
ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
సాక్షి, నరసాపురం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో బుధవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై ఖాళీ బిందెలను ఉంచి నిరసన తెలిపారు.
సుమారు 200 కుటుంబాలకు పైగా నివసిస్తున్న తమ కాలనీలో తాగునీటి సదుపాయం లేదని మంత్రి వద్ద ధ్వజమెత్తారు. పూర్తిగా ఉప్పునీటి మయమైన తమ ప్రాంతానికి పక్క గ్రామమైన వేములదీవి నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అవుతున్నప్పటికీ.. అవి కూడా తరచూ పైపులైన్లు పాడై నీరు ఉప్పగా ఉంటుందని చెప్పారు. అదికూడా రెండు రోజులకోసారి కేవలం అరగంట పాటు మాత్రమే ఇస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలు తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. అనంతరం కాన్వాయ్ ముందుకు సాగింది.
Comments
Please login to add a commentAdd a comment