
సాక్షి, పినకమామిడి: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఏలూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని.. మహిళలు, చిన్నారులు ఉన్నారన్న ఇంగితజ్ఞానం మరిచిపోయి బూతులు మాట్లాడారు.
అయితే, ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని పినకమామిడిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ మీటింగ్‌లో బూతుపురాణం అందుకున్నారు. అట్రాసిటీ కేసు పెట్టిన దళితుడిపై మరోసారి అశ్లీల వ్యాఖ్యలు చేశారు. దీంతో చింతమనేని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సభలో **** నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ రెచ్చిపోయి బూతులు మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై కూడా తప్పుడు ప్రచారం చేశాడు. మరోవైపు.. వివాదస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment