westgodavari district
-
YSRCP పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులు వీళ్లే
పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!
అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు. బియ్యపు గింజపై కళాఖండాలు చెక్కి ఔరా! అనిపిస్తాడు. పెన్సిల్ మొనపై రాటుదేలిన తన పనితనంతో బొమ్మ చెక్కితే భూతద్దం పెట్టి చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటికే తన కళాతృష్ణతో రెండు సార్లు లిమ్కా బుక్ రికార్డులకెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి విజయమోహన్ తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ అబ్బురపరిచాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు చెక్కి గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. సూక్ష్మకళలో కొన్నేళ్ల నుంచి అద్భుతాలు సృష్టిస్తున్న అతను బియ్యపు గింజలపై వివిధ కళాఖండాలు చెక్కడంలో దిట్ట. బియ్యపు గింజ ఎంత చిన్నగా ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి గింజపై వేల కొద్దీ బొమ్మలు చెక్కిన ఘనత ఆయనది. ప్రస్తుతం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయ అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ ఎలాంటి సూక్ష్మదర్శిని వాడకుండా చిన్నపాటి సూదిమొనతో ఈ అద్భుతాలు సృష్టించడం విశేషం. – నరసాపురం బియ్యపు గింజలు, నువ్వుల గింజలు, కొబ్బరి పీచు ఇలా ఈ సూక్ష్మమోహనుడు పనితనానికి కాదేదీ అనర్హం. దేనిపైనైనా అద్భుతంగా బొమ్మలు చెక్కిచూపిస్తాడు. పదేళ్ల వయస్సులో పనికిరాని వస్తువులతో బొమ్మలు చేయడంతో ప్రారంభమైన ఇతని విజయ ప్రస్థానం ఈ రోజు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచం మొత్తంగా సూక్ష్మ కళాకారులు ఎంతో మంది ఉండగా.. బియ్యపు గింజపై బొమ్మలు చెక్కే వారు చాలా అరుదు. బియ్యపు గింజలపై పేర్లు రాయడం వంటివి చాలామంది చేస్తుంటారు. అయితే ఆ దశను మోహన్ దాటి మరింత ముందుకు వెళ్లాడు. ఇంత వరకూ బియ్యపు గింజలపై 3 వేల వరకూ బొమ్మలు చెక్కాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు, ప్రియురాలి హృదయం, దేశ నాయకులు ఇలా.. ఒక్కో బియ్యపుగింజపై ఒక్కో అద్భుత ఆకారాన్ని సృష్టించాడు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా.. ఒకే బియ్యపుగింజపై శ్రీరామ పట్టాభిషేకం దృశ్యం మొత్తం చెక్కడం ఆ యువకుడి ప్రతిభకు మరో తార్కాణం. పెన్సిల్ మొనలు, సుద్దముక్కలపై 5 వేల పైనే బొమ్మలు చెక్కాడు. నువ్వుల గింజ, కొబ్బరిపీచులో ఒక లేయర్‌పై బొమ్మలు వేస్తాడు. భవిష్యత్‌లో కొబ్బరిపీచు లేయర్‌పై కూడా బొమ్మ చెక్కే ప్రయత్నం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన విజయమోహన్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఢిల్లీ పిలిపించుకుని అభినందించారు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) తొలి ప్రయత్నంలోనే గిన్నిస్ రికార్డు బియ్యపు గింజలపై బొమ్మలే కాదు కాకుండా చెట్ల ఆకులపై సూదితో చిల్లులు పెడుతూ ఎవరి ఆకారాన్ని అయినా చెక్కేస్తాడు. అగ్గిపుల్లలు, కోడిగుడ్డు గుల్లలు, ఖాళీ బీరుబాటిళ్లు, పనికిరాని చెక్క ముక్కలు అతని కంటిలో పడితే అందాలు చిందే వస్తువులుగా మారిపోతాయి. ఇంజినీరింగ్ పూర్తిచేసి 2019 అక్టోబర్‌లో గ్రామసచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అయినా తన ప్రవృత్తిని వదిలిపెట్టకుండా బొమ్మలు చెక్కడం కొనసాగిస్తూ గిన్నిస్ రికార్డు సాధించాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు ఎలాంటి అతుకులు లేకుండా చెక్కి గిన్నిస్ సాధించాడు. అదీ తొలిప్రయత్నంలోనే కావడం గమనార్హం. దీనికి కేవలం రెండురోజుల సమయం పట్టింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అతిచిన్న మిక్సీ తయారు చేసినందుకు 2019 మార్చి 16న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతనిపై వ్యాసం వెలువడింది. మళ్లీ అదే ఏడాది అతిచిన్న మజ్జిగ చిలికే యంత్రం తయారుచేసి రెండోసారి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కాడు. నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్ట్స్ విభాగంలో విజయమోహన్‌ను జాతీయ స్థాయిలో రాష్ట్రీయ యువ గౌరవ అవార్డుతో సత్కరించింది. 2018 మార్చి 21న ఢిల్లీలోని ఆంధ్రా భవన్లో జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర మంత్రులు విజయ్‌గోయల్, రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ యువకుడిని తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇన్క్రెడిబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడుకు చెందిన ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ ఎచీవర్ బుక్ అఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు. 2017 ఆగస్ట్‌లో ఒకే ఒక్క బియ్యపుగింజపై శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని సూక్ష్మదర్శిని సాయం లేకుండా 3 గంటల వ్యవధిలో చెక్కినందుకు నేషనల్ రికార్డ్స్ బుక్ పురస్కారం లభించింది. 2017 సెప్టెంబర్‌లో మూడు బియ్యపు గింజలపై మూడు భాషల్లో జాతీయ గీతాన్ని 10 గంటల వ్యవధిలో రాసినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 2015లో 33 రోజుల్లోనే 1,33,333 గింజలపై సాయిరాం నామావళిని రాసి ఔరా అనిపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. గిన్నిస్ సాధించాలన్న నా కల నిజమైంది. ఆనందంగా ఉంది. ఈ కళలో ఇంకా సాధించాలి, మరింత ప్రయోగాత్మకంగా ముందుకెళ్లాలని ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఏ వస్తువు చూసినా దానిని ఏదో చేయాలనే ఆలోచన వచ్చేది. ఇదే ఉత్సాహం నన్ను ఈ కళకు పరిచయం చేసింది. బియ్యపు గింజలపై బొమ్మలు చెక్కేవారు ప్రపంచం మొత్తంగా ఎవరూ లేరు. అదీ సూక్ష్మదర్శిని లేకుండా చిన్న సూది మొనతో చెక్కుతాను. అందువల్లే గిన్నిస్ సాధ్యమైంది. –కొప్పినీడి విజయమోహన్ -
గాయపడ్డ కొండ చిలువకు చికిత్స
సాక్షి, తాడేపల్లిగూడెం : వలలో చిక్కుకున్న ఓ కొండ చిలువకు పశు వైద్యాధికారి చికిత్స చేసి కాపాడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. జీలుగుమిల్లిలో శ్రీను అనే రైతు పొలానికి ఆనుకున్న ఉన్న చెరువులో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వల వేశారు. అందులో 12 అడుగుల కొండ చిలువ చిక్కడంతో వారు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. వలలో చిక్కుకున్న కొండచిలువను గుర్తించిన శ్రీను ఈ విషయాన్ని జంగారెడ్డిగూడెం స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకుడు క్రాంతికి తెలిపారు. అక్కడకు చేరుకున్న క్రాంతి గాయలుపాలైన కొండ చిలువను పట్టుకుని ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం స్థానిక పశు వైద్యశాలకు తీసుకు వెళ్లారు. కొండచిలువకు చికిత్స చేసిన పశు వైద్యులు తీవ్రంగా గాయం కావడంతో పదిరోజుల పాటు వైద్యం చేయాల్సి ఉందని తెలిపారు. అప్పటి వరకూ దాన్ని తాను సమరక్షిస్తూ, వైద్యం చేయిస్తానని క్రాంతి తెలిపారు. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణలో అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. మరో కొండచిలువ కలకలం కాగా భీమడోలు శివారు లింగంపాడు గ్రామం వద్ద పంట కాలువలో కొండచిలువ కలకలం రేపింది. 10 అడుగుల కొండచిలువ చేపల వలలో చిక్కింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
‘సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఆదుకోగలరు’
కరోనా ఆడిన వింత ‘నాటకం’లో రంగస్థలం మూగబోయింది.. కోవిడ్–19 పోషించే విలన్ పాత్రకు ఎదురునిలవలేక కళాకారులంతా చిగురుటాకుల్లా వణుకుతున్నారు.. మహమ్మారి ధాటికి నిజ జీవిత పాత్రలుసైతం అర్ధంతరంగా ముగిసిపోతున్న తరుణంలో.. ఏం చేయాలో తెలియని ‘స్టేజి’లో కొట్టుమిట్టాడుతున్నారు.. వైద్యులు.. పోలీసులు వంటివారి ‘హీరో’చిత పోరాటం నెగ్గితేనే.. కళతప్పిన జీవితాల్లోకి మళ్లీ వెలుగులొస్తాయి.. ఈ యుద్ధంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు.. శానిటైజర్లు.. సామాజిక దూరం వంటి ఆయుధాలు ధరిస్తేనే.. కరోనాను అంతమొందించి ‘విశ్వ’విజేతలవుతాం.. అంతవరకూ రంగస్థలానికి ‘విశ్రాంతి’ తప్పేలా లేదు. సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళలకు పుట్టిల్లు వంటి జిల్లాలో నేడు కళారంగం వెలవెలబోతోంది. ఉత్సవాలు లేక, పరిషత్‌లు జరగక కళాకారులు, కళాభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసిన కరోనా మహమ్మారి కళారంగాన్ని కూడా తిరోగమన బాట పట్టించింది. గతంలో సమాచార సాంకేతిక విప్లవ ప్రభావంతో కళారంగం కొంత తత్తరపాటుకు గురికాగా ప్రభుత్వాలతో పాటు కళాకారులు, కళాపోషకులు ఈ రంగాన్ని పూర్వ వైభవం వైపు నడిపే దిశగా చర్యలు తీసుకున్నారు. దీనితో ఇప్పుడిప్పుడే నేటి యువతలో కళారంగంపై మక్కువ పెరగడం, కొంతమంది యువకులు సైతం రంగం వైపు ఆకర్షితులు కావడంతో ఈ రంగానికి పూర్వ వైభవం వస్తోంది అనుకునే లోపు మరో పెద్ద కుదుపు కరోనా రూపంలో రావడం దురదృష్టకరమని కళాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన పరిషత్‌లు, పోటీలు కళలపై సమాజ దృక్ఫథాన్ని మార్చే క్రమంలో వివిధ సంస్థలు కళారంగాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాయి. దీని కోసం పరిషత్‌లు, పోటీలు ఏర్పాటు చేసి ఈ రంగాన్ని సజీవంగా నిలపడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. దీనితో కళాకారులకు కూడా ఆదరాభిమానాలు దండిగానే అందేవి. జిల్లాలో ఏటా పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు ఏకపాత్రాభినయ పోటీలు ఎక్కడో ఒక చోట జరుగుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణం చందంగా ఉండేది. జిల్లాలోని ఏలూరులో హేలాపురి కల్చరల్ అసోసియేషన్, గరికపాటి ఆర్ట్స్ కళా పరిషత్, వైఎంహెచ్ఏ హాలు పరిషత్, భీమవరంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటిక పరిషత్, కళారంజని నాటక పరిషత్, పాలకొల్లులో పాలకొల్లు కళా పరిషత్, వీరవాసరం కళా పరిషత్, తోలేరు సుబ్రహ్మణ్య కళా పరిషత్, రాయకుదురు శ్రీ కృష్ణదేవరాయ నాటక కళా పరిషత్, కొంతేరు యూత్‌క్లబ్ కళా పరిషత్, తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాపరిషత్ తదితర సంస్థలు పోటీలు నిర్వహిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అలాగే నృత్య రంగానికి సంబంధించి ఏలూరు నగరంలోని అభినయ నృత్య భారతి వంటి సంస్థలు వివిధ శాస్త్రీయ నృత్య రీతుల్లో పోటీలు నిర్వహిస్తూ నృత్య రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు నిర్వహించే పోటీలు కరోనా కాలంలో రద్దు కాగా మరికొన్ని నిర్వహించే అవకాశం ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాయి. దీనితో పాటు గతంలో శ్రీరామనవమి, ఉగాది వేడుకలు నిస్సారంగా జరిగిపోగా త్వరలో వచ్చే వినాయక చవితి, దసరా ఉత్సవాల్లోనైనా అవకాశాలు అందివస్తాయని భావించిన కళాకారులకు కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా ఉత్సవాలను కూడా రద్దు చేసే అవకాశం ఉండడంతో ఉత్సవ కమిటీలు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ విధంగా ఆయా ఉత్సవాలు కూడా వారిని నిరుత్సాహానికి గురిచేశాయి. కళారంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు జిల్లాలో కళారంగంపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, హరికథలు, బుర్ర కథలు వంటి కళలు ప్రదర్శించే కళాకారులతో పాటు వాటికి అనుబంధంగా మేకప్, సంగీతం, రంగాలంకరణ, సౌండ్ సిస్టమ్, మైక్ అండ్ లైటింగ్, దుస్తులు అద్దెకిచ్చే వారు ఇలా అనేక వర్గాలు ఉపాధి పొందుతున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా కళారంగానికి అనుబంధంగా ఉపాధి పొందుతున్న అన్ని కుటుంబాలూ పూర్తిగా తమ ఆదాయ వనరులను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయాయి. పింఛన్ల మంజూరుతో కొద్దిగా ఊరట ఇదిలా ఉండగా ఐదు నెలలుగా పింఛన్లు లేక గోరుచుట్టపై రోకలిపోటు చందంగా ఇబ్బంది పడుతున్న వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఒకే సారి ఐదు నెలల బకాయి పింఛన్లు విడుదల చేయడంతో కొంత ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ఇది కేవలం వృద్ధ కళాకారులకు మాత్రమే రావడంతో 60 ఏళ్లలోపు వయసు కలిగిన కళాకారులు మాత్రం ఇప్పటికీ ఆకలిదప్పులతో అలమటిస్తూనే ఉన్నారు. సకల కళాకారుల సంఘం, మరికొన్ని కళా సంస్థలు, కొంతమంది దాతలు కళాకారులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు వంటివి పంపిణీ చేసినా అది తాత్కాలిక ఊరటగానే చెప్పుకోవాలి. కరోనా విలయ తాండవం నేపథ్యంలో కళాకారులను ఆదుకోవడానికి మరింత మంది కళాపోషకులు ముందుకు వస్తారనే ఆశతో కళాకారులు ఎదురు చూస్తున్నారు. ఆదాయం ఉన్నా లేకపోయినా ఆత్మగౌరవంతో జీవిస్తున్న వారి కుటుంబాలు పస్తులుంటున్న నేపథ్యంలో అభిమానాన్ని చంపుకుని కూలి పనులకు వెళ్లేందుకూ కొంతమంది కళాకారులు వెనుకడుగు వేయడం లేదు. అయితే వారికి పని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ దుర్బర పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారిని పలువురు దాతలు ఆదుకుంటున్నట్లుగానే కళాకారులను, కళారంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవాలని కొన్ని కళా సంస్థలు పిలుపునిచ్చాయి. దానిపై దాతలు స్పందించాల్సి ఉంది. సీఎం జగన్ మాత్రమే ఆదుకోగలరు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 లక్షల కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కేవలం కళను నమ్ముకునే జీవిస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు ఏడాది చివరి వరకూ ప్రదర్శనలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే మా కళాకారుల కుటుంబాలను ఆదుకోగలరు. –విజయ కుమార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రధారి కరోనా వైరస్ కళాకారులకు మైనస్ కరోనా వైరస్ కళాకారులను మైనస్‌లో పడేసింది. 55 ఏళ్ల వయసు కలిగిన నేను చిన్నప్పటి నుంచి రంగస్థలాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. తొలుత భజనలు, అనంతరం నాటకాల్లో పాత్రలు, సంగీతం, హార్మోనియం వంటి కళలు నేర్చుకుని బుర్రకథ కళాకారుడుగా స్థిరపడ్డాను. 45 ఏళ్లకు పైగా కళారంగంలో ఉంటున్న నేను ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. –యడవల్లి సుబ్బరాజు, బుర్రకథ కళాకారుడు ఆస్తులు లేవు, ఇతర పనులు చేతకాదు నా వయస్సు 46 సంవత్సరాలు. గత 30 ఏళ్లుగా హార్మోనిస్టుగా నాటక రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. పెద్దలు సంపాదించిన ఆస్తులు లేవు. వేరే ఏ పనీ చేతకాదు. ప్రదర్శనలు లేక ఆదాయం పోయింది. పెన్షన్‌కు సరిపడే వయసూ రాలేదు. అన్ని రంగాలనూ ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ కళాకారులకు కూడా ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలి. –యడవల్లి రమణ, హార్మోనిస్టు -
తల్లికి పిండం పెడుతూ.. కుప్పకూలిన కొడుకు
సాక్షి, ఇరగవరం: తల్లికి పిండం పెడుతూ కుమారుడు కరోనాతో మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో శనివారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై జానా సతీష్ తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ తల్లి 11 రోజుల క్రితం మృతి చెందింది. శనివారం వారి బంధువులు, కుమారుడు తల్లికి పిండం కార్యక్రమం ఉంది. అందులో భాగంగా పిండం పెడుతూనే శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెండాడు. వెంటనే బంధువులు వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహానికి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రామస్తులు ఎవ్వరూ మృతదేహాన్ని దహనం చేయడానికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు నలుగురు గ్లౌజ్‌లు ధరించి మాస్కులు పెట్టుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
తాడేపల్లిగూడెంలో దారుణం
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడలు కూల్చివేసిన దుండగులు.. బంగారం, నగదు, విలువైన పత్రాలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం పాత ప్రభుత్వ ఆస్పత్రి సందులోని ఓ ఇంట్లో విజయలక్ష్మి అనే మహిళ అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఆ ఇంటిపై దుండగులు జేసీబీతో దాడి చేశారు. బిల్డింగ్ ప్రహరీ, ఇంటి లోపలి గోడలు కూల్చివేసిన దుండగలు.. విజయలక్ష్మిని చీరతో కట్టి నిర్బంధించారు. ఇంట్లోని మోటార్, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేశారు. ఇంట్లోని బంగారం, నగదుతోపాటు విలువైన పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై విజయలక్ష్మి తన కూతురు సురేఖతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మేము 25 ఏళ్లకు పైగా ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ప్రకాశ్, అవినాశ్‌ల అనుచరులు గురువారం తమ ఇంటిని కూల్చేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ప్రకాశ్, అవినాశ్‌లు మళ్లీ వారి అనుచరులను మా ఇంటిపై దాడికి పంపారు. సుమారు నలభై మంది జేసీబీ, కత్తులు, గునపాలు, రాడ్లతో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డార’ని తెలిపారు. అలాగే తాము నివాసం ఉంటున్న ఇంటిని బలవంతంగా అక్రమించుకునే ఉద్దేశంతోనే వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
బీరాలు వీడి బేరాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోస్టల్ బ్యాలెట్ అధికార పార్టీలో ప్రకంపనలు రేపింది. ఉద్యోగులకు ఓటుకు రెండు వేల రూపాయల వరకూ ఆశ చూపినా వారు తోసిరాజని వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓట్లు వేయడం అధికారపార్టీని కలవరపెడుతోంది. జిల్లాలో పోలైన ఓట్లలో 70 నుంచి 80 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీకి పడ్డాయని అంచనా. పోస్టల్ బ్యాలెట్లో ట్రెండ్ చూసిన తర్వాత డబ్బుతోనైనా గెలవాలనే అభిప్రాయానికి పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వచ్చేశారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా ఓట్ల కొనుగోలుకు సిద్ధ పడుతున్నారు. ఒక్క ఓటు ఉన్నా వారిని వెతికిపట్టుకుని ప్రలోభ పెట్టే పనిలో పడిపోయారు. డబ్బుతో కొనడం.. వినకపోతే బెదిరింపులకు దిగడం వారి వ్యూహంగా మారింది. కొన్నిచోట్ల అధికారులు, ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు మద్దతు పలుకుతుండటంతో వారి అండతో గెలుపొందాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ వారి వాహనాలను చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు చేయడం లేదు. మరోవైపు గత నెల 24న సమావేశం పేరుతో చెక్‌పోస్టులలో తనిఖీ చేసే సిబ్బందిని నియోజకవర్గ కేంద్రాలకు రప్పించి ఆ సమయంలో డబ్బులు అన్ని ప్రాంతాలకు చేరేలా తెలుగుదేశం నాయకులకు సహకరించినట్లు సమాచారం. అదే విధంగా మద్యం తరలించేందుకు కూడా పోలీసు అధికారులు సాయం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఒక కీలక విభాగం అధికారి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఎక్కడైనా తెలుగుదేశం నాయకులు డబ్బులు పంచుతూ పట్టుబడినా వారిపై కేసులు లేకుండా పంపించేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అధికారిపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు అక్రమ సంపాదనతో కూడబెట్టిన డబ్బులతో పాటు తెలుగుదేశం అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుండటంతో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు అయినా ఖర్చు చేసేందుకు తెలుగుదేశం అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇంటిలోని అన్ని ఓట్లకు ఇంత మొత్తం అంటూ బేరాలకు దిగుతున్నారు. కాదు కూడదు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రూపులు వారీ డ్వాక్రా మహిళల అకౌంట్లకు నగదును బదిలీ చేస్తున్నారు. సమావేశాలు పెట్టి మరీ మహిళలకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. మొత్తంగా ఓట్లు పొందేందుకు అధికార పార్టీ నేతలు అన్ని రకాల ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇంటింటి ప్రచారం కన్నా... అధికార పార్టీ నేతలు ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికార యంత్రాంగం అండతో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాల రాజకీయం మితిమీరింది. గ్రామాల్లో డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ, ఆశావర్కర్లను టార్గెట్ చేశారు. నగదు అందచేసి వారి ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగా డ్వాక్రా మహిళల అకౌంట్ల నంబర్లు తీసుకుని టీడీపీ నాయకులు గ్రూపుకు రూ.10 వేల చొప్పున పలు అకౌంట్లకు జమ చేశారు. పలు మండలాల్లో మహిళలకు మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన వారికి వెయ్యి రూపాయల నగదు అందచేశారు. ప్రధానంగా మహిళల ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇవికాక మత్స్యకార గ్రామాలు, కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లను అడ్డుపెట్టుకుని గ్రామంలోని మొత్తం ఓట్లు మాకే వేయాలంటూ పైరవీలు చేస్తున్నారు. ఆయా కుల పెద్దలకు ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామ కాపులతో బేరం పెడుతున్నారు. మత్స్యకార గ్రామాలను కొంటున్న పరిస్థితులు దెందులూరు, నర్సాపురం నియోజకవర్గాల్లో ఉన్నాయి. నిడదవోలులో తెలుగుదేశం అభ్యర్థ్ధి శేషారావు ఆయా సంఘాల ప్రతినిధులను కలిసి వారికి ఒక్కొక్కరికి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకూ ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఎవరైనా పది ఓట్లు వేయించగలరని తెలిస్తే వారి ఇంటివద్ద వాలిపోతున్నారు. వారికి ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు డబ్బులు ఎరచూపి వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా భీమవరంలో జనసేన కూడా డబ్బులు వెదజల్లి గెలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. భీమవరంలో పోస్టల్ బ్యాలెట్‌కు రెండు వేల రూపాయల వరకూ జనసేన నాయకులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తెలుగుదేశం నాయకులు బహిరంగంగా నగదు పంపిణీ చేస్తున్నా పట్టించుకోని అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని కూడా కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు. -
చింతమనేని వీడియో షేర్.. మరో కార్యకర్త అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా: దళితులను తీవ్రంగా అవమానించిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీడియో షేర్ చేసినందుకు గానూ మరో వైఎస్సార్సీపీ కార్యకర్త కామిరెడ్డి నానిని పశ్చిమ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త నానిని బలవంతంగా అరెస్ట్ చేసి ఏలూరు త్రీటౌన్కి పోలీసులు తరలించారు. నిన్న రాత్రే కామిరెడ్డి నానికి వివాహం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నాం దెందులూరు మండలం శ్రీరామవరంలోని సొంత ఇంటిలో రిసెప్షన్ జరిగింది. వివాహ రిసెప్షన్ ముగిసిన తర్వాత పోలీసులు నానిని అరెస్ట్ చేశారు. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవక ముందే నానిని అరెస్ట్ చేయడంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులను దూషించిన చింతమనేనిపై మాత్రం ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దళితులపై దూషణ పర్వానికి దిగిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గత నాలుగు రోజులుగా దళిత సంఘాలు ఆందోళనలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలి వీడియో షేర్ చేశారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చింతమనేని కేసును తప్పు దోవ పట్టించేలా పశ్చిమ పోలీసుల చర్యలు ఉన్నాయని, కామిరెడ్డి నాని అక్రమ అరెస్ట్‌ను దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ తీవ్రంగా ఖండించారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు: నాని తండ్రి తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చింతమనేని వీడియో షేరింగ్ కేసులో అరెస్టయిన కామిరెడ్డి నాని తండ్రి వాపోయారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చాలా సేపటి నుంచి ఉన్నా.. మమ్మల్ని పోలీస్‌స్టేషన్ లోపలికి రానివ్వడం లేదన్నారు. దళితులను తిట్టిన చింతమనేనిని వదిలేసి నా కుమారుడిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వీడియోని నా కుమారుడు అసలు షేర్ చేయలేదని, కేవలం వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతోనే అరెస్ట్ చేశారని చెప్పారు. -
దెయ్యం భయం.. ఊరు ఖాళీ!
సాక్షి, వేలేరుపాడు: ఆ ఊరి పొలిమేరల్లో ఓ పెద్ద బండరాయి.. దాని కింద ఓ సొరంగం.. అందులో ఉడుము రూపంలో ఎర్రమారి దెయ్యం.. నిత్యం బయట సంచరిస్తుంది.. కాలక్రమేణా ఆ సొరంగం మట్టితో పూడుకుపోయింది. ఇంకేం.. ఆ దెయ్యానికి కోపం వచ్చింది.. గ్రామస్తులను బలితీసుకోవడం మొదలుపెట్టింది.. అందుకే ఆ గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నా ఇంకా ఇటువంటి మూఢాచారాలు జన జీవనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయనడానికి పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో మారుమూల గిరిజన గ్రామమైన కొర్రాజులగూడెం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇళ్లను సైతం పడగొట్టారు గ్రామంలో మొత్తం 40 గిరిజన కుటుంబాలుండేవి. పెంకుటిళ్ల కాలనీలతో పాటు, మూడు మంచినీటి బోర్లు, లక్షలాది రూపాయలు వెచ్చించి రహదారి కూడా నిర్మించారు. తొమ్మిదేళ్ల కిందట పక్కా పాఠశాల భవనాన్ని కూడా నిర్మించారు. గతేడాది మరో అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న ఓ పెద్ద బండరాయి కింద ఉన్న సొరంగం రెండున్నరేళ్ల కిందట మట్టితో పూడిపోయింది. అదే ఏడాది గ్రామంలో వివిధ వ్యాధులతో కారం లక్ష్మయ్య, పరిశక లక్ష్మయ్య, బందం తమ్మయ్య, మిడియం రాములు మృతి చెందారు. మళ్లీ ఆరు నెలలకు మడివి చిన్నయ్య, కారం చిన్నక్క, సోడే రాజమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. ఇంకేముంది దీనికి ఎర్రమారి దెయ్యం ఆగ్రహమే కారణమని భయపడిన గ్రామస్తులు ఊరుని ఖాళీచేసి వెళ్లిపోయారు. గ్రామంలోని 30 పెంకుటిళ్లను సైతం పడగొట్టి.. కిలోమీటర్ దూరంలోని తారురోడ్డు ప్రాంతంలో పూరిగుడిసెలు నిర్మించుకున్నారు. అందుకే బలితీసుకుంటోంది.. ‘మా గ్రామంలో దెయ్యం ఉన్న సొరంగం మట్టితో పూడిపోవడంతో అది ఆగ్రహించి మా ఊరివాళ్లను బలితీసుకుంది’ అని ఆ గ్రామ పెద్దకాపులు తెల్లం సాయిబు, సోడే ముత్యాలు, కారం గంగులు ‘సాక్షి’తో చెప్పారు. అందువల్లనే ఊరు ఖాళీ చేశామని, ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందన్నారు. గతంలో ఊరు అక్కడున్నప్పుడు 46 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవారు. గ్రామస్తులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతానికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ఈ పాఠశాలకు విద్యార్థులు వెళ్లకపోవడంతో ప్రభుత్వం మూసేసింది. దీంతో కొర్రాజులగూడేనికి చెందిన 18 మంది విద్యార్థులు కాలినడకన కిలోమీటరు దూరంలో ఉన్న చాగరపల్లి పాఠశాలకు వెళ్తున్నారు. బతుకుజీవుడా అంటూ బయటపడ్డాం.. ఆ దెయ్యం వల్ల మా వాళ్లను కోల్పోయాం. ఇంకా అక్కడే ఉంటే మమ్మలికూడా ఆ అది మింగేసేదే. అందుకే బతకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాం. వేరే చోట కొత్త ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. – కణితి శ్రీరాములు కొర్రాజులగుడెం గ్రామస్తుడు నన్నూ భయపెట్టారు.. ఈ పాఠశాలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయడానికి ఇక్కడకొచ్చాను. ‘మీరు పాఠశాలకు ఎలా వెళుతున్నారు.. అక్కడ దెయ్యం ఉంది’ అంటూ నన్ను భయపెట్టారు. మొదట్లో కొంత భయపడ్డాను. తర్వాత నెమ్మదిగా భయం వీడి పాఠశాలకెళ్లాను. తర్వాత పాఠశాలను ప్రభుత్వమే మూసేసింది. ఇక్కడి విద్యార్థులను కిలోమీటరు దూరంలోని చాగరపల్లి పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం చాగరపల్లి పాఠశాలలో పర్మినెంట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. కొర్రాజులగూడెం విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. – గుజ్జా శిరీష, అకడమిక్ ఇన్స్ట్రక్టర్ -
నారా లోకేశ్‌కు నిరసన సెగ
సాక్షి, నరసాపురం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో బుధవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై ఖాళీ బిందెలను ఉంచి నిరసన తెలిపారు. సుమారు 200 కుటుంబాలకు పైగా నివసిస్తున్న తమ కాలనీలో తాగునీటి సదుపాయం లేదని మంత్రి వద్ద ధ్వజమెత్తారు. పూర్తిగా ఉప్పునీటి మయమైన తమ ప్రాంతానికి పక్క గ్రామమైన వేములదీవి నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అవుతున్నప్పటికీ.. అవి కూడా తరచూ పైపులైన్లు పాడై నీరు ఉప్పగా ఉంటుందని చెప్పారు. అదికూడా రెండు రోజులకోసారి కేవలం అరగంట పాటు మాత్రమే ఇస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలు తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. అనంతరం కాన్వాయ్ ముందుకు సాగింది. -
తండ్రి మీదకి కుక్కను ఉసిగొల్పుతూ..
సాక్షి, యలమంచిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉన్నమట్ల లక్ష్మణదాసు. పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసు భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పెళ్లి చేసుకోలేదు. చిన్న కుమారుడు చిరంజీవికి, కూతురు సౌమ్యలకు పెళ్లి అయ్యింది. లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన ఐదు సెంట్ల ఇంటి స్థలం ఉంది. అది కాకుండా మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ మధ్య చిన్న కుమారుడు చిరంజీవి, అతని భార్య రజని ఆస్తి తమ పేరిట రాయమని ఇబ్బంది పెడుతున్నారు. అతని స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల ఫలసాయం కూడా తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా కుక్కను తీసుకువచ్చి లక్ష్మణదాసుపై ఉసిగొల్పుతూ భయపెడుతున్నారు. దీనిపై స్థానిక సంఘ పెద్దలకు చెపితే వారి మాట కూడా వినకుండా సంఘ పెద్దలను దుర్భాషలాడి చెదరగొట్టారు. దీంతో స్థానిక సర్పంచ్ కలుగజేసుకుని ఆస్తి రాయమని సలహా ఇచ్చారు. సరే కదాని ఇరువురు కుమారులకు చెరొక 5 సెంట్ల స్థలం ఇవ్వడానికి సిద్ధపడగా అలా కుదరదు నాకు ఏడున్నర సెంట్లు రాయాలని చిన్న కొడుకు, కోడలు ఎదురుతిరగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంటిలో ఉంటుంటే సూటి పోటు మాటలతో ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని లక్ష్మణదాసు తహసీల్దార్ వి. స్వామినాయుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. -
నిలిచిన కొబ్బరి వర్తకం
సాక్షి, పాలకొల్లు అర్బన్(పశ్చిమగోదావరి జిల్లా): కొబ్బరి వర్తకులు ఈ పర్మిట్ తో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని జీఓ జారీ చేయడంతో జూలై 1 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి వర్తకం పూర్తిగా స్తంభించిపోయింది. రోజు వారీ జరిగే సుమారు రూ.3 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగా 30 వేల కుటుంబాలకు ఉపాధి కరువయ్యింది. ఎగుమతి, దిగుమతి, ఒలుపు, దింపు కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ పర్మిట్ అంటే.. ప్రతి వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ప్రతి 15 రోజులకో, లేదా నెలాఖరుకో వ్యాపార లావాదేవీలను బట్టి వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పన్ను చెల్లించేవారు. అయితే గత నెల జూన్ 1 నుంచి ఈ పర్మిట్ ద్వారా పన్ను చెల్లించాలని జీఓ జారీ చేశారు. దీంతో వర్తకులు ఆందోళనకు దిగడంతో కొంత వెసులుబాటు కల్పించారు. అయితే అదే జీఓను ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించుకోవడంతో కొబ్బరి వర్తకులు జూలై 1 నుంచి వ్యాపార లావాదేవీలు నిలిపి వేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఈ పర్మిట్ విధానం ప్రకారం వర్తకుడు రైతు నుంచి కొనుగోలు చేసిన కొబ్బరికాయలకు ఏ రోజు పన్నును ఆ రోజే ఈ పర్మిట్ విధానంలో చెల్లించాలి. ఇది వర్తకులకు సాధ్యం కాదంటున్నారు. గుమస్తాలకు ఆన్లైన్లో పన్ను చెల్లించడం వీలు కాదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరి కాయలను ఎగుమతి చేసుకునే సరికి అర్థరాత్రి అవుతుంది. ఆ సమయంలో నెట్ సౌకర్యం అందుబాటులో ఉండదంటున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సిగ్నల్స్ కూడా సరిగా పని చేయవంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్లో పన్నులు ఏవిధంగా చెల్లిస్తామని కొబ్బరి వర్తకులు ప్రశ్నిస్తున్నారు. ధర పడిపోతుందని ఆందోళన కొబ్బరి వర్తకులు సమ్మె కారణంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి నిలిచిపోవడంతో కేరళ రాష్ట్రం నుంచి ఎగుమతులు ఊపందుకుంటాయి. దీంతో సమ్మె విరమించినా కొబ్బరి ధర పడిపోతుందని రైతులు, వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 కోట్ల కొబ్బరి కాయలు ఎగుమతి ఉభయ గోదావరి జిల్లా నుంచి ప్రతి రోజు సుమారు 40 కోట్ల కొబ్బరి కాయలు మహారాష్ట్ర, ముంబై, పుణే, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీని ద్వారా రోజువారీ రూ.3 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 200 మంది కొబ్బరి వర్తకులున్నారు. రోజుకు 100 లారీల కొబ్బరి కాయలు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. లారీకి మూడు నుంచి 5 లక్షలు కొబ్బరి కాయలు ఎగుమతి చేస్తే సుమారు 40 కోట్లు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉపాధి కరువైన ఒలుపు, దింపు కార్మికులు కొబ్బరి వర్తకం ప్రధానంగా ఒలుపు, దింపు, హమాలీలు (ఎగుమతి కూలీలు), గుమస్తాలపై ఆధారపడుతుంది. ప్రస్తుతం గత వారం రోజుల నుంచి వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 30వేల మంది కుటుంబాలకు ఉపాధి కరువైంది. దీంతో గత వారం రోజుల నుంచి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఏ రోజు కారోజు పని చేసుకుని ఉపాధి పొందే కూలీలకు పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఉపాధి లేక ఇబ్బందులు ప్రభుత్వం వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలి. ఈ పర్మిట్ వల్ల ఇబ్బందులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ చెల్లింపులు కష్టం. అంతే కాకుండా గుమస్తాలకు అవగాహన తక్కువ. దాదాపు 30 ఏళ్ల నుంచి ఒక షాపులో గుమస్తాగా పనిచేస్తున్నా. కొబ్బరి కాయ నాణ్యతను పరిశీలించి రైతుల నుంచి కొనుగోలు చేస్తాం. – కాపిశెట్టి కృష్ణ, గుమస్తా గుదిబండగా మారింది ఒలుపు, దింపు కార్మికులకు ఉపాధి కరువైంది. ఏ రోజు కారోజు పనిచేసుకుని ఉపాధి పొందే ఒలుపు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ గుదిబండగా మారింది. కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకుని ప్రభుత్వం ఆ జీఓను వెనక్కి తీసుకోవాలి. – దూలం భాస్కరరావు, ఒలుపు కార్మికుడు -
‘వైఎస్ జగన్‌కు పట్టం కట్టడం ఖాయం’
సాక్షి, చింతలపూడి : ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టడం ఖాయమని చింతలపూడి నియోజక వర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వీఆర్ ఎలీజా అన్నారు. చింతలపూడిలో బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో 30 సంవత్సరాల పాటు ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సొంత రాష్ట్రానికి వచ్చానని పేర్కొన్నారు. ఇకపై చింతలపూడి నియోజక వర్గ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నానన్నారు. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించి ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇద్దామని ఎలీజా పిలుపునిచ్చారు. వైవీ సుబ్బారెడ్డి అభినందనీయులు.. ప్రత్యేక హోదా పోరులో భాగంగా ఇంకా ఏడాదికి పైగా సమయమున్నా ఎంపీ పదవిని తృణప్రాయంగా వదులుకున్న వైవీ సుబ్బారెడ్డి అభినందనీయులని ఎలీజా కొనియాడారు. వైఎస్సార్ సీపీ ఎంపీల పోరాటానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతుగా ఉండటం హర్షణీయమన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు రైతాంగానికి వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. -
బీసీలకు తోడుగా ఉంటా
ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఈ నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు కేటాయించి ఉండాలి. తీరా చూస్తే 2014–15లో కేవలం రూ.2,242 కోట్లు, 2015–16లో రూ.2,573 కోట్లు, 2016–17లో రూ.4,500 కోట్లు, 2017–18లో రూ.4,700 కోట్లు కేటాయించారు. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ.13,700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇచ్చిన హామీలో 20 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేసి బీసీలపై ప్రేమ ఉందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబును నమ్మి మోసపోయిన బీసీలకు తాను అండగా ఉంటానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలతో పేదలందరికీ మేలు జరిగేలా చూస్తానని, చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని కులాలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ సీటును తాము బీసీలకే ఇస్తామని ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 185వ రోజు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మల్లవరం గ్రామంలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబుకు బీసీలపై నిజమైన ప్రేమ లేదని, వారిని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలనే ఆలోచిస్తారని విమర్శించారు. బాబు దృష్టిలో బీసీల అభివృద్ధి అంటే నాలుగు కత్తెర్లు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమేనని ఎద్దేవా చేశారు. నిజంగా పేదవాడికి మేలు జరుగుతుందా లేదా అనేది ఆలోచించకుండా రాజకీయంగా ఏది లాభం అనేలా పరిస్థితిని దిగజార్చారని మండిపడ్డారు. ఈ సమ్మేళనంలో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. బీసీలకు చెందాల్సిన కుప్పంను బాబు ఆక్రమించాడు.. చంద్రబాబు గురించి ఇప్పటి తరం వారికి తెలీదు. అందుకే ఆయన గురించి చెబుతున్నా. ఆయన సొంత గ్రామం నారావారి పల్లె చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 1978లో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2,494 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చంద్రబాబుకు మా నాన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. నాన్నగారి సహకారంతో కాంగ్రెస్‌లో చంద్రబాబు మంత్రి కూడా అయ్యారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1983లో మంత్రి హోదాలో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 17,429 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయాడు. సాధారణంగా మంత్రి పదవిలో ఉండే వ్యక్తి ఓడిపోవడం జరగదు. అలా ఓడిపోయాడంటే అంతకంటే దౌర్భగ్యం మరొకటి ఉండదు (సభికుల నుంచి కేరింతలు, అరుపులు, కేకలు). 1978 తర్వాత చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీ రామారావు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 1983 ఎన్నికల్లో ఓడిపోయాక తన అల్లుడే కదా అని ఆ పెద్దాయన ఎన్టీఆర్ చంద్రబాబును క్షమించి దగ్గరకు తీశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు దగ్గరకు తీశానా అని ఎన్టీఆర్ బాధపడేలా చేశారు. టీడీపీలో చేరాక 1985 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయలేదు. 1989 ఎన్నికల్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని భయపడి, బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పట్లో కుప్పంలో కూడా ఆయన కుంటుతూ కుంటుతూ 5 వేల మెజార్టీతో గెలిచాడు. ఇది ఆయన ఘనత. ఎంతసేపు బీసీలను ఎలా వాడుకోవాలనేదే తప్ప.. వారిపై ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదు. బీసీలు జడ్జీలు కాకుండా అడ్డుకున్నారు.. బీసీలు జడ్జీలు కాకుండా చంద్రబాబు ఎలా అడ్డుకున్నారో ఇటీవల హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య గౌడ్ బయటపెట్టారు. కొందరు బీసీ అభ్యర్థులను న్యాయమూర్తులుగా నియమించవద్దని చంద్రబాబు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖను (చేత్తో పట్టుకుని చూపిస్తూ) సాక్షి తప్ప, మరో పత్రికగాని, చానల్ గాని కవర్ చేయలేదు. చంద్రబాబు అంత గొప్పగా మీడియాను మేనేజ్ చేశారు. అమర్నాథ్గౌడ్ అనే న్యాయవాదిని జడ్జిగా నియమించవద్దని అడ్డుకుంటూ చంద్రబాబు ఈ లేఖ రాశారు. అమర్నాథ్గౌడ్కు మేథోపరమైన ప్రతిభ లేదని, వృత్తిపరమైన, వ్యక్తిగతమైన నిబద్ధత, వ్యక్తిత్వం లేదని అడ్డుచెప్పారు. అందుకే ఆయన్ను న్యాయమూర్తిగా నియమించడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇవన్నీ ఉన్నట్టు ఇంకొకరిపై బురదజల్లారు. దీన్ని బట్టి చంద్రబాబుకు బీసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 110 ఎన్నికల వాగ్దానాలు చేసి, అమలు చేయలేదు. చైతన్య, నారాయణ కార్పొరేట్ సూళ్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను ఎడాపెడా మూసేశారు. ఇప్పటికే 600కుపైగా బీసీ హాస్టళ్లను మూసేశారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విషయంలో చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది. కొన్ని నిర్ణయాలు తన స్థాయిలో లేవని తెలిసి కూడా చంద్రబాబు బీసీల ఓట్ల కోసం కుతంత్రాలు చేశారు. రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. కురువ, కురుబ కులాలను ఎస్టీలుగా గుర్తిస్తానని, వాల్మీకి, బోయలను ఎïస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చాడు. మత్స్యకారులను కూడా ఎస్టీలుగా గుర్తిస్తానని అన్నాడు. ఏ కులాన్ని అయినా ఎస్సీలు, ఎస్టీలుగా గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని తెలిసి కూడా బాబు వీరిని మోసం చేశారు. ఇవాళ ఏమంటున్నారంటే తాను చేయాల్సిన పని అయిపోయిందని, కేంద్రమే చేయడం లేదంటూ బురద జల్లుతున్నాడు. తాను చేయగలిగే పరిస్థితి లేనప్పుడు ఓట్ల కోసం చంద్రబాబు ఎందుకు అబద్ధాలు చెప్పాలి? నాన్నగారు గుర్తొస్తారని.. నిరుపేదలు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ వంటి ఉన్నత చదువులు చదువుకోవాలని దేశంలో మరెక్కడాలేని విధంగా విప్లవాత్మకంగా నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఈ పథకం అమలు జరిగితే నాన్నగారు ఎక్కడ ప్రజలకు, విద్యార్థులకు గుర్తొస్తారోనని చంద్రబాబు దారుణంగా నిర్వీర్యం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. ఇవాళ చంద్రబాబు.. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చాడు. కానీ ఆ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం ఇవ్వకుండా పేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏటా ఇంజనీరింగ్ విద్యకు లక్ష రూపాయల ఫీజు ఉంటే ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్టు రూ.30 వేలు, రూ.35 వేలు ఇస్తోంది. రెండేళ్లుగా అది కూడా సరిగ్గా రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. నవరత్నాలతో బీసీలకు మేలు మా నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు వీలుగా నవరత్నాలను తీసుకొచ్చాను. మీ పిల్లలు ఎంత పెద్ద చదువులు చదవాలనుకున్నా చదివించే బాధ్యత నాది. ఎంత ఖర్చు అయినా భరిస్తాం. ప్రతి విద్యార్థికి మెస్ చార్జీల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం. మీ చిట్టి తల్లులు, మీ చిట్టి పిల్లలను బడికి పంపిన ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను. అవ్వా తాతలకు పెన్షన్ పెంచడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదు కానీ, కమీషన్ల కోసం కాట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచుతాడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవ్వాతాతల పింఛన్‌ను రూ.2 వేలు చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద అక్కలకు రూ.2 వేల పింఛన్ ఇస్తాను. పింఛన్ వయసును 45 ఏళ్లకే తగ్గిస్తాను’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, నేతలు కారుమూరి నాగేశ్వరరావు, మేకా శేషుబాబు, కొయ్యే మోషేన్‌రాజు, కవురు శ్రీనివాస్, పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ తానేటి వనిత పాల్గొన్నారు. బాబు పాలనలో బతకలేకపోతున్నామన్నా.. కంకటాల శ్రీనివాసరావు: శెట్టిబలిజ కులానికి చెందిన మేము తాడిచెట్లు గీతగీచి కల్లు అమ్ముకునేవాళ్లమన్నా. చంద్రబాబు వచ్చాక ఇంటింటికి మద్యం బెల్ట్‌షాపు పాయింట్ ఇచ్చి మా వృత్తి దెబ్బతీసి జీవనాధారం లేకుండా చేశాడు. ఈ పాలనలో మేము బతకడమే కష్టమైంది. ఇల్లు, మరుగుదొడ్డి, పింఛన్ కూడా ఇవ్వడంలేదు. పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం. కరెంటు బిల్లు కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. జగన్: మీ అందరికీ ఒక విషయం చెబుతున్నా. రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకే ఇవ్వబోతున్నాం. ఇక్కడి నుంచే బీసీలకు ప్రాధాన్యత మొదలవుతుందని చెబుతున్నా. కర్నాటి కన్నయ్య: సగర ఫెడరేషన్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. అది అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వద్ద నాకించినట్టు ఉంది. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ సగర కార్పొరేషన్ చేస్తే దాదాపు 35 లక్షల మందికి మేలు జరుగుతుంది. సగర, ఉప్పర కులాన్ని బీసీ–డి నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని టీడీపీ మెనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేదు. మీరు సీఎం అవ్వగానే మాకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. జగన్: నేరుగా చట్టసభల్లోకి పంపించలేకపోయిన కులాల వారికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇస్తున్నా. గోపీ యాదవ్ : మా బావ గారికి రెండు కిడ్నీలు పాడైపోయాయి. రాజశేఖరరెడ్డి గారి దయ వల్ల ఆయన బతికాడు. ఇప్పుడు డయాలసిస్ చేయించాలంటే చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే పరిస్థితిలేదు. జగన్: ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా మార్పు చేస్తాం. రూ.1000 వెయ్యి ఖర్చు దాటిన వైద్యాన్ని పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం. శ్రీనివాసరావు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తూర్పుకాపులు కరువు పరిస్థితుల్లో వందేళ్ల క్రితం ఏపీ, తెలంగాణలకు వలస వచ్చారు. ఆ మూడు జిల్లాల్లో కాకుండా మిగిలిన చోట బీసీలుగా గుర్తింపునకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నాం. వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని ఈ రోజు ఏలూరులోనే పది మంది తూర్పు కాపుల పిల్లల డాక్టర్లుగా చదువుకుంటున్నారు. అందుకే ఏలూరు తూర్పుకాపు సంఘం భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫొటో పెట్టుకున్నాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మా కులానికి చెందిన మంత్రి కళా వెంకట్రావుకు చెబితే మా సమస్య పరిష్కరించకపోగా ఆ మూడు జిల్లాకు వెళ్లి ఓబీసీ సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు కదా? అని సలహా ఇచ్చారన్నా. మా సమస్య పరిష్కరిస్తే మీ ఫొటోను మా ఇళ్లలో పెట్టుకుంటాం. జగన్: ఎక్కడ పుట్టినా బీసీలో పుట్టిన వాడు ఎక్కడైనా బీసీగానే ఉంటాడు. ఈ జిల్లాలో సర్టిఫికెట్ ఇవ్వను, ఆ జిల్లాలో బీసీ సర్టిఫికెట్ ఇస్తానని అన్యాయం చేయడం దుర్మార్గమైన పని. మన ప్రభుత్వం వచ్చాక పూర్తిగా న్యాయం జరిగేలా చూస్తానని ఇదే జిల్లాలోని పాలకొల్లు సభలో చెప్పాను. ఓబీసీ విషయంలో మీరు, నేను కేంద్ర స్థాయిలో ప్రయత్నం చేద్దాం. వీరన్న: రాష్ట్ర బీసీ జాబితాలో అనేక కులాలతోపాటు అత్యంత వెనుకబడి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న సుమారు 52 కులాలున్నాయి. హీనమైన కులాలుగా చూస్తూ అడుక్కుని తింటున్న సంచార జాతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఏదైనా అడిగితే చంద్రబాబు ప్రభుత్వం వాళ్లు జెండా మోశారా? వాళ్లు ఓటేశారా? అని అడిగే పరిస్థితి ఉంది. సంచార జాతుల వారిని ఆదుకోవాలి. జగన్ : వారందరినీ అదుకుందాం. -
నాలుగేళ్లుగా ఏం చేశావు బాబూ?
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల ఇది. ఆమె భర్త వీరభద్రుడు ఇదే ప్రాంతానికి గొప్ప పరిపాలన అందించాడని మనం కథల్లో విన్నాం. ఇలాంటి గడ్డపై నాలుగేళ్లుగా కన్పిస్తున్నదేమిటో తెలుసా? అన్యాయం, అక్రమం, అవినీతి, దోపిడీ, పక్షపాతం. కళ్లెదుటే ఇసుక, మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా పాలకులకు ఏమి పట్టని పరిస్థితి. మొత్తం 15కు 15 స్థానాలు ఇచ్చిన ఈ జిల్లాకు ఏం చేశాడో చంద్రబాబును గట్టిగా అడగండన్నా అని ప్రజలు అంటున్నారు. ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ఈ నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరక ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి అబద్ధాలు, మోసాల ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపేయాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 184వ రోజు శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా సాగిందో అందరూ చూశారని, ఎన్నికల తరుణంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సభలో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. రోజూ లక్షల టన్నుల ఇసుక తరలిపోతోంది.. ‘‘ఆశ్చర్యం కలిగించే రీతిలో ఇక్కడ ఇసుక దోపిడి జరుగుతోంది. పందలపర్రు, పెండ్యాల, ఖండవల్లి, తీపర్రు ఇసుక ర్యాంపుల నుంచి నాలుగేళ్లుగా ఈ దందా సాగుతోంది. ఇసుక రీచ్‌లలో ప్రొక్లెయినర్లు, లారీలు కన్పిస్తాయి. కళ్లెదుటే రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుక తరలిపోతోంది. కలెక్టర్లు పట్టించుకోరు.. పోలీసులు దగ్గరుండి ఈ పనులు చేయిస్తారు. మొదట డ్వాక్రా సంఘాల పేరు చెప్పారు. తర్వాత సీసీ కెమెరాలు పెడతామన్నారు. తీరా చూస్తే డ్వాక్రా మహిళలు లేరు. సీసీ కెమెరాలు లేవు. ఇసుకను దోచేసేందుకు ఇసుక ఫ్రీ అని పేరు పెట్టుకున్నారు. నిజానికి మీరు ఇల్లు కట్టుకునేందుకు, ఇతరత్రా అవసరాలకు ఇసుక ఉచితంగా లభిస్తోందా? కానీ చంద్రాబాబు తన ఎమ్మెల్యేలకు, బినామీ కాంట్రాక్టర్లకు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాడు. బాబు ముఖ్యమంత్రి అయిన మూడేళ్లపాటు స్టీల్ రేట్లు తగ్గిపోయినా కూడా తన బినామీలకు, లంచాలు ఇచ్చే కాంట్రాక్టర్లకు రెండింతలు, మూడింతలు, నాలుగింతలు అంచనా విలువ పెంచుతారు. ఇదే ఇసుక మాఫియా ఆధారాలతో సహా అధికారులకు దొరికిపోయినా కూడా ఈ జిల్లాలో చర్యలుండవు. ఆధారాలన్నీ చెత్తబుట్టలోకి పోతాయి. ఈ దోపిడీలో ఎమ్మెల్యేలు, చినబాబు, పెదబాబు వరకు అందరికీ వాటాలు. ఇసుకే కాదు, మట్టిని కూడా వదిలిపెట్టలేదు. కోరుమామిడి, తాడిమళ్ల గ్రామాల్లో ఒక్కో చెరువును ఇరవై, ముప్పె అడుగులు తవ్వేశారు. మట్టిని తవ్వినందుకు డబ్బులు తీసుకుంటారు. అదే మట్టిని అమ్ముకున్నందుకు డబ్బులు లాగుతారు. ఈ నాలుగేళ్లలో మట్టి తవ్వకాల రూపంలో ఈ రాష్ట్రంలో రూ.34 వేల కోట్లు దోపిడి జరిగిందంటే ఏ స్థాయిలో దోపిడీ సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్రిడ్జి కడతామంటూ సినిమా చూపిస్తున్నారు.. ఇదే నియోజకవర్గంలో ప్రజలు నా దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న ప్రాంతాన్ని చూపించి అక్కడ ఆర్ఓబి(రోడ్ కం రైల్ బ్రిడ్జి) కట్టకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే అన్నాడన్నా.. ఆ బ్రిడ్జి ఇస్తామని చంద్రబాబు అన్నాడన్నా.. కానీ నాలుగేళ్లుగా రోజుకో సినిమా చూపిస్తున్నారన్నా.. అని జనం చెబుతున్నారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జి దాదాపు కూలిపోయి ఉంది. పక్కనే ఐరన్ గడ్డర్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. పుష్కరాల పేరుతో జరిగిన అవినీతికి సాక్ష్యాంగా నిలబడింది ఆ గడ్డర్ బ్రిడ్జి. కూలిపోయిన ఆ బ్రిడ్జికి మరమ్మతుల పేరుతో పుష్కరాల నిధుల నుంచి డబ్బులు పెట్టారు. డబ్బులు లాక్కూన్నారో మరేం చేశారో దేవుడెరుగు. పుష్కరాలు, దేవుడి పేరు చెప్పి దోచేస్తున్న వైనానికి నిదర్శనంగా నిలబడింది ఆ బ్రిడ్జి. ఇదే నియోజకవర్గంలో వేలివెన్నులో రొయ్యల ఆధారిత పరిశ్రమల కారణంగా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోందని, ప్యాక్టరీ వ్యర్థాలను నరసాపురం, గోస్తానీ పంట కాలువల్లో వదిలిపెడుతున్నారని ఇక్కడున్న రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. నాన్నగారి పాలనతో పోలికా? నాలుగేళ్ల క్రితం ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తాను అని బాబు ఊదరగొట్టాడు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టించిన పాపన పోలేదన్నా అని ప్రజలు అంటున్నారు. ఆ ప్రజలంతా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాలన గుర్తు తెచ్చుకుంటున్నారు. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో పదివేల ఇళ్లు, నిడదవోలు పట్టణంలోనే దాదాపుగా వెయ్యి ఇళ్లు కట్టాడన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నిజంగా నాన్నగారి పాలన ఎక్కడ, ఈ చంద్రబాబు పాలన ఎక్కడ? ఇక్కడ ప్రజలు నాలుగేళ్లుగా అడుగుతున్నా ఆటోనగర్ కూడా ఇవ్వని పరిస్థితి. పక్కనే గోదావరి కనిపిస్తోంది.. కానీ దాళ్వా సమయంలో మాత్రం పెరవలి, తణుకు సరిహద్దు ప్రాంతాలకు నీరు రాదు. డెల్టా ఆధునికీకరణ పనులు సరిగ్గా జరగవు. నీళ్లు ఇస్తున్నామా? లేదా? రైతులు ఎలా బతుకుతున్నారు? అనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి పట్టదు. చెరకు రసం రంగులో ఉన్న ఈ నీళ్లు తాగలేకపోతున్నామన్నా.. ఈ నీళ్లను సభలో చంద్రబాబుకు చూపించండన్నా.. అని ప్రజలు ఆ నీటిని బాటిళ్లలో తెచ్చిస్తున్నారు. 15కు 15 స్థానాలు అప్పగించిన ఈ జిల్లాకు ప్రజలకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేని అధ్వానమైన పాలన సాగుతోంది. రేపు ఎన్నికలొస్తే అదే బాటిల్ చూపించి ప్రజలకు చెరుకురసం ఇస్తున్నానని ఈ పెద్దమనిషి మైకుల్లో ఊదరగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత దారుణంగా మీడియాను మేనేజ్ చేయగల సమర్థుడు ఈ చంద్రబాబు. ఏం చెప్పారు.. ఏం చేశారు..? రైతులు భూమిమీద పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదు. చివరకు నీటిలో పండించే రొయ్యలు, చేపలకు కూడా ధరలేని పరిస్థితి. మినుము, పెసర.. ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. ఈ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? ఈ పెద్దమనిషి.. అధికారంలోకి రాగానే బెల్డ్‌షాపులు తీసేస్తాను, మద్యాన్ని తగ్గిస్తాని చెప్పాడు. ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఏదైనా ఉందేమో గానీ మందు షాపులేని గ్రామం ఉందా? ఏమైనా అంటే మైక్రోసాఫ్ట్, బిల్‌గేట్స్ అంటాడు. సెల్‌ఫోన్, కంప్యూటర్ను తానే కనిపెట్టాను అంటాడు. ఇలాంటి హైటెక్ పరిపానలలో ఫోన్ కొడితే మినరల్ వాటర్ వస్తుందో రాదో గానీ మందు బాటిల్ మాత్రం ఇంటికే వస్తుంది. రైతుల రుణాలు అక్షరాలా రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా మహిళల రుణాలనూ మాఫీ చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు అమలు చేశానని చెప్పుకుంటున్న రుణ మాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మీ అందరికీ తెలుసు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా పొదుపు సంఘాలను కూడా ఆయనే కనుక్కున్నట్లుగా గొప్పలు చెబుతున్నారు. అప్పట్లో టీవీ అడ్వర్టయిజ్మెంట్లు మీకు గుర్తుండే ఉంటాయి. టీవీ ఆన్ చేస్తే కనిపించే దృశ్యాలు భలే ఉండేవి. ఒక ఇంట్లో ఓ అక్క ఉంటుంది. ఆమె మెడలో మంగళసూత్రం ఉంటుంది. ఇంతలో ఓ చెయ్యి వచ్చి ఆమె మంగళసూత్రాన్ని గట్టిగా లాక్కుంటూ ఉంటుంది. వెంటనే మరో చెయ్యి వచ్చి ఆ చెయ్యిని పట్టుకుంటుంది. ఆ వెంటనే ఆయనొస్తున్నాడు.. ఆయనొస్తున్నాడు.. అని చెబుతుంది. కానీ ఈ రోజు బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వస్తున్నాయా? ఎక్కడా ఈ వర్షాన్ని లెక్క చేస్తామా? నాలుగేళ్లుగా బాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. నాలుగేళ్లుగా ఈ పెద్దమనిషి పాలన చూశాం. ఇవాళ రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. పెట్రోలు, డీజల్ ధరలు ఎక్కడా లేనట్లు రాష్ట్రంలో భగ్గుమంటున్నాయి. లీటరుకు రూ.7 అదనంటా బాదుతున్నారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా ఉపాధి అన్నారు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ ఏదీ లేదు. ఈ లెక్కన ఈ 48 నెలలకు గాను రూ.96 వేలు బకాయి పడ్డారు. మొత్తం ఐదేళ్లకైతే ఒక్కో ఇంటికి రూ 1,20,000 ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని చివరిలో ఆరు నెలలో, నాలుగు నెలలో మాత్రమే రూ.1000 ఇస్తాడట. అది కూడా రాష్ట్రంలో ఒక కోటి 70 లక్షల మంది ఉంటే, కేవలం పది లక్షల మందికేనట. ఇలాంటి పెద్దమనిషిని క్షమిస్తే రేపు మీ వద్దకు వచ్చి ఏం చెబుతారో తెలుసా? తాను ఎన్నికల్లో చేసిన హామీల్లో 98 శాతం నెరవేర్చానని చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటారు. అయినా మీరు నమ్మరని, ప్రతి ఇంటికీ మనుషులను పంపించి ప్రతి చేతికీ రూ.3000 ఇస్తాడు. ఆ డబ్బు వద్దనకండి. రూ.5000 కావాలని గుంజండి. ఆ డబ్బంతా మన జేబుల్లో నుంచి కాజేసిందే. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పే వాళ్లను, మోసాలు చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని తీసుకు రండి. ఈ వ్యవస్థలో మార్పు కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. వర్షం పెద్దగా కురుస్తోంది. నేను వర్షంలో తడవడానికి బాధపడను. కానీ నాతో పాటు మీరు తడవడం బాధ కలిగించే అంశం కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను’’ అని జగన్ అన్నారు. ‘నిడదవోలు నియోజకవర్గంలోని 30 పడకల ఏరియా ఆసుపత్రికి రోజూ 300 మందికిపైగా వస్తారన్నా.. ఈ ఆసుపత్రిలో ఎనిమిది మంది డాక్టర్లు ఉండాల్సింది పోయి ఎనిమిదేళ్లుగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారన్నా.. 15 మంది నర్సులకు గాను ఆరుగురు మాత్రమే ఉన్నారన్నా.. కనీసం ఎక్స్‌రే మిషన్ కూడా లేదన్నా’ అని ఇక్కడి ప్రజలు వాపోతుంటే బాధేస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా? రైతులు నా దగ్గరకు వచ్చి.. ‘వరికి మద్దతు ధర రూ.1550 అన్నా.. కానీ చంద్రబాబు పాలనలో మార్కెట్‌కు పోయి అమ్మాలంటే రూ.1150కి అడుగుతున్నారన్నా..’ అని వాపోతున్నారు. కూర అరటి గెల రూ.100కు అడుగుతున్నారు. అదే కూర అరటి రెండే రెండు కాయలు బాబు హెరిటేజ్ షాపులో రూ.25కు అమ్ముతారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి దళారీలకు నాయకుడైతే రైతులకు గిట్టుబాటు ధరలెలా వస్తాయి? -
సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేక అధికార టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్ జగన్ దాటనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు వెళ్లకుండా టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సభకు హజరుకావొద్దని ఏలూరు మండలం చొదిమళ్ల గ్రామస్తులను టీడీపీ నాయకులు బెదిరించారు. వైఎస్ జగన్ సభకు హాజరైతే ప్రభుత్వ పథకాలు అన్నీ కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అదేవిధంగా ఎస్సీ, బీస్సి, కాపులను సభకు రాకుండా అడ్డుకుంటామంటూ టీడీపీ నేతలు బెదిరింపులు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. టీడీపీ నాయకుల బెదిరింపులపై వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్ అభిమానులు మండిపడుతున్నారు. బెదిరింపులతో ప్రజాభిమానాన్ని అడ్డుకోలేరని అన్నారు. -
‘మే 14 ఎంతో ముఖ్యమైన రోజు’
సాక్షి, కాళ్ల: వైఎస్ జగన్ పాదయాత్ర కోసం పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ఎదురు చేస్తున్నారన్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మే 14న పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. కాళ్ల మండలం పెద అమిరంలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్లతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏలూరు వద్ద వైఎస్ జగన్ 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటతారని వెల్లడించారు. మే 14 తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, 15 సంవత్సరాల క్రితం అదేరోజున వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్నారని గుర్తు చేశారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని, 12 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు. లోకేష్‌కి డబుల్ బొనాంజా ప్రత్యేక హోదా రావాలనే తనతో పాటు వైఎస్సార్ సీపీ ఎంపిలు రాజీనామా చేశారని అన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వచ్చేది కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలోనే అతి ముఖ్యంగా పశ్చిమగోదావరి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు రాష్ట్రంలోని యువతను మోసం చేసి తన కుమారుడు నారా లోకేష్‌కి మాత్రం డబుల్ బొనాంజా ఇచ్చారని దుయ్యబట్టారు. ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతోనే ఎన్నికల తర్వాత కలుస్తామని మొదట నుంచి చెబుతున్నామని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. -
వైద్యాలయం.. మందుల వ్యాపారం
తణుకు అర్బన్:తణుకు ఏరియా ఆస్పత్రిలో కార్పొరేట్ మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ ఒత్తిడో, మరే ఇతర కారణాలో కాని వైద్యాధికారుల కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. గతేడాది నుంచి విజయవాడకు చెందిన ఉషా కార్డియాక్ ఆస్పత్రి ఆధ్వర్యంలో తణుకు ఏరియా ఆస్పత్రిలో ప్రతి మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈసీజీ, ఎకో వంటి గుండె పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారు. మెరుగైన సేవలు అవసరమైన వారిని విజయవాడకు రావాల్సిందిగా సం బంధిత వైద్యులు సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు నిర్వహించిన వైద్యుడు రాసిన మందులు కార్పొరేట్ సంస్థ ప్రతినిధుల వద్దే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అవి మరే దుకాణంలో దొరకని దుస్థితి. దీంతో రోగులు వీరి వద్దే మందులు కొంటున్నారు. బయట దుకాణాల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారని, అయితే ఇక్కడ మాత్రం ఎమ్మార్పీకే మందులు విక్రయిస్తున్నారని రోగులు అంటున్నారు. తణుకు ఆస్పత్రిలో జరుగుతున్న ఈ మందుల విక్రయాలను మంగళవారం తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ పరిశీలించారు. ఎంఓయూ ఉందంటూ తప్పుదోవ మందులు విక్రయించేందుకు తమకు మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ధ్రువీకరణ పత్రం ఉందని సదరు విక్రయాలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి సిబ్బంది డ్రగ్ ఇన్స్పెక్టర్ విక్రమ్‌కు చెప్పారు. ఎంఓయూ చూపించమని విక్రమ్ అడగడంతో అందుబాటులో లేదని సదరు సిబ్బంది సమాధాన మిచ్చా రు. మందుల అమ్మకంపై గతంలోనే ‘సా క్షి’ కథనాలు ప్రచురించినా వైద్యాధికారులు స్పందించలేదు. రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన కార్పొరేట్ ఆస్పత్రి కావడంతో తెరవెనుక ఏదైనా రాజకీయ హస్తం ఉందా అనే విమర్శలు లేకపోలేదు. రూ.లక్షకు పైగా అమ్మకాలు జిల్లాలో తణుకుతో పాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ తరహా మందుల అమ్మకాలు సదరు కార్పొరేట్ సంస్థ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకులో వైద్య శిబిరానికి సుమారుగా 50 నుంచి 70 మంది వరకు వస్తున్నారు. రూ.లక్షకు పైగా మందుల విక్రయం జరుగుతున్నట్టు అంచనా. ఎంఓయూ ఉందంటున్నారు మందుల అమ్మకాలకు ఎంఓయూ ధ్రువీకరణ పత్రం పొందామని విజయవాడ ఉషా కార్డియాక్ ఆస్పత్రి వైద్య బృందం చెప్పారు. అయితే అది విజయవాడలో ఉందంటున్నారు. వచ్చే వారం ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మని ఆదేశించాను. తీసుకురాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.– విక్రమ్, తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎటువంటి ధ్రువీకరణ ఇవ్వలేదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేట్ మందుల విక్రయాలు జరపరాదు. ఇందుకోసం ఎవరికీ ఎటువంటి ఎంఓయూ ధ్రువీకరణ పత్రాలు జారీచేయలేదు. వచ్చే మంగళవారం జరిగే వైద్య శిబిరంలో మందుల విక్రయాలు మానకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు -
ఉలిక్కిపడ్డ ఉల్లంపర్రు
పాలకొల్లు అర్బన్: హైదరాబాద్‌లో ముగ్గు రు హత్యకు గురైన సంఘటన పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో తీవ్ర సంచలనాని కి దారితీసింది. ఉల్లంపర్రు గ్రామానికి చెం దిన అపర్ణతోపాటు ఆమె నాలుగేళ్ల కుమార్తె, అపర్ణ తల్లి హత్యకు గురయ్యారు. వీరు హత్యకు గురైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉల్లంపర్రులో విషాదఛా యలు అలముకున్నాయి. ఈ ముగ్గురిని హ త్య చేసిన ఇదే గ్రామానికి చెందిన రావాడ మధు ఇరవై ఏళ్ల నుంచి భార్య, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సెల్ రిపేరింగ్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. అపర్ణతో సెల్‌షాపులో పరి చయం కావడం, ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఆ పరిచయం కాస్తా వివాహేతర సం బంధానికి దారితీసింది. అయితే వీరిద్దరి మధ్య ఏ మనస్పర్థలు తలెత్తాయో తెలి యదు కాని ముగ్గురిని మధు హత్య చేసి పరారయ్యాడు. అపర్ణ అద్దెకుంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో హత్య సంఘటన బయటపడింది. ప్రస్తుతం మధు పోలీ సుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అప ర్ణ ఫ్యాన్సీ షాపులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ తల్లీ, కూతుళ్లను పోషించుకుంటుంది. çహంతకుడు, బాధితులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో అలజడి రేగింది. -
ఎర్రకాలువ వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెన వద్ద ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. మృతులు కాపుశెట్టి జ్యోతి(33), కాపుశెట్టి అఖిలసత్య(12), శివసాయి(14), గేలం లక్ష్మి(50), పల్లా సావిత్రమ్మ(62)గా గుర్తించారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. సిమెంట్ లారీ టైరు పేలిపోయి బస్సుపైకి దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి సమీపంలో నాలుగురోజుల క్రితం నానో కారును లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో అనంతపల్లివాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. -
అదృశ్యమైన తల్లీకూతుళ్లు శవాలయ్యారు
సాక్షి, పోలవరం: ఏడాది క్రితంనాటి తల్లీకూతుళ్ల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్.ఎన్.డి.పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు(19)లు తల్లీ కూతుళ్లు. వీరు గత ఏడాది నవంబర్ 2వ తేదీ నుండి కనబడకుండా పోయారు. ఈ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ నుంచి ఎర్రాయగూడెం వెళ్లే రహదారి పక్కన జీడిమామిడి తోటలో వీరి శవాలను కనుగొన్నారు. తల్లీకూతుళ్ళను హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సావిత్రి భర్త రామాంజనేయులు, మంగతాయారు భర్త పులిబోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
మరణంలోనూ ఒకరికి ఒకరై..
భీమడోలు: జీవించినంత కాలం ఒకరికి ఒకరు తోడునీడగా బతికిన వారు చనిపోయినపుడూ ఒకటిగానే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని మేజర్ పంచాయతీ గుండుగొలనులోని ఓ దళితవాడలో శనివారం రాత్రి ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెయ్యల లాజర్(98), సుగుణమ్మ(87)లు దంపతులు. వారికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలలుగా లాజర్ అనారోగ్యంతో మంచం పట్టాడు. అతనికి అన్నీ తానే అయి సుగుణమ్మ సపర్యలు చేస్తోంది. భర్తను చంటి బిడ్డలా చూసుకుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి లాజర్ ఉలుకుపలుకూ లేకుండా జీవచ్ఛవంలా ఉండిపోయాడు. ఆందోళనతో వైద్యుడిని పిలిపించగా లాజర్ చనిపోయాడని నిర్ధారించారు. భర్త మరణవార్త విని ఆమె తట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికే గుండెపోటుతో మృతిచెందింది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ వృద్ధుల భౌతికకాయాలను సందర్శించేందుకు వాడ అంతా తరలివచ్చింది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
పశ్చిమ బరిలో రూ. 200 కోట్లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి పుంజులకు కత్తులు కట్టి పందేలు నిర్వహించరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా తెర వెనుక ఏర్పాట్లు మాత్రం యథావిధిగానే సాగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది కూడా 50కి పైగా బరులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భోగి నాటి నుంచి ప్రారంభం అయ్యే పందేలు, జూదాల్లో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.రెండు వందల కోట్లు చేతులు మారతాయని అంచనా. జాతరే జాతర.. కోడి పందేల బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిసి జాతరలను తలపిస్తాయి. వీటిని నిర్వహించుకునేందుకు ఇప్పటికే వేలం పాటలు మొదలయ్యాయి. పందేల మాటున పేకాట, గుండాట, కోతాట, జూదం నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం జరగకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కలిదిండి రామచంద్రరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణను హైకోర్టు జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దగ్గరుండి ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక సాంప్రదాయం పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ముందుండి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, గుండుగొలను, జంగారెడ్డిగూడెం, కొప్పాక తదితర చోట్ల పెద్ద ఎత్తున కోడిపందేలు జరుగుతున్నాయి. భోగి పండుగ నుంచి కనుమ వరకూ రాత్రి పగలు తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. పండగ మూడు రోజులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక గత ఏడాది జాయింట్ యాక్షన్ టీములను ఏర్పాటు చేసి కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించినా ఎక్కడా అమలు కాలేదు. ఈసారి కోడి పందేల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితోపాటు పందేలను ప్రోత్సహించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడిపందేలపై ఇటీవల జరిగిన సమీక్షలో ఎస్పీ రవిప్రకాష్ అ«ధికారులకు సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు. కోడిపందేలు ఎక్కడ జరిగినా అక్కడి స్టేషన్ ఆఫీసర్‌ను బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డని హత్య
పశ్చిమగోదావరి , జంగారెడ్డిగూడెం: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్యచేసిన కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత నెల 18న మండలంలోని లక్కవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుట్లగట్లగూడెంలో చేనుబోయిన నాగు (34) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇంటి ఎదురుగా ఉన్న డ్రైన్లో పడి ఉండగా గుర్తించిన అతని సోదరుడు అంజియ్య లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్కవరం ఎస్సై వి.జగదీశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో వెల్లడైన వివరాలు ఇవి.. నాగు, అతని భార్య శీనమ్మకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన గుర్రం చిట్టియ్యకు, శీనమ్మకు ఏడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శీనమ్మ మూడు నాలుగు సార్లు చిట్టియ్యతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. గ్రామ పెద్దలు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆ దంపతుల కాపురాన్ని సరిదిద్దారు. అయినా శీనమ్మ, చిట్టియ్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలైలో శీనమ్మ కోసం ఆమె ఇంటికి రాత్రి సమయంలో చిట్టియ్య వచ్చాడు. అదే సమయంలో శీనమ్మ భర్త నాగు ఇంటికి రాగా అతడిని చూసిన చిట్టియ్య పారిపోయాడు. ఇరువర్గాలు గొడవ పడి లక్కవరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. అప్పటి నుంచి చిట్టియ్య, శీనమ్మలు తమకు అడ్డుగా ఉన్న నాగును తొలగించుకోవాలన్నారు. దీనికోసం పథకం రూపొందించుకున్నారు. గత నెల 17 రాత్రి నాగు మద్యంతాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ విషయం చిట్టియ్యకు శీనమ్మ సమాచారం అందించింది. చిట్టియ్య తన వెంట విద్యుత్‌వైరు తీసుకుని నాగు ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న నాగు చేతికి ఒక వైరు, కాలికి ఒక వైరు చుట్టి కరెంటు షాక్‌తో హత్య చేశారు. నాగు చనిపోయినట్టు నిర్ధారించుకున్న తరువాత అతని ఇంటి ఎదురుగాఉన్న మురుగు కాలువలో పడేశారు. మద్యం మత్తులో నాగు కాలువలో పడి చనిపోయినట్టు ఆ మరునాడు ఉదయం అందరినీ నమ్మించారు. కేసు దర్యాప్తు చేసిన సీఐ కె.బాలరాజు, ఎస్సై వి.జగదీశ్వరారవులు చిట్టియ్య, శీనమ్మ కలిసి నాగును హత్యచేసినట్టు విచారణలో తేల్చారు. వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ చెప్పారు. సీఐ, ఎస్సైలకు రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు. హత్య కేసు ఛేదించింది ఇలా.. నాగు మరణించిన రెండు రోజుల తరువాత అతని సోదరుడు అంజియ్య, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన శీనమ్మ తమపై అనుమానం రాకుండా ఉండేందుకు స్థానిక ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీని కలిసి తనభర్తను ఎవరో హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ నాగు మృతిని లోతుగా విచారించాలని ఆదేశించారు. సీఐ కె.బాలరాజు, ఎస్సై వి.జగదీశ్వరరావు రంగంలోకి దిగి నాగు పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించగా విద్యుత్‌షాక్‌కు గురైనట్టు గుర్తించారు. శీనమ్మ, చిట్టియ్య సెల్‌ఫోన్ కాల్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు. గ్రామంలో పెద్దలను విచారించగా శీనమ్మ, చిట్టియ్యల మధ్య వివాహేతర సంబంధం తెలిసింది. చిట్టియ్య వ్యవసాయ కూలీ. గ్రామంలో రైతులు పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్‌వైర్లు ఏర్పాటు చేస్తుం టారు. ఆ విద్యుత్ వైర్లు తగిలి పందులు మృతి చెందుతుంటాయి. షాక్ గురై మృతిచెందిన పందులపై ఎటువంటి గాయాలు, ఆనవాళ్లూ లేకపోవడం చిట్టియ్య గమనించేవాడు. నాగును హతమార్చేందుకు ఇదే పద్ధతిని ఎంచుకున్నాడు. శీనమ్మ పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన భర్త నాగును ఎవరో హత్యచేసి ఉంటారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం బెడిసి కొట్టి చివరికి దొరికిపోయారు. -
హుండీలో సొమ్ము తస్కరించాడు..మళ్లీ వచ్చి దొరికిపోయాడు
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల : చిన వెంకన్న ఆలయ హుండీలో చేయిపెట్టి సొమ్మును తస్కరించిన వ్యక్తి మరోసారి చోరీ చేసేందుకు శుక్రవారం క్షేత్రానికి వచ్చి దేవస్థానం సిబ్బంది చేతికి చిక్కాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజుల క్రితం శ్రీవారి ఆలయానికి వచ్చి ఓ వ్యక్తి దర్శనానంతరం బయటకు వెళ్లే క్రమంలో ముఖ మండపంలో ఉన్న పెద్ద హుండీలో చేయిపెట్టి నగదును తస్కరించాడు. దీన్ని సీసీ పుటేజీలో పరిశీలించిన ఆలయ అధికారులు, సిబ్బంది అతడ్ని పట్టుకునే లోపే అక్కడి నుంచి జారుకున్నాడు. ఆలయ అధికారులు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం మళ్లీ అతను ఆలయానికి వచ్చాడు. హుండీలో చేయి పెడుతుండగా ఆలయ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. తీరా చూస్తే 10 రోజుల క్రితం హుండీలో చేయిపెట్టి సీసీ పుటేజీలో రికార్డయింది ఇతడేనని సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడ్ని పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎస్సై వీర్రాజు విచారణ చేపట్టారు. అతడు చింతలపూడిలోని ఆంథోనినగర్కు చెందిన దుద్దు పవన్‌కుమార్‌గా గుర్తించారు. అతను పాత నేరస్తుడని ఎస్సై చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్
పశ్చిమగోదావరి, దవేగి రూరల్ : ఫిట్నెస్ లేకపోవడంతో స్కూల్ బస్ పంట బోదెలోకి దూసుకెళ్లిన సంఘటనలో 30 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు మండలం పోతునూరు గ్రామ సమీపంలో విశ్వకవి స్కూల్ బస్సు స్టీరింగ్ ఊడి పోవడంతో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సుకు ఫిట్ నెస్ లేకపోయినా దానినే పాఠశాల యాజమాన్యం తిప్పుతోందని అంటున్నారు. గతంలోను ఇదే పాఠశాలకు చెందిన బస్సు ఈ తరహా రోడ్డు ప్రమాదానికి గురైనా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
టీడీపీలో ఉత్కంఠ
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు జిల్లా ఎమ్మెల్యేలతో సోమవారం ఇక్కడ ఇంఛార్జి మంత్రులు అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. సత్యనారాయణరాజు, ముళ్లపూడి రేణుక, అంబికా కృష్ణ, సైదు సత్యనారాయణ, దుమ్మేటి సుధాకర్, కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లను సమన్వయ కమిటీ పరిశీలిస్తోంది. రెండు సీట్లలో ఒకటి ఓబీసీకి, మరోటి ఓసీకి కేటాయించాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎమ్మెల్యేల కోటాలో మరో సీటు కేటాయించాలని చంద్రబాబును ఎమ్మెల్యేలు కోరారు. -
ఫోర్జరీతో టీడీపీ ఎంపీపీ మనస్తాపం..
► ఎంపీపీ సంతకాలతో రూ.50 లక్షల పనులకు ఆమోదం ► మనస్తాపానికి గురై రాజీనామాకు సిద్ధమైన ప్రజాప్రతినిధి ► టీడీపీ పరువు పోతుందని బుజ్జగించిన ఎమ్మెల్యే, ఇతర నేతలు ఏలూరు: ప్రజాప్రతినిధి ఫోర్జరీ సంతకంతో ఉపాధి హామీ పనులకు ఆమోదముద్ర వేసిన ఘటన దేవరపల్లి మండల పరిషత్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిగువస్థాయి ఉద్యోగి సుమారు రూ.50 లక్షలు విలువగల ఉపాధి హామీ పనులకు ఎంపీపీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తీర్మానానికి ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో రెండు నెలల క్రితం ఉపాధి హామీ పథకం, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ, ఎస్డీఎఫ్ నిధులు సుమారు రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు తయారు చేశారు. పనులు చేపట్టడానికి గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు మండల పరిషత్ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాల్సి ఉంది. ఈ నిధుల్లో గౌరీపట్నంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించారు. మంజూరు చేసిన పనులకు గత నెల 26న జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదం కోసం మండల పరిషత్ అధికారి సమావేశంలో సభ్యుల ముందు ఉంచారు. గౌరీపట్నంకు కేటాయించిన రూ.50 లక్షల పనులకు సంబంధించిన తీర్మానం ప్రతిపాదనపై ఎంపీపీ సంతకాన్ని మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న దిగువస్థాయి ఉద్యోగి ఫోర్జరీ చేసి తీర్మానాన్ని సంబంధిత వ్యక్తులకు ఇచ్చారు. దీంతో గత నెలలో గ్రామంలో పనులను పూర్తి చేశారు. ఈ విషయం ఎంపీపీ ఆలస్యంగా గమనించి అవాక్కయ్యారు.తనకు తెలియకుండా కార్యాలయంలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయోనని ఆయన అనుమానం వ్యక్తం చేసి జరిగిన ఫోర్జరీ సంతకాలపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయటానికి సిద్ధపడగా పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుపడినట్టు తెలిసింది. విషయాన్ని ఎంపీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ దృష్టికి తీసుకువెళ్లి దీనిపై తనకు న్యాయం చేయాలని కోరినట్టు తెలిసింది. ఘటనపై మనస్తాపానికి గురైన ఎంపీపీ నరసింహరావు రాజీనామాకు సిద్ధపడగా విషయం బయటపడితే పార్టీ పరువు పోతుందని ప్రజాప్రతినిధులు వారించినట్టు సమాచారం. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వద్ద ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీడీపీ నాయకులు, పలువురు సర్పంచ్ల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా సదరు దిగువస్థాయి ఉద్యోగి జరిగిన తప్పును అంగీకరించినట్టు తెలిసింది. సంబంధిత అధికారిని ఎమ్మెల్యే తీవ్రంగా మందలించి భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని సమాచారం. అడుగడుగునా అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల వల్ల అవమానానికి గురవుతున్నానని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవమానంతో పనిచేసే కంటే రాజీనామా చేసి పక్కన ఉండటం మంచిదని ఎంపీపీ ఎమ్మెల్యే వద్ద వాపోయారు. ఎమ్మెల్యే, ఇతర నాయకులు సదరు దిగువస్థాయి ఉద్యోగిని ఇక్కడ నుంచి బదిలీపై పంపించటానికి నిర్ణయం తీసుకని ఎంపీపీని బుజ్జగించి శాంతింప చేసినట్టు తెలిసింది. కురుకూరు వద్ద మండల పరిషత్ నిధులురూ.1.50 లక్షలతో బస్‌షెల్టర్ నిర్మాణం చేశారు. దీనికి అదనంగా మరొక రూ. 35,000 ఎంపీపీ అనుమతిలేకుండా మండల పరిషత్ నిధుల నుంచి డ్రా చేసిన విషయం కూడా ఎంపీపీ వెల్లడించినట్లు తెలిసింది. -
నేనేంటో చూపిస్తా !
కాపు ప్రజాప్రతినిధులపై కస్సుమన్న చంద్రబాబు ఉద్యమాన్ని చల్లార్చకపోతే సహించేది లేదని హెచ్చరిక తుని తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు: తునిలో కాపు ఐక్యగర్జన దరిమిలా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యం అటుతిరిగి ఇటుతిరిగి టీడీపీ ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంటోంది. గర్జనకు ఊహించని స్థాయిలో కాపు సామాజిక వర్గం సునామీ మాదిరి వెల్లువెత్తడం.. తదనంతర పరిణామాలతో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇరుకున పెడుతున్నాయి. ‘ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు.. మీ నియోజకవర్గాల నుంచే ఎక్కువ స్థాయిలో కాపులు, నేతలు తరలివెళ్లారు. మనపై వ్యతిరేకతతో అంతమంది ఏకమవుతుంటే మీరేమీ చేయలేకపోయారా’ అని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు గట్టి క్లాస్ పీకారు. తుని ఘటనల నేపథ్యంలో చంద్రబాబు జిల్లాలోని కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో మంగళవారం భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో చంద్రబాబు మాట్లాడారు. ‘నా హయాంలోనే ఎలాగోలా కాపు రిజర్వేషన్లు సాధించాలని యత్నిస్తున్నా. ఒక్క పూటలోనే అన్నీ జరిగిపోవు కదా. ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని ఇంత అరాచకం చేస్తారా. ఇక నేను చూస్తూ ఊరుకోను. ఎంతటి వారినైనా అణచివేస్తా. నేనేంటో చూపిస్తా’ అని చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోయినట్టు తెలిసింది. ‘ఇప్పటివరకు మీరు ఏమీ చేయలేకపోయారు.. ఇకనైనా మీ నియోజకవర్గాల్లో కాపు నేతలను కంట్రోల్ చేయండి. మరోసారి రెచ్చిపోకుండా భయపెట్టండి’ అని టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం ఒకింత బెదిరింపు ధోరణితోనే మాట్లాడినట్టు చెబుతున్నారు. మొత్తంగా కాపు ప్రజాప్రతినిధుల వద్ద కాపు సామాజికవర్గ నేతలపై చంద్రబాబు విరుచుకుపడినట్టు తెలిసింది. సీఎం వద్ద ఏమీ మాట్లాడకుండా తలాడించి వచ్చిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత మాత్రం ఒకరినొకరు ఓదార్చుకున్నారని అంటున్నారు. సీఎం వ్యాఖ్యలతో నొచ్చుకున్న ఎమ్మెల్యేలలో ఒకరు ‘కాపు ఐక్యగర్జన పరిణామాలను అంచనా వేయడంలో దారుణంగా విఫలమైన ఇంటెలిజెన్స్ వర్గాల వారిని అనాల్సిన మాటలు మనల్ని అంటే ఎట్లా’ అని సహచర ఎమ్మెల్యేలు, సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. -
తాడేపల్లిగూడెంలో దోపిడీ దొంగల బీభత్సం
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మంగళవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు దొంగతనం చేసేందుకు యత్నించారు. అంతలో స్థానికులు రావడాన్ని గమనించి వారివెంట తెచ్చుకున్న రివాల్వర్ ను దుండగులు అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన లాయర్లు
నరసాపురం: స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయమూర్తి, న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించిన నరసాపురం టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆయన అనుచరులపై స్థానిక పోలీసుస్టేషన్ లో బార్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న అదనపు జిల్లా న్యాయమూర్తి పి.కల్యాణరావు, న్యాయవాదులపై ఎమ్మెల్యే మాధవనాయుడు, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈనెల 19న జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. శాసనసభ్యుని దురుసు ప్రవర్తనను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ఎన్నికల కమిషన్, న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు పంపినట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. -
'జడ్జిపై నరసాపురం ఎమ్మెల్యే దౌర్జన్యం'
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోర్టు ఆవరణ వద్ద అదనపు జడ్జి కల్యాణరావుతో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆవరణలో షాపులు ఖాళీచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జడ్జిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని నరసాపురం బార్ అసోసియేషన్ ఆరోపించింది. ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించారని మండిపడింది. జడ్జిని ఏకవచనంతో సంబోధించడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. ఎమ్మెల్యే దౌర్జన్యానికి నిరసనగా బుధవారం విధులు బహిష్కరిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి బాబ్జి తెలిపారు. అయితే జడ్జి పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే మాధవనాయుడు వివరణయిచ్చారు. ప్రత్యామ్నాయం చూపకుండా జడ్జి స్వయంగా షాపులు ఖాళీ చేయిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఆయన జడ్జి అని తనకు తెలియదని చెప్పారు. -
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు
ఏలూరు: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఇబ్బందులెదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో వర్షాలకు కూలిన విద్యుత్ స్తంభాలు కూలిపోడంతో కందరవల్లి, కాంబొట్లపాలెం, అయోధ్యలంక, వల్లూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భీమవరంలో రోడ్లు జలమయం అయ్యాయి. హౌసింగ్ బోర్డు కాలనీ, ఆర్టీసీ డిపోలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్టప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దేవరపల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. -
దేవరపల్లిలో ‘దేశం’ దొంగాట
ఏలూరు: అధికారదాహంతో తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అధికారం దక్కకుండా చేయాలని అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిషత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ ఎంపీపీ పదవిని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేసిన ఆ పార్టీ నేతలు ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లోనూ శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వాన్ని, అల్లరి మూకలను ఆరోజు దేవరపల్లి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రయత్నాలనూ అడ్డుకుంటున్నారు. ఇదీ జరిగింది దేవరపల్లి మండల పరిషత్‌లో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 12 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన పెనుబోతుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ పదవికి గన్నమని జనార్దనరావు పోటీకి దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల్ని భయపెట్టో, ప్రలోభపెట్టో తమవైపు తిప్పుకొని ఎంపీపీ పదవి దక్కించుకోవాలని టీడీపీ పథకం వేసింది. ఈ కుతంత్రాలకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు లొంగలేదు. ఈనెల నాలుగున ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. టీడీపీ శ్రేణులు ఆ రోజున దేవరపల్లిలో అరాచకం సృష్టించాయి. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల సభ్యులపై దౌర్జన్యానికి దిగటమేగాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామారావుపైనా దాడిచేశారు. దీంతో ఎన్నికల్ని ఆపేసిన ఎన్నికల సంఘం.. అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. మళ్లీ ఈనెల 13న ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించటంతో ఆరోజున మళ్లీ దౌర్జన్యాలకు పాల్పడాలని టీడీపీ కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని, లేకపోతే శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం మంత్రులు కూడా అక్కడే మకాం వేయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలు సక్రమంగా జరిగేలా రక్షణ కల్పించాలని వైఎస్సార్ సీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. టీడీపీకి కొమ్ముకాస్తున్న అధికారులు దేవరపల్లిలో ఈనెల 4న జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు టీడీపీకి చెందిన వారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని పోలీసు అధికారులు వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆరుగురిలో ఎంపీపీ అభ్యర్థి కుమారుడు గన్నమనేని వెంకటేశ్వరావు, వైఎస్సార్ సీపీ నేత కొఠారు దొరబాబులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వారు బుధవారం బెయిల్ తీసుకోవడానికి కోర్టుకు వెళితే అక్కడా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆవరణలో నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ హక్కులకు భంగం కలిగించిన కొవ్వూరు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలపై బాధితులు గురువారం ఎస్పీకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. కోర్టు ఆవరణలో పోలీసుల దౌర్జన్యాన్ని న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు. జిల్లా జడ్జికి, సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం వారంతా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఆందోళన చేయనున్నారు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు తమ ప్రాణాలకు భద్రత, హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దేవరపల్లి మండల పరిషత్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోమని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో పొటీచేసే అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. అయితే.. అధికారం అండతో ఎవరినీ లెక్కచేయకుండా దాడులకు తెగబడుతున్న టీడీపీ వారు ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఏ అరాచకం సృష్టిస్తారోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
'వైఎస్ఆర్ సీపీ నేతలకు చిత్రహింసలు'
పెదవేగి: అధికార టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో పది రోజుల క్రితం వైఎస్ఆర్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు వారిని అరెస్ట్ చూపించలేదు. జూన్ 30న అంకన్నగూడెం సర్పంచ్, టీడీపీ నాయకుడు చిదిరాల సతీష్ ఊరి పొలిమేర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే అతనిపై హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు మొరవినేని భాస్కరరావు, గోపాలరావు, సూర్యప్రకాశరావు, చంద్రశే్ఖర్ సహా దాదాపు 10మందిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లు మారుస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు తెలిసింది. టీడీపీ సర్పంచ్ పై దాడి చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పోలీసుల వేధింపులతో భాస్కరరావు, గోపాలరావు అనారోగ్యం పాలయ్యారని సమాచారం. భాస్కరరావు నివాసంపై టీడీపీ నేతల దాడి విషయంలో కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. -
'పశ్చిమ'లో వైఎస్సార్ సీపీ హవా
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పలు స్థానాల్లో వైఎస్సార్ సీపీ హవా కొనసాగుతోంది. పాలకొల్లులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా శేషుబాబు ముందంజ తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట గోపి ఆధిక్యం ఆచంటలో వైఎస్సార్ సీపీ ముదునూరి ప్రసాదరాజు ముందంజ -
నడిరోడ్డుపై బ్యాలెట్ పత్రాలు
-
నడిరోడ్డుపై బ్యాలెట్ పత్రాలు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కృష్ణాయపాలెం ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసిన 15 బ్యాలెట్ పత్రాలు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఇక్కడ ఎంపీటీసీ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాపాక వీరవెంకటకృష్ణ, టీడీపీ తరఫున మిరియాల చినవెంకట్రావు పోటీపడగా, టీడీపీ అభ్యర్థి వెంకట్రావు 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. పోలైన ఓట్లలో 24 చెల్లలేదని పేర్కొన్నారు. అయితే, కృష్ణాయపాలెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని రామన్నపాలెంలో గురువారం ఉదయం 15 బ్యాలెట్ పత్రాలు రోడ్డుపై పడివున్నాయి. వీటిని గ్రామానికి చెందిన మూగ వ్యక్తి ఏరుకుని వెళ్తుండగా వైఎస్సార్సీపీ అభ్యర్థి తరఫు వ్యక్తులు చూసి అవాక్కయ్యారు. పరిశీలించగా ఆ 15 బ్యాలెట్ పత్రాలపై ఓటు ముద్రవేసి ఉంది. వీటిని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏలూరు తీసుకువెళ్లి కలెక్టర్‌కు అందజేశారు. ఈ వ్యవహారంపై విచార ణ జరిపి న్యాయం చేయాలని అభ్యర్థి వెంకటకృష్ణ కలెక్టర్‌ను కోరారు. -
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేగింది. ఎన్నికల టిక్కెట్ల కేటాయింపుతో కాంగ్రెస్ పార్టీలో ఇక్కట్లు మొదలయ్యాయి. ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని వెంకట పద్మరాజుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంపై యూత్ కార్యకర్తలు దాడి చేశారు. వెంకట పద్మరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాత్రి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఏలూరు లోక్‌సభ టిక్కెట్ లిక్కర్ సిండికేట్ ముసునూరి నాగేశ్వరరావుకు ఇచ్చారు. నాగేశ్వరరావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించినా లభించలేదు. కాంగ్రెస్ కుదేలవడంతో ఇప్పుడు ఏకంగా లోక్‌సభకే పోటీచేసే అవకాశం దక్కింది. -
సినీ నటుడు మురళీమోహన్ అరెస్ట్
ఏలూరు: సినీ నటుడు, టీడీపీ నాయకుడు మురళీమోహన్ను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 29న ద్వారకాతిరుమలలో అనుమతిలేకుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించినందుకు ఆయనను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. మురళీమోహన్తోపాటు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీరమణిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిని భీమడోలు కోర్టులో హాజరుపరిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
‘ఇప్పుడు పోటీచేస్తే 2019లోనూ టికెట్’
ఆకివీడు: ఈ ఎన్నికల్లో పోటీచేసిన వారికే 2019 ఎన్నికల్లోనూ టికెట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరామని, ఆ భరోసాతోనే ప్రస్తుతం కార్యకర్తలు సూచించిన వారికి టికెట్లు కేటాయించనున్నట్టు ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరు బాపిరాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అయిభీమవరంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశంతో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీచేయనున్నట్టు చెప్పారు. తను పోటీ చేయడంతో పాటు జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత చేపట్టాలని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తనను కోరారని అన్నారు. అయితే, నర్సాపురం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల బాధ్యత తీసుకుంటానని, మిగిలినవాటిలో డీసీసీ అధ్యక్షుడికి సహకరిస్తానని చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఇప్పుడు పోటీచేసిన వారికే 2019లో కూడా టికె ట్ ఇవ్వాలని తాను బొత్స సత్యనారాయణతో చెప్పానన్నారు. రాష్ట్ర విభజన తనకు ఎంతో మనస్తాపం కలిగించిందని, అయితే 2009 ఎన్నికల్లోనే తమ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొందన్నారు. విభజన విషయం కొత్తగా చూపిస్తూ పార్టీని నిందించడం సరికాదన్నారు. తాను జీవిత కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. -
సప్తాశ్వ రథంలో రాజన్న తనయుడు
నరసాపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన సప్తాశ్వ రథం(ఏడు గుర్రాల బండి)పై బస్టాండ్ సెంటర్ నుంచి ఊరేగిస్తూ రాజన్న తనయుడికి స్వాగతం పలికారు. గుర్రపు బండిలో ఎక్కిన యువనేత ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దారిపొడవునా జననేతపై అభిమానులు పూల వర్షం కురిపించారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. యువనేత రాకతో పులకించిపోయిన నరసాపురం వాసులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో నరసాపురం కిక్కిరిసింది. కాగా, ప్రసాదరాజు వైఎస్సార్ సీపీ వదిలివెళతారని జరుగుతున్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఆయన యువనేత చెంతనే ఉన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రసాదరాజు... రథంలో జగన్‌కు ఇరువైపుల నిల్చున్నారు. మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. -
‘అమ్మ ఒడి’పైనే తొలి సంతకం
* అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులు వేస్తాం * ముఖ్యమంత్రి కాగానే నాలుగు సంక్షేమ పథకాలపై సంతకం చేస్తా * వృద్ధుల పెన్షన్ రూ. 700కు పెంచుతాం * రూ. 3 వేల కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం * అక్క చెల్లెళ్ల కోసం డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఏ గడ్డయినా తినే పరిస్థితులను ఈరోజు చూస్తున్నాం. ఓట్ల కోసం, సీట్ల కోసం దొంగ కేసులు పెట్టడానికి, ఒక వ్యక్తిని జైలు పాలు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయం అంటే ప్రతిపేదవాడి గుండెల్లో చిరునవ్వు చూడాలి. ఈ వ్యవస్థలో మార్పును తీసుకొస్తాం. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడదాం. మరో రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున నాలుగు సంతకాలు పెడతా. ఈ సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేలా ఉంటాయి. మొదటి సంతకం అక్కచెల్లెళ్ల పిల్లలను చదివించే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం గురించి చేస్తా. ఈ పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో విద్యార్థికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1000 వేస్తాం. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెన్షన్‌ను రూ.700 పెంచడానికి చేస్తా. మూడో సంతకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం చేస్తా. నాలుగో సంతకం అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణాల మాఫీ కోసం చేస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు గణేశ్ చౌక్ సెంటర్లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో ఆయన మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. చంద్రబాబు పాలన మరచిపోలేం.. ‘‘ఒక వ్యక్తి చనిపోయి ఐదు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడున్నారని ఎవరినైనా అడిగితే గుండెలు చూపించి మా గుండె లోతుల్లో ఉన్నాడని చెబుతారు. రామరాజ్యం నేను చూడలేదు కానీ ఆ దివంగత నేత సువర్ణయుగాన్ని మాత్రం చూశాను. ఆ దివంగత నేతకు ముందు రాష్ట్రాన్ని చంద్రబాబు అనే వ్యక్తి పరిపాలించేవారు. ఆ భయానక పాలనలో గ్రామాలకు వెళ్లినప్పుడు అవ్వాతాతలు.. అయ్యా పెన్షన్ ఇప్పించమని అడిగేవారు. వారి కష్టాలు చూడలేక అధికారులకు ఫోన్ చేస్తే.. గ్రామంలో 15 మందికో, 20 మందికో ఉన్న కోటా పూర్తయిందని వారిలో ఎవరైనా చనిపోతేగానీ కొత్త వారికి పెన్షన్ ఇవ్వలేమని చెప్పడం నాకు గుర్తుంది. పిల్లలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా వారిని చంద్రబాబు సీఎం స్థానంలో ఉండి ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపానపోలేదు. హఠాత్తుగా ఎవరికైనా గుండెనొప్పో, ఇంకో రోగమో వస్తే ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు ఫీజు అడిగేవారు. ఆ కుటుంబ సభ్యులు ఎంత వడ్డీకైనా అప్పుతెచ్చి కట్టేవారు. కానీ దాన్ని తీర్చడానికి జీవితాంతం వారు ఊడిగం చేయడం నాకు గుర్తుంది. రైతు ఆత్మహత్యల్ని బాబు అవహేళన చేశారు.. ఆ భయానక పాలనలో చంద్రబాబు ఓట్ల కోసం, సీట్ల కోసం డ్వాక్రా అక్క చెల్లెళ్లను ఉపయోగించుకున్నారు. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియని రోజులవి. రైతన్నలు పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులవి. వారి కోసం ఉద్యమాలు జరిగాయి. అప్పుడు రైతన్నల రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని అడిగితే.. అలా చేస్తే ఆ డబ్బుల కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చంద్రబాబు అవహేళన చేశారు. రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎగతాళి చేశారు. వైఎస్.. వెలుగు రేఖలా వచ్చారు.. అలాంటి సమయంలో దివంగత మహానేత వైఎస్ వెలుగు రేఖలా వచ్చారు. ప్రతి పేదవాణ్ణి పేదరికం నుంచి బయట పడేయడానికి ఆయన ముందుకొచ్చారు. ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా ఇంజినీర్ కావాలని, డాక్టర్ కావాలని కలలు కన్నారు. ఆ పిల్లల ఫీజులు ప్రభుత్వమే కట్టేలా చేశారు. పేదవాడికి రోగం వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. అప్పులు తెచ్చి రూ.2 లక్షలు కట్టాల్సిన పరిస్థితి లేకుండా చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపేలా చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. పేదవాడికి గుండెపోటు వస్తే 108 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు కుయ్.. కుయ్.. కుయ్‌మని అంబులెన్స్ వచ్చేది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేదలకోసం ఎవరైనా పనిచేశారని అంటే ఆయన దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. రెండు నెలల్లో కాంగ్రెస్‌కు చరమగీతం పాడదాం.. ఓట్లు, సీట్ల కోసం నాయకులు ఏ గడ్డయినా తినే పరిస్థితులను చూస్తున్నాం. ఓట్ల కోసం, సీట్ల కోసం దొంగ కేసులు పెట్టడానికి, ఒక వ్యక్తిని జైలు పాలు చేయడానికి కూడా వెనుకాడలేదు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించే రాజకీయ వ్యవస్థను మనం చూస్తున్నాం. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయం అంటే ప్రతిపేదవాడి గుండెల్లో చిరునవ్వు చూడాలి. ఈ వ్యవస్థలో మార్పును తీసుకొస్తాం. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడదాం. మరో రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసే రోజున నాలుగు సంతకాలు పెడతా. ఈ సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేలా ఉంటాయి. మొదటి సంతకం అక్కచెల్లెళ్ల పిల్లలను చదివించే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం గురించి చేస్తా. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెన్షన్‌ను రూ.700 పెంచడానికి చేస్తా. మూడో సంతకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం చేస్తా. నాలుగో సంతకం అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణాల మాఫీ కోసం చేస్తాం. ఇవే కాదు. రాజధాని కోసం మనం ఉద్యమం చేయాల్సి ఉంది. మన రాజధానిని నిర్మించుకునేందుకు ఉద్యమం చేద్దాం.’’ అడుగడుగునా జనహోరు వైఎస్ జగన్ రెండో రోజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోకు జనహారతి పట్టారు. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో రోడ్ షో మొదలైనప్పటి నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దూబచర్లలో ఊరూరంతా జగన్‌ను చూసేందుకు రోడ్డుపైకి రావడంతో కోలాహలంగా మారింది. అక్కడి నుంచి ఆరు కిలో మీటర్లు దూరంలో ఉన్న నల్లజర్ల చేరుకోడానికి జన నేతకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. ప్రతిచోటా మహిళలు, యువకులు ఆయన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. అనంతపల్లి, యర్నగూడెం, కోరుమామిడి మీదుగా రాత్రి 8.30 గంటలకు జగన్ నిడదవోలు సభ వద్దకు చేరుకున్నారు. సభకు వచ్చిన జనసంద్రంతో నిడదవోలు గణేశ్‌చౌక్ సెంటరులోని నాలుగు రోడ్ల కూడలి కిక్కిరిసిపోయింది. ఈ సభలో పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, కృష్ణబాబు, జిల్లా నాయకులు రాజీవ్ కృష్ణ, తలారి వెంకట్రావు, తోట చంద్రశేఖర్, తూర్పు గోదావరి జిల్లా నాయకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన జీఎస్ రావు జనభేరి సభలోనే పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు, ఆయన కుమారుడు శ్రీనివాసనాయుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నిడదవోలు ఎమ్మెల్యేగా యువకుడైన రాజీవ్ కృష్ణను, ఎంపీగా బొడ్డు వెంకట్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. నేడు ఖమ్మంలో ‘వైఎస్ఆర్ జనభేరి’ సాక్షి, ఖమ్మం: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలో ‘వైఎస్ఆర్ జనభేరి’ సభ నిర్వహించనున్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి సత్తుపల్లి మండలం గంగారం మీదుగా జగన్ ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. సత్తుపల్లి, వైరా మీదుగా ఖమ్మం వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగిస్తారు. తెలంగాణలో తొలిసభ కావడంతో పొరుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. -
పైలెట్ స్నిగ్ధ
కొవ్వలి (దెందులూరు): పైలెట్ గా రాణిస్తూ పురుషుల కంటే మహిళలు తక్కువేమి కాదని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన పి.స్నిగ్ధ. కోస్తా జిల్లాల్లో తొలి మహిళా పైలెట్ గా పేర్గాంచిన ఆమె శనివారం స్వగ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో తను అనుభవాలను పంచుకున్నారు. ‘మహిళల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉంది.. ఇంజినీరింగ్, మెడిసిన్ వైపే కాకుండా విద్యార్థినులు అన్ని రంగాలపై ఆసక్తి పెంచుకోవాలి. ముఖ్యంగా కేంద్ర సర్వీసులపైనా, అంతర్జాతీయ స్థాయిలో రాణించే రంగాలపై దృష్టి పెట్టాలి. నా చిన్నతనంలో బాగా చదువుకోవాలని, ఆడవాళ్లు ఉన్నతస్థాయిలో ఉండాలని మా అమ్మమ్మ ఎప్పూడూ చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. దీంతో పాటు అమ్మ ఢిల్లీలో ఎయిడ్ హోస్టస్‌గా పనిచేసేవారు. అప్పుడు తరచుగా విమానాల్లో ప్రయాణించడంతో పైలెట్ కావాలని నిశ్చయించుకున్నా. ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో రెండేళ్లు పైలెట్ శిక్షణ పొందాను. 2008-09 బ్యాచ్ పైలెట్ గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముంబైలో జెట్ ఎయిర్వేస్ పైలెట్ గా పనిచేస్తున్నా. తండ్రి సివిల్ సర్వీస్ అధికారి పి.రవీంద్రబాబు, తల్లి సునీత స్ఫూర్తితో ఈ స్థాయికు చేరుకోగలిగా. యువతులు పైలెట్ కోర్సు చదివి స్థిరపడాలని అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఇందుకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి’అన్నారు. ముందుగా స్నిగ్ధకు గ్రామస్తులు, బంధువులు ఘనస్వాగతం పలికారు. -
సినీనటుడు పొట్టి సత్యం మృతి
కొయ్యలగూడెం: తెలుగు చలనచిత్రాలలో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన పొట్టిసత్యం(85) ఆదివారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక వైఎస్సార్ నగర్‌లోని బంధువులైన శెనగశెట్టి లక్ష్మీనారాయణ, శెనగశెట్టి వెంకటేశ్వరరావు ఇంటివద్ద గడుపుతున్నారు. చెన్నై టినగర్లో ఉండే సత్యంకి నా అన్నవారు ఎవరూ లేరు. దీంతో నెల క్రితం ఆయన వరుసకు సోదరులైన తమ ఇంటికి వచ్చినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. గవరవరంలోని తమపొలంలో ఉన్న ఇంటివద్ద ఉంచి చికిత్స చేయిస్తున్నామని, ఆరోగ్యం విషమించి మరణించారని పేర్కొన్నారు. 150కి పైగా తెలుగు, తమిళ చలనచిత్రాలలో నటించారని వివరించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో సత్యంకు ఉన్న పరిచయంతో అసెంబ్లీ రౌడీ, పెద రాయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాలలో హాస్య,కేరెక్టర్ పాత్రల్లో నటించారన్నారు. పొట్టి సత్యం స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామం. -
ఉపాధ్యాయుడిని బలిగొన్న కొబ్బరిచెట్టు
ఆచంట: కొబ్బరి చెట్టు విరిగి మీద పడడంతో ఓ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన కోలా శ్రీనివాసరావు (45) కొవ్వూరు మండలం దొమ్మేరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సంక్రాంతి పండగను జరుపుకొనేందుకు కుటుంబసభ్యులతో కలసి స్వగ్రామం ఆచంట వచ్చారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కచేరీ సెంటర్‌కు మోటార్ బైక్‌పై వచ్చి వెళుతుండగా గ్రామచావిడిలోని కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా విరిగి ఆయనపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావు మృతితో ఆచంటలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
జగన్ రాకతో సమైక్య పోరు ఉధృతం: బోస్
చేబ్రోలు(ఉంగుటూరు): సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలిత సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2వ రోజు గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో జరుగుతున్న దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలతో నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేయటం అభినందనీయమన్నారు. 175 నియోజకవర్గంలో సమైక్యకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 2వరోజు కూడా దీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. సమైక్య కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని సీమాంధ్రులేగాక, తెలంగాణావారు కూడా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ వెంటనే విరమించుకోవాలన్నారు. సొనియా గాంధీ తన కొడుకు ప్రధాని చేయటానికే అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టారని వారు విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఉద్యమం మరింత ఊపందుకుందన్నారు. తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా వర్షం కూడా లెక్కచేయకుండా దీక్షలు చేయటం అభినందనీయమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నౌడు వెంకట రమణ మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. -
ఎమ్మెల్యే చింతమనేనికి చేదు అనుభవం
-
ఎమ్మెల్యే చింతమనేనికి చేదు అనుభవం
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురయింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్‌లో సమైక్యాంధ్ర సమరభేరీ సభ ఏర్పాటు చేశారు. సమరభేరీ సభకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వేదికపైకి రావొద్దంటూ రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘాల నేతలు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. సమైక్యాంధ్ర సమరభేరీ సభకు రైతులు భారీగా తరలివచ్చారు. రైతు సంఘాల నేతలు నాగిరెడ్డి, ఎర్నేని నాగేంద్రనాథ్, మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇటీవలే ప్రభాకర్ పై కేసు నమోదయింది. -
పులస @ రూ. 4 వేలు!
పుస్తెలమ్మై పులస తినాల్సిందే అన్నది నానుడి. వీటికున్న విశిష్టత అటువంటిది. ఎంతైనా వెచ్చించి పులస చేపల్ని కొనేందుకు మాంస ప్రియులు ఎగబడుతుంటారు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే వరదల సమయంలో గోదావరిలో పులసలు లభిస్తుంటాయి. ఈసారి కొద్దిగా ఆలస్యంగా చించినాడ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులసలు కనిపిస్తున్నాయి. కిలో చేప రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ధర పలుకుతోంది. పులస పేరు వింటేనే జనం పుల కరించిపోతారు. రాష్ట్రంలో కోస్తా తీరంలో మాత్రమే దొరికే పులస చేప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఒక్క కోస్తా నదీ తీరప్రాంతాల్లోనే లభించడంతో దీని కోసం ఈ సీజన్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల నుంచి పులసప్రియులు వచ్చి ఎంత ధరయినా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒకసారి పులస రుచి చూసిన వారు వేల రూపాయలైనా పోటీ పడి కొనుగోలు చేస్తుంటారు. దీంతో పులస చేప ధరలు ఏటేటా ఎగబాకుతున్నాయి. దీని ధరలను చుక్కలను తాకుతుండడంతో సామాన్యులకు అందకుండా పోతోంది. -
ప.గో.జిల్లాలో జగన్ దీక్షకు సంఘీభావం
సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా భీమవరం మాజీ గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో, రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. చింతలపుడి గ్రామస్తులు మోటర్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. జగన్ దీక్షకు మద్దతుగా చింతలపుడి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మద్దాల రాజేష్ చేస్తున్న దీక్ష రెండో రోజుకు చేరింది. కామవరపుకోటలో వైఎస్సార్ సీపీ నేత నెట్ట సురేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. ద్వారకాతిరుమలలో తలారి వెంకట్రావు ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. గోపాలపురంలో తానేటి వనిత దీక్షకు మద్దతుగా ఆటో యూనీయన్ సభ్యులు రాస్తారోకో జరిపారు. జగన్ దీక్షకు మద్దతుగా డున్నేరులో వైఎస్సార్ సీపీ నాయకుడు నేత ముదునూరి నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.