![Megastar Chiranjeevi Tweet Goes Viral On Bangalore Water Crisis - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/27/Megastar-Chiranjeevi-Tweet.jpg.webp?itok=_PqMKLAX)
మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో చిరు సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో అవలంభించిన పద్ధతులను వివరించారు. తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను పంచుకున్నారు. అంతే కాకుండా తన ట్వీట్‌లో కన్నడ భాషలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ఇది చదవండి: చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే?)
కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది.
ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ... ಬಹಳ ಮುಖ್ಯ.
ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024
Comments
Please login to add a commentAdd a comment