దుద్దెడలో మాట్లాడుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
కొండపాక: మిషన్ భగీరథతో నియోజక వర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద ప్రధాన మంత్రి మోదీచే ప్రారంభించే మిషన్ భగీరథ పథక సమావేశానికి జన సమీకరణ కోసం మండలంలోని దుద్దెడలో బుదవారం సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఎంపీ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నియోజక వర్గంలో అన్ని కుటుంబాలకు నల్లాల ద్వారా గోదావరి నదీ జలాలను అందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం నియోజక వర్గ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టమన్నారు. కేవలం 6 నెలల కాలంలో కొండపాక, గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, తూప్రాన్, ములుగు మండలాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక‌్షన్‌లు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, జెడ్పీటీసీ మాధూరి, ఎంపీపీ అనంతుల పద్మ, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు దోమల ఎల్లం, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు ఏర్పుల యాదయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఖమ్మంపల్లి మల్శేశం, ఎంపీపీ ఉపాధ్యక్షులు రాదాకిషన్‌రెడ్డి, డీబీఎస్ రాష్ట అధ్యక్షులు దేవి రవీందర్, సర్పంచ్‌లు, మాజీ ఎంపీపీ బొద్దుల కనుకయ్య, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గోన్నారు.