సాక్షి, పశ్చిమగోదావరి: మరోసారి టీడీపీ - జనసేన లోపాయికారి ఒప్పందం బయటపడింది. ఏలూరులో తెలుగుదేశం అభ్యర్థులు విత్‌డ్రా అయిన చోట జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేపట్టారు. ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రచారం చేస్తున్నాయి. జనసేన అభ్యర్థులను గెలిపించాలంటూ చింతమనేని ప్రచారం చేస్తున్నారు. ఏలూరు 25వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి తరఫున చింతమనేని ప్రచారం చేపట్టారు. సైకిల్ గుర్తు లేకుంటే గ్యాస్ గుర్తుకు ఓటేయాలన్న చింతమనేని ప్రచారంపై విమర్శలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, జిల్లాలోని నరసాపురం మునిసిపాలిటీలో టీడీపీ, జనసేన బహిరంగంగా పొత్తులు పెట్టుకున్నాయి. పలు వార్డుల్లో ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టాయి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు అపవిత్ర పొత్తుకు తెరలేపాయి. 2014లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన 2019లో ఒంటరిపోరు చేసి చావుదెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం లోపాయికారీ పొత్తులకు తెరలేపింది. ఏకంగా రెండు జెండాలను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
చదవండి:
చంద్రబాబు ఆ దమ్ముందా.. కొడాలి నాని సవాల్
ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు
Comments
Please login to add a commentAdd a comment