Kavuri Sambashiva Rao
-
'గుడివాడ చరిత్రలో ఇది గొప్ప రోజు'
సాక్షి, గుడివాడ : గుడివాడ చరిత్రలో ఈరోజును ఒక గొప్ప రోజుగా గుర్తుంచుకుంటామని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని లింగ వరం రోడ్డు లోని కె కాన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. మంత్రి కొడాలి మాట్లాడుతూ.. ఎందరో ప్రముఖుల పురిటిగడ్డ ఈ గుడివాడ అని, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం తలుపు తట్టే న్యాయ వ్యవస్థ ప్రాంతంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. బట్టు దేవానంద్ గుడివాడ నుంచి హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులవడం ఈ ప్రాంతం అదృష్టమని తెలిపారు. సమాజంలో అనేక అసమానతలు తొలిగేలా అంబేద్కర్ ఆశయాలను దేవానంద్ నెరవేర్చుతాని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు,దర్శకుడు, నిర్మాత వైవీయస్ చౌదరి యూనేటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గుమ్మడి రవీంద్ర నాధ్ తదితరులు పాల్గొన్నారు.(‘ఎల్లో’ వైరస్ కరోనా కంటే ప్రమాదకరం) సినీ దర్శకుడు వైవీయస్ చౌదరి మాట్లాడుతూ.. ' గుడివాడలొనే నా విద్యాబ్యాసమంతా కొనసాగింది. నాకు సినిమా రంగంలో స్పూర్తి ఎన్టీఆర్. ఆయన స్పూర్తితోనే నేను సినిమా రంగంలోకి వెళ్ళాను. జీవితంలో ప్రతి ఒక్కరు..నువ్వు అనే పిలుపు నుంచి మీరు అని పిలిపించుకుని స్థాయికి చేరాలి. బట్టు దేవానంద్ నా చిన్ననాటి సహా విద్యార్థి. కానీ నేడు బట్టు దేవానంద్‌ను మీరు అని పిలిపించుకోవడం మన ప్రాంతం అదృష్టం. మత సామరస్యనికి నిలయం గుడివాడ.విద్యార్థి దశ నుంచే సమయ స్పూర్తి తో నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి బట్టు దేవానంద్' అంటూ తెలిపారు. మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. 'పేద కుటుంబ నుంచి వచ్చి వ్యక్తి ఉన్నత స్థాయికి రావడం సాదరణ విషయం కాదు. స్వాతంత్రం అనంతరం గుడివాడలో ఒక దళితుడు కూడా హైకోర్టు జడ్జి కాలేదు. నేటి రోజుల్లో పేదవారు పైకి రావడం చాలా కష్టం. పేదవారు కూడా ఉన్నత స్థాయికి రావాలన్నదే నా ఉద్దేశం. చరిత్రలో నిలిచిపోయే తీర్పులు ఇవ్వాలని నేను దేవానంద్‌ను కోరుతున్నాను. బట్టు దేవానంద్ సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి చేరాలని ఆశిస్తున్నా' అంటూ వెల్లడించారు. -
‘ఆ భావన తీసుకొచ్చేందుకే చంద్రబాబు కృషి’
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదనే భావన తీసుకొచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేతలు మండిపడ్డారు. టీడీపీ అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం’లో కేంద్ర పథకాలను వివరించాలని కోరారు. అశోక్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. పూటకో పార్టీతో పొత్తుకునే చంద్రబాబు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీపై నెట్టాలని చూస్తున్నారని ద్వజమెత్తారు. ఆయన సత్తా తేలిపోయింది.. రాబోయే కాలంలో నుంచి 7 నుంచి 8 మంది మంత్రులు, 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారని మాణిక్యాలరావు అన్నారు. చంద్రబాబు సత్తా ఏమిటో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందనీ, ఆయనకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అబద్ధాన్ని పదేపదే చెప్పి రాహుల్ ప్రజల్ని నమ్మించే యత్నం చేశారు. అందుకే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాఫెల్ పేరుతో కాంగ్రెస్ కుట్రకు పాల్పడిందనే అనుమానాలు కలుగుతున్నాయి’అని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని అభూత కల్పనలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. ఏపీలో కూడా మహా కూటమికి ఘోర పరాజయం పాలవుతుందన్నారు. -
చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోంది..
-
చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోంది..
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోందని, ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అయిందని, ఇదే విషయాన్ని అమిత్ షాకు చెప్పామని బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు తెలిపారు. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షా... పార్టీ నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. భేటీ అనంతరం కావూరి విలేకరులతో మాట్లాడుతూ అన్ని విషయాలు అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు లబ్ది పొందుతున్నారని కావూరి అన్నారు. ఏపీలో జన్మభూమి కమిటీల తీరు అధ్వాన్నంగా ఉందన్నారు. ఏ విషయంలోనూ బీజేపీని టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. మిత్రపక్షం కాబట్టి టీడీపీ ఉన్న వ్యతిరేకత బీజేపీపై పడుతుందన్నారు. నిబద్ధత కలిగిన నేతల వ్యాఖ్యలపైనే తాను స్పందిస్తానని, ఎంపీ కేశినేని నాని లాంటి వారి వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత ఫలితాలు తారుమారు అయ్యాయని, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని... ఏదైనా జరగవచ్చని కావూరి అన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. -
వాళ్ల చర్చలు మీరు చూశారా.. మేం చూశామా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసిన విషయంలో టీడీపీ నేతలు పెడార్థాలు తీయడం సరికాదని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రిని ఒక ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేముందని ఆమె ప్రశ్నించారు. అయినా.. ప్రధానితో జగన్ తన కేసుల గురించి చర్చించడం మీరు చూశారా.. మేం చూశామా అని టీడీపీ నేతలను ఆమె నిలదీశారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని, టీడీపీ మిత్రధర్మం పాటించలేదనే అనుమానం నెలకొందని పురందేశ్వరి చెప్పారు. ఇక రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని, పొత్తుల నిర్ణయానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉందని తెలిపారు. ఇక ప్రధానమంత్రి మోదీని జగన్ కలవడం మీద టీడీపీ నేతల విమర్శలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వెళ్లి ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటని ఆయన అడిగారు. అసలు వాళ్లిద్దరు కలవడం ఏంటనే ప్రశ్న వేయడమే తప్పన్నారు. కేసుల కోసమే కలిశారని ఎవరైనా చూశారా అని కావూరి నిలదీశారు. -
'ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని బీజేపీ నేత కావూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని కావూరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని కావూరి విమర్శించారు. -
కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ధర్నా
శ్రీనగర్‌కాలనీ: రుణాలు తిరిగి చెల్లించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బాలాపురి బస్తీలోని ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరిట రూ.160 కోట్ల రుణాలు తీసుకున్నారని తెలిపారు. సక్రమంగా తిరిగి చెల్లించడం లేదన్నారు. దీంతో నిరసనకు దిగినట్టు ని డీజీఎం రాజీవ్‌పురి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బీఎస్ శర్మ, వెంకటేశ్వర్లు, అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
'ఏపీలో బీజేపీని అణగదొక్కాలని చూస్తే ఊరుకోం'
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షం బీజేపీల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, శాంతారెడ్డి తదితరులు ఈ అంశంపై వైఎస్ఆర్ జిల్లా కడపలో మీడియాతో మాట్లాడారు. బీజేపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని, మిత్రపక్షంగా కలుపుకొని వెళ్లాలని కావూరి వ్యాఖ్యానించారు. టీడీపీ పద్ధతి మారాలని ఆయన సూచించారు. జన్మభూమి కమిటీలలో రాజకీయ జోక్యం కారణంగా అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని, ఇది ఎవరికీ మంచిది కాదని చెప్పారు. పేదలకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఇక.. రాజధాని భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించిందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌తో టీడీపీ నేతలు కోట్లకు పడగలెత్తుతున్నారని శాంతారెడ్డి ఆరోపించారు. -
'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది'
-
'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది'
అనంతపురం: చంద్రబాబు సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. లంచగొండితనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందారు. కాగా, పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని కావూరి సాంబశివరావు అంతకుముందు డిమాండ్ చేశారు. -
ఇంత దోపిడీ ఎప్పుడూ చూళ్లేదు
ఏలూరు : మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ తారస్థాయికి చేరిందని కేంద్ర మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతదోపిడీ ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఇసుక ర్యాంపులను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దోపిడీ ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. డ్వాక్రా మహిళ ముసుగులో టీడీపీ నేతలు ఇసుక ర్యాంపులను దోచుకున్నారని, ఇసుక గుట్టలను నోట్లకట్టల్లా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ క్యాడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇసుక ర్యాంపులను అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని హితవు పలికారు. జన్మభూమి కమిటీలను టీడీపీ క్యాడర్‌తో నింపేశారని ఆయన నిందించారు. ‘గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఇద్దరు డ్వాక్రామహిళలు సభ్యులుగా జన్మభూమి కమిటీ ఉండాలని ఉత్తర్వులు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు, డ్వాక్రామహిళల పేరిట టీడీపీ కార్యకర్తలను నియమిస్తున్నారు’ అని కావూరి పేర్కొన్నారు. బీజేపీ సానుభూతిపరులైన సామాజిక కార్యకర్తలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పట్టుదలగా పూర్తిచేసిన రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కావూరి సూచించారు. -
రాహుల్‌ను ప్రధాని చేసేందుకే సోనియా...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. గురువారం విజయవాడలో బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ... రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే రాష్ట్రాన్ని సోనియా విభజించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ ఆదుకుంటుందని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే అధిక నిధులు రాష్ట్రానికి తీసుకొస్తామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీలపై ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. -
యూపీఏలో అవినీతి మంత్రులున్నారు కానీ...
విజయనగరం: బీజేపీ నేత కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. గతంలో 10 ఏళ్లు పాటు సాగిన యూపీఏ ప్రభుత్వంలో అవినీతి మంత్రులు ఉన్నారని ఆరోపించారు. కానీ ప్రస్తుతం ఎన్డీఏ హయాంలోని మోదీ ప్రభుత్వంలో అలాంటి మంత్రులు లేరని తెలిపారు. మోదీ దేశ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి మంగళవారానికి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా జన కల్యాణ్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇచ్చి తీరాలని ఆయన ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా 2009 ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కావూరి సాంబశివరావు ... యూపీఏ ప్రభుత్వ హయాం 2009 - 2014 మధ్య కాలంలో అంటే 2013లో కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. -
పట్టిసీమతో ఉపయోగం లేదు: కావూరి
-
పట్టిసీమతో ఉపయోగం లేదు: కావూరి
విజయవాడ : బీజేపీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఆపార్టీ నేత కావూరి సాంబశివరావు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం మిగతా రాష్ట్రాల అనుమతి తీసుకునే ప్రయత్నం ఉన్నట్లు చెప్పారు. అలాగే ఏపీకి నిధులు సమకూర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆమె పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. -
ఓటు వేయకపోతే చంపేస్తారా
ఏలూరు : జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా తలపడేవిధంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయూలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.హరిబాబు పిలుపునిచ్చారు. ఏలూరు పేరయ్య కోనేరు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. పార్టీలో ఎంత పనిచేస్తే అంత గౌరవం ఉంటుందని, సిద్ధాం తాల ప్రకారం నడిచే పార్టీ బీజేపీ ఒక్కటేనని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తను సైతం గౌరవించే పార్టీ తమదేనని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి నిట్, ఐఐటీ, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయూలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు మంజూరు చేశామని చెప్పారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఘనత మోడీదేనన్నారు. రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని 148 సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి ఏ ఒక్కటీ దక్కకపోవడంతో నానా కష్టాలు పడుతున్నామన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ సమాజంలో లంచగొండితనం వేనూళ్లకోవడానికి కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. బీజేపీ బలపడటం అంటే మిత్రపక్షమైన టీడీపీని ఇబ్బంది పెట్టడం కాకుండా రాబోయే రోజుల్లో పార్టీ మరింత విస్తరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా నష్టపోయిందన్నారు. సౌకర్యాలు, మందులు లేక ప్రభుత్వ వైద్యరంగం దిగజారిందన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ 100 రోజుల బీజేపీ పాలనలో ఒరిగిందేమీ లేదంటూ కాంగ్రెస్ బూటకపు ప్రకటనలు చేస్తోందని, మోడీ నాయకత్వంలో ప్రజలకు ఏం జరిగిందో ప్రపంచ దేశాలకు సైతం అర్థమైందని అన్నారు. మోడీకి వీసా నిరాకరించిన అమెరికా సైతం ఆయనిను సగౌరవంగా ఆ దేశానికి ఆహ్వానించడం మోడీ నిబద్ధతకు తార్కాణమని పేర్కొన్నారు. ఓటు వేయకపోతే చంపేస్తారా : టీడీపీ తీరుపై కావూరి ఫైర్ తమ పార్టీకి ఓటు వేయని వారిని చంపేస్తామని, పొలాల్లో వ్యవసాయం చేయనిచ్చేది లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు ప్రజలను హింసించడాన్ని చూస్తూ ఊరుకునేది లేదని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొలానికి పాస్ పుస్తకం ఇప్పించేందుకు రూ.10 వేలు, రూ.10 లక్షల పొలానికి నష్టపరిహారం ఇప్పించేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకోవడం రాజకీయూ అవుతుందా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ‘ఈ మాత్రం దానికి రాజకీయాల్లోకి రావడం ఎందుకని, ఏదైనా మంచి వ్యాపారం చేసుకుని బతకొచ్చుకదా’ అని వ్యాఖ్యానించారు. అధికార దర్పంతో ప్రజలను హింసించడమనే నీతిమాలిన బతుకు మరొకటి ఉండదన్నారు. టీడీపీ అఘాయిత్యాల నుంచి ప్రజలను పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా రక్షించే స్థితి లేకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యే చావా రామకృష్ణ, చేగొండి ప్రకాష్‌బాబు, నగర సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రాము, కాంగ్రెస్ నాయకుడు పులి శ్రీరాములు, తపన ఫౌండేషన్ అధ్యక్షుడు గారపాటి చౌదరి, బొజ్జా నరేంద్ర, మాజీ కౌన్సిలర్ కొంపల్లి తాయారు, మేరీపాల్ పద్మావతి బీజేపీలో చేరారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సోము వీర్రాజు, పార్టీ అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షులు కె.మాలతీరాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్‌రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, నాయకులు పీవీఎస్ వర్మ, జమ్ముల కిషోర్, పి.వీరరాఘవులు, పొట్లూరి రామ్మోహన్రావు, పీవీ సుబ్రహ్మణ్యవర్మ, కోడూరి లక్ష్మీనారాయణ, కురెళ్ల సుధాకర్‌కృష్ణ, ముద్దాని దుర్గారావు, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత కోనేరు సురేష్‌బాబు పాల్గొన్నారు. -
టీడీపీపై మరోసారి కావూరి ఫైర్
ఏలూరు: బీజేపీ మిత్రపక్షమైన టీడీపీపై ఆపార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగి బీజేపీ కార్యవర్గ సమావేశంలో మిత్రపక్షం టీడీపీపై కావూరి సాంబశివరావు ఆరోపణలు చేయడం రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది. అధికార పార్టీకి ఓటు వేయకపోతే ఇతర పార్టీల నేతల్ని చంపేస్తారా అంటూ నిలదీశారు. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ కావూరి విమర్శించారు. రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగిపోయింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో టీడీపీకి సమానంగా బీజేపీ బలపడుతుందని కావూరి అన్నారు. -
టీడీపీలో పవన్ కల్యాణ్ దుమారం
‘పవన్ కల్యాణ్ వల్లే టీడీపీకి అధికారమొచ్చింది. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయినా.. మాకు మాత్రం డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పే ముఖ్యమంత్రి’ అంటూ ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం నేతలు చేస్తున్న కోలాహలం ఎటు తిరిగి ఎటొస్తుందోనన్న చర్చ ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో మొదలైంది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా ఇంకా సన్మానాలు, సత్కారాల మోజులోనే ఉన్న టీడీపీలోని ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఏలూరులో గత వారం తమ వర్గం నేతల నిర్వహణలో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ను కీర్తిస్తూ ఆ సామాజిక వర్గం నేతలు మాట్లాడితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ... టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ‘వర్గం’ కోణంలో మాట్లాడటం, కేవలం పవన్ ప్రచారంతోనే మన జిల్లాలోని పదిహేను సీట్లూ గెలుచుకున్నామంటూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. టీడీపీకి మొదటి నుంచీ కొమ్ముకాస్తున్న బలమైన ఓ సామాజిక వర్గం నేతలు ఈ వ్యాఖ్యలను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ జనసేన పార్టీ పెట్టకముందే జరిగిన మునిసిపల్, పంచాయతీ, స్థానికసంస్థలు, సహకార ఎన్నికల్లో టీడీపీ పాగా వేసిన విషయాన్ని ఆ వర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ప్రభావం లేదని కొట్టిపారేయలేం కానీ.. కేవలం పవన్ వల్లనే అధికారంలోకి వచ్చామన్న భావన, వ్యాఖ్య లు సరైనవి కావని ఆ వర్గం నేతలు అంటున్నారు. ఎటూ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సహా బీజేపీ నేతలు వీలు దొరికినప్పుడల్లా పవన్‌కు కీర్తిస్తున్నారని, ఇప్పుడు టీడీపీలోని ఓ వర్గం నేతలూ ఇదే రాగం ఆలపిస్తుండటంతో పార్టీకి కొమ్ముకాస్తున్న మిగిలిన వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉందని ఒకింత ఆందోళన చెందుతున్నారు. అరుుతే, పదేళ్ల తర్వాత పార్టీని పవర్లోకి తీసుకువచ్చిన సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో సున్నితమైన ఈ అంశాన్ని బాహాటంగా చెబితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు. సఖ్యతతో ‘రాజు’.. లక్ష్యంతో ‘సాంబ’ ఎప్పుడొచ్చామన్నది కాదు.. వార్తల్లో నిలిచామా లేదా.. కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ నేత కావూరి సాంబశివరావు వ్యవహారశైలి ఇప్పుడు సరిగ్గా ఇలాగే నడుస్తోంది. ఎన్నికల ముందు.. ఆ తర్వాత మూడు నెలల పాటు ఎక్కడా కనిపించకుండాపోయిన కావూరి సరిగ్గా ఐదురోజుల కిందట బీజేపీ నేతగా జిల్లాకు వచ్చి హల్చల్ చేశారు. వచ్చీ రాగానే తెలుగుదేశం నేతల అరాచకాలపై నేరుగా విమర్శలు గుప్పించారు. కావూరి వ్యాఖ్యల వెనుక మర్మమేమిటన్నది తొలుత చాలా మందికి అర్థం కాకుండాపోయింది. ఎవరేమనుకున్నా తాను అనాలనుకున్నదీ.. చెప్పాలనుకున్నదీ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కావూరి ఇప్పుడు ఇలా దూకుడుగా వెళ్తుండటం వెనుక చాలా ‘ముందుచూపు’ ఉందంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీకి తోక పార్టీగానే ఉండిపోతోందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న వాస్తవం. సరిగ్గా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన పునాదులపై దృష్టిపెట్టిన బీజేపీలోని ఓ వర్గం టీడీపీతో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించిన కార్యాచరణలో భాగంగానే కావూరి అలా దూసుకెళ్తున్నారని అంటున్నారు. మరోవైపు జిల్లాలో తనకంటూ ఓ వర్గా న్ని తయారుచేసుకునే పనిలో కూడా కావూరి ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. భీమవరంలో మునిసిపల్ వైస్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడి.. కౌన్సిలర్‌గానే మిగిలిపోయిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మను తోడుగా చేసుకుని కావూరి ఆ పార్టీ రాజకీయాల్లో వేగంగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావును కలుకుపుని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఓ వర్గంగా టీడీపీతో సఖ్యతతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీలో కావూరి పవర్‌సెంటర్‌గా మరో వర్గం తయారవుతోందని అంటున్నారు. పరస్పర విరుద్ధభావాలతో ఈ రెండు వర్గాలూ సమాంతరంగా ముందుకెళ్తూ జిల్లాలో బీజేపీని ఎటువైపు తీసుకువెళ్తాయో అన్నది కాలమే నిర్ణయించాలి. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
టీడీపీపై కావూరి ఘాటైన వ్యాఖ్యలు
నాయకుడు కావూరి సాంబశివరావు రెండు రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తనదైన శైలిలో అధికార పక్షాన్ని కావూరి టార్గెట్ చేయడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేస్తుండగా, బీజేపీ నేతలకు ఒకింత ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఎక్కడిక్కడ అరాచకాలకు పాల్పతున్నారు. మన జిల్లాలోని టి.నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి చెందిన సాగునీటి పైపుల ధ్వంసం, పెదవేగి మండలం అంకన్నగూడెంలో వైఎస్సార్ సీపీ నేతలు, వారి ఆస్తులు, ఇళ్లపై దాడులకు తెగబడటం వంటి ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కావూరి సరిగ్గా వీటిపై దృష్టిసారించి టీడీపీ నేతల నిర్వాకాలపై ధ్వజమెత్తుతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని, టీడీపీ వాళ్లు సరికొత్త ఆగడాలతో, దుష్టరాజకీయ సంస్కృతికి తెరలేపారని ఆయన వ్యాఖ్యానిం చడం గమనార్హం. వైఎస్సార్ సీపీ నేతలపై జరిగిన దాడులు, ఆ పార్టీ నేతలే లక్ష్యంగా టీడీపీ సాగిస్తున్న అరాచకాలను తప్పుపడుతూ పార్టీలకు అతీతంగా కావూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యూయి. అదేవిధంగా కొల్లేరులో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, బీజేపీ శ్రేణులపై జులుం ప్రదర్శిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కావూరి కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో హెచ్చరించారు. బీజేపీకి టీడీపీ మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని, టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కావూరి విరుచుకుపడటం సంచలనమవుతోంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాకు దూరంగా ఉన్న కావూరి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత జిల్లాకు వచ్చీ రాగానే టీడీపీ నేతల ఆగడాలపై ఎటాక్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. -
టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం
ఏలూరు అర్బన్ : ‘జిల్లాలో టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం.. పార్టీ బలోపేతానికి శ్రేణులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం స్థానిక ఖండ్రికగూడెం పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఏలూరు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్ధించబోమని, ప్రజల ఆకాంక్షలకు తగినవిధంగా ప్రజాపోరాటాలకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ ప్రభంజనంతో యువత పార్టీలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తోందని అన్నారు. మోడీ ఆలోచనలకు అనుగుణంగా యువతను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యకర్తలు రానున్న 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేసి బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఇప్పటినుంచే కృషి చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, జిల్లా శాఖ అధ్యక్షురాలు లక్కోజు సుజాత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దాని దుర్గారావు, కార్యదర్శి కురెళ్ల సుధాకరకృష్ణ, నాయకులు కత్తి రాము, పులి శ్రీరాములు, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి చౌదరి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కైరం అప్పారావు పాల్గొన్నారు. -
టిడిపి రౌడీ రాజకీయాలు: మిత్రపక్ష నేత కావూరి
ఏలూరు: టిడిపి మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని బిజెపి నేత కావూరి సాంబశివరావు చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. 2019లో రాష్ట్రంలో టీడీపీ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కావూరి విమర్శించారు. -
టీడీపీ అధికారం బీజేపీ భిక్షే
ఎమ్మెల్యేలూ ఖబడ్దార్ తెలుగు తమ్ముళ్ల తీరుపై బీజేపీ నేతలు కావూరి, శ్రీనివాసవర్మ ఫైర్ తెలుగు తమ్ముళ్ల తీరుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మండిపడ్డారు. బీజేపీ భిక్షతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ శ్రేణులపై జులుం ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. కొయ్యలగూడెం : టీడీపీ నాయకుల వ్యవహార శైలి, హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు ప్రజలను మోసగిస్తున్న తీరుపై బీజేపీ నాయకులు కావూరి సాంబశివరావు, భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్రస్థారుులో ధ్వజమెత్తారు. పోలవరం నియోజకవర్గ బీజేపీ శ్రేణుల సమావేశాన్ని కొయ్యలగూడెంలో సోమవారం నిర్వహించారు. పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బీజేపీ భిక్షతోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టిందని పేర్కొన్నారు. అరుునా, బీజేపీని అణగదొక్కటానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. తమ వల్లే అధికారం వచ్చిందన్న విషయూన్ని టీడీపీ నేతలు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. చాలాకాలంగా టీడీపీలో ఉంటూ అన్యాయూనికి గురవుతున్న నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని పటిష్టం చేయూలని శ్రేణులకు సూచించారు. ఈ నెల 31న ఏలూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున జనసమీకరణ జరపాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చావా రామకృష్ణ వంటి నాయకులు బీజేపీలో చేరడంతో పార్టీ పటిష్టంగా తయూరవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల పాలకమండళ్లలో బీజేపీ నాయకులకే ఆగ్రస్థానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలూ ఖబడ్దార్ కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ శ్రేణులపై జులం ప్రదర్శిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొల్లేరులో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, సానుభూతిపరులపై టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తనను నమ్ముకున్న అనుచర గణానికి రక్షణ తాను కవచంలా నిలబడతానని, రక్తం చిందించైనా కాపాడుకుంటానని కావూరి పేర్కొన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం కల్ల అని, బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆ పాపం శాపంలా వెంటాడుతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా భవిష్యత్‌లో ఆ పార్టీని వీడి దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించగల బీజేపీలో చేరి చరితార్థులు కావాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు అర్జుల మురళి, కోడూరి లక్ష్మీనారాయణ, బొల్లిన నిర్మల, లక్కరాజు సుజాత, సురేంద్రనాథ్‌బెనర్జీ, కట్టా సత్యనారాయణ, గొలిశెట్టి గంగాధరరావు, మోడేపల్లి నాగు, సరియం రామలక్ష్మి, కొండేపాటి రామకృష్ణ, బొప్పిన నాగేశ్వరరావు, మద్దిబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా!
అంతకు ముందు కాలనీలకు.. పేటలకు.. బస్తీలకు ఓ ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలా హడావుడి కనిపించేది. రోడ్ల వెంబడి బ్లీచింగ్ చల్లేవారు. తోరణాలు.. పూలమాలలు.. స్వాగత సత్కారాలు గట్రా నడిచేవి. ఎందుకంటే ఆ ఏరి యాకి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు వచ్చాడంటే కచ్చితంగాఅభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలో లేదా శంకుస్థాపనలో పెద్దఎత్తున జరిగేవి. ఒక్కోసారి ఇలాంటివి జరగకపోయినా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి వెంటనే సదరు నేతలు అక్కడి పనులకు సంబంధించి హామీలిచ్చేవారు. కొన్నాళ్లకో.. చాన్నాళ్లకో మొత్తం మీద చాలావరకు పనులు చేసేవారు. మరి మంత్రులే వస్తే.. ఏకంగా ఉప ముఖ్యమంత్రే వస్తే.. ఇప్పుడిదంతా ఎందుకంటే సమైక్యాంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్ర 13 జిల్లాలతో ఓ రాష్ట్రంగా మిగిలిన తర్వాత కొలువుదీరిన కొత్త మంత్రులు ఎక్కడికక్కడ గిరాగిరా తిరుగుతున్నారు. ఎటుచూసినా అక్కడో మంత్రి పర్యటన.. ఇక్కడో మంత్రి టూరు. కానీ.. ఆ ప్రాంతాలకు ఏం జరుగుతోంది. అక్కడి జనానికి ఏం ఒరుగుతోంది. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ‘ఇదిగో ఈ రెండు నెలల్లో ఇది చేశాం’ అని ఎవరూ ఏమీ చెప్పుకోలేని పరిస్థితే ఉంది. కొత్తగా వేల, వందలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రకటనల గురించి ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు. కనీసం బాధితులకు, క్షతగాత్రులకు మంత్రులిచ్చిన హామీల అమలుకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంటోంది. రెండు వారాల కిందట ఆకివీడు శివారు ధర్మాపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఘట నా స్థలంలోనే ఒక మహిళ.. చికిత్స పొందూతూ మరో మహిళ మృతి చెందారు. వీరి కుటుంబాల పరామర్శకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం ఆదుకుంటామని హామీలిచ్చింది. క్షతగాత్రుల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తామని మంత్రులు వాగ్దానాలు చేశారు. ఆనక ఎవరూ పట్టిం చుకోలేదు. చివరకు ఓ క్షతగాత్రుడు గత సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ‘సార్.. మమ్మల్ని, మా పిల్లల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెంటనే స్పందించి ఆ పిల్లలను నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో అప్పగించారు. ఇక్కడ విషయమేమిటంటే.. స్వయంగా ఉపముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు వెళ్లి ఇచ్చిన హామీలు కూడా నెరవేరని స్థితిలో బాధితులు ఏలూరు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకోవడం. ఒకరిద్దరి బాధితులకు సంబంధించిన సహాయ కార్యక్రమాలపైనే పాలకుల స్పందన ఇలా ఉండటం ఒకింత విమర్శలకు తావి చ్చింది. ఇదొక్క ఘటనే కాదు.. జిల్లాలో ఇటీవల మంత్రులు వెళ్లి అక్కడి జనానికి ఇస్తున్న చిన్నపాటి హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యాయో లేదోనన్న పరిశీలన ఇప్పటివరకు ఏ నేత కూడా చేస్తున్న దాఖలాలు లేవు. ఏదో వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా.. అన్న తీరు కాకుండా మా గోడు కాస్త పట్టించుకోండంటూ సామాన్య జనం వేడుకుంటున్నారు. వింటున్నారా పాలకులూ! కావూరి ఎక్కడ? రెండుసార్లు ఎంపీగా గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను, ముఖ్యంగా ఏలూరు వాసులను ఎప్పటికీ మరచిపోలేను.. అంటూ మొన్నటివరకు బీరాలు పలికిన కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు ఇప్పుడెక్కడున్నారు.. కనీసం మచ్చు కు కూడా కానరావడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయనకు వరుసగా రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా ఇక్కడి ప్రజలు పట్టం కట్టా రు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన తొలినాళ్లలో సమైక్య ఉద్యమ సారధిగా హడావుడి చేసిన ఆయన కేంద్రమంత్రి తాయిలం దక్కగానే ప్లేటు ఫిరాయించడం, చివరివరకు పదవిని అనుభవించి ఎన్నికల సమయం వచ్చేసరికి కాంగ్రెస్‌ను కాదనుకుని బయటకు వచ్చేయడం అందరికీ తెలిసినవే. రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేసిందని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అదే విభజన అంశానికి మద్దతిచ్చిన బీజేపీలో చేరడం కేవలం ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమే అన్నది బహిరంగ రహస్యం. సరే.. ఆయన ప్రయోజనాలు, పార్టీల మార్పిడి ఎలా ఉన్నా పదేళ్లు ఆదరించిన ఏలూరుకు ఇటీవలికాలంలో పూర్తిగా రావడం మానేశారు. చివరకు నగరంలోని మోతేవారి తోటలో ఎన్నో ఏళ్లుగా ఉన్న క్యాంపు కార్యాలయాన్ని రెండు నెలల కిందటే ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఎటూ ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి జనం కొత్త పాలకులపైనే ఆశగా చూస్తున్నారు. మరి పదేళ్ల పాటు కావూరినే నమ్ముకుని హల్చల్ చేసిన క్యాడర్ పరిస్థితి ఏమిటో? దుందుడుకు ఎమ్మెల్యేకి సీఎం క్లాస్ గెలిచేవరకే పార్టీలు.. రాజకీయాలు.. ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. అంటే ఎన్నికల్లో తనకు ఓటేసిన వారికి, వేయని వారి కూడా తానే ఎమ్మెల్యే. ఈ కనీస స్పృహ కూడా లేని ఒకాయన ఎమ్మెల్యే అయిన తర్వాత వేరే పార్టీ వాళ్లు కనిపిస్తే చాలు ఎగబడి, కలబడి గొడవ చేస్తున్నారట. అంతే కాదు అధికారులను కూడా నోటికొచ్చినంత మాట్లాడేస్తున్నారట. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదరు నేతకు గట్టిగా క్లాస్ పీకారట. ‘జాగ్రత్త.. ఆఫీసర్స్‌తో ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావ్ అని తెలిసింది. మరోసారి ఇలాంటివి నా దృష్టికొస్తే ఊరుకోను’ అని గట్టిగానే మందలించారట. మరి ఇప్పటికైనా సదరు నేతలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
'దేశానికే కాదు... కుటుంబానికి ఏమీ చేయలేదు'
తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు ఆరోపించారు. శనివారం కర్నూలులో జరిగిన బీజేపీ పార్టీ సమావేశాలకు కావూరి సాంబశివరావు హాజరైయ్యారు. కావూరి సాంబశివరావు ఈ సందర్భంగా కాంగ్రెస్ సోనియాగాంధీపై నిప్పులు చెరిగారు. దేశానికే కాదు సొంత కుటుంబానికి కూడా ఏమీ చేసుకోలేక పోయారని కావూరి... సోనియాగాంధీని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. ఆ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబుతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరైయ్యారు. -
బిజెపిలో చేరిన కావూరి సాంబశివరావు
భీమవరం: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఈరోజు ఇక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో బిజెపిలో చేరారు. భారత్ విజయ్ బహిరంగ సభా వేదికపైకి వచ్చిన కావూరి మోడీని భారీ పూల మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ దేశానికి ప్రధాని కాగల అర్హత మోడీకి ఉందన్నారు. దీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన కావూరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాని అయోమయ స్థితిలో ఆయన కొంతకాలం ఉన్నారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించి విరమించుకున్నట్లు తెలిసింది. చివరకు ఈరోజు ఆయన బిజెపిలో చేరారు. -
బీజేపీలోకి కావూరి జంప్!
-
బీజేపీలోకి కావూరి జంప్!
ఏలూరు : దీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు బీజేపీలోకి జంప్ కానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాని అయోమయావస్థలో కావూరి చిక్కుకున్నారు. టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ నేతలు అడ్డు తగలటంతోగే బీజేపీ వైపు చూసినట్టు వార్తలొచ్చాయి. అప్పట్లో బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా... టీడీపీతో పొత్తు కారణంగా అది సాధ్యం కాలేదని సమాచారం. దాంతో ఆయన చాలారోజులుగా సైలెంట్‌గా వున్నారు. తాజాగా కావూరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మే 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కావూరి ఏలూరు నుంచి భారీ ర్యాలీగా వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా ఈసారి ఎన్నికలకు కావూరి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కావూరి బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపారు కూడా. ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆమె రాజంపేట నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
'వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారు'
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో చాలామంది వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యనించారు. కావూరి ...బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రశంసించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీజేపీ ఇప్పటివరకూ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయకపోవటానికి కారణం ఏంటో చెప్పాలని సుర్జీవాలా డిమాండ్ చేశారు. ప్రజలను విడదీయటమే బీజేపీ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. కాగా రాష్ట్ర విభజనకు నిరసనగా కావూరి సాంబశివరావు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈమేరకు కావూరి ఆపార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. -
కావూరి రూటే సఫరేటు
-
అప్పుడే కొత్త పల్లవి అందుకున్న కావూరి
కేంద్రమంత్రి పదవికి నిన్న రాజీనామా చేశారో లేదో అప్పుడే కావూరి సాంబశివరావు కొత్త పల్లవి అందుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ సమర్థవంతమైన నాయకుడని అభివర్ణించారు. గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధితో మోడీ సత్తా ఏంటో నిరూపించుకున్నారని కావూరి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొద్ది పాటి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానాలేవి పెద్దగా ప్రజలపై ప్రభావం చూపలేదని కావూరి ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరి తనను తీవ్రంగా కలచివేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి కావూరి గురువారం రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కాగా రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. ఇప్పటికే ఆ పార్టీలోని మహామహులంతా ఇప్పటికే జంపింగ్ రాగం జపిస్తూ ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ఆ క్రమంలో కావూరి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు కావూరి రాకను అడ్డుకున్నారు. దాంతో మరో పార్టీ చూసుకో అంటూ కావూరికి చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చారు. దాంతో కావూరి కమలం పార్టీలో వెళ్లాలని చూస్తున్నారు. అందులోభాగంగానే కావూరి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారని సమాచారం. -
కావూరి రాజీనామా.. ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేయబోనని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, ఏ పార్టీలోకి వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ఆయన గురువారం ఉదయం పదిగంటలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసానికి వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆయన వెంటనే రాష్ట్రపతికి ఆ లేఖను పంపారు. రాష్ట్రపతి దానిని ఆమోదించారు. విభజన తీరు తనను ఎంతో బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన ప్రతి అంశాన్ని టేబుల్ ఐటంగానే కేబినెట్ ముందుకు తెచ్చారని, అప్రజాస్వామికమైన ఈ నిర్ణయాలను తాను సమర్థించబోనని ప్రతి కేబినెట్ సమావేశంలో సూచించినట్టు అందులో తెలిపారు. రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ఎన్నోమార్లు వ్యక్తిగతంగానూ కలసి విజ్ఞప్తి చేసినట్టు గుర్తుచేశారు. అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఆపాలని కేబినెట్లోనూ, పార్లమెంట్‌లోనూ ప్రయత్నించానన్నారు. 20 రోజుల కిందటే రాజీనామా చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైందని చెప్పారు. కొత్త రాష్ట్రానికి అభివృద్ధి నిధుల కోసం, పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్, హైదరాబాద్ యూటీ... ఇలా పలు విషయాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామన్న ఉద్దేశంతోనే కేబినెట్లో కొనసాగినట్లు తెలిపారు. తన పనితీరు బాగుందని, రాజీనామా చేయవద్దని ప్రధాని వారించారని తెలిపారు. తాను కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తనకెలాంటి హామీ రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జైరాం, కావూరి మాటల యుద్ధం కావూరి రాజీనామాపై జైరాం రమేశ్ మాట్లాడుతూ... కావూరికి వ్యాపార ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలేవీ లేవని దుయ్యబట్టారు. కేబినెట్ నిర్ణయాలు వెలువరించేందుకు జైరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. కావూరి రాజీనామా చేశారని విలేకరులు చెప్పగానే.. పార్టీని కూడా వీడారేమోననుకున్న కావూరిపై విరుచుకుపడ్డారు. ఆయన అప్పులపై ప్రశ్నించకుండా ఉండేందుకు బీజేపీని ఆశ్రయించినట్టున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరి, కావూరి వంటి వారు కాంగ్రెస్ నుంచి పూర్తి లబ్ధిపొంది ఆ తరువాత కాంగ్రెస్‌ను వదిలేశారని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని విలేకరులు చెప్పడంతో సర్దుకుని... ‘‘ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయడం బాధాకరం. పోలవరం గురించి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గురించి పోరాటం చేశారు..’’ అని చెప్పారు. జైరాం వ్యాఖ్యలు తెలుసుకున్న కావూరి సాయంత్రం మళ్లీ విలేకరుల సమావేశం నిర్వహించి నిప్పులు కురిపించారు. దమ్మిడీ విలువ లేని జైరాం లాంటి వారి వల్లే పార్టీకి ఈ గతిపట్టిందని విమర్శించారు. జీవితం లో ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపడనివారు, ఏవో నాలుగు పుస్తకాల్లోని విషయాలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇలాంటివారివల్లే సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్కసీటూ గెలవని పరిస్థితికి చేరిందని చెప్పారు. ఇలాంటి వాళ్లను నమ్మితే వందేళ్లయినా పార్టీ తిరిగి అధికారంలోకి రాదని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల పదేళ్లుగా ఇన్ఫ్రా కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సన్నాసులు ఎందరున్నారో చూశాక పార్టీలో కొనసాగే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. -
కావూరి ‘సొంత’బాట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని లెక్కచేయకుండా.. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా సొంత లాభమే లక్ష్యంగా చివరివరకూ రాజకీయం నడిపించిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఎట్టకేలకు పదవులను త్యజించారు. తాజా అడుగు కూడా తన భవిష్యత్ కోసమే వేయడం విశేషం. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఆయన సన్నిహితులే పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు అండతో బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తేటతెల్లమవుతోంది. వరుస ఓటముల నుంచి... కృష్ణా జిల్లాలో వరుస ఓటములతో అల్లాడుతున్న కావూరి సాంబశివరావుకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు పార్లమెంటరీ సీటును ఇప్పించారు. 2009 ఎన్నికల్లోనూ కావూరితో ఇక్కడి నుంచి పోటీ చేయించారు. చివరకు కావూరి మాత్రం పదవే పరమార్థంగా వ్యవహరిస్తూ ప్రజల మనోభీష్టాలను తుంగలో తొక్కారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకున్న సమయంలో ప్రజలు చేపట్టిన సమైక్యాం ధ్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. ఫలితం లేకపోవడంతో అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అధిష్టానం పిలిచి మాట్లాడటంతో వెనక్కి తగ్గారు. అనంతరం విభజనకు కేంద్రం వడివడిగా అడుగులు వేసింది. దీనికి కొద్దిరోజుల ముందే కావూరికి కేంద్ర క్యాబినెట్లో జౌళిశాఖను కట్టబెట్టింది. అప్పటివరకూ సమైక్యాంధ్ర ఉద్యమం రథసారధిగా వ్యవహరించిన కావూరి మంత్రి పదవి వచ్చిన తరువాత సమైక్యాంధ్ర విషయాన్ని పక్కన పెట్టేశారు. ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా... సీమాంధ్ర అంతటా ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా కావూరి పట్టించుకోలేదు. జిల్లాకు వచ్చినప్పుడు అనేకసార్లు ఆయన్ని సమైక్యవాదులు, ప్రజలు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కావూరి మాత్రం రాజీనామా చేయకపోవడం ఉద్యమాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసి.. ఉద్యమకారులపై దుర్భాషలాడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. చివరకు రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత కూడా కావూరి పదవిని వదల్లేదు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసినా ఈయన మాత్రం పదవిని పట్టుకుని వేలాడారు. ఏ దశలోనూ రాష్ట్ర విభజన విషయంలో ఇక్కడి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే ప్రయత్నం చేయలేదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విభజన నిర్ణయం జరిగిపోయి ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కావూరి రూటు మార్చారు. మంత్రి పదవిని అనుభిస్తూనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీలో చేరటం ద్వారా తిరిగి ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి పావులు కదిపారు. కానీ జిల్లా టీడీపీ నేతలంతా ఆయనను ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో చంద్రబాబు వెనుకడుగు వేశారు. అయితే నేరుగా టీడీపీలో చేర్చుకోకుండా బీజేపీలోకి పంపించి ఆ పార్టీ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదురుతుందనుకున్న నేపథ్యంలో ఆయనకు వీలైతే ఏలూరు లేకపోతే కృష్ణాజిల్లా మచిలీపట్నం సీటు ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతోనే ఆయన పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పణంగా పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్న కావూరి ఆ తర్వాత ఉద్యమాన్నే కించపరిచి ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మారారు. చివరివరకూ కేంద్ర మంత్రి పదవిని అనుభవిస్తూ తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గురువారం రాజీనామా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడుతూనే సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచిన కావూరి చివరకు రాష్ట్రాన్ని విడగొట్టడంలో తనవంతు పాత్ర పోషించిన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌వాదిగా బీజేపీని, చంద్రబాబును వ్యతిరేకించిన కావూరి చివరకు రాజకీయ భవిష్యత్ కోసం వారి పంచనే చేరుతుండటం గమనార్హం. -
కావూరికి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం
-
దమ్మిడీకి పనికిరానివాళ్లు నాకు నీతులు చెప్తారా?
న్యూఢిల్లీ: తనకు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్మిడీకి పనికిరానివాళ్లు నాకు నీతులు చెప్తారా అంటూ ధ్వజమెత్తారు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని హైకమాండ్ దగ్గర కుప్పిగంతులు వేస్తున్నారంటూ దుయ్యబట్టారు. దమ్ముంటే జైరాం రమేష్ లోక్‌సభకు పోటీచేసి గెలవాలని కావూరి సవాల్ విసిరారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి జైరాం రమేష్ లాంటి నాయకులే కారణమన్నారు. వీరిని హైకమాండ్ ప్రోత్సహించరాదని సూచించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన కావూరి సాంబశివరావుపై జైరాం రమేష్ అంతకుముందు విమర్శలు గుప్పించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ నుంచి కావూరి ఎంతో మేలు పొందారని గుర్తు చేశారు. -
కాషాయం కట్టడమేనా?
ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాజకీయాల్లో 'దూకు'డు ఆట రసపట్టు మీదుంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబకడంతో సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజకీయంగా సురక్షిత పార్టీలకు చేరుకుంటున్నారు. సమైక్యాంధ్ర వీరుడి ముసుగులో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌లో లాభం లేదనుకుని కొద్దికాలం నుంచి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. చేతులు కాలాక...ఆకులు పట్టున్నట్లుగా ఆయన రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేసినట్లు చెప్పకు రావటం విశేషం. ఈ మేరకు కావూరి గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించుకున్నారు. కాగా రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ప్రజలు రాజీమానా చేయమని డిమాండ్ చేసినా కావూరి ఏ మాత్రం పట్టించుకోలేదు. పలుమార్లు ఆయన్ను సమైక్యవాదులు అడ్డగించినా లెక్కచేయలేదు. రాష్ట్ర విభజన జరిగిపోతున్న సమయంలోనూ విభజన జరగదని, పార్లమెంటులో తన సత్తా చూపిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలతో అందరినీ గందరగోళంలో పడేశారు. చివరికి కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజనకు అంగీకరించి రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చి మరింత చులకనయ్యారు. పార్లమెంటులోనూ రకరకాల డ్రామాలు ఆడారు. చివరికి విభజన జరిగిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ పరాజయం ఖాయమని సర్వేల్లో వెల్లడి కావడంతో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జనాన్ని ఎలాగోలా మభ్యపెట్టేందుకు రంగంలోకి దిగారు. రాజీనామా అస్త్రాన్ని తెరమీదకు తెచ్చి ఇందు కోసం తమ నియోజకవర్గ కార్యకర్తలతో మంతనాలు జరిపి నేనేం చేయాలో మీరే చెప్పండంటూ లేఖలు సంధించారు. అయితే రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరాలన్నది తేల్చుకోకపోవడంతో ఆయన ఇప్పటి వరకు ఆగారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఏ పార్టీలోకి మారాలో తెలియక కొద్దిరోజులు డైలమాలో పడ్డారు. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా ఏలూరు సీటు కేటాయించేందుకు ఆ పార్టీ హామీ ఇవ్వకపోవడంతో కావూరి వెనుకడుగు వేశారు. ఇక సైకిల్ ఎక్కాలనుకున్నా....స్థానిక నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల చంద్రబాబు కావూరిని తమ పార్టీలోకి ఆహ్వానించలేకపోయారు. దీంతో కావూరి ఇక దారేదీ లేక కాషాయం వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిజెపి అగ్రనేతలతో మాటామంతి జరిపినట్లు మాత్రం మీడియాలో కథనలు వెలువడ్డాయి. చివరికి బీజేపీతో లింకు కుదరడంతో అందులోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
'విభజన తీరు నచ్చకే... రాజీనామా'
-
కావూరికి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం
కేంద్ర మంత్రి పదవికి ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరు సాంబశివరావు రాజీనామా చేయడంపై ఆయన మంత్రి వర్గ సహచరుడు, జీవోఎం సభ్యుడు జై రాం రమేష్ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు.గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కావూరి సాంబశివరావుకు ఓ సిద్దాంతమంటూ లేని జై రాం రమేష్ ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని విమర్శించారు. విభజన అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నప్పుడు కావూరి ఎప్పుడూ వాకౌట్ చేయలేదని జై రాం రమేష్ గుర్తు చేశారు. సూడాన్‌లో పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకుని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. దాంతో భారత్ ప్రభుత్వానికి కావూరి వల్ల చెడ్డ పేరు వచ్చిందన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ నుంచి కావూరి ఎంతో మేలు పొందారన్నారు. కావూరి రాజీనామాపై స్పందించాలని జై రాం రమేష్‌ను విలేకర్లు కోరగా ఆయన పై విధంగా స్పందించారు.అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జై రాం రమేష్ స్పందిస్తూ... దుగరాజు పట్నంలో వేల ఏకరాలు స్థలాలు పురందేశ్వరీ కొనుగోలు చేసిందంటూ ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవికి గురువారం రాజీనామా చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌ను పక్క పెట్టడంపై తాను తీవ్రంగా కలత చెందానని ఈ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కావూరి ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన రాజీనామా లేఖను స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కావూరి అందజేసిన సంగతి తెలిసిందే.కావూరి సాంబశివరావు టీడీపీలో చేరేందుకు సిద్ధపడగా, ఆపార్టీలో తలుపులు మూసుకుపోయాయి. దాంతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. -
కేంద్రమంత్రి పదవికి కావూరి రాజీనామా
-
కేంద్రమంత్రి పదవికి కావూరి రాజీనామా
కేంద్ర మంత్రి పదవికి ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. కావూరి తన రాజీనామా లేఖను గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్వయంగా అందజేశారు. రాష్ట్ర విభజనే...పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్ పెండింగ్‌లో పెట్టడం తనను తీవ్రంగా కలచివేసిందని ఈ సందర్భంగా ప్రధానితో కావూరి పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి కావూరి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలను ముమ్మరం చేశారు. కావూరి రాకను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు మాత్రం కావూరి రాకను పూర్తిగా వ్యతిరేకించారు. ఒకానొక క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబు నాయుడుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. చివరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సదరు జిల్లా నాయకుల మాటలకు తలవంచక తప్పలేదు. దాంతో చంద్రబాబు మరో పార్టీ చూసుకో అని కావూరికి ఓ సలహా పడేశారంటా. దాంతో బీజేపీలోకి వెళ్లేందుకు కావూరి ఇప్పటికే తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారని సమాచారం. అయితే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన దగ్గుబాటి పురందేశ్వరీ ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
అసమ్మతి ఆనవాయితీ
సాక్షి, మచిలీపట్నం : కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. అక్కడ ప్రధాన పార్టీల నాయకులకు అసమ్మతి బెడద, వర్గపోరు ఆనవాయితీగా వస్తోంది. దీనికితోడు ఇక్కడ ఒకసారి ఓడిస్తే మరో ఎన్నికలో సానుభూతితో గెలిపించే సంప్రదాయం కూడా ఓటర్లలో ఉంది. ఫలితంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో ఆ నియోజకవర్గం ‘గన్’వరంగా గుర్తింపు పొందింది. 1994 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గద్దె రామ్మోహన్రావు ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. గద్దె చేతిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు పరాజయంపాలయ్యారు. అప్పట్లో సానుభూతి ఓట్లతో గద్దె గెలవడంతో ఓటమిపాలైన బాలవర్థనరావు ఉడా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం గద్దె తిరిగి టీడీపీలో చేరడంతో 1994 నుంచి 1999 వరకు గద్దె, దాసరి రెండు వర్గాలుగా గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ ఎంపీగా గద్దెను పంపి దాసరికి గన్నవరం సీటు కేటాయించి వర్గ వైషమ్యాలను సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు. 1999 ఎన్నికల్లో అప్పటి ఎంపీ కావూరు సాంబశివరావు మద్దతుతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ పొంది గన్నవరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముద్దరబోయినకు అప్పటి ఎన్నికల్లో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వ్యతిరేకంగా పనిచేసి ఓడించారు. కాంగ్రెస్‌లో అసమ్మతికితోడు ప్రజల్లో సానుభూతి తోడుకావడంతో 1999 ఎన్నికల్లో దాసరి విజయం సాధించారు. ఓటమి పొందిన ముద్దరబోయిన నియోజకవర్గంలో మకాం పెట్టి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. అంతకుముందు రెండు ఎన్నికల నుంచి చెల్లాచెదురైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన ముద్దరబోయినకు 2004 ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించలేదు. అధిష్ఠానం కడియాల బుచ్చిబాబును కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికచేయడంతో బిత్తరపోయిన ముద్దరబోయిన కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009 ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించినప్పటికీ టీడీపీ తరపున పోటీ చేసిన దాసరి చేతిలో పరాజయం పాలుకాక తప్పలేదు. తాజాగా.. గన్నవరంలో గతం నుంచి కాంగ్రెస్, టీడీపీ నువ్వానేనా అనే రీతిలో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చిరునామా గల్లంతైంది. వైఎస్సార్సీపీ పట్టు సాధించింది. ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశంలో మాత్రం అసమ్మతి అనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్లు ఇద్దరూ టికెట్ నాది అంటే నాది అంటూ పంతాలకు పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారి సామాజికవర్గానికి చెందిన పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా వీరిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగిలిన వారు అసమ్మతి అనవాయితీని కొనసాగిస్తూ రెబల్ అవుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
కైకలూరు టీడీపీలో ముదురుతున్న ముసలం
టిక్కెట్ల కలకలం ఇంటి సమస్యలే జయమంగళను దూరం చేస్తున్నాయా? తెరపైకి కొత్త ముఖాలు వ్యతిరేకిస్తున్న మాగంటి, జయమంగళ అనుచరగణం కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కలకలం మొదలైంది. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు పార్టీలో చేరతారని వస్తున్న ఊహాగానాలపై లోక్‌సభ సీటు ఆశిస్తున్న మాగంటి బాబు వర్గం కారాలు మిరియాలు నూరిన విషయం విదితమే. తాజాగా జిల్లాలోని తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కైకలూరు మినహా మిగతావి యథాతథంగా పోటీలో ఉండే అవకాశం ఉందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనం కైకలూరు నియోజకవర్గ పార్టీ వర్గాల్లో శుక్రవారం కలకలం రేపింది. నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు ఈ అంశంపై స్థానిక మాగంటి బాబు నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నిప్పులు చెరిగారు. టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇప్పటికే బీజేపీలో చేరిన యెర్నేని సీతాదేవికి కైకలూరు సీటు కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కార్యకర్తలు కుండబద్దలు కొట్టినట్టు చె ప్పారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జయమంగళ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం, కార్యకర్తల్లో విభేదాలపై అధిష్టానం ఈ సారి సీటు కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తుందనే అనుమానం కార్యకర్తల్లో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అవకాశం దొరికితే పోటీ చేయడానికి మరో ఇద్దరు నేతలు కాచుకు కూర్చున్నారు. సీటివ్వకపోతే వ్యతిరేకిస్తాం... పత్రిక కథనంతో కంగుతున్న నాయకులు జయమంగళకు సీటు కేటాయించకపోతే వ్యతిరేకిస్తామని శుక్రవారం టీడీపీ ఏలూరు లోక్‌సభ పరిశీలకుడు గరికపాటి రామ్మోహనరావుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసేదిలేక పత్రిక కథనాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని నచ్చచెప్పి పంపించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పెన్మెత్స త్రినాథరాజు, వల్లభనేని శ్రీనివాస చౌదరి, కొత్తూరు విఠల్, రేమల్లి విజయబాబు, నాయకులు సమావేశంలో మాట్లాడుతూ మాగంటి, జయమంగళకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు. -
కావూరి కంపెనీపై చర్యలకు ఎస్బీఐ సిద్ధం!
-
కావూరి కంపెనీపై చర్యలకు ఎస్బీఐ సిద్ధం!
ముంబయి : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కంపెనీపై చర్యలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమంటూ మింట్ పత్రికలో ఒక వార్తా కథనం వెలువరించింది. ప్రోగెస్సివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలో పేరుతో తీసుకున్న మొండి బకాయిలు చెల్లించకపోవడంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రోగెస్సివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ పేరిట రుణం తీసుకోగా, రూ.350 కోట్లు ఎస్బీఐకి బకాయిపడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీలో కావూరి సాంబశివరావుకు 41 శాతం వాటా ఉంది. ఇప్పటికే ప్రోగెస్సివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ బకాయిలపై ఈసీకి బ్యాంకర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈకంపెనీ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.49కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు నుంచి రూ.47కోట్లు, అలహాబాద్ బ్యాంకు నుంచి రూ.42కోట్లు అప్పు తీసుకున్నట్లు బ్యాంకర్స్ అసోసియేషన్ ఆరోపించింది. -
టీడీపీ లో సెగలు
చిచ్చురేపుతున్న కాంగ్రెస్ నేతలు వారికే అగ్రతాంబూలం ఇస్తున్న అధిష్టానం ఘెల్లుమంటున్న తమ్ముళ్లు మాగంటి బాబు, ఇతర నేతల్లో తీవ్ర అసంతృప్తి జిల్లాలో వెలిసిపోరున పసుపు జెండాకు టీడీపీ అధినాయకత్వం కొత్త రంగు అద్దుతోంది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పెద్దలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. రాష్ర్ట విభజనకు సహకరించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ నేతలను పిలిచి మరీ పచ్చకండువా కప్పుతున్నారు. నియోజకవర్గాలు, పట్టణాల్లో ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలసి కాపురం చేయూలంటూ తమ్ముళ్లకు హుకుం జారీ చేస్తున్నారు. అధినేత తీరును పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓటర్లు ఆదరించకపోరునా.. పదేళ్లుగా అధికారానికి దూరమైనా.. ఏదో ఒక రోజున అవకాశం రాకపోతుందా అన్న దింపుడు కళ్లం ఆశలతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను తన స్వార్థం కోసం అధినేత అధఃపాతాళానికి తొక్కేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో’ అనే సామెతకు తెలుగుదేశం పార్టీ అసలైన అర్థం చెబుతోంది. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నుం చి వచ్చే నాయకులకు అధిష్టానం పెద్దపీట వేస్తుం డటం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతోంది. ప్రజాభిమానం కోల్పోరు.. అన్నిదారులూ మూసుకుపోవడంతో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో సూపర్ సీనియర్‌నని చెప్పుకునే కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, భీమవరం, తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కారుమూరి నాగేశ్వరరావు సైతం గత్యంతరం లేక అదే బాటలో పయనిస్తున్నారు. వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద సీట్లను రిజర్వు చేసుకుని టీడీపీలోకి వస్తుండటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. కిందిస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ అధినేత తీరుపై విరుచుకుపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా చంద్రబాబు వ్యవహార శైలిని తప్పు పడుతున్నారు. మాగంటి బాబు ఆగ్రహం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తుండటం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మాగంటి బాబు కు మింగుడు పడటం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలకంగా పనిచేసిన తనను కాదని కావూరికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీని నేరుగా తిట్టలేక కావూరిపై విరుచుకుపడ్డారు. ఆయనవల్లే రాష్ట్రం విడిపోయిందని, కావూరి జెడ్పీటీసీగా కూడా గెలవలేరని బాబు విమర్శించారు. ఆయన టీడీపీలోకి వస్తే సీమాంధ్రలో పార్టీకి నష్టం తప్పదని కుండబద్దలు కొట్టారు. మాగంటి నేరుగా కావూరిపై విమర్శలు చేయడానికి కారణాలు లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం ఏలూరులో నిర్వహించిన సమావేశంలో మాగంటి గెలిచే అవకాశం ఉంటే టీడీపీ నాయకులు తనను ఎందుకు రమ్మని కోరతారని కావూరి అనటం మాగంటి వర్గీయులకు కోపం తెప్పించింది. దీంతో వారంతా కావూరిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కావూరిని పార్టీలోకి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కావూరి టీడీపీలో చేరేందుకు ఉన్నత స్థాయిలో లాబీ నడుపుతున్నారు. ఘెల్లుమంటున్న గూడెం టీడీపీ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరడాన్ని అక్కడి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొట్టుకు తాడేపల్లిగూడెం సీటిస్తే తాము పనిచేసేది లేదని అక్కడి నేతలు, కార్యకర్తలు హెచ్చరికలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముళ్లపూడి బాపిరాజు ఈ విషయంపై అధినేత వద్దే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు పట్టించుకోకుండా వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించడంతో స్థాని క నాయకత్వం డోలాయమానంలో పడింది. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని కాదని కొత్త వారికి సీటిస్తే సహాయ నిరాకరణ చేయాలనే యోచనలో అక్కడి కీలక నేతలున్నారు. భీష్మిస్తున్న భీమవరం నేతలు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొన్నటివరకూ తమను ఇబ్బందులు పెట్టిన వారి కోసం ఇప్పుడు ఎలా పనిచేస్తామని కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నలకు నేతల వద్ద సమాధానం లేకుండాపోయింది. కొత్తవారితో సర్దుకుపోవాలని చంద్రబాబు చెబుతున్న మాటలు వారి చెవికెక్కడంలేదు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకూ పార్టీని నడిపించిన వారి కోసం పనిచేయాలా, కొత్తగా వచ్చిన బయట నేతల కోసం పనిచేయాలో తెలియక కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నారు. -
'కావూరికి ద్వారాలు తెరిచి లేవు'
ఏలూరు : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో రావటాన్ని ఆపార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కావూరికి టీడీపీ ద్వారాలు తెరిచి లేవని టీడీపీ నేత, మాజీమంత్రి మాగంటి బాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ కావూరిని టీడీపీలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోనూ ఫలితాలు తారుమారు అవుతాయని ఆయన హెచ్చరించారు. జరగబోయే ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో తన గెలుపు ఖాయమని మాగంటి బాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే యోచనలో ఉన్న ఆయన మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. తన మనసులోని మాటను నాయకులతో బయటపెట్టించారు. ఇదే సందర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపించారు. ‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ చేయూలని సూచించారు. చివరకు ఎక్కువ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు సమాచారం. -
కావూరి చూపు.. టీడీపీ వైపు
ఏలూరు, న్యూస్‌లైన్: మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయూనికి వచ్చిన ఆయన ఆది వారం వట్లూరు సమీపంలోని సీతారామ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. తన మనసులోని మాటను నా యకులతో బయటపెట్టించారు. ఇదే సం దర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియో జకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపిం చారు. ‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయా లి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ ేయూలని సూచించారు. చివరకు ఎక్కు వ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు పేర్కొన్నారు. ఇంట్లో సమాలోచనలు.. సభలో హైడ్రామా అభిప్రాయ సేకరణకు ముందే కావూరి ఏలూరులోని తన క్యాంపు కార్యాల యంలో అనుయూయులతో మంతనాలు సాగించారు. సభలో ఎవరు, ఏం మాట్లాడాలనే విషయమై దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ముందుగా నిర్ణరుుంచిన ప్రకారం వేదికపైకి సామాజిక వర్గాల వారీగా నాయకుల్ని పిలిచి మాట్లాడిం చారు. ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ట్రస్టు ద్వారా లబ్ధి పొం దినవారే ఊకదంపుడు ప్రసంగాలు చేయ టం విమర్శలకు తావిచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, చావా రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గారపాటి రామసీత, తూతా లక్ష్మణరావు, ముసునూరి నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన కోసం కావూరి పనిచేశారని, ఆయన ఏ పార్టీవైపు నడిస్తే అటువైపు సాగుతామని కొందరు, ఏ పార్టీలో చేరినా మీ వెంట సాగుతామని ఇంకొందరు పేర్కొన్నారు. త్వరలోనే నిర్ణయం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కావూరి కాంగ్రెస్ పెద్దల అసమర్ధత కారణంగానే రాష్ట్రం విడిపోయిం దన్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రి పద వి ఇచ్చే విషయమై రాజీవ్‌గాంధీ నిర్ణయానికి కొందరు అడ్డుపడ్డారని ఆవేదన వ్య క్తం చేశారు. 2004లో మంత్రి పదవి రాలేదని బాధపడ్డానని, 2009లో మనోవేదనకు గురయ్యానని చెప్పారు. పార్టీ సిద్ధాం తాలకు అనుగుణంగా పనిచేసినా గౌరవం దక్కలేదని వాపోయూరు. త్వరలో అందరికీ సంతృప్తినిచ్చే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సమావేశంలో మాగం టి వీరేంద్రప్రసాద్ (బబ్బు), కలిపిండి అప్పారావు, పెరికే వరప్రసాదరావు, కొత్త సాంబశివరావు, బొమ్మి ప్రభాకర్, సైదు సత్యనారాయణ, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, పులి శ్రీరాములు, కారే బాబూరావు, కత్తి రాములు పాల్గొన్నారు. మాగంటి అనుచరుల ఆరా ఇదిలావుండగా, టీడీపీలోకి కావూరి రాకను వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అనుచరులు ఈ సభపై కన్నేసి ఉంచారు. సమావేశంలో ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారనే విషయూలపై ఆరా తీశారు. -
కాంగ్రెస్ లో అసమర్ధ నాయకత్వం: కావూరి
-
కాంగ్రెస్ లో అసమర్ధ నాయకత్వం: కావూరి
ఏలూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితి కనిపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలలో కావూరి ఉన్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారేందుకు అభిప్రాయాల్ని సేకరిస్తున్నారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే తాను ఓ నిర్ణయం తీసుకుంటానని కావూరి అన్నారు. ఆ క్రమంలోనే వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాని కావూరి అన్నారు. కార్యకర్తలు ఒప్పుకుంటే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమర్ధవంతమైన నాయకుడు లేడని.. పార్టీ అసమర్థ నాయకత్వం ఉందని కావూరి ధ్వజమెత్తారు. మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు ఏలూరు నియోజకవర్గంలో జోరందుకున్నాయి. -
అసలు మతలబు ‘ఆత్మీయ’మేనా!
విజయవాడ: కొల్లేరువాసుల ఓట్లు వలలో పడ్డాయి.. ఎంపీ పదవి దక్కింది.. చివరి ఏడాదైనా అనుకున్న కేంద్రమంత్రి పదవి వరించింది.. పైకి ఎన్ని చెప్పినా ఐదేళ్లు పదవులను అనుభవించడం కూడా పూర్తయింది.. ఇంకేముంది అనుకోకండి.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయనకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజలు, కార్యకర్తల ‘ఆత్మీయత’ గుర్తొచింది. కొల్లేరు సమస్యలను పట్టించుకోకుండా, రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా కాలాన్ని వెళ్లబుచ్చే ప్రయత్నం చేసిన కావూరి మళ్లీ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తూ సరికొత్త వేషంతో ముందుకు వస్తున్నారు. ఆయన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు. ఎవరికోసం ‘ఆత్మీయ’ సమావేశం తన రాజకీయ భవితను నిర్ణయించుకునేందుకు ఏలూరులో కావూరి ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏలూరు లోక్‌సభ పరిధిలోని కృష్ణా జిల్లాకు చెందిన కైకలూరు, నూజివీడు కాంగ్రెస్ శ్రేణులకు కబురు పంపించారు. నూజివీడులో ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వర్గమే బలంగా ఉండడంతో కావూరి పిలుపునకు అక్కడి నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదు. కైకలూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల్లోని తన సామాజికవర్గం నుంచి ఏలూరు ఆత్మీయ సమావేశానికి గణనీయంగానే జన సమీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో కావూరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో క్యాడర్, ప్రజల సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకుంటానంటూ ప్రతిపాదన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిని బట్టి తన రాజకీయం కోసమే ఈ సమావేశం ఉద్దేశమన్నది బహిరంగ రహస్యం. టీడీపీలోకి వస్తే మాగంటి ఎటాక్.. కాంగ్రెస్ గుర్తుతో పోటీచేస్తే సీటు గల్లంతయ్యే అవకాశం ఉందని భావించిన కావూరి కనీసం పోటీ ఇచ్చినా పరువు దక్కుతుందన్న ఉద్దేశంతో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం మొదలైంది. అదే జరిగితే ఇప్పటికే టీడీపీలో ఏలూరు ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీమంత్రి మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) నుంచి రాజకీయ ఎటాక్ తప్పేలా లేదు. గతంలో ఇద్దరు కాంగ్రెస్‌లో కొనసాగినా.. అటు తరువాత కాంగ్రెస్, టీడీపీలో చేరొకరు ఉన్నా వీరద్దరి రాజకీయం కొల్లేరు చుట్టూనే తిరిగేది. కొల్లేరువాసుల ఓట్లకు వలవేస్తే గెలుపు సాధ్యమనుకునే వీరిద్దరూ కొల్లేరు రాజకీయాన్ని కొన్నేళ్లుగా చక్కగా పండిస్తున్నారు. ఇప్పటికే మాగంటి ఏలూరు టీడీపీ ఎంపీ టిక్కెట్ తనదే అన్న ధీమాలో ఉన్నారు. ఇంతలో కావూరి ఆ టికెట్ తనుకుపోయి తమ నాయకుడికి కైకలూరు ఎమ్మెల్యే టిక్కెట్‌తో సరిపెడతారేమోననే భయం మాగంటి బాబు అనుయూయుల్లో మొదలైంది. దీంతో కావూరి టీడీపీలోకి వస్తే వ్యతిరేకించేందుకు మాగంటి సైన్యం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అటు కావూరితో స్నేహ సంబంధాలు, ఇటు మాగంటితో పార్టీ సంబంధాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుందని కైకలూరులో అప్పుడే గుసగుసలు మొదలుకావడం కొసమెరుపు. -
కావూరి కొత్త నాటకం నేనేం చేయాలి!
బహిరంగ లేఖలతో మభ్యపెట్టే యత్నం ఇప్పటికీ కేంద్ర పదవిని వదలని వైనం టీడీపీలో చేరేందుకు సన్నాహాలు మరో ఎత్తుగడగా ప్రజల గుసగుసలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నా బాధ్యతల్ని శక్తి మేరకు చిత్తశుద్ధితో నిర్వహించినా పార్టీ నిర్ణయం కారణంగా మీకు నొప్పి కలిగించానేమో. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో మీరే చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ...’ అంటూ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఎన్నికల తరుణంలో బహిరంగ లేఖల పేరుతో జనాన్ని మరోసారి బుట్టలో వేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తాను చేసిన అభివృద్ధి పనులు, పార్లమెంటులో తన ప్రతాపం తదితర వివరాలతో ఆయన ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో చివర లైనులో ప్రజలు చెప్పినట్లు చేస్తానని, ఏంచేయాలో చెప్పాలని ఎంతో వినమ్రంగా వేడుకున్నారు. ఈ లేఖను కరపత్రాలుగా ముద్రించి ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గంలో విస్తృతంగా పంపిణీ చేస్తున్నా రు. ఆ కరపత్రంపైఒక ఫోన్ నంబరు కూడా ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుండటం విశేషం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో జనం రాజీనామా చేయాలని అడ్డుకున్నా, ఘెరావ్ చేసినా, నెత్తీనోరూ మొత్తుకున్నా పదవిని వదలని ఆయన ఇప్పుడు అదే జనాన్ని ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదట్లో సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పనిచేస్తున్న నేతగా బిల్డప్ ఇచ్చిన కావూరి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన తర్వాత ఆ ఉద్యమాన్నే ఎగతాళి చేసి మాట్లాడటం ఎవరూ మరచిపోలేని విషయం. సమైక్యవాదులు, జనాన్ని వెదవలు, దరిద్రులంటూ ఇష్టానుసారం తిట్టిన కేంద్ర మంత్రివర్యులు ఎన్నికలు ముంచుకురావడంతో ఇప్పుడు వారి కే లేఖలు పంపించి ఎంతో వినమ్రంగా ఏంచేయాలో చెప్పండంటూ ఆడుతున్న నాటకం వెగటు పుట్టించేలా ఉందని ఆయన అనుయాయులే అనుకుంటున్నారు. ప్రజలను పట్టించుకోక..పదవిని వీడక.. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ప్రజలు రాజీమానా చేయమని డిమాండ్ చేసినా మంత్రి కావూరి ఏ మాత్రం పట్టించుకోలేదు. పలుమార్లు ఆయన్ను సమైక్యవాదులు అడ్డగించినా లెక్కచేయలేదు. రాష్ట్ర విభజన జరిగిపోతున్న సమయంలోనూ విభజన జరగదని, పార్లమెంటులో తన సత్తా చూపిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలతో అందరినీ గందరగోళంలో పడేశారు. చివరికి కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజనకు అంగీకరించి రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చి మరింత చులకనయ్యారు. పార్లమెంటులోనూ రకరకాల డ్రామాలు ఆడారు. చివరికి విభజన జరిగిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఇంకా కేంద్ర పదవిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జనాన్ని ఎలాగోలా మభ్యపెట్టేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆయన పంపిణీ చేయిస్తున్న బహిరంగ లేఖలు కొద్దిరోజులుగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. ఏలూరు నుంచే పోటీకి తహతహ కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే మంత్రి కావూరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖల భాగోతానికి తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే అభిప్రాయనికి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో జనాన్ని మభ్యపెట్టేందుకు సర్వదా ప్రయత్నిస్తున్నా రు. ఏలూరు ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశానని.. ప్రజలకే కట్టుబడి ఉన్నాననే ప్రచారాన్ని ముమ్మరంగా చేయిస్తున్నారు.ప్రజల్లో తనపై తీవ్రంగా ఉన్న ఆగ్రహాన్ని కొంతవరకైనా చల్చార్చి టీడీపీ తరఫున ఎంపీ గా బరిలోకి దిగాలనేది ఆయన ఎత్తుగడగా కనిపిస్తోంది. -
కావూరి కోలాటం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పదవే పరమార్థంగా పావులు కదుపుతున్న కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీల్లో కల్లోలం రేపుతున్నాయి. ఎలాగైనా కావూరిని పార్టీలోకి తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తుండటం కొందరు నేతలకు మింగుడు పడటంలేదు. కావూరిపై వ్యతిరేకతను వ్యక్తం చేసినా అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతుండటంతో టీడీపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో లాభం లేదనుకుని.. సమైక్యాంధ్ర వీరుడి ముసుగులో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న కావూరి కాంగ్రెస్‌లో లాభం లేదనుకుని కొద్దికాలం నుంచి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. చివరికి తెలుగుదేశంతో లింకు కుదరడంతో అందులోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 13వ తేదీ లోపు కాంగ్రెస్‌కు, మంత్రి పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మాగంటి, చింతమనేని అసంతృప్తి తెలుగుదేశం పార్టీలో చేరితే ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి కావూరిని గానీ ఆయన కుమార్తెను గానీ బరిలో దింపేం దుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఊరూవాడా గుప్పుమంటోంది. కావూరి అనుచరులూ ఈ విషయాన్ని ఇప్పటికే అందరికీ చెప్పుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మింగుడు పడటంలేదు. కావూరి చేరితే తమ సీట్లకు ఎసరు వస్తుందనే భయంతో వారు గంగవైలెత్తుతున్నారు. ఇద్దరికీ ప్రత్యామ్నాయాలు మాగంటి బాబు ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగేం దుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చింతమనేని ప్రభాకర్ రెండోసారి దెందులూరు నుంచి పోటీ చేయడానికి ఎప్పటినుంచో రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారు కావూరిని చేర్చుకోవద్దని అధిష్టానానికి గట్టి సంకేతాలు పంపించారు. వాటిని పట్టించుకోని చంద్రబాబు ఇద్దరికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించినట్లు తెలిసింది. మాగంటి బాబును దెందులూరు అసెంబ్లీకి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను నూజివీడులో పోటీ చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమ సీట్లకు ఎసరు పెట్టిన కావూరిపై నిప్పులు కక్కుతూనే ఇద్దరూ కూడా ఒకరినొకరు విభేదించుకుంటున్నారు. కావూరి రాక ఖాయమైతే అనివార్య పరిస్థితుల్లో దెందులూరు నుంచి పోటీ చేయడానికి మాగంటి బాబు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రభాకర్ మాత్రం ఇందుకు ససేమిరా ఒప్పుకోవడంలేదు. తాను దెందులూరును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెబుతున్నట్టు తెలిసింది. కావాలంటే మాగంటి బాబునే కైకలూరు అసెంబ్లీకి పంపించాలని ఆయన వర్గం సూచిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రభాకర్‌పై మాగంటి బాబు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాజకీయం రసకందాయం మాగంటి బాబు తొలుత దెందులూరు నియోజకవర్గం సీటును తన కుమారుడు రాంజీకి ఇప్పించాలని ప్రయత్నించారు. అయితే చంద్రబాబు ఏలూరు పార్లమెంటును చూసుకోమనడంతో దెందులూరును వదిలేశారు. ఇప్పుడు కావూరి వ్యవహారంతో మళ్లీ దెందులూరుకు మాగంటి పేరును ప్రతిపాదించడం, ప్రభాకర్ దాన్ని వ్యతిరేకించడంతో తెలుగుదేశం రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఏలూరు పార్లమెంటు, దెందులూరు అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుందనే అంశం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. కావూరి విషయంలో కొందరు అనుకూలంగా ఉండగా, మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. మాగంటి బాబు, ప్రభాకర్ మధ్య గొడవ సర్దుమణగాలంటే కావూరిను చేర్చుకోకపోవడమే మంచిదని పార్టీలోని సీనియర్లు వాదిస్తున్నట్టు సమాచారం. కావూరి వల్ల మేలు జరగకపోగా నష్టం జరుగుతుందనేది వారి వాదన. దీంతో చంద్రబాబు ఏలూరు పార్లమెంటు, దెందులూరు అసెంబ్లీ సీట్లను పెండిం గ్లో పెట్టినట్టు సమాచారం. -
కేంద్రమంత్రి కావూరి భవిష్యత్ ఏంటీ?
-
కాంగ్రెస్ ఎంపీలకు సోనియా విందు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం రాత్రి విందు ఇచ్చారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ విందు సమావేశానికి.. సీమాంధ్ర నుంచి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, కిశోర్‌చంద్రదేవ్, పళ్లంరాజు, చిరంజీవి, జె.డి.శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎంపీలు బొత్స ఝాన్సీ, కనుమూరి బాపిరాజు, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు ఎస్.జై పాల్‌రెడ్డి, బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, సురేష్‌శెట్కర్, వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎం.ఎ.ఖాన్, రేణుకాచౌదరి, తదితరులు హాజరయ్యారు. టీఆర్ఎస్తో బంధం ఖరారుకాలేదు: సింఘ్వీ టీఆర్ఎస్తో కాంగ్రెస్ బంధం ఎలా ఉండాలన్న అంశంపై తుది నిర్ణయం జరగలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్సింఘ్వీ పేర్కొన్నారు. ‘తెలంగాణ, సీమాంధ్రకు సమన్యాయం చేసేందుకు కాంగ్రెస్ యత్నించినట్లుగా మరే పార్టీ చేయలేదు. అందుకు అనుగుణంగా అవసరమైన పొత్తులు పెట్టుకునేందుకు మేం సుముఖంగా ఉన్నాం. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’’ అని చెప్పారు. -
రాజధానిగా బెజవాడ భేష్ అని చెప్పా: కావూరి
ఏలూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధానిని కృష్ణా నది ఒడ్డున విజయవాడలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని, ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పానని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చాలా నష్టం జరుగుతుందని కేంద్ర కేబినెట్లో అనేకసార్లు చెప్పానని, అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, ఇక్కడ పరిశ్రమలు నిర్మించుకోవడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహించాలని కోరిన వెంటనే కేంద్రం అంగీకరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడి నుంచి గెలుపొందే 10 మంది ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను చూసి అటువంటి మహానగరాన్ని నిర్మించలేమనుకుని, డబ్బును సంపాదించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని నాయకులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్రాన్ని కోరడం, దానికి కేంద్రం అంగీకరించడం చారిత్రాత్మక తప్పిదమని కావూరు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందంటూనే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటు గురించి మీరేమంటారు అనే ప్రశ్నకు పార్టీ పెట్టినప్పుడు చూద్దాంలే అంటూ దాటవేశారు. -
కాంగ్రెస్‌లో కొనసాగాలా.. వద్దా?: కావూరి
ఏలూరు: కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్నానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కేడర్, ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేస్తానని కావూరి స్పష్టం చేశారు. 1984 కంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అద్వాన్నంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కావూరి సమర్థించారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పార్టమెంట్‌లో టీబిల్లు అమోదించిన విధానం అవమానకరమని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బలిపెట్టి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడానికి విభజన చేయడం దురదృష్టకరమని అన్నారు. నేటి కేబినెట్ భేటీలో పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకువస్తామని, భద్రాచలం గుడి గ్రామం తప్పితే డివిజన్లోని అన్ని గ్రామాలు ఆంధ్రాలో కలిసే విధంగా కృషిచేస్తానని కావూరి చెప్పారు. -
రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా
రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. శనివారం సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... విజయవాడ - గుంటూరు నగరాల మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేస్తానని కావూరి సాంబశివరావు తెలిపారు. -
కావూరిపై కురియన్ ఫైర్...
సాక్షి, న్యూఢిల్లీ: పలువురు మంత్రులు తమ నివేదికలు బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండగా.. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు వెల్‌లో ఆందోళన చేస్తుండటంపై ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘లోక్‌సభ సభ్యుడై మంత్రిగా ఉంటే ఈ సభలో వచ్చి ప్రభుత్వపరంగా తన పనితాను చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఎలా సభావ్యవహారాలకు ఆటంకం కలిగిస్తారు..’ అని డిప్యూటీ చైర్మన్‌ను అడిగారు. వెంకయ్యనాయుడు కూడా లేచి ‘పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ఏంచేస్తున్నారు? మీ మంత్రులే వెల్‌లోకి వస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. దీంతో.. లోక్‌సభ సభ్యులు మంత్రులుగా ఉండి ఇక్కడికి వచ్చి.. ఎలా అంతరాయం కలిగిస్తారని కావూరిని డిప్యూటీ చైర్మన్ ప్రశ్నించారు. ‘మీరు సభను వదిలిపెట్టండి..’ అని సూచించారు. మంత్రులుగా ఉన్నవారు నిరసన తెలపాలనుకుంటే.. ఆ పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు రమేశ్, సుజనాచౌదరిలు డిప్యూటీ చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి సభ మళ్లీ అదుపుతప్పటంతో 3.34 గంటల సమయంలో నాలుగు గంటల వరకు వాయిదావేశారు. తిరిగి సభ సమావేశమయ్యాక పలు బిల్లులను ఆమోదించారు. ఆ తరువాత సభ 4.26 సమయంలో సాయంత్రం 5 గంటలకు వాయిదాపడింది. మళ్లీ సమావేశమయ్యాక కావూరి మాట్లాడుతూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఏ ప్రాతిపదికన తెస్తున్నారని ప్రశ్నిస్తుండగా.. ‘ఆ బిల్లు సభకు రాలేదు.. దానిపై ఇప్పుడు మాట్లాడేందుకు ఏమీ లేదు’ అంటూ కురియన్ సభను గురువారానికి వాయిదావేశారు. -
రాజ్య సభలో పెద్ద రభస
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు), లోక్‌సభ సభ్యులు రాజ్యసభలోకి ప్రవేశం, సభల పరువు, రాజ్యాంగ నిబంధనలు, రాజ్యసభ చైర్మన్ విచక్షణాధికారాలు... తదితర అంశాలపై ఈరోజు రాజ్యసభలో పెద్ద రభస జరుగుతోంది. వాయిదాలపై వాయిదాలు వేస్తున్నారు. తెలంగాణ బిల్లుపై తీవ్ర ఆందోళన, గందరగోళం చోటు చేసుకున్నాయి. ఇప్పటికే లోక్‌సభ పరువు, ప్రతిష్టలు పోయాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాజ్యసభ పరువైనా కాపాడండి, సభ గౌరవం మంటగలపొద్దు అని విజ్ఞప్తి చేశారు. సభను బుల్డోజ్ చేసి బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండని కోరారు. పెద్దలసభలో గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు సభ మర్యాదలు పాటించాలన్నారు. లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును ఉద్దేశించి లోక్‌సభ సభ్యులు వచ్చి రాజ్యసభను ఆటంకపరచకూడదని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ చెప్పారు. రాజ్యాంగంలో ఈ నిబంధన స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. దయచేసి లోక్‌సభ్యులు సభను విడిచి వెళ్లాలని కురియన్ కోరారు. సీమాంధ్ర సభ్యులు వెల్‌లోకి వెళ్లడంతో, వెల్‌లో నిరసన తెలపాలంటే ముందు రాజీనామా చేయండని డిప్యూటీ చైర్మన్ చెప్పారు. సభ సజావుగా సాగేలా సభ్యులు నడుచుకోవాలని కోరారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సభను అడ్డుకోవద్దని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరారు. నచ్చకపోతే సభ నుంచి వెళ్లిపోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు కానప్పుడు సభను ఎలా అడ్డుకుంటారని రాజ్యసభలో విపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ కావూరిని ఉద్దేశించి ప్రశ్నించారు. మంత్రిగా మాత్రమే సభకు రావొచ్చని తెలిపారు. అంతేతప్ప సభను అడ్డుకోవద్దని కోరారు. రాజ్యసభలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వాళ్ల మంత్రులే బిల్లు ప్రవేశపెడతారు, వాళ్ల మంత్రులే వెల్‌లోకి వెళ్లి అడ్డుకుంటారని అన్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర విభజన బిల్లు పెట్టడానికి వీళ్లేదని విపక్షాలు పట్టుపట్టాయి. కనీసం ఒక రోజు గడువు ఇవ్వాలని కోరాయి. బిల్లుపై చైర్మన్‌కు విచక్షణాధికారం ఉందని కురియన్ తెలిపారు. ఎప్పుడైనా సభ ముందు బిల్లు పెట్టవచ్చునని చెప్పారు. -
బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దు: సీమాంధ్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దని స్పీకర్ మీరాకుమార్‌కు సీమాంధ్రకు చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు లేఖ రాశారు. 14వ తేదీతో ఉన్న ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పురందేశ్వరి ఉన్నారు. ‘‘నిబంధనావళితో సంబంధం లేకుండా కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సభలోకి తెచ్చారు. సవరించిన ఎజెండాలో కూడా లేనప్పుడు సప్లిమెంటరీ బిజినెస్‌లో ఉండడం సభాసాంప్రదాయం. కానీ ఆ బిల్లు సవరించిన ఎజెండాలో లేదు. సప్లిమెంటరీ ఎజెండా కూడా ఏదీ ఇవ్వలేదు. మీరు మాత్రం 12 గంటలకు హోంమంత్రిని పిలిచారు. సప్లిమెంటరీ జాబితా 2 గంటలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా సభా సంప్రదాయాలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉద్దేశాలను, స్పీకర్ కార్యాలయం ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది. బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రకటించడాన్ని బీజేపీ సహా అనేక రాజకీయ పార్టీలు ఖండించాయి. తిరిగి బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి’’ అని అందులో కోరారు. సస్పెన్షన్లపై పునరాలోచించాలి: ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఎత్తివేయాలని కోరుతూ ఈ ఐదుగురు కేంద్ర మంత్రులు స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. సభను అడ్డుకోవద్దు: అద్వానీ కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి, చిరంజీవి, కిల్లి కృపారాణి సోమవారం బీజేపీ అగ్రనేత అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ ప్రాంతానికి తగిన ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేలా సహకరించాలని, తమ ప్రాంత ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు అద్వానీని కోరారు. అద్వానీ సానుకూలంగా స్పందించారు. అలాగే, పార్లమెంటు సాంప్రదాయాలను కాలదన్ని వెల్‌లో నిరసనలకు దిగడం సరికాదని, సభను అడ్డుకోవద్దని అద్వానీ వారికి సూచించారు. ఈ భేటీలో మరో కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొనలేదు. -
లోక్‌సభలో రేపు టి బిల్లు: కమల్‌నాథ్
-
'టి.బిల్లుపై రేపు మాట్లాడనున్న సోనియా'
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో రేపు చర్చ జరుగుతుందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మంగళశారం లోక్‌సభలో కచ్చితంగా చర్చ జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బిల్లుపై సోపియా గాంధీ మాట్లాడే అవకాశముందన్నారు. తెలంగాణ బిల్లును వంద శాతం ఆమోదించి తీరుతామన్నారు. బిల్లును వ్యతిరేకించాలనుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల సస్పెన్షన్ తొలగింపుపై లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా, కమల్‌నాథ్‌తో సీమాంధ్ర కేంద్రమంత్రుల వాగ్వాదానికి దిగారు. ఎలాగైనా విభజన బిల్లును అడ్డుకుని తీరుతామని కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం 3 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ వారంలోనే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. రాజ్యసభ బీఏసీ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించారు. రాజ్యసభలో చర్చకు చైర్మన్ హమిద్ అన్సారీ సమయం కేటాయించారు. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో విభజన బిల్లు పెద్దల సభకు వచ్చే అవకాశముంది. -
ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: కావూరి
ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాస్తాం.. వెల్‌లోకి వెళతాం.. ప్రతిఘటిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: సహచర సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివే యాలని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. ‘ఎవరికి చెప్పుకున్నా వినలేని పరిస్థితుల్లోనే వెల్‌లోకి వెళ్లాలనుకున్నాం. సోమవారం వెళతాం. ఆ తర్వాతా వెళతాం. ప్రతిఘటన తప్పదు..’ అని అన్నారు. ఆదివారం రాత్రి కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై 3 గంటలపాటు చ ర్చించారు. అనంతరం కావూరి మీడియాతో మాట్లాడారు. ‘అసలు హింసాత్మక పద్ధతులకు ఎవరు పాల్పడ్డారు. వీడియో దృశ్యాలు చూడాలి. అప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులను బయటకు పంపి రాష్ట్రాన్ని విభజించడాన్ని చరిత్ర క్షమించదు. మా సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి. సభలోకి రావడానికి అనుమతించాలని స్పీకర్ గారిని అడగబోతున్నాం. దీనికి కాంగ్రెస్, ప్రతిపక్షాల నేతలు కూడా సహకరిస్తారని నమ్ముతున్నాం. ప్రధాని, సోనియా, జీఓఎంకు చెప్పినా.. అసెంబ్లీ తిప్పిపంపినా వినకుండా విభజిస్తే దేశం ఎలా ముక్కలవుతుందో చెప్పదలుచుకున్నాం. కేబినెట్లో చర్చించినా మా అభిప్రాయాలకు విలువ లేకపోతే ఎలా? పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నాం..’ అని చెప్పారు. ‘బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నేను కూడా ఉన్నా. సంప్రదాయమేంటి. సవరించిన జాబితాలో పెట్టొచ్చు. అర్జంట్ అయితే సప్లిమెంటరీ ఎజెండాను సభ్యులకు పంచిపెడతారు. సభ్యులు అడ్డుచెబితే సభ అభిప్రాయం తీసుకుని.. సభా సంప్రదాయం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ గొడవలో ఎవరు ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితిలో బిల్లును తెచ్చినట్టు చెప్పడం సబబు కాదు..’ అని పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం.. ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట, బాపిరాజు, సారుుప్రతాప్, సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి, కేవీపీ, హర్షకుమార్లు పాల్గొన్నారు. -
తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం: కావూరి
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం అని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఆయన నివాసంలో జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల భేటీ అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశపెడతారు అని కావూరి మండిపడ్డారు. సస్పెన్షన్ ధర్మబద్దంగా జరగలేదని స్పీకర్ మీరాకుమార్ కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు లేఖ రాశారు. సవరణలను ముందే బిల్లులో చేర్చాలని సీమాంధ్రమంత్రులు డిమాండ్ చేశారు. సవరణలు బిల్లులో పెట్టకుంటే మంత్రులందరం వెల్‌లోకి వస్తాం అని కేంద్ర మంత్రి కావూరి హెచ్చరించారు. లోక్‌సభ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజిని విడుదల చేయాలి కావూరి కోరారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపక్షాలు కూడా సహకరిస్తారని భావిస్తున్నానని కావూరి ఆశాభావం వ్యక్తంచేశారు. -
తెలంగాణ బిల్లుపై నేతల భిన్నాభిప్రాయాలు
టీ బిల్లును ప్రతిఘటిస్తాం : కావూరి చింతలపూడి, న్యూస్‌లైన్: పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు విధేయుడనని, అలాగని ప్రజలకు నష్టం కలిగిస్తే పార్టీలో ఎంతటి వారిపై అయినా తిరగబడతానని పేర్కొన్నారు. విభజన దేశానికి మంచిదికాదని సోనియా సహా కేంద్ర మంత్రులకు పలుమార్లు హెచ్చరించామన్నారు. బతికుంటే మహాత్ముడు సిగ్గుపడేవారు: కోట్ల కోడుమూరు, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కమల్‌నాథ్ నిండుసభలో గుండాగిరి చేశారని, ఈ ఘటన ప్రజాస్వామ్యానికే తలవంపని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మహాత్మాగాంధీ బతికుంటే వీరి తీరుకు సిగ్గుపడేవారని అన్నారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితులు లేవని సర్వేలు చెబుతున్నా పార్టీ పెద్దలకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. సీమాంధ్ర ఎంపీల తీరు సరిగాలేదు: పనబాక బాపట్ల/పర్చూరు, న్యూస్‌లైన్: లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరు సరిగాలేదని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఆమె గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా పర్చూరులో విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం చూశానన్నారు. బిల్లు ప్రవేశపెట్టేవరకు మౌనంగా ఉన్న లగడపాటి ఒక్కసారిగా పెప్పర్ స్ప్రే చేయడం, ముందుకు దూసుకెళ్లడం సరికాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమన్యాయమంటూ మాట్లాడటం సరికాదని విమర్శించారు. తాను బాపట్ల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానన్నారు. దారులు మూసుకుపోలేదు: జేడీ శీలం అద్దంకి, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు విషయంలో సీమాంధ్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇంకా దారులు మూసుకుపోలేదని కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో శనివారం మాట్లాడుతూ.. ‘‘నాలుగు రోజులు ఆగండి. అన్నీ తెలుస్తాయి. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించడానికి తెర వెనుక, ముందు చేయాల్సినవన్నీ చేస్తున్నాం. రెండు ప్రాంతాల వారి మనసులు విరిగిపోయాయి. ఏనాడైనా విడిపోవాల్సిందే. ఈ సమావేశాల్లో బిల్లు పాసవుతుందో లేదో చెప్పలేం’’ అని అన్నారు. ఫుటేజీ రేపు బయట పెడతా: సబ్బం సాక్షి, విశాఖపట్నం: లోక్‌సభలో నిజానికి ఎవరు ఎవరిపై దాడికి ప్రయత్నించారనే దానిపై దూరదర్శన్ వీడియో ఫుటేజీలను సోమవారం బయట పెడతానని ఎంపీ సబ్బం హరి ప్రకటించారు. దూరదర్శన్‌కు ఇప్పటికే ఈ మేరకు లేఖ రాశానని శనివారం చెప్పారు. అంతేగాక అత్యంత సంచలనాత్మకమైన ఒక అంశంపై సోమవారం నోరు విప్పుతానన్నారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆ అంశంపై లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు తానిప్పటికే ప్రశ్న పంపినా అదింకా సభలోకి రాలేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీమాంధ్ర ఎంపీలను సోనియా తన బలంతో, ఇతర రాష్ట్రాలకు చెందిన గూండా ఎంపీలతో దాడికి ఉసిగొల్పేందుకు పూనుకోవడం హేయమని సబ్బం అన్నారు. లోక్‌సభ స్పీకర్‌తోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు సోనియా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, వారు అచ్చం బానిసలను తలపిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీది ద్వంద్వవైఖరి: బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతిస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. మాట నిలబెట్టుకుంటేనే బీజేపీకి గౌరవం దక్కుతుందన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు మినహా మిగతా ప్రాంతమంతా తెలంగాణలోనే ఉంచాలని అన్నారు. సస్పెన్షన్ ఎత్తేయాలి: సమైక్యాంధ్ర పోరాట కమిటీ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 17న సీమాంధ్ర జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 21 వరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
పార్లమెంట్లో కాంగ్రెస్ గూండాగిరి
* సీమాంధ్ర ఎంపీల ధ్వజం * ఇతర రాష్ట్రాల ఎంపీలను పెట్టి కొట్టించారు * కాంగ్రెస్ చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారు * టెన్ జనపథ్ నుంచే ఫ్లోర్ మేనేజ్మెంట్ * లోక్‌సభ వీడియోలను ప్రజల ముందుంచుతాం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గూండాగిరి చేస్తోందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలను మోహరింపజేసి తమపై దాడి చేయించారని వాపోయారు. విభజన బిల్లు విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో పోలిస్తే లోక్‌సభలో లగడపాటి రాజగోపాల్ చేసిన పని చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ను సజావుగా నడపాల్సిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కాంగ్రెస్ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో ఎవరు ఎవరిపై దాడి చేశారో... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరనే విషయంపై లోక్‌సభ వీడియో పుటేజీలను సేకరించి ప్రజల ముందుంచుతామని తెలిపారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం ఉదయం ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, జి.హర్షకుమార్, సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్ తదితరులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై గంటకుపైగా చర్చించారు. లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలకు తమను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నందున వాస్తవాలను బయటపెట్టేందుకు లోక్‌సభ వీడియో దృశ్యాలను సేకరించాలని నిర్ణయించారు. దీంతోపాటు విభజన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి వివరించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ మూడూ సవరిస్తే విభజనకు ఓకే: కావూరి రాష్ట్రాల విభజనకు శాస్త్రీయ విధానం ఉండాలి. ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎందుకు విడదీస్తున్నారు? మేము ప్రతిపాదించిన మూడు సవరణలకు కేంద్రం సోమవారంలోగా అంగీకరిస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తాం. హైదరాబాద్‌ను పదేళ్లపాటైనా యూటీ చేయాలి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలి. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి. వీటిని అంగీకరించకపోతే తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం. నేనూ సిగ్గుపడుతున్నా: లగడపాటి లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. అలాంటి చర్యలు ఎవరు చేసినా ఆక్షేపణీయమే. అందుకు నేను సిగ్గుపడుతున్నా. నిన్నటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులేమిటో అందరికీ తెలియాల్సిన అవసరముంది. మాపై దాడి చేయడానికి వందమంది ఎంపీలు వచ్చారు. నా సహచర ఎంపీపైనా దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసమే పెప్పర్‌స్ప్రే ఉపయోగించాను. మమ్మల్నే ఎందుకు సస్పెండ్ చేశారు?: హరి కాంగ్రెస్ అప్రజాస్వామికంగా బిల్లును ప్రవేశపెట్టింది. గురువారం సుమారు వందమంది ఎంపీలు వెల్‌లోనే ఉండి ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు? పార్లమెంట్ ఏమైనా జన్‌పథ్ అనుకుంటున్నారా? జన్‌పథ్ నుంచి పంపిస్తే తెలుస్తుంది: హర్షకుమార్ రాష్ట్రాన్ని విడగొట్టి మమ్మల్ని హైదరాబాద్ నుంచి పంపుతామంటున్నారు. మిమ్మల్ని (సోనియాగాంధీని ఉద్దేశించి) జన్‌పథ్ నుంచి పంపితే ఎంత బాధ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. పార్లమెంట్లో ఫ్లోర్ మేనేజ్మెంట్ అంతా జన్‌పథ్ నుంచే నడిస్తోంది. దీనికి కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు. సీట్ల కోసం విభజిస్తారా?: సాయిప్రతాప్ తెలంగాణలో సీట్లు రావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతిపక్షాలకు తెలీకుండా పార్లమెంట్లో బిల్లును పెడుతున్నారు. ఇంతకంటే అప్రజాస్వామిక చర్య ఏముంటుంది? సస్పెన్షన్ ఎత్తివేయండి స్పీకర్‌కు లగడపాటి, సబ్బం లేఖలు సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నిర్హేతుకం, అన్యాయమైనదని ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి పేర్కొన్నారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు వేర్వేరుగా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి నిజమైన ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటు విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఇద్దరు సభ్యులు విడివిడిగా లేఖలు రాశారు. -
కావూరి మూడు షరతులు
-
పదేళ్లపాటు హైదరాబాద్ యూటీ చేయాలి: కావూరి
తెలంగాణ బిల్లుకు సవరణలు చేస్తేనే తాము ఆమోదిస్తామని, లేని పక్షంలో మళ్లీ వెల్‌లోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండు చేశారు. కేంద్ర సంఘటిత నిధి నుంచి సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు కూడా భాగం ఇవ్వాలని కావూరి అడిగారు. ఈ సవరణలకు అంగీకరించని పక్షంలో తాము మరింతగా ఆందోళన చేయడం ఖాయమని ఆయన చెప్పారు. -
కావూరి నివాసంలో సీమాంధ్ర ఎంపీల భేటీ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో నిన్న తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, అనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యచరణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆదివారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో సమావేశం కానున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. -
విభజన బిల్లును అడ్డుకుంటాం
-
విభజన బిల్లును అడ్డుకుంటాం
సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల ప్రకటన కేంద్ర మంత్రి కావూరి నివాసంలో గంటకుపైగా భేటీ పనబాక, కిశోర్ మినహా మంత్రులంతా హాజరు బీజేపీ కాళ్లు పట్టుకుంటున్న కాంగ్రెస్.. సొంత ఎంపీలకు ఏమి కావాలో అడగలేదా? బిల్లును అడ్డుకొనేందుకు వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయన్న ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు స్పష్టంచేశారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఢి ల్లీలోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో బుధ వారం రాత్రి ఎనిమిది గంటలకు సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. గంటకుపైగా సాగిన ఈ కీలక భేటీలో కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పల్లంరాజు, జేడీ శీలం, చిరంజీవి, ఎంపీలు బొత్స ఝాన్సీ, అనంత వెంకటరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు, బహిష్కృత ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, సబ్బం హరి, సాయిప్రతాప్, ఉండవల్లిఅరుణ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన అరగంట తర్వాత కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు వచ్చారు. తెలంగాణ బిల్లు, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపైనా చర్చించినట్లు సమాచారం. బీజేపీ కాళ్లు పట్టుకుని బిల్లుకు మద్దతు కోరుతున్న కాంగ్రెస్ పెద్దలు.. సొంత పార్టీ ఎంపీలను చేతులు పట్టుకుని ఏం కావాలో అడగలేని స్థితిలో ఉన్నారని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకోవాలని వీరంతా నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం ఎంపీలు మాగుంట శ్రీనివాసులు, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్ విలేకరులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకునేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు వస్తోందన్నారు. రైల్వే బడ్జెట్ సమయంలోనూ నలుగురు కేంద్ర మంత్రులు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన తెలిపారని, పార్లమెంటు చరిత్రలోనే ఇది మొదటిసారి అని తెలిపారు. తెలంగాణ బిల్లు పెడితే మిగిలిన మంత్రులు కూడా వెల్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బహిష్కృత ఎంపీ సాయిప్రతాప్‌తో అవిశ్వాస తీర్మానం పెట్టిస్తామని, ఇందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగడుతున్నామని చెప్పారు. నలుగురు కేంద్ర మంత్రులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగిందని లగడపాటి అన్నారు. తమను సభ నుంచి సస్పెండ్ చేయకుండా అవిశ్వాస తీర్మానాన్ని కవచంలా అడ్డు పెట్టుకుంటామన్నారు. కాగా, ఈ సమావేశానికి సీమాంధ్రకే చెందిన కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిశోర్‌చంద్రదేవ్ హాజరుకాలేదు. అవిశ్వాసానికి మద్దతివ్వను : కనుమూరి బాపిరాజు పార్లమెంటులో సహచర ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తాను మద్దతివ్వనని లోక్‌సభ సభ్యుడు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. ప్రజల మనోభావాలు తెలిపేందుకు మూడు రోజులుగా లోక్‌సభలో వెల్‌లోకి వచ్చి నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. 36 ఏళ్ల తన రాజకీయ జీవితంలో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలా వెల్‌లోకి వెళ్లలేదని అన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పదేళ్లు యూటీ చేస్తే ఓకే: కావూరి పదేళ్లపాటు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తే తెలంగాణ బిల్లుకు శాస్త్రీయత వస్తుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. పది సంవత్సరాల్లో సీమాంధ్రలో అన్ని సదుపాయాలూ అభివృద్ధి చేసుకునే వీలుంటుందని, అప్పుడు రాష్ట్రం విడిపోయినా ఏ ప్రాంతానికీ ఇబ్బంది ఉండదన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని విజయ్చౌక్వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం ఆత్మగౌరవం, స్వయంపాలన అన్న అంశాల ప్రాతిపదికనే రాష్ట్రాన్ని విభజించడం సరికాదన్నారు. ఇలా చేస్తే దేశంలో అన్ని ప్రాంతాలనూ ముక్కలు చేయాల్సి వస్తుందన్నారు. ఎంపీగా ఏనాడూ సభలో వెల్‌లోకి వెళ్లని తాను ప్రజల భావాలు తెలిపేందుకు కేంద్ర మంత్రిగా ఉన్నా ఈ రోజు వెల్‌లోకి వెళ్లానని చెప్పారు. తనది ప్రాంతీయ వాదంకాదని, దే శీయవాదం అని పేర్కొన్నారు. తెలుగు జాతి పరువు తీశారు: టీ ఎంపీలు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, టీడీపీ ఎంపీలు రైల్వే బడ్జెట్ సందర్భంగా సభలో తెలుగు జాతి పరువు తీశారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు. సభలో వెల్‌లోకి దూసుకెళ్లడం, అధికారులను దూషించడం, బడ్జెట్ కాగితాలను చించివేయడం, పెన్నులు లాక్కోవడం అవమానకరంగా ఉందన్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేశ్‌షెట్కార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు బుధవారం విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. -
రాష్ట్ర విభజన అనాలోచిత చర్య: కావూరి
-
కేంద్రమంత్రిగా ఉంటే ప్రజల వాదన వినిపించకూడదా?
న్యూఢిల్లీ : సీమాంధ్ర ప్రజల వాదనను వినిపించేందుకే స్పీకర్ వెల్‌లోకి దూసుకు వెళ్లినట్లు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్లో టేబుల్ ఐటంగా తీసుకు వచ్చినప్పుడే తెలంగాణ బిల్లుపై అభ్యంతరం తెలిపానని కావూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రిగా ఉంటే ప్రజల వాదన వినిపించకూడదా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో తొలిసారిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు వెల్ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. -
కావూరి కార్యాలయ ముట్టడికి యత్నం
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం టీడీపీ శ్రేణులు ఏలూరులోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు ఆధ్వర్యంలో పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి కోట రామారావు(బుజ్జి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్‌లను పోలీసులు అదుపులోనికి తీసుకుని స్టేషన్‌కు తరలించేందుకు జీపు ఎక్కించారు. అయితే కార్యకర్తలు జీపుగా అడ్డుగా రోడ్డుపై బైఠాయించడంతో అరెస్టు చేసిన నాయకులను వదిలివేశారు. అనంతరం బడేటి బుజ్జి, మాగంటి బాబు మాట్లాడుతూ సీమాంధ్రుల మనోభావాలను గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో దూకుడుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలవాల్సిన కావూరి సాంబశివరావు ప్యాకేజీలకు అమ్ముడుపోయి ప్రజలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లేపల్లి రాజు, ఈడ్పుగంటి నరసింహరావు, భీమవరపు సురేష్‌కుమార్, శేషపు వెంకటేశ్వరరావు, చోడే వెంకటరత్నం, ఎ.మధు పాల్గొన్నారు. -
'తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్న ఢిల్లీ'
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. చచ్చిపోయిన తెలంగాణ ఉద్యమానికి చిదంబరం ప్రకటనతో మళ్లీ జీవం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ నుంచే ప్రాణం పోస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో బాగా వెనుకబడ్డాం కాబట్టి తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణవాదులు తర్వాత మాట మార్చారని చెప్పారు. 1956 తర్వాత తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని శ్రీకృష్ణ కమిటీ తేల్చడంతో.. స్వయం పాలన, మనోభావాలంటూ విభజన కోరుతున్నట్టు ప్రకటించారని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కావూరి విమర్శించారు. -
40 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నా ప్రాధాన్యతలేదు
తణుకు: తాను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నాకూడా ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో కావూరికి సమైక్య సెగ తగిలింది. సమైక్యవాదులు ఆయనను నిలదీశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ తాను కూడా సమైక్యవాదినేనని చెప్పారు. ఆఖరి వరకు సమక్యవాదిగానే పోరాడుతానన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. -
కావూరికి సమైక్య సెగ
ఢిల్లీలో మంత్రి నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర విద్యార్థి జేఏసీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కేంద్రం మొండిగా ముందుకు వెళుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలో కావూరి ఇంటిని ముట్టడించారు. విభజన బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కావూరి నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేత అడారి కిశోర్, సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని ప్రసాద్‌ల నేతృత్వంలో 30 మంది విద్యార్థులు కావూరి ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా కావూరి వారిని కలిసేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. ఇంటిముందు బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యతను కాపాడతానని ప్రతిజ్ఞ చేసిన కావూరి నేడు పదవి కాపాడుకునేందుకు అధిష్టానానికి సహకరిస్త్తున్నారని ఆరోపించారు. కావూరి ఇంటిముం దున్న నేమ్‌ప్లేట్‌కు ‘రాష్ట్రాన్ని కాపాడండి’ ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అన్న పోస్టర్లను అతికించారు. అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి నేత కిశోర్‌తోపాటు ఇతరులను అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టా రు. 15 రోజుల్లో పోయే పదవి కోసం కావూరి సమైక్య నినాదాన్ని పక్కనపెట్టారని విద్యార్థి నేత కిశోర్ విమర్శించారు. -
కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత
-
కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత
ఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కుండీలను పగలకొట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి నాయకులు సేవ్ఆంధ్రప్రదేశ్ పోస్టర్లను అతికించి నిరసన తెలిపారు. -
కేబినెట్ లో కావూరి, సీమాంధ్ర మంత్రులకు చుక్కెదురు!
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు చేసిన ప్రయత్నాలకు బెడిసికొట్టాయి. అసెంబ్లీ చర్చించిన బిల్లునే యథాతథంగా కేబినెట్ ముందుకు తీసుకువెళ్లారు. బిల్లును కేబినెట్‌కు మంత్రివర్గ సభ్యులు చిదంబరం, జైరాంరమేష్‌లు వివరించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కావూరి చేసిన ప్రతిపాదనను కేబినెట్ తోసిపుచ్చింది. అయితే కనీసం హైదరాబాద్‌ను యూటీ చేయాలని ముగ్గురు సీమాంధ్ర మంత్రులు చేసిన విజ్క్షప్తికి కేబినెట్ నిరాకరించింది. సీమాంధ్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలను, విజ్క్షప్తులను కుదరదని కేబినెట్ తోసిపుచ్చినట్టు సమాచారం. బిల్లుకు సంబంధించి...మొత్తం 30 నుంచి 40 సవరణలు ఉన్నాయని తెలుస్తోంది. సవరణలను అధికారికంగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధానికి సంబంధించి అన్ని అనుమతులనూ బిల్లు ద్వారా ఓకే కేంద్రం చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదించిన మరికొన్ని అంశాలు: 10 ఏళ్లపాటు సీమాంధ్ర-తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతి భద్రతలు షెడ్యూల్ ప్రకారమే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలనే యోచన పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రకే సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే కొత్త రాజధానికి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనేదానిపై పార్లమెంట్లో నిర్ణయం సీమాంధ్ర పన్ను రాయితీ ప్రకటించిన కేంద్రం -
తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమస్యే లేదు: కావూరి
తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే సమస్యే లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. అందుకు తమ వ్యూహాలు తమకున్నాయని, తమ అస్త్రాలు, ఎత్తుగడలు అన్నీ సిద్ధంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను యూటీ చేయకపోతే కేంద్ర మంత్రివర్గ సమావేశం నుంచి వాకౌట్ చేస్తానని కావూరి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయకపోతే ఇక సీమాంధ్రులకు ఏరకంగా ఉపయోగం ఉంటుందని ఆయన మండిపడ్డారు. అయితే హైదరాబాద్ నగరాన్ని నేరుగా యూటీ చేయకుండా, యూటీకి ఉండే లక్షణాలన్నీ దానికి కల్పిస్తామని జీవోఎం అంటే, అలా చేస్తే ఉపయోగం ఏమీ ఉండదని కావూరి వాదించారు. -
మెడ్విన్ ఆసుపత్రి సీజ్‌కు జీహెచ్ఎంసీ యత్నం
పన్ను బకాయిపై అధికారుల నిర్ణయం హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీమణికి చెందిన మెడ్విన్ ఆసుపత్రి భవనాన్ని సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లడంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడి అబిడ్స్ చిరాగ్అలీ లేన్‌లోని ఉన్న ఈ 11 అంతస్తుల ఆసుపత్రి భవనానికి సంబంధించి శ్రీమణి జీహెచ్ఎంసీకి రూ.71.5 లక్షలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలతో కలిపి వెంటనే పన్ను చెల్లించాలని జీహెచ్ఎంసీ 8వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్ నవంబర్ 7న రెడ్‌నోటీస్ జారీ చేశారు. అయినా యాజమాన్యం పన్ను చెల్లించకపోవడంతో గురువారం డీఎంసీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది ఆసుపత్రిని సీజ్ చేసేందుకు అక్కడికి చేరుకున్నారు . ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి, జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటల తర్వాత ఆసుపత్రి యాజమాన్యం రూ.13.3 లక్షలు చెల్లించడంతో వివాదం సద్దుమణిగింది. మిగతా బకాయిలన్నీ వారం రోజుల్లో చెల్లిస్తామని ఆసుపత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. -
సమస్యలు త్వరలో సమసిపోతాయి
కామవరపుకోట, న్యూస్‌లైన్ :కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజలకు కోపం ఉందని, అయితే త్వరలోనే సర్దుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం అన్నారు. కామవరపుకోట మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామవరపుకోట చౌత్‌నా సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి శీలం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యలున్నాయని అవన్నీ త్వరలోనే సమసిపోతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. మంత్రి కావూరు సాంబశివరావు సమర్థవంతమైన నాయకుడన్నారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులు, రైతు కూలీలు అందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివరావు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఎన్ని పెట్టుబడులు పెట్టినా అభివృద్ధి అంతగా ఉండదని, రైతాంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పదవులు పొందే నాయకులున్న ఈ రోజుల్లో కనీసం 20- 30 శాతం మంచి ప్రజాప్రతినిధులున్నా దేశం బాగుపడుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తిమేరకు కృషి చేస్తానని కావూరు సాంబశివరావు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి ఇప్పటి వరకు రైతులు, రైతు కూలీల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఐడీసీ చైర్మన్ ఘంటా మురళీ రామకృష్ణ మాట్లాడుతూ కామవరపుకోటలో మూడు కిలోమీటర్లు సీసీరోడ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు, కామవరపుకోట - ద్వారకాతిరుమల మెయిన్ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణను కోరగా అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. అంతకుముందు తడికలపూడిలో రూ.22 లక్షలతో నిర్మించే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు భవనం, ఆడమిల్లిలో రూ.7 కోట్ల ఎస్సీ, ఎస్టీ గ్రాంట్‌తో నిర్మించే రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి, ఆదర్శ డిగ్రీ కళాశాలకు, కామవరపుకోటలో రూ.50 లక్షలతో నిర్మించే మార్కెట్‌యార్డు గోడౌన్‌కు, రావికంపాడులో రూ.24 లక్షలతో నిర్మించే పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.6.30 కోట్లతో కామవరపుకోటలో ఏర్పాటు చేసే సీపీడబ్ల్యూ పథకానికి శంకుస్థాపన చేశారు. నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటరత్నం నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీవీ నాగచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తూతా లక్ష్మణరావు. కలెక్టర్ సిద్ధార్థ జైన్, సీఈవో నాగార్జున సాగర్, వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్, ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ జి.జయచంద్రరావు, పీఆర్ డీఈ డి.సత్యనారాయణ , తహసిల్దార్ జె.మదనగోపాలరావు, ఎంపీడీవో కె.శిల్ప తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించలేదు: తడికలపూడి సర్పంచ్ ఆరోపణ తమ పంచాయతీ పరిధిలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణానికి ఆదివారం మంత్రులు శంకుస్థాపన చేశారని, అయితే సర్పంచ్ అయిన తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తడికలపూడి సర్పంచ్ కడిమి దివ్యభారతి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ అవడం వల్ల తనకు సమాచారం ఇవ్వకుండా అవమానపర్చారని ఆమె పేర్కొన్నారు. ఫ్రొటోకాల్ పాటించని వారిపై చర్య తీసుకోవాలని ఆమె కోరారు. -
సమైక్యవాదుల నిర్బంధం
పాలకొల్లు, న్యూస్‌లైన్: కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు పర్యటన నేపథ్యంలో గురువారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్యవాదులను పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్బంధించారు. కావూరి పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటనకు రావడంతో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైసీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు, జేఏసీ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, ఉద్యోగు జేఏసీ కన్వీనర్ గుడాల హరిబాబు తదితరులతోపాటు మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కావూరిని సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకుంటున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వారందరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. సాయంత్రం వీరందరినీ సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. -
కావూరి వస్తున్నారని.. వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్నారంటే చాలు.. ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. సమైక్యాంధ్ర వాదులను ఆయన నానా మాటలు అంటున్నా సరే.. ముందస్తుగా వారి నుంచి ఆయనకు 'రక్షణ' కల్పిస్తోంది. ఆ మేరకు ముందుగానే పోలీసులకు ఆదేశాలు జారీచేసినట్లుంది. ఈ విషయం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మరోసారి రుజువైంది. పాలకొల్లులో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ మేకా శేషుబాబును, మరో 20 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి సంఘటన తర్వాత కావూరి ఎక్కడ పర్యటిస్తున్నా, ముందుగానే సమైక్యవాదులను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. -
ఉపాధ్యాయ జేఏసీ వినూత్న నిరసన
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : సీమాంధ్ర కేంద్ర మంత్రుల కళ్లకు పట్టిన హైకమాండ్ అనే పొరను తొలగించి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా పరిషత్ సెంటర్లోని దీక్షా శిబిరం వద్ద కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పళ్ళం రాజు తదితరుల చిత్రపటాలలోని కళ్లను తుడిచి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్రమంత్రులు స్వతహాగా మంచివారైనా వారికి హైకమాండ్ అనే పొర కళ్లకు కమ్ముకుందని తెలిపారు. ఈ కారణంగానే రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని వివరించలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా హైకమాండ్‌ను ఎదిరించి రాష్ట్ర విభజనను నిలిపివేయడానికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధామస్, సుభాకరరత్నం, హనుమంతరావు, భాస్కరలక్ష్మి, పూర్ణశ్రీ పాల్గొన్నారు. -
కర్నూలు, అనంత జిల్లాలను తెలంగాణలోనే ఉంచండి
ఏలూరు: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యాంధ్ర ఉద్యమ సెగ వెంటాడుతోంది. భారీ బందోబస్తు మధ్య ఏలూరులో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇటీవల చింతలపూడిలో జరిగిన కావూరి పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, అనంతరం కోడిగుడ్లతో దాడికి తెలిసిందే. దాంతో కావూరి పర్యటనకు పోలీసులు భారీగా మోహరించారు. తానెప్పటికీ సమైక్యవాదినే అంటూ కావూరి ...మరోసారి సమైక్యవాదులను తన మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం ఎప్పుడూ కలిసుండాలనే కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తప్పనిసరై రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే భద్రాచలంను ఆంధ్రాలో కలపాలని కావూరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పర్యవేక్షణలో హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ బిల్లులో కచ్చితంగా మార్పులుంటాయన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి వస్తే అందులో తాను భాగస్వామిని కాలేనని కావూరి చెప్పారు. రాజీనామా చేయటమా? గైర్హాజరు కావటమా అనేది అప్పుడే నిర్ణయించుకుంటానని కావూరి తెలిపారు. -
అభివృద్ధికి అధికారులు సహకరించాలి : కావూరి
గోసవరం(ముసునూరు) న్యూస్‌లైన్ : అభివృద్ధికి అధికారులు సహకరించాలని కేంద్రమంత్రి కావూరు సాంబశివరావు సూచించారు. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుతో కలిసి మండలంలోని వేల్పుచర్లలో రూ.27 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు, గోపవరం నాగేంద్రస్వామి ఆలయ సమీపంలో 30 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. గోపవరం నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 16 పంచాయతీల్లో ఉన్న సమస్యలను ఆయా గ్రామ సర్పంచులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్నామని పలువురు రైతులు వాపోయారు. మండలం సరిహద్దుగా తమ్మిలేరు నది ఉన్నప్పటికీ ఇసుక తోలుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. కావూరు స్పందిస్తూ గోపవరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 24 గంటల విద్యుత్ సరఫరా కోసం అవసరమైన లక్ష రూపాయల గ్రాంటుని ఇవ్వడానికి అంగీకరించారు. ముసునూరు మండలంలో 10 గ్రామాల్లోఉన్న వాల్టా చట్టాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానని రైతులకు హామీ ఇచ్చారు. బదిలీకైనా సిద్ధమే : సబ్ కలెక్టర్ పేదలు నిర్మించే ఇళ్లకు ఇసుక తోలుకోవడానికి అనుమతినివ్వాలని స్టేజీపై ఆయన పక్కనే ఉన్న సబ్ కలెక్టరు చక్రధరబాబుని కావూరు అడిగారు. అనుమతినిస్తే ఇసుక అక్రమంగా రవాణా అవుతుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేనని సబ్‌కలెక్టర్ కావూరుకి తేల్చి చెప్పారు. ప్రజలకు మేలు చెయ్యడానికి నిబంధనలు కొద్దిగా సడలించవచ్చునని కావూరు ఈ సందర్బంగా సబ్‌కలెక్టర్‌కి సూచించారు. ఎక్కడికైనా బదిలిైపై వెళ్లడానికైనా సిద్ధమేనని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేనని సబ్‌కలెక్టర్ తెలపడంతో కేంద్రమంత్రికి, సబ్‌కలెక్టర్ మధ్య కొంతసేపు ఆసక్తికరమైన వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు,తహశీల్దార్ డీఎస్ శర్మ, ఎంపీడీవో జీ రాణీ, ఎంఈవో తోటకూర సాంబశివరావు, కాంగ్రెస్ నాయకులు నందిగం గంగాదరరావు, నందిగం పెరుమాళ్ళు, నందిగం బాబ్జీ, సర్పంచులు, మేరుగు తేరెజమ్మ, నందిగం శ్రీనివాసరావు, పల్లెపాము కుటుంబరావు, రే గుల గోపాలకృష్ణ, సొంగా వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు. -
'పదవి కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు'
చింతలపూడి(పశ్చిమగోదావరి జిల్లా): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సమైక్యవాదం వినిపించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కావూరి పర్యటిస్తున్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదన్నారు. పరుష వ్యాఖ్యలు చేసిన కావూరి సమైక్యవాదులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలల మంత్రి పదవి కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని కావూరికి బాలరాజు హితవు పలికారు. తాను సమైక్యవాదినని ఊరూవాడా ప్రచారం చేసుకున్న కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రి అయ్యూక సమైక్యవాదులపైనే విరుచుకుపడుతున్నారు. మంత్రి పదవి పొందాక సమైక్య వాదానికి గుడ్‌బై చెప్పిన ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని దూషించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. -
మీ గొట్టాలు నన్నేం చేయవ్!
మీడియాపై కావూరి కస్సుబుస్సు ముదినేపల్లి, న్యూస్‌లైన్: ‘‘మీ గొట్టాలు నాకేం చేయవ్..సమాజాన్ని మీడియా పక్కదారి పట్టిస్తోంది’’ అని కేంద్ర మంత్రి కావూరి సాంబశిరావు మీడియాపై చిందులు తొక్కారు. శనివారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో పీసీసీ సంయుక్త కార్యదర్శి బొర్రా చలమయ్య గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఆయన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకముందు సమైక్యాంధ్ర సింహం లా గర్జించిన మీరు ఇప్పుడెందుకు మిన్నకుండి పోయారంటూ అడిగిన ప్రశ్నకు కావూరి ఆగ్రహోదగ్రులయ్యారు. ప్రజలకెలాంటి బాధలేనప్పటికీ కొంతమంది నేతల దుష్ర్పచారంతో పాటు ఇందుకు మీడియా వంత పాడుతూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేక వార్తలకు ప్రాధన్యం ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రిగా తెలంగాణలోని సిరిసిల్లకు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు చేసిన కృషి సీమాంధ్ర లో ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించగా మిన్నకుండిపోయారు. -
నాపై... మీడియానే బురద జల్లుతోంది : కావూరి
విజయవాడ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజాయితీగా రాజకీయాల్లో ఉన్న తనపై మీడియా బురద జల్లుతోందని కావూరి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మీడియానే భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. ఓ ఛానల్ తనపై దుష్రచారం చేస్తోందని కావూరి సాంబశివరావు చెప్పినట్టు సమాచారం. -
మెగా పవర్లూమ్ క్లస్టర్‌కు కృషి
కేంద్ర మంత్రి కావూరి సిరిసిల్ల, న్యూస్‌లైన్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాన్ని నివారించడం, నేత కార్మికుల ఆత్మహత్యలను అరికట్టే చర్యల్లో భాగంగా ఇక్కడ మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కృషిచేస్తానని కేంద్ర చేనేత జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మరమగ్గాల ఆధునికీకరణ పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్‌లోనే సైజింగ్, ప్రాసెసింగ్ యూనిట్, వార్పిన్, సీఎఫ్‌సీ(కామన్ పెసిలిటీ సెంటర్)ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో మరమగ్గాల ఆధునికీకరణకు రూ.90 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే కార్పస్‌ఫండ్ 1.65 కోట్లు విడుదల చేయాలని కేంద్ర చేనేత జౌళిశాఖ కార్యదర్శిని ఆదేశించారు. కార్మికులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని, వృత్తినైపుణ్యం పెంపొందించడం కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తామన్నారు. ఆధునిక మగ్గాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50లక్షల వరకు రుణం అందిస్తామన్నారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలను ఈనెల 31లోపు మాఫీ చేస్తామని తెలిపారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకోసం రానున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రికి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, అధికారులు పాల్గొన్నారు. -
నేడు ‘గీతం’ క్యాంపస్ ప్రారంభం
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ :భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖచే ‘ఎ’ కేటగిరి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన గీతం యూనివర్సిటీ బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్లాపురం వద్ద ఇంటర్నేషనల్ క్యాంపస్‌ను ప్రారంభించనుందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం అనుమతితో సోమవారం ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు చేతుల మీదుగా వర్సిటీ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాసప్రసాద్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని అన్నారు. గీతం బెంగళూరు క్యాంపస్‌లో బీటెక్, ఎంబీఏ కోర్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీలో 25 శాతం సీట్లను మెరిట్ ఆధారంగా కర్ణాటక విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారు. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి గాను 2014 ఏప్రిల్ 17 నుంచి మే 8 వరకూ దేశ వ్యాప్తంగా 36 కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో బళ్లారి, దావణగెరె, మంగళూరు, మైసూరు, రాయచూరు, తుమకూరు, బెంగళూరు సిటీతో పాటు దొడ్డబళ్లాపురంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రవేశపరీక్షల్లో తొలి పది ర్యాంకర్లకు ఉచిత విద్యనందిస్తామని అన్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కరూర్ బ్యాంక్‌లలో లభిస్తాయన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను 2014 మే 15న ప్రకటిస్తామని అన్నారు. బీటెక్‌లో ఐటీ, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కోర్సులు బెంగళూరు క్యాంపస్‌లో ఉంటాయని అన్నారు. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వసతి సదుపాయం కల్పించినట్లు వివరించారు. గీతం విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంవత్సరాలలో 5 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. విశాఖ స్టీల్ఫ్లాంట్, రెడ్డీస్ ల్యాబ్, ఎరిక్సన్ ఇండియా, ఐబీఎమ్ తదితర సంస్థలతో గీతం విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందాలను కలిగి ఉందన్నారు. విలేకరుల సమావేశంలో బెంగళూరు స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ విజయభాస్కర్, రాజు, యూజీసీ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ రామకృష్ణ హాజరయ్యారు. -
అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగిందేమిటి: కావూరి
పశ్చిమ గోదావరి: రాష్ట్ర సమైక్యతకు అవసరమైనప్పుడే రాజీనామా చేస్తాను అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సమైక్యవాదినని నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎంపీల అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగిందేమి లేదు అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉండకూడదనే కారణంతోనే అవిశ్వాసంకు మద్దతు పలకలేదు కావూరి తెలిపారు. రాజకీయ నేతలు, అధికారులపై కావూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, అవినీతికి పాల్పడటం వల్లే కిందిస్థాయి ప్రజలకు అన్యాయం జరుగుతోంది అని కావూరి అన్నారు. ప్రభుత్వాలు నిధుల విడుదల చేస్తున్నా, నేతలు, అధికారులు అవినీతికి పాల్పడం వల్లే సంక్షేమం కుంటుపడుతోంది అని ఆయన విమర్శించారు. -
స్వామీ.. కావూరికి మంచి బుద్ధిని ప్రసాదించు
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : కేంద్ర మంత్రి పదవి రాక ముందు ఒక రకంగా.. పదవి వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు మంచి బుద్ధిని ప్రసాదించమని మద్ది ఆంజనేయస్వామిని కోరినట్లు వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే చింతలపూడి నియోజకవర్గమే ఎక్కువగా నష్టపోతుందన్నారు. తమ్మిలేరు, ఎర్ర కాలువలు పూర్తిగా ఎండిపోతాయని, రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. చింతలపూడి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కావూరిని లోక్‌సభలో సమైక్యవాదం వినిపించాలని కోరేందుకు వెళ్లగా తమపై ఆయన తిట్ల పురాణం ఎత్తుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌చేసి విడుదల చేశారని, కావూరి అదేరోజు రాత్రి జిల్లా అధికారులతో మాట్లాడి రెండోసారి అరెస్ట్ చేయించారని చెప్పారు. ఒకే కేసుపై రెండుసార్లు ఎవరూ అరెస్టు అయిన దాఖలా లేదన్నారు. తమపై ఎన్నికేసులు బనాయించినా ఓర్చుకుంటామని, ఆయన మాత్రం సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలా చేస్తే ఆయనపై పూలజల్లు కురస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంటేనే పార్టీ విజయం సులభం అవుతుందని అన్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మేనేజర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్లు, వలంటీర్లు పోలింగ్ విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనిల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యులు బీవీఆర్ చౌదరి, పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాస్, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామినాయుడు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు తల్లాడి సత్తిపండు, పొల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, కొయ్య రాజారావురెడ్డి, కేమిశెట్టి మల్లిబాబు, రాఘవరెడ్డి ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు. -
కావూరి ‘కావరం’!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తాను సమైక్యవాదినని ఊరూవాడా ప్రచారం చేసుకున్న కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రి అయ్యూక సమైక్యవాదులపైనే విరుచుకుపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి పొందాక సమైక్య వాదానికి గుడ్‌బై చెప్పిన ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని దూషించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. మంగళవారం చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఆయనును రాష్ట్ర విభజనపై నిలదీయడంతో ఇష్టానుసారం నోరుపారేసుకోవడం కలకలం రేపింది. నోటికి వచ్చినట్లు తిట్టిన ఆయన అక్కడితో ఆగకుండా సమైక్యవాదులను రెండోసారి అరెస్టు చేయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైనప్పటి నుంచీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు, ఎన్జీవోలు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నారు. ఇలా అడ్డుకున్న వారిపై పోలీసులు సాధారణ కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. మంగళవారం చింతలపూడిలో కావూరిని అడ్డుకున్నందుకు అక్కడి పోలీసులు సెక్షన్-151 కింద కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వ్యక్తిగత పూచీకత్తుపై అందరినీ వదిలేశారు. అయితే బుధవారం అదే కేసులో మూడు అదనపు సెక్షన్లు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యే రాజేష్‌తోపాటు మరో 19మందిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. రెండోసారి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేకుండాపోయింది. ఇదంతా కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కక్ష గట్టి చేయించినట్టు అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ వారిపై అదనపు సెక్షన్లు పెట్టించి అరెస్ట్ చేయించారు. తీవ్రమైన కేసుల్లో మాత్రమే పోలీసులు ఇలా సెక్షన్లు మార్చుతారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో, అదీ ఒక కేంద్ర మంత్రి ఒత్తిడితో అదనపు సెక్షన్లు పెట్టడం పోలీసులకే ఇబ్బందికరంగా మారింది. ఉద్యమం మొదలైన నాటినుంచీ ఇంతే... కావూరి సాంబశివరావు వైఖరి రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. గతంలోనూ ఆయన ఇదే తరహాలో సమైక్యవాదులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఎన్జీవోలు ఏలూరులోని క్యాంపు కార్యాలయం వద్ద ఆయనను నిలదీయడంతో వారందర్నీ వెధవలంటూ తిట్టిపోశారు. పదవి తనకు లెక్కకాదని చెప్పిన ఆయన అదే పదవి కోసం రాష్ట్ర విభజనను సమర్ధించడాన్ని సమైక్యవాదులు జీర్ణించుకోలేపోతున్నారు. ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నారుు. అక్కడ రాష్ట్ర విభజన అంశంపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి కీలక తరుణంలో పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చిన కావూరి సమైక్యవాదులను బండబూతులు తిట్టడం గమనార్హం. కేంద్ర మంత్రి పదవిని అలంకరించినప్పటి నుంచి కావూరి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పదవి రాకముందు కేంద్ర ప్రభుత్వాన్ని తెగతిట్టిన ఆయన పదవి వచ్చాక సమైక్యవాదులపై దుర్భాషలాడుతున్నారు. పదవికి రాజీనామా చేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా పట్టించుకోకుండా దాన్నే అంటిపెట్టుకుని వేలాడటంపై రాష్ట్ర వ్యాప్తం గా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్లో రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగే సమయంలో రాయల తెలంగాణకు మద్ధతివ్వడంపైనా తీవ్ర వ్యతిరేకత నెల కొంది. చివరకు విభజనను వ్యతిరేకిస్తూ కేం ద్రంపై కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం పెడితే దానికి మద్దతు ఇవ్వడానికి మాజీ సమైక్యవాదిగా ఉన్న కావూరి ముందుకురాలేదు. ఇలా ఏ దశలోనూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించిన ఆయన తరచూ సమైక్యవాదులపై విరుచుకుపడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
సమైక్యమన్నందుకు సంకెళ్లు
చింతలపూడి, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు దురహంకార వైఖరికి పరాకాష్ట ఇది. సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసమే తాను మంత్రి పదవిలో కొనసాగుతున్నానని బీరాలు పలుకుతూ వచ్చిన ఆయన ఇప్పుడు తన అధికారబలంతో సమైక్యవాదులను కేసుల ఉచ్చులో బిగిస్తున్నారు. సమైక్యవాదులు తనను అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేని కావూరి వారిపై కక్షగట్టి కేసుల మీద కేసులు నమోదుచేసి వేధింపులకు గురి చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గసమన్వయకర్త మద్దాల రాజేశ్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు, ఉద్యోగులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మంత్రి కావూరిని అడ్డుకున్న విషయం తెలిసిందే. బస్ షెల్టర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యవాదులపై కావూరి అసహనం వ్యక్తం చేయడంతో ఆవేశానికి గురైన కొందరు యువకులు ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు. దీంతో కావూరి రెచ్చిపోయి ‘వెధవల్లారా.. సన్నాసుల్లారా.. ఎవరు డబ్బులిచ్చి మిమ్మల్ని ఇక్కడకు పంపార్రా..’ అంటూ నానా దుర్భాషలాడారు. ‘అర్థరూపాయికి అమ్ముడుపోయేవాళ్లు నన్ను ప్రశ్నిస్తారా’ అనడంతో పాటు పదేపదే వెధవలు, సన్నాసులంటూ తిట్టారు. పత్రికలో రాయలేని భాషలో దుర్భాషలాడారు. కావూరి ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు రాజేశ్‌తోపాటు మరో 21 మంది సమైక్యవాదులను బలవంతంగా ఈడ్చుకెళ్లి లారీలో పడేశారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అదే రోజు సాయంత్రం వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కావూరి ఆదేశాలతో రెండోసారి... అయితే, తనను అడ్డుకున్న వారికి వెంటనే స్టేషన్ బెయిల్ రావడం జీర్ణించుకోలేని కావూరి పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి బుధవారం మరోమారు అరెస్టులు చేయించారు. రాజేశ్‌తోపాటు మరో 19 మందిని బుధవారం రెండోసారి పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారనే అభియోగంపై 341, 143, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అడ్డగోలుగా అరెస్టులు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాజేశ్ నివాసానికి పోలీసు అధికారులు భారీ బలగాలతో చేరుకున్నారు. ఆయన్ను మళ్లీ అరెస్టు చేస్తారనే సమాచారంతో అప్పటికే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. అరెస్టు చేయడానికి ఇంట్లోకి వెళుతున్న పోలీసులను వారంతా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కార్యకర్తలను నెట్టుకుంటూ లోపలికి వెళ్లి నిద్రపోతున్న రాజేశ్‌ను లేపి అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలు ప్రతిఘటించడంతో పోలీసులు బలవంతంగా రాజేష్‌ను ఎత్తుకుని జీపు వద్దకు తీసుకువెళ్లారు. దీంతో సమైక్యవాదులు పెద్దఎత్తున కావూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర ద్రోహి, దళిత ద్రోహి కావూరి అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసు జీపు ఎక్కడానికి రాజేశ్ నిరాకరించడంతో పోలీసులు ఆయన్ను కాలి నడకన పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో సమైక్యవాదులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడుగడుగునా పోలీసులను అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. కాళ్లకు కనీసం చెప్పులు లేకుండా రాజేశ్‌ను రెండు కిలోమీటర్ల దూరం నడిపించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్టేషన్ నుంచి రాజేశ్ సహా 20 మందిని జీపుల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కేంద్ర మంత్రిని నిలదీశానని తాను బెయిల్‌కు దరఖాస్తు చేయనని రాజేశ్ స్పష్టం చేశారు. దీంతో న్యాయవాదుల జేఏసీ ముందుకొచ్చి రాజేశ్‌తో సహా 20 మందికి బెయిల్ కోసం దరఖాస్తు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం మాజీ ఎమ్మెల్యే సహా 20 మంది విడుదలయ్యారు. సమైక్యవాదులను దూషించిన కావూరిపై ఎందుకు కేసులు పెట్టరు: మద్దాల రాజేశ్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడమని స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని వినిపించడానికి వెళ్ళిన తమపై అసభ్య పదజాలంతో కావూరి దూషించారని చెప్పారు. సమైక్యవాదులను వెధవలు, సన్నాసులు, చెత్త వెధవలు అని దూషించిన కావూరిపై ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. పోలీసులతో దాడులు చేయించి , సమైక్యవాదులను భయభ్రాంతులకు గురి చేయాలని చూశారని చెప్పారు. మంగళవారం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసిన పోలీసులు, రాత్రికి రాత్రి కావూరి ఒత్తిళ్లకు లొంగి అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బంద్‌కు సమైక్య జేఏసీ పిలుపు రాజేశ్, సమైక్యవాదుల అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ గురువారం చింతలపూడి నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి వైఖరికి నిరసనగా అందరూ బంద్‌లో పాల్గొనాలని నాన్‌పొలిటికల్ జేఏసీ కోరింది. మరోవైపు రాజేశ్ అరెస్టును ఖండిస్తూ గురువారం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. -
'జిల్లాలో పర్యటించకుండా కావూరిని మహిళలు తరిమి కొట్టాలి'
మహిళలపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు దగ్గరుండి దాడులు చేయించడం సిగ్గుచేటు అని వైఎస్ఆర్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల వ్యాఖ్యానించారు. జిల్లాలో అడుగుపెట్టనీయకుండా కావూరిని మహిళలు తరిమి కొట్టాలి అని ఉమాబాల అన్నారు. కేంద్ర మంత్రి పదవి పొందిన అనంతరం తొలిసారి చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటించేందుకు వచ్చిన కావూరిని నియోజకవర్గ వైసీపీ నమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. ‘సీమాంధ్ర ద్రోహి.. కావూరి గో బ్యాక్’ అని రాసిన ఫ్లెక్సీలను చేతబూని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మంత్రి కాన్వాయ్‌ని అడ్డుతగిలిన సందర్భంలో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన కార్యకర్తలు కావూరి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. కావూరి నిలదీసిన మహిళలపై దాడులకు పాల్పడటం వివాదంగా మారింది. కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు- చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కావూరి ఒత్తిళ్లకు లొంగి పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. రాజేష్ అరెస్ట్‌ను గూడూరి ఉమాబాల ఖండించారు. -
రాజేష్‌పై కావూరి దొంగ కేసులు పెట్టించారు: వైఎస్ఆర్సీపీ
చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అరెస్టును వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. అధికారులపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఒత్తిడి చేసి.. మద్దాల రాజేష్‌పై దొంగకేసులు పెట్టించారని, ఆయనను ఓ ఉగ్రవాది తరహాలో బంధించి మరీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కావూరి సాంబశివరావు సమైక్యాంధ్రకు ద్రోహం చేసినందుకే ప్రజలు ఆయనను నిలదీశారని, అలాంటి సమయంలో సమైక్యవాదులపై దాడులు చేయించడం కావూరికి తగదని ఎమ్మెల్యేలు అన్నారు. కంపెనీల్లో అక్రమ పెట్టుబడుల కోసం కావూరి సమైక్యవాదాన్ని తాకట్టు పెట్టారని శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తక్షణమే మద్దాల రాజేష్‌పై కేసులు ఉపసంహరించి కావూరి క్షమాపణ చెప్పాలని, లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమైక్య ద్రోహులెవరికైనా ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
కావూరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ ఫైర్
-
కావూరికి కాక కేసులో మద్దాల రాజేష్ అరెస్ట్
-
కావూరికి కాక కేసులో మద్దాల రాజేష్ అరెస్ట్
చింతలపూడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు- ఆయనను నేడు అదుపులోకి తీసుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కావూరి ఒత్తిళ్లకు లొంగి పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమైక్యవాదులపై కావూరి అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమపై పరుష పదజాలంతో దూషించిన కావూరి పై సంబంధిత సెక్షన్ల కేసు నమోదు చేయాలని మద్దాల రాజేష్ డిమాండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసే పోలీసు స్టేషన్లోనే బైఠాయిస్తామని అన్నారు. సొంత నియోజకవర్గంలో తనను అడ్డుకున్న సమైక్యవాదులపై మంగళవారం కావూరి విరుచుకుపడ్డారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, చేతకాని వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. కాగా, మద్దాల రాజేష్ అరెస్టుకు నిరసనగా గురువారం చింతలపూడిలో బంద్ పాటిస్తున్నారు. -
కావూరిపై కోడిగుడ్లు
చింతలపూడి, న్యూస్‌లైన్ : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావుకు మంగళవారం సమైక్య సెగ తగిలింది. కేంద్ర మంత్రి పదవి పొందిన అనంతరం తొలిసారి చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటించేందుకు వచ్చిన కావూరిని నియోజకవర్గ వైసీపీ నమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. ‘సీమాంధ్ర ద్రోహి.. కావూరి గో బ్యాక్’ అని రాసిన ఫ్లెక్సీలను చేతబూని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మంత్రి కాన్వాయ్‌ని అడ్డుతగిలారు. ఈ దశలో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కావూరి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు. మంత్రి కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడటంతో మద్దాల రాజేష్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాన్వాయ్ బోసుబొమ్మ సెంటరుకు చేరుకోగా, పోలీసు వ్యాన్‌లోంచి దూకి వచ్చిన రాజేష్ కేంద్ర మంత్రిని మరోసారి అడ్డుకున్నారు. దీంతో రాజేష్‌ను పోలీస్ జీపులో స్టేషన్‌కు తరలించారు. సమైక్యవాదులపై పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ప్రగడవరం ఉప సర్పంచ్ శీలపురెడ్డి రమేష్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, గంధం చంటి తదితరులను లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, స్టేషన్ ఎదుట తెలంగాణ బిల్లు ముసారుుదా ప్రతులను మద్దాల రాజేష్, కార్యకర్తలు తగులబెట్టారు. సీమాంధ్రను కేంద్రానికి తాకట్టు పెట్టిన కావూరి వెంటనే పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. అడుగడుగునా సమైక్యవాదుల నిరసనల మధ్య పోలీ సుల సాయంతో కావూరి ముందుకు సాగారు. సమైక్యవాదులపై నోరుపారేసుకున్న కేంద్రమంత్రి ‘మీరంతా చేతకాని వెధవలు, సన్నాసి వెధవలు, ఎవడో డబ్బులిస్తే వచ్చి సమైక్య నినాదాలు చేస్తున్నారు’ అంటూ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులపై నోరుపారేసుకున్నారు. పాత బస్టాండ్ సెంటర్లో వైసీపీ శ్రేణు లు, సమైక్యవాదులు విసిరిన కోడిగుడ్లు ఆయనపై పడకుండా పోలీసులు వలయంలా నిలబడ్డారు. ఈ సందర్భంలో కావూరి తాను ప్రయూణిస్తున్న వాహనం డోరు వెనుక నిలబడి కోడిగుడ్ల దాడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు విసిరిన కోడిగుడ్లు పోలీసులతోపాటు, కేంద్ర మంత్రికి తగిలారుు. ఈ సందర్భంలో కావూరి ఆగ్రహంతో ఊగిపోయూరు. వెంటనే మైక్ తీసుకుని తిట్ల దండకం అందుకున్నారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. ‘మీరుమాత్రమే సమైక్యవాదులా, మీరే హీరోలా’ అంటూ తిట్టిపోశారు. దీంతో రెచ్చిపోయిన సమైక్యవాదులు కావూరి గోబ్యాక్ అంటూ ముందుకు దూసుకురావడంతో పోలీసులు మద్దాల రాజేష్ సహా 22 మందిని అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అనంతరం మద్దాల రాజేష్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పదవి కోసం సమైక్యవాదిలా ఫోజులు కొట్టిన కావూరి ఎంపీ పదవికి రాజీనామా చేశారని, పదవి రాగానే కోట్లాది రూపాయల ప్యాకేజీకి అమ్ముడుపోయూరని విమర్శించారు. సమైక్య ముసుగును తొలగించుకుని సీమాంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన సమైక్యవాదులను ‘వెధవలు, సన్నాసులు’ అని తిట్టడమేకాకుండా పోలీసులతో దాడులు చేయించారన్నారు. జరిగిన ఘటనకు కావూరి క్షమాపణ చెప్పాలని కోరారు. వెంటనే పదవులకు రాజీనామా చేసి సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాటం సాగించాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర విభజన జరిగే పనికాదు
చింతలపూడి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగే పని కాదని కేంద్ర జౌళి శాఖామాత్యులు కావూరి సాంబశివరావు అన్నారు. చింతలపూడి మార్కెట్ కమిటీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. 371 డీ కి రాజ్యాంగ సవరణ చేయకుండా విభజన సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో అందుకు అంత సమయం లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా యూపీఏ ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. బీజేపీతో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విభజనకు మద్దతు తెలపడం వల్లనే కేంద్రం తొందరపడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒక్క ప్రాంతానికి కాక రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. 1959 వరకు భద్రాచలం డివిజన్ సీమాంధ్రలో కలిసే ఉండేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో భద్రాచలం డివిజన్‌ను కలిపారన్నారు. భద్రాచలం ఎప్పటికీ సీమాంధ్రదే నన్నారు. తమిళనాడుకు చెన్నై రాజధానిగా ఉన్నా అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్రంలో మాత్రం అన్నిరకాలుగా హైదరాబాద్‌లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒక వేళ విభజన తప్పని సరి అయితే హెచ్ఎండీఏ పరిధిని పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదా ఢిల్లీ తరహా రాష్ట్రంగా చేయాలని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు 20 ఏళ్లపాటు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సరైన చర్య కాదని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా అధిష్టానం తమ మాటను వినలేదని చెప్పారు. అంతకు ముందు చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, యర్రగుంటపల్లిలో పీహెచ్‌సీలకు కావూరి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు, రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. ఆయన వెంట ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ తూత లక్ష్మణరావు, కేంద్ర ఉన్ని ఉత్పత్తుల బోర్డు డెరైక్టర్ ఎం.ధామస్, అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, బోదల రమేష్ ఉన్నారు. -
కావూరికి సమైక్య కాక
కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి, గోబ్యాక్ అంటూ నినాదాలు చేతకాని, సన్నాసి వెధవలంటూ మంత్రి ఆగ్రహం చింతలపూడి, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు తన సొంత నియోజకవర్గంలోనే చేదుఅనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌పై మంగళవారం సమైక్యవాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కావూరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, కావూరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన్ను కారు దిగనివ్వకుండా కోడిగుడ్లతో దాడికి దిగారు. పోలీసులతో పాటు తనకూ కోడిగుడ్లు తగలడంతో ఆయన కోపంతో ఊగిపోయారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, చేతకాని వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. కాన్వాయ్‌కు అడ్డంగా పడుకున్న నిరసన కారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
చేనేత కళాకారులకు ఇళ్లు, బీమా
=కేంద్ర మంత్రి కావూరి =శిల్పారామంలో ‘హస్తకళామేళా’ ప్రారంభం =31 వరకు కొనసాగనున్న మేళా మాదాపూర్, న్యూస్‌లైన్: చేనేత కళాకారులకు జీవిత బీమా, గృహ వసతులను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర టెక్స్టైల్స్ శాఖా మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. శిల్పారామంలో ఈ అఖిల భారత హస్తకళా మేళా ఆదివారం అట్టహాసంగా ఆరంభమైంది. ఈ మేళాను రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ చేనేత కళాకారులు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. యంత్రాలు రావడంతో వారు తయారుచేసిన అనువైన వస్తువులు మరుగును పడుతున్నాయని, అలాంటి వారికి ఇదో మంచి అవకాశమని చెప్పారు. పదిహేను రోజుల పాటు కొనసాగనున్న మేళాలో రూ.12కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా అని మంత్రి కావూరి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 600 మంది కళాకారులు ఈ క్రాఫ్ట్ మేళాలో పాల్గొంటున్నారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను మంత్రులు సందర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్, రాష్ట్ర పర్యాటక భవన్ ప్రత్యేక అధికారి కిషన్‌రావు, శిల్పారామం ప్రత్యేకాధికారి జీఎన్‌రావు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హస్తకళామేళా ప్రారంభానికి ముందు శిల్పారామంలో నిర్వహించిన వివిధ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామానికి చెందిన దుర్గానాగేశ్వరసాయి డప్పు బృందం డప్పు ప్రదర్శన, విజయనగరం జిల్లాకు చెందిన ముత్య అప్పన్న బృందం నిర్వహించిన తప్పెట గుళ్ళ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. -
సీమ జోలికొస్తే చీరేస్తా!
రాష్ట్ర విభజన ప్రక్రియ చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రాంతాలవారీగా విడిపోయిన నేతలు పరస్పరం వాగ్బాణాలు విసురుకుంటున్నారు. నువ్వొకటి అంటే నేరెండంటా తరహా తన్నుకుంటున్నారు. ఇదే సమయంలో పరుష పదజాలం వాడేందుకు కూడా వెనుకాడడం లేదు. తాము ప్రజా ప్రతినిధులమన్న సంగతి మర్చిపోయి దిగజారుతున్నారు. సినిమా డైలాగులు చెబుతూ రెచ్చగొడుతున్నారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుపై రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసిన కావూరిపై పరుష పదజాలంతో బైరెడ్డి విరుచుకుపడ్డారు. రాయలసీమ జోలికొస్తే చీరేస్తా అంటూ ఊగిపోయారు. కావాలంటే కోస్తా ప్రాంతాన్ని చీల్చుకోమని సలహాయిచ్చారు. 'కోయాలనుకుంటే కోస్తాను కోసుకోండి, సీమను కోయాలని చూస్తే... కోస్తాం జాగ్రత్త' అంటూ బైరెడ్డి హెచ్చరించారు. తమ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసే హక్కు కావూరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమాంధ్రకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను బహిరంగంగా సమర్ధించిన జేసీ దివాకర్ రెడ్డిని బైరెడ్డి ఒక్కమాట అనకపోవడం గమనార్హం. కాగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రాయలసీమ ప్రజా ప్రతినిధుల సమావేశంలోనూ కావూరిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కొత్త రాజధానిని కృష్ణా జిల్లాకు తరలించాలన్న కుట్రతోనే కావూరి రాయల తెలంగాణ ప్రతిపాదన చేశారని మండిపడినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదన మరుగున పడకుంటే కావూరిని కడిగిపారేసే వాళ్లమని అన్నారు(ట). మొత్తానికి రాష్ట్ర విభజన నేతల మధ్య పెద్ద చిచ్చే పెట్టిందనే చెప్పాలి. -
అధిష్టానం మా మొర వినలేదు : కావూరి
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రుల వాయిస్ పూర్తిగా మారిపోయింది. కొంతమంది విభజనకు సిద్ధపడి ప్యాకేజీల విషయం మాట్లాడుతుంటే, మరికొంతమంది విభజనను అడ్డుకోగలం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చెన్నైలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ తామెంత మొరపెట్టినా అధిష్టానం వినలేదని చెప్పారు. విభజన తప్పదన్న దృఢనిశ్చయంతో అధిష్టానం ఉందన్నారు. కానీ, విభజనను అడ్డుకోగలమనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యలను పరిష్కరించకుంటే విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందన్నారు. విభజన అనివార్యమని తెలియటంతో తాము సీమాంధ్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టామన్నారు. మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళంలో మాట్లాడుతూ విభజన అనివార్యం అన్నారు. సీమాంధ్ర ప్యాకేజి కోసం డిమాండ్ చేస్తామని చెప్పారు. -
'ఏ మంత్రీ చదవకుండా తెలంగాణ నోట్‌ను ఎలా ఆమోదిస్తారు'
హైదరాబాద్ : కేంద్ర కేబినెట్లో ప్రభుత్వం ఇచ్చిన నోట్‌ను ఏ మంత్రీ పూర్తిగా చదవలేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అంత పెద్ద నోట్‌ను ఏదో డిటెక్టివ్ కథలాగా వేగంగా అప్పటికప్పుడు చదవలేమని, అందుకు కొంత సమయం కావాలని కోరినట్లు చెప్పారు. కీలకమైన నోట్‌ను చదవకుండా రాష్ట్ర మంత్రివర్గం విభజనను ఎలా ఆమోదిస్తుందని కావూరి అన్నారు. తాను మాత్రం ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తథ్యమని జీవోఎం స్పష్టం చేసిందని కావూరి చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సమస్య అంతా హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతమై ఉందని జీవోఎంకు చెప్పామన్నారు. హైదరాబాద్‌ను పదేళ్లు కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే రెండోవైపు అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పామన్నారు. తాము ఎన్ని చెప్పినా... ఏం చేసినా... వారు ఒకే ప్రాంతానికే అన్నీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అయినా, విభజన అనివార్యమైతే ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. తాము రాష్ట్ర విభజనను అడ్డుకోలేనందున తన మాటలను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు కావూరి చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ నగరాన్ని యూటీ చేస్తే సీమాంధ్ర ప్రజలకు నచ్చజెప్పే ఆలోచన ఉండేదన్నారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేస్తే... మిత్రులుగా విడిపోయే అవకాశం ఉందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతమైన భద్రాచలం డివిజన్‌ను కోస్తాంధ్రలో కలపాలని కోరినట్లు కావూరి చెప్పారు. గతంలో భద్రాచలం కోస్తాంధ్రలో ఉండేదని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భద్రాచలంపై నిర్ణయం అత్యవసరమన్నారు. భద్రాచలాన్ని తెలంగాణకు ఇస్తే శబరి నుంచి వచ్చే నీటిని అడ్డుకునే అవకాశం ఉందన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు కావూరి తెలిపారు. రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందనుకుంటే తాను ఎప్పుడో రాజీనామా చేసేవాడినని ఆయన అన్నారు. 47 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు భయపడటం లేదన్నారు. ప్రజల శ్రేయస్సు కన్నా పార్టీ శ్రేయస్సు ముఖ్యమని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. -
కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారమిక్కడ సమావేశం అయ్యారు. హైదరాబాద్, రాయల తెలంగాణ, జీవోఎం భేటీ తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా నేడు భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఇక జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. -
‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్’పై 11ఏళ్ల నిషేధం: కావూరి సాంబశివరావు
కావూరి సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ప్రపంచ బ్యాంకు నిబంధనల ఉల్లంఘనే కారణమని వెల్లడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్(పీసీఎల్)’ సంస్థను ప్రపంచబ్యాంక్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. మోసం, అవినీతి పూరిత పద్ధతులకు వ్యతిరేకంగా బ్యాంకు రూపొందించిన నిబంధనలను (ఫ్రాడ్ అండ్ కరప్షన్ పాలసీ) ఉల్లంఘించడంవల్ల ఆ సంస్థను ఈనెల 26 నుంచి కనీసం 11 ఏళ్ల పాటు నిషేధిస్తున్నామని ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పీసీఎల్ నియంత్రిస్తున్న అన్ని సంస్థలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాము ఆర్థికసాయం చేసే ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ‘ప్రొక్యూర్మెంట్ గైడ్‌లైన్స్’ను ప్రపంచబ్యాంకు రూపొందిస్తుందని, ఆయా ప్రాజెక్ట్‌ల్లో భాగస్వాములైన కంపెనీలు ఆ నిబంధనలను పాటించాలని.. వాటిని ఉల్లంఘించడంవల్ల హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంక్ పేర్కొంది. అయితే, నిషేధం వర్తించే పీసీఎల్ సోదర సంస్థలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టుల వివరాలను బ్యాంక్ వెల్లడించలేదు. అలాగే పీసీఎల్ ఉల్లంఘించిన నిబంధనల వివరాలను కూడా తెలపలేదు. దాంతోపాటు ఆ సంస్థ ప్రమోటర్లు, ఉన్నతాధికారుల పేర్లను కూడా ప్రపంచబ్యాంక్ పేర్కొనలేదు. పీసీఎల్ వెబ్సైట్లో మాత్రం ఆ సంస్థను ప్రస్తుత కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు 1966లో స్థాపించారని ఉంది. అది 1982లో ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ప్రస్తుతం ఆ సంస్థకు ముళ్లపూడి శ్రీవాణి మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పీసీఎల్ విద్యుత్, నీటిపారుదల, రైల్వే, రవాణ, గృహనిర్మాణం, పారిశ్రామిక రంగాల్లోని మౌలిక వసతుల కల్పనలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. కాగా, నిషేధం విషయంపై స్పందన కోరేందుకు చేసిన ప్రయత్నాలకు పీసీఎల్ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కావూరి సాంబశివరావుకు, ఆయన కార్యాలయానికి చేసిన ఫోన్లకు, మెసేజ్‌లకు కూడా జవాబు రాలేదు. ప్రపంచబ్యాంక్ నిషేధానికి గతంలో గురైన వాటిలో సత్యం, విప్రో, వీడియోకాన్, ఎల్ అండ్ టీ.. తదితర కంపెనీలున్నాయి. -
'హైదరాబాద్‌ను యూటీ చేస్తే విభజనకు ఒప్పుకుంటాం'
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని వారు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేశారు. జీవోఎం సమావేశం ముగిసిన అనంతరం జీవోఎం సభ్యులు షిండే, జైరాం రమేష్, నారాయణ స్వామితో ....కావూరి, శీలం భేటీ అయ్యారు. భేటీ అనంతరం కావూరి, జేడీ శీలం మాట్లాడుతూ తాము ప్రస్తుతం హైదరాబాద్‌పై దృష్టి పెట్టామని, ప్యాకేజీలపై తర్వాత చర్చిస్తామన్నారు. జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ ప్రయత్నాలు ప్యాకేజీల కోసం తాము చేస్తున్న డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కూడా కావూరి సాంబశివరావు, చిరంజీవి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సంయుక్తంగా వెళ్లి జీవోఎం సభ్యులు సుశీల్‌కుమార్‌షిండే, ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, జైరాంరమేశ్‌లను మరోసారి వేర్వేరుగా కలిశారు. విభజనకు పూర్తిగా సహకరిస్తున్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీమాంధ్రులు సంతృప్తి చెందాలంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందేనని సూచించారు. -
సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి
-
సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి
ఏలూరు : జీవోఎం ముందు సమైక్యవాదాన్నే వినిపించామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పాస్ చేస్తే తామేమీ చేయలేమని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానంతోనే పోరాడతామని కావూరి తెలిపారు. అయితే మద్దతు కోసం ఇతర పార్టీ నేతలను కలిసే ఆలోచన లేదని ఆయన అన్నారు. కాగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న జీవోఎం సభ్యులకు నివేదికను అందజేశారు. కేంద్ర మంత్రులంతా తమ అభిప్రాయాలను జీవోఎంకు చెప్పారు. ఒక్కొక్కరు 10 నిమిషాలకుపైగానే మాట్లాడారు. అయితే అందరూ స్థూలంగా విభజనకు అంగీకరిస్తూనే తద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కోర్కెల చిట్టా విప్పారు. కిశోర్ చంద్రదేవ్ మినహా మిగిలిన వారంతా హెచ్ఎండీఏ పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. -
గోదావరి టూరిజంపై దృష్టి
పోలవరం, న్యూస్‌లైన్ : పోలవరం వద్ద గోదావరి టూరిజం జాతీయస్థాయిలో అభివృద్ధి చెందనుందని, దీనిపై దృష్టి సారిస్తామని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం పోలవరం మండలంలో నిర్వహించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పోలవరం సర్పంచ్ సంకురు వెంకాయమ్మ ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మంత్రి కావూరి మాట్లాడారు. విభజన సమస్య తేలిన తరువాత టూరిజం కోసం అనేక అవకాశాలు వస్తాయన్నారు. పోలవరంలో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని, గోదావరి వరద నివారణకు చేపట్టిన నక్లెస్‌బండ్ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, దానిని పూర్తిచేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బల్లలు సమకూర్చాలని సర్వశిక్షా అభియాన్ అధికారులను ఆయన ఫోన్లో ఆదేశించారు. డీసీసీబీ అధ్యక్షుడు ము త్యాల వెంకటేశ్వరరావు, డీసీసీ అధికార ప్రతి నిధి జెట్టి గురునాధరావు, ఏఎంసీ వైఎస్ చైర్మన్ మట్టా సత్తిపండు, డీసీసీ ఉపాధ్యక్షుడు సంకురు బాబూరావు, కార్యదర్శి పైడిముక్కల కృష్ణ పాల్గొన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచండి : బాలరాజు పోలవరం : సమైక్యాంధ్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, తెల్లం బాలరాజు కోరారు. పోలవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రచ్చబండ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చర్యతో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. మూడు నెలలుగా సమైక్యాంధ్ర సాధన కోసం అలుపెరగకుండా ఉద్యమిస్తున్నారని మంత్రికి వివరించారు. మూడో దఫా రచ్చబండ గ్రామాల్లో నిర్వహించి ఉంటే గ్రామప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాయితీలను చెల్లించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని సక్రమంగా అందజేసిన తరువాతే గ్రామాలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. -
'మీకు పదవే ముఖ్యమనుకుంటే రాజకీయ సమాధే'
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో జరిగిన రైతు గర్జన సభలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుపై అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో ముగిసిపోయే పదవి కోసం పాకులాడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదవే ముఖ్యమనుకుంటే రాజకీయ సమాధేనని తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వని సీమాంధ్ర ఎమ్మెల్యేలను సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రులు ఈ తరహాలో ఉండి వైఖరి మార్చుకోకపోతే ఉద్యమ తీవ్రతను చూపిస్తామంటూ కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయిన విభజన బిల్లుకు సహకరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండి చేస్తామన్నారు. మంత్రులు కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ గెలవాలనుకుంటే అది వారి పిచ్చితనమే అవుతుందన్నారు. సమైక్యాంధ్ర కోరుకునే వారిని గెలిపించి సీమాంధ్రుల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలన్నారు. -
కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యసెగ తగిలింది. రచ్చబండకు వెళ్తున్న కావూరిని సమైక్యవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండలో కావూరి మాట్లాడుతూ కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ముందు రేపు సమైక్యవాదం గట్టిగా వినిపిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హొదా ఖాయం అని చెప్పారు. విభజన అనివార్యమైతే భద్రాచలం సీమాంధ్రకే చెందాలన్నారు. -
అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటి
హైదరాబాద్: అప్పుడు కావూరి సాంబశివరావు మంత్రి పదవి కోసం సమైక్యవాదం వినిపించినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన సెటిల్మెంట్ కోసం ఈ వాదనను వినిపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం నిజంగా సమైక్యవాది అయితే సమైక్యరాష్ట్రం కోసం ఈ వంద రోజులు ఏం చేశారు? అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, జీవోఎం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేకపోయారు? అని అడిగారు. విభజన డ్రామాలో అన్ని పాత్రలు కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుందని విమర్శించారు. సీఎం కిరణ్ చేత పార్టీ పెట్టించి మళ్లీ కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని ఆశిస్తుందన్నారు. ఈ డ్రామానంతటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తగిన బుద్ధి చెబుతారని అంబటి హెచ్చరించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, కిరణ్‌లు విభజన డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. విభజనకు కిరణ్ ఆమోదించినట్లు ఒక పక్క దిగ్విజయ్ చెబుతుంటే, మరో పక్క సీఎం మాత్రం ఇంకా తాను సమైక్యవాదినేనని చెబుతున్నారని విమర్శించారు. పదవి ముఖ్యం కాదంటున్న సీఎం కిరణ్ జులై 30న ఎందుకు రాజీనామా చేయలేదు? అని అంబటి ప్రశ్నించారు. ఆ రోజే సీఎం పదవికి రాజీనామా చేసుంటే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేదా? అని అడిగారు. వార్ రూమ్‌లో పదవి కోసం కన్వీన్స్ అయిన సీఎం బయటకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లారి నాటకంతో ప్రజలు క్షోభిస్తున్నారన్నారు. కాంగ్రెస్ తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మా అనుమానాలు తీర్చాలి: చిరంజీవి
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మార్గం లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరి భాగస్వామ్యం ఉందన్నారు. చిదంబరంను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని చిరంజీవి చెప్పారు. హైదరాబాద్ గురించి మరోసారి ఆలోచించాలని కోరామన్నారు. ఉద్యోగులు, విద్యార్థుల భయాలు తొలగించాలని సూచించామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి భద్రత కల్పిస్తారో చెప్పాలని కోరామన్నారు. అందరికీ న్యాయం చేయాలని, తమ అనుమానాలు తీర్చాలని కోరినట్టు తెలిపారు. అన్యాయం జరుగుతుందని తెలిస్తే తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినందున విధులకు దూరంగా ఉన్నట్టు తెలిపారు. చిరంజీవితో పాటు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, పురందేశ్వరి కూడా చిదంబరంను కలిశారు. జీవోఎం సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది. -
జేడీ శీలం 'నో కామెంట్'...కాఫీ తాగామన్న కావూరి!
-
ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. జీవోఎంకు నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం మంత్రులను మాట్లాడించేందుకు ప్రయత్నించగా మంత్రి జేడీ శీలం 'నో కామెంట్' అని వ్యాఖ్యానించగా, కావూరి 'కాఫీ తాగాం' అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి మంత్రుల బృందాన్ని మరోసారి కలుస్తాం అని పనబాక లక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై మళ్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ లను కలుస్తామన్నారు. -
కేంద్ర మంత్రి కావూరికి సమైక్య సెగ
కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : కొయ్యలగూడెం మండలంలో పర్యటనకు మంగళవారం వచ్చిన కేంద్ర జౌళి శాఖా మంత్రి కావూరి సాంబశివరావును సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన వస్తున్న విషయం తెలిసి స్థానిక గణేష్ సెంటర్లో వందలాది మంది సమైక్యవాదులు గుమిగూడారు. ఐటీడీఏకు వెళుతున్న మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని ఆయనను కారులోంచి దిగాల్సిందిగా కోరారు. కారు దిగి నాయకులు చెప్పిన విషయాలను మంత్రి ఆలకించారు. సమైక్య రాష్ట్రంపై ఏమీ చెప్పకుండానే కారు ఎక్కడంతో సమైక్యవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. డీఎస్పీ రాఘవ, పోలీసు సిబ్బంది వారిని పక్కకు నెట్టేశారు. అనంతరం కాన్వాయ్ దిప్పకాయలపాడు చేరుకుంది. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎస్ఆర్ఆర్ నరసింహరాజు, సమైక్య పరిరక్షణ ఉద్యమ యూత్ జేఏసీ సభ్యుడు గంగిరెడ్ల సతీష్, ఉపాధ్యాయుల సంఘాలు, ఎన్జీవో సంఘ నాయకుల ఆధ్వర్యంలో వందలాది మంది స్థానిక తూర్పు కాలువ బ్రిడ్జి వద్ద బైఠాయించి మంత్రిని అడ్డుకున్నారు. మంత్రి కారు దిగి ఉపాధ్యాయ సంఘం నాయకుని చేతిలో చెయ్యివేసి పార్లమెంట్లో సమైక్యరాష్ట్రానికి మద్దతుగా ఓటువేస్తానని ప్రమాణం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని మంత్రిని కోరారు. సహనం కోల్పోయిన మంత్రి మీకు చెప్పాల్సిన పని లేదనడంతో సమైక్యవాదులు ‘గోబ్యాక్ కావూరి’ అంటూ నినాదాలు చేశారు. -
కేంద్రం నుంచి నిధులు ఇప్పించండి
ఏలూరు, న్యూస్‌లైన్ : భారీ వర్షాల వల్ల సంభవించిన అపార నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి జిల్లాకు నిధులు విడుదల చేయించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావును కోరారు. ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన కేంద్ర మంత్రిని కలిసి జిల్లాలో నష్టం వివరాలను తెలియజేశారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. మూడు నెలల్లో వరదలు, తుపానులు, భారీ వర్షాలవల్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే బాగు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించాలని కోరారు. నష్టం తీవ్రతను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన ముం దస్తు చర్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కలెక్టర్‌ను ప్రశంసించారు. పలువురు జిల్లా అధికారులతో ఆయన చర్చించారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఏలూరు సీఐలు నక్కా సూర్యచంద్రరావు, రవికుమార్, విజయపాల్ తదితరులు కావూరిని కలిశారు. కేంద్ర నిధులు తీసుకు వస్తా : మంత్రి కావూరి జిల్లాలో భారీ వర్షాల వల్ల రూ.784కోట్ల నష్టం వాటిల్లిం దని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. నష్టపోయిన ైరె తులు, ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏలూరు కలెక్టరేట్లో పంట, ఆస్తి నష్టాలపై మంత్రి మంగళవారం రాత్రి సమీక్షించారు. వర్షాలు, వరదలు తాకిడికి ఇళ్లు కోల్పోయిన పేదలకు శాశ్వత గృహనిర్మాణ పథకంలో ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వరదల నివారణకు శాస్త్రీయ సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకువస్తానని కావూరి హామీ ఇచ్చారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలను ప్రారంభించి నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. పంట నష్టం పరిశీలన కొవ్వలి(దెందులూరు), న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మంగళవారం పర్యటించారు. దెందులూరు మండలం కొవ్వలి, దోసపాడు, పోతునూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కొవ్వలి మొండికోడు వద్ద మునిగిపోయిన పంట పొలాల్లో వచ్చిన మొలకలను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల కోరికమేరకు నీలం తుపాను నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. దోసపాడు వాగు వల్ల పంట నష్టానికి గురవుతోందని గ్రామస్తులు మంత్రికి తెలిపారు. పోతునూరులో డ్రె యిన్ల ఆధునీకరణ, పూర్తి స్థాయి రోడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాటన్ ఎడ్వైజరీ బోర్డు డెరైక్టర్ కొత్త సాం బశివరావు, పోతునూరు సర్పంచ్ జక్కుల దాసు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందచేశారు. -
కొత్త డిజైన్లను అన్వేషించాలి: కావూరి
సాక్షి, న్యూఢిల్లీ: హస్తకళల రంగంలో అంతర్జాతీయ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కొత్త డిజైన్ల అన్వేషణ అవసరమని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. నవ్యత, నాణ్యత, సృజనాత్మకత అంశాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ ఆదరణ ఉంటుందన్నారు. దీనివల్ల శ్రమకు తగిన ఫలితం ఉత్పత్తిదారులకు, పెట్టుబడికి తగిన ఆదాయం ఎగుమతిదారులకు, మంచి వస్తువులు వినియోగదారులకు లభ్యమవుతాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి కంపెనీల అవసరాలు, డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని రంగులు, డిజైన్లు, ప్యాటర్న్లు తయారు చేయకుంటే మనుగడ అసాధ్యమన్నారు. నోయిడాలోని ఎక్స్‌పోలో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఇండియా హ్యాండిక్రాప్ట్స్, గిఫ్ట్స్ మేళా (అటమున్)-2013ని కేంద్ర మంత్రి కావూరి మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. ఈ మేళాను ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హాండిక్రాప్ట్స్ (ఈపీసీహెచ్) నిర్వహిస్తోంది. హస్తకళల రంగం అభివృద్ధికి కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని, నిధుల అవసరాలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. హస్తకళల డిజైన్ల రూపకల్పన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వస్తువులు తయారుచేసేవారిలో వృత్తినైపుణ్యం పెంచడానికి అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్న ఈపీసీహెచ్ సేవలను కొనియాడారు. అనంతరం మంత్రి కావూరి మేళా డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూపీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అభిషేక్ మిశ్రా మాట్లాడుతూ హ్యాండిక్రాఫ్ట్స్ మేళా నిర్వహించడానికి వచ్చిన వారికి యూపీ సర్కారు స్వాగతిస్తోందన్నారు. హస్తకళలలో మొత్తం ఎగుమతుల్లో 40 శాతం యూపీలోని మోరాదాబాద్, భదోయి, లక్నో తదితర ప్రాంతాల నుంచి ఉండడం అభినందనీయమన్నారు. -
సీఎస్ఆర్... 50 వేల కొత్త కొలువులు
న్యూఢిల్లీ: కంపెనీల సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కారణంగా 50 వేల మరిన్ని ఉద్యోగావకాశాలు ఉత్పన్నమవుతాయని నిపుణులంటున్నారు. సీఎస్ఆర్ను తప్పనిసరి చేయడం వల్ల ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, రానున్న సంవత్సరాల్లో ఈ ఉద్యోగాల సంఖ్య 50 శాతానికి పైగా పెరుగుతుందని వారంటున్నారు. కంపెనీల చట్టం పరిధిలోకి సుమారుగా 8,000 కంపెనీలు వస్తాయని, ఫలితంగా కొత్త ఉద్యోగావకాశాలు ఉత్పన్నమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సీఎస్ఆర్ కార్యకలాపాలను కంపెనీ కమ్యూనికేషన్స్ విభాగం చూస్తోం దని, కొత్త కంపెనీల చట్టం కారణంగా సీఎస్ఆర్ కోసం కనీసం ఐదారుగురితో ఒక జట్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. సీఎస్ఆర్ నిపుణుల కోసం డిమాండ్ 50-60% పెరిగే అవకాశాలున్నాయని ప్రముఖ హెచ్ఆర్ సంస్థ గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. సీఎస్ఆర్ను ఒక కెరీర్‌గా ఇప్పటికే పలువురు ఎంచుకుంటున్నారని, వీరి సంఖ్య మరింత పెరుగుతుందని చేంజ్యువర్బాస్డాట్కామ్ సీఈవో భూపేందర్ మెహతా అంచనా వేస్తున్నారు. కంపెనీ చిన్నదైనా, పెద్దదైనా సీఎస్ఆర్ కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. జౌళి రంగంలో 50 లక్షల ఉద్యోగాలు: కావూరి జౌళి (టైక్స్టైల్స్) రంగంలో నాలుగేళ్లలో 50 లక్షల అదనపు ఉద్యోగాలు రానున్నాయని టెక్స్టైల్స్ శాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలం(2012-17)లో ఉత్పన్నమయ్యే ఈ కొత్త కొలువుల కారణంగా ఈ రంగంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 5 కోట్లకు చేరుతుందన్నారు. క్యూ2లో 1.36 లక్షల కొత్త ఉద్యోగాలు ముంబై: ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో కంపెనీలు 1.36 లక్షల కొత్త ఉద్యోగాలిచ్చాయని ఆసోచామ్ పేర్కొంది. కొత్త కొలువుల్లో హైదరాబాద్ వాటా 16.5%. క్యూ2లో కొత్త కొలువుల్లో 61% ఉద్యోగాలు టాప్-5 మెట్రో నగరాల్లోనే వచ్చాయి. క్యూ1లో వచ్చిన ఉద్యోగాల (1.25 లక్షల ఉద్యోగాలు)తో పోల్చితే క్యూ2లో కొత్త కొలువుల వృద్ధి 9 శాతంగా ఉంది. ఇక రంగాల వారీగా చూస్తే ఐటీ, ఐటీ అనుబంధ సర్వీసులు, ఐటీ హార్డ్‌వేర్ రంగాల్లో 42% ఉద్యోగాలొచ్చాయి. తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్, బీమా, నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలు ఉన్నాయి. -
కేబినెట్ భేటీకి పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశానికి కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు అయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి కావూరి సాంబశివరావు, జైపాల్ రెడ్డి హాజరు అయ్యారు. సీమాంధ్ర విద్యుత్ సంక్షోభంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే భేటీ అనంతరం కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా పల్లంరాజు తన రాజీనామాను ప్రధానమంత్రికి ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఉన్నావా కావురి ఉన్నావా....
-
'విషాదకర ప్రకటనకు వారే సాక్షులు'
సీమాంద్ర చరిత్రలో ఓ విషాదకర ప్రకటనకు వారు సాక్షులుగా మిగిలిపోయారు. తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే సందర్భంగా జరిగిన చర్చలోనూ పాల్గొన్నారు. కానీ తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం చెప్పకుండా ఆపలేకపోయారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇద్దరు మంత్రులు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. వారే కావూరి సాంబశివరావు, పల్లంరాజు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరి సాక్షిగానే తెలంగాణపై కేబినెట్ నోట్ కు ఆమోద ముద్ర పడిపోయింది. సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా... సమైక్యవాదులు రాజీనామాలు చేయండంటూ ఎంత డిమాండ్ చేసినా రాజీనామాలతో ఏం లాభం. పదవుల్లోనే ఉండి ఢిల్లీలో తెలంగాణను అడ్డుకుంటామంటూ ఎన్నో ప్రకటనలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టనివ్వమన్నారు. ఎంతమంది రాజీనామాలు చేయమన్నా పదవులను పట్టుకుని వేలాడారు. కానీ చివరికి జరిగిందేంటీ..? కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్‌పై సాగిన చర్చలో కావూరి, పల్లంరాజులు పాల్గొన్నారు. నోట్‌ను వ్యతిరేకించలేక, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రమంత్రి మండలి ముందు ఉంచడంలో ఘోరాతిఘోరంగా విఫలమయ్యారు. అధిష్టానం ఆదేశాలతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. విభజన పాపాన్ని మూటగట్టుకున్నారు. తెలంగాణ నోట్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకోవటంతో .....ఇక ప్రజలు తమమీద తిరగబడతారనుకున్నారో ఏమో మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. భేటీ తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పదవుల్లో కొనసాగలేమని చెప్పారు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని ప్రధాని నచ్చజెప్పారు. దీంతో రాజీనామాలపై వారెలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు ఈరోజు తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
‘విభజన’పై సవరణ ఉంటుంది : కావూరి సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలో పెల్లుబికిన ప్రజాగ్రహం, విభజనతో జరిగే నష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని, ఈ సమాచారం తనకు కూడా అందిందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. రాష్ర్టంలో నెలకొన్న సమస్యలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుందని, విభజన ప్రకటనపై సవరణ కూడా చేసే అవకాశం ఉందని అన్నారు. జాతీయ టెక్స్టైల్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసిన ‘ఇండియన్ రిపబ్లిక్’ బ్రాండ్ దుస్తుల ప్రారంభ కార్యక్రమం బుధవారం ఇక్కడ జరిగింది. దీనికి వచ్చిన కావూరి కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రూ. 2 వేల కోట్లతో రాష్ట్రంలో 4 టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కావూరి వెంట కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తదితరులున్నారు. -
కాంగ్రెస్ అధిష్టానం తొందరపడింది: కావూరి సాంబశివరావు
రాష్ట్ర విభజన మంచి పరిణామం కాదు: కావూరి స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం తొందరపడిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఫలితంగా సీమాంధ్రలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బతగలనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని లేపాక్షిలో స్వచ్ఛమైన భారతీయ పట్టు విక్రయ కేంద్రం ‘రేషమ్ ఘర్’ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అనే కాదు, ప్రస్తుతం దేశంలోని ఏ పార్టీకీ సిద్ధాంతం లేదు. ఎన్నికల్లో ఎలా గెలవాలి? అధికారాన్ని ఎలా చేజి క్కించుకోవాలి? అనే ఆలోచనతోనే ఉన్నాయి’ అని అన్నారు. తాను ఈ విధానాన్ని సమర్థించబోనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని, విభజనతో మేలు జరుగుతుందని తాను భావించడం లేదని అన్నారు. అధిష్టానం తొందరపడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతోందనే వాదనపై స్పందిస్తూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా భవిష్యత్‌పై జోస్యం చెప్పలేను. అద్భుతాలూ జరగవచ్చు’ అన్నారు. ైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనే అంశంపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటివి సహజమన్నారు. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ భవిష్యత్ దెబ్బతిన్నదని, దీనిపై పార్టీ అధిష్టానంతో మాట్లాడతానన్నారు. -
'రాజీనామాలు వద్దని సీఎం....కావాలని ప్రజలు'
న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి అంటున్నారని.... అయితే రాజీనామాలు చేయాలని ప్రజలంటున్నారని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అవసరం అయినప్పుడు రాజీనామాలు చేస్తామన్నారు. పార్టీలు సిద్ధాంతాలు వదిలేయటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కావూరి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. భేటీకి కేవీపీ రామచంద్రారవు, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. -
భస్మాసుర హస్తం
జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి భస్మాసుర హస్తాన్ని తలపిస్తోంది. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం బరితెగించితే... జిల్లా నాయకులు నోరెత్తకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమానికి దూరంగా ఉండడం, ఇంకా పదవులను పట్టుకువేలాడడంతో ఆ పార్టీ నేతలు జనం మధ్యకు వచ్చే అవకాశం లేకుండా పోతోంది. ప్రజాగ్రహ జ్వాలకు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యవాదులనుంచి ఎదురైన పరాభవం జిల్లాలోని కాంగ్రెస్ నేతల ను ఆలోచనలో పడేసింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చక్రం తిప్పుతున్న స్థానిక నేతలు జిల్లాలో తిరిగితే ఇటువంటి చేదు అనుభవాన్నే ఎదుర్కోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కేంద్రమంత్రి కావూరికి బుధవారం సమైక్యసెగ తగిలింది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కావూరి.. సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్యపార్టీలు తెలంగాణ అంశంపై తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తొలుత సమర్థించి ఆ తర్వాత మాట మార్చారు. ఆయన ధోరణిని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. జిల్లా పర్యట నకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకొని, నిరసన తెలపడంతో కావూరి అవమాన భారంతో వెనుదిరిగారు. కేంద్రమంత్రికే ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. తమ సంగతి ఏమిటని కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. ప్రజల మధ్యకు రాని ఎంపీ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ జనం మధ్యకు రావడమే మానేశారు. అడపాదడపా వచ్చినా మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు. గతంలో మాదిరిగా జనంలో ఉండలేకపోతున్నారు. ఏదో విధంగా ప్రచారం కోరుకునే లగడపాటి ఈసారి మౌనంగా ఉండిపోయారు. ఏ వైఖరి తీసుకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయంతోనే ఆయన కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తానంటూ ప్రకటనలు గుప్పించిన లగడపాటి వాయిస్‌లో బేస్ తగ్గిందని ప్రజలు దుయ్యబడుతున్నారు. మంత్రి సారథిదీ అదే దారి రాష్ర్ట మంత్రి సారథి సైతం జనంలోకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ను, మంత్రి పదవిని పట్టుకుని వేలాడుతున్న సారథి.. జిల్లాలో సమైక్యవాదులకు తన ముఖం చూపలేకపోతున్నారు. హైదరాబాద్, ఢిల్లీల్లో సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్టు మీడియా సమావేశాలు నిర్వహించడం మినహా జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్న ఉద్యమానికి ఆయన చేరువకాలేకపోతున్నారు. జిల్లాకు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్న మంత్రి తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తన మంత్రి పదవికైనా రాజీనామా సమర్పిస్తే ఆయనపై కొంత గౌరవం ఉంటుందని జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయాల మొహం చూడని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విష్ణు, దాసు, వెలంపల్లి , రవి, పద్మజ్యోతి, ఇతర ముఖ్యనేతలు సమైక్య ఉద్యమం దరిదాపులకు వెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మీడియా పులిగా పేరున్న మల్లాది సమైక్య ఉద్యమంలో పాల్గొనకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గంలోకే కాదు, కనీసం వారి కార్యాలయాల్లోకి అడుగుపెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ప్రజాభీష్టం కంటే పదవులే పరమావధిగా భావించే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని, పదవులను పట్టుకువేలాడుతున్న వారిని నిలదీసేందుకు ప్రజలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అడుగుపెడితే నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
సాంబ... ఇదేం దబ్బ!
‘పదవిని పట్టుకుని వేలాడ్డానికి నేను వెధవను కాదు. మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేను’ ఈ మాటలన్నది గల్లీ నాయకుడు కాదు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. 45 ఏళ్లుగా హస్తం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతాశ్రీ విచక్షణ మరిచిపోయి వదిలిన పరుష పదజాలమిది. ఆయనెవరో కాదు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు. తనను నిలదీసిన సమైక్యవాదులపై ఆయన తిట్ల దండకం అందుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయిన 49 రోజుల తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన కావూరిని ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా తమతో కలిసి ఉద్యమంలోకి రావాలని అభ్యర్థించారు. కేంద్ర అమాత్య పదవికి రాజీనామా చేసి సమైక్య పోరాటంలోకి దూకాలని కోరారు. ఆందోళనకారులను సముదాయిల్సింది పోయి వారిని మరింత రెచ్చగొట్టారు. రాజీనామాకు ససేమీరా అనడంతో సమైక్యవాదులు కావూరిని కదలనీయలేదు. 45 ఏళ్ల పొలిటికర్ కెరీర్ ఉన్న తాను నాలుగు నెలలుండే కేంద్ర మంత్రి పదవి కోసం పాకులాడే వెధవని కానని, మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేనంటూ మాట తూలారు. దీంతో విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా కావూరి అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. తాను పక్కా సమైక్యవాదినని చెప్పుకునే కావూరి సమైక్యాంధ్ర అనడానికి నిరాకరించడం ఆయన ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తోంది. కేంద్ర మంత్రి కాగానే ఆయన సమైక్యాంధ్ర టాగ్‌ను వదిలేశారు. మంత్రి పదవి రాకముందు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళమెత్తిన కావూరి తర్వాత రూటు మార్చారు. కేంద్ర మంత్రిగా స్థాయికి దిగి మాట్లాడలేనంటూ గతంలో బీరాలు పలికిన కావూరి ఇప్పుడు చేసిన పరుష వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెబుతారు? -
కావూరికి సమైక్య కాక
ఎక్కడికక్కడ అడ్డుకున్న సమైక్యవాదులు ‘పిచ్చోళ్లు, వెధవలు’ అన్న కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని అడ్డగించిన ఉద్యమకారులు ఏలూరు/కైకలూరు/విశాఖపట్నం, న్యూస్‌లైన్: కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య కాక గట్టిగా తాకింది. మంగళవారం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలుచోట్ల సమైక్యవాదులు ఆయనను అడ్డుకున్నారు. తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘పిచ్చోళ్లు, వెధవలు’ అంటూ తమను మంత్రి నిందించడంతో ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. వారిపై కావూరి అనుచరులు చేయి చేసుకున్నారు. మరో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డిలకు కూడా మంగళవారం సమైక్య సెగ బాగా తగిలింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన 49 రోజుల అనంతరం తొలిసారి కావూరి జిల్లాకు వచ్చారు. ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాక ఏలూరు బయల్దేరారు. భీమడోలు జంక్షన్లో ఎన్జీవోలు ఆయన్ను అడ్డుకున్నారు. ‘కావూరి గో బ్యాక్’, ‘తక్షణం పదవికి రాజీనామా చేయాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాట్లాడేందుకు కావూరి విఫలయత్నం చేశారు. మంత్రి కాన్వాయ్‌ని కదలనీయకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో పోలీసు బలగాల సాయంతో సమీపంలోని సమైక్యవాదుల శిబిరం వద్దకు కావూరి నడిచి వెళ్లారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై కేంద్ర మంత్రిగా వైఖరి చెప్పాలని వారు పట్టుబట్టారు. శ్రీకృష్ణ కమిటీ, పోలవరం ప్రాజెక్టు తదితరాలపై ఆయన మాట్లాడటంతో విసుగుచెందిన సమైక్యవాదులు, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం మీరేం చేస్తున్నారంటూ నిలదీశారు. అసహనానికి గురైన కావూరి, ‘పిచ్చోళ్లలా మాట్లాడుతున్నారు. మీ అందరి దగ్గరకూ వచ్చి మాట్లాడుతున్నాను. నా ప్రసంగానికి అడ్డు తగలడమేమిటి? మీలో సమైక్యవాదులున్నారా? లేక వేరే వ్యక్తుల్ని తీసుకొచ్చారా?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన సమైక్యవాదులు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ కావూరి’ అంటూ నినదించారు. దాంతో ఆయన అసహనానికి గురై న వెళ్లిపోయారు. తర్వాత కావూరి ఏలూరు వస్తున్నారని తెలుసుకున్న ఎన్జీవోలు, విద్యార్థులు, సమైక్యవాదులు అశోక్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో వంతెన వద్దకు చేరుకుని రహదారిని స్తంభింపజేశారు. కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని తోసేసి మంత్రిని క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆగ్రహించిన ఎన్జీవోలు, విద్యార్థులు కార్యాలయూన్ని ముట్టడించారు. అక్కడ కావూరి అనుచరులు సమైక్యవాదులతో ఘర్షణకు దిగి రెచ్చగొట్టేలా మాట్లాడారు. దాంతో సమైక్యవాదులు క్యాంప్ కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకెళ్లి అక్కడి కుర్చీలను ధ్వంసం చేశారు. కాసేపటికి కావూరి బయటకొచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన రాజీనామా చేయాలని ఎన్జీవోలు డిమాండ్ చేశారు. తాను మనసా వాచా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ఆయనన్నారు. ‘నా రాజీనామాతో తెలంగాణ ప్రకటన ఆగిపోతుందంటే నా అంత అదృష్టవంతుడు మరొకరుండరు. 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో నిజాయితీ, కట్టుబాట్లతో పని చేస్తున్నాను. నడ్డిరోడ్డుపై ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడే సత్తా నాకుంది. అసమర్థుణ్ని కాను’ అన్నారు. ఉద్దేశపూర్వకంగా, స్వార్థంతో కొందరిని తనపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ‘మీలో చాలా మంది సమైక్యవాదులు కాదు’ అన్నారు. దానికి విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ‘పదవిని పట్టుకుని వేలాడ్డానికి నేను వెధవను కాదు. మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేనం’టూ పరుష వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఎన్జీవోలు, విద్యార్థులు తీవ్ర నిరసన తెలిపారు. ‘కావూరి డౌన్.. డౌన్.. కావూరి గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా కావూరికి సమైక్య సెగ తగిలింది. మండవల్లి మండలం భైరవపట్నంలో దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణకు ఆయన హాజరైన విషయం తెలిసి జేఏసీలు, పార్టీల నేతలు ఉదయం నుంచే గ్రామ రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం కావూరి రాగానే, రాజీనామా చేయాలంటూ నినదించారు. కారు వెంట పరుగులు తీశారు. కాన్వాయ్కి అడ్డొచ్చిన వారిని పోలీసులు విచక్షణారహితంగా పక్కకు నెట్టేయడంతో ముగ్గురు జేఏసీ నేతలు గాయపడ్డారు. విగ్రహావిష్కరణ సభలోనూ కావూరి ఉన్నంతసేపూ నిరసన నినాదాలు మిన్నంటాయి. విమానాశ్రయంలో మంత్రులకు ఎదురుగాలి సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో కృపారాణిని అడ్డగించారు. పోలీసు బందోబస్తు మధ్య ఆమె వెళ్లిపోజూశారు. మీడియా వివరణ కోరగా, ‘సమైక్యాంధ్ర కోసం కచ్చితంగా పోరాడాలి. అయితే కేంద్రం విభజన నిర్ణయాన్ని ప్రకటించే పరిస్థితి ఉంటే అప్పుడు రాజీనామా చేస్తా’నన్నారు. తర్వాత శత్రుచర్లను కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బదులివ్వకుండా పోలీసుల సాయంతో వెళ్లిపోయారు. సుబ్బరామిరెడ్డిని కూడా సమైక్యవాదులు మరోసారి అడ్డుకున్నారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా కేజీహెచ్‌లో రోగులకు పండ్లు, దుప్పట్లు పంచడానికి వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆస్పత్రి మెయిన్ గేటు వద్ద దీక్ష చేస్తున్న మెడికల్ జేఏసీ నేతలు, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు టీఎస్సార్‌ను అడ్డగించారు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయాలని నిలదీశారు. రాష్ట్ర విభజనపై మీ వైఖరి ఏమిటంటూ ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు కట్టుబడ్డానని ఆయన చెప్పారు. తాను రాజీనామా చేసిన లేఖ జిరాక్స్ కాపీని జేబులోంచి తీసి వారికి చూపించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. -
కావూరి ఇంటిపై చింతమనేని అనుచరుల దాడి
కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్ అనుచరులు, సమైక్యవాదులు ఏలూరులోని కావూరి ఇంటిని ముట్టడించారు. వీరిని కావూరి అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమయింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు కావూరి నివాసంలోకి ప్రవేశించిన ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కలగజేసుకుని వీరిని చెదరగొట్టారు. పలువురి అదుపులోకి తీసుకున్నారు. కావూరిని అంతకుముందు కలపర్రు చెక్‌పోస్ట్ వద్ద చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో కావూరి తన ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరి ఏలూరు నగరాన్ని చేరుకున్నారు. -
కేంద్ర మంత్రి కావూరికి సమైక్య సెగ
-
సమైక్యమే రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం: కావూరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే దేశానికి, రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరమని కేంద్రమంత్రి, ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఏలూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై అవసరమైతే ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన స్ఫష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ జులై 30న తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. 2009 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రకటన తొందరపాటు చర్య అని తాను కేంద్రానికి ముందే చెప్పానని కావూరి సాంబశివరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు సొంత నియోజకవర్గమైన ఏలూరులో మంగళవారం సమైక్య సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు వస్తున్న కావూరిని కలపర్రు చెక్‌పోస్ట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో కావూరి తన ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరి ఏలూరు నగరాన్ని చేరుకున్నారు. -
రాజీనామాల్లేవ్!
* రాజీనామా డిమాండ్ మీడియా సృష్టే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల అసహనం * పదవుల నుంచి వైదొలగమని ప్రజలెవరూ అడగడం లేదు.. * ఎప్పుడు ఏం చేయాలనే తెలివితేటలు మాకున్నాయి * మా ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చింది.. త్వరలో మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు * సమైక్యంగా ఉంచాలని సోనియా, రాహుల్‌గాంధీలను కోరతాం * హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది * పరిణామాలను చూస్తే విభజన ప్రక్రియ ఆగినట్లే కనిపిస్తోంది * హైదరాబాద్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల భేటీ ‘‘సీమాంధ్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని, ఎంపీలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని మీడియా కాకమ్మ కథలు అల్లుతోంది. ప్రజాభిప్రాయుంపై మీడియా స్పందించటం లేదు. ప్రజల పేరుతో, మీడియానే స్పందిస్తోంది.’’ - కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ‘‘మేం రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారు? పేర్లు చెప్పండి? రాజీనామా ఎవరూ అడగటం లేదు. ఇదంతా మీడియా సృష్టి. చానళ్లు, పత్రికల మధ్యనున్న పోటీ, ఇతర కారణాలవల్లే ఇదంతా జరుగుతోంది.’’ - మరో కేంద్రమంత్రి జె.డి.శీలం ‘‘కావూరి సాంబశివరావు మాటపైనే మేమంతా నిలబడ్డాం. అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాం తప్ప మాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజల ఆందోళన, ఆకాంక్షల ముందు మా పదవులు చాలా చిన్నవి. ఏదో ఒక కారణంతో పదవులను చంకలో పెట్టుకుని తిరిగే గాడిదలు ఎవరూ లేరిక్కడ.’’ - టీటీడీ చైర్మన్ బాపిరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడ్డారంటూ జరిగిన ప్రచారమంతా వట్టిదేనని తేలింది. సీమాంధ్ర కేంద్రమంత్రులు శనివారం హైదరాబాద్‌లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజీనామాలు చేసే ఉద్దేశమే వారికి లేదని తేటతెల్లమవుతోంది. తమ రాజీనామాల డిమాండ్ అనేది మీడియా సృష్టేనంటూ వారంతా కొట్టిపారేశారు. తమను ఎవరూ రాజీనామాలు అడగటం లేదన్నారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయంపై తమ ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చిందని చెప్పారు. ఆ కమిటీ సీమాంధ్రలో పర్యటించి ప్రజల ఆందోళనలు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు. ఢిల్లీలో తాజా పరిస్థితులను చూస్తే విభజన నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సహా మొత్తం 16 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యూరు. ఢిల్లీ పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజీనామాలు, భవిష్యత్ కార్యాచరణపై రెండు గంటలకుపైగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రవుంత్రి కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలపై ప్రజల ఒత్తిళ్ల గురించి, విలేకరులు ప్రస్తావించగా ఆయున అసహనం వ్యక్తంచేశారు. రాజీనామాల డిమాండ్ మీడియా సొంత అభిప్రాయమేనని.. ప్రజా స్పందనను మీడియా పేర్కొనటం లేదని తప్పుపట్టారు. తాము ఏ త్యాగాలకైనా సిద్ధవుని, ఎప్పుడు ఏం చేయాల నే తెలివితేటలు, సమర్ధత తమకున్నాయన్నారు. పార్టీ మా సర్వస్వం.. ప్రజలే ముఖ్యం... టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆనాడు ఇంకా దీక్ష కొనసాగిస్తే చనిపోతారనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిందని, కేసీఆర్ దీక్ష నటనేనని తాము చెప్పినా కేంద్రం వినలేదని కావూరి వ్యాఖ్యానించారు. అప్పట్లో కేంద్రం ప్రకటనతో సీమాంధ్రలో తలెత్తిన ప్రజాందోళన, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ క్షేత్రస్థారుు అధ్యయనంతో ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు. దీనిపై తాము ఒత్తిడి తేవటం వల్లే ఆంటోనీ కమిటీ వచ్చిందని.. మంత్రుల కమిటీ ఏర్పాటుకు ప్రధాని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను పట్టింటుకోకుండా పదవులను అంటిపెట్టుకోవాలన్న ఆశ తమకు లేదన్నారు. తామంతా మళ్లీ ఢిల్లీ వెళ్తావుని, రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్ర ఆందోళనలను చూసి నిర్ణయం తీసుకోవాలని ఆంటోనీ కమిటీకి చెప్తామని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నాం. పార్టీయే వూకు సర్వస్వం. పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్ప మరేదీ సమ్మతం కాదని సోనియూగాంధీ, రాహుల్‌గాంధీలకు చెప్తాం’’ అని తెలిపారు. రాజీనామా చేస్తామంటే పెద్దలు వద్దన్నారు... హైకమాండ్ పెద్దలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయని, వారిలో మార్పు వస్తుందని మరో కేంద్రమంత్రి చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిని గురించి ఆంటోనీ కమిటీతోనే హైకమాండ్‌కు చెప్పిస్తామన్నారు. ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారని, తాము కూడా రాజీనామా చేస్తామంటే హైకమాండ్ పెద్దలు వద్దన్నారని మరో మంత్రి పురందేశ్వరి పేర్కొన్నారు. విభజన ఆగుతుందనుకుంటే రాజీనావూలకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారంటూ వుంత్రి శీలం మీడియాను ఎదురు ప్రశ్నించారు. పదవుల్లో ఉంటే, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవచ్చన్నారు. సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ కోసం మంత్రి పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన కనుమూరి బాపిరాజు చెప్పారు. రాజీనామాలపై సమష్టి నిర్ణయం తీసుకుంటామని, కావూరి మాటపైనే తావుు నిలబడ్డామని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంలేని విభజన నిర్ణయంతో దేశం అల్లకల్లోలం అవుతోందని, ప్రస్తుత పరిణామాలను చూస్తే, విభజన ప్రక్రియ ఆగినట్టే కనిపిస్తోందని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. విభజన ఆగినట్టేనని, కేంద్రం పునరాలోచనలో పడిందని ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకోబోవుని హైకమాండ్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేయబోమని చెప్పండి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు సవాల్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలు, మంత్రులకు ధైర్యం ఉంటే, తాము రాజీనామాలు చేయబోవుంటూ ప్రజలకు చెప్పాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సవాల్ విసిరారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల డిమాండ్‌తోనే ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైందన్నారు. రాజీనామాలకు ఏపీఎన్జీవోలు ఒత్తిడి తేలేదన్న ఎంపీల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నుంచి తిరిగి వెళ్తూ, బస్సులపై జరిగిన దాడిలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందున్న రాజమండ్రి ఉద్యోగి సత్యనారాయణను ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలతో కలిసి అశోక్ బాబు శనివారం పరావుర్శించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సంఘం హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలిపారు. చికిత్సకు ఇప్పటికే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్య ఖర్చులను తమ సంఘమే భరిస్తోందని చెప్పారు. -
కేసీఆర్ చనిపోతాడనే విభజన ప్రకటన చేశారు: కావూరి
కేసిఆర్ చనిపోతాడన్న భయంతో 2009లో విభజన ప్రకటన చేశారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆడింది నాటకమని డిసెంబర్ 9 ప్రకటనకు ముందే చెప్పామని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండవని, జూలై 30 ప్రకటనతో మరిన్ని సమస్యలు వస్తాయని అధిష్ఠానానికి ముక్తకంఠంతో చెప్పామని కావూరి తెలిపారు. 2009లాగే 2013లోనూ కేంద్రం వెనక్కువెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు ఢిల్లీ వెళ్తామని, తమకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం అని కావూరి చెప్పారు. తమ ఒత్తిడి మేరకే కేంద్రం ఆంటోని కమిటీని నియమిచిందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆంటోనీ కమిటీనీ కోరతామని చెప్పారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కమిటీకీ స్పష్టం చేస్తామన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అయితే.. రాజీనామాలపై మాత్రం సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరి ప్రయత్నంగా సోనియాను కలవాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించారు. -
మాకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం : కావూరి
హైదరాబాద్: తమకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ఒత్తిడి మేరకే కేంద్రం ఆంటోని కమిటీని నియమిచిందని చెప్పారు. సీమాంధ్రలో అన్ని వర్గాలు ఏకమై సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయన్నారు. ఒక్క రాజకీయ నేత లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆంటోనీ కమిటీనీ కోరతామని చెప్పారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కమిటీకీ స్పష్టం చేస్తామన్నారు. సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని త్వరలోనే హైకమాండ్‌ను కలుస్తామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. -
కావూరి సాంబశివరావు నివాసం ముట్టడి
-
కావూరి సాంబశివరావు నివాసం ముట్టడి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేయాలంటూ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసాన్ని విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు గురువారం ముట్టడించారు. బంజారాహిల్స్‌లోని కావూరి ఇంటి ముందు మహాసభ కార్యకర్తలు ధర్నా చేశారు. తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి కోసం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాకు కావూరి తాకట్టు పెట్టారని వారు ఆరోపించారు. కావూరి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు కావూరి ఇంట్లోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం విశాలాంధ్ర ప్రతినిధులు బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో కూడా తమ ఆందోళన కొనసాగించారు. -
కావూరి ఇంటిని ముట్టడించిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు
-
తెలంగాణ నోట్ ఇప్పట్లో రాదు: కావూరి సాంబశివరావు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ నోట్ ఇప్పట్లో కేబినెట్ ముందుకు వచ్చే ప్రసక్తే లేదని, అందుకు మరింత సమయం పడుతుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరమే దీనిపై కదలిక వచ్చే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, తాము చేసిన నిర్ణయంపై పునరాలోచనలో పడిందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగేవరకు విభజనపై కాంగ్రెస్ ముందుకు పోదనే భావిస్తున్నానని ఆయన శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ైహైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని తానెన్నడూ కోరలేదని, దాన్ని మూడో రాష్ట్రంగా చేయాలని కోరుతూ వచ్చానని అన్నారు. -
తెలంగాణ నోట్ ఇప్పట్లో రాదు: కావూరి
తెలంగాణ నోట్ క్యాబినెట్‌కు ఇప్పట్లో రాదని కేంద్ర కావూరి సాంబశిరావు అన్నారు. సోనియాగాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాతే ఈ ప్రక్రియలో కదలిక ఉంటుందని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమంతో కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు. హైదరాబాద్‌ను సీమాంధ్రులు వదులుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ ఆమోదం కోసం నోట్ తయారవుతోందని, సిద్ధమయ్యాక దాన్ని కేంద్ర న్యాయ శాఖ ఆమోదానికి పంపిస్తామన్నారు. న్యాయ శాఖ ఆమోదించాక 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పిస్తాం అని తెలియజేశారు. -
ప్రధానిని కలిసిన ఎన్జీవోలు
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంగళవారం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించామని ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ ‘న్యూస్‌లైన్’కు ఫోన్లో తెలిపారు. సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని పునః పరిశీలించే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేనని, సీమాంధ్రుల విద్యా, ఉపాధి, సాగునీరు, హైదరాబాద్ అంశాలపై కేంద్ర కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర విభజన చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. సమైక్యాంధ్రే సీమాంధ్రుల ఆకాంక్షని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రధానికి వివరించారన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్, ఏలూరు నగరశాఖ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి రమేష్‌కుమార్, నాయకులు సందీప్‌గౌడ్, ఎన్ఎంయూ ఏలూరు రీజినల్ కార్యదర్శి ప్రసాద్ ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారన్నారు. -
రాజీనామాకు సిద్ధం : కావూరి
తిరుమల : సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఉద్యమానికి సానుకూల నిర్ణయం రాకుంటే రాజీనామాకు సిద్ధమని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోలు ఉద్యమం చేయటం సమంజసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం కావూరి కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విజయంలో అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కావూరి అన్నారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను సోనియాగాంధీ, ఆంటోనీ కమిటీకి వివరించినట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో 24వ రోజు కూడా నిరసనలు, ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. -
హైదరాబాద్ యూటీ లేదా ప్రత్యేక రాష్ట్రం: కావూరి సాంబశివరావు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల తీవ్రతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని.. త్వరలోనే విభజన నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల్సిందేనన్నారు. హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకోవటంలో మూడు ప్రాంతాల ప్రజల పాత్ర, కృషి ఉందని.. రాజధాని నగరం తెలుగు ప్రజలందరికీ చెందాల్సిందేనని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కావూరి సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంత్రిపదవులకు రాజీనామాలు చేయటంతో సహా ఎలాంటి చర్యకైనా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగిస్తే ఒనగూరే ప్రయోజనాలను శాస్త్రీయబద్ధంగా ఆంటోనీ కమిటీకి నివేదిస్తామని చెప్పారు. -
మా మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రకే: కావూరి
-
మా మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రకే: కావూరి
ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై తమ మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రాకే ఉంటుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం చేయాల్సి వస్తే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్రకు సంబంధించి సోమవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిలో మూడు ప్రాంతాల కృషి ఉందని కావూరి తెలిపారు. సమైక్యాంధ్రాకే తన ఓటన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నుంచి తిరిగి ప్రకటనే వెలువడే అకవాశం ఉందని కావూరి తెలిపారు. ఈ అంశానికి సంబంధించి సాయంత్రం తొమ్మిది మంది సీమాంధ్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. మరో ఎంపీ పనబాక లక్ష్మి మాట్లాడుతూ..తమపై అనవసర ప్రచారం చేస్తున్న కారణంగానే మీడియాకు దూరంగా ఉంటున్నామని తెలిపారు. కొందరు మాత్రమే మీడియాతో మాట్లాడాలని నిర్ణయించామన్నారు. అందుకే మీడియా ఎదుట హాజరు కావడం లేదని తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందు సమైక్య వాదనలు వినిపిస్తామని పనబాక అన్నారు. -
వారిది చానళ్ల ఆరాటం : సంధ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలది చాన్నాళ్ల పోరాటం, సీమాంధ్రులది చానళ్ల ఆరాటమని టీ-జేఏసీ కోకన్వీనర్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య వ్యాఖ్యానించారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడుతూ సాధించుకున్న తెలంగాణను కాపాడుకుందామని కోరారు. దోమలగూడలోని సిరిరాజ్ మీడియా సెంటర్లో (ఎస్ఎంఎస్) సోమవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డాక్టర్ల జేఏసీ నాయకురాలు అనితారెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమం స్పాన్సర్డా, కృత్రిమమా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు లేవని, ప్రాంతాలు, సంస్కృతుల మధ్యే వైరుధ్యం ఉందని, తెలుగు వారి ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరగలేదని తెలిపారు. విడిపోవడానికి తెలంగాణ ప్రజలు అనేక కారణాలు చూపుతున్నా.. ఎందుకు కలిసి ఉండాలో అనడానికి సీమాంధ్రులు ఒక్క కారణం కూడా చూప డం లేదన్నారు. ఎంపీ లగడపాటి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావులాంటి సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ చుట్టుపక్కల కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి తమ వల్లనే అని సీమాంధ్రులు చెపుతున్నారని, ప్రతిష్ఠాత్మకమైన ప్రాగాటూల్స్, హెచ్ఎంటీ, ఆల్విన్ వంటి కంపెనీలను మూసివేయడమే అభివృద్ధా? ఆ భూములన్ని సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఏకాభిప్రాయం పేరిట మహిళా బిల్లుకు మోసం చేశారని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టకుండా అడ్డుకునే ప్రమాదం ఉందని, ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సంధ్య ఆరోపించారు. తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులకు అభద్రతాభావం లేదని, ఏవైనా అపోహలుంటే తొలగించుకోవాలని ఆమె కోరారు.