద్దు. ఇతర పంటలు సాగు చేయాలి. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లా భాలు వచ్చేలా పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి. వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసు కోవాలి. దీనిద్వారా తమ సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకురావొచ్చు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్ర మాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తాం. రైతులు ధైర్యం కోల్పోవద్దు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమ ల్లోకి తెచ్చింది. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటే.. రైతులు ధీమాగా బతికేందుకు పంటల బీమా పనిచేస్తుంది. పంట వేసినప్పటి నుంచి కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారం అందుతుంది. రైతులు పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుంది. వారు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ‘రైతు నేస్తం’ ఏమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతువేదికలను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసి.. నేరుగా రైతుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూ.97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు, వ్యవసాయ నిపుణులు గ్రామాల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. తగిన సలహాలు ఇవ్వడంతోపాటు పంటల సాగులో అధునాతన మెలకువలను సూచిస్తారు. ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు కూడా ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. -
Aqueduct Water Risk Atlas: ఇక కన్నీళ్లేనా..?
వానలు, వరదలతో ప్రపంచంలో కొన్ని దేశాలు అల్లాడిపోతుంటే, మరి కొన్ని దేశాల్లో గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లకి కరువు వచ్చి పడింది. ప్రపంచంలో 25 దేశాలు నీటికి కటకటలాడుతున్నట్టుగా వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అడ్వకేట్ వాటర్ రిస్క్ అట్లాస్ పేరుతో ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచ జనాభాలో 25% మంది ప్రస్తుతం అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నివేదిక ఏం చెప్పిందంటే.. ► ప్రపంచంలోని 25 దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిలో భారత్, సౌదీ అరేబియా, చిలీ, శాన్మెరినో, బెల్జియం, గ్రీస్ వంటి దేశాలున్నాయి. ► బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ప్రతీ ఏడాది నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. ప్రతీ ఏడాది కరువు బారిన పడుతున్నాయి. ► ప్రపంచంలో నీటి కొరత అత్యధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతాలు పశి్చమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా. ఈ ప్రాంతాల్లో 83% జనాభా అత్యధికంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. ► దక్షిణాసియా జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశాల్లో 74% మంది జనాభా నీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ► ప్రపంచ జనాభాలో 50% మంది అంటే 400 మంది కోట్ల వరకు ప్రతీ ఏడాది ఒక నెల రోజుల పాటు నీటికి కటకటగా ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 60 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయి. ► నీటి కొరత కారణంగా భారత్, మెక్సికో, ఈజిప్టు, టర్కీ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నాయి. ► 2010లో నీటి కొరత వల్ల ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 15 లక్షల కోట్ల డాలర్లు (ప్రపంచ జీడీపీలో 24%) నష్టపోతే, 2050 నాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 31% నష్టం వాటిల్లుతుంది. అంటే 70 లక్షల కోట్ల డాలర్ల నష్టం వస్తుంది. ► ఆసియా దేశాల్లో భారత్ అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొంటుంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో 80% మందికి సురక్షిత నీరు అందదు. ► ప్రపంచ వ్యవసాయ రంగం 60% నీటి కొరతను ఎదుర్కొంటోంది. దీని వల్ల వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకు పంటలపై ప్రభావం పడుతోంది. నీటి కటకటకి కారణాలివే..! జనాభా పెరుగుదల , పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణ సమర్థంగా చేయకపోవడం వంటివెన్నో నీటి కటకటకి కారణాలు. భూమ్మీద 70% నీటితో నిండి ఉన్నా మన అవసరాలు తీర్చే నీరు అందులో 3% మాత్రమే. అందులో రెండింట మూడొంతులు మంచు రూపంలో ఉంది. జనాభా పెరిగిపోతూ ఉండడంతో నీటికి డిమాండ్ పెరుగుతోంది. 1960తో పోల్చి చూస్తే నీటికి డిమాండ్ రెట్టింపు కంటే ఎక్కువైంది. యూరప్, అమెరికాలో నీటికి డిమాండ్ స్థిరంగా ఉంటే ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోంది. 2050 నాటికి నీటికి డిమాండ్ మరో 25% పెరుగుతుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలో సగం దేశాల్లో అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు పెరిగిపోతూ ఉండడంతో నీటి వినియోగం అధికమవడమే కాకుండా, కలుíÙత నీరు పెరిగిపోయే ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది. చేయాల్సింది ఇదే..! ప్రతీ వాన బొట్టుని సంరక్షించడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేయాలి. వ్యవసాయ, పారిశశ్రామిక రంగాలకే 70% నీటిని వాడాల్సి వస్తోంది. 2050 నాటికి పెరిగే జనాభాకి 2010 కంటే 56% అధికంగా పంటలు పండించాలి. తక్కువ నీటి వాడకంతో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల 2050 నాటికి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు గణనీయంగా తగ్గుతాయని ఒక అంచనా. చిత్తడి నేలలు పెంచడం, భూగర్భ జలాల పెంపొందించే చర్యలు చేపట్టడం వంటివి చెయ్యాలి. ఇక గ్లోబల్ వారి్మంగ్ అదుపు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సి ఉంది. ఆ 25 దేశాలు ఇవే..!: భారత్, బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, యెమన్, బోత్సా్వనా, ఇరాన్, జోర్డాన్, చిలీ, శాన్ మారినో, బెల్జియం, గ్రీస్, టునిషియా, నమీబియా, దక్షిణాఫ్రికా, ఇరాక్, సిరియా నీరు మనకి జీవనాధారం. భూమ్మీద లభించే అత్యంత ముఖ్యమైన వనరు అదే. అయినా దాని నిర్వహణలో మనం విఫలమవుతూ వస్తున్నాం. జల సంరక్షణ అనే అంశంలో నేను 10 ఏళ్లుగా పని చేస్తున్నాను. దురదృష్టవశాత్తూ ప్రతీ ఏడాది అదే నివేదిక, అదే కథనం ఇవ్వాల్సి వస్తోంది. ఈ సంక్షోభ పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రపంచ దేశాధినేతలు చిత్తశుద్ధితో పని చేస్తూ నీటి వనరుల సంరక్షణకి ఆర్థిక వనరులు కేటాయించాలి’’ –సమంతా కుజ్మా, డబ్ల్యూఆర్ఐ నివేదిక రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాగునీటి సమస్యకు చెక్
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకానికి జడ్చర్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.47కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మరో 20ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా పనులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట, జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాల, నక్కలబండతండ, శంకరాయపల్లి తండాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాల్లో కొంత నీటి సమస్య ఉంది. అమృత్ 2.0 పథకంలో మంజూరైన రూ.47కోట్ల ద్వారా అన్ని గ్రామాల్లోనూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. మున్సిపాలిటీలో లక్షా 10వేలకుపైగా జనాభా ఉండగా, 17వేలకుపైగా ఇళ్లున్నాయి. ప్రస్తుతం 9వేలకుపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో ప్రస్తుతం 20ట్యాంకులు ఉండగా, 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్తకు సమాచారం.. పట్టణంలోని సామాజిక కార్యకర్త కంచుకోట ఆనంద్ పలు సమస్యలపై ఉన్నతాధికారులకు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయటం పరిపాటిగా మారింది. ఆ లేఖల్లో నీటి ప్రాజెక్టు అమృత్ 2.0 ఒకటి. అయితే ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ సెక్రెటరి పి.ఏ.లతిక సామాజిక కార్యకర్తకు లేఖను పంపించటం గమనార్హం. రియల్ వెంచర్లతో పెరుగుతున్న సమస్య మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలంగా వెలుస్తున్న రియల్ వెంచర్ల వల్ల నీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవానికి వెంచరు దారులే ప్రతి ఇంటికి నీటి సౌకర్యం వసతి కల్పించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవటంతో మున్సిపాలిటీపై భారం పడుతుంది. కొత్తకాలనీలకు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వల్లే మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్నప్పటికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. అమృత్ 2.0లోఇవీ ప్రతిపాదనలు.. అమృత్ 2.0 పథకం ద్వారా మంజూరైన నిధులతో మున్సిపాలిటీలో కింది పనులు చేపట్టనున్నారు. నూతనంగా 53 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల 6 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 30వేల లీటర్ల సామర్థ్యం కల 1స్లంప్ నిర్మించనున్నారు. 2.5కి.మీటర్ల మేర ఫీడర్ పైప్‌లైన్ వేయనున్నారు. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు గానూ 62.5 కి.మీటర్ల మేర పైప్‌లైన్ వేయనున్నారు. అదేవిధంగా 7,954 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయటంతోపాటు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలు పెట్టనున్నారు. -
పడిపోయిన భూగర్భజల మట్టం... అప్రమత్తత లేకుంటే ముప్పే
కైలాస్‌నగర్: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. గతేడాదితో పోల్చితే నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలో 9.93 మీటర్ల లోతుకు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, యాసంగి సాగుకు ఎక్కువ నీటిని వినియోగించడం, బోరుబావుల తవ్వకాలపై నియంత్రణ లేకపోవడం, జూన్ నెలాఖరుకు చేరినా వర్షాలు కురవకపోవడంతో జలమట్టం పాతాళానికి చేరువవుతోంది. నీటి వినియోగంపై అప్రమత్తత లేకుంటే ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకం జిల్లాలో బోరుబావుల తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కొందరు వాల్టా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించేస్తున్నారు. నిబంధనల ప్రకారం బోరుబావి ఏర్పాటుకు రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. అలాగే బోరుకు బోరుకు మధ్య 250 మీటర్ల దూరం ఉండాల్సి ఉండాలి. అయితే జిల్లాలో ఈ నిబంధనలు ఏవీ అమలుకు నోచుకోవడం లేదు. కనీసం పది మీటర్ల దూరంలోనే రెండు, మూడేసి బోర్లు ఉండడం గమనార్హం. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ యంత్రాంగం శ్రీమామూలుశ్రీగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో వ్యవసాయ క్షేత్రాల్లో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సాగు చేసిన పంటలకు బోరుబావులే ఆధారం కావడంతో జలాల వినియోగం అధికమై లోతుకు చేరడానికి ప్రధాన కారణమవుతుంది. ఇచ్చోడలో అట్టడుగుకు.. ఈ ఏడాది మే నెలలో నమోదైన అధికారిక నీటి మట్టం వివరాలు పరిశీలిస్తే.. ఇచ్చోడలో అత్యధికంగా 25.70 మీటర్లకు పడిపోయింది. అలాగే గుడిహత్నూర్‌లో 18.2 మీటర్లు, జైనథ్‌లో 14.85 మీటర్లు, నేరడిగొండలో 9.90 మీటర్ల లోతుకు చేరాయి. ఈ మండలాల్లో ఏప్రిల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇచ్చోడలో ఏకంగా 37.60 మీటర్లకు చేరడం గమనార్హం. అయితే మేలో కురిసిన అకాల వర్షాలతో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ఏడు మీటర్ల లోతులో నీటి మట్టాలు ఉన్నాయి. అప్రమత్తత అవసరం నీటి వినియోగంలో ప్రజలు అప్రమత్తత పాటించకుంటే ముప్పు తప్పదని అధికారులు సూచిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించేలా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ క్షేత్రాల్లోనైతే నీటి కుంటలు నిర్మించుకోవాలి. చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా కూడా నీటిని సంరక్షించుకున్న వారమవుతాము. ఎక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను కాకుండా డ్రిప్, తుంపర్ల సేద్యం ద్వారా సాగయ్యే పంటలపై దృష్టిసారిస్తే నీటి సంరక్షణ సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బోరుబావుల తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలి. ముందుగా మీ సేవ ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించి అనుమతించాకే బోరు ఏర్పాటు చేసుకోవాలి. – ఏ.శ్రీవల్లి, భూగర్భ జలవనరుల శాఖ ఏడీ -
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి జలాలు
పాల్వంచరూరల్/అశ్వాపురం: దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2,250 కోట్ల వ్యయంతో అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద పనులు చేపట్టారు. 23 మండలాల పరిధిలోని 1,828 గ్రామాల్లో 9.97 లక్షల మందికి, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా) పట్టణాల్లోని 2.98 లక్షల మందికి తాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 2016లో డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు, అశ్వాపురం మండలం మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40ఎంఎల్డీ, పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద 145 ఎంఎల్డీ, పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్డీ, పూసూరు వద్ద 9ఎంఎల్డీ సామర్థ్యం గల ఇన్‌టేక్ వెల్లు నిర్మించారు. ప్రతిరోజూ 145 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల డబ్ల్యూటీపీలో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో రాష్ట్రంలోనే తొగ్గూడెంలోని నీటిశుద్ధి కేంద్రం ద్వితీయ స్థానంలో ఉంది. ఇంట్రా విలేజ్ స్కీమ్ ద్వారా.. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షణలో పైపులైన్, ట్యాంక్‌లు నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.191.09 కోట్లు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో 818 ట్యాంక్‌లు, 2,234 కిలోమిటర్ల పొడవునా పైపులైన్ నిర్మించారు. తాగునీటికి ఇబ్బంది లేదు జిల్లాలో మిషన్ భగీరథ పథకం రాకముందు తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రధానంగా వేసవిలో సమస్య జఠిలంగా ఉండేది. మిషన్ భగీరథ స్కీం అమల్లోకి వచ్చాక తాగునీటి సమస్య పరిష్కారం అయింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు దాదాపుగా తాగునీరు అందుతోంది. 85 గొత్తికోయల గ్రామాలకు గాను 75 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నాం.10 గ్రామాలకు అటవీశాఖ అనుమతి లేనందున పైపులైన్ నిర్మించలేకపోయాం. –తిరుమలేశ్వరరావు, ఇంట్రా విలేజ్ ఈఈ -
నీటికోసం బావి చుట్టూ మహిళలు
-
వన్య ప్రాణులకు జీవధార
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందేవి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్ డ్యామ్‌ల ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటి తొట్టెల్లో వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తెచ్చి నింపుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. నీటి తొట్టెల పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు ఆ నీరు తాగి.. ఉప్పు ముద్దను నాకుతాయని.. దీనివల్ల వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలుంటాయని అటవీశాఖ అధికారులంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. పాపికొండల అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, జాకర్స్, దున్నలు వంటి అనేక జంతువులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి సమస్య తలెత్తకుండా చర్యలు పాపికొండల అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీరు పోసి నింపుతున్నాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చదవండి: పూర్తి చేసేది మేమే వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. -
మంత్రి బాలినేని చొరవ.. రోజూ నీళ్లొచ్చేలా మెగా ప్లాన్
గుక్కెడు నీటి కోసం ఒంగోలు నగర ప్రజలు నానా తంటాలు పడాల్సిందే. నాలుగు రోజులకు ఒకసారి ఇచ్చే మంచినీటి కోసం ఎదురుచూపులే. శివారు కాలనీల్లో మంచినీటి ట్యాంకర్లు వస్తే తప్ప నీరందని దుస్థితి. పట్టణం ఆవిర్భావం నుంచి ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టేలా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మెగా తాగునీటి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రూ.409 కోట్లు ఖర్చయ్యే ఈ పథకాన్ని సీఎం జగన్ మంజూరు చేయడంతో నగరవాసుల క‘న్నీటి’ కష్టాలకు తెరపడనుంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. జిల్లా కేంద్రం నలుదిశలా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా నీటి అవసరాలూ పెరుగుతున్నాయి. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించారు. ముందుచూపుతో భారీ రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. మెగా మంచినీటి ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేశారు. నగర పాలక సంస్థ అధికారులతో మొత్తం రూ.409 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించారు. రెండు రోజుల క్రితం ఒంగోలుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. వెంటనే స్పందించిన సీఎం పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నగర ప్రజల దశాబ్దాల సమస్య తీరనుంది. ఇదీ ప్రణాళిక... ఈ పథకం పూర్తయితే నాలుగైదు రోజులకు వచ్చే మంచినీటికి æఇక చెక్ పడ్డట్టే. ప్రతి మనిషికి 135 లీటర్ల చొప్పున నగర ప్రజలందరికీ ప్రతిరోజూ రక్షిత మంచినీటిని అందించవచ్చు. ప్రస్తుతం నగరంలో దాదాపు 3 లక్షలకు పైగా జనాభా నివశిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలో 2,65,746 మంది ఉన్నారు. నగరంలో విలీనమైన గ్రామాలకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా సంవృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం నగరానికి రామతీర్థం నుంచే సాగర్ నీళ్లు వస్తున్నాయి. నగరంలోని రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులతో పాటు రంగారాయుడు చెరువు నుంచి ప్రస్తుతం తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థకు భిన్నంగా నగరానికి రామతీర్థం నుంచే నీటిని సరఫరా చేయటానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా నగరం వరకు నీటిని సరఫరా చేయటానికి మొత్తం రూ.107 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు పైప్‌లైన్ వ్యవస్థను రూపొందించనున్నారు. రామతీర్థం రిజర్వాయర్‌లో 18 మీటర్ల వ్యాసార్థంతో ఇన్‌టేక్ వెల్‌తో పాటు పంపు హౌస్‌ను నిర్మించనున్నారు. రిజర్వాయర్‌లోనే ఇన్‌టేక్ వెల్ కోసం కాపర్ డ్యాంను నిర్మిస్తారు. అక్కడే సర్వీసు బ్రిడ్జితో పాటు, 150 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఆరు పంప్ సెట్లతో పాటు నీటిని పంపింగ్ చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. అక్కడి వరకు దాదాపు రూ.5.50 కోట్ల వరకు వెచ్చించనున్నారు. చీమకుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు దాదాపు 16 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్‌ను ప్రత్యేకంగా వేయనున్నారు. డ్యాం వద్ద నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు అప్రోచ్ రోడ్డు, 900 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకును కూడా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అక్కడ నుంచి ఒంగోలు వరకు నీటిని సరఫరా చేయటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లకు సంబంధించి మొత్తం రూ.107 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. రీ మోడల్‌కు రూ.302 కోట్లు నగరంలోని మంచినీటి వ్యవస్థను మొత్తాన్ని రీ మోడల్ చేయటానికి దాదాపు రూ.302 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇంటింటికీ మంచినీరు సరఫరా చేసేందుకు మొత్తం 28 జోన్లుగా విభజించారు. కొత్తగా నగరంలో కలిసిన నగర శివారు గ్రామాలు, విలీన గ్రామాలన్నింటినీ కలుపుకొని ఈ నూతన విధానానికి రూపకల్పన చేశారు. ఈ మెగా మంచినీటి ప్రాజెక్టు కోసం 28 జోన్లలో కొత్తగా 12 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించ తలపెట్టారు. ఒంగోలు నగరం నలుదిశలా వీటిని ఏర్పాటు చేయాలి. ఒక్కో ట్యాంకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం నుంచి 700 కిలో లీటర్ల సామర్ధ్యం వరకు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత ట్యాంకుల నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వాటిని వాడాలా, వద్దా అన్న దానిపై కూడా లోతుగా అధ్యయనం చేశారు. భవిష్యత్తులో నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాల్సి వచ్చినా మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థ మొత్తం రీ మోడల్ దిశగా ప్రణాళికలు రూపొందించారు. అమృత్ పథకానికి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించిన మంత్రి బాలినేని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘‘అమృత్’’ పథకాన్ని టీడీపీ పాలకులు మధ్యలోనే వదిలేశారు. నిధులు లేవని గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన పథకం పనులు నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కమీషన్ల కక్కుర్తితో ఈ పథకం మధ్యలోనే నిలిచిపోయింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బాలినేని అమృత్ పథకం పూర్తి చేయటానికి ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించారు. దీంతో ఆగిపోయిన పథకం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పథకంలో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించనున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు అడిగిన వెంటనే ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సిద్ధం చేసిన మెగా మంచినీటి పథకాన్ని స్వయంగా సీఎం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఒంగోలు నగర ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఈ పథకంతో నగర రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు ప్రజలు మంచినీటి కోసం పడుతున్న కష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం ఒంగోలు నగర ప్రజలతో పాటు రుణపడి ఉంటా. – బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మంత్రి -
ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..
జూలూరుపాడు: వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ స్వగ్రామం ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనుకతండా గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. నీళ్ల కోసం ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనకతండా గ్రామంలో రెండు వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. రెండు వారాల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఈ విషయాన్ని సర్పంచ్, ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వివరించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. గ్రామంలో చేతి పంపులు కూడా పని చేయడంలేదని, బిందె నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమని సర్వేల్లో తేలింది) చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల -
పల్లెల్లో పట్నం పేదల పాట్లు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న వారంతా నీళ్లు పడక జ్వరాల పాలవుతున్నారు. చాలామంది కూలీలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు పట్టణాల్లో సరైన ఉపాధి లేక, ఇంటి అద్దెలు కట్టలేక సొంత ఊళ్లో కలో, గంజో తాగి బతుకుదామని గ్రామాలకు చేరుకున్నారు. అయితే, వారిని అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో అది కరోనా అనే ఆం దోళన చెందుతున్నారు. నీళ్లు పడకపోవడంతో సమస్యలు: పట్నాల్లో ఉన్నప్పుడు సురక్షితమైన నీరు అందుబాటులో ఉండడంతోపాటు మినరల్, ఫిల్టర్ వాటర్ వాడి న జనం పల్లెలకు వెళ్లిన తర్వాత అందుబాటులో ఉన్న నీటికి వెంటనే అలవాటు పడలేకపోతున్నారు. దీంతో గొంతు నొప్పి, జలుబు, జ్వరాలు పీడిస్తున్నాయి. గతంలో పండగకో, పబ్బానికో ఊళ్లకు వెళ్లినా మహా అయితే రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండేవారు కాదు. ఆ పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా నెలలు తరబడి ఉండాల్సి వస్తోంది. దీంతో అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలవుతున్నారు. బయటకు చెప్పుకోలేక..: జ్వరం, గొంతునొప్పి లాంటి సమస్యలకు డాక్టర్ల సలహా ప్రకారం ఇంట్లోనే మందులు తీసుకుంటున్నవారు పక్కింటివారికి కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. జ్వరమొచ్చిందని తెలిస్తే ఎక్కడ వెలివేసినట్టు చూస్తారో లేక ఊళ్లో నుంచి వెళ్లిపొమ్మంటారేమోనన్న భయంతో ఇంటి నుంచి బయటకు రాకుండా గడుపుతున్నారు. కరోనా టెస్టులు చేయించుకోడానికి భయపడుతున్నారు. ‘గత పదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నా. రోజూ లేబర్ అడ్డాల వద్ద దాదాపు 20 నుంచి 25 మంది ఉంటాం. అయితే కరోనా తగ్గుతుందేమోనని మూడు నెలలు ఎదురుచూసి ఈ మధ్యే మా సొంత ఊరికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చినంక నీళ్లు, వాతావరణం పడక జ్వరం వచ్చింది. బయటకు ఎళ్లలేక, ఇంట్లనే ఉంటూ మందులు మింగుతున్న’ – మహబూబ్ నగర్‌కు చెందిన మాసన్న మినరల్ వాటర్ మేలు.. పల్లెలకు వెళ్లినప్పుడు కొద్ది రోజులపాటు మినరల్ వాటర్ వాడటం మేలు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ -
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం
సిడ్నీ : ఆస్ట్రేలియాలో అంటుకున్న కార్చిచ్చు ప్రస్తుతం ఆ దేశాన్ని అతలాకుతులం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలుసా.. అయిదు రోజుల ప్రచారంలో భాగంగా ఆస్ట్రేలియాలోని 10వేల ఒంటెలను చంపాలని నిర్ణయించారు. కాగా బుధవారం నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం కార్చిచ్చుతో పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో వేడిని భరించలేక ఒంటెలు ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నాయి. అందుకే వాటిని చంపేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒంటెలను చంపడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇదే అంశమై అనంగు పిజంజజరా యకుంనిజజరా(ఏపీవై) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ మరీటా బేకర్ స్పందిస్తూ.. ‘కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడిపోతుంది. దీనికి తోడు కార్చిచ్చు ద్వారా వస్తున్న వేడి , అసౌకర్య పరిస్థితులతో కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాము. ఒంటెలు మా కంచెలను పడగొట్టి ఇళ్ళలోకి ప్రవేశించి విచ్చలవిడిగా నీరు తాగడంతో పాటు ఏసీలను పాడు చేసి అందులోని నీటిని తాగుతూ తమ దాహర్తిని తీర్చుకొని వెళ్లిపోతున్నాయి. ఈ సమయంలో ఒంటెలు విడుస్తున్న వ్యర్థాల వల్ల వచ్చే దుర్వాసనను మేము భరించలేకపోతున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.(కార్చిచ్చు ఆగాలంటే.. వర్షం రావాల్సిందే) గత నవంబర్‌లో కార్చిచ్చు అంటుకొని ఆస్ట్రేలియాలో పరిస్థితి అతలాకుతులమయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు కనీస నీటి అవసరాలు మిగల్చకుండా ఇళ్లపై దాడి చేస్తూ ఒంటెలు నీళ్లు తాగుతున్నాయి. అందుకే చట్ట బద్ద ప్రణాళికంగానే 10వేల ఒంటెలను చంపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపానికి 12 మందికి పైగా తమ ప్రాణాలు పోగొట్టుకోగా, 480 మిలియన్ల జంతువులు కార్చిచ్చుకు బలైనట్లు తమ పరిశోధనలో తేలిందని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశధకులు అభిప్రాయపడ్డారు. -
అన్నిసార్లొద్దు: డొనాల్డ్ ట్రంప్
అమెరికాలో వాటర్ ప్రాబ్లమ్! అవును. అమెరికాలోనే. అమెరికాలో ఓసారెప్పుడో కరెంట్ పోయింది. అప్పుడూ ఇంతే.. అమెరికాలో కరెంటు పోయిందా అని ముక్కుమీద వేలేసుకున్నాం. అమెరికా ఆకాశంలో ఎక్కడో లేదు. ఈ భూమి మీదే ఉంది. అమెరికన్లు ఎవరో కాదు. మనలా మానవులే. ఆ మానవుల్లో అతి మామూలు మానవుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు అయితే కావచ్చు. అతడి బాత్రూమ్లోనూ ట్యాప్‌లోంచి ఈమధ్య నీళ్లు రాలేదు! సిస్టమ్ ఎక్కడో దెబ్బతినిందని ట్రంప్‌కి అర్థమైంది. బాత్రూమ్ సిస్టమ్ కాదు. అమెరికన్ వాటర్ సేవింగ్ సిస్టమ్. వెంటనే ఒక ఆర్డర్ జారీ చేసి.. వాష్‌రూమ్‌లకు వెళ్లేవాళ్లంతా పనైపోయాక ట్యాప్ కట్టేయాలని సర్క్యులర్ జారీ చేయించారు. అమెరికన్లు ఒకసారి టాయ్‌లెట్‌కి వెళితే పదిసార్లు ఫ్లష్ కొట్టి వస్తారని, ఆ పాడు అలవాటు ఎంత త్వరగా మానుకుంటే అంత త్వరగా అమెరికాలో నీటి కొరత తీరుతుందని కూడా ట్రంప్ చిన్న టిప్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకో టిప్ కూడా. సింకులూ, షవర్లు వాటర్‌ని వృథాగా పోనివ్వకుండా కొత్తవాటిని బిగించుకోవాలి– అని!! -
నీళ్లు తాగకుండా మందులా..?
టొరంటో: తగినంత నీరు తాగకపోవటమూ కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది!! మరి అలాంటి వారు ఇతరత్రా మందులు తీసుకుంటే అది కిడ్నీని మరింత దెబ్బ తీస్తుందా? ఇదిగో... ఇలాంటి విషయాల్ని లోతుగా శోధించే కొత్త ‘కంప్యూటర్ కిడ్నీ’ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ‘అధిక రక్తపోటు ఉన్న వారికి నీటితో కూడిన మాత్రలిస్తారు. దాంతో వారు ఎక్కువగా మూత్రవి సర్జన చేస్తారు. అలా వారి రక్త పోటు అదుపులోకి వస్తుంది’ అని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనితా లేటన్ చెప్పారు. ఈ పేషెంట్లకు హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపే మరో మందును కూడా తరచు ఇస్తారు. దాంతోపాటు ఆస్ప్రిన్ కూడా ఇస్తుంటారు. ఇవనీన కిడ్నీపై ప్రభావం చూపిస్తుంటాయి. ‘శరీరంల్లో నీరు తక్కువయినప్పుడు అతితక్కువ నీటితో మూత్ర విసర్జన జరిగేలా చేసేది కిడ్నీయే. కాకపోతే వృద్ధులు, కిడ్నీ సమస్యలతో మందులు తీసుకునేవారు ఇబ్బంది ఎదుర్కోవచ్చు. మూత్రాన్ని కిడ్నీ నుంచి బ్లాడర్‌కు తీసుకెళ్లే కండరాలు సరిగా సంకోచించకపోవటమే దీనికి కారణం’ అని చెప్పిన లేటన్... ఈ సంకోచాల స్టిమ్యులేషన్‌ను లెక్కించే తొలి మోడల్‌ను రూపొందించారు. కిడ్నీకి కాంబినేషన్ మందులు తీసుకునే వారు తగినంత నీటిని తప్పకుండా తీసుకోవాలని, లేనట్లయితే ఆస్ప్రిన్‌తో కిడ్నీ దెబ్బతింటుందని తమ కంప్యూటర్ మోడల్ గుర్తించిందన్నారు. -
వేంపల్లిలో త్రాగునీటిని సమస్యను తీర్చిన ప్రభుత్వం
-
ప్రశ్నార్థకంగా ఖరీఫ్!
సాక్షి, మహబూబ్‌నగర్ : ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఎన్నో ఆశలతో రైతులు ఖరీఫ్‌లో వరిసాగు చేసి భంగపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా చెప్పుకోదగ్గ పెద్ద వర్షం కురవనేలేదు. చెరువులు, కుంటలు కంపచెట్లతో దర్శనమిస్తున్నాయి. బోరు బావుల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇదివరకే వేసిన వరి పొలాలు నెర్రెలుబారి కనిపిస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరదలు వచిచనా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల అవుతుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగులుతోంది. సాంకేతిక కారణాలతో పంపింగ్ నిలిచిపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. 8 వేల హెక్టార్లలో వరిసాగు వర్షాకాలం ప్రారంభంలో జిల్లాలో దామరగిద్ద, నారాయణపేట, మద్దూరు, కోస్గి, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ మండల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. మరికల్, ధన్వాడ, నర్వ మండల్లాలో వర్షాపాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా జూలై, ఆగస్టు మాసాల్లో ఇప్పటివరకు 8 వేల హెక్టార్లకు పైగా వరినాట్లు వేశారు. కానీ వర్షాలు కురవక.. కోయిల్‌సాగర్ సాగునీరు రాక ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బోరుబావుల్లో కూడా నీరు తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే వరినాట్లు వేసిన రైతుల బోర్లలో నీళ్లులేక ట్యాంకర్లు తెప్పించుకుని నారును తడుపుతున్నారు. ఎరువులు, కూలీ ధరలు పెరిగి పెట్టుబడి ఖర్చు అధికమైందని రైతులు ఆందోళన చెందుతుంటే నీళ్లను కొనుక్కుని వేయడం వారికి అదనపు భారంగా మారింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తే కొంతవరకైనా పంటలను కాపాడుకునే పరిస్థితి ఉంది. కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలని రైతులు వారం రోజుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారిగోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం బోర్లు ఉన్న రైతులు మాత్రమే కేఎస్పీ ఆయకట్టు కింద వరినాట్లు వేస్తున్నారు. మిగితా రైతులు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి నీటి విడుదల కోసం వేచి ఉన్నారు. సాంకేతిక లోపం రైతులకు శాపం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. జూరాల నుంచి వరదనీరు తన్నుకు వస్తున్నా తీలేర్ పంపింగ్ వద్ద ఎత్తిపోతల మోటార్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆది వారం అర్ధరాత్రి మళ్లీ రెండు పంపులు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఇంజనీర్లు అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. పంపులు ప్రారంభమైన 11 రోజుల వ్యవధిలోనే ఇలా ఆటంకా లు ఎదురు కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా గతంలో ఇలాగే సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఉంద్యాల, తీలేర్ పంపుహౌస్‌ల వద్ద కేవలం ఒకటీరెండు రోజుల్లో సరిచేసేవారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ కంపెనీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండిం గ్ బకాయిలు రాకపొవడంతో వారు కోయిల్‌సాగర్ ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నెలరోజుల క్రితం కోయిల్‌సాగర్ ఎత్తిపోతల బాధ్యతలను పవర్ సెల్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. మోటార్లకు సంబంధించిన టెక్నిషన్ సమస్యలు వారికి కొత్త కావడంతో నీటి పంపింగ్‌కు బ్రేక్ పడుతోంది. ఈ విషయంపై ప్రాజెక్టు డీఈ నాగిరెడ్డి వివరణ ఇస్తూ రాత్రి వరకు రెండు పంపులను సరిచేసి ప్రారంభిస్తామన్నారు. చెరువులను నింపండి తీలేర్ పంపుహౌస్ నుంచి వస్తున్న నీటితో పూర్తి స్థాయిలో చెరువులను నింపితే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. రూ.30 వేల పెట్టుబడి పెట్టి వరినాట్లు వేశాను. బోరులో ఇంకిపోవడంతో నీళ్లు పట్టే పరిస్థితి లేదు. పొలమంతా నెర్రెలు విచ్చింది. కనీసం కోయిల్‌సాగర్ నీటితోనైనా చెరువులను నింపితే పంటలను కాపాడుకుంటాం. – గొల్ల రాజు, కౌలు రైతు, మరికల్ -
గ్రేటర్ గొంతెండుతోంది..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ శివార్లలోని పలు ప్రాంతాల్లో బోరుబావులు చుక్కనీరు లేక బావురుమంటుండటంతో జలమండలి నల్లా నీళ్లు ఏమూలకూ సరిపోవడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నీటి కష్టాలు నగరవాసికి పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు ఇంటి అద్దెలకు దాదాపు సమానమైన మొత్తాన్ని ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు వెచ్చించి జేబులు గుల్లచేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 460.88 మిలియన్‌గ్యాలన్ల కృష్ణా, గోదావరి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాలను సరఫరా చేసినా నీటి డిమాండ్ 560 మిలియన్ గ్యాలన్ల మేర ఉంది. సుమారు వంద ఎంజీడీల నీటికి కొరత ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో కన్నీటి కష్టాలు దర్శనమిస్తున్నాయి. జలమండలి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 460.88 మిలియన్ గ్యాలన్ల నీటిలోనూ 40 శాతం మేర సరఫరా, చౌర్యం తదితర నష్టాల కారణంగా వాస్తవ సరఫరా 276 మిలియన్గ్యాలన్లు మించడంలేదు. అంటే కోటికి పైగా జనాభాతో అలరారుతోన్న సిటీలో ప్రతీవ్యక్తికి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ప్రైవేటు ట్యాంకర్ నీళ్లు (ఐదు వేల లీటర్ల నీరు)కు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.2–5 వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. పలు గేటెడ్‌కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల సముదాయాలున్న అపార్ట్మెంట్లలో ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు నెలకు లక్షల్లో వ్యయం చేస్తుండడం గమనార్హం. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏడాదిగా తీవ్ర వర్షాబావ పరిస్థితులు, జలమండలి అరకొరగా నీటిని సరఫరా చేస్తుండడంతో జనం బాధలు వర్ణనాతీతంగా మారాయి. వేలు చేల్లించినా ప్రైవేట్ నీటి ట్యాంకర్లు దొరకని దుస్థితి నెలకొంది. ఐటీ కారిడార్‌లో బస్తీలకు రెండు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. అపార్ట్మెంట్లకు, వాణిజ్య నల్లా కనెక్షన్లకు భారీగా నీటి కోత విధిస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో నివాసం ఉండే వారు ట్యాంకర్ నీళ్లకు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాలలో 1500 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు కనిపించడం లేదు. కొండాపూర్‌లోని గౌతమీ ఎన్క్లేవ్ ఇంకుడు గుంతలు ఎన్నో ఏర్పాటు చేశారు. గత సంవత్సరం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. గౌతమీ ఎన్‌క్లేవ్‌లో దాదాపు 60 అపార్ట్మెంట్లు ఉన్నాయి. రోజు 5000 లీటర్ల ట్యాంకర్లు 100కు పైగానే కొనుగోలుచేస్తున్నట్లు గౌతమీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసిసియేషన్ అధ్యక్షులు యలమంచలి శ్రీధర్ తెలిపారు. 5000 లీటర్ల ట్యాంకర్‌కు 2 వేలపైనా, 10 వేల ట్యాంకర్‌కు 4వేలకు పైన వసూలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో 5000 లీటర్ల ట్యాంకర్‌కు 3 వేలు, 10 వేల ట్యాంకర్‌కు 6 వేలు వసూలు చేస్తున్నారు. సీజన్లో రూ.600 ఉండే 500 లీటర్ల ట్యాంకర్ ఖరీదు రెండు వేలకు పైనే ఉందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అరకొర నీటి సరఫరా గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు వెయ్యి కుంటుంబాలు నివాసం ఉంటాయి. ప్రతి రోజు జలమండలి 1400 కేఎల్ నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఈ నెల 13న 407.59 కెఎల్, 14న 281.17 కెఎల్, 15న 140.23 కెఎల్, 16న 208.17 కెఎల్, 17న 80.26 కెఎల్, 18న 408.93 కెఎల్, 19న కేవలం 8.33కెఎల్ నీటిని సరఫరా చేసింది. అవసరం మేరకు నీటి సరఫరా సరగకపోవడంతో స్థానికులు జలమండలి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్లో అక్రమ నీటి వ్యాపారం నిర్వహిస్తున్న బోర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. దీంతో పటాన్ చెరువు శివారు గ్రామాలు, శంకర్పల్లి మండలంలోని గ్రామాలు, తెల్లాపూర్ నుంచి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దూరం నుంచి రావడంతో ఖర్చు పెరుగుతోందని ట్యాంకర్ నిర్వాహకులు చెబుతున్నారు. కూకట్పల్లి ప్రాంతంలో.. కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో రెండు ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఇదే దుస్థితి నెలకొంది. కేపీహెచ్‌బీకాలనీలోని మలేషియాటౌన్షిప్లో తీవ్ర నీటి ఎద్దడి. ఈ ఏడాది మార్చి–జూన్ వరకు జలమండలికి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించినప్పటికీ సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్చినెలలోనే జలమండలికి తాగునీటి కోసం 6.7లక్షలు బిల్లు రూపంలో చెల్లించగా, బయటి నుంచి సుమారు 285 ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసినందుకు రూ.5.8లక్షలు చెల్లించినట్లు స్థానికులు తెలిపారు. నీటి సరఫరాలో విఫలం 15 రోజులకోసారి నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. 40 ఫ్లాట్లు ఉన్న మా అపార్ట్‌మెంట్‌కు నెలకు 436కెఎల్ సరఫరా చేయాల్సి ఉండగా 100 కెఎల్ కూడా సరఫరా చేయడం లేదు. బోర్లన్నీ ఎండిపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అత్యవసర సమయంలో ట్యాంకర్ యజమానులు డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారు. – కిరణ్, ప్రీస్టైన్ అపార్ట్మెంట్ గౌతమి ఎన్క్లేవ్ జలమండలి నీరు 60శాతం తగ్గకుండా సరఫరా చేయాలి జలమండలితో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోయినా కనీసం 60శాతానికి తగ్గకుండా సరఫరా చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా కేవలం 30 నుంచి 40శాతం నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో మేము లక్షలు వెచ్చించి బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలుచేయాల్సిన దుస్తితి తలెత్తింది. – శ్రీకాంత్‌రెడ్డి, ఇందూ ఫార్చ్యూన్ఫీల్డ్స్ గార్డెనీయా అధ్యక్షుడు -
బాధ్యతగా పనిచేద్దాం.. జవాబుదారీగా ఉందాం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘ప్రజాధనంతో వేతనం పొందుతున్నాం... బాధ్యతగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉందాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మెరుగైన సేవలు అందించాలి. వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. నవరత్నాలు అమలు ద్వారా ప్రజాసంక్షేమానికి కృషి చేయాలి’ అని కలెక్టర్ ఎస్. సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ డిల్లీరావుతో కలిసి జిల్లా అధికారులతో నేరుగా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి అధికారులు పనిచేయాలన్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ పూర్తయిన తరువాత మండల స్థాయి అధికారులు డ్వామా, డీఆర్డీఏ అధికా రులు, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశా, ఉపాధ్యాయులు కీలకమన్నారు. సమన్వయంతో విధులు నిర్వర్తిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉండదన్నారు. పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ సమయాన్ని వృథా చేయకుండా పనిచేయాలని సూచించారు. చిన్నారుల మరణాలు పునరావృతం కానీయొద్దు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరుగురు చిన్నపిల్లలు చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్‌సెంటర్ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశా వర్కర్ సమన్వయంతో పనిచేసి శిశుమరణాలను నియంత్రించాలన్నారు. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయని, పూర్తిగా పడేంత వరకు భూగర్భ జల మట్టం పెరగదన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి నివారణ కోసమే ఖర్చు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించండి ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు విరివిగా పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి కుంటలు, కందకాల నిర్మాణ పనులు కల్పించాలని ఆదేశిం చారు. సంక్షేమ శాఖలకు సంబంధించి రుణాల మంజూరులో ఎల్డీఎం కీలక పాత్ర పోషించాలన్నారు. మండల స్థాయిలో జేఎంఎల్టీసీ సమావేశాలను ఏర్పాటు చేసి రుణాల మంజూరు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తన వేరుశనగ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జేడీఏ హబీబ్‌బాషాను ఆదేశించారు. అధికారులకు మెమోలు ఇవ్వండి ‘మీ కోసం’ కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గుడిబండ, వజ్రకరూరు, తనకల్లు, ఆమడగూరు, అమరాపురం, డి.హీరేహాళ్ ఎంపీడీఓలు, తహసీల్దార్లు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌కు వస్తుంటే, అధికారులు సమయానికి హాజరుకాకపోతే ఎలాగని ఆగ్రహించారు. గ్రీవెన్స్‌కు హాజరుకాని ఎంపీడీఓలు, తహసీల్దార్లకు మెమోలు జారీ చేయాలని జెడ్పీ సీఈఓ, డీఆర్‌ఓని ఆదేశించారు. -
మంచినీటికి ‘మహా’ కష్టం
అసలే వేసవి కాలం.. చుక్క నీటిని సైతం జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాల్సిన పరిస్థితి. ఉన్న నీటి వనరులతో ఈ ఎండాకాలాన్ని ఎలాగైనా గట్టెక్కించాలన్న మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులకు పుండు మీద కారం చల్లినట్టు ఏలేరు కాల్వకు పడిన గండి వల్ల నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కాలువలో నీటి ప్రవాహం తగ్గకపోవడంతో గండి పూడ్చే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో గ్రేటర్ పరిధిలో నీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖసిటీ :ఏలేరు కాలువ ద్వారా నగర వాసుల వేసవి కష్టాలు గట్టెక్కుతాయని ఊపిరి పీల్చుకున్న మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అన్ని రిజర్వాయర్లూ ఖాళీ అయిపోవడంతో ఉన్న ఒకే ఒక్క వనరైన ఏలేరు నుంచి వస్తున్న నీటితో నగరంలో నీటి సరఫరాను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. వర్షాకాలం వరకూ ఈ నీటితోనే ప్రజల అవసరాలు తీర్చాలని భావించిన జీవీఎంసీకి గండి రూపంలో అవరోధం ఎదురైంది. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఏలేరు కాల్వకు పడిన గండి కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు రోజులుగా 220 ఎంజీడీల మంచినీరు వృథా అయ్యింది. అంటే.. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు రెండు రోజుల పాటు వినియోగించే నీరంతా వృథాగా పోయింది. దీంతో పరిస్థితి ఒక్కసారి తల్లకిందులుగా మారింది. ఈ గండి వల్ల రాబోయే రోజుల్లో నీటి సరఫరా మహా కష్టంగా మారే ప్రమాదముంది. మరో గండి కొట్టినా.. రాచపల్లి వద్ద గండి పడి రోజున్నర గడిచినా నీటి ప్రవాహం తగ్గడం లేదు. దీంతో పూడ్చే పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిని తగ్గించేందుకు గండి పడిన చోటుకు 200 మీటర్ల దూరంలో కొండల అగ్రహారం వద్ద గురువారం సాయంత్రం అధికారులు మరో గండి కొట్టారు. శుక్రవారం సాయంత్రం గడిచినా.. ప్రవాహం ఏ మాత్రం తగ్గకపోవడంతో పనులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో నర్సీపట్నం సమీపంలో శుక్రవారం సాయంత్రం మరో గండి కొట్టి నీటిని దారిమళ్లించారు. రాత్రివరకు పనులు ప్రారంభం అయ్యే అవకాశం కనిపించలేదు. ఏలేశ్వరం నుంచి 153 కిలోమీటర్ల దూరంలో గండి పడటంతో ఈ 153కిమీ పొడవునా ఉన్న కాల్వలో నీరు పూర్తిగా పోయేందుకు కొంత సమయం పడుతుందని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఈఈ రాజారావు తెలిపారు. రాచపల్లి వద్ద తాటి దుంగలు వేసి ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేశామన్నారు. అయితే 30 మీటర్ల మేర గండి పడటంతో మధ్యాహ్నం సమయంలో పూడ్చే పని చేసినా అది కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయిందని వెల్లడించారు. దీంతో పనులు పూర్తిగా నిలిపేశామన్నారు. నీటి ప్రవాహం గురువారం అర్ధరాత్రికి తగ్గే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామని, ప్రవాహం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాజారావు వివరించారు. రెండు మూడు రోజులు కష్టమే శుక్రవారం రాత్రి ఏ సమయానికైనా వరద ఉధృతి తగ్గిపోయే ప్రమాదం ఉండటంతో.. గండి పూడ్చేందుకు అవసరమైన యంత్రాంగాన్ని జీవీఎంసీ అధికారులు సిద్ధం చేశారు. కావాల్సిన మట్టి, ఇతర సరంజామాను సిద్ధంగా ఉంచి ప్రవాహం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి మూడు గండ్లూ పూడ్చేయ్యాలని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం పురుషోత్తపట్నం నుంచి నీటిని విడుదల చేసినా.. నగరానికి చేరుకునే సమయానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ నీరు వచ్చేంతవరకూ నగరంలో మంచినీటి సరఫరాకు ఆస్కారమే లేదు. అంటే.. నగరానికి ఆదివారం నుంచి నీటి సరఫరా రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎక్కిళ్లు!
ప్రభుత్వ అలసత్వం..అధికారుల ముందుచూపులేని వ్యవహారం వల్ల పల్లె, పట్టణాల ప్రజలకునీటికష్టాలు తప్పడంలేదు.రాత్రంతా మేలుకున్నా..పగలంతా ఎదురుచూసినా...కొళాయిలోనీటి చుక్క కనిపించడం లేదు. వేసవి ఆరంభానికి ముందు కేవలం 100 గ్రామాల్లోపే సమస్య ఉండగా..అది కాస్త 500కు చేరిందంటే జిల్లాలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందోఅర్థమవుతోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన పల్లెలు సైతం నేడు దాహమో రామచంద్రాఅంటూ గగ్గోలు పెడుతున్నాయి. సాక్షి కడప/ఎడ్యుకేషన్: జిల్లాలో దాహం కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి.నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. కొందరు వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తుండగా..మరికొందరు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.గత ఏడాది ఇదే సమయానికి కేవలం 17 గ్రామాల్లోనే తాగునీటి సమస్య ఉండగా, ఈసారి వందలు దాటింది. ఖరీఫ్‌తోపాటు రబీలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతోనే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. 544 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జిల్లాలో ప్రస్తుతం ఎండలు ముదిరాయి. బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. జిల్లాలో 790 పంచాయతీలకుగాను 4,446మజరా గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద 544 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అధికారులు ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ల వద్ద జనాలు బారులు తీరుతుండడం..సంపూర్ణంగా నీటిని అందుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే స్కీమ్ ద్వారా వస్తే పూర్తి స్థాయిలో ఇంటి అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ట్యాంకర్లు కావడంతో అరకొరగా పట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. 100 గ్రామాలకు అద్దె బోర్లతో నీటి సరఫరా జిల్లాలో తాగునీటి సమస్య నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని పల్లెలకు నీరు అందిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రాయచోటి నియోజకవర్గంతోపాటు బద్వేలు, కమలాపురం, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, మైదుకూరు, పులివెందుల, రాజంపేట ప్రాంతాల్లోని 31 మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. సుమారు 100 గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లలో ఒక్కో బోరుకు రోజుకు రూ. 150 అద్దె చెల్లించి నీటి సరఫరా సాగిస్తున్నారు. పట్టణాలను వేధిస్తున్న సమస్య జిల్లా కేంద్రమైన కడపతోపాటు పలు పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నగరంలోని అనేక కాలనీలకు ఐదారు రోజులకు గాని నీరందని పరిస్థితి నెలకొంది. రాత్రింబవళ్లు మేలుకున్నా నీరు రావడం లేదు. దీంతో వచ్చిన సమయంలోనే డ్రమ్ములకు నింపుకుని పొదుపుగా వాడుకుంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. కడప నగరంతోపాటు జిల్లాలోని పలు మున్సిపాలిటీలను నీటి సమస్య వేధిస్తోంది.ఈరోజు బోరులో నీరు వస్తే రేపు వస్తుందో, రాదో అన్న ఆందోళన అధికారులను వెంటాడుతోంది. ప్రజలపై ఆర్థికభారం కడప నగరంలో ఐదారు రోజులకు ఒకసారి నీరు రావడంతో ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది. ఒక్కో ట్యాంకరును రూ. 500–600 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 26.89 మీటర్ల లోతులో ఉన్నాయి.గత ఏడాది ఇదే సమయంలో 15 మీటర్ల లోతులో ఉండేవి. బిందె నీరు కరువు మా గ్రామంలో గత నెలరోజులుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. గ్రామానికి రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటిని కూడా టీడీపి వారికే పంపుతున్నారు. వైఎస్సార్ కాలనీలో సమస్య ఉన్నా వారికి పట్టడం లేదు. విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు, ఉన్నతాధికారులు స్పందించి తాగునీటిని అందించాలి. – హుస్సేనయ్య, ఆకులనారాయణపల్లె . కాశినాయన మండలం -
ఎండ దెబ్బ.. వీధి కుక్కల వింత ప్రవర్తన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలుమండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలుఅత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరాల నిమిత్తం బయటకు వెళ్తున్న సిటీజనులు వడదెబ్బకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యాచకులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో చాలామంది తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఎండలకు తోడు సరైన నీరు, ఆహారం లభించకపోవడంతో వీధి కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లేవారిపై దాడి చేస్తూ కాటేస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 40–50 మంది కుక్కకాటు బాధితులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వాడుతుండడంతో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఎండలకు వెలవెలబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, ఒకవేళ అనివార్యమైతే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సొమ్మసిల్లితే... సహజంగా మనిషి రోజుకు 7–8 లీటర్ల నీరు తాగాలి. కానీ చాలామంది పని ఒత్తిడితో 2–3లీటర్లు కూడా తాగడం లేదు. ఇదిలా ఉంటే నగరానికి రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు వచ్చి పోతున్నట్లు అంచనా. వివిధ పనులతో జిల్లాల నుంచి ఇక్కడికి రావడం, రోజంతా ఎండలో తిరగడం వల్ల అనేక మంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇలాంటి వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపిన వాటర్, కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యనిపుణుడు చిన్నారుల విషయంలో... సెలవుల నేపథ్యంలో పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా చూడాలి. ఎక్కువసేపు ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10గంటల లోపు, సాయంత్రం 5గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. ఎండలకు త్వరగా దాహం వేస్తుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమటపొక్కుల సమస్య ఉండదు. రోజు రెండుసార్లు చన్నీటి స్నానం చేయించడంతో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో పిల్లలకు చికెన్‌ఫాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలి.– డాక్టర్ రమేశ్ దంపురి, నిలోఫర్ ఆస్పత్రి మంచినీరు తాగాలి... నగరంలో చాలామంది ప్రతిరోజు టూవీలర్‌పై ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా మార్కెంటింగ్ వారు రోజుకు ఐదారు గంటలు రోడ్డుపైనే తిరగాల్సి ఉంటుంది. అతినీలలోహిత కిరణాలు నేరుగా ముఖానికి తగలడం వల్ల ముఖం, చేతులు నల్లగా వాడిపోతాయి. దాహం వేస్తే రోడ్డు పక్కనున్న చలివేంద్రాలు, హోటళ్లు తదితర ఎక్కడి నీరైనా తాగుతున్నారు. అయితే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది. శరీరానికి వేడిమినిచ్చే నల్లని దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం ఉత్తమం. – డాక్టర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి వీధి కుక్కలతో జాగ్రత్త... ఎండ ప్రభావం వీధి కుక్కలపై ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తదితర కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. అసలే కుక్కలకు వేట సహజ లక్షణం. ఆ లక్షణమే వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి కారణమవుతుంది. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదు అవుతుండడానికి కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండాకుళాయి నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. లేదంటే రేబీస్ సోకి చనిపోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి -
పల్లెల్లో భగీరథ ప్రయత్నం
మెదక్ రూరల్: పల్లెల్లో తాగునీటి గోసను అధిగమించేందుకు గ్రామ సర్పంచ్‌లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నీటి సమస్యలు తలెత్తనీయకుండా జవాబుదారితనంగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు పల్లెల్లో కొనసాగుతున్న ప్రయత్నాల పై కథనం.. మెదక్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ వైపు భానుడి భగభగలు మరోవైపు నీటి కోసం తంటాలు పడటం ప్రజలకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ట్యాంకులను ఏర్పాటుచేసింది. పల్లెల్లో సింగూరు నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాని కాలం కరుణించక ఈ సారి వర్షాలు సరిగ్గా కురువలేదు. దీంతో భూగర్భజలాల అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోయాయి. నీటి మట్టం అందనంత కిందికి పడిపోయింది. ప్రభుత్వ, ప్రవేట్ బోర్లు చాలా వరకు ఎండిపోయాయి. దీంతో పల్లెల్లో నీటి కష్టాలు ప్రారంభమవుతున్న తరుణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు అధికారుల సహకారంతో నీటి సమస్యను అధిగమించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటేసిన ప్రజలకు నీటి సమస్య తలెత్తనీయకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ప్రజలు నీటికోసం రోడ్డెక్కకుండా చర్యలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అందరికీ అందాలనే ఉద్ధేశ్యంతో పలు చోట్ల అవగాహన లేమితో కొందరు తొలగించిన చెర్రలను తిరిగి వేయింస్తున్నారు. దీంతో నీరు అందరికి సమానంగా వెళ్తాయి. అలాగే పాడయిన బోర్లను ఫ్లష్షింగ్ చేయించడం, అద్దెకు బోర్లు తీసుకోవడం, లీకేజీలను అరికట్టడం, కట్‌వాల్స్ ఏర్పాటు చేసి నీటినివిడుదల చేయడం వంటి ప్రయత్నాలను చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తనీయకుండా సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తుండటం పట్ల పలువరు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నాము. ఇప్పటికే రెండు బోర్లను అద్దెకు తీసుకోగా, ఇటీవల ఒక బోర్ను వేశాము. నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు చేపడుతున్నాము. గ్రామస్తులందరికీ నీటిని సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పైప్‌లైన్ కలిపాము. నీటి కోసం గ్రామస్తులు రోడ్డు పైకి రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాము. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. – దొడ్లె లక్ష్మి, సర్పంచ్, తిమ్మానగర్ నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు.. వేసవిలో నీటి సమస్యను అధిగమించేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాము. పాడయిన బోర్లను ఫ్లష్షింగ్ చేయించాము. తొలగించిన మిషన్ భగీరథ చెర్రలను వేయించి నీటిని కంట్రోల్ చేశాము. దీంతో రెండు రోజులకోసారి మిషన్ భగీరథ నీళ్ళు అందరికి సమానంగా వస్తున్నాయి. కట్‌వాల్స్ ఏర్పాటు చేశాము. అద్దెకు ఓ బోరును మాట్లాడిపెట్టాము. అదనంగా పైప్‌లను సైతం వేయడం జరిగింది. నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకుంటున్నాము. – సరోజ, సర్పంచ్, మల్కాపూర్ -
తప్పనున్న నీటి తిప్పలు
సాక్షి, దామరచర్ల : మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు దృష్టి సారిస్తోంది. మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా ఈనెల చివరినాటికి అన్ని గ్రామాలకు నీరు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అప్పటిలోగా తాగునీటి సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు వినియోగించనున్నారు. వేసవి వచ్చిందంటే చాలు దామరచర్ల మండల ప్రజల్లో తాగునీటి వెతలు తప్పడం లేదు. ఈఏడాది వేసవి ప్రారంభంలోనే నీటి సమస్య ఎదురైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు పోయడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్యలపై అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. నెలాఖరులోగా మిషన్ భగీరథ నీరు దామరచర్ల మండలంలో ఈనెల చివరి నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనుల వేగాన్ని పెంచారు. మండలంలో మిషన్ భగీరథ పనులకు రూ.25.40 కోట్లు మంజూరయ్యాయి. మండలంలో మొత్తం 71 ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 36 పూర్తయ్యాయని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మండలంలోని 53 ఆవాస గ్రామాల్లో అంతర్గత పైప్లైన్లు వేస్తున్నారు. ఇప్పటికే 49 గ్రామాల్లో పూర్తయ్యాయని, మరో వారంలోగా మిగిలిన 4 గ్రామాల్లోనూ పైపులైన్లు పూర్తికానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీలున్నచోట్ల మరమ్మతులు చేయించి, ఈనెల చివరిలోగా అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ బ్రహ్మం బాబు చెబుతున్నారు. ట్యాంకర్ల ద్వారానీటి సరఫరా మండల ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. దామరచర్ల మండల కేంద్రంలోని ఎర్రనామ్, వీరభద్రాపురం ప్రాంతాలతో పాటుగా తాళ్లవీరప్ప గూడెం, నర్సాపురం, కేశవాపురం, గాంధీనగర్, కల్లేపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దామరచర్ల, తాళ్లవీరప్ప గూడెంలలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి సమస్యలున్న మిగిలిన గ్రామాల్లో సైతం ప్రజలు ఇబ్బందులు పడకుండా నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అవసరమైన చోట్ల రైతుల బోర్లను అద్దెకు తీసుకొని ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. భూగర్భజలాలు పెంచేందుకు చెరువులు నింపాలని ప్రజలు కోరుతున్నారు. -
రైతుకు కన్నీళ్లే!
సాక్షి, తాడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో కేఎల్ఐ కాల్వల ద్వారా వస్తున్న నీటిని ఆశించి రైతులు పొలాలను సిద్ధం చేసుకొని వరిని నాటుకున్నారు. కానీ సాగుచేసుకున్న వరి పంటలు తగినంత నీరు అందకపోవడంతో ఎండుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడడం, పంటలు ఎండిపోవడంతో గత్యంతరం లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు. మండల కేంద్రంలో రామస్వామి అనే రైతు కేఎల్ఐ నీటితో నిండిన కొత్త చెరువు కింద నీరు వస్తుందని ఆశతో రూ.వేలల్లో వెచ్చించి వరి పంట సాగుచేశాడు. కానీ కాల్వల ద్వారా నీరు రాకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. దీంతో సాగు చేసిన వరి పంటలు బీటలు వారి ఎండిపోయింది. రెండు తడుల వరకు నీరు ఉంటే కాస్త పంట పండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఆకునెల్లికుదురు, గుంతకోడూరు, అల్లాపూర్ గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొన్ని గ్రామాల్లో కాల్వల ద్వారా వస్తున్న నీటిని ఆశించి రైతులు సాగు చేసిన వరి పంట ఎండిపోవడంతో పశువులను మేత కోసం వదిలారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎండిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
వెంకటాయపాలెంలో దాహం కేకలు
సాక్షి, వెంకటాయపాలెం(నూజివీడు): మండలంలోని వెంకటాయపాలెంలో ఓసీ ఏరియాలో మంచినీటి సమస్య నెలకొనడంతో స్థానికులు దాహం కేకలు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మంచినీటి కష్టాలు మరింతగా పెరిగాయి. పంచాయతీ బోరుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్ కాలిపోయి నెలరోజులు గడిచినప్పటికీ మరమ్మతులు చేయించలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. దీంతో స్థానికులు మంచినీళ్ల కోసం, వాడుకోవడానికి వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఎన్నిసార్లు పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దాదాపు 50 గృహాల వారికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎస్సీ ఏరియాలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంక్ నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే వస్తున్నాయని, ఆ నీరు తాగడానికి పనికిరావని మహిళలు పేర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఇంకేమీ పట్టించుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల క్రితం మోటర్లో వైరింగ్ కాలిపోవడంతో మరమ్మతుల కోసమని తీసుకెళ్లారే గాని ఇంత వరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడం దారుణం. మరమ్మతులు అయ్యే వరకు నీళ్లు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక పాలన అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో సమస్యను పరిష్కరించలేకపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన బోరుకు మోటర్‌ను బిగించేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేవు నెలరోజుల నుంచి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మోటర్ కాలిపోయి నెలరోజులు అయినా ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. వేసవి వచ్చిన నేపథ్యంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి – పూజారి సుజాత, వెంకటాయపాలెం అధికారులు పట్టించుకోవడం లేదు నెలరోజులుగా నీటి సమస్య ఉంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు గ్రామానికి వస్తున్నారో, రావడం లేదో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటే గ్రామస్తులు ఎలా బతకాలో అధికారులే చెప్పాలి. – షేక్ ఆషా, వెంకటాయపాలెం -
పొంచి ఉన్న నీటి గండం
నూజివీడు: ఎన్నెస్పీ మూడో జోన్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గానికి సాగర్‌జలాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రానున్న వేసవిలో ఈ నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా సాగర్‌జలాలను విడుదల చేసి చెరువులను నింపాల్సి ఉంది. అయితే జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాకు చెందిన వాడైనప్పటికి సాగర్‌జలాలను తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలుండగా, నూజివీడు, ఆగిరిపల్లి మండలాలకు నూజివీడు మేజర్ ద్వారా, చాట్రాయి, ముసునూరు మండలాలకు వేంపాడు మేజర్ ద్వారా సాగర్‌జలాలను సరఫరా చేయాల్సి ఉంది. అయితే జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా గాని, సంబంధిత జలవనరుల శాఖాధికారులు గాని సాగర్‌జలాలను తీసుకురావాలనే ఆలోచన చేస్తున్న దాఖలాలు లేవు. ఎప్పుడో అక్టోబర్‌లో 10 రోజుల పాటు వచ్చిన సాగర్జలాలే తప్ప ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా రాలేదు. మూడోజోన్‌కు షెడ్యూల్ ప్రకారం నవంబరు 15 నుంచి మార్చి 15 వరకు సాగర్‌జలాలు సరఫరా కావాల్సిఉంది. రబీ సీజన్లో ఆరుతడి పంటలకు సాగునీరే కాకుండా, వేసవిలో మంచినీటి ఎద్దడి ఎదురుకాకుండా నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నింపాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తీసుకురాకుండా ఇప్పటివరకు కాలం గడిపేశారు. కొన్ని మండలాలకు ఇంతవరకు అసలు సాగర్‌జలాలు రాలేదు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ప్రతిఏటా ఇదే తంతు జరుగుతోంది తప్ప సాగర్‌జలాలను తీసుకువచ్చిన దాఖలాలు లేవు. బోరుమంటున్న చెరువులు వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, వడగాడ్పులు కూడా ఉధృతంగా వీస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 65 చెరువులను సాగర్‌జలాలతో నింపాల్సి ఉంది. లేకపోతే గ్రామాల్లో భూగర్భజలాలు పడిపోవడంతో పాటు మనుషులకు, పశువులకు నీళ్లు దొరకని పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సాగర్‌జలాలు రప్పించి చెరువులను నింపాలని రైతులు కోరుతున్నారు. -
నారా లోకేశ్‌కు నిరసన సెగ
సాక్షి, నరసాపురం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో బుధవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై ఖాళీ బిందెలను ఉంచి నిరసన తెలిపారు. సుమారు 200 కుటుంబాలకు పైగా నివసిస్తున్న తమ కాలనీలో తాగునీటి సదుపాయం లేదని మంత్రి వద్ద ధ్వజమెత్తారు. పూర్తిగా ఉప్పునీటి మయమైన తమ ప్రాంతానికి పక్క గ్రామమైన వేములదీవి నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అవుతున్నప్పటికీ.. అవి కూడా తరచూ పైపులైన్లు పాడై నీరు ఉప్పగా ఉంటుందని చెప్పారు. అదికూడా రెండు రోజులకోసారి కేవలం అరగంట పాటు మాత్రమే ఇస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలు తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. అనంతరం కాన్వాయ్ ముందుకు సాగింది. -
నగరానికి నీటికష్టం
మహా నగరానికి మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రేటర్ పరిధిలో నీటికష్టాలు తరుముకొస్తున్నాయి. విశాఖ వాసులకు తాగునీటిని సరఫరా చేస్తున్న రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో.. ఏలేరు నుంచి వచ్చే గోదావరి జలాలపైనే ఆశలున్నాయి. దీంతో వేసవి నాటికి నగర ప్రజలకు తాగునీటి కష్టాలు మరింత ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ముందు జాగ్రత్తగా డిసెంబర్ నుంచి పరిశ్రమలకు అందించే నీటిలో 25 శాతం కోత విధించాలని జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ తరహాలో బల్క్ కనెక్షన్లకు నీటి సరఫరాలో కోత విధించడం తొలిసారి కావడం చూస్తుంటే.. పరిస్థితి ఎంత దుర్భిక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ సిటీ: అంతర్జాతీయ నగరంగా, ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెబుతున్న పాలకులు.. నగరానికి కావాల్సిన నీటి వనరులను పెంపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పాతికేళ్లుగా అదనపు నీటి వనరులు సమకూర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. ఫలితంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్ అధికారులు తలకిందులవుతున్నారు. 8 లక్షల జనాభా ఉన్నప్పుడు ఉన్న వనరులతోనే సుమారు 24 లక్షల జనాభా ఉన్న నేటి నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది కురవాల్సిన దానికంటే కనిష్ట స్థాయిలో వర్షాలు కురవడంతో ఆయా వనరుల్లో నీటి నిల్వలు పెరగలేదు. ఫలితంగా వేసవి రాకముందే అవన్నీ ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఏలేరు, రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం కాల్వల ద్వారా నగరానికి తాగునీటి అవసరాలకు 80 ఎంజీడీలు అవసరం ఉండగా.. నీటి వనరుల లభ్యత బట్టి కేవలం 67.3 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది. ఇందులో శివారు ప్రాంతాలైన ఆరిలోవ, విశాలాక్షినగర్, తోటగరువు, ముడసర్లోవ, చినగదిలి తదితర ప్రాంతాలకు నీటిని అందించే ముడసర్లోవ రిజర్వాయర్ నీటిమట్టం కనిష్ట స్థాయికి సమీపిస్తోంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నుంచి రోజుకి 0.5 ఎంజీడీ నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ గరిష్ట నీట మట్టం 169 అడుగులు కాగా.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా 157 అడుగులకు పడిపోయింది. ఈ నీటి వనరులు ఏప్రిల్ నెలాఖరు వరకు సరిపోతాయి. ఆ తర్వాత శివారు గ్రామాల పరిస్థితి ఏమిటన్నది అంతు చిక్కడంలేదు. అన్ని రిజర్వాయర్లలో అదే పరిస్థితి వర్షాభావ పరిస్థితుల కారణంగా ఒక్క ముడసర్లోవే కాకుండా మిగిలిన కెనాల్స్ పరిస్థితీ అదే మాదిరిగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ప్రకారం ఏప్రిల్ నెలాఖరు వరకు నెట్టుకొచ్చేయ్యొచ్చు. ఆ తర్వాత పరిస్థితేంటన్నది అగమ్యగోచరంగా మారనుంది. వీటిలో ఒక్క ఏలేరు కాల్వ నుంచే 80 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా అవుతోంది. అయితే.. మార్గమధ్యంలో రైతుల దారిమళ్లింపు, లీకుల వల్ల దాదాపు 20 ఎంజీడీల నీరు వృథా అయిపోతుండగా.. కేవలం 65 ఎంజీడీలు మాత్రమే అందుతున్నాయి. ఇందులో 35 ఎంజీడీలు స్టీల్ ప్లాంట్‌కు, 10 ఎంజీడీలు ఏపీఐఐసీ, గంగవరం పోర్టు, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలకు అందిస్తున్నారు. మిగిలిన 20 ఎంజీడీలు నగర ప్రజల తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. దీంతోపాటు రైవాడ నుంచి 25 ఎంజీడీలు, మేఘాద్రిగడ్డ నుంచి 8.5, గోస్తనీ నుంచి 3.5, తాటిపూడి నుంచి 11 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. అయితే.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను చూస్తుంటే.. త్వరలోనే ఈ సరఫరా పూర్తిగా తగ్గిపోయే ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఒక్క ఏలేశ్వరంలో తప్ప.. మిగిలిన రిజర్వాయర్లన్నీ అథమ స్థితికి చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఏలేరులో 85.97 మీటర్ల గరిష్ట నీటిమట్టం ఉంది. రోజుకు 80 ఎంజీడీల చొప్పున సరఫరా చేస్తే.. 2019 డిసెంబర్ వరకూ ఈ నీటి నిల్వలు సరిపోతాయి. ఈలోపు వర్షాలు కురిస్తే తప్ప.. ఇందులో నుంచి సరఫరా మహా కష్టమనే చెప్పవచ్చు. మిగిలిన రిజర్వాయర్ల పరిస్థితీ దారుణంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో.. నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. ఏలేరు తర్వాత ఎక్కువ శాతం నీటిని సరఫరా చేసే రైవాడ కూడా కనిష్టమట్టానికి చేరువై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రైవాడ రిజర్వాయర్ కనిష్ట నీటిమట్టం 99 మీటర్లు కాగా.. ప్రస్తుతం 103.50కి చేరుకుంది. రోజు వారీ సరాసరి సరఫరా చేస్తే.. జనవరి మొదటి వారంలోనే రైవాడ ఖాళీ అయిపోతుందని మహా విశాఖ నగర పాలక సంస్థ నీటి సరఫరా విభాగం అంచనా వేస్తోంది. ఇలా.. ప్రతి రిజర్వాయర్.. అట్టడుగు స్థాయికి చేరుకొని వచ్చే ఏడాది జనవరి నాటికే నగరంలో దాహం కేకలు వినిపించనున్నాయి. రోజు విడిచి రోజు సరఫరా..25 శాతం కోతలు వర్షాభావ పరిస్థితుల కారణంగా తగ్గిపోతున్న నీటినిల్వలపై ఆందోళన చెందిన జీవీఎంసీ అధికారులు.. ముందస్తు చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బల్క్ కనెక్షన్లకు అందించే నీటి సరఫరాలో 25 శాతం కోత విధించాలని నిర్ణయించారు. తాటిపూడి నుంచి పరిశ్రమలకు అందించే నీటి సరఫరాలో డిసెంబర్ 1 నుంచి 2019 మే 20 వరకూ అంటే 171 రోజుల పాటు 25 శాతం చొప్పున తగ్గించి సరఫరా చేస్తే సుమారు 287 ఎంజీడీలు ఆదా చెయ్యవచ్చని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అదే మాదిరిగా.. జోన్–1లో 2019 మార్చి 1 నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా చెయ్యాలని నిర్ణయించింది. 1, 2, 3, 6 వార్డులకు ఒకరోజు, మరుసటి రోజున 4, 5 వార్డులకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాలకు గోస్తనీ నది నుంచి సరఫరా జరుగుతుంటుంది. ఒకవేళ ఈ సమయాల్లో గోస్తనీలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతే.. టీఎస్ఆర్ రిజర్వాయర్ నుంచి ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు రివర్స్ పంపింగ్ చేసి ఆయా వార్డులకు నీటిని అందించాలని జీవీఎంసీ ప్రణాళికలు రూపొందించింది. నీటి కష్టాలు రాకుండాసిద్ధమవుతున్నాం రానున్న వేసవికాలంలో నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా పటిష్ట ప్రణాళికలు ముందుగానే రూపొందించాం. తాగునీరు అందుబాటులో ఉండీ.. సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. ఉదయం పూట నీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. నీటి సరఫరా సమయాలతోపాటు ఒకవేళ నీటిసరఫరా వేళల్ని మార్చినా వాటిని ప్రజలకు తెలియపరచాలని సిబ్బందిని సూచించాం. రానున్న వేసవి దృష్ట్యా అవసరమైన మరమ్మతులపై అప్రమత్తంగా ఉండాలని నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించాం. అదే విధంగా 32 విలీన గ్రామాల్లోనూ నీటి కొరత రాకుండా చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం.– హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
ఊటగుండం..‘కిడ్నీ’ గండం!
సముద్రతీరానికి ఆనుకొని ఉన్న ఊటగుండం గ్రామాన్ని కిడ్నీ వ్యాధి సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతిచెందడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గ్రామంలోని మరికొంతమంది కూడా ఈ సమస్యతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. తమకు అందించే తాగునీరు కలుషితమవ్వడం వల్లే కిడ్నీ వ్యాధి సమస్య తమ గ్రామానికి మహమ్మారిలా పట్టిందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. కోడూరు (అవనిగడ్డ) : కోడూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఊటగుం డం గ్రామం సముద్రతీరానికి ఆనుకొని ఉంటుం ది. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు చెందిన 700మంది జనాభా నివాసముంటున్నా రు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. వీరందరికి నాగాయలంక మండలం కమ్మనమోల పంపుహౌస్ నుంచి తాగునీటిని పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. అయితే ఈ గ్రామం చిట్టచివరన ఉండడంతో కుళాయిల వెంట తాగునీరులో చెత్తచెదారాలతో కూడిన మురుగు నీరు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఇంటి అవసరాలకు ఉపయోగించుకునే నీరు పూర్తిగా పసర్లు కమ్మి ఉంటాయని వాపోయారు. గ్రామంలోని కుళాయిల వద్ద కూడా మురుగు పెరుకుపోయి పారిశుద్ధ్యం లోపించిం దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో ఆరుగురు మృతి.. తాగునీరు కలుషితమవ్వడం వల్ల తమ వారికి కిడ్నీ వ్యాధి సోకిందని ఊటగుండం గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. ఈ నీరు తాగడం వల్లే మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందారని వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కురాకుల వెంకటేశ్వరరావు(52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీనివాసరావు (47), ఆరేపు ఆంజ నేయులు (55), దేవనబోయిన వెంకటేశ్వరమ్మ(42), కూచిబోయిన వెంకాయమ్మ (62), కురాకుల కోటేశ్వరరావు (50) కూడా కిడ్నీ సమస్యతో నే మృతిచెందినట్లు వివరిస్తున్నారు. వీరందరు విజయవాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికి త్స పొందగా, వీరికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు రిపోర్టులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. పెరుగుతున్న బాధితుల సంఖ్య.. ప్రసుత్తం మరికొంతమంది గ్రామస్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు ఇక్కడవారు చెబుతున్నారు. కొంతమంది అయితే ఈ వ్యాధి తమకు కూడా సోకుతుందనే భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. గ్రామం వైపు చూడని పాలకులు.. మూడు నెలల వ్యవధిలో ఆరుగురు గ్రామస్తులు కిడ్నీ సమస్యతో చనిపోయినా తమ గ్రామానికి సమస్య తెలుసుకునేందుకు వచ్చిన అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని లేరని ఇక్కడ వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ఊటగుండం వాసులు కోరుతున్నారు. ఇద్దరు సోదరులను కోల్పోయాను మూడు నెలల వ్యవధిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఇద్దరు సోదరులను కోల్పోయాను. వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులు కలుషితమైన నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సోకింది. వీరికి విజయవాడలో చికిత్స చేయిస్తే కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. రూ.లక్షలాది ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. – కురాకుల రంగారావు, గ్రామస్తుడు -
సాగునీటికోసం లడాయి
ఖిల్లాఘనపురం (వనపర్తి) : కల్వకుర్తి ఎత్తిపోతల ప థకం ప్రధాన కాల్వనుంచి ఖిల్లాఘనపురం బ్రాం చ్ కెనాల్ ద్వారా వస్తున్న సాగునీరు పలుగ్రామాల రైతుల మధ్య గొడవ పెట్టింది. ఇటీవలే మం డలంలోని పెద్దవాగు ద్వారా కృష్ణాజలాలు వస్తున్నాయి. ఈ నీరు నేరుగా మహ్మదుస్సేన్‌పల్లి, ని జాలపురం తదితర గ్రామాల వరకు వాగుద్వారా వెళతాయి. అయితే వెంకటాంపల్లి గ్రామ శివా రులో ఉన్న చెక్‌డ్యాంపై కమాలొద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఇటీవల సంచుల్లో ఇసుక నింపి కట్టగా వేశారు. ఆ నీటిని గ్రామానికి చెందిన వాతరాయ చెరువుకు పాటు కాల్వ ద్వారా తరలించారు. ఇది గమనించిన నిజాలాపురం గ్రామానికి చెందిన రైతులు చెక్‌డ్యాంపై ఉన్న సంచులను రెండు రోజుల క్రితం తొలిగించారు. ఇది తెలుసుకున్న కమాలొద్దీన్‌పూర్ రైతులు జేసీబీ సహాయంతో కట్టవేసి చెక్‌డ్యాంపై మళ్లీ సంచులు వేశారు. మంగళవారం అక్కడికి వచ్చిన మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు సంచులను తొలిగించడానికి వెళ్లడంతో కమాలొద్ధీన్‌పూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. సంచులు వేస్తేనే మా చెరువుకు నీళ్ళు వెళతాయని సంచులు తీయనీయమని పట్టుబట్టారు. సంచులు తీస్తేనే మా చెరువుకు నీరు వెళతాయని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు సంచులు తీసేందుకు యత్నించారు. నచ్చజెప్పిన పోలీసులు చెక్‌డ్యాం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ విజయ్‌కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరుగ్రామాల రైతులతో మాట్లాడి కొన్ని సంచులు తీయించారు. అయినా సాయంత్రం వరకు సంచులు తొలిగిస్తామని కమాలొద్దీన్‌పూర్ గ్రామ రైతులు, మళ్లీ అడ్డువేస్తారని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు చెక్‌డ్యాం దగ్గర కాపలా ఉన్నారు. ఇదిలాఉంటే మహ్మదుస్సేన్‌పల్లి చెరువుకు వెళ్తున్న నీటిని ముసాపేట మండలం నిజాలాపురం గ్రామానికి చెందిన రైతులు తరలించేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. ముసాపేట మండలానికి చెందిన ఎస్ఐ, తహసీల్దార్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. పెద్దవాగు వెంట రైతుల మధ్య ఎప్పుడు ఏం గొడవ చోటుచేసుకుంటుందోనని ఆయాగ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కంబం మండలంలో నీటి సమస్య గ్రామస్తుల ధర్నా
-
నీళ్లో నారాయణా..!
ఓ వైపు కార్పొరేషన్ అధికారులు నీళ్లు ఇవ్వరు.. మరోవైపు భూగర్భజలాలు అడుగంటి బోర్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆరు నెలలుగా నెల్లూరు ప్రజలు గుక్కెడు నీటికోసం కటకటలాడుతున్నారు..నిత్యం 105ఎంఎల్డీ నీటిని నెల్లూరు నగరవాసులకు అందించాల్సి ఉంది. అందులో సగం కూడా సరఫరా కావడం లేదు. నీళ్ల కోసం కార్పొరేషన్ అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. సాక్షాత్తూ మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ నివాసం ఉంటున్న నగరంలోనే నిధుల్లేవ్.. నీళ్లు ఇవ్వలేమంటున్నారు అధికారులు. ‘నీళ్లో నారాయణా’ అంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నెల్లూరు సిటీ: నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు మున్సిపల్ పైప్లైన్ల ద్వారా వచ్చేనీరు నిలిచిపోవడం.. మరోవైపు భూమిలో నీళ్లు ఇంకిపోవడంతో ఆరు నెలలుగా ప్రజలు నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాల పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రోడ్ల తవ్వకాలు జరిపిన సమయంలో మున్సిపల్ వాటర్ పైప్‌లు దెబ్బతింటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సరఫరా వారాల తరబడి నిలిచిపోతోంది. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లు, 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. సుమారు 7 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు రోజూ 105ఎంఎల్డీ నీటిని అందించాల్సి ఉంది. అయితే కేవలం 85ఎంఎల్డీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 60ఎంఎల్డీ నీటిని కూడా సరఫరా కావడం లేదు. పెన్నానది, బుజ్జమ్మరేవు, సమ్మర్ స్టోరేజీట్యాంకు నుంచి కార్పొరేషన్ తాగునీటిని సరఫరా చేస్తోంది. రోజుకు 85ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. పెన్నానది నుంచి 49 ఎంఎల్డీ, బుజ్జమ్మరేవు నుంచి 6 ఎంఎల్డీ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి 18 ఎంఎల్డీ, మిగిలిన నీటిని బోర్‌వెల్స్ నుంచి 12 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు, మూడు సార్లు మాత్ర మే నీరు సరఫరా అవుతున్న సందర్భాలు ఉన్నాయి. తవ్వకాల్లో తుక్కవుతున్న పైప్లైన్లు కార్పొరేషన్ పరిధిలో రూ.1100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఎల్ఎండ్టీ, మెగా కంపెనీలు దక్కించుకోగా ఆయా కంపెనీలు సబ్ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాయి. దీంతో సబ్‌కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో వాటర్ పైప్లైన్లు ధ్వంసమవుతున్నాయి. పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు కావడంతో కార్పొరేషన్ అధికారులకు ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయో కూడా స్పష్టత లేకుండాపోతోంది. కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్ల తవ్వకాల్లో మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ దెబ్బతింటుండడంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వాటర్ పైప్‌లైన్ ఎక్కడ పగిలిందో తెలుసుకునేందుకే కార్పొరేషన్ అధికారులు వారాలపాటు సమయం తీసుకుంటున్నారు. దీంతో ప్రజలకు అవస్థ తప్పడం లేదు. 150 అడుగులు బోర్లు వేయాల్సిందే.. నెల్లూరు నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, ఎన్టీఆర్నగర్, మైపాడుగేటు. కిసాన్‌నగర్, వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, జండావీధి, ఫత్తేకాన్‌పేట తదితర ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం వరకు 50 అడుగుల లోతులో బోర్లు వేస్తే నీరు వచ్చేది. అయితే ప్రస్తుతం పెన్నాకు సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో సైతం 100 అడుగులు పైనే బోర్లు వేయాల్సి వస్తోంది. ఇక పొదలకూరు రోడ్డు, దర్గామిట్ట, అయ్యప్పగుడి ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 150 అడుగుల వరకు బోరు వేయాల్సి వస్తోంది. వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. భవిష్యత్‌లో నీటికి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ► జూన్ నెలలో స్టౌన్‌హౌస్‌పేటలోని జలకన్య బొమ్మ వద్ద ఓ పైప్‌లైన్ పగిలింది. దీంతో బాలాజీనగర్‌లోని దాదాపు 5000 కుటుంబాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. కార్పొరేషన్ అధికారులు వారం రోజులపాటు ఎక్కడ సమస్య ఉందో తెలుసుకునేందుకు అన్వేషించాల్సి వచ్చింది. అయితే ఓ కంపెనీ జరిపిన రోడ్ల తవ్వకాల్లో పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు తెలిసింది. లెక్కల్లోనే ట్యాంకర్ నీరు సరఫరా పొదలకూరురోడ్డు, చంద్రబాబునగర్, భగత్‌సింగ్‌కాలనీ, సమతానగర్, నాగమ్మకాలనీ, ఆర్టీసీ కాలనీ, రామ్‌నగర్, కొత్తూరు, వేదాయపాళెం, బుజబుజనెల్లూరు తదితర శివారు ప్రాంతాలకు 22 ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు 117 ట్రిప్పులు నీరు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే ప్రతి రోజూ నీటి ట్యాంకర్ రాకపోవడంతో నీటి కోసం ఆ ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. మురుగునీరు సరఫరా.. 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారానే కార్పొరేషన్ నగర ప్రజలకు నీటిని సరఫరా చేస్తోంది. పాత పైప్‌లైన్ కావడంతో కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్‌కు రంధ్రాలు ఏర్పడి మురుగునీరు సరఫరా అవుతోంది. మరోవైపు భూగర్భడ్రైనేజీ పనుల కారణంగా కార్పొరేషన్ వాటర్ పైప్లైన్లు దెబ్బతింటున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలకు మురుగునీరే దిక్కైంది. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, స్టౌన్‌హౌస్‌పేట, రంగనాయకులపేట, కోటమిట్ట, మన్సూర్‌నగర్, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాలాజీనగర్‌లో వారం రోజులుగా నీరు రావడం లేదు. పైప్‌లైన్ పగలడం కారణంగా వారం రోజులుగా దాదాపు 20 వేల మంది తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు ► మూలాపేటలోని నీలగిరి సంఘం ప్రాంతాల్లో ఇటీవల తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తున్న సమయంలో మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ పగిలింది. దీంతో మూలాపేటలోని వందల ఇళ్లకు వారం రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులకు చెప్పినా మరమ్మతులు చేస్తున్నామని, పని పూర్తయ్యే వరకు వేచి చూడాలని సూచన ఇవ్వడం గమనార్హం. ► స్టౌన్‌హౌస్‌పేటలో భూగర్భ డ్రైనేజీ పనుల నేపథ్యంలో వాటర్ పైప్‌లైన్‌కు రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో 20 రోజులపాటు మురుగునీరు సరఫరా అయ్యాయి. కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. -
పల్లెల్లో తాగునీటి గోస
కొడంగల్ రూరల్ : మా ఊరిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదని మండల పరిధిలోని రావులపల్లి గ్రామస్తులు సోమవారం రోడ్డుపై భైఠాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయని వాపోయారు. పైప్‌లైన్ పగిలిపోయిన తర్వాత దాదాపు 15 రోజులుగా రోడ్డుపై ట్యాంకర్‌ను ఉంచి నీటి సరఫరా చేశారని, అయినా పూర్తి స్థాయిలో నీరు అందక ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల నుండి నీటి సరఫరా కాకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు, నాయకులకు తెలియజేసినా స్పందించపోవడంతో ధర్నాతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో నాలుగు చేతిపంపులు ఉన్నా వాటిలో రెండు చెడిపోవడంతో సుదూర ప్రాంతం నుండి నీటిని తెచ్చుకుంటున్నామని అన్నారు. గ్రామ శివారులో దౌల్తాబాద్ రోడ్‌లోని రైస్‌మిల్ సమీపంలో నీటిని తెచ్చుకుం టున్నామని, ద్విచక్రవాహనాలు, సైకిళ్లపై బిందెలను పెట్టుకొని నీటిని తెచ్చుకుంటున్నామని అన్నారు. సుదూర ప్రాంతం నుండి నీటి బిందెలను మోసుకొని రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని నినాదాలు చేశారు. రావులపల్లి గేటు సమీపంలో కొడంగల్– యాద్గిర్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విషయం తెలిసిన పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకొని సంబంధిత కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడించారు. మంగళవారం సాయంత్రం వరకు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలపడంతో నిరసన విరమించారు. -
వన్యప్రాణుల దాహం తీర్చేలా..
మార్కాపురం: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వేలాది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి సమస్యకు అటవీ శాఖాధికారులు శాశ్విత పరిష్కారం చూపారు. ఏటా వేసవి ప్రారంభం నుంచి జంతువులకు తాగునీటి సమస్య ఏర్పడేది. అధికారులు ట్యాంకర్ల ద్వార కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ తొట్లు(సాసర్ పిట్స్)ను ఏర్పాటు చేసినప్పటికీ వేసవి తీవ్రతకు నీరు ఆవిరి కావటం, కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్ యజమానులు నీళ్లు పోయకపోవటంతో జంతువులు దప్పికతో అలమటించేవి. సమీపంలోని గ్రామాలకు వెళ్తే ప్రజలు దాడులు చేసే వారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నల్లమలలోనే శాశ్వితంగా నీటి వనరులు ఏర్పాటు చేసినట్లయితే జంతువులకు ఇబ్బంది ఉండదని భావించారు. 100కు పైగా చిరుతలు... టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ప్రస్తుతం 100కు పైగా చిరుత పులులు, దాదాపు 70 పెద్ద పులులు, సుమారు 3 వేల జింకలు, దుప్పులు, ఇంకా రేచు కుక్కలు, కణతులు, ఎలుగుబంట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి నీటి సమస్య తీర్చేందుకు నల్లమలలో అధికారులు కొన్ని ప్రాంతాల్లో డీప్‌బోర్లు వేసి సోలార్ సిస్టం ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి శాశ్వితంగా నీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. గతంలో ఏటాఫిబ్రవరి నుంచి జూన్ వరకు అటవీ జంతువులకు నీటి సరఫరా కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసే వారు. 95 సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కొండ అంచు, మిట్ట ప్రాంతాల్లో సాసర్‌పిట్స్‌ను ఏర్పాటు చేశారు. దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, శ్రీశైలం సరిహద్దు, తదితర మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో పిట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది అటవీశాఖ ఉన్నతాధికారులు శాశ్విత పరిష్కారం కోసం ప్రయోగాత్మకంగా దోర్నాల మండలం పులిచెరువు, యర్రగొండపాలెం మండలం తంగెడివాగు, గుంటూరు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతమైన బొంకులపాడు వద్ద మూడు డీప్‌బోర్లు వేసి సోలార్ ప్యానళ్లను పెట్టి పైపులైన్లు వేసి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటలకు ఇంజిన్ల ద్వారా నీటిని పంపింగ్ చేశారు. ఇందు కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది ఇలా... ఈ ప్రయోగం విజయవంతం కావటంతో ఈ ఏడాది రూ.5 లక్షలు ఖర్చు పెట్టి నల్లగుంట్ల 2, కొమరోలు, నారుతడికల, బటుకులపాయ ప్రాంతాల్లో ఒక్కొక్క డీప్‌బోరు మోటార్లు ఏర్పాటు చేసి పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇందుకోసం గిరిజన యువకులను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క బోరుకు రూ.45 వేలు ఇవ్వగా, నెడ్ క్యాప్ ద్వారా సోలార్ సిస్టంకు రూ.55 వేలు కేటాయించారు. ఈ విధంగా గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ సంవత్సరం ఐదు ప్రాంతాల్లో డీప్‌బోర్లు వేసి నీటి సరఫరా చేయటంతో పెద్ద పులులు, చిరుతలు, జింకలు, రేచు కుక్కలు, ఎలుగు బంట్లు, కణతులకు నీటి సమస్య తీరింది. దీని వలన అవి అటవీ ప్రాంతంలోనే హాయిగా సంచరిస్తుంటాయి. నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చి వేటగాళ్ల బారి నుంచి ప్రమాదాలను తప్పించుకుంటున్నాయి. ఇప్పటికే నల్లమలలోని బేస్ క్యాంప్‌లో ఉన్న పెద్ద చేమ, చిన్న మంతనాల, పులిబోను ప్రాంతాల్లో ఉన్న డీప్‌బోర్లకు మోటార్లు బిగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మార్కాపురం డీఎఫ్ఓ పరిధిలో గుంటూరు జిల్లా సాగర్, రెంటచింతల, గురజాల, దోర్నాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. నీటి సమస్య తీరినట్లే..జయచంద్రారెడ్డి, డీఎఫ్ఓ, మార్కాపురంనల్లమలలో శాశ్వితంగా జంతువులకు నీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ ఏడాది ఐదు ప్రాంతాల్లో డీప్ బోర్లు వేశాం. సోలార్ సిస్టం ద్వారా మోటార్లను ఆన్‌చేసి పైపు లైన్ల ద్వారా సాసర్‌పిట్ ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నాం. దీనితో అటవీ ప్రాంతంలో జంతువులు ఈ ప్రాంతాలకు వచ్చి నీరు తాగి వెళ్తున్నాయి. గతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో జంతువులు తీవ్రంగా ఇబ్బంది పడేవి. ఇప్పుడు ఆ సమస్య తీరింది. బేస్ క్యాంప్‌ల్లో కూడా ఉన్న డీప్‌బోర్ల వద్ద మోటార్లను బిగించాలన్న ఆలోచన ఉంది. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస, నిరంకుశ పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాక్షర భారత్ సమన్వయ కర్తలుగా పనిచేసే 20,500ల మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో ఉందని మండిపడ్డారు. అన్యాయంగా ఉద్యోగులను తొలగించడం చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు. బాబు పాలనలో సాగు తగ్గుతోంది.. ముంఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో సాగి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకుల్లో తనఖా పెడుతోందని తెలిపారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెట్టిన పరిస్థితి, దుస్థితి దేశ చరిత్రలోనే లేదని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం సోమశీల, వంశాధార, వెలుగొండ, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్టులను బ్యాంక్‌లలో తాకట్టు పెడుతోందన్నారు. ఇప్పటికే బాబు ప్రభుత్వం ప్రాజెక్టులను తానఖా పెట్టి 3 వేల కోట్లు రుణాలు తీసుకుంది.. మళ్లీ ఇప్పుడు 10 వేల కోట్లు రుణాలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. ప్రపంచానికి పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న వ్యక్తినని చెప్పుకున్న చంద్రబాబు ఇలాంటి పాలన సాగించడం సిగ్గుచేటని నాగిరెడ్డి పేర్కొన్నారు. బాబు ఖరీఫ్ సీజన్లో 2 కోట్ల ఎకరాలకు నీరు అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు మెట్ట, సాగునీటి ప్రాంతాల భూమి మొత్తం కలిపి కనీసం కోటి ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలిపారు.ఇంత నీటి కొరత ఉంటే రైతులు ఏ విధంగా పంటలు పండించగలరని ప్రశ్నించారు. రైతులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు
ప్రకాశం, పొదిలి: నీళ్లు లేక పడుతున్న ఇబ్బందులతో మహిళలు సమస్య తీవ్రతను తెలిపేందుకు రోడ్డు ఎక్కారు. బుధవారం స్థానిక టైలర్స్ కాలనీ వాసులు ఒంగోలు రోడ్డులోని దర్గా సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలను ప్రదర్శించారు. నీళ్ల సమస్య గురించి పలు మార్లు విన్నవించినా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రోడ్డును వీడ బోమని కూర్చున్నారు. సాగర్ నీరు సక్రమంగా రావడం లేదని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా వస్తున్న నీరు ఏమాత్రం అవసరాలు తీర్చడం లేదని తెలిపారు. పేదలమైన తాము నీరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని వాపోయారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు కొంత మేర అంతరాయం ఏర్పడింది. ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరావు, ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. నీటి సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
సిమ్లాలో నీటి కష్టాలు
-
ఎండుతున్న మంజీరా
నారాయణఖేడ్ (మెదక్): మంజీరా నది ఎండుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే నదిపై ఆధారపడి ఉన్న మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే సకాలంలో వర్షాలు కురవని పక్షంలో మంజీరా నదిపై ఆధారపడి ఉన్న గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. గత ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో మంజీరా నది పూర్తిగా నిండి కళకళలాడింది. నది నుంచి భారీగా నీటిని వదలడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది. మంజీరా నదిపై నారాయణఖేడ్ నియోజకవర్గంతోపాటు జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు చెందిన తాగునీటి పథకాలు ఉన్నాయి. వర్షాలు ఏమాత్రం ముఖం చాటేసినా నీటి పథకాలు వట్టిపోనున్నాయి. ఇప్పటికే నీటిపథకాల నిర్వహణ కష్టతరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నాగల్గిద్ద మండలం గౌడ్గాం జనవ్వాడ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న మంజీరా నది నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అత్యధిక ప్రాంతంలో పారే నది ఖేడ్ నియోజకవర్గంలోనే. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. నదిలో సమృద్ధిగా వరద నీరు వచ్చి చేరింది. కాగా ఏడాది ప్రారంభంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడతల వారీగా సింగూరు నుంచి నీటిని వదిలారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 10 టీసీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల వరకు నీరు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ అంతకంటే తక్కువ టీఎంసీల నీరు మాత్రమే ఉందని ప్రతిపక్షాలు, నది సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటి నిల్వ తగ్గే స్థాయిలో పూడిక మట్టి ఉంది. నది నుంచి భారీగా నీరు వదలడంతో ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు వేసవి చివరిలోనూ నిండుకుండలా నీటితో కళకళలాడుతున్నాయి. మంజీరా నది మాత్రం ఎండిపోతోంది. నీటి పథకాలకు గడ్డుకాలం.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీరా నది నుంచే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్‌వెల్‌లు అన్నీ మంజీరా నదిపైనే ఉన్నాయి. ఇప్పటికే గూడూరు పథకం ద్వారా రోజు విడిచి రోజు, రెండు రోజులకు ఓ మారు నీటి సరఫరా జరుగుతోంది. శాపూర్, బోరంచ ఇన్‌టెక్ వెల్ వద్ద కూడా నీరు తగ్గింది. ముందు ముందు ఎండల పరిస్థితి ఇలాగే ఉంటే తాగునీటి పథకాలు వట్టిపోతాయి. నదిలో నీరు తగ్గడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్ వెల్లు కూడా మంజీరా నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంజీరా నది ప్రారంభం మొదలుకొని గోదావరిలో కలిసే వరకు పూర్తి ప్రవాహంలో రాయిపల్లి వంతెన వద్ద ఉన్నంత ఉద్ధృతి ఎక్కడా కన్పించదు. ఈ వంతెన సమీపంలో కనుచూపు మేర పూర్తిగా నీటితోనే నది కన్పిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిలా తయారైంది. నదిలోంచి పశువులు, జనాలు ఇవతలి వైపు నుంచి అవతలి వైపు నడిచి వెళుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నదిలో అక్కడక్కడా గోతుల్లో ఉన్న నీటిలో పశువులు ఈదుతున్నాయి. నది ఎండడంతో రబీ సీజన్‌కు సంబంధించి జొన్న, శనగ తదితర పంటలను నది ముంపు భూముల్లో రైతులు సాగుచేసి పంటలను సైతం తీసుకున్నారు. నది పరిస్థితి చూసి జనాలు తల్లడిల్లుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే వరుణుడు కరుణిస్తేనే మూడు నియోజకవర్గాల్లోని ప్రజలునీటి ఎద్దడి నుండి బయట పడగలరు. -
నీరు లేక నిలిచిన ప్రసవాలు..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ) : మోర్తాడ్‌లోని క్లస్టర్ ఆస్పత్రిలోని బోరుబావిలో సమృద్ధిగా నీరు లేక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరిపడేంత నీరు సరఫరా కావడం లేదు. దీంతో సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా నిర్వహించే ప్రసవాలను నిలిపివేశారు. గర్భిణులు ఎవరైనా ప్రసవానికి వస్తే కమ్మర్పల్లి లేదా ఆర్మూర్ ఆస్పత్రులకు తరలించడానికి వైద్య సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. మోర్తాడ్ పీహెచ్‌సీని పదేళ్ల కిందనే 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణలో మార్పులు తీసుకురావడంతో పీహెచ్సీ నుంచి క్లస్టర్ ఆస్పత్రిగా మోర్తాడ్ ఆస్పత్రి అప్‌గ్రేడ్ అయ్యింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ తదితర ఆస్పత్రుల తరహాలో మోర్తాడ్‌లోనూ సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలను చేయాలని నిర్ణయించారు. శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలను నిర్వహించడానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి మోర్తాడ్ ఆస్పత్రిలో సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 200 మంది గర్భిణులకు ప్రసవాలను చేశారు. కాగా మూడు వారాల కింద మోర్తాడ్ ఆస్పత్రిలోని బోరుబావి నుంచి ఆశించిన మేరకు నీరు రావడం లేదు. ఊష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, భూమిలోని భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మోర్తాడ్ ఆస్పత్రి బోరుబావి ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉంది. బోరుబావి నుంచి గతంలో ఎక్కువ మొత్తంలో నీరు సరఫరా కాగా కొన్ని రోజుల నుంచి తక్కువ పరిమాణంలో నీరు వస్తోంది. దీంతో ఈ నీరు రోగులకు సరిపోవని అధికారులు గుర్తించారు. ఆస్పత్రి వైద్యాధికారి శివశంకర్ ఎత్తిపోయిన బోరుబావి గురించి జిల్లా పరిషత్ సీఈవో, మోర్తాడ్ ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌లకు విన్నవించారు. ఆస్పత్రిలోని బోరుబావి ఎండిపోవడం వల్ల రోగులకు ప్రధానంగా బాలింతలైన వారికి సరిపోయేంతగా నీరు సరఫరా కాదు. అలాగే అప్పుడే పుట్టిన చిన్నారులకు స్నానం చేయించడానికి నీరు అవసరం. శస్త్ర చికిత్స చేయించుకున్న వారిని మినహాయిస్తే సాధారణ ప్రసవం అయిన వారికి రోజూ స్నానాల కోసం నీరు అవసరం అవుతుంది. ఇలా ఎన్నో విధాలుగా నీరు అవసరం కావడం అందుకు అనుగుణంగా నీరు బోరుబావిలో లేక పోవడంతో ప్రసవాలను అధికారులు నిలిపివేశారు. మోర్తాడ్‌లోని క్లస్టర్ పరిధిలో మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, చౌట్పల్లి పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రసవాల కోసం గర్భిణులు ఎంతో మంది మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలివెళుతున్నారు. ఇప్పటికే సుమారు 30 మంది గర్భిణులకు ఇక్కడ ప్రసవం చేయాల్సి ఉండగా వారిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. గర్భిణులకు ఇక్కడ ప్రసవం చేయకుండా మరో ఆస్పత్రికి తరలించడంతో తీవ్ర ప్రభావం ఏర్పడి రోగుల సంఖ్య తగ్గిపోయింది. అయితే మోర్తాడ్ ఆస్పత్రిలో సంపూర్ణ వసతి ఉంటే గర్భిణుల ప్రసవాలకు ఎలాంటి ఆటంకం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోరుబావి వేయించాలని ప్రశాంత్‌రెడ్డి ఆదేశం... మోర్తాడ్ ఆస్పత్రిలోని బోరుబావి నుంచి తక్కువగా నీరు వస్తుండగా మరో బోరుబావిని తవ్వించాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. బట్టాపూర్లో నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో మోర్తాడ్ ఆస్పత్రి దుస్థితిని ఏఎన్ఎం అలేఖ్య ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకపోవడంతో ఆయన స్పందించి వెంటనే కొత్త బోరుబావిని తవ్వించాలని ఎంపీడీవో పీవీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. నీరు లేక పోతే ప్రసవాలు ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. మోర్తాడ్ ఆస్పత్రిలో ఏ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉన్నతాధికారులకు నివేదించాం మోర్తాడ్ ఆస్పత్రిలో నీటి సమస్య తీవ్రం కాగా ఈ విషయాన్ని జిల్లా పరిషత్ సీఈవో ఇతర అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. ఆస్పత్రిలో నిధులు ఉన్నాయి. అయితే బోరుబావికి వినియోగించడానికి మాకు అధికారం లేదు. దీంతో జిల్లా కలెక్టర్ అనుమతి కోరాం. అనుమతి రాగానే కొత్త బోరుబావిని తవ్విస్తాం. నీటి సమస్యను పరిష్కరించి ప్రసవాలను కొనసాగిస్తాం. – డాక్టర్ శివశంకర్, కమ్యునిటీ హెల్త్ అధికారి -
నీళ్ల గోస.. బండి కడితేనే.. గొంతు తడిచేది!
ఎడ్లబండ్లపై డ్రమ్ములతో తాగునీటిని తెచ్చుకుంటున్న వీరు నార్నూర్ మండలం సుంగాపూర్ గ్రామస్తులు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి చేతి పంపులు పనిచేయడం లేదు. నీటి ఎద్దడి నెలకొనడంతో ఇలా కిలోమీటర్ దూరం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. గొంతు తడుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు గ్రామంలో నిత్యం ఇదే పరిస్థితి. ఏటా తాగునీటి సమస్య తలెత్తుతున్నా పాలకులు మాత్రం స్పందించడం లేదు. ఒక్క సుంగాపూర్ మాత్రమే కాదు.. జిల్లాలో చాలా గ్రామాలు నీళ్ల గోసతో అవస్థలు పడుతున్నాయి. సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలోని పలు గ్రామాలు వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పల్లెల్లో మంచినీటి పథకాలు, చేతిపంపులు పనిచేయకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. తాగునీటి కోసం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల దాహార్తిని మాత్రం పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నారు. గ్రామాల్లో ఓ వైపు జనం నీటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయంటూ వేసవిని గడిపేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నా నీటి సమస్య పరిష్కారం కాలేకపోతోంది. గత ఫిబ్రవరి, మార్చిలో పుష్కలంగా నీళ్లు వచ్చిన కొన్ని చేతిపంపులు మే నెలలో పూర్తిగా అడుగంటిపోవడంతో అవి ఇప్పుడు పని చేయడం లేదు. దీంతో మరిన్ని గ్రామాలు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలోని నీటి ఎద్దడి ఉన్న 17 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏటా క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఎన్ని హ్యాబిటేషన్లు, వాటి పరిధిలో పని చేస్తున్న చేతిపంపులు ఎన్ని? పని చేయనివి ఎన్ని? మంచినీటి పథకాలెన్ని? అందులో పనిచేస్తున్నవి ఎన్ని? ఎన్ని బోర్లు ఉన్నాయి.. వేటికి మరమ్మతు చేయించాలి.. దానికి అయ్యే అంచనా వ్యయం.. కొన్ని గ్రామాల్లో నీటి పథకాలు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, ఇలా అన్నింటీని క్రాష్ ప్రోగ్రాం ద్వారా అంచనా వేసి ఓ నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదిక ప్రకారం జిల్లాలోని మొత్తం 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 502 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో 5,219 చేతిపంపులు ఉన్నాయి. ఇందులో 4,718 మాత్రమే పని చేస్తున్నాయి. పని చేయని చేతిపంపుల్లో సగానికిపైగా నీరు అందకపోవడం, ఈ రెండు నెలల్లో 110పైగా చేతిపంపులు మరమ్మతుకు గురికావడంతో తాగునీటి కోసం తండ్లాట ఎక్కువైంది. కొన్ని గ్రామాలకు రెండు, మూడు చేతిపంపులు ఉన్న చోట భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అయితే చెడిపోయిన చేతిపంపులకు అప్పటికప్పుడే మరమ్మతు చేయిస్తున్నామని చెబుతున్నా అధికారులు తాగునీటి ఇబ్బందులు ఎందుకు తలెత్తుతున్నాయో స్పష్టం చేయలేకపోతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో మెకానిక్‌ను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు చేతిపంపులను పర్యవేక్షిస్తున్నామని మాత్రం పేర్కొంటున్నారు. జిల్లాలో మరో 585 బావులు ఉన్నాయి. ఇందులో 492 బావులు పని చేయగా, మిగతా 93 బావులు పని చేయడం లేదు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.3 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని జీపీల నిధులు కలిపి సుమారు రూ.13 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మిషన్ భగీరథ పనుల్లో అధికారులు బీజీగా ఉన్నారు. ఏప్రిల్ చివరి నాటికే మిషన్ నీళ్లను అందిస్తామనుకున్నా ఇంకా చాలా గ్రామాలకు పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో అది సాధ్యం కాలేకపోయింది. అడుగంటిన భూగర్భజలాలు జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. గతేడాది జనవరితో పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది జనవరిలో మరింత లోతుకు పడిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎండలు తక్కువగా ఉండడంతో చేతిపంపులకు అందిన నీరు ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో చేతిపంపులకు నీరందక వృథాగా మారుతున్నాయి. అయితే మరో నెల పాటు నీటి ఎద్దడి ఉంటుందని, వర్షాలు పడితేనే బోర్లకు, బావులకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని అనుబంధ గ్రామాలు : 1,175 చేతిపంపులు : 5,219 పని చేయనివి : 501 పని చేస్తున్నవి : 4,718 బావులు : 585 పని చేయనివి : 93 పని చేస్తున్నవి : 492 అందుబాటులో ఉన్న నిధులు : రూ.13 కోట్లు పంచాయతీల్లో నిధులున్నాయి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు, చేతిపంపుల మరమ్మతు చేయించేందుకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయి. తాగునీటికి ఇబ్బంది రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నాం. జిల్లాలోని జీపీలో సుమారు రూ.13 కోట్లు అందుబాటులో ఉన్నాయి. నిధుల కొరత లేదు.– జితేందర్‌రెడ్డి, ఇన్చార్జి డీపీవో -
చుక్క నీటి కోసం బావుల్లో ప్రజల ఇబ్బందులు
-
చాలీచాలని నీటి సరఫరా
చందుర్తి(వేములవాడ) : చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నా.. ఎటూ సరిపోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు ట్యాంకర్ల ద్వారా ఇంటికి 200 లీటర్లను సరఫరా చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ముఖం కడుక్కునేందుకు కూడా ఈ నీరు సరిపోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి రోజుకు 400 లీటర్లు అందజేస్తే నీటికష్టాలు తప్పుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఇప్పటికే మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంపై అలసత్వం మల్యాలలో పదేళ్లుగా మంచినీటి గోస ఉంది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. రెండు మంచినీటి ట్యాంకులు నిర్మించినా వాటిని నింపేందుకు నీళ్లు లేక వృథాగా ఉంటున్నాయి. ఏటా ట్యాంకులను నింపేందుకు అద్దె బావులతోనే కాలాన్ని గడిపారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదు. డ్రమ్ము నీళ్లతోనే.. రోజంతా ఒక్క డ్రంబు నీళ్లతోనే సరిపెట్టుకోవాలి. నీళ్లు సరిపోవడం లేదన్న ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తే రైతులు కోపానికి వస్తున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. – గుంటిపెల్లి రాజవ్వ, ఎస్సీకాలనీ పట్టించుకునేటోళ్లు లేరు ఓట్లు వస్తే ఇంటికి పది సార్లు వచ్చి ఓటు ఎయ్యిమని బతిలాడుతరు. నీళ్లు లేక కరువు వచ్చి చచ్చి పోతున్నామంటే ఊల్లె ఉన్నోడు రాడు. ఊరవుతలోడు రాడు. నీళ్లు లేక సచ్చిన సరే పట్టించుకుంట లేరు. పది బిందెల నీళ్లతో ఇంట్లో పది మంది ఉంటే ఎట్లా గడుపుతాము. – గుంటిపెల్లి మల్లవ్వ, మల్యాల -
ఫైర్ స్టేషన్..నీటికి పరేషాన్..
కంభం : తీవ్ర వర్షాభావ పరిస్థితులు అడుగంటిన భూగర్భజలాలతో ఓ వైపు రైతులు, ప్రజలు అల్లాడుతుంటే మరో వైపు అగ్నిమాపక శాఖ కూడా నీళ్ళకోసం తంటాలు పడుతుంది. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. మంటలను ఆర్పివేయడానికి చాలా చోట్ల అగ్ని మాపక కేంద్రాల ద్వారా స్పందిస్తుంటారు. అలాంటి అత్యవసర పరిస్థితుల నుంచి ప్రాణాలును, ఆస్తులను కాపాడే అగ్ని మాపక కేంద్రంలో నీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. కంభం అగ్నిమాపక కేంద్రంలో 5 సంవత్సరాల నుంచి బోరు పనిచేయక పోవడంతో నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నారు. కంభం, అర్థవీడు, బేస్తవారిపేట మండలాలకు కలిపి కంభంలో అగ్నిమాపక కేంద్రం ఉంది. తీవ్ర వేసవి దృష్ట్యా మూడు మండలాల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటుంది. ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న సిబ్బంది వాహనంలో నీళ్ళకోసం వెతుకులాడి అక్కడికి వెళ్ళే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో బోరు ఒట్టిపోయి ఐదేళ్ళుగా నీళ్లురాక ఇబ్బందులు పడుతున్నా ఉన్నతాధికారులు కానీ ప్రజా ప్రతినిధులు సమస్య పరిష్కారంపై దృష్టి సారించడంలేదు. కార్యాలయంలో బోరు పనిచేయక పోవడంతో నీళ్ళు నిలువ చేసే తొట్టె, మోటారు నిరుపయోగంగా పడిఉన్నాయి. తీవ్ర నీటి సమస్యకు తోడు కరెంటు కోతలు కూడా ఇష్టానుసారంగా విధిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బందిబాధలు వర్ణనాతీతంగా మారాయి.ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయంలో రీబోర్ చేయించడమో లేదా మరో చోట ఎక్కడైనా బోరువేయించి సమస్యను పరిష్కరించడమో చేయకుంటే ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదాలు జరగక ముందే సమస్యను పరిష్కరించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యన్ బాలచెన్నయ్య , ఫైర్ ఆఫీసర్, కంభం నీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్లవెంట బోర్లకోసం వెతుక్కోవాల్సి వస్తుంది. బోరులేకపోవడం తో స్టోరేజ్ ట్యాంక్ నిరుపయోగంగా పడిఉంది. -
దాహం తీరింది..
నిర్మల్అర్బన్: ఎండలు మండుతున్నాయి. వేసవి దాహార్తికి పశు, పక్ష్యాదులు విలవిల్లాడుతున్నాయి. అందుకు ఈ చిత్రాలే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ఓ ఆవు దాహార్తితో మసీద్ వద్ద ఉన్న నల్లా వద్దకు చేరింది. నల్లా నుంచి నీరు రాకపోవడంతో అటూ.. ఇటూ దీనంగా చూసింది. ఫోన్లో మాట్లాడుతూనే ఆవును గమనించిన మొజాన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని నల్లాను తెరిచాడు. ఒక్కసారిగా నల్లా నుంచి నీరు రావడంతో నీటిని తాగిన ఆవు తన దాహార్తిని తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
గాల్లోంచి నీరు పుట్టిస్తారు..!
ఎక్స్‌ప్రైజ్.. ఈ పేరు చాలా తక్కువగానే విని ఉంటారుగానీ.. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కొనేందుకు పోటీలు పెడుతుంటుంది ఈ సంస్థ. పీటర్ డెమండిస్ అనే వ్యాపారవేత్త 1995లో దీన్ని స్థాపించారు. రెండేళ్ల కింద ‘వాటర్ అబండెన్స్’అనే పోటీ పెట్టింది. గాల్లోని తేమను అతిచౌకగా నీరుగా మార్చే యంత్రం, లేదా సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 10.5 లక్షల డాలర్లు.. (రూ.9.75 కోట్లు) ఇస్తామని ప్రకటించింది. రోజుకు కనీసం 2 వేల లీటర్ల నీరు ఉత్పత్తి చేయాలని, ఒక్కో లీటరు నీటి తయారీకి 2 సెంట్ల (రూ.1.28)కు మించి ఖర్చు కాకూడదన్నవి నిబంధనలు. మొత్తం 98 సంస్థలు ఈ ప్రైజ్‌మనీ కోసం పోటీపడ్డాయి. రెండు వారాల కింద తుది పోటీలకు 5 జట్లు ఎంపికైనట్లు ప్రకటించింది. ఆ జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఉరవు’ఉంది. ఉరవు వ్యవస్థాపకుడే స్వప్నిల్! మూడేళ్లలో 80 పైసలకే లీటర్.. నమూనా యంత్రం ద్వారా లీటర్ నీరు ఉత్పత్తి చేసేందుకు దాదాపు రూ.2 ఖర్చు అవుతోందని, సిలికా పదార్థం ఆధారంగా నమూనా యంత్రాన్ని తయారు చేశామని స్వప్నిల్ చెప్పారు. మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలగడంతో పాటు ఖర్చు తగ్గిస్తామని పేర్కొన్నారు. మరో మూడేళ్లలో నీటి ఉత్పత్తి ఖర్చును లీటర్‌కు 80 పైసలకు తగ్గించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఫైనల్ పోటీలు ఈ ఏడాది జూలైలో జరగబోతున్నాయని పేర్కొన్నారు. నమూనా యంత్రాన్ని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించామని, వాతావరణంలో తేమ తక్కువగా ఉండే డిసెంబర్‌లోనూ పూర్తిస్థాయిలో నీరు ఉత్పత్తి చేయగలిగినట్లు వివరించారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని, ఇందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘గాల్లోంచి నీరును ఉత్పత్తి చేసే యంత్రాలు ఇప్పటికే చాలా ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కువ. ఇంటి అవసరాలు తీర్చే యంత్రం ఖరీదు రూ.50 వేల వరకు ఉండొచ్చు. ఒకసారి ఇంట్లో పెట్టుకుంటే చాలు.. దీర్ఘకాలం పాటు స్వచ్ఛమైన మంచినీరందిస్తుంది’అని స్వప్నిల్ వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ చేతులు కలిపిన యువశక్తి.. ఐదుగురు యువకులు కలసి ఈ సంస్థను స్థాపించారు. స్వప్నిల్ ఆర్కిటెక్చర్ చదివితే అమిత్ ఎంబెడెడ్ డిజైనింగ్‌లో డిప్లొమో చేశాడు. వీరికి మెకా నికల్ ఇంజనీరింగ్ చేసిన భరత్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విద్యనభ్యసించిన సందీప్, ఆర్కిటెక్చర్ చదు వుకున్న వెంకటేశ్ తోడయ్యారు. అందరూ చదువుకు న్నది కేరళలోని కాలికట్లో. ఎక్స్‌ప్రైజ్ పోటీ ముందే వీరంతా కలసి గాల్లోంచి నీటిని ఉత్పత్తి చేసేందుకు ఓ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. సంక్షేపణం అనే భౌతిక ప్రక్రియ ద్వారా ఇది పనిచేస్తుంది. ఎవా అని దీనికి పేరు పెట్టారు. గాజు గ్లాసులో చల్లటి నీటిని ఆరుబయట పెడితే గ్లాస్ బయటివైపున నీటి బిందు వులు ఏర్పడతాయి కదా అలాగన్నమాట. ఇది పనిచే సేందుకు విద్యుత్ అవసరం. ఎక్స్‌ప్రైజ్ నిబంధనల ప్రకారం పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరుల పైనే ఆధారపడాలి. దీంతో ప్రత్యేకమైన డిజైన్‌ను ఉపయోగించామని, అదనపు ఖర్చుల్లేకుండా ఎక్కడైనా నీరు ఉత్పత్తి చేయొచ్చని స్వప్నిల్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సరికొత్త యంత్రంతో రోజుకు 15–20 లీటర్ల నీరు ఉత్పత్తి చేయొచ్చని అన్నారు. స్వప్నిల్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి) బృందం -
తాగునీటికే మొదటి ప్రాధాన్యత
రాయికల్(జగిత్యాల): తాగునీటి సమస్యకే మొదటి ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఇటీవల బావి తవ్వగా ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఈద్గాకు 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. శ్మశాన వాటిక కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దోబిఘాట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపిమాధవి, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ కట్కం సులోచన, సింగిల్‌విండో చైర్మన్ పడిగెల రవీందర్‌రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్ మొబిన్, ఉపసర్పంచ్ మ్యాకల రమేశ్, వార్డు సభ్యులు కోల రవి, నాయకులు మహిపాల్, మున్ను, దివాకర్ పాల్గొన్నారు. -
ఆ గ్రామంలో ఇప్పటికి కనీస వసతులు లేవు
-
రైతుల జలజగడం
మక్కువ(సాలూరు):రబీ పంటలకు సాగునీరు విషయంలో రైతుల మధ్య జలజగడం మొదలైంది. ఈ సీజన్లో ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని ఇరిగేషన్ అధికారులు, నీటిసంఘాల నాయకులు ప్రకటించడంతో రైతులు ఆరుతడి పంటలకు బదులుగా వరి అధికంగా సాగుచేశారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఆర్ఎంసీ కాలువ పరిధిలోని 12ఎల్, 13ఎల్, 14ఎల్, 15ఎల్ కాలువలకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడంలేదు. అయినప్పటికీ వారాబందీ ప్రకారం రైతులు మూడురోజుల వంతున కాలువ పరిధిలో ఉన్న పంటపొలాలకు నీటిని సరఫరా చేసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ దానిని ఓ వర్గం ఉల్లంఘించడంతో వివాదం మొదలైంది. కోసేసిన కాలువ షట్టర్ వారాబందీ ఒప్పందాన్ని ఉల్లంఘించి కొందరు కాలువ షట్టర్ కోసేసి ఓ వైపు మాత్రమే సాగునీరు తీసుకువెళ్లేందుకు కొందరు రైతులు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. షట్టర్ కోసేయడం వల్ల తమకు నీరందడం లేదని మండలంలోని పాపయ్యవలస, కొయ్యానపేట గ్రామానికి చెందిన సుమారు 100మంది రైతులు ఆర్ఎంసీ కాలువ వద్ద మంగళవారం నిరసన తెలియజేశారు. అనంతరం ఇరిగేషన్ ఏఈ జగదీష్‌కు ఫోన్‌చేసి కాలువ వద్దకు రప్పించారు. కాలువ షట్టరు విరగ్గొట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం నుంచి 12ఎల్ కాలువకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఏఈ జగదీష్ సాగునీరు సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటానని, తలుపు విరగ్గొట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హామీ ఇచ్చారు. అమలుకాని వారాబందీ వెంగళరాయసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఆర్ఎంసీ(కుడిప్రధానకాలువ) చప్పబుచ్చమ్మపేట గ్రామం వద్ద నున్న 12ఎల్ కాలువ నుంచి మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, కాశీపట్నం, పాపయ్యవలస, కొయ్యానపేట గ్రామాలకు చెందిన సుమారు 2వేల ఎకరాల వరిపంటను ఈ ఏడాది రబీసీజన్‌లో సాగుచేస్తున్నారు. అలాగే 13ఎల్, 14ఎల్, 15ఎల్ కాలువ పరిదిలో ఏ.వెంకంపేట, కన్నంపేట, కొండరేజేరు గ్రామాలకు చెందిన సుమారు 1500 ఎకరాల్లో వరిపంటను సాగుచేస్తున్నారు. ఆర్ఎంసీ కాలువ నుంచి సాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో వారం రోజుల క్రితం ఏ.వెంకంపేట గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో మూడురోజులు 12ఎల్ కాలువకు, మరో మూడురోజులు 13, 14, 15ఎల్ కాలువలకు సాగునీరు సరఫరా చేసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల అయిదురోజులుపాటు 12ఎల్ కాలువకు నీరు అందించినప్పటికి, మరలా 12ఎల్ కాలువ పరిధిలోని రైతులు 13ఎల్ కాలువకు నీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని 13, 14, 15ఎల్ కాలువలకు చెందిన రైతులు తలుపును కోసేసినట్లు చెబుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదుచేసిన రైతులు మండలంలోని పాపయ్యవలస గ్రామానికి చెందిన రైతులతోపాటు, వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదుచేశారు. 12ఎల్ కాలువకు సాగునీరు అందించకుండా ఉండేందుకే ఆర్ఎంసీ కాలువ పరిధిలో షట్టర్ తలుపును కోసేశారనీ, దీనివల్ల 2వేల ఎకరాలకు సాగునీరు అందడంలేదని, తలుపు విరగ్గొట్టిన వ్యక్తులను గుర్తించి, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు. -
2050 నాటికి ప్రపంచం గొంతెండిపోతుంది
సాక్షి, హైదారాబాద్: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ మహానగరం.. తాగునీరు లేక ఎడారిగా మారబోతున్న నగరం... మనిషికి 50 లీటర్లు మాత్రమేనంటూ నీటికి రేషన్ విధించింది తొలి నగరం. ఆ దుస్థితే ప్రపంచ దేశాలు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. నీటిసంక్షోభం 2050 నాటికి మరింత తీవ్రతరం కానుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. అప్పటికి 500 కోట్ల మంది నీరు లభ్యం కాని ప్రాంతాల్లోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడించింది. 2050నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. అంటే సగం మంది జనాభా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడతారన్న మాట. అందులోనూ సురక్షిత నీరు దొరక్క భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా యునెస్కో తన నివేదికలో నీటివనరులపై భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటికి డిమాండ్ పెరగడం, నీటి కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం వంటి కారణాలతో నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఆ నివేదిక ఏం చెప్పిందంటే ... చైనా, భారత్, అమెరికా, రష్యా, పాకిస్థాన్ దేశాలు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నాయి. ఆ దేశాలే నీటి సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడతాయి. భూమిపై 70 శాతం నీరు ఉంటే అందులో స్వచ్ఛమైన నీరు కేవలం 2 శాతం మాత్రమే మధ్య భారతం అత్యధికంగా నీటికొరతను ఎదుర్కొంటుంది. 2050నాటికి 40 శాతం నీటి వనరులు తగ్గిపోతాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయి. దక్షిణ భారత్ నీటి కాలుష్యం సమస్యని అత్యధికంగా ఎదుర్కొంటుంది. దక్షిణభారతంలో ఉన్న నదులన్నీ 2050నాటికి విషతుల్యంగా మారతాయి. బహిరంగ మలవిసర్జన, వివిధ రకాల వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కాలుష్యంతో నిండిపోతాయి. ఈకోలి బ్యాక్టేరియా సమస్య తీవ్రతరమవుతుంది. భారత్‌లో 21 శాతం వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తున్నవే. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది సురక్షిత మంచి నీరు అందడం లేదు. భారత్‌లో 16.3 కోట్ల మంది భారతీయులకు రక్షిత మంచినీరు లభ్యం కావడం లేదు. పరిశుభ్రమైన తాగు నీరు లేక భారత్‌లో ప్రతీరోజూ అయిదేళ్ల లోపు వయసున్న చిన్నారులు దాదాపు 500 మంది మరణిస్తున్నారు. ఏడాదికి ఏడాది నీటి వినియోగం 1 శాతం పెరుగుతూ వస్తోంది. వాతావరణంలో వస్తున్న విచిత్రమైన పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటికి కట కట ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో వరద ముంపునకు గురవుతాయి. 2050 నాటికి 116 కోట్ల మందికి వరదల వల్ల ముప్పుని ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యల్ని అధిగమించడానికి ప్రకృతి సంబంధమైన పరిష్కారాల కోసం కసరత్తు చేయాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సూచించారు. వర్షపు నీటిని రీసైక్లింగ్‌కు చైనా అనుసరిస్తున్న విధానాలు, భారత్‌లో ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన నీటిసంరక్షణ, అటవీప్రాంతాన్ని విస్తరించడం వంటి చర్యలు, ఉక్రెయిన్‌లో కృత్రిమ చిత్తడి నేలల్ని రూపొందించడం వంటివి అన్ని చోట్లా చేపట్టాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. అలా చేయడం వల్ల నీటి సంక్షోభం బారి నుంచి తప్పించుకోవడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల్ని 20 శాతం పెంచుకోవచ్చునని ఆ నివేదిక వివరించింది. -
ప్రమాద ఘంటికలు
ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాగునీరూ దొరకని దుర్భర పరిస్థితులు తలెత్తనున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు అడుగంటుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 22 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఆరో తడికి నీటి విడుదలను ప్రారంభించారు. దీనితో కలిపి మరో మూడు తడులకు, అలాగే తాగునీటికి నీటి విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాల్కొండ: ఎస్సారెస్పీలో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆదివారం నుంచి కాలువల ద్వారా ఆయకట్టు పంటలకు ఆరో తడికి నీటి విడుదలను ప్రారంభించారు. మరో రెండు తడులకు నీటిని అందించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రతి తడికి 5 టీఎంసీల చొప్పున విడుదల చేశారు. ఈ లెక్కన ఉన్న 22 టీఎంసీల్లో 15 టీఎంసీలను ఆయకట్టుకు విడుదల చేస్తే తాగునీటి అవసరాలు ఎలా తీరుస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలు పొట్ట దశలో ఉన్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నీటి వినియోగం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం తక్కువగా ఉండడంతో చివరి తడి వరకు నీటి విడుదల ప్రశ్నార్థకంగానే మారింది. ఏం చేస్తారో ఏమో..? ఎస్సారెస్పీలో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. ఇక, 6.5 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ పథకం కోసం నిల్వ ఉంచాలి. మరో 3 టీఎంసీలు ఆవిరి రూపంలో పోతుందని ప్రాజెక్ట్ రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన ప్రాజెక్ట్‌లో సుమారు 15 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే తాగు నీటి అవసరాలు తీరతాయి. అలాగే, ఆయకట్టు పంటలకు ప్రస్తుత తడితో కలుపుకుని మూడు తడుల నీరు అందించాలి.. గత తడుల లెక్క ప్రకారం ప్రతి తడికి 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్ట్‌లో తాగునీటి అవసరాలు, డెడ్‌స్టోరేజీ, ఆవిరి రూపంలో పోయే నీటి లెక్కలు పోను.. మిగిలేది 7.5 టీఎంసీలు మాత్రమే. దీంతో అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు ఏ విధంగా నీటిని విడుదల చేస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా పూడిక.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో పేరుకు పేయిన పూడిక నీటి నిల్వపై ప్రభావం చూపుతోంది. 1994లో చేపట్టిన సర్వే ప్రకారం ప్రాజెక్ట్‌లో 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని, ఆ లెక్క ప్రకారమే ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలుగా లెక్కిస్తున్నారు. 2014లో సర్వే చేపట్టిన ఏపీఈఆర్‌ఎల్ సంస్థ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు నివేదించింది. తాజాగా కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇదే ప్రకటించింది. అంటే అధికారుల లెక్కల ప్రకారమే 10 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. 1978లో హైడ్రోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా సంస్థ సర్వే నిర్వహించి, ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 112 టీఎంసీలుగా పేర్కొంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వే చేపట్టి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కించాలి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్‌లో పూడిక భారీగా పేరుకు పోయింది. 2004లో సర్వ చేపట్టిన ఓ సంస్థ ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం 70 టీంసీలకు పడిపోయినట్లు ప్రకటించినా.. ఇరిగేషన్ అధికారులు దానిని కొట్టిపారేశారు. రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2013లో రీసర్వే చేపట్టి ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితోనే ఏటా 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ఈ లెక్కన 54 ఏళ్ల కాలంలో ప్రాజెక్ట్‌లో ఏమేరకు పూడిక చేరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకరాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న ఎస్సారెస్పీ పూడికతీతపై దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పంటలకు నీరు అందిస్తాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు నిర్దేశించిన ప్రకారం నీరు అందిస్తాం. తాగునీటి అవసరాలకు కేటాయించినంతగా నీరు నిల్వ ఉండక పోవచ్చు. కానీ సకాలంలో వర్షాలు వస్తే తాగునీటి అవసరాలకు కూడా నీరు సరిపోతుంది. – రామారావు, ఎస్సారెస్పీ ఈఈ -
భగీరథ యత్నం
కొత్తకోట: రబీలో జిల్లాలోని కొత్తకోట ప్రాంతంలో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. భీమా ఫేస్–1 కాల్వ వెంట తిర్మలాయపల్లి, వడ్డేవాట, అమడబాకుల, కొత్తకోట, కానాయపల్లి గ్రామాల రైతులు వరిసాగు చేస్తున్నారు. వారబందీగా నీరు విడుదల చేస్తామని అధికారులు చెప్పడంతో సుమారు 400ఎకరాలకు పైగా వరి వేశారు. ఒకసారి కాల్వ ద్వారా నాలుగు గంటల పాటు విడుదల చేస్తే నెల రోజులకు సరిపడా నీరందుతుంది. కానీ అధికారులు నెలరోజులుగా కాల్వ ద్వారా విడుదల చేయడం లేదు. దీంతో కంకిదశలో ఉన్న వరి ఎండిపోతోంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఓ వైపు పంట ఎండిపోతుండడం.. మరోవైపు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అద్దె ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరందిస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడులు నష్టపోవద్దంటే ఇంతకంటే తమకు మరోమార్గం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తకోటకు చెందిన రైతులు మోహన్‌రెడ్డి, దాబా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వరి పొలాలకు ట్యాంకర్లకు ద్వారా నీరు పారిస్తూ ఇలా కనిపించారు. -
గొంతెండుతోంది
గత ఏడాది కాంట్రాక్టర్లకు బకాయిలు రూ.75 లక్షలు ఈ ఏడాది రూ.93 లక్షలు అవసరమని అధికారులు అంచనాజిల్లాలో చెరువులు నింపేందుకు రూ.20 లక్షలు అవసరంవీటితోపాటు జిల్లాలో 101 పంపులు మరమ్మతులకు రూ.17 లక్షల అంచనా .ప్రస్తుత ఎండాకాలం గట్టెక్కాలంటే రూ.1.30 కోట్లు అవసరం. 141 శివారు ప్రాంతాల్లో కటకట బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): జిల్లాలో మార్చి ఆరంభం నుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. జిల్లాలో 1096 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో 193 గ్రామాల్లో మంచినీటి కొరత పీడిస్తోందని అధికారులు గుర్తించారు. వీటితోపాటు 141 శివారు ప్రాంతాలు నీటికోసం కటకటలాడుతున్నాయి. ఆయా గ్రామాలు, శివారు ప్రాంతాలకు ప్రతిరోజూ మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటì సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మంచినీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు రూ.75 లక్షల బిల్లులు మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం సరఫరా చేసేందుకు ముందుకు రావడంలేదు. సుమారు 4,534 ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు రూ.93 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మంచినీటి చెరువులు నింపేందుకు రూ.20 లక్షలు అవసరం. వీటితోపాటు జిల్లాలో 101 పంపులు మరమ్మతులకు రూ.17 లక్షలు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఎండాకాలం గట్టెక్కాలంటే రూ.1.30 కోట్లు అవసరం. తలలు పట్టుకుంటున్న అధికారులు...: గ్రామాల్లో చాలా వరకు చేతిపంపులు కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో మంచినీటి కష్టాలు మరింత పెరిగాయి. మరికొన్ని గ్రామాల్లో మంచినీటి బావులు సైతం అడుగంటిపోవడంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. సరాసరి రోజుకి 50 నుంచి 70 లీటర్ల వరకు మంచినీరు సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం చాలా గ్రామాల్లో 20 లీటర్లు కూడా మంచినీరు సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. గ్రామాల్లో కూడా రక్షిత మంచినీరు లభించకపోవడంతో మినరల్ వాటర్ ప్లాంట్ల ద్వారా మంచినీటిని కొనుగోలు చేసుకుని తాగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానరాని ఎన్టీఆర్ సుజల పథకం... ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా గతంలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ అవి మూతపడ్డాయి. జిల్లాలో సుమారు 300ల పైగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల పథకాలు 70లోపు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వం వీటికి నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులు మూసివేస్తున్నారు. -
అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
గుంటూరు ఈస్ట్: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రోడ్డు, బారాఇమాంపంజా సెంటర్లో వారం రోజులుగా నీటి సమస్య, డయేరియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ఈ నిరసనకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసులు, పాతగుంటూరు ఎస్‌హెచ్‌వో బాలమురళీకృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపచేసేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు ర్యాలీగా పాత గుంటూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని అక్కడ రోడ్డుపై బైఠాయించారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నినదించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు షేక్ చాంద్‌బాషా, షేక్ సమీవుల్లా, కాంగ్రెస్ నాయకులు షేక్ బాజీ, స్థానిక నాయకులు మహమ్మద్ షరీఫ్, ఫిరోజ్, హమీద్ మాట్లాడుతూ శనివారం కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం మైనార్టీలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోనే వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారని, కొంత మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించి అభివృద్ధి మరించిందని ఆరోపించారు. ఈప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని, అనారోగ్యబారిన పడి ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం మృతిచెందిన కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
గోదారి.. ఎడారి!
మంథని: గోదావరి ఎడారిని తలపిస్తోంది. నదిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. సాధారణంగా ఏప్రిల్..మే మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటే గోదావరిలో నీటిధార ఆగిపోతుంది. కానీ.. ఈసారి రెండు మాసాలు ముందుగానే గోదావరి ఎండిపోయింది. వేసవిలో తాగునీటి ముప్పు ఇప్పుడే తెలియజేస్తుంది. నదీపరీవాహక ప్రాంతాల్లో సాగుచేసిన పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకరంగా మారింది. జిల్లాలో సుమారు వంద కిలో మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఎక్కడా చుక్కనీరు కనిపించడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఈ పరిస్థితి భవిష్యత్తు అవసరాల కోసం గోదావరినదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈసారి గోదావరినదిలో నీరు లేకుండా పోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ మొదలుకొని సుందిళ్ల పం పుహౌస్ వరకు గోదావరిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నదీ ప్రవాహాన్ని మళ్లించడమే కాకుండా నిర్మాణానికి నీటిని వినియోగిస్తుండడంతో నదీస్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒక్క మేడిగడ్డ వద్ద మాత్రం ప్రాణహిత నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద ఎక్కడా నీరు లేదు. తాగునీటికి పొంచి ఉన్న ముప్పు గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో ఈ సారి త్రాగునీటి సమస్య ముందే ఎదురౌతుంది. మంథని మేజర్ గ్రామపంచాయతీ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అదనంగా బోర్లు వేసి సౌకర్యం కల్పించారు. కాని గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడే అనేక గ్రామాల్లో బోర్లలో నీటి మట్టం తగ్గి ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. చెలిమె నీటితో పుణ్యస్నానాలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచరంగా వస్తుంది. శుభకార్యమైనా..ఆశుభకార్యమైన నదిలో స్నానం చేసి శుద్ధి చేసుకుంటారు. ఐతే నదిలో నీటి ధార లేకపోవడంతో చెలిమలను తోడుకొని పుణ్యస్నానాలు చేస్తున్నారు. గోదావరి నీటిని తీసుకెళ్లి ఇంట్లో శుద్ధిచేసుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల తంతుకూడా గోదావరి నదీతీరంలోనే ఎక్కువమంది చేస్తారు. నదీతీరంలో ఏర్పాటు చేసిన బోరు కింద స్నానాలు చేస్తున్నారు. చనిపోయిన వారి బొక్కలు కలుపడం సంప్రదాయం. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో కాళేశ్వరంనకు వెళ్తున్నారు. మహాశివరాత్రి భక్తులకు అసౌకర్యమేనా? ఈ నెల 13న మహాశివరాత్రి పర్వదినం ఉంది. పండుగ రోజున పుణ్యస్నానాలు చేసి ఉపవాసంతో జాగరణ చేస్తారు అనేక మంది భక్తులు. మంచిర్యాల జిల్లా వేలా లలో 13 నుంచి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. మల్లన్నకు భక్తులు బోనాలు సమర్పిస్తారు. జిల్లా పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలోని ప్రజలు వేలాల మల్లన్నను దర్శించుకొని బోనాలు, పట్నాలు సమర్పిస్తారు. నదీలో పుణ్యస్నానం చేసి స్వామి వారిని దర్శించుకోవడం ఆచారం. మహా శివరాత్రి మరో వారం రోజులు మాత్రమే ఉంది. పుణ్యస్నానాలకు నీటి వదిలితే తప్ప ఆ అవకాశం భక్తులకు ఉండదు. అధికారులు.. ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఎండిపోతోంది !
-
కేప్‌టౌన్‌లో నీటికి కటకట!
కేప్‌టౌన్: టెస్టు సిరీస్‌లో పేస్ బౌలింగ్‌తో భారత్‌ను బెంబేలెత్తించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికాకు తొలి మ్యాచ్‌లోనే సంకట స్థితి ఎదురవుతోంది. రెండేళ్ల క్రితం భారత గడ్డపై టెస్టు సిరీస్‌లో స్పిన్ దెబ్బకు చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా ప్రతీకారం సంగతేమో కానీ చివరకు పిచ్ భారత్‌కు అనుకూలంగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు! తొలి టెస్టు జరిగే ఈ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర నీటికొరత ఉంది. నీటి వాడకం తక్కువగా ఉంటే పిచ్‌ను పేస్, బౌన్స్‌కు అనుకూలంగా తీర్చి దిద్దడం చాలా కష్టంగా మారిపోతుంది. చివరకు వికెట్ పొడిగా మారి స్పిన్ బాగా ప్రభావం చూపించవచ్చు. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి జరిగే తొలి టెస్టు కోసం పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు క్యురేటర్‌కు కష్టంగా మారింది. -
ఈ నెల గడిచేనా..?
►కోరుట్లకు మంచినీటి గండం ►నిండని పాలమాకుల చెరువు ►ఖాళీ అవుతున్న తాళ్ల చెరువు.. ►భూగర్భజలాలకూ దెబ్బ కోరుట్ల: వర్షాలు జాడలేవు.. అరకొరగా వచ్చిన ఎస్సారెస్పీ నీరు..నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోరుట్లకు మంచినీటి ముప్పు పొంచి ఉంది. వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే.. ఈ నెలాఖరులో నీటి గండం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. పెరిగిన అవసరాలు... ఈ మధ్యకాలంలో కోరుట్ల జనాభా సుమారు లక్షకు మించిపోయింది. పట్టణంలోని 31వ వార్డుల్లో కలిపి మొత్తం 22 వేల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 13 వేలకుపైగా ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో మంచినీటి పైప్లైన్లు లేని ఏరియాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రతీరోజు పట్టణ జనాభా అవసరాలకు నల్లా కనెక్షన్ల ద్వారా సరాఫరా చేయడానికి సుమారు 4.2 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పట్టణ శివారులోని తాళ్ల చెరువు నుంచి నీటిని వాగులో ఉన్న బావుల్లో నింపి వాటర్ ట్యాంకుల ద్వారా పట్టణానికి సరాఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నల్లాల నుంచి నీటిని సరాఫరా చేస్తున్నారు. ఇదంతా మంచినీటి పైప్‌లైన్ ఉన్న చోట మాత్రమే జరుగుతోంది. మంచినీటి పైప్లైన్లు పూర్తిస్థాయిలో లేని భీమునిదుబ్బ, రథాల పంపు, హాజీపురా, ఆనంద్‌నగర్, ఆల్లమయ్యగుట్ట ఏరియాల్లో మంచినీటికి తిప్పలు తప్పడం లేదు. భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడంతో నల్లానీటిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నీటి అవసరాలు మరింత పెరిగాయి. అవసరాలు పెరిగినా నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారడంతో పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నెల గడిచేనా..? పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం వాడుతున్న తాళ్ల చెరువులో నీటి మట్టం దాదాపుగా డెడ్‌స్టోరేజీకి చేరింది. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ముందుచూపుతో ఎస్సారెస్పీ నీటిని వదిలిన సమయంలో మరో నీటి వనరుగా ఉన్న పాలమాకుల చెరువును నింపే ప్రయత్నం చేశారు. ఎస్సారెస్పీ నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఫలితంగా తాళ్ల చెరువు, పాలమాకుల చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి వనరులు మరో 20–25 రోజులకు మించి సరిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు లేని క్రమంలో భూగర్భ జలమట్టం సుమారు 900 ఫీట్లుకు పడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇటు మున్సిపల్ నల్లా నీరు లేక..అటు బోర్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఏడాది క్రితంలా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయాల్సిన దుస్థితి మళ్లీ వస్తుందా..? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. -
ఖరీఫ్ రైతులకు సాగునీటి కష్టాలు
-
వాడిన జుట్టు.. మాసిన బట్టలు
- వారానికి ఒకసారే స్నానం.. కాలకృత్యాల పరిస్థితి నరకం - మంత్రి కాలవ ఇలాకాలో కేజీబీవీ విద్యార్థినుల అవస్థలు గుమ్మఘట్ట : చదువులో ప్రథమం.. సౌకర్యాల్లోనే అధమంగా నిలుస్తోంది గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్ట్ వద్ద ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల. పది రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య విద్యార్థినులను వేధిస్తుండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. పాఠశాలలో 6 నుంచి 10 వరకు 200 మంది చదువుతున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన బోరుబావిలో రెండు నెలల కిత్రం నీరు అడుగంటిపోయింది. దీంతో విద్యార్థినులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రతి విద్యార్థినికీ స్నానం, బట్టలు ఉతుక్కోవడానికి రోజుకు కనీసం 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం. ఈ లెక్కన రోజుకు 10 వేల లీటర్ల నీరు అందుబాటులో ఉండాలి. కానీ 3 వేల లీటర్లు నిలువ చేసే సింటెక్స్ ట్యాంకులు ఉండటంతో మిగులు నీరు అన్ని వేళలా వాటిలో భద్రపరిచేవారు. ప్రస్తుతం కుళాయి ద్వారా రోజుకు వెయ్యి నుంచి 1,500 లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. తరగతులు, సెక్షన్ల వారీగా రోజుకు బకెట్ నీటిని మాత్రమే చౌకగా అందిస్తున్నారు. ఈ నీటిలోనే అన్నీ ముగించాలని చెబుతున్నారు. ఫలితంగా మాసిన బట్టలు.. వాడిన జుట్టుతోనే విద్యార్థులు చదువులకు వెళ్తున్నారు. రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతిని«థ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో పిల్లలకు ఇలాంటి కష్టాలు ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత తాగునీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. మాసిన బట్టలతోనే వెళ్తున్నాం నీటి ఇబ్బందుల దృష్ట్యా బట్టలను శుభ్రం చేసుకోలేకపోతున్నాం. వారానికి ఓసారి ఇంటికి పంపి శుభ్రం చేయించుకుని రమ్మని చెబుతున్నాం. దీంతో మాసిన బట్టలే దిక్కు అవుతున్నాయి. శాశ్వత నీటి కష్టాలు తీర్చాలి. – డి.శ్రుతి, 8వ తరగతి విద్యార్థిని బకెట్ నీరు సరిపోవడం లేదు బకెట్ నీరు ఏమాత్రం సరిపోడం లేదు. సీజనల్ వ్యాధులు సైతం ముసిరి ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో శుభ్రత పాటించకపోతే వ్యాధుల బారిన పడక తప్పదు. వంతుల వారీగా నీటిని అందిస్తున్నారు. – ఎం.అంబిక, 10వ తరగతి విద్యార్థిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం పాఠశాలలో తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు రోజుల కిత్రం తహసీల్దార్ అఫ్జల్ఖాన్, ఎంపీడీఓ జి.మెనెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు, ఎంపీపీ పాలయ్య కూడా పాఠశాలకు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. – షబానాబేగం, ఎస్ఓ, బీటీపీ సమస్య పరిష్కరిస్తాం విద్యార్థినుల తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు సత్వర పరిష్కారం చేపడుతాం. అందుబాటులో ఉన్న ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను తాగునీటికి ఖర్చు చేసేలా సంబంధిత ఎస్ఓను ఆదేశిస్తాం. అవసరమైతే ట్యాంకర్ ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చుతాం. – సుబ్రమణ్యం, ఆర్వీఎం, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ -
కన్నీటి కష్టాలు
కేజీబీవీల్లో నీటికి కటకట! ► అల్లాడుతున్న విద్యార్థినులు, ఉద్యోగులు ►మూడు రోజులకోసారి స్నానం..దుస్తులు ఉతుక్కోవడం లేదు ►బహిర్భూమికీ ఆరుబయటకే ఈ చిత్రం గుమ్మఘట్ట మండలంలోని బీటీపీలో ఉన్న కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయది. పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు అడుగంటడంతో పంచాయతీ బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా అవి విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కొళాయి నీటిని డ్రమ్ముల్లో నిల్వచేసి ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం...నీరు తక్కువగా ఉండడంతో బాలికలంతా పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి పాఠశాలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. అనంతపురం ఎడ్యుకేషన్ : లేపాక్షి కేజీబీవీలో 200 మంది విద్యార్థినులతో పాటు 15–18 మంది ఉద్యోగులు ఉన్నారు. భూగర్భజలాలు అడుగంటి ఉన్న ఒక్కబోరూ ఇటీవల ఎండిపోయింది. దీంతో రోజూ ఒక ట్యాంకరు నీళ్లు వస్తున్నాయి. అవి సరిపోకపోవడంతో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా దుస్తులు ఉతుక్కోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా లేపాక్షి ఒక్కటే కాదు జిల్లాలో చాలా కేజీబీవీల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భజలాలు అడుగంటడం...ప్రత్యామ్నాయ మార్గాలు పెద్దగా ఉపయోగపడకపోవడంతో కొన్ని కేజీబీవీల్లోని విద్యార్థులు మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గుమ్మఘట్ట, హిందూపురం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కనగానపల్లి, పరిగి, తనకల్లు, కుందుర్పి, అగళి కేజీబీవీల్లోని విద్యార్థులు నీటికోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఒక మనిషికి రోజు అవసరాల కోసం కనీసం 70 లీటర్ల నీరు అవసరం. అయితే కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇందులో సగం కూడా దొరకడం లేదు. మూడు రోజులకోసారి స్నానం నీటి కొరత కారణంగా కొన్ని కేజేబీవీల్లో విద్యార్థినులు మూడు రోజుకోసారి స్నానం చేస్తున్నారు. తరగతి గదిలో చమట వాసన భరించలేకున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అలాగే దుస్తులు ఉతుక్కోవడం లేదు. దీంతో మాసిన దుస్తులను వేసుకుంటున్నారు. గుమ్మఘట్ట కేజీబీవీలో నీటి సమస్య కారణంగా తరగతుల వారీగా వంతుల ప్రకారం స్నానాలు చేస్తున్నారు. అంటే వారంలో తొలిరోజు 6వ తరగతి, ఆతర్వాతి రోజు 7వ తరగతి ఇలా వంతుల వారీగా స్నాలకు నీళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక శెట్టూరు కేజీబీవీలో బోరు ఎండిపోగా ఇటీవల మండలస్థాయి ‘మీకోసం’ కార్యక్రమంలో స్వయంగా స్పెషలాఫీసర్ ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం నీటి సమస్య ఉంది కదా ‘సర్దుకోవాలి’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. నీటి సమస్య తీవ్రతరం కావడంతో చాలా కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఉపయోగించడం లేదు. దీంతో విద్యార్థినులు బహిర్భూమికోసం ఆరుబయటకు వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కేజీబీవీల్లో నీటి కష్టాలను తప్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిగమిస్తాం వేసవికాలం ప్రారంభం కాగానే చాలాప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయి. నీటి సమస్య అధికంగా ఉంటుంది. అయితే విద్యార్థినులెవరూ ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని ఆదేశించాం. నీటి సమస్య ఉన్నచోట అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థినీ ఇబ్బంది పడకుండా చూస్తాం. – సుబ్రమణ్యం, పీఓ ఎస్ఎస్ఏ -
ఇదేమి దౌర్భాగ్యం..?
ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు చిలమత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి రోజూ అన్నం తిని తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న మరుగుదొడ్ల వద్దకు వెళ్లి ప్లేట్లను శుభ్రం చేసుకొని నీళ్లు తాగి వస్తుంటారు. ఈ దృశ్యాలను చూస్తున్న వారంతా రోజూ అయ్యో పాపం అని అనుకుంటుంటే... అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రం చీమకుట్టినట్లైనా లేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని దాదాపు 800 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో పంచాయతీవారు ఏర్పాటు చేసిన కుళాయిల్లో నీరురాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం వస్తుందో... లేదో చూడాలి. - చిలమత్తూరు -
కస్తూర్బాలో కన్నీటి కష్టాలు
- విద్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు - 20 రోజులుగా దుస్తులు ఉతుక్కోని వైనం లేపాక్షి : అనంతపురం జిల్లా లేపాక్షిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో నీటికష్టాలు తారస్థాయికి చేరాయి. పాఠశాలలో గత జూన్ 12న తరగతులు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నీటి కోసం విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు హాజరైనప్పటి నుంచి దుస్తులు ఉతుక్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం విద్యార్థినులు ఏకమై పాఠశాల మెయిన్ గేట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయినులు, సిబ్బందిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. సుమారు గంటకు పైగా ఆందోళన నిర్వహించారు. ఉన్నతాధికారులు వచ్చి తాగునీటి సమస్య పరిష్కరించే వరకు తాళాలు తీయబోమని భీష్మించారు. చివరకు విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సుధారాణి ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేశారు. ఎంఈఓ నాగరాజు, ఎంపీడీఓ నటరాజ్, తహసీల్దార్ ఆనందకుమార్ విద్యాలయం వద్దకు చేరుకుని తాళాలను తీయించి సమస్యలు వివరించాలని కోరారు. ఈ సందర్భంగా 9వ తరగతి చదువుతున్న పుష్ప, 7వ తరగతి విద్యార్థిని శ్రవంతి, 10వ తరగతి విద్యార్థినులు అనూష, జ్యోతి తదితరులు కస్తూర్బాలోని సమస్యలను వివరించారు. అధికారులు మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇదే సమయంలో పరిస్థితిని జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఏ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇవీ సమస్యలు - 20 రోజులుగా నీటి సమస్య. - ఉన్న ఒక్క బోరు కూడా ఎండిపోయింది. - రోజుకు ఒక ట్యాంకరు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. - సంపులోకి నీరు సరఫరా చేస్తుండటంతో తోడుకునేందుకు అవస్థలు. - నీటి సమస్య కారణంగా అధ్వానంగా బాత్రూం, లెట్రీన్లు. - ఒంటిపై గుల్లలు, దరద. - మెనూ ప్రకారం భోజనం వడ్డించరు. - అరకొరగా కోడిగుడ్లు, చికెన్. -
ఇక నెల రోజులే!
‘దుర్గం మున్సిపాలీటీకి తాగునీటి గండం ఎస్ఎస్ ట్యాంకులో 30 రోజులకు సరిపడ హెచ్చెల్సీ తాగునీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే తప్పని నీటి కష్టాలు రాయదుర్గం టౌన్ : రాయదుర్గం పట్టణానికి తాగునీటి గండం పొంచి ఉంది. తాగునీటిని సరఫరా చేస్తున్న కణేకల్లులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో కేవలం ఒక నెలరోజుల పాటు సరిపడే నీరు నిల్వ ఉంది. దీంతో 62 వేల మంది పట్టణవాసుల్లో కలవరం మొదలైంది. తుంగభద్ర జలాశయానికి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై నేటికీ అధికారులు, పాలకులు చర్చించిన దాఖలాలు లేవు. రోజు విడిచి రోజు నీటి విడుదల ఎస్ఎస్ ట్యాంకు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3,052 మిలియన్ లీటర్ల కాగా, ప్రస్తుతం 728 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీటిని నెలరోజుల పాటు అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక రోజుకు ఒక మనిషికి తాగేందుకు , ఇతర అవసరాలకు 130 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా 70 లీటర్ల నీటిని మాత్రమే అందజేస్తున్నారు. కనిపించని ప్రత్యామ్నాయం కనీస నీటి అవసరాలకు ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు అధికారులు, పాలకులు నేటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దం చేసిన దాఖలాలు లేవు. పట్టణంలో మొత్తం 31 వార్డులుండగా ఇందులో 10 వార్డుల్లో ఉప్పు నీటి బోర్లు, నీటి ట్యాంకులు, చేతిపంపులు ఉన్నాయి. మిగిలిన వార్డుల్లో కొళాయిల నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి కాలనీల్లో యుద్దప్రాతిదికన బోర్లు ఏర్పాటు చేయడం, మరమ్మతుకు నోచుకున్న చేతిపంపులు, బోర్లను వినియోగంలోకి తేవడం లాంటి చర్యలను అధికారులు చేపట్టడం లేదు. నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటాం ఎస్ఎస్ ట్యాంకుకు సకాలంలో నీరు రానిపక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్యాంకర్ల సంఖ్యను పెంచడమే కాకుండా నీటి అవసరాలు తీర్చేందుకు బళ్లారి రోడ్డులోని జీఎల్ఎస్ఆర్ పరిసరాల్లో బోర్లు వేసి సగం పట్టణానికి నీటిని అందజేసే చర్యలు చేపడతాం. మిగిలిన చోట్ల కూడా బోర్లు వేసి నీటిని సరఫరా చేస్తాం. – సురేష్, మునిసిపల్ డీఈ -
ఈ ‘దాహం’ తీరనిది!
– ఈ ఏడాది రూ.124 కోట్లు నిధులు – నేటికి 679 గ్రామాలకు చేరని తాగునీరు – 162 గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా - నిధుల స్వాహాకే పెద్దపీట ప్రజల దాహాన్ని తీరుస్తాన్నమంటూ నిధుల స్వాహాకే నాయకులు పెద్ద పీట వేశారు. రూ. కోట్లు ఖర్చు పెట్టి ప్రవేశపెట్టిన పథకాలు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. తరాలు మారినా ‘అనంత’ గొంతు తడిపిన వారు లేరు.... నేతల ధన దాహమూ తీరలేదు. - అనంతపురం సిటీ గుక్కెడు నీటి కోసం జిల్లాలో కిలోమీటర్ల దూరం జనం పరుగులు తీయాల్సివస్తోంది. పలుమార్లు మహిళలు రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు తెలిపినా.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. బిందెడు నీటి కోసం రోజు కూలి పనులు వదుకునే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిల నుంచి ప్రజలను గట్టెక్కించాల్సిన ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ చర్యలను పక్కనబెట్టి అధికారులపై జులుం చేస్తూ భయపెడుతోంది. వాస్తవానికి సమస్య తీవ్రతను ఎత్తి చూపి, నిధులు రాబట్టుకోవడం.. దానిని క్షేత్రస్థాయిలో సక్రమంగా వినియోగించకుండా సొంత ఖజనాలకు తరలించుకోవడం ఆనవాయితీగా మారింది. ఫలితంగా ప్రతి ఏటా తాగునీటి సమస్య ఉత్పన్నమవుతూ ఉంది. నిధుల వరద ఇలా.. – ఈ ఏడాది జిల్లాలోని పలు గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు బకాయిలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. - ఇవి కాక కలెక్టర్ ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 58 కోట్లు ఖర్చయ్యాయి. – తాజాగా మరో రూ.40 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తంతో శింగనమల పరిధిలోని 25 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేలా పథకానికి రూపకల్పన చేశారు. – శ్రీరామరెడ్డి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ పనులకు రూ.32 కోట్లు మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. – చేతి పంపులు, బోర్ల మరమ్మతులు తదితర పనులకు రూ.4 కోట్లు మంజూరయ్యాయి. – శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పని చేసే సిబ్బంది వేతనాలు, ఇతర బత్యాలకు గాను ఏడాదికి రూ.23 కోట్లను ప్రభుత్వం ఇస్తోంది. ఇవి కాకుండా పలు పథకాల కింద మరిన్ని నిధులు మంజూరయ్యాయి. స్కీమ్‌లన్నీ స్కామ్‌లే జిల్లాలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది. అయితే ఆ పథకాలన్నీ చోటా నేతల జేబులు నింపుకునేందుకే సరిపోయాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో 56 తాగునీటి రక్షిత పథకాలు అమలులో ఉన్నాయి. పది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులున్నాయి. 1.05 టీఎంసీల తాగునీటిని రోజుకు సరఫరా చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇన్నీ ఉన్నా.. సగటున ఒక మనిషికి రోజుకు 30 లీటర్లకు మించి నీరు అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. 63 మండలాల్లోని 2,379 గ్రామాలకు ఈ 56 తాగునీటి పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రభుత్వం డిజైన్ చేసింది. ఇందులో 1,795 గ్రామాలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. మిగిలిన 679 గ్రామాలకు తాగునీటి పథకాలు చేరలేదు. జిల్లాలోనే అతిపెద్ద తాగునీటి పథకంగా ఉన్న శ్రీరామరెడ్డి పథకం ద్వారా 936 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే 836 గ్రామాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధాన పైప్‌లైన్ పనులు నాసిరకంగా ఉండడం.. ముందస్తు ప్రణాళిక లేకుండా వేసవిలో పైప్‌లైన్ పనులు చేపట్టడం కారణంగా ఈ పథకం ద్వారా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఫలితంగా 400ల పైచీలుకు గ్రామాలకు తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. పైగా ఒకే కంపెనీ కింద ఉన్న నిర్వహణ బాధ్యతను ఏడుగురికి అప్పగించి పథకం అమలు అస్తవస్త్యంగా మార్చారు. నిర్వహణ లోపంతో పంప్ హౌస్‌లోని రెండు మోటార్లు పాడైపోయాయి. దీంతో మంచి వేసవిలో నాలుగు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రధాన పట్టణాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రూ. 508 కోట్లతో 14 గ్రామాలకు నీళ్లు! 2007లో రూ.508 కోట్లతో 514 గ్రామాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన జేసీ నాగిరెడ్డి పథకం పనులు ఆదిలోనే నీటి సమస్యతో అనుకున్న మేర పూర్తి కాలేదు. ప్రస్తుతం 14 గ్రామాలకు మాత్రమే ఈ పథకం ద్వారా నీటిని అందజేస్తున్నారు. అధికార పార్టీ నేతల పెత్తనం వల్ల ఈ పథకం నిర్వీర్యమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. సత్యసాయి తాగునీటి పథకంలో లోపాలు లేకున్నప్పటికీ ఎక్కడపడితే అక్కడ అనువుగా ఉన్న గ్రామాలకు నీటిని మళ్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా 571 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. నిరుపయోగంగా చేతి పంపులు జిల్లాలోని 63 మండలాల్లో 12,674 చేతి పంపులున్నాయి. వేసవి సమీపిస్తుండగానే భూగర్భ జలాలు అడుగంటి 2,487 చేతి పంపుల్లో నీరు రాకుండా పోయాయి. ఇవి కాక 872 చేతి పంపులు నిరుపయోగంగా మారాయి. అధిక శాతం చేతి పంపులు మరమ్మతులకు గురవుతున్నాయి. సకాలంలో వీటిని ప్రజావినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జీపీఎస్ సిస్టమ్ అమలుపై విమర్శలు కరువు పీడిత 162 గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పదుల సంఖ్యలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన చోట రెండు, మూడు ట్యాంకర్లతో సరిపెట్టి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. వాస్తవానికి తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లకు జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని వల్ల ట్యాంకర్లు ఎన్ని ట్రిప్పుల నీటిని ప్రజలకు అందజేసింది స్పష్టంగా తెలుస్తుంది. అయితే జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వైనం ఎక్కడా కనిపించలేదు. ఈ లోపాన్ని ట్యాంకర్ నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. ప్రజావసరాలకు తగ్గట్లుగా నీటిని సరఫరా చేయకున్నా.. అంతా బాగా చేసినట్లు రికార్డులు చూపి ప్రజాధనాన్ని దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది వేసవిలో తాత్కాలికంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు వెచ్చించిన సొమ్ముతో శాశ్వత పరిష్కారాలు చూపే అవకాశమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. -
నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు
నల్లగొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని వేంకటాద్రిపాలెంలో నీటి కోసం ప్రజలు మంగళవారం ఉదయం రోడ్డు ఎక్కి ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన తమ నీటి కష్టాలు తీరలేదని, ,ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ కష్టాలు పట్టించుకోవటం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళల ధర్నా వల్ల కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించి పోయాయి. పోలీసులు ఎంత నచ్చ జెప్పినా మంచి నీరు మా ఊరికి వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గ్రామస్తులు రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్నారు. -
నీటి సమస్యను పరిష్కరించుకుందాం
-జీడీపీ నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ అవసరం - రూ. 56 కోట్లతో నాబార్డుకు ప్రతిపాదనలు -అఖిలపక్ష పారీ్టల నేతల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక కోడుమూరు రూరల్: పార్టీలకతీతంగా కలసి కట్టుగా మంచినీటి సమస్యను పరిష్కరించుకుందామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. శనివారం ఎంపీ కోడుమూరులో నెలకొన్న మంచి నీటి సమస్యపై స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో అఖిలపక్ష పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో నెలకొన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ నిర్మాణం చేపట్టడమొక్కటే మార్గమన్నారు. కోడుమూరు, చుట్టు పక్కల గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 56కోట్లు అవసరమని నాబార్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు. గడిచిన మూడేళ్లల్లో కోడుమూరు నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనులకు రూ.2.17కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. అన్ని పార్టీల నేతలు కలసి వస్తే నీటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని ఎంపీ సూచించారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నిరుద్యోగం, నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. తన పార్లమెంట్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి సంవత్సరం పుస్తకం ముద్రిస్తున్నట్లు చెప్పారు. -
గ్రేటర్ వరంగల్‌లో తాగినీటి ఎద్దడి
-
కోనసీమలో నీటి కట కట
-
తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన వార్డులో మంచి నీటి సమస్య ఉందని ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మున్నాపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. మున్నా ఇంటి వద్ద ధర్నాకు జేసీ వర్గీయులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి విషమించడంతో పోలీసులు తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. తాగునీటి సమస్య తీర్చాలని కోరిన వారిపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని మున్నా మండిపడ్డారు. -
నీటి కష్టాలు తాడిపత్రి మున్సిపల్ అధికారులు నిర్వాకం
-
దాహం కేకలు
చిలమత్తూరు : మండలంలోని మరసలపల్లి పంచాయతీ కేంద్రంలో గుక్కెడు నీటి కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. మాదిరెడ్డిపల్లి, దోరణాలపల్లి తదితర గ్రామాలకు చెందిన వ్యవసాయ బోర్లను ఆశ్రయించి నీరు తెచ్చుకుంటున్నారు. గ్రామంలో సుమారు 300 ఇళ్లల్లో 1,000 మంది జనాభా నివసిస్తున్నారు. పంచాయతీ వారు గ్రామానికి ఒకబోరు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటారు, పైపులైన్ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. మిగిలిన బోరుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్కు వ్యవసాయ బోరు తదితర సర్వీసులు ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సమస్య తలెత్తిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో నాలుగు రోజులగా చుక్క నీరు సరఫరా కాలేదు. ఫలితంగా చిన్న, పెద్ద తేడా లేకుండా బిందెలతో కిలోమీటర్లు నడిచి పలు గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్టు గ్రామస్తులు వివరించారు. నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని అ«ధికారులు హామీ ఇవ్వడంతో డీపీ కోసం దిమ్మె నిర్మిస్తే ఇంత వరకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయలేదని ఆవేదన చెందారు. పాలకులు, అధికారులకు సమస్య తెలియజేస్తే ఒక్కరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి అధికారులు స్పందించి గ్రామానికి అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి. నూతన ట్రాన్స్ఫార్మర్కు దిమ్మె ఏర్పాటు చేశాం. ఇంతవరకు అధికారులు స్పందించకపోవంతో సమస్య తలెత్తింది. - లక్ష్మీనారాయణ, మరసలపల్లి శాశ్వత పరిష్కారం చూపాలి నీరు, ట్రాన్స్ఫార్మర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. నాలుగు రోజులుగా నీటి సమస్యతో పలు గ్రామాలు, వ్యవసాయ బోర్లకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం. - అంజి, మరసలపల్లి -
ఎస్కేయూకు ఎక్కిళ్లు
- వర్సిటీలో తీవ్ర నీటిఎద్దడి - రోజుకు 10 లక్షల లీటర్లు అవసరం - సరఫరా అవుతోంది 2 లక్షల లీటర్లే -ల్యాబ్‌లు, చెట్లు, ఇతరత్రా వాటికి నీరు బంద్ ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గతంలో ఎన్నడూలేని విధంగా సమస్య ఉధృతరూపం దాల్చింది. ఎలా గట్టెక్కాలోనని వర్సిటీ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు, వర్సిటీ ఉద్యోగులు అవస్థ పడుతున్నారు. వర్సిటీకి రోజూ పది లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం రెండు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. ప్రధాన వనరులుగా ఉన్న పండమేరు వంకలోని మూడు బోరుబావులు అడుగంటిపోయాయి. సత్యసాయి పథకం ద్వారా రోజూ మూడు లక్షల లీటర్ల నీరు ఇచ్చేవారు. వేసవి కారణంగా ఈ పథకానికి నీటి లభ్యత తగ్గిపోయింది. దీంతో వర్సిటీకి సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం మహిళా వసతిగృహంలో ఉండే మూడు బోరుబావులు, చిత్రావతి హాస్టల్ వద్ద ఉండే ఒక బోరుబావి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదింట ఒక వంతు మాత్రమే అందుతుండటంతో పరిస్థితి దయనీయంగా మారింది. ట్యాంకర్లతో సరఫరా నీటి ఎద్దడిని కొద్దిమేరకైనా గట్టెక్కే ఉద్దేశంతో వారం నుంచి ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. అత్యవసర విభాగాలు తప్ప తక్కిన వాటికి బంద్ చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులందరూ హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశోధక విద్యార్థులకు సైతం ఈ ఆదేశాలివ్వడం గమనార్హం. ఉద్యోగ నివాస సముదాయాలకు రెండు, మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. పడకేసిన పరిశోధన వర్సిటీ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పెరగాలంటే సైన్స్ విభాగాల్లో పరిశోధనలే గీటురాయి. అయితే..ల్యాబ్స్‌కు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఉత్పన్నమైంది. వర్సిటీ ప్రాంగణంలోని చెట్లకు నీటి సరఫరా పూర్తిగా బంద్ చేయడంతో అవి ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడిని శాశ్వతంగా అధిగమించడానికి పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ప్రత్యేక పైపులైన్ వేయాలని ఎస్కేయూ యాజమాన్యం పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించింది. ప్రస్తుతం పీఏబీఆర్ నీరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు వస్తోంది. అక్కడి నుంచి వర్సిటీకి సమీపంలోని పూలకుంట గ్రామం వరకు నీరు సరఫరా చేయడానికి కొత్తగా పైప్‌లైన్ వేస్తున్నారు. దాన్ని కాస్త వర్సిటీ వరకు పొడిగిస్తే సమస్య శాశ్వతంగా తీరుతుంది. ఇటీవల నిర్వహించిన ‘నీరు – ప్రగతి’ కార్యక్రమంలో వర్సిటీలో నీటి ఎద్దడి గురించి వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.రాజగోపాల్ నేరుగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి హామీ లభించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి వర్సిటీ బోరుబావుల్లో ఆశించినంత నీరు లభించడంలేదు. పండమేరు వంకలో ఉన్న బోరుబావులు అడుగంటిపోయాయి. దీంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. –వి.మధుసూదన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ , ఎస్కేయూ -
బండెక్కిన బిందెలు
రొద్దం (పెనుకొండ) : మండలంలోని నారనాగేపల్లిలో తాగునీటి సమస్య తాండవిస్తోంది. గ్రామంలో 400 ఇళ్లు, 2 వేలకు పైగా జనాభా ఉంది. గ్రామంలో మూడు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం పెండ్లిజీవి గ్రామం పెన్నానది వద్ద ఉన్న చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా కాలి నడకన, ఎద్దుల బండ్లలో వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్య పరిష్కరిస్తాం : - మనోహర్, సర్పంచ్, నారనాగేపల్లి భూగర్భజలాలు అడుగంటిపోవడంతో సమస్య ఏర్పడింది. టాంకర్ల ద్వారా కొన్ని రోజులు నీటిని సరఫరా చేశాం. తర్వాత అధికారులు ఒప్పుకోకపోవడంతో ట్యాంకర్లను ఆపేశాం. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతాం. -
‘పురం’లో నీటిసమస్య పరిష్కారమే లక్ష్యం
హిందూపురం అర్బన్ : హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్ (డీఎంఏ) కన్నబాబు తెలిపారు. హిందూపురంలో నెలకొన్న తాగునీటి సమస్య, కూరగాయల మార్కెట్ నిర్మాణ విషయమై కన్నబాబు సోమవారం ప్రత్యేక పరిశీలనకు వచ్చారు. ముందుగా కూల్చివేసిన కూరగాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పరిగి రోడ్డులోని పీఏబీఆర్ పంపింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. తర్వాత మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కౌన్సిల్ హాల్లో అధికారులు, చైర్పర్సన్, కౌన్సిలర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగునీటి సమస్యకు నిధుల కొరత లేదన్నారు. అదనంగా బోర్లు ఫ్లషింగ్, కొత్తబోర్లు వేయడానికి డీఎంఏ నిధుల కింద రూ.16 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈవేసవిలో హిందూపురంలో నీటి సమస్య ఉండకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చే ఏడాదిలోపు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.250 కోట్లతో కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడతలో రూ.160 కోట్లు, రెండోవిడతలో రూ.90 కోట్లు విడుదలవుతాయన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై ప్రపంచబ్యాంకు సహకారంతో ప్రత్యేక సర్వే జరుపుతున్నామన్నారు. ఇందులో భాగంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేసి కార్డు ద్వారా ప్రతి ఇంటికీ 40 లీటర్ల శుద్ధిజలం అందిస్తామని చెప్పారు. అలాగే నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి త్వరలోనే ఎమ్మెల్యే బాలకృష్ణ చేత శంకుస్థాపన చేయిస్తామన్నారు. నాలుగు అంతస్తుల్లో నిర్మాణం జరుగుతుందన్నారు. ఇందుకోసం రూ.23 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పీఏ వీరయ్య, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఫయాజ్ అహ్మద్, ఏడబ్ల్యూఈ లోక్‌నాథ్, మున్సిపల్ ఎస్ఈ ఇమాం, తహసీల్దార్ విశ్వనాథ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాము, ఇంజినీర్ రమేష్, టీపీఓ తులసీరాం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
– ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు నగరంలో నెలకొన్న తాగునీడి ఎద్దడిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరకోనున్నట్లు తెలిపారు. అనంతరం 10.30 గంటల నుంచి భారీ ధర్నాను నిర్వహించనున్నామని, కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, ఇన్చార్జీలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో పక్కనే నదులు పారుతున్న చుక్కనీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన విమర్శించారు. -
ప్ర‘జల’ కష్టం పట్టదా?
పాలకులకు ముందుచూపులేకపోవడంతోనే నగరంలో తాగునీటి సమస్య – హంద్రీజలాల వినియోగంలో నిర్లక్ష్యం – కర్నూలు నగరంలో నీటి సమస్యపై 24న కలెక్టరేట్ వద్ద ధర్నా – ధర్నాను జయప్రదం చేయండి - ప్రజలకు, పార్టీశ్రేణులకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరంలో మంచినీటి ఎద్దడితో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పాలకులు, అధికారులకు పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. దీనికంతటికి వారికి ముందుచూపు లేకపోవడమే కారణమని ఆరోపించారు. పక్కన నదులు పారినా నీటిని ఎందుకు నిల్వ చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. నీటి సమస్య పరిష్కారానికి ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గౌరు వెంకటరెడ్డితో పాటు పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది నీటి ఎద్దడి నెలకొందన్నారు. హంద్రీ జలాలు వాడుకునేందుకు మూడు నెలల క్రితమే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు 24న ఉదయం 9.00 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుంచి 10 గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరుతామన్నారు. 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ధర్నా ఉంటుందన్నారు. నీటి విడుదలలో వివక్ష- ఎమ్మెల్యే గౌరుచరిత నగరానికి మంచినీటి సమస్య పొంచి ఉన్న విషయాన్ని జనవరి నెల నుంచే అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా పట్టనట్లు వ్యవహరించారని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. అరోరానగర్‌కు నీరు సరఫరా అయి మాధవీనగర్‌కు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అధికారులు నీటిసరఫరాలో పక్షపాతం వహిస్తున్నారని, అశోక్‌నగర్, ఎన్నార్పేటలో మాత్రం కొరత లేకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 14 వార్డుల ప్రజలు నీటిపన్ను కట్టడం లేదా అని ప్రశ్నించారు. అధికారులకు తెలియదా?కొత్తకోట అక్టోబర్ తర్వాత వర్షాలు రాలేదని, నగరానికి నీటి సమస్య ఏర్పడుతుందని అధికారులకు ముందే తెలియదా అని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నీళ్లకంటే మద్యం పుష్కలం చంద్రబాబు పాలనలో మంచినీళ్ల కంటే మద్యం పుష్కలంగా లభిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ఎద్దేవా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే సమ్మర్ స్టోరేజీ, సుంకేసులప్రాజెక్టును పరిశీలించడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజల కష్టాలకు ఇవ్వదన్నారు. వాటర్ మేనేజ్మెంట్ పాటించడం లేదు.. అధికారులు వాటర్ మేనేజ్మెంట్ పాటించడం లేదని పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ విమర్శించారు. 10 నిమిషాలసేపు వచ్చే నీటి కోసం ప్రజలు రాత్రంతా జాగరణలు చేస్తున్నారని, రోజూ సరఫరా చేస్తున్నట్లు పాలకులు ప్రకటించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారుల మెడలు వంచుదాం మంచినీటి సమస్యపై భారీ ధర్నా నిర్వహించి అధికారుల మెడలు వంచుదామని పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ పేర్కొన్నారు. వినతులు ఇస్తే అధికారులు మాట వినడం లేదన్నారు. దోమల నివారణ తరహాలో ఉద్యమిద్దాం.. దోమల నివారణ కోసం చేపట్టిన మహాధర్నా తరహాలోనే పార్టీ శ్రేణులు మంచినీటి ఎద్దడిపై గళం విప్పాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, మైనారిటీసెల్, ఎస్సీసెల్ల రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్యలు, మైనారిటీసెల్, కిసాన్సెల్ల రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, పిట్టం ప్రతాప్‌రెడ్డిలు, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు ఈశ్వర్, మహేశ్వరరెడ్డి, ఎస్.ఎ.అహ్మద్, బుజ్జి, సఫియాఖాతూన్, మంగమ్మ, విజయలక్ష్మి, వాహిద, పేలాల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఇది ప్రభుత్వ నిర్వాకమే!
- మంచినీటి సమస్యపై శంకరనారాయణ పెనుకొండ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెనుకొండతోపాటు జిల్లాలోని అనేక మండలాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానంగా తాగునీటి సమస్యే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథికి అధికారంపైనే వ్యామోహమని, ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదని అన్నారు. ప్రజలు తాగునీటికి విలవిలలాడుతుంటే కనీసం వారి సమస్యలను వినే పరిస్థితిలో కూడా లేరన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని పామిడిలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గొల్లపల్లి రిజర్వాయర్‌కు గడువులోగా నీరు తీసుకొస్తామని ఇచ్చిన హామీని ఎంతమాత్రం నెరవేర్చారో చెప్పాలన్నారు. ఈ రిజర్వాయర్‌కు నీరు తీసుకురావడంలో విఫలమైన ఆయన తెప్పోత్సవం వంటి మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రూ.4వేల కోట్ల పంట నష్టం సంభవించి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం ఇన్పుట్ సబ్సిడీ కానీ, బీమా కానీ అందించిన పాపాన పోలేదన్నారు. ప్రజలు జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? అని ఎదురు చూస్తున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, నారాయణరెడ్డి, కన్వీనర్లు వెంకటరత్నం, శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, ఫక్రోద్దీన్, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం చంద్రశేఖర్, ఎంపీటీసీ రామ్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హిందూపురంలో ఉద్రిక్తత
-
హిందూపురంలో ఉద్రిక్తత
అనంతపురం: తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. జిల్లాలోని హిందూపురంలో తీవ్ర నీటి ఎద్దటి ఉండటంతో.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానికులంతా కలిసి ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుకు నిరసనగా దున్నపోతులపై పెయింటింగ్‌లతో ప్రదర్శన చేపట్టారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీలతో తెగబడ్డారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
బిందెడు నీటి కోసం రోజంతా పడిగాపులు
-
ప్రత్యామ్నాయమే శరణ్యం
- నీటి సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం కేఈ - గ్రామాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశం - తక్షణ పరిష్కారం కింద ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్): ‘జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఆర్డబ్ల్యూఎస్ ఆధికారులు అన్ని పంచాయతీలు, నివాసిత ప్రాంతాల్లో అధ్యయనం చేసి పక్కా ప్రణాళికలతో ప్రతిపాదనలు పంపితే తక్షణ చర్యలు తీసుకుంటాం.. అప్పటి వరకు సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయండి’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నీటి సమస్య, పరిష్కారంపై ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా నీటి సమస్య తీవ్రత, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం కేఈ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుంకేసుల ద్యామ్లో నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులను అన్వేషించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమున్న గ్రామాల్లో నీటి వనరులు గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తే జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేస్తారని కేఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు స్పష్టం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలకు జాప్యం లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశానికి నీటిపారుదల శాఖ సీఈ గైర్హాజరుకావడంపై కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది బకాయిలు చెల్లించాలి... నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో గత ఏడాది ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ.1.32 కోట్ల బిల్లులను చెల్లిస్తే ఈ ఏడాది నీటి సరఫరాకు కంట్రాక్టర్లు ముందుకు వస్తారని పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. నంద్యాల మండలం కొత్తపల్లిలో సర్పంచ్ ప్రభుత్వ బోరు పైప్‌లైన్‌ను కట్ చేసి నీటి సరఫరాకు ఆటంకాలు కల్గిస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిద్ర పోతున్నారా అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై విరుచుకు పడ్డారు. సోమవారం సాయంత్రానికి పైప్‌లైన్‌ను పునరుద్ధరించాలని, సర్వంచ్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 8 గ్రామాలకు నీరు అందించే శ్రీరంగాపురం సీపీడబ్ల్యూ స్కీమ్‌ను పునరుద్ధరించాలని మంత్రి జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఫైళ్లు తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు.. నీటి సమస్య పరిష్కారానికి సంబంధించిన ఫైళ్లను మీ దగ్గరకు తెచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు భయపడుతున్నారని డోన్ నియోజక టీడీపీ ఇన్చార్జీ కేఈ ప్రతాప్ పేర్కొనగా తప్పు చేసిన వారికే భయం ఉంటుందని, మిగతావారు ధైర్యంగా వస్తారని కలెక్టర్ బదులిచ్చారు. ప్రస్తుతం ఆన్లైన్ ఫైళ్లు కావడంతో ఆ సమస్య కూడా లేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సుంకేసుల డ్యామ్‌లో తుంగభద్ర నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. అన్ని గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయండి నీటి సమస్య సమీక్షలో భాగంగా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉన్న గ్రామాలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అయితే ఇందుకు వర్క్ ఆర్డర్ ఉండి తీరాలని తెలిపారు. సమస్య పరిష్కారానికి గ్రామ సభలతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంది, బుడ్డారాజశేఖర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
బాలయ్యా..నీళ్లేవయ్యా!
-
నీటి కోసం బండి కట్టాల్సిందే..!
-
దాహార్తి తీరింది..!
♦ బోరు అద్దెకు తీసుకుని నీటి సరఫరా ♦ మరో బోరుకు కూడా మరమ్మతులు ♦ రాజనాయక్ తండావాసుల్లో సంబరం తుంగతుర్తి: పదేళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న ఆ తండా వాసుల దాహర్తి తీరింది. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ తండాకు పిల్లను కూడా ఎవరూ ఇవ్వడం లేదు. వారి ఆవేదనను వివరిస్తూ ‘పానీ చేనికన్.. ఛార్విన్ దేరేకొని’ శీర్షికన శనివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ క్రమంలో మంగళవారం తండాకు నీటి సరఫరా చేశారు. సూర్యాపేట జిల్లా లోని తిరుమలగిరి మండలం మారుమూల గ్రామమైన జలాల్పురం శివారు రాజనాయక్ తండాలో పదేళ్లుగా గిరిజనులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. తండాలో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బావులు, బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్.. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరలో తండావాసుల నీటి కష్టాలు తీర్చాలని ఆదేశించారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సోమ, మంగళవారాల్లో తండాను సందర్శించి నీటి వనరులను సమీక్షించారు. తండాకు కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోరులో నీరు ఉండటంతో ఆ రైతును పిలిచి డబ్బులు చెల్లిస్తాం వేసవిలో నీటి సరఫరా చేయాలని కోరారు. అనంతరం తండా వెలుపల ఉన్న మరో బోరుకు మరమ్మతులు చేయడంతో కొద్దిగా నీరు వస్తోంది. ఈ రెండు బోర్లద్వారా తండాలోని ట్యాంక్‌ను నింపి మంగళవారం నీటిని సరఫరా చేశారు. నీటి సమస్య తీరడంలో ఆ తండావాసుల ఆనందానికి హద్దులు లేవు. నీటి సమస్య పరిష్కారానికి తోడ్పడిన సాక్షి దినపత్రికకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు మా తండాకు 10 ఏళ్ల నుంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సాక్షి పత్రిక వారు మా బాధలను తెలుసుకొని కథనాన్ని రాశారు. దీంతో అధికారులు స్పందించి మా తండాకు నీటిని సరఫరా చేశారు. సాక్షి పత్రికవారికి కృతజ్ఞతలు. – మాలోతు హరిలాల్, రాజనాయక్ తండా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడ్డాం. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించి, మా తండాకు నీటిని తెచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా. కిలోమీటర్ దూరం నడిచే బాధ తీరింది. – మాలోతు బుజ్జి, రాజనాయక్ తండా -
అనంతపురం జిల్లాలో నీటి కష్టాలు
-
అనంతపురం జిల్లాలో నీటి కష్టాలు
-
గొంతెండుతోంది..!
► మూలకు చేరిన బోర్లు ► గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణం ► పనిచేయని తాగునీటి పథకాలు ► పెద్ద పథకాలకు నిధులు మంజూరుకావు ► చిన్న ప్రతిపాదనలకు కదలిక లేదు.. ►తాగునీటికి అల్లాడుతున్న జనం పనిచేయని పథకాలు 150 జిల్లాలో ఉన్న బోర్లు16,859 నిర్మాణంలో ఉన్న భారీ రక్షిత పథకాలు 6 సింగిల్ విలేజ్ స్కీంలు 1262 సమగ్ర మంచినీటి పథకాలు 29 మరమ్మతుల్లో ఉన్న బోర్లు 2,500 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో అధిక సంఖ్యలో తాగునీటి పథకాలు, బోర్లు ఉన్నా ప్రయోజనం శూన్యమే. ప్రజలకు తాగునీటి వెతలు తీరడం లేదు. ప్రతి 250 మందికి ఒక తాగునీటి చేతిపంపు ఉండాలి. దీనికి రెండున్నర రెట్లు బోర్లు జిల్లాలో ఉన్నాయి. అందులో మరమ్మతులకు గురయినవే ఎక్కువ. క్రాష్ ప్రోగ్రాం అంటూ అధికారులు చేస్తున్న హడావుడి బోర్లు వరకు వెళ్లడం లేదు. పల్లెల్లోని చేతిపంపులు బాగు పడడం లేదు. మరమ్మతు పనులు అరకొరగానే సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పథకాలు ఉన్నా.. జిల్లాలో చాలా చోట్ల తాగునీటి పథకాలున్నా నీరు సరఫరా కావడం లేదు. బోర్లలో నీరు లేకపోవడం, ట్యాంకులకు నీరు చేరక పోవడం, పైప్లైన్ల లీకేజీలు ప్రజలకు శాపంగా మారాయి. నేటికీ జిల్లా ప్రజలుచెలమలు, నేలబావులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని 928 పంచాయతీలకు తాగునీరు అందించేందుకు రూ.3,650 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అన్ని గ్రామాలకూ ఇంటింటికీ కుళాయి ప్రాతిపదికన పంపిన ప్రతిపాదనల్లో కనీసం కదలిక లేదు. రాష్ట్ర బడ్జెట్లో అసలు తాగునీటికి నిధులు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద పథకాలు మంజూరు కావడం ఆలస్యమవుతుందని గ్రహించిన జిల్లా అధికారులు మరో 110 కోట్లతో కొద్దిపాటి మరమ్మతులతో పనిచేయగలిగే పథకాలకు ప్రతిపాదనలు పంపించారు. వీటికి కూడా ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. దీంతో జిల్లాలోని సుమారు 150 తాగునీటి పథకాలు మూలకు చేరాయి. కొత్త పథకాల్లో నాణ్యత డొల్ల ! జిల్లాలో ఆరు పథకాలు గత ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నాయి. ఇటీవలే దత్తిరాజేరు, ఎస్. కోట పథకాలు పూర్తి చేశారు. పూర్తి చేసిన పథకాల్లో సామర్థ్యం కన్నా తక్కువ సైజ్ ఉన్న పైపులు వేయడంతో తాగునీరు అంద డం లేదు. దీంతో ఈ పథకం పరి«ధిలోని గ్రామాల్లో మంచి నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జమదల, నర్సిపురం, పాచిపెంట, ఎస్.కోట రెండు ఫేజుల పథకాలు నేటికీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దత్తిరాజేరు, ఎస్.కోట–1 నిర్మాణాలు పూర్తయ్యాయని కాంట్రాక్టర్లు, అధికారులు చెబుతున్నా చివరి గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎస్డీపీ గ్రాంట్లతో కొత్త స్కీంలు పెడుతున్నామని ప్రకటించినా పనులు మాత్రం జరుగ డం లేదు. ఇటీవల రూ.38 కోట్లతో 481 పనులు ప్రారంభిస్తే అందులో 155 మాత్రమే పూర్తి చేశారు. మిగతావి నత్తనడకన సాగుతున్నాయి. గొట్లాంలోని రక్షిత నీటి పథకం నుంచి 25 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండగా నేటికీ పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. ఏజెన్సీల్లోని ప్రజలు వాగులు, చెలమల్లోని నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. సాలూరు మండలం గంజా యి భద్ర గ్రామంలో 200 మంది నివసిస్తున్నా వారికి మంచినీటి బోరు లేదు. దీంతో గ్రామ శివారులో వచ్చే చిన్న గెడ్డ నీటికి అడ్డంగా ఓ చిన్న తుప్పు పట్టిన గొట్టాన్ని ఏర్పాటు చేశారు. దీనినుంచి వచ్చిన కలుషిత నీటితో గొంతు తడుపుకుంటున్నారు. కురుపాం. గుమ్మలక్ష్మీపు రం వంటి గ్రామాల్లో ఊట గుంతలు, నీటి చెలమల నుం చి వచ్చే నీరే ప్రాణాధారం. గొంతు తడుపుకునేందుకు జీవాధారవిుదేనని వారు ఆవేదన చెందుతున్నారు. ఏజెన్సీలో తీవ్రమైన తాగునీటి సమస్య.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. సుమారు 8 మండలాల్లో తాగునీటికి జనం అల్లాడుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్మమ్మవలస, మక్కువ, గరుగుబిల్లి, కొమరాడ తదితర మండలాల్లో మంచినీటి ఎద్దడి నెలకొంది. కొద్దిపాటి నీరు ఊరే గుంతలు, ఊట బావులు, చెలమలపై ఆధారపడుతున్నారు. 20 నుంచి వంద కుటుం బాలుండే గిరిజన గూడల్లో ఒక్కో బోరు ఉండడం, కొన్నిచోట్ల బోరు కూడా లేకపోవడంతో కష్టాలు తప్పడంలేదు. రాత్రంతా ఊరే నీరు సేకరణకు తెల్లవారు జాము నే పరుగులు తీస్తున్నారు. కలుషిత నీటినే తాగుతూ అనా రోగ్యం పాలవుతున్నారు. కురుపాం మండలం ఒప్పంగి లో ప్రజలు వేకువ జామునే వెళ్లి ఊటబావి నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు ప్రయాసలు పడుతున్నారు. ఇదే మండలం గొందిలోవలో ఒక్క బోరు మాత్రమే ఉంది. ఇందులో చుక్క నీరు రావడం లేదు. వేసవికి ముందుగానే ఎండిపోతోంది. గ్రామం ఆవల ఉన్న చెలమలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ కూడా పడిగాపులు కాస్తేనే తాగునీరు లభ్యమవుతోంది. సాలూరు మండలం గంజాయి భద్రలో తాగునీటి పథకం మంజూరు చేయాలని కోరినా పట్టించుకునేవారే కరువయ్యారు. చర్యలు తీసుకుంటున్నాం.. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. సంచార వాహనాల్లో సిబ్బందిని పంపించి తాగునీటి వనరులను బాగుచేయిస్తున్నాం. అవసరమైన పరికరాలను ఎంపీడీఓల ఆధ్వర్యంలో అందజేస్తున్నాం. భారీ రక్షిత పథకానికి ప్రతిపాదనలు చేశాం. అవి వార్షిక ప్రాతిపదికన నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. చిన్నపాటి మరమ్మతులు, సింగిల్ విలేజ్ స్కీంలపై దృష్టి సారించాం. కొత్తగా 110 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం. –ఎన్వీ రమణమూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆర్డబ్ల్యూఎస్, విజయనగరం -
పానీ చేనికన్.. ఛ్వారిన్ దేరేకొనీ..!
నీళ్లు లేవని తండాకు పిల్లను ఇవ్వడంలేదట - సంవత్సరంలో రెండు నెలలే తండాకు నీరు - మిగతా రోజుల్లో 3 కిలోమీటర్ల నుంచి మోత - వారానికోమారే తండావాసులు స్నానం - తండాకు రావాలంటే భయపడుతున్న పిల్లలు - రాజునాయక్ తండా క‘న్నీటి’గాథ ‘ఈ ఫొటోలో వాళ్ల అమ్మకు నీళ్లు ఇస్తున్న యువకుడు మాలోత్ దేవేందర్. ఎం.ఫార్మసీ చదివాడు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి నుంచి తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి బంధువులు వచ్చారు. అబ్బాయి బాగున్నాడు. మంచి చదువు చదివాడని కట్న కానుకలు కూడా మాట్లాడుకున్నారు. పూలు పండ్లు పెట్టుకున్నారు. తీరా లగ్గం పెట్టుకునేందుకు తండాకు రాగా.. తండావాసుల నీటి కష్టాల గురించి విన్న పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తమ బిడ్డను ఈ తండాలో ఉంటేæ ఇవ్వం.. మీ తండాలో నీళ్లు లేవు. నా బిడ్డ మూడు కిలోమీటర్ల నుంచి నీళ్లు తేవాలా..? నీళ్లు వచ్చినప్పుడే లగ్గం పెట్టుకుంటాం.. అని వెనుదిరిగి వెళ్లారు. ’ సాక్షి, సూర్యాపేట: పానీ చేనికన్.. ఛ్వారిన్ దేరేకొనీ..! అంటే లంబాడి భాషలో నీళ్లు లేవని తండాకు పిల్లను ఇవ్వడంలేదని అర్థం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జమాల్‌పురం ఆవాసంలోని రాజునాయక్‌తండా వాసుల పరిస్థితి మారలేదు. ప్రతీ ఎన్నికలప్పుడు నాయకులు వస్తూనే ఉంటారు. నీటి కష్టాలు తీరుస్తామని, రోడ్లు వేస్తామని చెబుతారే తప్ప.. తమ కష్టాలు తీర్చే నాథుడే లేరని తండావాసులు వాపోతున్నారు. తమ తండా గురించి తెలిసిన వారు తండాకు పిల్లను ఇవ్వడంలేదని, నీళ్లు లేక ఎండా కాలంలో తండా నుంచి కొన్ని కుటుంబాలు బయటకు వెళ్లి వర్షాలు పడిన తర్వాత వస్తారని గిరిజనులు చెబుతున్నారు. అందరికీ అన్ని వసతులు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం, నాయకులు తమ నీటి కష్టాలను ఎందుకు తీర్చడంలేదని ప్రశ్నిస్తున్నారు. కిలోమీటర్ల దూరం వరకు నీరు లేదు.. తిరుమలగిరి మండల కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలోని రాజునాయక్తండాలో భూగర్భ జలాలు అడుగంటాయి. గత పదేళ్ల క్రితం వరకు ఊరి బయట ఉన్న గుట్ట వద్ద చెలిమలు తీసుకుని ఆ నీటిని తెచ్చుకునేవారు. తండాలో వేసిన బోర్లు, ట్యాంకులకు చిన్న దారగా నీరు వచ్చేది. కానీ ఇప్పుడు తండాలో బోరు వేయని ఇల్లు లేదు. అదీ కూడా 200 అడుగులకు పైగా బోర్లు వేసినా.. చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. భయపడుతున్న పిల్లలు.. 120 కుటుంబాలు, 400 మంది జనాభా ఉన్న రాజునాయక్‌తండా నుంచి విద్యార్థులు జిల్లాలోని తిరుమలగిరి, సూర్యాపేట, హైదరాబాద్, తుంగతుర్తి ప్రాంతాల్లో సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్నారు. ఎవరైనా సెలవులు రాగానే ఇంటికి వెళ్లాలని భావిస్తారు. కానీ ఈ తండా పిల్లలు మాత్రం తమ ఇంటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి రావాలి. మగవారైతే వారానికోమారు స్నానం చేయాల్సిన పరిస్థితి. బట్టలు ఉతకాలన్నా, స్నానాలు చేయాలన్నా దూరంగా ఉన్న వ్యవసాయ బావులే దిక్కు. అదేవిధంగా ఇప్పటికే నీటికష్టాలు పడలేక తండా నుంచి పలు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయా యి. తండాకు వస్తే నీళ్లు దొరకవని, బంధువు లు, కుటుంబ సభ్యులు కూడా రావడంలేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య తీరేదెట్టా.. సంవత్సరాల తరబడి నీటి గోస పడుతున్న తండావాసుల నీటి కష్టాలు తీరేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టా ల్సిన అవసరం ఉంది. తండాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంపటి, బండరామారంలో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ బోర్లు వేసి పైపులైన్ల ద్వారా తండాకు నీటిని సరఫరా చేయవచ్చని తండావాసులు అంటున్నారు. సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమ తం డాకు నీటి కష్టాలు తీర్చేందుకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. నీటి కోసం తిప్పలు పడుతున్నాం... తండాలో ప్రతీ ఇంటిలో బోర్లు వేశాం. 200 ఫీట్లు వేసినా చుక్క నీరు లేదు. అంతా బండ. తండా అడుగున గుట్టలు ఉన్నాయి అంటున్నారు. దీంతో నీటి కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇల్లు కట్టాలన్నా.. నీటి ఇబ్బందే. తాగేందుకే నీరు లేదు. ఇక స్నానం, బట్టలు పిండడం అంతా కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావులు వద్దనే. – మాలోత్ నీలమ్మ, గృహిణి నా కొడుకు పెళ్లి జరగలేదు... నా కొడుకు పెద్ద చదువు చదివిండు. పెళ్లి కుదిరింది. లగ్గం పెట్టుకోవాలంటే తండాలో నీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా పెళ్లి చేస్తారు.. అంటున్నారు అమ్మాయి ఇంటి వాళ్లు. బండరామారాం, వెంపటిలో బోర్లు వేసి మా తండాకు నీల్లు వచ్చేలా చేయండి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చేన్లు, చెలకల వద్ద నుంచి నీరు తేవాల్సి వస్తుంది. – మాలోత్ బుజ్జి రోజురోజుకూ లోతుకెళ్తున్న నీళ్లు తండాలో ఎప్పుడూ నీటి తిప్పలే. పది, పదిహేను సంవత్సరాల క్రితం తండాకు పక్కనే ఉన్న గుట్ట వద్ద చెలిమలు తీస్తే నీరు వచ్చేవి. ఇప్పుడు చెలిమలు ఎండిపోయాయి. నీరు రావడంలేదు. ఎన్ని బోర్లు వేసినా నీటి చుక్క అన్న మాటేలేదు. వర్షాకాలం రెండు నెలలు. అదీ కూడా వర్షాలు పడితే పొలాలు, నీటి గుంటల్లో, చెలిమల్లో నీరు ఉంటుంది. లేకపోతే లేదు. నీరు లేక మనవడు, మనవరాళ్లు తండాకు రావాలంటేనే భయపడుతుంటారు. – మాలోతు కృష్ణ, వృద్ధుడు -
గుక్కెడు నీళ్ల కోసం తెగింపు
-
ఖరీఫ్‌పై నీలి నీడలు
మొరపెట్టుకున్నా కరుణించేవారేరీ? ఈ ఏడాది జూ¯ŒS 15 తరువాతనే సాగునీరు సాగు సమ్మెలో డిమాండ్‌నూ పట్టించుకోని వైనం బ్రిటిష్ కాలంలో పద్ధతిగా నీళ్లిచ్చేవారు ఆ ప్రణాళిక అమలు చేయాలంటే పట్టించుకోని వైనం మండిపడుతున్న డెల్టా రైతులు అమలాపురం : తెల్లవారి పాలనలో... బ్రిటిష్ పాలనా కాలంలో మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇచ్చేవారు. జూ¯ŒS 15 నాటికి రైతులు నాట్లు పూర్తి చేసేవారు. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తయి అన్నదాతలంతా ఆనందంతో గడిపేవారు. ఆ తరువాత అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వచ్చిన అల్ప పీడనం, తుపాన్ల బారి నుంచి బయటపడేవారు. మనవారిపాలనలో... మే 15వ తేదీన కాకుండా ఓ నెల ఆలస్యంగా అంటే జూ¯ŒS 15 తరువాత నీరు విడుదల చేస్తున్నారు. దీంతో తుపాన్లలో చిక్కి చేతికొచ్చే పంటా వరదపాలయ్యేది. 2011లో సాగు సమ్మె ఉధృతంగా జరిగింది. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి 2012 మే 25న సాగునీరు విడుదల చేశారు. ఆ తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో గత ఖరీఫ్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు. ‘బ్రిటీష్ కాలంలో ఇచ్చినట్టుగా మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇవ్వాలి. అలా ఇస్తే జూ¯ŒS 15 నాటికి నాట్లు పూర్తి చేస్తాం. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తవుతాయి. అప్పుడే మా పంట మాకు దక్కుతుంది. ఆలస్యమైతే అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వస్తున్న అల్ప పీడనలు, తుపాన్లకు పంట నష్టపోవడం పరిపాటిగా మారింది’ అని డెల్టా రైతులు మొరపెట్టుకుంటున్నారు. 2011లో జరిగిన సాగు సమ్మె ఉద్యమ సమయంలో ఇదే ప్రధాన డిమాండ్. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లలో ఇదొకటి. సాగుసమ్మె జరిగిన తరువాత ఏడాది 2012 మే 25న సాగునీరు ఇచ్చిన ఇరిగేష¯ŒS అధికారులు తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో డెల్టా రైతులు పంటను నష్టపోతున్నారు. దీనికి నిరసనగా గత ఖరీఫ్‌లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా జూ¯ŒS 15 తరువాతే మధ్య డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించడం ఇక్కడ గమనార్హం. ‘కనీస సదుపాయాలు కల్పించండి ... పంట పండించి దేశానికి ధాన్యరాశులు అందిస్తాం’ రైతులు చేస్తున్న డిమాండ్ ఇదీ. డెల్టాలో సాగవ్వాల్సిన 40 వేల ఎకరాలను బీడుగా పెట్టి ప్రాధేయపడుతున్న వేడుకోలు ఇది. అయినా పాలకులు పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించడంతో అన్నదాతలుఅల్లాడిపోతున్నారు. మే రానే వచ్చింది. మళ్లీ రైతన్న పిడికిలి బిగుస్తోంది. అన్ని అనర్థాలకూ ఇదే కారణం... lసాగునీరు ఆలస్యంగా ఇవ్వడమే మధ్య డెల్టాలో సాగు నష్టపోవడానికి కారణమవుతోంది. జూ¯ŒS 15 నాటికి నీరు విడుదల చేయడం వల్ల అక్టోబరు 20 తరువాత తుపాన్లబారిన పడి పంట నష్టపోవడంతో రైతులు కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు. l తుపాన్ల నుంచి పంటను రక్షించుకునే ఉద్ధేశంతో కొంతమంది రైతులు సాగు ఆలస్యం చేసి ఆగస్టు మొదటివారంలో నాట్లు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల డిసెంబరు నెలాఖరు నాటికి కాని కోతలు పూర్తి కావడం లేదు. దీంతో రబీసాగు ఆలస్యమవుతోంది. రబీ నాట్లు సంక్రాంతి తరువాత కూడా పడడం వల్ల ఏప్రిల్ 10 వరకు సాగునీరు విడుదల చేయాల్సి వస్తోంది. తమకు ఈ నెల 20 వరకు సాగునీరు విడుదల చేయాలని కొంతమంది రైతులు కోరుతుండడం చూస్తుంటే సాగు ఎంత జాప్యమవుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ ఆలస్యం కావడం వల్ల మూడో పంట అపరాలు సాగు లేకుండా పోతోంది. దీనివల్ల రైతులు అదనపు ఆదాయం కోల్పోవడమే కాకుండా భూసారాన్ని పెంచి పచ్చిరొట్ట ఎరువులకు దూరమవుతున్నారు. కాలువలను ఆలస్యంగా మూసివేయడం వల్ల అటు ఇరిగేష¯ŒS శాఖాధికారులు సైతం ఆధునికీకరణ పనులను ఆశించిన స్థాయిలో చేయడం లేదు. ఈ అనర్ధాల నుంచి గట్టెక్కాలంటే మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లోను కష్టాలు తప్పేటట్టు లేవు. -
నీటి సమస్య పరిష్కరించండి
► అసెంబ్లీలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం : మార్కాపురం నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలోని మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయని తెలిపారు. ఈ ప్రాంతంలో 1000 అడుగుల లోతున బోర్లు వేసినా నీరు పడే పరిస్థితి లేదన్నారు. మంచినీటి సమస్య జనవరి నుంచే ప్రారంభమైందని, నీటి రవాణా కూడా కష్టమై ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని పొదిలి, కొనకనమిట్ల మండలాల్లోని 32 ప్రాంతాల్లో రూ.95 కోట్లతో నీటి పథకం, అలాగే మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని 32 ప్రాంతాల్లో రూ.600 కోట్లతో పథకం, మార్కాపురం మండలం ఇడుపూరు, తర్లుపాడు మండలాల్లో సాగర్‌నీరు కవర్ కాని ప్రాంతాల్లో రూ.110 కోట్లతో నీటి ఎద్దడి నివారణ కోసం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. పథకాలు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖామంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడిని కోరారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల ద్వారా శాశ్వత పరిష్కారానికి మూడు ప్రాజెక్టులు రూపొందించామని, ఇటీవల కేంద్రం ప్రకటించిన పథకంలోగానీ, రాష్ట్ర నిధుల నుంచిగానీ మంజూరు చేయాలని కోరారు. అలాగే బొందలపాడు, తుమ్మలచెరువు రోడ్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గం ప్రాధాన్యత క్రమంలో ఉందని తెలిపారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అలానే అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేయటం మంచిది కాదని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిసి రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేయటం సరికాదన్నారు. గతంలో కృష్ణాజిల్లా తహసీల్దార్ వనజాక్షిపై కూడా టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు కేసులు నమోదు చేయకుండా రాజీ చేయటం వలన అధికారుల మనోధైర్యం దెబ్బతింటుందన్నారు. ప్రజాసేవ చేస్తున్న అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. -
కేజీబీవీల్లో దాహం దాహం
అల్లాడుతున్న విద్యార్థినులు, ఉద్యోగులు మూడు రోజులకోసారి స్నానం..దుస్తులు ఉతుక్కోవడమూ కష్టమే నీటి కొరతతో మరుగుదొడ్లు బంద్ హిందూపురంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 200 మంది విద్యార్థినులతో పాటు 15 మంది దాకా సిబ్బంది ఉన్నారు. తాగునీటి కోసం రెండు బోర్లు వేయించారు. ఒక బోరులో నీళ్లు అరకొరగా వస్తున్నాయి. మరో బోరు చెడిపోయింది. దీంతో తాగేందుకు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో మునిసిపల్ ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. ఆ నీళ్లు ఏ మాత్రమూ చాలడం లేదు. ఇలాంటి పరిస్థితే జిల్లా వ్యాప్తంగా చాలా కేజీబీవీల్లో ఉంది. వేసవి ప్రారంభమైంది. దీంతో పాటే జిల్లాలోని చాలా కేజీబీవీల్లో నీటి కష్టాలూ మొదలయ్యాయి. జిల్లాలో 62 కేజీబీవీలు ఉన్నాయి. దాదాపు 30 చోట్ల నీటి సమస్య ఉంది. వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. అసలే ఎండాకాలం. ఒకరోజు స్నానం చేయకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఉదయం, రాత్రి రెండు పూటలా స్నానం చేసి ఉపశమనం పొందుతున్నారు. అలాంటిది నీటి కొరతతో కొన్ని కేజీబీవీల్లో మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మసముద్రం, కనగానపల్లి, హిందూపురం, పరిగి, తనకల్లు, కుందుర్పి, అగళి కేజీబీవీల్లో నీటి సమస్య మరీ జఠిలంగా మారింది. ఒక మనిషికి రోజుకు కనీసం 70 లీటర్ల నీరు అవసరం. అయితే కేజీబీవీల్లో విద్యార్థినులకు ఇందులో సగం కూడా అందడం లేదు. రోజూ స్నానం చేయకపోవడంతో తరగతి గదిలో చమట వాసన భరించలేకపోతున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అలాగే దుస్తులు ఉతుక్కోవడం లేదు. మాసిన దుస్తులను అలాగే వేసుకుంటున్నారు. నీటి సమస్య ఉంది కదా.. ‘సర్దుకోవాలి’ అంటూ సిబ్బంది సలహా ఇస్తున్నారు. మరి కొన్ని కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఉపయోగించడం లేదు. నీరులేక అవి నిరుపయోగంగా మారాయి. విద్యార్థినులు బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. ఊరి శివారు ప్రాంతాల్లో కేజీబీవీలు ఉండటంతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి సమస్య గురించి సంబంధిత అధికారులకు తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు, తల్లిదండ్రులు, సిబ్బంది వాపోతున్నారు.కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిగమిస్తాం – వాణీదేవి, గర్ల్‌చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ), సర్వశిక్షా అభియాన్ విద్యార్థినులెవరూ ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని ఆదేశించాం. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించాం. కేజీబీవీల్లో పర్యటించి నీటి సమస్య ఉన్నచోట అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థినీ ఇబ్బంది పడకుండా చూస్తాం. -
వి'దాహ'నగరం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మంచినీటి పథకం విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న తోటపాలెం వైఎస్సార్‌నగర్‌లో ఉంది. సుమారు రూ. 45.5లక్షల వ్యయంతో 2015లో నిర్మించిన ఈ పథకం కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరమ్మతు చేయిద్దామని ముందుకు రావడం లేదు. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అయినా వారికి పట్టడంలేదు. ఇది జిల్లా కేంద్రంలో ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యే అనుకుంటే పొరపాటే. జిల్లాలో ఇలాంటి పథకాలు అనేకం ఉన్నాయి. ఒకవైపు క్రాష్ప్రొగ్రాం పేరిట హడావుడి చేస్తున్నా ఎక్కడా తాగునీటి సమస్య పరిష్కార దిశగా అడుగులైతే పడటంలేదు. ► జిల్లా కేంద్రంలోనే దాహం కేకలు ► తోటపాలెం వైఎస్సార్‌కాలనీలో పనిచేయని మంచినీటి పథకం ► వేసవి వచ్చేసినా చొరవ చూపని యంత్రాంగం ► మిగతా చోట్లా అదే పరిస్థితి సాక్షి ప్రతినిధి, విజయనగరం : వేసవి వచ్చేసింది. జిల్లా వ్యాప్తంగా అప్పుడే నీటి ఎద్దడి మొదలైంది. తాగునీటి ఇక్కట్లు లేకుండా, పరిష్కార చర్యలు తీసుకునేందుకు అప్రమత్తమైనట్టు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా క్రాష్ ప్రొగ్రామ్ నిర్వహిస్తుండగా, పట్టణాల్లో మున్సిపల్ యంత్రాంగం తగు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఎక్కడే సమస్య ఉన్నా ఇట్టే పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్టు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేశారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదని చెప్పడానికి తోటపాలెం వైఎస్సార్‌కాలనీలో లక్షలాది రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇదేదో నదిపై ఆధారపడిన మంచినీటి పథకం అనుకుంటే పొరపాటే. ఊటబావుల రీచార్జ్‌తో పనే లేదు. స్థానికంగా తీసిన బోరు ద్వారా కాలనీ వాసులకు నీరు సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితులూ అంతే...: జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 150 వరకు మంచినీటి పథకాలు చెడిపోయినట్టు లెక్కలు ఉన్నాయి. వీటి సంగతి ఎలా ఉందో స్థానికులకే ఎరుక. ఒకవైపు కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో మంచినీటి సమస్య తలెత్తకూడదని, నిధుల కోసమని వెనక్కి చూడొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశిస్తున్నారు. తరచూ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ, అధికారులకు ఇవేవీ తలకెక్కడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పాలకులు కూడా వీటిగురించి పట్టించుకోవడంలేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి: వాస్తవానికి ఈ పథకం 2013 డిసెంబర్ 11వ తేదీన మంజూరైంది. దీన్ని నిర్మించడానికి అధికారులకు రెండేళ్లు పట్టింది. 2015లో ప్రారంభమైంది. కానీ, కాలనీ వాసులకు సక్రమంగా ఎప్పుడూ నీరందించడం లేదు. ఎప్పటికప్పుడు మొరాయిస్తోంది. మున్సిపల్ అధికారులకు ఎప్పుడో బుద్ధి పుడితే అలా వచ్చి ఏదో చేసి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత పరిస్థితి మామూలే. సాధారణంగా వేసవి సీజన్ వచ్చేసరికి మరమ్మతుకు గురైన మంచినీటి పథకాలను యుద్ధ ప్రతిపాదికన బాగు చేయాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తారు. కానీ, విజయనగరం మున్సిపల్ అధికారులకు తోటపాలెం వైఎస్సార్ కాలనీలో మూలకు చేరిన మంచినీటి పథకం గుర్తుకు రాలేదు. అసలిక్కడ బోర్లు ఎలా ఉన్నాయి? మంచినీటి పథకం ఎలా ఉంది? అన్నదానిపై పరిశీలనే జరగలేదు. వేసవి నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. ఇక్కడదేమీ జరగకపోవడంతో నెలల తరబడి పనిచేయని మంచినీటి పథకానికి మోక్షం కలగడం లేదు. చెప్పాలంటే అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో 250కి పైగా కుటుంబాలు తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నాయి. మరమ్మతు చేయిస్తాం: ఆ నీటి పథకం పనిచేయడం లేదని నా దృష్టికి రాలేదు. తప్పని మరమ్మతు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం. మున్సిపల్ డీఈని పంపిస్తాను. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. తాగునీటి సమస్య లేకుండా చూసుకుంటాను. ---నాగరాజు, మున్సిపల్ కమిషనర్, విజయనగరం -
వేసవికి ముందే ఎక్కిళ్లు!
అప్పుడే మొదలైన నీటి కష్టాలు పడిపోతున్న భూగర్భ జలమట్టాలు గ్రామాలు, తండాల్లో తాగునీటి తిప్పలు నీటిఎద్దడి ప్రాంతాలను గుర్తించే పనిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వేసవికి ముందే జిల్లాలో తాగునీటి సమస్య నెలకొంది. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుముఖం పట్టడం.. నీటి వనరులు వట్టిపోతుండటంతో గ్రామాలు, గిరిజన తండాల్లో తాగునీటి కొరత ఏర్పడుతోంది. దీనికితోడు గ్రామాల్లోని చేతిపంపులు పనిచేయకపోవటం, మరమ్మతులకు సైతం నోచుకోకపోవటంతో నీటి సమస్యకు దారితీస్తోంది. ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావులను ఆశ్రయిస్తున్నారు. చిన్నశంకరంపేట మండలం జప్తిశివనూరు గ్రామంలోని ఎస్పీకాలనీ వాసులు ఇటీవల తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా తెలుస్తోంది. కలుషిత నీరే దిక్కు బోరు మోటారు చెడిపోయి 15 రోజులవుతున్నా.. మరమ్మతు చేయించకపోవడంతో కాలనీలో నీటి ఎద్దడి నెలకొంది. ఫలితంగా కలుషిత నీరే దిక్కవుతోంది. తాము రోజూ రాత్రివేళలో బాలవికాస్‌కు చెందిన నీటి శుద్ధి యంత్రం ద్వారా పడిపోతున్న వృధా నీటిని పట్టుకుంటున్నాం. వెంటనే బోరును మరమ్మతు చేయించాలి. – శ్రీదేవి, నిజాంపేట సాక్షి, మెదక్ : జిల్లాలో మొత్తం 320 గ్రామాలు, వందకుపైగా గిరిజన తండాలున్నాయి. వీటిలో సుమారు 80 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. వర్షా కాలం చివరలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో జిల్లాలో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. అయితే డిసెంబర్ మాసం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో 14 మీటర్ల మేర ఉన్న భూగర్భ జలమట్టాలు ప్రస్తుతం 22 మీటర్లకు చేరుకున్నాయి. రబీలో బోరుబావుల కింద పంటల సాగు గణనీయంగా పెరగటంతో భూగర్భజలాల వాడకం పెరుగుతోంది. దీనికితోడు పట్టణ ప్రాంతాల్లో సైతం భూగర్భజలాలను ఎడాపెడా తోడేస్తున్నారు. దీంతో జల మట్టాలు పడిపోతున్నాయి. అల్లాదుర్గం మండలంలో 22 మీటర్లు, కొల్చారంలో 21.25, టేక్మాల్‌లో 19.69, మెదక్‌లో 15.24, హవేళిఘనపూర్‌లో 14.80 మీటర్ల మేర లోతుకు భూగర్భజలాలు చేరుకున్నాయి. దీంతో ఆయా మండలాల్లో తాగునీటి సమస్య ప్రారంభమైంది. భూగర్భ జలమట్టాలు పడిపోవటానికి తోడు జిల్లాలోని నీటి వనరులు సైతం ఎండిపోతున్నాయి. ఇది కూడా తాగునీటి సమస్యకు దారితీస్తోంది. నీటి కోసం తిప్పలు చిన్నశంకరంపేట మండలంలోని జప్తిశివనూర్ గ్రామ ఎస్సీ కాలనీ, గిరిజన తండాలో మంచినీటి సమస్య నెలకొంది. స్థానికులు మంచి నీటి కోసం వ్యవసాయ బోరుబావులతో పాటు స్థానిక చెరువులోంచి బిందెల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించాల్సిల్సిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులుగాని పట్టించుకోవడంలేదని కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అలాగే మండలంలోని జంగరాయి నాగులమ్మ తండాలోను నీటి సమస్య నెలకొంది. గిరిజనులు వ్యవసాయ బోర్లపై ఆధారపడి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. రామాయంపేట మండలంలోని కాట్రియాల, దంతెపల్లి, పర్వతాపూర్ పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో పదేళ్లక్రితం నిర్మించిన వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా ఉండటంతో, ఈమూడు తండాల్లో తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి నెలకొంది. తండాల్లోæ ఉన్న చేతిపంపులు చెడిపోవడంతో నీటికోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రేగోడ్ మండలం దోసపల్లి గ్రామ పంచాయతీలోని సంగమేశ్వర తండాలో సుమారు 225 మంది జనాభా ఉంది. ఇందులో రెండు చేతి పంపులు ఉన్నా నీళ్లు సరిగ్గా పనిచేయటంలేదు. ఇరవై రోజులుగా తాగునీటికి కోసం తండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దశంకరంపేటకు రేగోడ్ మండలం బోరంచ నుంచి మంజీర సరఫరా అవుతుంది. గత ఏడాది నుంచి నూతనంగా పైప్లైన్లు వేస్తుండడంతో పాటు, రహదారి విస్తరణ వల్ల పాత పైపులైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో పెద్దశంకరంపేటకు తాగునీరు నీరు సరఫరా కావడం లేదు. కమలాపూర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ వేసవిలో మాత్రం తాగునీటికి ఇబ్బందులు తప్పేలాలేవు. మండల పరిధిలోని బూర్గుపల్లితాండాలలో మంచినీటి ట్యాంకులు ఉన్నా నీరు సరఫరా లేదు. తండా వాసులు పంట పొలాల్లోంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. చేగుంట మండల కేంద్రమైమైన బుడగ జంగాల కాలనీలో ఏళ్ల నుంచి నీటి తిప్పలు పడుతూనే ఉన్నారు. కాలనీలో 40 కుటుంబాలు ఉండగా కాలనీ సమీపంలోనే ఓ వాటర్ ట్యాంకుతో పాటు మినీ ట్యాంకులను నీటి సరఫరా కోసం నిర్మించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. నీటి సమస్యను తీర్చడానికి కాలనీ సమీపంలో బోరుబావిని తవ్వించినా నీరు రాలేదు. నీటి సమస్యను గుర్తించే పనిలో అధికారులు జిల్లాలో నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మండలాల వారీగా నీటి సమస్య ఉన్న గ్రామాలను, పనిచేయని బోరుబావుల వివరాలు సేకరిస్తున్నారు. నీటి సమస్య నెలకొంటే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు గురించి ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నీటి ఇబ్బందులు తప్పడం లేదు తండాలో కొత్తగా బోరు వేసినా తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. ఉన్న రెండు చేతిపంపుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. తాగునీటి సమస్య ఎప్పటిలాగే ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. – రవి, తండావాసి, రేగోడ్ మండలం. నీళ్ల కోసం పొలాల వద్దకు పోతున్నాం మా కాలనీలో నీళ్ల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. బోర్లలో నీరు లేకపోవడంతో పొలాల దగ్గర బోర్లవద్ద నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎండాకాలం వస్తే నీటి కోసం ఎంత కష్టపడాలో అర్థమైతలేదు. కాలనీలో ఉన్న ట్యాంకుల్లోకి నీళ్లు వచ్చేలా చేసి మావాడలో నీటి సమస్యను తీర్చాలి. అందరం కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లమే ఉన్నాం. నీటి ఇబ్బందులతో ఒక్కో సారీ పనులకు కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే కాలనీలోకి నీళ్లు వచ్చేలా చేయాలి – కడమంచి సత్తమ్మ, బుడగజంగాల కాలనీ, చేగుంట. -
డెల్టా కంట తడి
in godavari, water level down, water problem గోదావరిలో పడిపోయిన ప్రవాహ జలాలు , పొంచి ఉన్న సాగునీటి గండం పశ్చిమ డెల్టా కంటతడి పెడుతోంది. గోదావరి నదిలో సహజ జలాలు పడిపోవడంతో నీటి తడులు అందక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతులవారీ విధానం అమల్లో ఉన్నా.. రైతుల కష్టాలు తీరడం లేదు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే ముప్పు పొంచి ఉంది. కొవ్వూరు : గోదావరి నదిలో ప్రవాహ జలాలు గణనీయంగా పడిపోయాయి. రబీ సీజన్లో డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు నాటికి సీలేరుతో కలిపి 90 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కకట్టారు. దీనిలో ఇప్పటి వరకు 61.208 టీఎంసీల నీరు వాడేశారు. ఇంకా సుమారు రెండు నెలలు రబీసాగుకు నీటితడులు అందించాలి. పంటలు కీలక దశలో ఉన్నందున ప్రస్తుతం మార్చి నెలకు 30 టీఎంసీల నీరు అవసరం. కానీ అందుబాటులో ఉన్నది మాత్రం 29 టీఎంసీలే. దీనిలో ఈనెలాఖరు వరకు సాగునీటి సరఫరాకు 13 టీఎంసీల వరకు వాడే అవకాశం ఉంది. అంటే మిగిలేది 16 టీఎంసీలే. అంటే పంట గట్టెక్కాలంటే ఇంకా 10 నుంచి 15 టీఎంసీల నీరు అదనంగా అవసరం ఉందని అధికార వర్గాల అంచనా. ఫలితంగా నీటి పొదుపు చర్యలు పటిష్టంగా అమలు చేయకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దుస్థితి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గుతున్న నీటిమట్టం ఈనెల 15 నుంచి గోదావరి నీటి మట్టం క్రమేణా తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పాండ్లెవెల్ 15న 13.32 మీటర్లు ఉంటే 19 నాటికి 13.23 మీటర్లకు తగ్గింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు కలిపి 8,240 క్యూసెక్కుల నీరు అందుతోంది. దీనిలో సీలేరు నుంచే 5,300 క్యూసెక్కులు వస్తోంది. అంటే గోదావరి ప్రవాహ జలాలు 3వేల క్యూసెక్కులలోపు మాత్రమే వస్తున్నాయన్నమాట. రానున్న రోజుల్లో వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత పెరిగితే ప్రవాహ జలాల లభ్యత మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎండలు క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా సాగుకు నీటితడుల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కులు కచ్చితంగా అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినా కేవలం 4,280 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. నీరందక రైతుల అవస్థలు డెల్టాలోని ప్రధానంగా అత్తిలి మండలం ఈడూరు, కంచుమర్రు, కొమ్మర, స్కిన్నెరపురం, పాలకొడేరు మండలం మోగల్లు, మైప, గరగపర్రు, పాలకోడేరు, కుముదవల్లి, కొండేపూడి, కోరుకొల్లు, శృంగవృక్షం, కాళ్ల మండలం కాళ్లకూరు, ఆకివీడు మండలం చెరుకుమిల్లి, ఉండి మండలం చెరుకువాడ, కలిసిపూడి తదితర గ్రామాల ఆయకట్టులో రైతులు నీటి తడులందక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు నీళ్లందక ఆయిల్ ఇంజిన్ల సాయంతో తోడుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా అందించే ఆయిల్ ఖర్చులూ ఈ ఏడాది అందించడం లేదు. గత ఏడాది చెల్లించాల్సి ఆయిల్ ఖర్చులు ఇప్పటికీ చాలామంది రైతులకు ఇవ్వలేదు. నీటి ఎద్దడి పరిష్కారానికి 187 చోట్ల కాలువలకు అడ్డుకట్టలు వేయాలని అధికారులు నిర్ణయించినా 60 చోట్ల మాత్ర మే అడ్డుకట్టలు వేశారు. మరో అరవై ప్రదేశాలలో నీళ్లు ఎత్తిపోయాలని నిర్ణయించినా కేవలం 25 చోట్ల మాత్రమే మోటార్లు, కరెంటు సిద్ధం చేశారు. పథకం నిర్వహణపై శ్రద్ధేదీ! పెనుగొండ మండలం దొంగరావి పాలెం వద్ద ఏటా రబీ సీజన్లో ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్ ఆయకట్టు నీటి అవసరాలు తీరుస్తున్నారు. గత ఏడాది ఎత్తిపోతల పథకం నిర్వహణకు బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఈ పథకం మూలనపడింది. దీని ద్వారా ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లో ఆయకట్టుతోపాటు పోడూరులో కొంత ఆయకట్టుకు సంమృద్ధిగా నీరందించే అవకాశం ఉంది. అధికారులు ఆ దిశగా యత్నాలు ప్రారంభించలేదు. కనీసం రెండు టీఎంసీల నీటిని అదనంగా గోదావరి నుంచి వాడుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ రబీ సీజన్లో గోదావరి నుంచి పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సరఫరా చేసిన నీటి వివరాలు నెల సరఫరా సహజ జలాలు సీలేరు జలాలు ( టీఎంసీల్లో ) డిసెంబర్ 25.192 17.201 7.991 జనవరి 23.144 13.208 9.936 ఫిబ్రవరి 12.872 5.288 7.584 మొత్తం 61.208 35.697 25.111 ఇబ్బందులు పడుతున్నాం సాగునీరందక చేలన్నీ బీటలు వారుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడుకుంటున్నాం. ఎకరా తడికి ఒక పర్యాయానికి రూ.800 ఖర్చు అవుతోంది. రాత్రి, పగలు చేలవద్ద కాపాలా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. నీటికోసం అదనపు వ్యయం కావడంతో కౌలు రైతులు నష్టపోవాల్సివస్తోంది. – కె సూర్రావు, కౌలురైతు, కంచుమర్రు -
నీటి సమస్య పరిష్కారానికి సమష్టి కృషి
అనంతపురం సిటీ : జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని సమష్టిగా పరిష్కరిద్దామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హారేరామ్‌నాయక్ సిబ్బందిని ఆదేశించారు. ‘గుటకలేశాకే..గుక్కెడు నీరు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ హరేరామ్‌నాయక్ మాట్లాడుతూ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. సమీప ప్రాంతాల్లోని పొలాల్లో నీరు ఉంటే సంబంధిత రైతును ఒప్పించి, అక్కడి నుంచి నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నించాలన్నారు. అవసరమైతే తాత్కాలిక పైప్లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. సమస్య తీవ్రం ఉంటే వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమైనా ఆర్డబ్ల్యూఎస్ శాఖనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు ప్రతి ఉద్యోగీ పని చేయాలన్నారు. జిల్లాలో నెలకొన్న నీటి సమస్యను అధిగమించేందుకు ఈ నెల 17న ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను ఆయా సబ్ డివిజినల్ కార్యాలయాలకు పంపుతామన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలు కూడా ఈనెల 17న 08554 -275769 నంబర్‌కు ఫోన్ చేసి, నీటి సమస్య తెలియజేయాలన్నారు. -
మరో 19 మందికి అస్వస్థత
రెండో రోజూ ఆస్పత్రికి రోగుల తాకిడి కాకినాడ రూరల్ : పండూరులో కుళాయిల ద్వారా సరఫరా అయిన కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు అధికంగా స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తరలి వస్తుండడంతో ఆస్పత్రి కిటకిటలాడింది. సరిపడినన్ని మంచాలు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ రోగులను పరుండబెట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కనీసం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి రక్షిత తాగునీటిని అందించకపోవడం, గతంలో పనికిరావని తెలిసి మూతవేసిన పైపులను మళ్లీ తెరిపించి సూర్యారావుపేట పంపింగ్ స్కీము నీటిని సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారంటూ గ్రామస్తులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పండూరులో గురువారం కలుషిత నీరు తాగి 20 మంది అవస్థతకు గురికాగా శుక్రవారం మరో 19 మంది విరేచనాలు, వాంతులతో ఆస్పత్రికి తరలి వచ్చారు. రెండు రోజులుగా తాగునీటి వల్ల అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరుగుతుండడంతో మండల అధికార యంత్రాంగం మొత్తం పండూరులో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక రోగులు మరింత అవస్థలు పడుతున్నారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో విశ్వనాథరెడ్డి, మండల వైద్యాధికారి ఐ ప్రభాకర్ ఎప్పటికప్పుడు రోగుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుని వారికి వైద్యసేవలు అందజేస్తున్నారు. ప్రస్తుతం పండూరుకు సరఫరా అవుతున్న నీటిని నిలిపివేశామని, ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా కాకినాడ నుంచి నీటిని అందజేస్తున్నట్లు ఎంపీడీవో వివరించారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం: కన్నబాబు సూర్యారావుపేట పంపింగ్ స్కీమ్ ద్వారా నీటిని సరఫరా చేసే గ్రామాలకు తక్షణం తాగునీటి సరఫరాను నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. పండూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలను ఆయన పరామర్శించి విలేకర్లతో మాట్లాడారు. పంపింగ్ స్కీమ్‌లో ఫిల్టర్ బెడ్లు మార్చాలని గతంలోనే అధికారులను కోరినా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ చేపలచెరువులోని నీరు తాగునీటి చెరువులోకి వస్తున్నా పట్టించుకోకుండా ఆ నీటినే నేరుగా ప్రజలకు అందించడం దారుణమన్నారు. సూర్యారావుపేట పంపింగ్ స్కీమ్ పేరుతో సరఫరా చేస్తున్న నీటిని తక్షణం నిలిపివేయాలని, ప్రజలకు రక్షిత తాగునీరు అందించాలని కన్నబాబు అధికారులను కోరారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటిని క్లోరినేష¯ŒS చేయకుండా సరఫరా చేస్తుండడంతో తాగునీరు మురుగునీటికన్నా దారుణంగా ఉంటుందని, నీటిలో బురదమట్టితో పాటు పురుగులు కూడా వస్తున్నాయని ప్రజలు కన్నబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వైద్యుడు ఐ.ప్రభాకర్, ఎంపీడీఓ సీహెచ్‌కే విశ్వనాథరెడ్డిలను కలసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కన్నబాబుతో పాటు పండూరు సొసైటీ అధ్యక్షుడు నందిపాటి సత్తిబాబు, ధర్మరాజు, సూర్యారావుపేట, ఉప్పలంక మాజీ సర్పంచ్‌లు కోమల సత్యనారాయణ, బొమ్మిడి శ్రీనివాస్ తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. -
తీరనున్న మంచినీటి కష్టాలు
హుజూర్నగర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మంచినీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఇన్నాళ్లు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు మంచి నీరు తాగాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా నీరు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్కోసారి ఇంటినుంచి తెచ్చుకున్నా సరిపోని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో విద్యార్థులు కష్టాలు పడుతున్న విషయాన్ని గ్రహించిన విద్యాశాఖ ఉన్నత అధికారులు వారి కష్టాలకు స్వస్తి పలకనున్నారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా మంచినీటి మినీ ట్యాంక్‌లు నిర్మించి విద్యార్థులకు మంచి నీటిని అందించేందుకు నివేదికలను సిద్ధం చేశారు. దీని కోసం పూర్వ నల్లగొండ జిల్లాలో190 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటికి రూ 1.71 కోట్లు నిధులు కేటాయించారు. వాటిలో 50 శాతం నిధులను ఇప్పటికే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మిగతా డబ్బులను పూర్తిగా చెల్తించనున్నారు. నల్లగొండ జిల్లాలో 103 పాఠశాలలు, సూర్యాపేట జిల్లాలో 54 పాఠశాలలు, యదాద్రి భువనగిరి జిల్లాలో 33 పాఠశాలలను ఈపథకానికి ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు రూ. 90 వేల చొప్పున నిధులు కూడా మంజూరు చేశారు. ఈనేపథ్యంలో హుజూర్ నగర్ మండలంలోని 8 పాఠశాల లకు కలిపి మొత్తం రూ 7. 20 లక్షలు మంజూరు అయ్యాయి. మండలంలోని శ్రీనివాసపురం, మాచవరం, లింగగిరి, లింగగిరి ఎస్సీ కాలనీ, మగ్ధుం నగర్, ఆనంద్ నగర్, జంగాల గూడెం, మాధవరాయిని గూడెం పాఠశాలల్లో ఈపథకం పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈనిధులతో ఆయా పాఠశాలల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చోట్లలో బోర్లు వేయడం, మినిట్యాంకులు నిర్మించడం, పైపులు వేయడం, నల్లాల దిమ్మెల నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కాగా ఇప్పటికే మూడు జిల్లాలలో 190 పాఠశాలలో నిర్మాణాలు మొదలు పెట్టారు. వాటిలో ఇప్పటి వరకు 68 పాఠశాలల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. 122 పాఠశాలల్లో వీటి నిర్మాణ పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. దాదాపుగా డిసెంబర్ నెలలోనే వీటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మిగిలినవి కూడా పూర్తయితే మూడు జిల్లాలలోని 190 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విద్యార్థుల మంచినీటి కష్టాలు గట్టెక్కుతాయి. దీంతో ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల కష్టాలు తీరనున్నాయని ఆ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి కష్టాలు తీరనున్నాయి ఇప్పటి వరకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత మంచినీటికి చాలా ఇబ్బందులు పడేవారు. మినీ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. పనులు కూడా జరుగుతున్నాయి. ఈ మంచినీటి పథకం నిర్మాణం పూర్త యితే విద్యార్థుల మంచినీటి కష్టాలకు ఫుల్స్టాప్ పడుతుంది. – దేవరం రామిరెడ్డి. హెచ్ఎం, శ్రీనివాసపురం -
వాడివేడిగా సర్వసభ్య సమావేశం
మెదక్ మున్సిపాలిటీ: వార్డుల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని ఇంజనీర్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్తే నాకేం తెలియదు...మీ సమస్య ఏదైనా ఉంటే చైర్మన్‌కు చెప్పుకోవాలంటూ సమాధానం ఇస్తున్నారని, ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ సమావేశాల్లో చర్చించిన ఏ సమస్యను కూడా అధికారులు పరిష్కరించలేదని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి ధ్వజమెత్తారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశమంటే...చాయ్ బిస్కెట్ల సమావేశంగా మారింది...సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేవి పరిష్కారం కావడం లేదని 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ ఎద్దేవాచేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్లంటే మున్సిపల్ కార్యాలయంలో కనీస విలువ లేకుండా పోతుందన్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్‌చైర్మన్ వ్యక్తిగత విషయాలను సభలో చర్చించవద్దన్నారు. నీటి సమస్య పరిష్కరించాలని కోరితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి సభ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన చైర్మన్ మీ సమస్యలు ఏమున్నాయో చెప్పాలంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కౌన్సిల్ సభ్యులు మధుసూదన్‌రావు, అనిల్‌కుమార్ కలుగజేసుకుని ఆవేశం ఎందుకు అధ్యక్షా సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. చిన్న చిన్న విషయాలకు కూడా చైర్మన్‌కే చెప్పుకోవాలంటున్నారని మరో కౌన్సిలర్ రమణా పేర్కొన్నారు. కౌన్సిలర్లు పేర్కొన విషయాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయని, ఇకపై అలా చేయవద్దని అధికారులకు సూచిస్తానని చైర్మన్ తెలిపారు. జీరో బ్యాలెన్స అకౌంట్ల విషయంలో కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ్యులకు కనీస మర్యాద ఇవ్వని కమిషనర్ మాకొద్దంటూ కౌన్సిలర్ అనిల్‌కుమార్ తెల్చిచెప్పారు. అలాగే జీఐఎస్ సర్వేలో చాలా తప్పులు జరిగాయని, ఇష్టారీతిగా సర్వేలు నిర్వహించారని మండిపడ్డారు. కౌన్సిలర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసి ప్రణాళిక బద్ధంగా ముందుకెళితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పట్టణంలో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని, వాటికి అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఒకటి చెబితే, ఇక్కడ మరొకటి చేయడం సరికాదన్నారు. తాము ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్లకు నోటీసులివ్వాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. జీఐఎస్ సర్వే ఆధారంగా పన్నుల శాతం పెరిగి మున్సిపల్‌కు రూ.35లక్షల ఆదాయం రానున్నట్లు చైర్మన్ తెలపగా,పెరిగిన ఆస్తి పన్నులు డిసెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. జీఐఎస్ ఆన్లైన్ చేపట్టి 4300 మంది నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వేలో సమస్యలపై మున్సిపల్ మేనేజర్‌ను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. అలాగే పలుచోట్ల ప్రభుత్వం సీజ్‌చేసే ఇసుకను మున్సిపల్ అభివృద్ధి పనులకు వినియోగించేలా అధికారులు తహసీల్దార్‌కు లేఖ రాయాలని చైర్మన్ ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో గ్రేడ్-2గా ఉన్న మెదక్ మున్సిపాలిటీని గ్రేడ్-1లోకి తీసుకొస్తామన్నారు. అనంతరం వార్డుల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను కౌన్సిల్ సభ్యులు సభదృష్టికి తీసుకురాగా స్పందించిన చైర్మన్ ట్రాన్సకో డీఈకి ఫోన్ సమస్యను విన్నవించారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు రబీన్ దివాకర్, ఆర్కె శ్రీనివాస్, చంద్రకళ, విజయలక్ష్మి, గాయత్రి, లక్ష్మి, గాయత్రి, సులోచన, గంగాధర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియాకు నో ఎంట్రీ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి పాలకవర్గం మీడియాను అనుమతించలేదు. పలువురు పాత్రికేయులు ప్రశ్నించగా మున్సిపల్ చైర్మన్ ఒకింత అసహనం వ్యక్తంచేస్తూ....చాంబర్ మాకే సరిపోవడం లేదని మీరెక్కడ కూర్చుంటారని ఎదురు ప్రశ్నించారు. అనంతరం ఏమనుకున్నారో ఏమో మళ్లీ అందరిని లోపలకు అనుమతించారు. -
మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక హాలహర్వి/ఆలూరు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. సోమవారం హాలహర్వి, బాపురం, గూళ్యం గ్రామాల్లో ఆమె పర్యటించారు. ముందుగా హాలహర్విలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లారు. హాలహర్విలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు దాదాపు రూ.6 కోట్లు కేంద్రం నిధులతో మంచినీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయించామన్నారు. గ్రామీణప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులను మంజూరు చేయించామన్నారు. క్షేత్రగుడి నుంచి మోకా మీదుగా బళ్లారికి వెళ్లే 3 కి.మీ. రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు రూ.6 కోట్లు మంజూరయ్యాయన్నారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేయడం సీఎం చంద్రబాబునాయుడుకే చెల్లిందన్నారు. అమరావతి జపం చేస్తూ రైతులను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గూళ్యం వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు మధ్య బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గూళ్యంలో ఎంపీ నిధుల కింద రూ.24 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆరోపించారు. వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి రూ.600 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాటతప్పారన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, పొదుపు మహిళలను మోసం చేశారన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అవినీతి డబ్బుతో కొనుగోలు చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎంపీపీ బసప్ప, వైఎస్ ఎంపీపీ కల్యాణ్‌గౌడ్, హాలహర్వి, హోళగుంద మండలాల కన్వీనర్లు భీమప్పచౌదరి, షఫీఉల్లా, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, కోనంకి జనార్దన్‌నాయుడు, నాయకులు విక్రాంత్‌రెడ్డి, అర్జున్, సిద్దప్ప, గాదిలింగప్ప, దిబ్బలింగ తదితరులు పాల్గొన్నారు. -
నస్కల్లో నీటి ఎద్దడి
రామాయంపేట (నిజాంపేట): నిజాంపేట మండలం నస్కల్ పంచాయతీ పరిధిలోగల నందగోకుల్ గ్రామంలో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్తులు వ్యవసాయబోరుబావులను ఆశ్రయిస్తున్నారు. గ్రామంలో పుష్కలంగా నీరు ఉన్నా సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. రక్షిత ట్యాంక్ నీరు గ్రామంలో కొంత భాగం మాత్రమే సరఫరా అవుతుంది. గతంలో నిర్మించిన రెండు మినీ ట్యాంకులను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి నిరూపయోగంగా మారాయి. దీనికితోడు గత పదిహేను రోజులక్రితం నుంచి బోరు కూడా పనిచేయడంలేదు. ఇప్పటి వరకు ఈ బోరునీరే ఆధారమైందని, మరమ్మతు చేయించే విషయంలో శ్రద్ధతీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటికి వ్యవసాయబోర్లను ఆశ్రయిస్తున్నామని మహిళలు వాపోయారు. కాగా ఇతర బోర్లవద్ద నీరు మురుగు కాలువల్లోకి వృథాగా పోతోందని, ఈ వృథా నీటిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనాన అధికారులు, ప్రజాప్రతినిధులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నీళ్లకు మస్తు కష్టముంది నీళ్లకు మస్తు కష్టముంది. బోరు కరాబై 15 రోజులవుతున్నా ఎవరూ పట్టించుకుంటలేదు. సర్పంచ్‌కు ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేస్తలేడు. పొద్దున లేవగానే పంట చేలల్లో ఉన్న బోర్లదగ్గరినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నం. వెంటనే బోరును రిపేరు చేయించి నీళ్లు సరఫరా చేయాలే. - ఊడెపు బాలవ్వ, నస్కల్ ఎవరూ పట్టించుకుంటలేరు నీళ్లకు గ్రామంలో మస్తు కష్టమవుతుంది. ప్రధానంగా గ్రామం మధ్యలో ఉన్న బోరు చెడిపోవడంతో ఈసమస్య తలెత్తింది. చెడిపోయిన ఈబోరును మరమ్మతు చేయించాలని ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదు. వెంటనే గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి పరిష్కరించాలి. - బురాని రమేశ్, నస్కల్ నీటి ఎద్దడి పరిష్కరిసా బోరు మోటారు కాలిపోవడంతో ఈసమస్య తలెత్తింది. వెంటనే దానిని మరమ్మతు చేరుుంచి గ్రామంలో నీటి ఎద్దడి తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. తాగునీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలి. - మన్నె ప్రమీల, సర్పంచ్, నస్కల్ -
రబీలో పూర్తి ఆయకట్టుకు సాగునీరు
వర్మా..వైఎస్ సాగు నీరివ్వలేదని నిరూపిస్తావా పదవికి రాజీనామా చేస్తాః ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సవాల్ పుష్కర ఈఈ బదిలీకి మంత్రి ఆదేశం వాడీవేడిగా ఐఏబీ సమావేశం రెండో పంటకు సాగునీటి సరఫరాపై గురువారం రాత్రి జరిగిన ఐఏబీ సమావేశం రసాభాసగా సాగింది. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్ విధాన గౌతమి హాలులో జరిగిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇ¯ŒSచార్జి, నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో గోదావరిలోని ఈస్టన్ర్, సెంట్రల్ డెల్టాలతో పాటు ఏలేరు ఆయకట్టులో రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు సరఫరా చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సాగునీటి సమస్యలు, ప్రాజెక్టు పనులపై సమీక్షను చేపట్టారు. సమస్యలు ఏమైనా ఉంటే చర్చకు పెట్టాలని ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలు పూర్తిగా పనిచేయడం లేదని, ఏ ఆయకట్టులోను రైతులు సక్రమంగా సాగు చేయలేకపోతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏ ప్రాజెక్టు పరిధిలో ఎంత ఆయకట్టుకు నీరు సరఫరా చేస్తున్నారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి అయిపోతుందని చెబుతున్నప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఎందుకు చేపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం పూర్తి అయిపోతుందని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు రూ.1632 కోట్లు ప్రజాధనం వృథా చేయడం కాక మరేమిటని జగ్గిరెడ్డి నిలదీశారు. మంత్రి దేవినేని స్పందిస్తూ పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఇలానే మాట్లాడారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసి వేలాది ఎకరాలకు సాగునీరందించామని అన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును జూ¯ŒS నాటికి పూర్తిచేసి ఏలేరుతో పాటు విశాఖకు కూడా నీరందిస్తామని చెప్పారు. రబీకి పూర్తిస్థాయిలో నీరు గోదావరి డెల్టా, ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ వ్యవస్థల కింద పూర్తి నికర ఆయకట్టుకు 2016–17 రబీ పంటల సాగుకు నీరు అందిస్తామని ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. తొలుత ధవళేశ్వరం ఇరిగేష¯ŒS సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు 2016–17 రబీ సీజ¯ŒSకు గత ఆరు సంవత్సరాల అనుభవాల ఆధారంగా లభ్యం కానున్న గోదావరి జలాలు, సీలేరు, బలిమేల నుంచి అందే జలాల అంచనాలు, తాగునీటి అవసరాలకు పోగా మిగిలే నికర జలాల అంచనాలను వివరించారు. ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని మాట్లాడుతూ అందుబాటులో ఉన్న జలాల సమర్థ వినియోగంతో ప్రస్తుత ఖరీఫ్ పంటలను కాపాడడంతోపాటు, వచ్చే రబీలో గోదావరి, ఏలేరు, పీబీసీ ఆయకట్టు మొత్తానికి నీరు అందించాలని ఇరిగేష¯ŒS అధికారులను ఆదేశించారు. వచ్చే రబీ అనంతరం 2017 మార్చి 10న కాలువలు మూసివేసి క్లోజర్ పనులు చేపట్టేందుకు, ఖరీఫ్ సీజ¯ŒSలో 2017 జూ¯ŒS 15 నుంచి పంట కాలువలు తెరిచేందుకు ప్రతిపాదించగా, మారిన సాగు కాలం, క్లోజర్ పనులు పూర్తి చేసేందుకు క్లోజర్ తేదీని మార్చి 31, కాలువలు తెరిచే తేదీని జూ¯ŒS మొదటి వారానికి మార్చాలని ఎమ్మెల్యేలు కోరారు. పుష్కర ఎత్తిపోతల పథకంలో పంపులు పనిచేయకపోవడంపై మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు కారణమేమిటని మంత్రి దేవినేని ప్రశ్నించగా రెండు పంపులు పనిచేయడం లేదని హైదరాబాద్‌కు ప్రతిపాదనలు పంపించామని సమాధానం చెప్పిన ఈఈ వాసుదేవరావును బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈఈలు పర్సంటేజీల కోసం కాకుండా రైతుల కోసం కాలువ గట్లపైకి వెళ్లి పనిచేయాలని, నీటి సంఘాల ప్రతినిధులు పెత్తనం కోసం కాకుండా ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఎంపీ తోట నరసింహం, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ప్రాజెక్టు కమిటీ చైర్మ¯ŒSలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వర్మ.. జగ్గిరెడ్డి వాగ్వాదం ఇంతలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కల్పించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకిగా తయారైందని చేసిన వ్యాఖ్యలపై జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టుల పరిధిలో ఒక్క ఎకరాకు సాగునీరందించ లేదని వర్మ ఆరోపించడంతో ఆయనపై జగ్గిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతు పక్షపాతి ఎవరో, రైతును వెన్నుపోటి పొడిచిన వారెవరో ప్రజలకు తెలుసని, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ హయాంలో ఒక్క ఎకరాకు సాగునీరందించ లేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అందుకు మీరు సిద్ధమా అని వర్మకు జగ్గిరెడ్డి సవాల్ విసిరారు. ఇద్దరి మద్య వివాదం తారస్థాయికి చేరుకోవడంతో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప జోక్యం చేసుకుని వారిని శాంతింపచేశారు.ఇంతలో 98శాతం మంది దళితులున్న రామచంద్రపురం నియోజకవర్గం శేరిలంక గ్రామంలో సగం గోదావరిలో కలిసిపోయిందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.కనీసం ఇప్పటికైనా రక్షణ చర్యలు తీసుకుని మిగిలిన గ్రామాన్నైనా పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నీటిపారుదలశాఖాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని జిల్లా ఇ¯ŒSచార్జి, నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమ ఆదేశించారు. ఇంతలో ఎమ్మెల్యే త్రిమూర్తులు సీటు లోంచి ఆగ్రహంగా లేచి అప్పటి ప్రభుత్వంలో ఉండి ఏ చర్యలు తీసుకున్నావో చెప్పాలంటూ ఎమ్మెల్సీ బోస్‌ను ఉద్ధేశించి బిగ్గరగా కేకలు వేయడం, అందుకు దీటుగా బోస్ కూడా మాట్లాడటంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. హత్యలు, దోపిడీలు, అవినీతి కార్యకలాపాలు చేయడం నీకే తగునని , అవి మాకు చేతకావని బోస్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వేదిక దిగి వచ్చి సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. -
40 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదు
మేయర్ అబ్దుల్ అజీజ్ మహ్మదాపురంలో వాటర్ ప్రాజెక్టు పరిశీలన నెల్లూరు సిటీ: నగర ప్రజలకు రాబోయే 40 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. సంగం మండలం మహ్మదాపురంలో రూ.580 కోట్లతో నిర్మిస్తున్న వాటర్ ప్రాజెక్టును గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు గానూ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పైప్‌లైన్ ద్వారా మహ్మదాపురం నుంచి నీటి సరఫరా అవుతుందన్నారు. అమృత్ నిధుల ద్వారా వచ్చే నిధులను మంచినీటికి, డ్రైనేజీ నిర్మాణానికి వాడాల్సి ఉండగా, ఆ నిధులను హడ్కోకు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్, ఈఈ శ్రీనివాసులు, టీడీపీ కార్పొరేటర్లు మన్నెం పెంచలనాయుడు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, వహీదా, బొల్లినేని శ్రీవిద్య, పొత్తూరు శైలజ, మల్లికార్జున్‌యాదవ్, ప్రశాంత్‌కిరణ్, నాయకులు షంషుద్దీన్, జహీర్, నన్నేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు. 33 మందిలో ఏడుగురు కార్పొరేటర్లే హాజరు కార్పొరేషన్‌తో 33 మంది టీడీపీ కార్పొరేటర్లకు గానూ ఏడుగురే పరిశీలన నిమిత్తం మేయర్‌తో కలిసి వెళ్లారు. మేయర్‌పై వారిలో ఉన్న అసంతృప్తి మరోసారి రుజువైంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టు సందర్శనార్థం గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ఆపరేటర్‌కు చెందిన రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లందరూ హాజరవుతారని భావించిన మేయర్‌కు ఏడుగురే హాజరవడంతో చుక్కెదురైంది. అక్కడ ఉన్న కార్పొరేటర్లు మేయర్‌పై అసమ్మతి చల్లారినట్లు లేదని చర్చించుకున్నారు. తప్పని పరిస్థితుల్లో మేయర్ ఒక బస్సును వెనక్కి పంపారు. ఒక బస్సులో మీడియా ప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పయనమయ్యారు. -
జలం.. జటిలం
చింతలపూడి : జిల్లాలోని మెట్ట ప్రాంత జలాశయాలు, చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. తమ్మిలేరు, ఎర్ర కాలువ, నందమూరి విద్యాసాగర్ ప్రాజెక్టులు దాదాపుగా అడుగంటాయి. పూర్తిగా వర్షాధారమైన ఈ ప్రాజెక్టులు సరైన వర్షాలు పడకపోవడంతో కళ తప్పాయి. దీంతో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది మెట్ట ప్రాంతంలోని రైతుల పరిస్థితి. చుట్టూ చెరువులున్నా సాగు నీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తున్నా వినియోగించుకునే అవకాశం రైతులకు కలగడం లేదు. దీంతో జిల్లాలో వర్షాలపై ఆధారపడిన చెరువులు, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. మెట్ట ప్రాంతంలో ప్రధానమైన తమ్మిలేరు, ఎర్రకాలువ, నందమూరి విద్యాసాగర్ జలాశయాలు నీరు లేక గతేడాది పూర్తిగా అడుగంటిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవిలో చెరువులు ఎండిపోగా, బోర్లు సుమారు 20 మీటర్లకు పైగా నీటి మట్టం పడిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కూడా మెట్ట ప్రాంతంలో సరైన వర్షాలు పడక పోవడంతో చెరువులు నిండలేదు. నీరు–చెట్టు పథకంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పూడిక తీత పనులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చెరువుల ఆక్రమణలు తొలగించకుండా కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేయడం వల్ల వర్షపు నీరు నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో 100 ఎకరాలకు పైబడిన చెరువులు సుమారు 450 వరకు ఉన్నాయి. ఇవి కాక వంద ఎకరాల లోపు చెరువులు, కుంటలు కలిపి దాదాపు 3,100 వరకు ఉంటాయి. ఈ చెరువుల విస్తీర్ణం సుమారు 1.80 లక్షల ఎకరాల్లో ఉంది. అడుగంటిన తమ్మిలేరు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు రిజర్వాయర్ ప్రస్తుతం అడుగంటింది. రాష్ట్ర విభజన తరువాత జలాశయానికి ఎగువ ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి వచ్చే నీటిని అక్కడి రైతులు ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నారు. దీంతో మెట్ట రైతుల కల్పతరువు తమ్మిలేరు రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తిగా నిండలేదు. ముందు ముందు తమ్మిలేరు భవిష్యత్తు ఏంటని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద 1969లో ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా ,ప్రస్తుతం 331 అడుగుల నీటిమట్టం ఉంది. కనీసం 340 అడుగుల నీరు ఉంటేనే కానీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేదు. గత దశాబ్ద కాలంలో ఇంత దారుణమైన పరిస్థితి తమ్మిలేరుకు ఎదురు కాలేదని రైతులు వాపోతున్నారు. ఆదుకోని నీరు–చెట్టు గతేడాది జిల్లాలో సుమారు 408 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది 374 చెరువుల్లో పూడికతీతకు ప్రభుత్వం రూ. 69 కోట్లు మంజూరు చేసింది. అయితే చెరువుల్లో ఆక్రమణలు తొలగించకుండా పనులు తూతూమంత్రంగా చేసి మమ అనిపించారు. గతేడాది పనుల కంటే అధ్వానంగా చేశారు. నీరు–చెట్టు పథకంలో చెరువుల్లో పూడికతీసి భూగర్భ జలాలను పెంపొందించాలని భావించిన లక్ష్యం పూర్తవలేదు. ఆక్రమణలు తొలగించమని కోరాం చెరువులను సర్వే చేసి ఆక్రమణలు తొలగించమని రెవెన్యూ శాఖాధికారులను గతంలోనే కోరాం. అయితే ఆ విధంగా చర్యలు లేవు. భారీ వర్షాలు కురిస్తే చెరువుల్లోకి నీరు చేరుతుంది. చెరువు పల్లాలను ఆక్రమించుకుని ఎవరైనా పంటలు వేసుకుంటే మునిగిపోవడం ఖాయం. – యు.పరమానందం, ఇరిగేషన్ ఏఈ -
కన్నీటి కష్టాలు
చిలమత్తూరు : స్థానిక కేజీబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల)లో తాగునీటి ఎద్దడి నెలకొంది. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థినులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరుకు సంబంధించిన మోటార్లు రెండు రోజుల క్రితం కాలిపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో విద్యార్థులు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పాఠశాల ఎదురుగా ఉన్న ఇటుకల ఫ్యాక్టరీలోని బోరు వద్దకు వెళ్లి బిందెలు, బకెట్లతో నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మోటారుకు మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘బోరు’న విలపిస్తూ..
-
ఆగ్రహించిన ‘నీరు’పేద రైతులు
ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన బలిజిపేట రూరల్: పెదంకలాం కాలువ సాగునీరు అందకపోవడంతో మండలలోని పెదపెంకి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ మేరకు ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. ఇరిగేషన్ ఏఈ వేణుగోపాలనాయుడు కార్యాలయం వద్ద లేకపోవడంతో ఫోన్లో మాట్లాడి ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పెదపెంకి గ్రామానికి పెదంకలాం కాలువ ద్వారా ఒకబొట్టు నీరయినా అందలేదని, మాభూముల సంగతేమిటని, మావద్ద శిస్తులు వసూలు చేస్తున్నారు, నాయకులు కాలువ పనులు చేసుకుని బిల్లులు తీసుకుంటున్నారు కానీ మాకు సాగునీరు అందడం లేదని రైతులు ఈర్ల సంజీవనాయుడు, జి.సూర్యనారాయణ, నాయుడుబాబు, కండినథానీలు, జి.రాంబాబు, రామారావు, ఎన్.ఈశ్వరరావు, డి.మురళీధర్, జగన్నాథంనాయుడు తదితరులు ఆందోళన చేశారు. నీరివ్వకుండా ప్రారంభాలెందుకు? కాలువ దిగువన సుమారు 1000ఎకరాల భూమి పెదపెంకి గ్రామానికి చెందినది ఉందని దానికి చుక్కనీరయినా అందడంలేదని వాపోయారు. కాలువ నుంచి అక్రమంగా సాగునీరు తరలిస్తున్నా ఇరిగేషన్ అదికారులు, సిబ్బంది, ప్రాజెక్టు చైర్మెన్, టీసీలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఈమాత్రం దానికి పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీజగదీష్‌లు పెదంకలాం హెడ్‌వద్ద నెలరోజుల క్రితం నీరు విడుదల చేయడం ఎందుకని రైతులు ప్రశ్నించారు. నీరు అందించకపోతే భవిషత్లో తీవ్ర అందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు ఆందోళస సమచారం తెలసుకునన్న తహసీల్దార్ బీవీ లక్ష్మి వారితో ఫోన్లో మాట్లాడుతూ అక్రమంగా ఎవరైనా సాగునీరు తరలిస్తే అటువంటి వారిపై చర్యలు చేపడతామని తెలియపరిచారు. కార్యక్రమంలో పెదపెంకి రైతులతో పాటు సీపీఎం నాయకులు వంజరాపు సత్యంనాయుడు, యమ్మల మన్మథరావు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య తీర్చాలి
హాలియా : మండలంలోని రాజవరం గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గ్రామంలో మహిళలు బుధవారం పశువుకు వినతిపత్రం సమర్పించారు. అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రమణ, సరస్వతి, మీరాభి, మైబు, చినఅంజయ్య, కోటమ్మ, శ్రీను, శివ గ్రామస్తులు పాల్గొన్నారు. -
వానాకాలంలోనూ నీటి గోసే
నిత్యం నీటి కోసం పాట్లు ఆందోళనకు దిగిన బూర్గుపల్లి వాసులు పాలకులు పట్టించుకోవడంలేదని మండిపాటు సర్పంచ్‌ను నిలదీస్తే రాజీనామా చేస్తానని వెల్లడి మెదక్ రూరల్: తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు రోడ్డెక్కారు. ఆర్నెల్లుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదని వారు మండిపడ్డారు. మంగళవారం మండలంలోని బూర్గుపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోఆరు నెలలుగా తాగునీటి సమస్య నెలకొందని, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నీటి సమస్య తీరడం లేదన్నారు. ఇప్పటికీ గ్రామంలో మూడురోజులకోసారి ట్యాంకర్ వస్తుండటంతో అవసరాలకు సరిపడా నీళ్లు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ట్యాంకర్లు కూడా సకాలంలో రాకపోవడంతో వాటికోసం కూలీ పనులు వదులుకొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గ్రామంలో 15 వరకు బోర్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటికీ మోటార్లు బిగించి మరమ్మతులు చేయిస్తే నీటి సమస్య తీరుతుందన్నారు. నీటి సమస్యను సర్పంచ్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా బోర్లను మరమ్మతులు చేయించకుండా కొందరు క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం సొంత ట్యాంకర్లను పెట్టి నీటిని సరఫరా చేయిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్ దేవమ్మ వృద్ధురాలు కావడంతో సర్పంచ్ బాధ్యతలన్నీ ఆమె కొడుకు చూస్తుంటారు. కాగా ఆయన గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉండక పోవడంతో సమస్యలు ఎక్కడికక్కడా పేరుకు పోయాయని మండిపడ్డారు. గ్రామ పంచాయతికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల జాడేలేదని, ఇప్పటి వరకు గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనిచేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. నీటి సమస్య తీర్చాలని తాము సర్పంచ్ దేవమ్మను నిలదీస్తే ఆమె రాజీనామా చేస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని గ్రామస్తులు మండిపడ్డారు. కాగా ప్రభుత్వం నుంచి గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిక పడకేసిందని, మురికి కాల్వలు చెత్తా చెదారంతో పూడుకుపోయాయని, వీధుల్లో చెత్తా చెదారం నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు లేక రాత్రివేళ ఇంటి బయటకు రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మరోవైపు మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. కాగా ఈ సమస్యలపై తాము సర్పంచ్ దేవమ్మను నిలదీస్తే రాజీనామా చేస్తానని చెబుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరి సైతం సమస్యలను పట్టించుకోవడం లేదు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా సర్పంచ్‌కు చెప్పుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. కూలీ పనులకు వెళ్లలేక.. గ్రామంలో తాగునీటిని సరఫరా చేయక పోవడంతో కూలీ పనులు కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. మా సమస్యలను సర్పంచ్‌తోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. బోరుబావుల్లో నీటి మట్టం పెరిగినప్పటికీ వాటిని మరమ్మతులు చేయించకుండా ట్యాంకర్లతో నీటి సరఫరా చేయిస్తున్నారు. పనులు వదులుకొని ట్యాంకర్‌కోసం పడిగాపులు పడితేనే నీళ్లు దొరుకుతున్నాయి. లేకుంటే గుక్కెడు నీళ్లకోసం అవస్థలు తప్పడం లేదు. - మౌనిక, గ్రామస్తురాలు.బూర్గుపల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులు అభివృద్ధిపై హామీలు గుప్పిస్తారు. ఓట్లేశాక..గద్దెనెక్కి అన్ని మర్చిపోతారు. నిత్యం వారి చుట్టూ తిరిగినా ఏ సమస్య పట్టించుకోరు. సర్పంచ్ వృద్ధురాలు కావడంతో ఆమె ఏం చేయలేని పరిస్థితి. ఆమె కొడుకు ఎప్పుడు అందుబాటులో ఉండడు. సమస్యలు పట్టించుకోడు. రాజులేని రాజ్యంలా మా ఊరి పరిస్థితి దాపురించింది. - లెంక కిష్టయ్య, గ్రామస్తులు. -
నీళ్ల కోసం సర్పంచ్ నిర్బంధం
గదిలో పెట్టి తాళం రెండు గంటల పాటు ఉత్కంఠ మాయికోడ్‌లో ఘటన మనూరు: నీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన ప్రజలు సర్పంచ్‌ను నిర్బంధించారు. ఈ ఘటన మనూరు మండలంలోని మాయికోడ్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా సర్పంచ్ నాయక్ పంచాయతీ కార్యాలయానికి చేరుకోగానే ప్రజలు బయటి నుంచి తలుపులు మూసి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సమస్య తీవ్రంగా ఉన్నా పంచాయతీ సిబ్బందితో పాటు మండల అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కాగా, సర్పంచ్ జెండా ఆవిష్కరించగానే గ్రామస్తులంతా మూకుమ్మడిగా పంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్‌ను నిర్బంధించారు. దీంతో రెండు గంటల పాటు ఉత్కంఠత నెలకొంది. బోరు మోటార్లను వెంటనే రిపేర్ చేయిస్తానని సర్పంచ్ పేర్కొనడంతో గ్రామస్తులు శాంతించారు. కాగా, సర్పంచ్ తండాకు చెందిన వాడు కావడం వల్లే మిగతా గ్రామస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని పలువురు మహిళలు ఆరోపించారు. సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేసి అధికారులే పంచాయతీ నిధులను పర్యవేక్షించాలని కోరారు. ఇదిలా ఉండగా, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ గతంలోనూ సర్పంచ్ నాయక్‌ను గ్రామస్తులు రెండుసార్లు పంచాయతీ కార్యాలయంలో నిలదీశారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
నడిరోడ్డుపై ‘నీటి’గోస!
దాహార్తి తీర్చాలంటూ ప్రజ్ఞాపూర్‌లో మహిళల ఆందోళన సమన్వయ లోపంతోనే పూర్తి కాని పనులు సీఎం ఆదేశించినా పట్టని అధికారులు గజ్వేల్: పల్లెల గొంతు తడిపే ‘మిషన్ భగీరథ’ ప్రారంభమైన కోమటిబండకు కూతవేటు దూరంలోని ప్రజ్ఞాపూర్‌లో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఇక్కడ కొన్ని రోజులుగా మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా విసిగిపోయిన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా పోలీసులతో మహిళలకు వాగ్వాదం జరిగింది. సమస్యలుంటే నగర పంచాయతీ కార్యాలయంలో చెప్పాలని.. రోడ్డెక్కితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించి ధర్నాను విరమింపజేశారు. ఇదీ సమస్య.. నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజుపల్లి, క్యాసారం గ్రామాలకు నిత్యం 5.19 ఎంఎల్డి (50.19 లక్షల లీటర్ల నీరు) అవసరం. 4 వేల వరకు నల్లాలు ఉన్నాయి. గతంలో 15 ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా 2 (20 లక్షల లీ.) ఎంఎల్డీ లీటర్ల నీటిని సరఫరా చేసేవారు. నాలుగు నెలలుగా పరిస్థితి మారింది. ఇక్కడ ‘మిషన్ భగీరథ’ శాశ్వత పైప్‌లైన్ నిర్మాణం, నల్లా కనెక్షన్ల నిర్మాణం చేపట్టకున్నా...(ఇప్పటికీ ఇంకా ఇక్కడ ‘మిషన్ భగీరథ’ పనులు చేపట్టలేదు) సీఎం కేసీఆర్ ఆదేశాలతో కోమటిబండలోని ‘మిషన్ భగీరథ«’ హెడ్ రెగ్యులేటరీ నుంచి నిత్యం ఇక్కడికి గడువుకు ముందే 10-20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పాత నల్లాల వ్యవస్థ నీటి సరఫరా ద్వారా గోదావరి జలాలతోపాటు ఇక్కడున్న వనరులతో కలిపి మొత్తం 30-35 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతున్నది. మొదటగా గజ్వేల్ పట్టణానికి మాత్రమే పాత నల్లాల వ్యవస్థ ద్వారా నీటిని అందించారు. ప్రజ్ఞాపూర్‌లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగేది. ఈ నీళ్లు సరిపోక గతేడాది మే నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు జనం ఆందోళనకు దిగారు. విస్తరణ పనులతోనే ఆటంకం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ పనులు కారణంగా పైప్‌లైన్ దెబ్బతిని నీరు ఇవ్వలేకపోతున్నామని చెప్పిన అధికారులు...జనం ఆగ్రహావేశాలు చూసి 3 నెలల క్రితం తాత్కాలిక పైప్‌లైన్ వేసి వాటితో ట్యాంకులు నింపి గజ్వేల్‌లో మాదిరిగానే ఇక్కడా పాత నల్లాల వ్యవస్థ ద్వారానే నీటిని అందించారు. దీంతో సమస్య తీరింది. ఇటీవల ప్రధాని పర్యటన నేపథ్యంలో వడివడిగా పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టిన క్రమంలో తవ్వకాలతో గతంలో తాత్కాలికంగా వేసిన పైప్‌లైన్ దెబ్బతిన్నది. ఫలితంగా ప్రజ్ఞాపూర్‌కు నీటి సరఫరా ఆగింది. 10 వేల జనాభా ఉన్న ప్రజ్ఞాపూర్‌లో 1500కిపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. తక్కువలో తక్కువగా ఇక్కడికి నిత్యం 5 లక్షల నీటిని అందించగలిగితే ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం 30 ట్యాంకర్ల ద్వారా 1.5 లక్షల లీటర్ల నీటినే సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్ విస్తరణ పనుల్లో జాప్యం మరోవైపు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ విస్తరణ 20 రోజులైనా పూర్తి కావడం లేదు. ప్రత్యేకించి ఇందిరాపార్క్ చౌరస్తా నుంచి పిడిచెడ్ రోడ్డు వరకు, మరికొన్ని చోట్ల పనులు పూర్తి చేస్తే శాశ్వతంగా వేస్తున్న ఈ లైన్ ద్వారా ప్రజ్ఞాపూర్‌లోని ట్యాంకుల్లోకి నీటిని ఎక్కించుకొని...నల్లాల బిగించే వరకు నీటిని అందించవచ్చు. ఇందుకోసం కొన్ని చోట్ల తాత్కాలిక లైన్ కూడా వేయాల్సి ఉన్నది. కానీ ఈ పనుల నిర్వహణలో నగర పంచాయతీ, వాటర్‌గ్రిడ్ విభాగం మధ్య సమన్వయ లోపం నెలకొంది. మరోవైపు ఆర్అండ్బీ అధికారులు కూడా పనులు వేగిరం చేయటం లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి ఈ మూడు విభాగాల నిర్వాకం ప్రజ్ఞాపూర్ మహిళలకు చుక్కలు చూపిస్తోంది. కాగా, గురువారం ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు నగర పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ అధికారులతో గురువారం నిర్వహించే సమావేశంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందోమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
మంచినీటి సమస్యకు ‘మిషన్ భగీరథ’
కొండపాక: మిషన్ భగీరథతో నియోజక వర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద ప్రధాన మంత్రి మోదీచే ప్రారంభించే మిషన్ భగీరథ పథక సమావేశానికి జన సమీకరణ కోసం మండలంలోని దుద్దెడలో బుదవారం సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నియోజక వర్గంలో అన్ని కుటుంబాలకు నల్లాల ద్వారా గోదావరి నదీ జలాలను అందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం నియోజక వర్గ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టమన్నారు. కేవలం 6 నెలల కాలంలో కొండపాక, గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, తూప్రాన్, ములుగు మండలాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, జెడ్పీటీసీ మాధూరి, ఎంపీపీ అనంతుల పద్మ, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు దోమల ఎల్లం, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏర్పుల యాదయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఖమ్మంపల్లి మల్శేశం, ఎంపీపీ ఉపాధ్యక్షులు రాదాకిషన్‌రెడ్డి, డీబీఎస్ రాష్ట అధ్యక్షులు దేవి రవీందర్, సర్పంచ్‌లు, మాజీ ఎంపీపీ బొద్దుల కనుకయ్య, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గోన్నారు. -
తాగునీరు లేకుండా బతికేదెలా?
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఖాళీ బిందెలతో స్వచ్ఛందంగా పాల్గొన్న మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండు గంటలపాటు ధర్నా వినుకొండ టౌన్: ఓ వైపు బోర్లు పనిచేయవు, కుళాయి నీళ్లు రావు, పట్టణ వాసులు ఏం తాగి బతకాలి, ఎలా బతకాలి అంటూ బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. మంచినీటి సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాను సోమవారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా ఖాళీ బిందెలతో ర్యాలీలో ప్రదర్శనగా పాల్గొనటం ప్రత్యేకతను సంతరించుకుంది. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బొల్లా నాయకత్వంలో బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, నీటి సమస్యపై పాలకుల నిర్లక్ష్యధోరణిని ఎండగడుతూ నినదిస్తూ ముందుకు సాగారు. పురపాలక సంఘం గేటు ముందు రెండు గంటల పాటు సాగిన ధర్నా కార్యక్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పట్టణవాసులకు ప్రధానంగా మున్సిపల్ కుళాయి నీరు ఆధారమన్న విషయం పాలకులకు తెలియందికాదని, సింగర చెరువు ఎండిపోతే పరిస్థితి ఎంటి అన్న కనీస విజ్ఞత కరువైన ప్రజాప్రతినిధులు మనకు దొరకటం దౌర్భాగ్యమన్నారు. రెండు నెలల క్రితం సింగర చెరువును పూర్తిగా నింపాలని ధర్నా చేస్తే పాలకులు, అధికారులు పట్టించుకున్నపాపాన పోలేదని, వారి నిర్లక్ష్యతీరు ఫలితమే ప్రజలు గుక్కెడు నీటి కోసం నేడు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రకు నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ వినతి అందచేశారు. -
తాగునీరు లేకుండా ఎలా బతకాలి?
వైఎస్సార్సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు నీటి సమస్యపై ధ్వజం ఖాళీ బిందెలతో మహిళల ప్రదర్శన వినుకొండ టౌన్: ఓ వైపు బోర్లు పనిచేయవు, కుళాయి నీళ్లు రావు, పట్టణ వాసులు ఏం తాగి బతకాలి, ఎలా బతకాలి అంటూ బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. మంచినీటి సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాను సోమవారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా ఖాళీ బిందెలతో ర్యాలీలో ప్రదర్శనగా పాల్గొనటం ప్రత్యేకతను సంతరించుకుంది. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బొల్లా నాయకత్వంలో బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, నీటి సమస్యపై పాలకుల నిర్లక్ష్యధోరణిని ఎండగడుతూ నినదిస్తూ ముందుకు సాగారు. పురపాలక సంఘం గేటు ముందు రెండు గంటల పాటు సాగిన ధర్నా కార్యక్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పట్టణవాసులకు ప్రధానంగా మున్సిపల్ కుళాయి నీరు ఆధారమన్న విషయం పాలకులకు తెలియందికాదని, సింగర చెరువు ఎండిపోతే పరిస్థితి ఎంటి అన్న కనీస విజ్ఞత కరువైన ప్రజాప్రతినిధులు మనకు దొరకటం దౌర్భాగ్యమన్నారు. రెండు నెలల క్రితం సింగర చెరువును పూర్తిగా నింపాలని ధర్నా చేస్తే పాలకులు, అధికారులు పట్టించుకున్నపాపాన పోలేదని, వారి నిర్లక్ష్యతీరు ఫలితమే ప్రజలు గుక్కెడు నీటి కోసం నేడు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శాసన సభ్యులు ఏపీలో వినుకొండను నెంబర్ వన్ చేస్తా అంటుంటే అభివద్ధిలో అనుకున్నాం కాని కరువు కాటకాల్లో అని అనుకోలేదని చురక అంటించారు. -
బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచండి
ఇరిగేషన్ సమీక్షలో మంత్రి దేవినేని ధవళేశ్వరం : జిల్లాలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం కాటన్ అతిథి గృహంలో ఇరిగేషన్ సర్కిల్, పోలవరం అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరికి 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినా ఇబ్బందులు లేనివిధంగా ఏటిగట్లను పటిష్టపరచాలన్నారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2017 నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేయని ఏజెన్సీలను తొలగించాలన్నారు. తొర్రిగెడ్డ, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సీఈ హరిబాబు, ఎస్ఈ రాంబాబు, ఈఈలు కృష్ణారావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
చేపపిల్లల ఉత్పత్తికి నీటి కొరత
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగు వ భాగాన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం సంవత్సరం ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో చేప పిల్లల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.జూలై పక్షం రోజులు దాటుతున్నా నీటి కొరతతో చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలోనే స్వయంగా చేపపిల్లలను ఉత్పత్తి చేసే ఏకైక కేంద్రం ఎస్సారెస్పీ జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. ప్రాజెక్ట్‌లో 1065 అడుగులు నీరున్నప్పుడు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నీరందించవచ్చు. ప్రస్తుతం 1063.70 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి ప్రాజెక్ట్ నీరు అందడంలేదు. చేపప్లిలల సంతనోత్పత్తికి జూలై, ఆగష్టు మాసలే అనువైనవి. జూలై మొదలు నుంచి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాలి. నీటి సరఫరా లేక ఉత్పత్తిప్రక్రియ సకాలంలో సాగడం లేదు. దీంతో మత్స్య కారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంత్సరం చేప పిల్ల ఉత్పతి పూర్తి స్థాయిలో జరుగుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా లేక పోవడం వలన తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఉత్పత్తి కేంద్రానికి నీటి సరఫరా చేసేందుకు కేంద్ర వద్ద బావి తవ్వారు. బావి ద్వారా నీటి సరఫరా చేసి చేప పిల్లల ఉత్పత్తి కోసం స్వల్పంగా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే విద్యుత్తు సరఫరా లేక ఆ నీరు కూడా అందడంలేదు. వ్యవసాయానికి సరఫరా చేసే ఆరు గంటల విద్యుత్తు సరఫరా మాత్రమే ఉంది. అదీ లోవోల్టేజీ సమస్యతో మోటారు నడిచేది చాలా తక్కువ సమయం. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా కోసం ట్రాన్స్‌కోకు డిమాండ్ ప్రకారం రూ. 7 లక్షలు చెల్లించినట్లు మత్స్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. జూలై మొదటి వారంలో కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు లేదు. దీంతో నీటి కొరత తీవ్రమైంది. అదేవిధంగా అధికారులు స్పందించి బోరుబావి తవ్వించాలని మత్స్య కారులు కోరుతున్నారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మూడు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి చేపట్ట వచ్చు. నీటి కొరత తీవ్రంగా ఉంది చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. కరెంట్ సరఫరా నిరంతరం లేక పోవడంతో ఉన్న నీటిని సరఫరా చేపట్ట లేక పోతున్నాం. దీంతో ఉత్పత్తి ప్రక్రియ ఆలస్య మవుతోంది. - లక్ష్మీ నారాయణ, ఇన్చార్జి, ఎఫ్‌డీవో -
నీటి విషయంలో కలిసి ముందుకెళ్దాం: కేసీఆర్
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచిది కాదనీ, నీటి విషయంలో కలిసి ముందుకెళ్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎ కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 15 లక్షల జనాభాకు అనుగుణంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పారు. 2018 తర్వాత తెలంగాణలో మంచినీటి కొరత ఉండదన్నారు. 2020 తర్వాత కరువు అనే మాట తెలంగాణ రాష్ట్రంలో వినపడదని తెలిపారు. 2024 కల్లా తెలంగాణ బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
దూప తీరదు.. దగా ఆగదు
♦ జిల్లా కేంద్రంలో నీటి కష్టాలు ♦ ఎండిపోయిన మంజీర ♦ అవసరాలు తీర్చని ప్రత్యామ్నాయ చర్యలు ♦ అడ్డగోలుగా నీటిదందా ♦ దోపిడీ చేస్తున్న వ్యాపారులు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ ప్రజలు నీటికోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. ప్రధాన నీటి వనరైన మంజీరలో నీరు లేకపోవడంతో పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వేసవిని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల క్రితం 72 బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. మోటార్లు బిగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు ఏ మాత్రం సరిపోక జనం సతమతమవుతున్నారు. నీటి కొరత దృష్ట్యా కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా డబ్బులు గుంజుతున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణానికి ప్రధాన ఆధారమైన మంజీర ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది.గత రెండు నెలలుగా మంజీర నుంచి వస్తున్న మూడు ఎంఎల్డీల నీటిని కేవలం 10 వార్డులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇలా మూడు రోజులకోసారి ఒక్కో వైపు అందిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో జనం ప్రైవేటు బోర్లను ఆశ్రయిస్తున్నారు. వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు. మూడు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటి సరఫరా చేస్తున్నా ఏ మూలకూ సరిపోవడం లేదు. ట్యాంకర్ల కోసం ప్రజల కంటే కౌన్సిలర్లే పోటీపడి తమ వార్డులకు తీసుకెళ్తున్నారు. నీటి సమస్య తీవ్రం కావడంతో గత సెప్టెంబర్‌లో కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ తీర్మానం మేరకు 75 బోర్లను తవ్వినా ఇంతవరకు మోటార్లు బిగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కొందరు వ్యక్తులు నీటి దందాను సాగిస్తున్నారు. అడ్డగోలుగా వసూలు చేస్తూ జనాన్ని దోపిడీ చేస్తున్నారు. సింగూరు నుంచి తెస్తాం... పట్టణ అవసరాలకు గాను సింగూర్ నుంచి 80 ఎంఎల్డీల వరకు నీటిని మంజీరలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసం సింగూర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీలో ఉన్నా ఎగువన ఉన్న నీటిని మంజీరకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. నూతన పద్ధతుల్లో పైప్‌ల ద్వారా నీటిని కిందికి తోడి తీసుకొస్తాం. ఆ నీరు మరో రెండు రోజుల్లో మంజీరకు చేరుతుంది. పట్టణానికి రెండు నెలల వరకు ప్రస్తుతమున్న నీటిని సరఫరా చేస్తాం. నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని పొదుపుగా వాడుకోవాలి. - విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్, సంగారెడ్డి చర్యలు తీసుకుంటాం.. మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కౌన్సిల్ ఆమోదం మేరకు వేసిన బోర్లలో 40 మోటార్లను బిగించేందుకు గాను ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచాం. వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరో రెండుమూడు రోజుల్లో 70 శాతం వరకు నీటి సమస్యను పరిష్కరిస్తాం. - వెంకటేశ్వర్, ఏజేసీ, ఇన్చార్జి కమిషనర్ అధికారుల నిర్లక్ష్యం.. పట్టణంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 14వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గత మూడు నెలల క్రితం బోరు వేశారు. మోటారు బిగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. మంచినీటి సరఫరా కాకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - అజీజ్ అహ్మద్, 14వ వార్డు నీళ్లు కొంటున్నాం... తాగేందుకు నీళ్లు దొరక్క కొంటున్నాం. మా కాలనీకి మంజీర నీరు రావడం లేదు. కనీసం బోరు నీరు కూడా పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదు. నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. - స్వర్ణలత, కిందిబజార్ ట్యాంకర్ల నీళ్లూ వస్తలె... కనీసం అద్దె ట్యాంకర్ల ద్వారా అయినా జలాల్ భాగ్ కాలనీకి మంచినీటిని సరఫరా చేయాలి. ఈ కాలనీకి మంజీర నీటితో పాటు బోరు నీటి సరఫరా సైతం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీటి సరఫరా చేసి ఆదుకోవాలి. - బీపాషా, 18వ వార్డు కౌన్సిలర్ బోరు వేసినా ప్రయోజనం లేదు... నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేశారు. మోటార్లు బిగించకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. ఫలితంగా మేం అద్దె ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నాం. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులు నీటిసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - పద్మ కల్వకుంట్ల -
పాపం పసివాళ్లు.. దూప చావు
అడవిలో మండుటెండలో నీళ్ల కోసం అల్లాడి ప్రాణాలు విడిచిన అన్నదమ్ములు ఎక్కడా చుక్కనీరు దొరక్క గొంతెండి మృత్యువాత రోజంతా ఎండలోనే చిన్నారుల మృతదేహాలు వాళ్లకు నీటికోసం వెళ్లి వడదెబ్బతో స్పృహ తప్పిన తల్లి తెల్లారితే అక్క పెళ్లి.. తమ్ముళ్ల మృతితో ఆగిన వైనం ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చెన్నూర్ రూరల్: ‘అమ్మా.. దూపైతందమ్మా..!’ ఆ మాటలకు కన్నపేగు కదిలింది.. కానల్లోకి వెళ్లింది.. గంటైంది.. రెండు గంటలైంది..! అమ్మ రాలేదు.. గొంతు తడవలేదు.. ‘అన్నా.. అమ్మేది..? దూపైతంది..!’ తమ్ముడి చేయిపట్టి నడిపించాడు అన్న.. తడారిన గొంతులతో ఇద్దరూ కలసి నీటిచుక్క కోసం అడవిలోని వాగులువంకలు వెతికారు.. ఎక్కడా దొరకలేదు. ఆ చిన్నారులకేం తెలుసు..? నీళ్లకోసం వెళ్లిన అమ్మ ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిందని..! మృత్యువుకేం తెలుసు? పాలుగారే ఆ పసివాళ్లపై యమపాశం విసరొద్దని..! అక్క పెళ్లి కోసం ఆనందంగా వెళ్తున్న ఆ అన్నదమ్ముల్ని తనతో తీసుకెళ్లొద్దని..!! తెల్లారాకే తెలిసింది.. నీటికోసం అల్లాడి.. నడి అడవిలో తండ్లాడి.. మండే ఇసుక దిబ్బల్లో పొర్లాడి.. పోరాడి.. ఆ చిన్నారులు ప్రాణం వదిలారని!! ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన కరువు రక్కసికి దర్పణం పడుతోంది. మండుటెండలో.. కాలినడకన.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని లింగంపల్లికి చెందిన ఏలాది లచ్చుకు ఇద్దరు కూతుళ్లు మంజుల, సునీత. ఇద్దరు కుమారులు మధుకర్(12), అశోక్(8). ఆమె భర్త లస్మయ్య పిల్లలు చిన్నతనంలో ఉండగానే మృతి చెందాడు. వీరిది నిరుపేద కుటుంబం. కూలీ పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. మధుకర్ ఐదో తరగతి, అశోక్ రెండో తరగతి చదువుతున్నారు. పెద్ద కుమార్తె మంజుల వివాహం లింగంపల్లికి సమీపంలోని బుద్దారం గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చయమైంది. పెళ్లి కుమారుని ఇంటి వద్దే వివాహానికి ఏర్పాట్లు చేశారు. సోమవారమే పెళ్లి. ఆనవాయితీ ప్రకారం మంజులను ముందుగానే పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్లారు. చిన్న కూతురు సునీతను ఇంటి వద్దే ఉంచి తల్లి లచ్చు.. ఆదివారం ఉదయం 10 గంటలకు తన కొడుకులు మధుకర్, అశోక్‌లను తీసుకొని లింగంపల్లి నుంచి కిష్టంపేట మీదుగా గుట్ట దారిలో బయల్దేరింది. 11 గంటల ప్రాంతంలో బుద్దారం అటవీ ప్రాంతంలో దాహం వేస్తోందని కొడుకులు అనడంతో తల్లి తాగేందుకు నీరు తీసుకొస్తానని చెప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లి దారి తప్పింది. మండుటెండలో నీటికోసం అటూఇటూ తిరిగిన లచ్చు వడదెబ్బ తాకి ఓచోట సృ్పహ తప్పిపడిపోయింది. ఇటు ఇద్దరు చిన్నారులకూ వడదెబ్బ తాకింది. నీటి చుక్క కోసం వారు కూడా అడవంతా వెతికారు. కానీ లాభం లేకపోయింది. చివరికి ఎక్కడా నీటిజాడ దొరక్క ఎర్రటి ఎండలో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. రోజంతా మండుటెండలోనే..: మండుతున్న ఎండ పైన.. కాలిపోతున్న ఇసుక కింద.. ఈ పరిస్థితి మధ్య రోజంతా చిన్నారుల మృతదేహాలు అడవిలోనే పడిఉన్నాయి. మరుసటి రోజుకుగానీ ఈ దారుణం వెలుగుచూడలేదు. సోమవారం ఉదయం ఉద్దారం గ్రామస్తులు పండ్ల సేకరణ కోసం అడవిలోకి వెళ్లగా స్పృహ తప్పిన లచ్చు కనిపించింది. నీరు తాగించడంతో కొన ప్రాణాలతో ఉన్న ఆమె మృత్యువు నుంచి బయటపడింది. కన్నీళ్లు పెట్టుకుంటూ తన కుమారుల కోసం వెతకగా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వారిని చూడగానే ఆమె గుండెలవిసేలా రోదించింది. ఉద్దారం గ్రామస్తులు బంధువులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి వె ళ్లి లచ్చును తీసుకొచ్చారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను లింగంపల్లికి తరలించారు. ఆగిన పెళ్లి..: తమ్ముళ్లు ఇద్దరూ వడదెబ్బతో మృత్యువాతపడటంతో మంజుల వివాహం నిలిచిపోయింది. అప్పటికే ఇంటి ముందు పెళ్లి పందిరితోపాటు వివాహానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. అభం, శుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతితో ఇటు లింగంపల్లిలో అటు బుద్దారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఓదెలు వడదెబ్బతో చనిపోయిన చిన్నారుల కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు చెప్పారు. సోమవారం ఆయన లింగంపల్లి వెళ్లి లచ్చు కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థికసాయం కింద రూ.10వేలు అందజేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసినట్లు చెప్పారు. -
నీటి సమస్యపై ఉద్యమిద్దాం
► రేపు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి పిలుపు తిరుపతి మంగళం: జిల్లాలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, అనుబంధ సంస్థలు, అభిమానులంతా ఉద్యమించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నీటి సమస్య పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపైన చంద్రబాబు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. మండుతున్న ఎండలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను అధికారంలోకి వస్తే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తానన్న చంద్రబాబు నేడు రైతులకు సక్రమంగా గంట సేపు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అర్ధరాత్రి 12గంటల నుంచి కేవలం గంట మాత్రమే విద్యుత్ సరఫరా అందిస్తున్నారన్నారు. దాంతో రైతులు రాత్రుల్లో పొలాల వద్ద జాగారం చేస్తూ పాము కాటుకు, విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రాష్ట్రంలో నియంతపాలన సాగిస్తూ అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే నారాయణస్వామి పిలుపునిచ్చారు. -
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి, ఎండలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మద్యం ధరల పెంపు ప్రతిపాదనలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ చట్టాల్లోని మార్పులపై కేబినెట్ చర్చించనుంది. తాత్కాలిక సచివాలయం టెండర్లపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి పునర్ నిర్మాణం, జన్మభూమి కమిటీలపైనా కేబినెట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. -
పుణే మ్యాచ్ లు విశాఖలో...
♦ బెంగళూరుకు ఫైనల్ ♦ ఐపీఎల్ మ్యాచ్‌ల తరలింపు న్యూఢిల్లీ: నీటి సమస్య కారణంగా మహారాష్ట్రలో జరగాల్సిన 13 ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర వేదికలకు తరలించారు. బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో వేదికల మార్పుపై శుక్రవారం సమావేశం జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా విశాఖపట్నం, రాయ్‌పూర్, కాన్పూర్, జైపూర్లను ప్రత్యామ్నాయ వేదికలుగా నిర్ణయించారు. దీంతో రైజింగ్ పుణే తమ వేదికగా విశాఖపట్నంను ఎంచుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువును కోరింది. అలాగే ముంబైలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఇక రెండో క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌ను కోల్‌కతాకు ప్రతిపాదించారు. ‘పుణే తమ హోం మ్యాచ్‌ల కోసం విశాఖను కోరింది. ఈ అంశాన్ని పాలకమండలి ముందు ఉంచుతాం. మహారాష్ట్ర సీఎం కరవు బాధిత సహాయక నిధి కోసం రెండు జట్లు రూ.5 కోట్ల చొప్పున విరాళం ఇచ్చేందుకు అంగీకరించాయి. అలాగే మే 1న ముంబై, పుణే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పుణేలో జరిపేందుకు అనుమతించాలని కోర్టును కోరనున్నాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. -
నీరు లేక నెమళ్ల మృత్యువాత
వేల్పూర్: ఎండ తీవ్రతకు వన్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో జీవించే పక్షులు, జంతువులు నీరు లభించక మృత్యువాత పడుతున్నాయి. నిజామాబాద్ మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఐదు నెమళ్ల కళేబరాలను స్థానికులు గమనించారు. ఈ మేరకు అటవీ అధికారులకు వారు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నీరు అందుబాటులో లేకపోవటంతోనే అవి చనిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు. -
చావుకీ 'నీళ్ల' కరువు!
♦ పాలివాళ్ల స్నానాలకు నీళ్లు లేక స్వగ్రామంలో అంత్యక్రియలు జరపని వైనం ♦ నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లిలో ఘటన ♦ గత నెల 30న చనిపోయిన పెండ్యాల నారాయణరావు ♦ ఇల్లు ఉన్న గ్రామంలో దహనం వద్దన్న కొడుకులు, బంధువులు ♦ కర్మకాండలు, స్నానాలకు నీళ్లు లేకపోవడమే అసలు కారణం ♦ ఊర్లోనే చేయాలని ప్రజలడిగినా కుటుంబ సభ్యుల వెనుకంజ (మేకల కల్యాణ్ చక్రవర్తి) సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉన్న ఊరు, కన్న తల్లి... ఈ రెండు పదాలకు మనిషి జీవితంతో విడదీయరాని అనుబంధం ఉంది. తల్లి లాలనలో అల్లారుముద్దుగా పెరిగి పెద్దయిన తర్వాత ఆ మాతృమూర్తి రుణం తీర్చుకోవాలని.. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా.. ఉన్న ఊరికి సేవచేయాలని, కన్ను మూసినప్పుడు మాత్రం ఆ ఊర్లోనేఆరడుగుల స్థలంలో శాశ్వతంగా నిద్రపోవాలని చాలామంది కోరుకుంటారు. అందుకే మనిషి ఎక్కడ చనిపోయినా స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు, కర్మకాండలు జరిపించడం మనదేశంలో ఆనవాయితీ. కానీ, నల్లగొండ జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు ఓ దొరవారిని ఉన్న ఊరికి దూరం చేశాయి. తాను పుట్టి పెరిగి, విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్దమనిషిగా ఎదిగేందుకు దోహదపడిన ఆ గ్రామంతో దొరవారికి ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెంపేశాయి. అందుకు కారణమేంటంటే.. నీళ్లు, నీళ్లు, నీళ్లు. దొరవారిని ఊర్లో దహనం చేస్తే పాలివాళ్లు (అదే ఇంటిపేరు కలిగిన చిన్నాన్న, పెదనాన్న తరఫు వాళ్లు) స్నానాలు చేయడానికి కూడా గ్రామం లో నీళ్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణంతోనే ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు వెనుకంజ వేశారు ఆయన కుటుంబసభ్యులు. ఊర్లో పెద్దమనిషిగా పేరున్న దొరవారు తమ ఊర్లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్న కోరికతో దొరవారిని ఊర్లోనే దహనం చేయాలని గ్రామస్తులంతా కోరినా.. కేవలం నీటి ఎద్దడి కారణంగానే కుటుంబ సభ్యులు మనోవేదనతో ఊరికి దూరంగా ఆయన అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ఉన్న నీటికొరతకు ఓ మచ్చుతునక. దొరవారు.. ఆ ఊరి కథ పెండ్యాల నారాయణరావు అనే పెద్దమనిషిది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం గుండ్రపల్లి గ్రామం. ఆయన పుట్టి పెరిగింది అక్కడే. ఎంతో క్రమశిక్షణ కలిగిన మనిషిగా, తెలుగుతోపాటు పార్శీ, ఉర్దూ భాషలు నేర్చుకున్న వ్యక్తిగా గ్రామంలో ఆయన తెలియని వారు లేరు. ఆయన మాటంటే గౌరవం కూడా. అందుకే ఆయన్ను నారాయణరావు దొరవారు అని ఆప్యాయంగా కూడా పిలుచుకుంటారు. ఆయనకు ఊర్లోనే భూమి, ఇల్లు, కావాల్సినంత బలగం ఉంది. నలుగురు కుమారులు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ముగ్గురు కుమార్తెలుంటే ఇద్దరు చనిపోగా, మరో కూతురు ఊర్లోనే ఉంటోంది. భార్య యశోదమ్మ 18 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. రెండేళ్ల క్రితం వరకు ఆయన కూడా ఊర్లోనే ఉన్నారు. దాదాపు 95 ఏళ్ల వయసు రావడంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తన రెండో కుమారుడు ఉండే నల్లగొండకు వచ్చారు. ఇటీవలే ప్రమాదవశాత్తు జారిపడ్డ ఆయనకు బాగా సుస్తీ చేసింది. దీంతో గత నెల 30న నల్లగొండలోనే కన్నుమూశారు. ఆయన చనిపోయిన నల్లగొండకు, స్వగ్రామం గుండ్రపల్లికి కేవలం 35 కిలోమీటర్ల దూరమే. పెద్దమనిషి చనిపోవడంతో ఊరికి తీసుకెళ్లి స్వగ్రామంలో దహనం చేయాలని, ఆయన ఇష్టపడి కట్టుకున్న ఇంట్లోనే కర్మకాండలు జరిపించాలని అంతా భావించారు. కానీ, వారి కులస్తులు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసే చోట బావి ఎండిపోయింది. దాదాపు 300 ఎకరాలకు నీళ్లు పారించిన కుంట కింది బావి కూడా వట్టిపోయింది. ఆ ఊళ్లో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. పేరుకు నాలుగు మంచినీటి ట్యాం కులున్నా.. రాత్రింబవళ్లు నీళ్ల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిందే. గతంలో ట్యాంకర్లు కొనుక్కుని నీళ్లు తెచ్చుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ ట్యాంకర్లు కూడా లేవు. కనీసం వాడుకునేందుకు... ఒక్క మాటలో చెప్పాలంటే స్నానాలు చేసేందుకు కూడా నీళ్లు లేవు. ఈ పరిస్థితుల్లో నారాయణరావు పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళితే నీటి ఇబ్బంది ఎదురవుతుందన్న చర్చ జరిగింది. ఊర్లోకి తీసుకెళ్లాలని కొందరు, తీసుకెళ్లి ఇబ్బందులు ఎక్కడ పడతామని మరికొందరు.. ఇలా చర్చోపచర్చలు జరిగాయి. ఊరి ప్రజలంతా ఆయనను ఊర్లోకి తీసుకొచ్చి దహనం చేయాలని అడిగారు.. కానీ కుటుంబ సభ్యులకు ధైర్యం సరిపోలేదు. పాలివాళ్లు స్నానాలు చేయడానికి, ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు, కర్మకాండలకు, పెద్దదినాలు చేసేరోజు ఇష్టబంతికి నీళ్లు ఇబ్బందవుతాయని కుమారులు భావిం చారు. అంతే.. ఊరికి తీసుకెళ్లకుండా నల్లగొండలోని ఓ శ్మశాన వాటికలో దహనం చేశారు. 30 కుటుంబాలవారు అప్ అండ్ డౌన్ ఇంకేముంది.. ఇప్పుడు ఊర్లోని బంధువులు, పాలివాళ్లు రోజూ నల్లగొండకు వచ్చిపోతున్నారు. దొరవారి కర్మకాండలు, రోజువారీ కార్యక్రమాల కోసం 30 కుటుంబాలకు చెందిన పాలివాళ్లు గుండ్రపల్లికి, నల్లగొండకు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. చుక్క నీళ్లుంటే ఒట్టు.. చండూరు మండలం గుండ్రపల్లిలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో మొత్తం 2 వేలకు పైగా జనాభా ఉంది. ఏనుగువారి గూడెం, అలరాజుబావి గూడెం, కోమటివారి గూడెం అనే మూడు ఆవాస గ్రామాలు కూడా ఉన్నాయి. ఊళ్లో ఉన్న నాలుగు ట్యాంకుల్లో నీళ్లు ఎప్పుడు వస్తాయా? అని గ్రామస్తులంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి. రాత్రింబవళ్లు నీళ్ల కోసం కాపలా కాయాల్సిందే. ఉన్న బోర్లు వట్టిపోయాయి. 3, 4 రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి. అవి తాగేందుకు కూడా సరిపోవడం లేదు. ఇక, వాడుకకు, స్నానాలకు నీళ్లన్న మాటే కరువయ్యాయి. గ్రామంలోని యువకులకు పిల్లనివ్వాలంటేనే నీటి ఎద్దడిని చూసి భయపడుతున్నారని, పొద్దున్నే భర్త నిద్ర లేచి భార్య ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి (భార్య నీళ్ల కోసం ట్యాంక్‌ల వద్దకు వెళ్లి కాపలా కాస్తుంది.) ఏర్పడిందని గ్రామస్తులు చెపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగాది నాడు కూడా స్నానాలు చేయలేదని, స్నానం చేయక బట్టలు ఉప్పురిసి పోయాయని గ్రామంలోని మహిళలు వాపోతున్నారు. మొన్న పోయినం.. నిన్న పోయినం..ఈ రోజు కూడా పోవాలె మా పెదనాన్న నారాయణరావు అంత్యక్రియలు ఊర్లోనే చేయాలనుకున్నాం. కానీ, నీటి సమస్యతో నల్లగొండలోనే చేశారు. ఊర్లో మంచి పేరున్న మా పెదనాన్నను ఊరికి తీసుకురావాలని అందరూ అడిగినా తీసుకురాలేకపోయాం. ఇప్పుడు ఆయన కర్మకాండల కోసం రోజూ నల్లగొండకు వెళ్లి రావాల్సి వస్తోంది. మొన్న పోయినం.. నిన్న పోయినం.. ఇష్టబంతికి ఈ రోజు కూడా పోవాలి. కేవలం ఊర్లో నీళ్లు లేవన్న కారణంతోనే మా పెదనాన్న పార్థివదేహాన్ని నల్లగొండలో పెట్టారు. - పెండ్యాల మనోహర్‌రావు, నారాయణరావు బంధువు -
తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ
హైదరాబాద్: తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం లోటస్‌పాండ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం భేటీ అయింది. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని జిల్లాల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో కరవు, మంచినీటి సమస్య, ప్రాజెక్ట్‌ల రీడిజైన్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. -
ఇవేం పైపులైన్లు?
తీవ్రంగా కలుషితమవుతున్న జలాలు పురాతన పైపులైన్లే కారణం గుర్తించిన అధికారులు నూతన పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు.. ఏడు నీటి నమూనాల్లో బ్యాక్టీరియా కలకలం.. సిటీబ్యూరో: నగరంలో పురాతన మంచినీటి పైపులైన్లు, డ్రైనేజి పైపులైన్లు ఒకదానిపై మరొకటి ఉన్న చోట కలుషిత జలాల సమస్య తరచూ తలెత్తుతోంది. ఇటీవల సరూర్‌నగర్ పరిధిలోని కామేశ్వర్రావు నగర్, అల్వాల్‌లోని రాజీవ్‌నగర్, అంబేద్కర్‌నగర్, మలక్‌పేట్‌లోని ప్రిన్స్ బాడీగార్డ్లేన్, చర్చికాలనీ, రామంతాపూర్‌లోని గోకుల్‌నగర్‌లో కలుషిత జలాల సమస్య ఉత్పన్నమైన విషయం విదితమే. ఈనేపథ్యంలో జలమండలి అధికారులు రంగంలోకి దిగి కలుషిత జలాలకు కారణాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పురాతన ఆర్సీసీ, ఏసీ, పీవీసీ, హెచ్డీపీఈ మంచినీటి సరఫరా పైపులను భూమి నుంచి 5 నుంచి ఆరు అడుగుల లోతున ఏర్పాటు చేశారు. వీటిపై నుంచి నూతనంగా మురుగు నీటి పైపులైన్లు వేయడంతో మంచినీరు, మురుగు నీటి పైపులైన్లకు ఏర్పడిన స్వల్ప లీకేజీలతో కలుషిత సమస్య ఉత్పన్నమైంది. ఆయా ప్రాంతాల్లో తక్షణం పురాతన మంచినీటి పైపులైన్ల స్థానే నూతన పైపులైన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హడ్కో సంస్థ మంజూరు చేసిన రుణంతో ఆయా ప్రాంతాల్లో ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలమండలి ఎండీ బి.జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో గుంతల్లో ఏర్పాటు చేసిన పిట్ట్యాప్లను తక్షణం తొల గించాలని స్థానికులకు సూచించామని జలమండలి వర్గాలు తెలిపాయి. 11247 నీటి నమూనాలకు పరీక్షలు.. మార్చి 1 నుంచి 24 వరకు నగర వ్యాప్తంగా 11,247 మంచినీటి నమూనాలకు ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్ ల్యాబుల్లో పరీక్షలు నిర్వహించినట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఏడు నీటి నమూనాల్లో మాత్రమే బ్యాక్టీరియా ఆనవాళ్లున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్యను నివారించామని ప్రకటించింది. ఇక రోజువారీగా నగరం నలుమూలల నుంచి 2180 నీటి నమూనాలను సేకరింంచి ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్, ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ల్యాబుల్లో పరీక్షిస్తున్నామన్నారు. నీటి నమూనాల సేకరణకు సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపు మహిళల సహకారం తీసుకుంటున్నామన్నారు. కలుషిత జలాలపై అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎండీ బి.జనార్దన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సీజీఎం, జీఎం, డీజీఎం, మేనేజర్లకు ఆదేశాలిచ్చారన్నారు. -
నీటి కోసం రోడ్డెక్కిన జనం
రెండు గంటల పాటు రాస్తారోకో గర్గుల్ వాసుల ఆందోళన అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మహిళలు కామారెడ్డి రూరల్: గొంతెండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తూ గర్గుల్ గ్రామస్తులు రోడ్డెక్కారు. కామారెడ్డి-రామారెడ్డి రోడ్డుపై గురువారం రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఉదయం ఖాళీ బిందెలతో స్థానికులు రాస్తారోకో చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, బోర్లు ఎత్తిపోవడంతో రోజూ వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడితో పాటు అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని వివరించారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు ఇక్కడకు వచ్చి గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే, అధికారులు వచ్చి నీటి సమస్యను తీర్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఓ కానిస్టేబుల్ గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, స్థానికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న దేవునిపల్లి ఎస్సై నవీన్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. మరోవైపు తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గాయత్రి వచ్చి వారితో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పగా, తమ కాలనీకి వచ్చి సమస్యను చూడాలని పట్టుబట్టారు. దీంతో వారు కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. సమీపంలో ఉన్న నాలుగు వ్యవసాయ బోర్లను సైతం పరిశీలించిన అధికారులు, రైతులతో మాట్లాడారు. అయితే, బోర్లను అద్దెకు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. వారం రోజుల్లో పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను సరఫరా చేస్తామని, అప్పటివరకు రోజూ రెండు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు. మాజీ ఎంపీపీ నిమ్మ లింగవ్వ, రవీందర్‌రెడ్డి, భీంరెడ్డి, శ్రీనివాస్, సాయిలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటిపై రాజకీయాలు దురదృష్టకరం
ఎమ్మెల్యే హంపనగౌడ ఆవేదన సింధనూరు టౌన్ : నగరంతో పాటు తాలూకా వ్యాప్తంగా మంచినీటి సమస్యపై విపక్ష నేతలకు అవగాహన ఉన్నా నీటి విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే హంపనగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సింధనూరు నగరసభ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సింధనూరులో నీటి సమస్య పరిష్కారానికి తాను, నగరసభ యంత్రాంగం శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విషయం విపక్ష నేతలకు తెలుసన్నారు. వారి వ్యాఖ్యలను గమనించానన్నారు. అనుభవజ్ఞులైన నాయకులు చేయాల్సిన వ్యాఖ్యలు కావన్నారు. ఇంకా నాలుగు నెలల పాటు నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్ల ముందు చూపుతో వ్యవహరిస్తున్నామన్నారు. టీబీ డ్యాంలో మంచినీటి అవసరాల కోసం ఇంకా సుమారు 3 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. బహుశ ఒకసారి కాలువకు నీరు వదిలించుకునేందుకు వీలవుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి కాలువకు నీరు వదిలేందుకు వీలు కాదన్నారు. ఈనెల 25న సింధనూరు వాసుల దాహార్తి తీర్చేందుకే తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదులుతున్నారన్నారు. సింధనూరులోని మంచినీటి చెరువులను, గ్రామీణ ప్రాం తంలోని చెరువులను నింపుకోవాలన్నా రు. ఈసందర్భంగా నగరసభ అధ్యక్షురాలు మంజుల పాటిల్, ఉపాధ్యక్షురాలు అన్వర్ బేగం, స్థాయీ సమితి అధ్యక్షుడు శరణయ్య స్వామి వక్రాణి, సభ్యులు ప్రభురాజ్, నబీసాబ్, మహ్మద్ అలీ, షఫియుద్దీన్ నవాబ్, వెంకటేష్ బండి, సురేష్ సేఠ్, శశికుమార్, నగర యోజన ప్రాధికారం అధ్యక్షుడు ఎస్.శరణేగౌడ, ఆర్సీ పాటిల్, మల్లికార్జున గుంజళ్లి, నన్నుసాబ్ పాల్గొన్నారు. -
ప్రియమైన ముఖ్యమంత్రి గారికి...
‘‘మేము, అనగా నల్లగొండ జిల్లా వాసులం.. మీకు ప్రేమతో రాస్తున్న కష్టాల లేఖ ఇది. జిల్లాలో ఉన్న 35లక్షల మంది ప్రజల పక్షాన మీకు మా సమస్యలను తెలియజేసుకుంటున్నాం. పోరాడి సాధిం చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాము. మీతో పాటు మా జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా మా జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. మానవాభివృద్ధి సూచిలో మా జిల్లా తెలంగాణలోని 10 జిల్లాల్లో 8వస్థానంలో ఉందంటే మా అభివృద్ధి ఏపాటిదో మీకు అర్థమవుతుంది. అయ్యా.. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మా సమస్యలను తెలియజేయాలని భావించి ఈ లేఖ రాస్తున్నాం.’’ సాగునీరు అందించాలి ఇక సాగునీటి విషయానికి వస్తే ఈ ఏడాది బడ్జెట్లో మా జిల్లా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు మీకు కృతజ్ఞులం. అయితే డిండి ఎత్తిపోతల పథకం డిజైన్ ఇంతవరకు ఖరారు కాలేదు. ఈ బడ్జెట్లో రూ.650 కోట్ల మేర నిధులు పెట్టినా పాలమూరు నేతల పంచాయతీతో అది పెండిం గ్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు వరప్రదాయినిగా మీరు ఈ ప్రాజెక్టును రూపొందించారు. వీలున్నంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. ప్రాణహిత-చేవెళ్ల, చొక్కారావు దేవాదులు, శ్రీరాంసాగర్ రెండో దశ లాంటి పథకాలను కూడా త్వరగా పూర్తి చేసేలా నిధులిప్పించాలని కోరుతున్నాం. మా సమస్యలివే సార్... తాగునీటి సమస్య తీవ్రతరం జిల్లాలో ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 1,176 గ్రామపంచాయతీల పరిధిలో 3,300 ఆవాసాలుండగా, అందులో 300 ఆవాసాలకు ఇంతవరకు మంచినీరు లేదు. వీటికి తోడు కరువుతో జిల్లా ప్రజానీకం అల్లాడుతోంది. పెద్ద ఎత్తున నిధులు సమకూరిస్తే కానీ రానున్న వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితి లేదు. నాన్కంటింజెన్సీ రిలీఫ్ ఫండ్ కింద రావాల్సిన రూ.60 కోట్లను ఇప్పించాలని కోరుతున్నాం. నీటి సమస్య తీరాలంటే సాగర్ ఎడమ కాల్వకు తాగునీటి కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతున్నాం. చేనేతకు చేయూతనివ్వాలి జిల్లాలో మొత్తం 70 చేనేత, జౌళి సంఘాల్లో 22వేల మంది కార్మికులున్నారు. ఇందులో ఏడాది కాలంలో 26 సంఘాలు మూతపడ్డాయి. దాదాపు 10 వేల మంది ఇతర రంగాలకు వలస వెళుతున్నారు. ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలకు మూడు నెలలుగా బిల్లుల్లేవు. చేనేతలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నాం. జిల్లాలో 3లక్షల ఎకరాల్లో బత్తాయి, నిమ్మ, మామిడి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా నకిరేకల్ ప్రాంతంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. బత్తాయి తోటలు సాగు చేసే రైతాంగానికి సరైన మార్కెటింగ్ కోసం మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలి. 9గంటల కరెంట్ హామీ నెరవేర్చాలి జిల్లాలో 3.44లక్షల వ్యవసాయ బావులున్నాయి. వీటికి 9 గంటల పగటి విద్యుత్‌ను సరఫరా చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఏప్రిల్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీ నెరవేర్చుకుంటామని మా జిల్లా మంత్రి, రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలి. అదే విధంగా జిల్లాలో దాదాపు 5లక్షల మంది రైతులు పూర్తి స్థాయిలో రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తెలంగాణలో మా జిల్లాకు అత్యధికంగా 1100 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ కింద ఇప్పటికే రెండు దఫాల్లో ఇచ్చారు. అది 50 శాతం మొత్తానికే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేసి వచ్చే ఖరీఫ్ నాటికయినా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. సరిపడా లేని అగ్నిమాపక కేంద్రాలు జిల్లాలో ప్రస్తుతం భువనగిరి, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, నల్లగొండ రామన్నపేటల్లో 11 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటిలో నకిరేకల్‌కు సొంత భవనం లేదు. వీటితోపాటు చండూరు, మోత్కూరు, యాదగిరిగుట్ట, రాజుపేటల్లో నూతన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. వీటిని కూడా త్వరగా నిర్మించాలని మనివి. హైవే ఆస్పత్రి ఏర్పాటు చేయూలి జిల్లా ప్రజలకు ఆధునిక వైద్యసేవలతోపాటు, హైవే భాదితులకు తక్షణ వైద్య సేవల కోసం నార్కట్‌పల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్టు మీరు 2014లో ప్రకటించారు. జిల్లాలో 65వ నంబరు జాతీయ రహదారి చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట నుంచి కోదాడ మండలం రామాపురం వరకు 160కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. హైవేపై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారిపై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయించాలి. ఎంజీయూలో సమస్యల లొల్లి మా జిల్లా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. పలు అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. యూనివర్శిటీకి రూ.100 కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా. ఈ మొత్తాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నాం. పాలేరు జలాల హామీ నెరవేర్చాలి ఎన్నికల ముందు సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో అధికారంలోకి వచ్చిన వెంటనే పాలేరు వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని సూర్యాపేట పట్టణానికి పాలేరు జలాలు అందిస్తానని మీరు హామీ ఇచ్చారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో నేరాలు పెరిగిపోతున్నాయి. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేస్తే నేరాలు అదుపులోకి తేవచ్చు.పట్టణంలో నాలా నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. అలాగే అండర్‌గ్రౌండ్ డ్రెరుునేజీ నిర్మాణం కూడా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భువనగిరి డివిజన్లో ఎక్కువగా ఉన్న బీడీ కార్మికులు సుమారు 1000 మంది అన్ని అర్హతలు ఉండి కూడా జీవన భృతి పొందడం లేదు. వారు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కడం లేదు. ఆసరా పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూపులు.. జిల్లాలో ప్రస్తుతం 4లక్షల మంది ఆసరా పథకం కింద పింఛన్లు పొందుతున్నారు.మొదటి వారంలో అందే పింఛన్ ఇప్పుడు మూడో వారానికి వెళ్లింది. బయోమెట్రిక్ వ్యవస్థతో వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛన్ల పంపిణీలో అవినీతి కూడా జరుగుతోంది. ప్రతినెలా మొదటి వారంలో పింఛన్లు వచ్చేలా చూడాలని మనవి. వలసలు, శిశు విక్రయూలను నివారించాలి దేవరకొండ నియోజకవర్గంలో వలసల కారణంగా పేదరికం పెరిగిపోతోంది. పనులు లేక పొట్టచేతబట్టుకుని చందంపేట మండలంలోని 60 శాతం గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇక్కడ పనులు కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ శిశు విక్రయాల దురాచారానికి అడ్డుకట్ట వేసేచర్యలు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలి. -
నీటి సమస్య తీర్చండి
బడ్జెట్లో నిధులు కేటాయించండి ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు పెంచండి బళ్లారి మహా నగర పాలికె సమావేశంలో కార్పొరేటర్లు విజ్ఞప్తి సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలో వేసవిలో మంచినీటి సమస్య తీర్చడంపై బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు న నగర ప్రముఖులతో పాటు నగరంలోని కార్పొరేటర్లు పేర్కొన్నారు. శుక్రవారం బళ్లారి నగరంలో మహానగర పాలికె ఆధ్వర్యంలో బడ్జెట్‌పై ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 11న బళ్లారి నగరాభివృద్ధి కోసం బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మహానగర పాలికె మేయర్ నాగమ్మ, ఇన్‌ఛార్జి కమిషనర్ విజయ మహాంతేష్ దానమ్మనవర్లు పలువురు ప్రముఖులు, కార్పొరేటర్ల నుంచి సలహాలు సూచన లు తీసుకున్నారు. బడ్జెట్లో ఏయే అభివృద్ధి పనులకు, సమస్యలు తీర్చడానికి నిధులు కేటాయించాలనే దాని గురించి చర్చ ఏర్పాటు చేయగా, నగర సమస్యలపై ప్రతి ఒక్కరూ గళం విప్పారు. నగరంలో 35 వార్డులలోను మంచినీటి సమస్య తీవ్రమైందని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. 1వ వార్డు కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... బళ్లారి నగరంలో 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేస్తామని మంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుని నగర వాసులకు నీటి కష్టాలు తీర్చాలన్నారు. కప్పగల్, సిరివార, సంగనకల్లు గ్రామాలకు మంచినీరు నిరంతరం సరఫరా చేస్తున్నారని, అదే సందర్భంగా అక్కడ నుంచి వచ్చే నీటిని పొదుపు చేస్తూ నగర వాసులకు నీటి సమస్య తీర్చాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కింద ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు మాత్రమే కేటాయిస్తున్నారని, ఆ మొత్తం సరిపోవడం లేదని, మరో రూ.5 వేలు మహానగర పాలికె కింద పేదల కోసం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువసేన సోషల్ యాక్షన్ క్లబ్ అధ్యక్షుడు మేకల ఈశ్వరరెడ్డి, స్థానికులు శ్రీనివాసమూర్తి తదితరులు మాట్లాడుతూ... బళ్లారి నగరంలో మంచినీటి సమస్య తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా చేపట్టడం లేదని, పందులు స్వైర విహారం చేస్తున్నాయని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్య ఉన్న వార్డులో ట్యాంకర్లతో ఎప్పటికప్పుడు నీటి సమస్య తీర్చడానికి కృషి చేయాలని, అందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ నాగమ్మ, ఉపమేయర్ మాలన్‌బీ, సిటీ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ విజయ మహాంతేష్ దానమ్మనవర్ తదితరులు పాల్గొన్నారు. -
కదిలిస్తే క‘న్నీరే’
జోగిపేట : అందోలు మండలం కొడెకల్ గ్రామస్తులను కదిలిస్తే కన్నీటి కథే.. గ్రామంలో మంచినీటి ఇబ్బందు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళితుల కాలనీలో కాలనీవారే చందాలు వేసుకొని బోరు వేసుకోగా, గ్రామానికి నీరందించేందుకు వ్యవసాయ బోరును రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బోరు నుంచి ట్యాంకు ద్వారా మినీ ట్యాంకును నింపి నీటిని పంపిణీ చేస్తున్నారు. గ్రామంలోని రెండు వీధుల్లోని కుటుంబాలు విరాళాలు వేసుకొని సొంతగా నీటి సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. నీటి కోసం పుట్టెడు కష్టాల్లో ఉన్న గ్రామాన్ని ఆదుకోవాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటువైపు కన్నెత్తయినా చూడడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరిని కదిలించిన బుక్కెడు అన్నం లేకున్నా సరే.. నీరు వచ్చేటట్లు చూడండంటూ ప్రాధేయపడుతున్నారు. వ్యవసాయబోరు కొనుగోలు గ్రామస్తులు నీటి ఎద్దడిని నివారించాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తామే రూ.1.50 లక్షలతో వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీకి వివిధ పద్దుల కింద వచ్చిన నిధులతో గ్రామానికి 2.కి.మీ దూరంలో ఉన్న నారాయణకు చెందిన వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. అయితే పంచాయతీలో కేవలం రూ.70వేలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే ట్రాక్టర్‌పై ట్యాంకర్ ద్వారా గ్రామంలోని మినీ ట్యాంకుల్లోకి చేరవేస్తున్నారు. అక్కడి నుంచి గ్రామస్తులు బిందెలతో పట్టుకెళుతున్నారు. కన్నెత్తి చూడని అధికారులు అందోలు మండలంలో కొడెకల్‌లో ఉన్న మంచినీటి ఎద్దడి ఏ గ్రామంలో లేదు. ఇన్ని ఇబ్బందులు ఏ గ్రామంలోనూ లేవు. కనీసం దగ్గరలోని వ్యవసాయ బోరుబావిలో నుంచి తెచ్చుకుందామనుకున్నా ఆ పరిస్థితిలేదు. గత్యంతరం లేక సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలంతా చర్చించుకొని సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావిని కొనుగోలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పశువులకు ట్యాంకరు నీరే... గ్రామంలో ఉన్న పశువులకు నీటి కోరత తీవ్రంగా ఏర్పడింది. ఎక్కడా వాటికి నీటి వసతిలేకపోవడంతో ప్రజలకు పంపిణీ చేసే ట్యాంకర్ ద్వారా తీసుకువచ్చిన మంచి నీటిని నీటి తొటెల్లో పోస్తున్నారు. పశువులను అక్కడికి తీసుకువచ్చి నీటిని తాగిస్తున్నారు. ఇంత కరువు ఎన్నడూ చూడలే.. నేను పుట్టినప్పటి నుంచి నీటి కరువును ఇంతగా చూడలేదు. తినడానికి తిండి లేకున్నా మంచినీళ్లు మాత్రం తప్పనిసరిగా కావాలి. ప్రభుత్వం వాగులో బోర్లు వేసి పైపులైన్ ద్వారా గ్రామానికి నీటిని అందించాలి. - సామెల్, కొడెకల్ వాసి చందాలువేసి బోరు వేయించుకున్నాం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎస్సీ వాడకు చెందిన 20 కుటుంబాలకు చెందిన మేము ఇంటికి రెండు వేలు వేసుకొని బోరు వేయించుకున్నాం. అయినా బోరు నుంచి సరిగా నీరు రావడంలేదు. గ్యాప్ ఇచ్చుకుంటూ నీళ్లు వస్తున్నాయి. - సాయమ్మ, కొడెకల్ గ్రామ మహిళ రూ.150 లక్షలతో బోరు కొనుగోలు చేశాం గ్రామంలో మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని రెండు బోర్లు వేయించగా ఫెయిలయ్యాయి. తప్పనిసరి పరిస్థితిలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయబోరును రూ.1.50 లక్షలకు పాలకవర్గ సభ్యుల అనుమతితో కొనుగోలు చేశాం. బోరు వద్ద నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని గ్రామంలోని మినీ ట్యాంకులకు చేరవేస్తున్నాం. - రజిత శ్రీనివాస్‌రెడ్డి, గ్రామసర్పంచ్, కొడెకల్