
ఇదేమి దౌర్భాగ్యం..?
ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు చిలమత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి రోజూ అన్నం తిని తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న మరుగుదొడ్ల వద్దకు వెళ్లి ప్లేట్లను శుభ్రం చేసుకొని నీళ్లు తాగి వస్తుంటారు. ఈ దృశ్యాలను చూస్తున్న వారంతా రోజూ అయ్యో పాపం అని అనుకుంటుంటే... అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రం చీమకుట్టినట్లైనా లేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని దాదాపు 800 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో పంచాయతీవారు ఏర్పాటు చేసిన కుళాయిల్లో నీరురాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం వస్తుందో... లేదో చూడాలి.
- చిలమత్తూరు