పాలకొల్లులో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబును, మరో 20 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్నారంటే చాలు.. ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. సమైక్యాంధ్ర వాదులను ఆయన నానా మాటలు అంటున్నా సరే.. ముందస్తుగా వారి నుంచి ఆయనకు 'రక్షణ' కల్పిస్తోంది. ఆ మేరకు ముందుగానే పోలీసులకు ఆదేశాలు జారీచేసినట్లుంది. ఈ విషయం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మరోసారి రుజువైంది.
పాలకొల్లులో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ మేకా శేషుబాబును, మరో 20 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి సంఘటన తర్వాత కావూరి ఎక్కడ పర్యటిస్తున్నా, ముందుగానే సమైక్యవాదులను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.