రబీలో పూర్తి ఆయకట్టుకు సాగునీరు
-
వర్మా..వైఎస్ సాగు నీరివ్వలేదని నిరూపిస్తావా
-
పదవికి రాజీనామా చేస్తాః ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సవాల్
-
పుష్కర ఈఈ బదిలీకి మంత్రి ఆదేశం
-
వాడీవేడిగా ఐఏబీ సమావేశం
రెండో పంటకు సాగునీటి సరఫరాపై గురువారం రాత్రి జరిగిన ఐఏబీ సమావేశం రసాభాసగా సాగింది. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్ విధాన గౌతమి హాలులో జరిగిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇ¯ŒSచార్జి, నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో గోదావరిలోని ఈస్టన్ర్, సెంట్రల్ డెల్టాలతో పాటు ఏలేరు ఆయకట్టులో రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు సరఫరా చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సాగునీటి సమస్యలు, ప్రాజెక్టు పనులపై సమీక్షను చేపట్టారు. సమస్యలు ఏమైనా ఉంటే చర్చకు పెట్టాలని ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలు పూర్తిగా పనిచేయడం లేదని, ఏ ఆయకట్టులోను రైతులు సక్రమంగా సాగు చేయలేకపోతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏ ప్రాజెక్టు పరిధిలో ఎంత ఆయకట్టుకు నీరు సరఫరా చేస్తున్నారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి అయిపోతుందని చెబుతున్నప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఎందుకు చేపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం పూర్తి అయిపోతుందని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు రూ.1632 కోట్లు ప్రజాధనం వృథా చేయడం కాక మరేమిటని జగ్గిరెడ్డి నిలదీశారు. మంత్రి దేవినేని స్పందిస్తూ పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఇలానే మాట్లాడారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసి వేలాది ఎకరాలకు సాగునీరందించామని అన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును జూ¯ŒS నాటికి పూర్తిచేసి ఏలేరుతో పాటు విశాఖకు కూడా నీరందిస్తామని చెప్పారు.
రబీకి పూర్తిస్థాయిలో నీరు
గోదావరి డెల్టా, ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ వ్యవస్థల కింద పూర్తి నికర ఆయకట్టుకు 2016–17 రబీ పంటల సాగుకు నీరు అందిస్తామని ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. తొలుత ధవళేశ్వరం ఇరిగేష¯ŒS సర్కిల్ ఎస్‌ఈ బి.రాంబాబు 2016–17 రబీ సీజ¯ŒSకు గత ఆరు సంవత్సరాల అనుభవాల ఆధారంగా లభ్యం కానున్న గోదావరి జలాలు, సీలేరు, బలిమేల నుంచి అందే జలాల అంచనాలు, తాగునీటి అవసరాలకు పోగా మిగిలే నికర జలాల అంచనాలను వివరించారు. ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని మాట్లాడుతూ అందుబాటులో ఉన్న జలాల సమర్థ వినియోగంతో ప్రస్తుత ఖరీఫ్ పంటలను కాపాడడంతోపాటు, వచ్చే రబీలో గోదావరి, ఏలేరు, పీబీసీ ఆయకట్టు మొత్తానికి నీరు అందించాలని ఇరిగేష¯ŒS అధికారులను ఆదేశించారు. వచ్చే రబీ అనంతరం 2017 మార్చి 10న కాలువలు మూసివేసి క్లోజర్ పనులు చేపట్టేందుకు, ఖరీఫ్ సీజ¯ŒSలో 2017 జూ¯ŒS 15 నుంచి పంట కాలువలు తెరిచేందుకు ప్రతిపాదించగా, మారిన సాగు కాలం, క్లోజర్ పనులు పూర్తి చేసేందుకు క్లోజర్ తేదీని మార్చి 31, కాలువలు తెరిచే తేదీని జూ¯ŒS మొదటి వారానికి మార్చాలని ఎమ్మెల్యేలు కోరారు. పుష్కర ఎత్తిపోతల పథకంలో పంపులు పనిచేయకపోవడంపై మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు కారణమేమిటని మంత్రి దేవినేని ప్రశ్నించగా రెండు పంపులు పనిచేయడం లేదని హైదరాబాద్‌కు ప్రతిపాదనలు పంపించామని సమాధానం చెప్పిన ఈఈ వాసుదేవరావును బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈఈలు పర్సంటేజీల కోసం కాకుండా రైతుల కోసం కాలువ గట్లపైకి వెళ్లి పనిచేయాలని, నీటి సంఘాల ప్రతినిధులు పెత్తనం కోసం కాకుండా ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఎంపీ తోట నరసింహం, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ప్రాజెక్టు కమిటీ చైర్మ¯ŒSలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు వర్మ.. జగ్గిరెడ్డి వాగ్వాదం
ఇంతలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ కల్పించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకిగా తయారైందని చేసిన వ్యాఖ్యలపై జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టుల పరిధిలో ఒక్క ఎకరాకు సాగునీరందించ లేదని వర్మ ఆరోపించడంతో ఆయనపై జగ్గిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతు పక్షపాతి ఎవరో, రైతును వెన్నుపోటి పొడిచిన వారెవరో ప్రజలకు తెలుసని, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ హయాంలో ఒక్క ఎకరాకు సాగునీరందించ లేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అందుకు మీరు సిద్ధమా అని వర్మకు జగ్గిరెడ్డి సవాల్ విసిరారు. ఇద్దరి మద్య వివాదం తారస్థాయికి చేరుకోవడంతో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప జోక్యం చేసుకుని వారిని శాంతింపచేశారు.ఇంతలో 98శాతం మంది దళితులున్న రామచంద్రపురం నియోజకవర్గం శేరిలంక గ్రామంలో సగం గోదావరిలో కలిసిపోయిందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.కనీసం ఇప్పటికైనా రక్షణ చర్యలు తీసుకుని మిగిలిన గ్రామాన్నైనా పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నీటిపారుదలశాఖాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని జిల్లా ఇ¯ŒSచార్జి, నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమ ఆదేశించారు. ఇంతలో ఎమ్మెల్యే త్రిమూర్తులు సీటు లోంచి ఆగ్రహంగా లేచి అప్పటి ప్రభుత్వంలో ఉండి ఏ చర్యలు తీసుకున్నావో చెప్పాలంటూ ఎమ్మెల్సీ బోస్‌ను ఉద్ధేశించి బిగ్గరగా కేకలు వేయడం, అందుకు దీటుగా బోస్ కూడా మాట్లాడటంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. హత్యలు, దోపిడీలు, అవినీతి కార్యకలాపాలు చేయడం నీకే తగునని , అవి మాకు చేతకావని బోస్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వేదిక దిగి వచ్చి సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.