వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి.
సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి.
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా భీమవరం మాజీ గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో, రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. చింతలపుడి గ్రామస్తులు మోటర్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. జగన్ దీక్షకు మద్దతుగా చింతలపుడి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మద్దాల రాజేష్ చేస్తున్న దీక్ష రెండో రోజుకు చేరింది. కామవరపుకోటలో వైఎస్సార్ సీపీ నేత నెట్ట సురేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది.
ద్వారకాతిరుమలలో తలారి వెంకట్రావు ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. గోపాలపురంలో తానేటి వనిత దీక్షకు మద్దతుగా ఆటో యూనీయన్ సభ్యులు రాస్తారోకో జరిపారు. జగన్ దీక్షకు మద్దతుగా డున్నేరులో వైఎస్సార్ సీపీ నాయకుడు నేత ముదునూరి నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.