కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్ అనుచరులు, సమైక్యవాదులు ఏలూరులోని కావూరి ఇంటిని ముట్టడించారు. వీరిని కావూరి అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమయింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి.
దీంతో రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు కావూరి నివాసంలోకి ప్రవేశించిన ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కలగజేసుకుని వీరిని చెదరగొట్టారు. పలువురి అదుపులోకి తీసుకున్నారు. కావూరిని అంతకుముందు కలపర్రు చెక్పోస్ట్ వద్ద చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో కావూరి తన ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరి ఏలూరు నగరాన్ని చేరుకున్నారు.