samaikyandhra agitations
-
కావూరి ఇంటిపై చింతమనేని అనుచరుల దాడి
కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్ అనుచరులు, సమైక్యవాదులు ఏలూరులోని కావూరి ఇంటిని ముట్టడించారు. వీరిని కావూరి అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమయింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు కావూరి నివాసంలోకి ప్రవేశించిన ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కలగజేసుకుని వీరిని చెదరగొట్టారు. పలువురి అదుపులోకి తీసుకున్నారు. కావూరిని అంతకుముందు కలపర్రు చెక్‌పోస్ట్ వద్ద చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో కావూరి తన ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరి ఏలూరు నగరాన్ని చేరుకున్నారు. -
'సమైక్యవాదులకు హాని చేస్తే తీవ్ర పరిణామాలు'
సమైక్యగర్జనకు వెళ్లే సమైక్యవాదులకు ఎటువంటి హాని కలిగిన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి గౌరవం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మోసగించాలనుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పండి, ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారని కాంగ్రెస్, టీడీపీలను నిలదీశారు. తమ ఏకైక ఎజెండా సమైక్యాంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు స్వార్థం వీడి ఒక ఎజెండాకు కట్టుబడాలని ఆయన కోరారు. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ జిల్లా రాయచోటిలో 6 రోజులుగా కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. గాలివీడులో విద్యార్థిసంఘం నాయకుల ఆమరణ నిరాహరదీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రాయచోటిలో పోస్టల్ సిబ్బంది 30వ రోజు గాంధీ వేషధారణలో రిలే నిరాహరదీక్ష చేపట్టారు. -
రోడ్డుపైనే 'సమైక్య' గురుపూజోత్సవాలు
ప్రకాశం జిల్లాలో సమైక్య ఉద్యమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఒంగోలులో పలు విద్యాసంస్థలు మూసివేశారు. అద్దంకి, కనిగిరిలలో బంద్ కొనసాగుతోంది. ఉలవపాడులో ఎంఈవో శివన్నారాయణ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. పొదిలిలో రోడ్డుపైనే విద్యార్థులు.. గురుపూజోత్సవాలు నిర్వహించారు. మార్టూరు జాతీయరహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర అంతటా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
ఢిల్లీలో బొత్స ప్రెస్‌మీట్ రసాభాస
-
ఢిల్లీలో బొత్స ప్రెస్‌మీట్ రసాభాస
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. విజయనగరంలో విద్యార్థులపై బొత్స అనుచరులు దౌర్జన్యం చేయడంపై సమైక్యాంధ్ర మద్దతుదారులు నిలదీశారు. ఈ దాడిని ఖండించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదానికి మద్దతుగా పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని కోరారు. దీంతో షాక్ తిన్న ఆయన తర్వాత తేరుకున్నారు. విజయనగరంలో విద్యార్థులపై దాడి గురించి తనకు తెలియదని చెప్పారు. విద్యార్థులపై దాడికి పాల్పడింది తన అనుచరులు కాదని చెప్పి సమైక్యవాదులను శాంతింపజేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కతో పోల్చడాన్ని బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబును గుంటనక్కతో పోల్చారు. మామను వెన్నుపోటు పొడిచిన బాబుకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. -
విజయవాడ జైల్‌భరో కార్యక్రమం
-
మహిళా ఎమ్మెల్యేలకు చేదుఅనుభవం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. ప్రజలే నాయకులుగా ఉద్యమం నడిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, భారీ ప్రదర్శనలతో ఆందోళనలు చేస్తున్నారు. లక్షలాది గళాలతో మహోగ్రంగా సమైక్య నినాదాలు విన్పిస్తున్నారు. తమతో కలిసిరాని ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని అడ్డుకుంటున్నారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమైక్యవాదుల సభలో బద్వేల్ ఎమ్మెల్యే కమలమ్మకు చేదు అనుభవం ఎదురయింది. సభలో ప్రసంగించొద్దని ఆమెకు సమైక్యవాదులు అడ్డుతగిలారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణిని ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకున్నాయి. రాజీనామాచేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ జయమణికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. -
జననేతకు విశాఖలో వెల్లువెత్తిన మద్దతు
-
చంద్రబాబు సీమాంధ్ర ద్రోహి: భూమన
చంద్రబాబు నాయుడు చేపట్టనున్న యాత్ర ఆత్మగౌరవ యాత్ర కాదని, ఆత్మఘోష యాత్రని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజల మనోభవాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. చంద్రబాబు సీమాంధ్ర ద్రోహి అని విమర్శించారు. ఆత్మఘోష యాత్రను తప్పి కొడతారని హెచ్చరించారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా తిరుపతితో మహిళలు చేస్తున్న రిలే దీక్షకు భూమన సంఘీభావం ప్రకటించారు. జగన్ చేస్తున్న నిరహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. జగన్ చేస్తున్న దీక్ష, వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాల పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. సీమాంధ్రను తెలంగాణలో భాగంగా ఉంచేంతవరకు తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వేర్పాటువాదులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. షర్మిల చేపట్టనున్న బస్సు యాత్రతో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతారని భూమన కరుణాకర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
జననేతకు విశాఖలో వెల్లువెత్తిన మద్దతు
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. జననేత నిరవధిక దీక్షకు సంఘీభావంగా మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో మద్దెలపాలెం వద్ద దీక్షలు జరుగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు సంఘీభావంగా మునగపాకలో యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 6వ రోజుకు చేరాయి. చోడవరంలో వైఎస్ఆర్సీపీ నేత టీవీఎస్ఎన్ రాజు ఆమరణ దీక్ష నాలుగోరోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జగన్ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని పెందుర్తి వెంకటాద్రి కొండపై స్వామివారికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, యువజన విభాగ అధ్యక్షుడు అన్నమరెడ్డి ఆదీప్ రాజు ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు, రేపు ఆటో యూనియన్లు బంద్‌కు పిలుపునివంవడంతో 16 వేల ఆటోలు రోడ్డెక్కలేదు. అనకాపల్లిలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఎన్జీవోల రిలే నిరాహార దీక్షలు అనకాపల్లిలో 19వ రోజుకు చేరాయి. -
ప్రజలను మభ్య పెట్టలేం: శైలజానాథ్
ప్రజలే నాయకులుగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఇకనైనా రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసైనా చంద్రబాబు పునరాలోచించుకోవాలి విజ్ఞప్తి చేశారు. ఓట్ల రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. గాదె వెంకటరెడ్డితో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని శైలజానాథ్ తెలిపారు. ప్రజలను మభ్య పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. మహోగ్రంగా సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతు పలకడమే తప్పా మభ్యపెట్టలేమన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం తాము మాత్రమే చిత్తశుధ్దితో ప్రయత్నిస్తున్నామని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ నిర్ణయమని, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తమ పార్టీపై ఒత్తిడి తెస్తూనేవుంటామన్నారు. -
తానేటి వనిత దీక్ష భగ్నం
వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు రోజుల దీక్ష చేస్తుండడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. బీపీ, షుగర్ లెవల్ బాగా తగ్గడంతో ఆమె నీరసించిపోయారు. అయితే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని తానేటి వనిత స్పష్టం చేశారు. మరోవైపు వనిత ఆరోగ్య పరిస్థితిపై ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, సోదరుడు విజయ్‌మోహన్ కుమార్ ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో వనిత దీక్షను పోలీసులు భగ్నం చేశారు. -
అద్వానీని కలిసిన ఏపీఎన్జీవో నేతలు
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని ఏపీఎన్జీవో నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంగళవారం ప్రధాని మన్మోమోహన్సింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని పునః పరిశీలించే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేనని, సీమాంధ్రుల విద్యా, ఉపాధి, సాగునీరు, హైదరాబాద్ అంశాలపై కేంద్ర కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర విభజన చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రధాని హామీ ఇచ్చారు. ప్రధానితో పాటు బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ, జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయను సమాజ్ వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం నేత సీతారాం యేచూరి, డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు తదితరులను కలిసి సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజాందోళనను ఏపీఎన్జీవో నేతలు వివరించారు. -
జగన్‌కు మద్దతుగా 'అనంత' దీక్షలు
-
జగన్‌కు మద్దతుగా 'అనంత' దీక్షలు
వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 48 గంటల దీక్ష చేపట్టారు. అనంతపురంలో చొవ్వ రాజశేఖరరెడ్డి, లింగాల రమేష్‌ల నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. కదిరిలో మాజీ మంత్రి షాకీర్, సుధాకర్‌రెడ్డి దీక్షలు 4వ రోజుకు చేరాయి. తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ నేత వీఆర్ రామిరెడ్డి మూడు రోజులుగా ఆమరణ దీక్ష 3వ రోజుకు చేరింది. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. రఘువీరారెడ్డి కనిపించడంలేదని ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తూ హిందూపురంలో సమైక్యవాదుల వినూత్న నిరసన చేపట్టారు. కదిరిలో నాలుగు రోజూ కొనసాగుతున్న వైఎస్ఆర్ సీపీ నేతల ఆమరణ దీక్షకు వైఎస్ వివేకానందరెడ్డి సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో ముగ్గురు కార్యకర్తలు చేస్తున్న నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. -
కర్నూలు జిల్లాలో మద్దతు దీక్షలు
జైల్లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు సంఘీభావంగా కర్నూలు జిల్లాలో మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ఆత్మకూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆమరణ దీక్ష మూడో రోజూ కొనసాగు తోంది. రాజశేఖర్‌రెడ్డికి సంఘీభావం తెలుపుతూ సీఎండీ రఫీ ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి ఆత్మకూరుకు సమైక్యవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పత్తికొండలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి 48 గంటల దీక్ష చేపట్టారు. నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డలో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలో నిన్న నిర్వహించిన లక్ష జన ఘోషకు విశేష స్పందన లభించింది. ఉద్యోగులు.. కార్మికులు.. వ్యాపారులు.. ప్రజా సంఘాలు.. అన్ని వర్గాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా సమైక్యాంధ్ర నినాదాన్ని మారుమ్రోగించారు. పల్లెలు.. పట్టణం నలుమూలల నుండి ర్యాలీగా కార్యక్రమ వేదికైన పొట్టి శ్రీరాములు కూడలికి జనం చీమల పుట్టల్లా తరలివచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. -
ప.గో.జిల్లాలో జగన్ దీక్షకు సంఘీభావం
సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా భీమవరం మాజీ గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో, రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. చింతలపుడి గ్రామస్తులు మోటర్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. జగన్ దీక్షకు మద్దతుగా చింతలపుడి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మద్దాల రాజేష్ చేస్తున్న దీక్ష రెండో రోజుకు చేరింది. కామవరపుకోటలో వైఎస్సార్ సీపీ నేత నెట్ట సురేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. ద్వారకాతిరుమలలో తలారి వెంకట్రావు ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. గోపాలపురంలో తానేటి వనిత దీక్షకు మద్దతుగా ఆటో యూనీయన్ సభ్యులు రాస్తారోకో జరిపారు. జగన్ దీక్షకు మద్దతుగా డున్నేరులో వైఎస్సార్ సీపీ నాయకుడు నేత ముదునూరి నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. -
‘సమైక్యం’కోసం సమ్మెబాట
* బుధవారం అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయుల సమ్మె * రేపు అర్ధరాత్రి నుంచి గెజిటెడ్ ఉద్యోగుల సమ్మె * గుంటూరులో జరిగిన సీమాంధ్రలోని 13 జిల్లాల అధికారుల భేటీలో నిర్ణయం * నేడు సీఎస్‌కు సమ్మె నోటీసు * సమ్మెలోకి 56 ప్రభుత్వ శాఖల అధికారులు * సీఎస్‌కు సమ్మె నోటీసిచ్చిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు * డిమాండ్ పరిష్కారానికి సెప్టెంబర్ 2 వరకు గడువు * లేదంటే అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె సాక్షి, గుంటూరు/ హైదరాబాద్: సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఎన్జీవోల బాటలోనే పలు ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పడుతున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాల ఉపాధ్యాయులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్లు గెజిటెడ్ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వచ్చే నెల రెండో తేదీలోగా వెనక్కి తీసుకోకపోతే అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి నోటీసు అందజేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన 56 ప్రభుత్వ శాఖల ప్రభుత్వ గెజిటెడ్ అధికారులు ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆఫీసర్స్ క్లబ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో నిర్వర్తించాల్సిన పాత్రపై చర్చించుకున్న అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు పిడుగు బాబూరావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ గత నెల 30న కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం నిర్మితమైందని చెప్పారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏపీఎన్జీవో, రెవెన్యూ అసోసియేషన్లకు చెందిన అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన నాన్-గెజిటెడ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిరవధిక సమ్మెలోకి దిగారని వివరించారు. వారికి మద్దతుగా సమైక్యరాష్ట్ర సాధనకోసం గెజిటెడ్ అధికారులుగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు నిరవధిక సమ్మెకు సన్నద్ధమయ్యామని తెలిపారు. ఇప్పటికే సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో అదనపు సంయుక్త కలెక్టర్ల సారధ్యంలో డీఆర్వోల అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీల ద్వారా గెజిటెడ్ అధికారులను సమ్మెకు సమాయత్తం చేశామనీ, ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోకుండా చేయడమే తమ లక్ష్యమని వివరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా ఇతర అధికారులెవ్వరూ ప్రభుత్వ విధుల్లో పాల్గొనే అవకాశం లేదని తేల్చిచెప్పారు. వాణిజ్యపన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు వాటిల్లే నష్టం ఊహించజాలమని, ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వానికి వాణిజ్య పన్నులద్వారా ఏటా రూ.42వేల కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో రూ.27వేల కోట్లు ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌తో పాటు అన్నిశాఖల అధిపతులకు గురువారం ఉదయం 11 గంటలకు సమ్మె నోటీసు ఇస్తున్నామని, సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకూ నిరవధిక సమ్మెలోనే ఉంటామని స్పష్టం చేశారు. 13 జిల్లాల నుంచి సమావేశానికి హాజరైన గెజిటెడ్ అధికారులు చేతులు కలిపి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మేకా రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు, కార్యదర్శి ధర్మచంద్రారెడ్డి, సహాయ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పులిపాక రాణి, కడప డీటీసీ కృష్ణవేణి, భూ పరిపాలన డిప్యూటీ కలెక్టర్ ఎ.ప్రభావతి, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు కె.వెంకయ్య, వివిధ జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లు, కమిషనర్లు, గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె నోటీసు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి నోటీసు అందజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల రెండో తేదీలోగా వెనక్కి తీసుకోవాలని గడువు విధించారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే.. అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. సీఎస్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం ఫోరం నాయకులు కేవీ కృష్ణయ్య, మురళీమోహన్‌తో కలిసి చైర్మన్ యు.మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ... తమ డిమాండ్ పరిష్కారమయ్యేంతవరకూ ఎన్ని నెలలైనా సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. తమను వలసవాదులని సంబోధిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె ఎలా చేపడతారని రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తమ న్యాయవాదులు ధర్మాసనానికి వివరణ ఇస్తారని తెలిపారు. కొనసాగిన నిరసన విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కూడా సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి సచివాలయంలో నిరసన కొనసాగించారు. ఎల్ బ్లాక్ వద్ద ధర్నా చేసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ఎదురుగా బైఠాయించి.. తాము వలసవాదులం కాదని, సమైక్యవాదులమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేడు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల రక్తదాన శిబిరం రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలో భాగంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నేడు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో సచివాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఫోరం కార్యదర్శి కె.వి కృష్ణయ్య తెలిపారు. -
మూడు వారాలుగా హోరెత్తుతున్న పోరు
-
ఆకేపాటి దీక్ష భగ్నం
రాజంపేట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను ఏడో రోజైన మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు. డీఎస్పీ జయచంద్రుడు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు దీక్షా శిబిరం వద్ద మోహరించారు. శిబిరంలోకి ప్రవేశించగానే అక్కడే ఉన్న కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. తోపులాట చోటుచేసుకుంది. 15 నిమిషాలపాటు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వ్యూహం ప్రకారం దీక్షను భగ్నం చేశారు. 108 వాహనంలో ఎమ్మెల్యేను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీక్షను కొనసాగిస్తా.. సమైక్యాంధ్ర కోసం తాను చేపట్టిన ఆమరణ దీక్షను ఆస్పత్రిలో కూడా కొనసాగిస్తానని అమరనాథరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానులు సహనం పాటించాలని కోరారు. ఏడో రోజూ... కొరముట్ల నిరశన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ దీక్ష ఏడో రోజూ కొనసాగింది. పెద్దఎత్తున ప్రజలతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు, అన్నిసంఘాల వారు తరలివచ్చి కొరముట్లకు తమ మద్దతు ప్రకటించారు. షుగర్, బీపీ లెవెల్స్ తగ్గడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అందోళన చెందుతున్నాయి. వీరి దీక్షలకు డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, నేషనల్ టూరిజం డెరైక్టర్ సురేంద్రకుమార్ సంఘీభావం తెలిపారు. -
సమైక్య ఉప్పెన
* మూడు వారాలుగా హోరెత్తుతున్న పోరు * కొనసాగుతున్న సకలం బంద్ * రోజురోజుకీ బలపడుతున్న నినాదం... సమైక్యాంధ్రప్రదేశ్ సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న దరిమిలా ఎగసిన సమైక్య ఉద్యమం మూడువారాలైనా సడలని దీక్షతో ముందుకు సాగుతోంది. అన్నివర్గాల జన భాగస్వామ్యంతో రోజురోజుకూ బలపడుతూ పతాకస్థాయికి చేరుతోంది. సకలం బంద్‌తో జీవనం స్తంభిస్తున్నా జనం లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు. మంగళవారం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఎటు చూసినా ఉద్యమవాతావరణమే కనిపించింది. ఎక్కడికక్కడ రోడ్ల దిగ్బంధం ఏపీఎన్జీవోల పిలుపు మేరకు సమైక్యవాదులు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో రోడ్లను దిగ్బంధం చేశారు. ముఖ్యంగా జాతీయరహదారులపై గంటల తరబడి ందోళనలు చేపడ్డటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడలో రామవరప్పాడు, గొల్లపూడి, కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ వద్ద రోడ్లను దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జగ్గయ్యపేటలో అనుమంచిపల్లి గ్రామ సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగ, ఎన్జీవో, ఉపాధ్యాయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, తేలప్రోలులో జాతీయ రహదారిపై కబడ్డీ ఆడారు. మైలవరంలో మానవహారం ఏర్పాటు చేశారు. ఎడ్ల బళ్లతో ప్రదర్శన ఉయ్యూరులో రైతులు కేసీపీ కర్మాగారం నుంచి వీరమ్మ తల్లి ఆలయం వరకు 200 ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రధాన సెంటర్లో బళ్లతో మానవహారంగా ఏర్పడి రహదారులను దిగ్బంధించడంతో రాకపోకలు స్తంభించాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో 300 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం నుంచి విశాఖ, పాలకొండ, సాలూరు వెళ్లే జాతీయ రహదారులను దిగ్బంధించి, వంటా- వార్పు చేపట్టారు. వికలాంగుల రాస్తారోకో విశాఖపట్నం శ్రీహరిపురంలో వికలాంగులు రాస్తారోకో చేపట్టారు. జి.మాడుగుల మండలం వై.బి.గొండూరు ప్రధానోపాధ్యాయుడు వరహాలరాజు సమైక్యాంధ్ర మద్దతుగా స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తగరపువలస గోస్తనీ నదిలో వైఎస్సార్ సీపీ నేత విజయనిర్మల వరినాట్లు నాటుతూ నిరసన తెలిపారు. అర్చకుల దీక్షలు సింహాచలం దేవాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గురు అర్చకులు, ఆరుగురు ఉద్యోగులు రిలేదీక్షలు ప్రారంభించారు. జీవీఎంసీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. కోర్టుకు తాళాలు విశాఖజిల్లా కోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోర్టుకు తాళాలు వేసి జీవీ ఎంసీ కార్యాలయం జంక్షన్‌వరకు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు,ఎన్జీఓలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు రాస్తారోకోలు,వంటావార్పు, మానవహారాలతో నిరసనలను హోరెత్తించారు. ఎన్‌జీఓసంఘం బుజబుజ నెల్లూరు జాతీయ రహదారిని దిగ్బంధించింది. జాతీయ రహదారిపై జన గోదావరి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జేఏసీ, కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయరహదారి దిగ్బంధంలో వేలాదిమంది సమైక్యవాదులు పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన సమైక్యవాదులు రావులపాలెం చేరుకునిహైవేపై ఆందోళన చేపట్టారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని ఇంటిగ్రేడెట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం కార్యాలయం బంద్ పాటించకపోవడంతో సమైక్యవాదులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 121 శివాలాయల్లో ఏకకాలంలో రుద్రాభిషేకాలు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో కోనసీమలో 121 శివాలయాల్లో రుద్రాభిషేకాలు ఏకకాలంలో నిర్వహించారు. సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను చాటుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం జగ్గంపేట నియోజకవర్గంలో కొనసాగింది. వాహనాలను తుడిచి న్యాయవాదుల నిరసన సమ్మెలోభాగంగా విధులను బహిష్కరించిన న్యాయవాదులు ఏలూరులో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను చేతిరుమాళ్లతో తుడిచి నిరసన తెలిపారు. ఏలూరు నగరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో వేలాదిమంది విద్యార్థులు రోడ్లపైకొచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. ఆదోనిలో రహదారుల దిగ్బంధం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదురు రోడ్డుపై వంటా-వార్పు, గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆర్టీసీ కార్మికులు దున్నపోతుల ప్రదర్శన నిర్వహించారు. అనంతలో పోలీస్‌స్టేషన్ ముట్టడి బైండోవర్లు, అక్రమ అరెస్టులను నిరసిస్తూ భారీసంఖ్యలో న్యాయవాదులు, విద్యార్థులు అనంతపురంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించి, ధర్నా చేశారు. ఎస్కేయూలో విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉరవకొండలో స్వర్ణకారులు రోడ్డుపైనే పని చేసి.. నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో 10 వేల మంది విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించారు. రాజంపేటలో 300 ట్రాక్టర్లతో యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు ర్యాలీలో వంగపండు ఉష పాల్గొని ఆటపాటలతో అలరించారు. విద్యార్థుల సింహగర్జన తిరుపతిలో శాప్స్ ఆధ్వర్యంలో 15 వేల మంది విద్యార్థులతో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ పాల్గొని ఉద్యమ పాటలతో జనాన్ని ఉత్తేజపరచారు. ఏపీపీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. పీలేరులో 10వేల మంది విద్యార్థులతో భారీర్యాలీ నిర్వహించారు. మదనపల్లెలో చెవిటి, మూగ, వికలాంగులు గుండు గీయించుకుని నిరసన తెలియజేశారు. ‘విభజన’ మనస్తాపంతో 9 మంది మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్: రాష్ట్ర విభజనపై ఆందోళనతో మంగళవారం మరో తొమ్మిది మంది తనువు చాలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గంగుల నాగ వెంకట కృష్ణ (48), భీమడోలులోని కౌలురైతు సుతాని వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న (55), ఉంగుటూరు మండలం గోపాలపురం శివారు పందిరెడ్డిగూడెంకు చెందిన కూలీ రాజాని అచ్చియ్య (55), కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి గ్రామానికి చెందిన వెంకట్రాముడు (48), తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మెడబల రామారావు (50), పి. గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు పెచ్చెట్టి సూర్యారావు (63), అంబాజీపేట మండలం మొసళ్లపల్లికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు బొక్కా రామకృష్ణ (43), అనంతపురం జిల్లా ఎన్పీ కుంటలో నరసయ్య (60), ఎగువతూపల్లిలో మద్దిపోగులు గంగన్న(58)లు గుండెపోటుతో మృతి చెందారు. -
‘సమైక్య’ ప్రకటన వెలువడే వరకూ సమ్మె
-
కేంద్రం నుంచి ‘సమైక్య’ ప్రకటన వెలువడే వరకూ సమ్మె
* ఏపీఎన్జీవోల సంఘం స్పష్టీకరణ * 19 నుంచి దశల వారీగా ఉద్యమాలు * త్వరలో హైదరాబాద్‌లో సమైక్య మహాసభ * కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాల్సిందే * ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడిపితే అడ్డుకుంటాం * సమ్మెలోకి అనేక ఇతర ఉద్యోగ సంఘాలు సాక్షి, గుంటూరు/హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కానుంది. సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకుని కేంద్రం సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన చేసే వరకూ సీమాంధ్రలో సమ్మె కొనసాగుతూనే ఉంటుందని ఏపీఎన్జీవోలు ప్రకటించారు. కేంద్రం దిగి రాకుంటే దిగొచ్చేలా ఆందోళనా కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటం తరువాత ఆ స్థాయిలో అన్ని జిల్లాల్లో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమాలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సంఘం నేతలు పేర్కొన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. శుక్రవారం గుంటూరులోని ఎన్జీవో హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో సమైక్య జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ఎన్జీవో సంఘ నేతలు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ జరిగిన భేటీలో నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబుతో పాటు వివిధ విభాగాల ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని సమావేశం తీర్మానించిందని తెలిపారు. ర్యాలీలు.. రోడ్ల దిగ్బంధం ఈ నెల 19 మొదలు వివిధ రకాల ఆందోళనలు నిర్వహించనున్నామని అశోక్‌బాబు చెప్పారు. 19న అన్ని జిల్లాల్లోనూ భారీ నిరసన ర్యాలీలు జరుగుతాయన్నారు. 20న ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ ఉన్న అన్ని రహదారుల్ని పూర్తిస్థాయిలో నిర్బంధిస్తామని, ఎన్జీవోలు రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు నిర్వహిస్తారని తెలిపారు. 21న ఉదయం 10-11 గంటల మధ్య అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ‘జై సమాక్యాంధ్ర’ నినాదంతో మానవహారాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య ఆయా జిల్లాల్లో కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 22, 23 తేదీల్లో రిలేదీక్షలు జరుగుతాయనీ, మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో మూడంచెలుగా ఈ దీక్షల్ని నిర్వహించేందుకు తీర్మానం చేశామని వివరించారు. 24 నుంచి నెలాఖరు వరకూ జరిగే వివిధ రకాల నిరసన కార్యక్రమాలు, ఆందోళనల్లో ఎన్జీవోల కుటుంబసభ్యులు, బంధువుల్ని కూడా భాగస్వాముల్ని చేయనున్నామన్నారు. త్వరలో ‘హైదరాబాద్ మనది’ రాజధాని నడిబొడ్డున ‘హైదరాబాద్ మనది’ అన్న నినాదంతో త్వరలో భారీ సమైక్య సదస్సును నిర్వహిస్తామని అశోక్‌బాబు తెలిపారు. దీనికంటే ముందు శ్రామికవర్గాలతో ప్రత్యేక అవగాహన సభను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సదస్సు పెట్టి తీరతామని తేల్చిచెప్పారు. తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో మంచి ఆదరణ ఉండేలా చూస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు సమైక్య వాదంతో పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సులు నడిపితే సహించం తిరుపతిలో కొందరు ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తిరుమల కొండపైకి బస్సులు నడిపేలా బెదిరింపులకు దిగుతున్నారనీ, దీన్ని ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చేందుకు ప్రత్యేక జీవో జారీ చేసిందని, దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడిపితే శనివారం నుంచి అడ్డుకుంటామని అశోక్‌బాబు హెచ్చరించారు. 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ప్రత్యేక ఫోరంగా ఏర్పడి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమయ్యార ని తెలిపారు. ఆంటోనీ కమిటీ చర్చల కోసం ఢిల్లీ రమ్మని పిలిస్తే అన్ని సంఘాలను పిలవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ, కోస్తా జిల్లాల్లో ప్రైవేటు ఆపరేటర్ల లాబీయింగ్ ఎక్కువగా ఉంటుందనీ, లాభాపేక్షతో ఎవరైనా బస్సులు నడిపితే సహించబోమని హెచ్చరించారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందే విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణాయాదవ్ మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసి ఉద్యమంలోనికి రావాల్సిందేనన్నారు. లేకుంటే వారిళ్ల ముందే వారి దిష్టిబొమ్మల్ని తగులబెడతామన్నారు. ఇంకా అవసరమైతే వారికి బొందబెట్టి వారి స్థానంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో జరిగే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇప్పటివరకు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడిన తాము ఇకపై ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడతామన్నారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సంఘ ప్రతినిధి శ్యాంసుందర్ మాట్లాడుతూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సమ్మెలోనికి వెళ్తున్నట్లుగా శుక్రవారం మేనేజ్మెంట్కు నోటీసు ఇచ్చామన్నారు. శనివారం నుంచి రాష్ట్రంలోని 58,850 మంది గెజిటెడ్ అధికారులు సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి కృష్ణమోహన్‌రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత గోపరాజు, ఏపీ గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు బషీర్, కోశాధికారి వీరేంద్రబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 2 నుంచి ‘విద్యుత్’నిరవధిక సమ్మె రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు సమైక్య ఆంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఎస్‌ఏవీఈ (సేవ్) జేఏసీ 29) ప్రకటించింది. ట్రాన్స్‌కో, జెన్కోతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్లలో సమ్మెకు దిగనున్నట్టు సేవ్ జేఏసీ చైర్మన్ ఆర్.సాయిబాబా, కన్వీనర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాతో పాటు జెన్కో ఎండీ విజయానంద్‌కు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు నర్సింహులు, రవిశంకర్, మురళీకృష్ణారెడ్డి, ప్రత్యూష, అనురాధ, సముద్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం దశలవారీగా ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. ఈ నెల 17, 18వ తేదీల్లో ప్రధాన కార్యాలయాల వద్ద ర్యాలీలు చేపడతారు. 19, 20, 21 తేదీల్లో జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బైకు ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో రాస్తారోకోలు, 25న జిల్లా కేంద్రాల్లో వంటావార్పు, 26 నుంచి 28 వరకూ మౌన ప్రదర్శనలు నిర్వహిస్తారు. 29 నుంచి 31వ తేదీ వరకు రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని, సెప్టెంబర్ 1న వంటావార్పు చేపడతామని జేఏసీ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. రవాణా చెక్‌పోస్టులు బంద్ రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆర్టీఓలు అడ్హాక్ కమిటీగా ఏర్పడి సీమాంధ్రలోని చెక్‌పోస్టులన్నింటినీ బంద్ చేయాలని నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్ జె.రమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని ఎనిమిది చెక్‌పోస్టులు మూతపడ్డాయని తెలిపారు. శుక్రవారం నుంచి సీమాంధ్రలో ఉన్న 300 మంది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, 15 మంది ఆర్టీఓలు నిరవధిక సమ్మెకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా కందుకూరు ఎంవీఐ డీవీ రావు నియమితులయ్యారు. రేపు అర్ధరాత్రి నుంచి న్యాయశాఖ ఉద్యోగుల సమ్మె ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్ర జిల్లాలోని న్యాయశాఖ ఉద్యోగులంతా సమ్మెకు దిగుతున్నట్లు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.వై.నరసింహం తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టుకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు ఆయన శుక్రవారం విశాఖపట్నంలో వెల్లడించారు. నేడు లైట్లు ఆర్పి నిరసన సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన తెలుపాలని జేఏసీ చైర్మన్ సాయిబాబా ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేంతవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. -
మంత్రులకు సమైక్య సెగ
సాక్షి, నెట్వర్క్: స్వాతంత్య్రదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రులకు చుక్కెదురైంది. గురువారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలకు హాజరైన మంత్రులను సమైక్యాంధ్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. అనంతపురంలో పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డిని న్యాయవాదులు అడ్డుకున్నారు. గోబ్యాక్ రఘువీరా.. అంటూ నినదించిన వారు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని అడ్డుతగిలారు. దీం తో న్యాయవాదులును పోలీసులు అరెస్టు చేశారు. అ యితే పోలీసు రక్షణలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న రఘువీరా.. జెండా ఎగురవేసి, ప్రసంగించే సమయం లో ఎమ్మెల్యే గురునాథరెడ్డి అడ్డుతగిలారు. పరేడ్ గ్రౌండ్లోకి ప్రజలను రానివ్వకుండా నియంత్రించి, స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారని మంత్రిని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఎంపీ అనంత వెంకటరామిరెడ్డినీ ఆయన నిలదీశారు. మంత్రి రఘువీరా, ఎంపీ అనంతల తీరుకు నిరసనగా నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్లో మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండగా ఎన్ఎంయూ నేతలు ఆయనకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. గంటా..గో బ్యాక్, బొత్స, సోని యా చేతగాని నేతలు అంటూ ఆందోళన చేశారు. విగ్రహానికి పూలమాల వేసే సమయంలోనూ ఆందోళనకు దిగారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న ఉద్యో గ సంఘాలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీ జి.వి.హర్షకుమార్‌ను సమైక్యవాదులు నిలదీ శారు. విభజన గురించి ముందే తెలిసినా ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నించారు. కనీసం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్దయినా నిరసన తెలపలేదని నిలదీశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని జంతర్‌మంతర్‌కు బదులు పార్లమెంట్ వద్ద నిరసన తెలిపామని హర్షకుమార్ తెలిపారు. -
విభజన భయంతో.. ఆగని మరణాలు
చిత్తూరు జిల్లాలో పీజీ విద్యార్థి ఆత్మహత్య గుండెపోటుతో ఆరుగురి మృతి సాక్షి, నెట్వర్క్: రాష్ట్రాన్ని విభజిస్తారనే భయంతో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం సమైక్యాంధ్ర కోరుతూ చిత్తూరు జిల్లాలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నం చేశారు. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం పెరిందేశం దళితవాడకు చెందిన జే.పోతురాజు (22) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పదిరోజులుగా స్వగ్రామంలో ఉండే సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట చిరునగర్కు చెందిన ఆటో ఎలక్ట్రిషియన్ గడ్డం రామారావు (58), పశ్చిమగోదావరి నరసాపురం మండలం చామకూరిపాలెంకు చెందిన చామకూరి కోటేశ్వరరావు (40), మొగల్తూరు మండలం కాటంవారితోటకు చెందిన కాటం పండుబాబు (48), కొయ్యలగూడెం మండలం పరింపూడి గ్రామానికి చెందిన చౌటుపల్లి నాగేశ్వరరావు(54), కొవ్వూరులోని మూడు డాబాల వీధిలో నివాసం ఉంటున్న తెలుగు ఉపాధ్యాయుడు గండికోట వెంకట గౌరీ శంకర్ (52), నిడదవోలు మండలం కోరుమామిడి వెంకటేశ్వరరావు(42) రాష్ర్టం విడిపోతుందేమోనని మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతిచెందారు. విభ‘జనాందోళన’ చూస్తూ హఠాన్మరణం కొడుకు మృతి వార్త విని ఆగిన తండ్రి గుండె సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలను టీవీలో వీక్షిస్తూ విజయవాడ భవానీపురం కరకట్ట సమీపంలో నివసించే జాలా సురేష్ (39) హఠాన్మరణం చెందాడు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే ఈయన ఆదివారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నాడు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సోమవారం నాటి ఆందోళన కార్యక్రమాలపై చర్చించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ టీవీలో వార్తలను చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ వార్త తెలిసిన వెంటనే సురేష్ తండ్రి జాలా వెంకటేశ్వరరావు అలియాస్ ఏసోబు (70) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
జన నినాదమై... ఉవ్వెత్తున సమైక్య సమరం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రనే శ్వాసిస్తూ, ధ్యానిస్తూ జన నినాదమై ఉద్యమం సీమాంధ్రలో వెల్లువెత్తుతోంది. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు, మారుమూల పల్లెలు అన్నీ ఒక్కటై సమైక్యమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నాయి. కులాలు, మతాలు, శ్రామిక వర్గాల వారీగా ప్రజలు విభజనయత్నాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. స్వచ్ఛందంగా వివిధ రూపాల్లో ఆందోళనలను హోరెత్తిస్తున్నారు. వరుసగా ఎనిమిదో రోజైన బుధవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థల మూత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు తోడుగా ప్రైవేటురంగంలోని ఉద్యోగులందరూ సమైక్యపోరాటంలో భాగస్వాములవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన 72గంటల పెన్‌డౌన్ బుధవారంతో ముగిసింది. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి. గోదావరి తీరాన 300కుటుంబాల నిరాహారదీక్ష రాజమండ్రి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 300కుటుంబాలు నిరాహార దీక్షలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కాకినాడలో జర్నలిస్టు వారణాసి సాయిపెరుమాళ్లు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారు. గుంటూరులో ఏపీఎన్జీవో జేఏసీ పిలుపు మేరకు అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు గుంటూరు-విజయవాడ హైవేపై రాస్తారోకో చే శారు. నడిరోడ్డుపై ముస్లింల ప్రార్ధన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వేలాదిమంది ముస్లింలు మసీదుల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. సోనియా మనసు మార్చి రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాలని నడిరోడ్డుపై ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కర్నూలులో పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో సుమారు 500మంది సభ్యులు వెంకటరమణ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై యోగాసనాలతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. మేముసైతమంటూ అంధుల ర్యాలీ తిరుపతిలో అంధులు భారీ ర్యాలీ నిర్వహించారు. కపిలితీర్థం నుంచి లీలామహల్ కూడలి, మున్సిపల్ కార్పొరేషన్, నాలుగుకాళ్ల మంటపం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకు సుమారు 7 కిలోమీటర్ల దూరం నడిచి సమైక్యనినాదాలతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే షాపులను మూయించి బంద్ నిర్వహించారు. పరకాల ప్రభాకర్ బుధవారం మదనపల్లి నుంచి బస్సుయాత్రను కొనసాగించారు. సినిమా థియేటర్లమూత కృష్ణా జిల్లాలో ఫిలింఛాంబర్ నేతృత్వంలో ఎగ్జిబిటర్లు బుధవారం బంద్ పాటించి జిల్లా మొత్తం సినిమా థియేటర్లు మూసివేశారు. విజయవాడలో భారీ ప్రదర్శన చేపట్టారు. నాలుగురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు బుధవారం రాత్రి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉయ్యూరులో రైతులు ఎడ్లబళ్లతో ప్రదర్శన చేశారు. గుడివాడలో నడిరోడ్డుపై నాట్లు వేశారు. సమ్మెకు తామూసిద్ధమన్న ఎంపీడీవోలు ఈ నెల 12 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు హరిహరనాధ్ విజయవాడలో ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న జిల్లా న్యాయమూర్తి ఎ.రాధాకృష్ణ వాహనాన్ని అడ్డగించారు. ఒంగోలు నగరంలో పదివేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై చేసిన రాస్తారోకోతో రాకపోకలు స్తంభించాయి. పదివేలమంది ఉద్యోగుల భారీ ప్రదర్శన అనంతపురం నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు పది వేల మంది ఉద్యోగులతో ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐదు వేల మంది మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్య ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధ్వర్యంలో పీఆర్టీయూ నాయకులు శ్రీకాకుళంలో సమావేశమై సమైక్య రాష్ట్ర సాధన కోసం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్య ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎచ్చెర్లలోని బీఆర్ అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు హౌరా-చెన్నై జాతీయ రహదారిపై హోమం నిర్వహించి, రహదారిని దిగ్బంధించడంతో సుమారు పది కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రణస్థలం, నరసన్నపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లోనూ రాస్తారోకోలునిర్వహించారు. విజయనగరంలో ఉద్యోగులు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేలుతున్న స్లో ‘గన్స్’ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేస్తున్న నిరసనల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు, ఫ్లెక్సీలపై ఆందోళనకారులు రాసి, ప్రదర్శిస్తున్న నినాదాలు, వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను ఎండగడ్తూ చిత్రించిన, రూపొందించిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గత వారం రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనకారులు ప్రదర్శించిన ప్లకార్లుల్లోని నినాదాలు, వాల్‌పోస్టర్లలోని వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని.... విభజనకు ముందు దర్జా... ఆ తర్వాత బికారి సమైక్యాంధ్రలో కుర్చీలో దర్జాగా ఉన్న కేసీఆర్.. విభజన జరిగితే బికారిగా మారతారంటూ రూపొందించిన ఫ్లైక్సీ అనంతపురం నగరంలో వెలిసింది. నాకు నచ్చని పదం రాజీనామా సినిమాల్లో చిరంజీవి డైలాగులను పేరడీ చేస్తూ విజయవాడలో ప్లకార్డులు ప్రదర్శించారు. నాకు తెలుగుభాషలో నచ్చనిది ఒకే ఒక్క పదం ‘రాజీనామా’ అంటూ ఠాగూర్ సినిమాలో డైలాగ్‌ను, నా ఇంటి ముందు ధర్నా చేయమని ముగ్గురికి చెప్పండి.. వారు ముగ్గురికి చెబుతారు.. వారు మరో ముగ్గురికి చెబుతారు.. అంటూ స్టాలిన్ సినిమాలో డైలాగ్‌ను పేర డీ చేశారు. బొత్స ఆచూకీ చెప్పండి ‘‘విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వెతుక్కుంటూ వెళ్లి తప్పిపోయారు. ఆచూకీ తెలిసిన వారు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యకర్తలకు తెలియజేయాలి.’’ అంటూ విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో వాల్‌పోస్టర్ అంటించారు. తెలుగుతల్లికి సోనియా తూట్లు తెలుగు తల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రదర్శించింది. రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ చిరంజీవి, బొత్స, గంటాశ్రీనివాసరావులను కోతి బొమ్మలుగా చిత్రీకరించినబ్యానర్‌ను తెలుగుశక్తి నేతలు విశాఖపట్నంలో ఊరేగించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పాము.. చిరు చీటింగ్ జీవి... చెన్నైలో అవార్డులు సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై మైలాపూర్‌లో తెలుగు సంఘాలు బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యంగ్యోక్తులతో అవార్డులను ప్రకటించారు. సోనియాకు ‘విభజన విధ్వంస స్వరూపిణి’, కేసీఆర్‌కు ‘ఫామ్ హౌస్ పాము’, చిరంజీవికి ‘చీటింగ్ జీవి’, పురంధేశ్వరికి ‘పితృ ఆత్మక్షోభకారిణి’, సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ‘సోనియా పెట్స్’, కాంగ్రెస్ అధిష్టానానికి ‘అష్టదరిద్ర స్థానం’ అవార్డులను ప్రకటించారు. తొమ్మిదిమందిని మింగిన ‘విభజన’ ఒకరి ఆత్మహత్య.. గుండెపోటుతో 8 మంది.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణించుకోలేక బుధవారం ఒక్కరోజే 8 మంది గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో పెయింటర్ దిడుమర్తి రాజీవ్‌గాంధీ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం గ్రామానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో కర్రి నాగరాజు(35), అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన రంగప్ప (45), రాయదుర్గం మండలంలోని జుంజరంపల్లికి చెందిన అచ్చెల్లి మాబు(35) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాష్ట్ర విభజనపై వస్తున్న వార్తలను టీవీలో వీక్షిస్తూ కర్నూలు జిల్లా అవుకు మండల పరిధిలోని రాఘవరాజపురానికి చెందిన బూరుగుల నాగేష్ బుధవారం గుండెపోటుతో మరణించాడు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో చంద్రమౌళి నాయుడు (55) సమైక్య ఉద్యమాలను టీవీలో చూస్తూ కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు రుయాకు తరలించగా చికిత్సపొం దుతూ మరణించాడు. సత్యవేడులో బాలాజీ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన కిషోర్ బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమైక్య ద్రోహులకు కుంభీపాకం శిక్ష విజయనగరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో సోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను మరుగుతున్న నూనెలో దించి కుంభీపాకం శిక్ష విధించారు. -
సీమాంధ్ర ఉద్యమ ప్రభంజనం
చేయి... చేయి కలిపి జన తరంగం ఉవ్వెత్తున ఎగసింది... గొంతు గొంతు కలిసి ప్రళయ గర్జన ప్రతిధ్వనించింది... చినుకు...చినుకు ప్రభంజనమై... సీమాంధ్ర అట్టుడుకుతోంది విభజన ఊసే భరించలేని జనం వీధికెక్కి ఉద్యమిస్తున్నారు సాక్షి నెట్వర్క్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. నిన్నమొన్నటి వరకు ఎక్కువగా రాజకీయపక్షాలు, యువత నుంచే వ్యక్తమైన నిరసనలు ఇప్పుడు అన్నివర్గాల ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని శాఖల ఉద్యోగులు వేర్పాటుకు నిరసనగా ఉద్యమబాట పట్టారు. వరుసగా ఏడవ రోజైన మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయూలు మూతపడ్డాయి. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన పెన్‌డౌన్ రెండోరోజుకు చేరుకుంది. రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలతో అన్నిచోట్లా నిరసనజ్వాలలు మిన్నంటాయి. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై జనాగ్రహం కొనసాగుతోంది. సోనియాగాంధీ, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, చిరంజీవిల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు అన్నిచోట్లా హోరెత్తాయి. మంత్రి పార్ధసారథీ ఇవిగో గాజులు ...వీటిని వేసుకొని ఇంట్లో కూర్చో అంటూ మహిళా ఉద్యోగులు విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏలూరు మోతేవారి తోటలోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయూన్ని ఎన్జీవోలు ముట్టడించారు. నెల్లూరు నగరంలో నిరసనకారులు మూడు గాడిదలకు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ బొమ్మలను కట్టి ఊరేగించారు. విజయనగరం జిల్లా కురుపాంలో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఇంటిని 30 మంది హిజ్రాలు ముట్టడించారు. విజయనగరంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటిని ఎన్జీవోలు ముట్టడించారు. పోటెత్తిన పురోహితుల నిరసనలు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వసంతమహల్ సెంటర్లో అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో చండీయాగం, పాలకొల్లులో రోడ్డుపై పురోహితులు హోమం నిర్వహించారు. తణుకు నరేంద్ర సెంటర్లో బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శాంతి హామం నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విభజన ప్రక్రియ నిలిచిపోవాలని ఆకాంక్షించారు. రాజమండ్రిలో పురోహితులు, బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద శాంతిహోమం, గణపతి హోమం, మహిళా శక్తి సంఘాల సభ్యులు ర్యాలీ నిర్వహించారు. బ్రాహ్మణసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు, శంకర్‌విలాస్ సెంటర్లో శాంతి హోమం చేశారు. హైదరాబాద్ నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఏలూరులో మెకానిక్‌లు, స్వర్ణకారులు ర్యాలీలు చేపట్టారు. నాగవంశం సంక్షేమ సంఘం, అర్చకుల సమాఖ్యల ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు అందాల రాకాసి చిత్రం షూటింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. కొవ్వూరులో సినీన టుడు మాగంటి మురళీ మోహన్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నేతలు పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంతో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై ట్రాక్టర్లు నిలిపి రాస్తారోకో నిర్వహించారు. ‘తూర్పు’ న స్తంభించిన వర్తక వాణిజ్యాలు రాజమండ్రి, కాకినాడల్లో సుమారు రూ.55 నుంచి రూ.65 కోట్ల మేర బ్యాంకింగ్, వర్తక లావాదేవీలు స్తంభించాయి. 300పైగా ఏటీఎంలు, 100కు పైగా బ్యాంకు శాఖలు గత వారం రోజులుగా పనిచేయడం లేదు. అనంతపురం జిల్లా జేఎన్టీయూ(ఏ)లో పీజీ సెట్‌ను సమైక్యవాదులు అడ్డుకోవడంతో సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి ప్రకటించారు. వైఎస్సార్సీపీ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం రైల్వేస్టేషన్లో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు. పెద్దపప్పూరు మండలం అమళ్లదిన్నెకు చెందిన వ్యవసాయ కూలీ కుళ్లాయప్ప తాడిపత్రిలోని దీక్షా శిబిరానికి వచ్చి.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తాడిపత్రిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో 11వ తేదీ వరకు స్వచ్చందంగా పాఠశాలల బంద్ చేపట్టాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. బెజవాడలో మరోవారం విద్యాసంస్థలు బంద్ విజయవాడలో మరో వారంరోజులపాటు కళాశాలలకు సెలవు ప్రకటించారు. కార్పొరేషన్ ఉద్యోగులు తమ 72 గంటల ఆందోళనలో భాగంగా రెండోరోజు కూడా విధులను బహిష్కరించారు. కేసీఆర్ ఇంట్లో బట్టలు ఉతకరాదని రజకులు బెజవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులకు నిప్పు తిరుపతి, చిత్తూరులో ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు. మరో నాలుగు ప్రైవేటు బస్సులను ధ్వంసం చేశారు. మదనపల్లె మల్లికార్జున కూడలిలో నారాయణ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు ఆమరణ నిరాహారదీక్షను భగ్నం చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. పరకాల ప్రభాకర్ మంగళవారం తిరుపతి నుంచి బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ రహదారిపై రెండుగంటల పాటు రాస్తారోకో చేపట్టారు. రిటైర్డ్ డీజీపీ హెచ్.జె.దొర కారును అడ్డుకున్నారు. పలాసలో తహశీల్దార్ కార్యాలయానికి సమైక్యవాదులు తాళం వేశారు. కర్నూలులో జాతీయ రహదారుల దిగ్బంధం వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో నంద్యాల-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారులను ఉద్యమకారులు దిగ్బంధించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పదివేల మందికి పైగా సమైక్యవాదులు జాతీయ రహదారిపై నినదించారు. దీంతో కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. 12న విశాఖలో సింహగర్జన.. 18న బీచ్‌రోడ్డులో మిలియన్ మార్చ్ విభజనయత్నాలను నిరసిస్తూ ఈనెల 12న విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో లక్ష మందితో సింహగర్జన పేరిట భారీబహిరంగసభ నిర్వహించనున్నట్టు ఏయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ లగుడు గోవింద్ ప్రకటించారు. అదేవిధంగా 18న బీచ్‌రోడ్డులో లక్షమందితో మిలియన్ మార్చ్ కూడా నిర్వహిస్తామని ఆయన మంగళవారం విశాఖనగరంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. వెంకన్నకూ ‘వేర్పాటు’ ఎఫెక్ట్ తిరుమల వెలవెల.. ఐదుగంటల్లోనే శ్రీవారి దర్శనం సాక్షి, తిరుమల : సీమాంధ్ర బంద్ ప్రభావంతో మంగళవారం తిరుమల కొండ ఖాళీ అయింది. కేవలం ఐదుగంటల్లోనే శ్రీవారి దర్శనం కలుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రూ.300 ప్రత్యేక దర్శనం కూడా గంటన్నరలోపే లభిస్తోంది. రద్దీ సాధారణ స్థాయి కంటే తగ్గడంతో ఆలయంలో లఘు దర్శనంలో (రాములవారి మేడ నుంచి) దగ్గరగా గర్భాలయ మూలమూర్తిని దర్శించుకునే అవకాశం కలిగింది. శ్రీవారి భక్తుల కోసం కేవలం తిరుమల, తిరుపతి మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. తిరుమల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు రద్దు చేశారు. ఆర్టీపీపీలో ఆగిన నిర్మాణ పనులు సాక్షి, ఎర్రగుంట్ల: సమ్య్యైంధ్ర ఉద్యమ ప్రభావం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ వపర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)పై పడింది. మం గళవారం జేఏసీ నాయకులు ఆరో యూనిట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. 600 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో కాంట్రాక్టర్లు, కార్మికులు పనులు నిలిపివేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఎక్కడి ఓడలు అక్కడే , కాకినాడ పోర్టులకు సమైక్య సెగ సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమైక్యాంధ్ర సెగ కాకినాడలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో నడుస్తోన్న రెండు ఓడరేవులకు తాకింది. సమైక్యాంధ్ర ఉద్యమ లక్ష్యాన్ని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రెండు పోర్టులను స్తంభింపచేయడంతో మంగళవారం కార్యకలాపాలు నిలిచిపోయాయి. యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టుల నుంచి బియ్యం, సిమెంట్, మొక్కజొన్న, గ్రానైట్, బొగ్గు, ఎరువుల ఎగుమతి దిగుమతులు నిలిచిపోయాయి. సుమారు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించాయి. రెండు పోర్టులపై ప్రత్యక్షంగా లేదా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 15 వేల మంది కార్మికులు విధులకు హాజరుకాలేదు. సముద్రంలో 26 నౌకలు నిలిచిపోయాయి. ఇండోనేషియా, ఆఫ్రికా, సోమాలియీ, వియత్నాం తదితర విదేశాలకు జరగాల్సిన ఎగుమతులు నిలిచిపోయాయి. రేవు ఆధారంగా పనిచేసే దాదాపు రెండువేలకు పైగా లారీల యజమానులు వాహనాలు నిలిపివేసి ఉద్యమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ బంద్‌కు సంఘీభావం తెలిపారు. పామాయిల్ సరఫరా బంద్? సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేదల తిండి అవసరాలను తీర్చే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సమైక్య ఉద్యమ సెగ తగిలింది. విదేశాల నుంచి సముద్ర మార్గంలో కాకినాడకు వచ్చే పామాయిల్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల సంస్థ గోదాములకు చేరవేయాల్సి ఉంటుంది. సీమాంధ్ర ప్రాంతంలో నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంతో రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి ఇతర జిల్లాలకు పామాయిల్ సరఫరా కావడంలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆగస్టు నెలలో తెలంగాణ ప్రాంతంలోపాటు సీమాంధ్ర జిలాల్లోనూ రేషన్‌కార్డు దారులకు పామాయిల్ సరఫరా చేయలేమని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ముక్కలైన గుండెలు విభజనపై మనస్తాపంతో ఏడుగురి మృతి సాక్షి నెట్వర్క్: సీమాంధ్రలో మృత్యుఘోష ఆగడం లేదు. రాష్ట్రం ముక్కలవుతుందని వార్తల నేపథ్యంలో మంగళవారం ఏడుగురు వ్యక్తులు గుండెపోటుతో మరణించారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామానికి చెందిన యుగంధర్ (55) సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. మంగళవారం గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఉద్యమంలో పాల్గొన్న అతను గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. విశాఖపట్నం జిల్లా మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెంకు చెందిన తాతబ్బాయి (62) రాష్ర్ట విభజన ప్రకటనపై తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందాడు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వర్ధనమ్మ (73) విభజన వార్తలపై తీవ్ర మనోవేదనకు గురై సోమవారం రాత్రి కూర్చున్నచోటే కుప్పకూలిపోయి ప్రాణాలొదిలింది. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలం కల్వటాలకు చెందిన పోస లక్ష్మీనారాయణరెడ్డి(46), ప్యాపిలి మండలం పీఆర్ పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి(55), కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం యాదరాల్ల గ్రామానికి చెందిన గొల్లనారాయణ(55), వెల్దుర్తి పట్టణంలోని ముల్లవీధిలో మహబూబ్‌బాషా(50) రెండు రోజులుగా టీవీలో విభజన వార్తలు చూస్తూ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించారు. కేసీఆర్‌పై కేసు వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై న్యాయవాదులు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టటడం.. కుట్రతో కూడిన ప్రకటనలు చేస్తున్నందుకు ఆయనపై ఐపీసీ 153ఎ, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీకి రోజూ రూ.9 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు...అసలే నష్టాలతో అల్లాడుతున్న ఆర్టీసీపై సమైక్య ఉద్యమ దెబ్బ పడింది. గత 31 నుంచి సోమవారం వరకు ..ఆర్టీసీ రోజుకు దాదాపు రూ. 9కోట్ల రాబడి కోల్పోయింది. ఆర్టీసీకి రోజుకు దాదాపు రూ. 20 కోట్ల రాబడి వస్తుంది. సమైక్య ఉద్యమం ప్రారంభమైనప్పటినుంచి రోజూ రాబడి రూ. 11 కోట్లు దాటట్లేదని ఆర్టీసీ అధికారవర్గాలు తెలిపాయి. సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు 12 వేల బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అందులో సోమవారం 7,000 బస్సులను ఆర్టీసీ తిప్ప గలిగింది. మిగతా 5వేల బస్సులు డిపోలకే పరిమితయమ్యాయి. సాధారణంగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) దాదాపు 70 శాతం వరకు ఉంటుంది. ఆందోళనల ఫలితంగా ఓఆర్ 30 శాతానికి దాటడం లేదు. 5-10 శాతం ఓఆర్‌తో పలు బస్సులు తిరిగాయని అధికార వర్గాలు చెప్పాయి. కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్క బస్సు కూడా సోమవారం తిరగలేదు. మిగతా జిల్లాల్లోనూ బస్సులు బయటకే రాని డిపోలు ఉన్నాయి. సీమాంధ్రలో దాదాపు 60 డిపోల నుంచి ఒక్కబస్సూ గడప దాటడం లేదు. రాబడి కోల్పోవడం ఒక ఎత్తయితే.. ఓఆర్ కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల నిర్వహణ వ్యయం పెరుగుతుందని, ఫలితంగా నష్టాలు అధికమవుతాయని ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.