
సాక్షి, నరసాపురం : పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... జిల్లాలో ఒకదానిని మించి మరొకటి అనేలా ఘనంగా బహిరంగ సభలు జరుగుతున్నాయన్నారు. రేపు (గురువారం) సాయంత్రం పాలకొల్లు గాంధీ సెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. అడుగడుగునా వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని పేర్కొన్నారు. జూన్ 2వ వారంలో ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని అన్నారు. గోదావరి నదిపై మూడుచోట్ల సంకల్పయాత్ర వంతెనలను దాటుతుందని తలశిల రఘురాం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment