ప్రజల పక్షాన పోరాడుతున్నాం: ఆళ్ల నాని | YSRCP Fight for People's problems, says Alla Nani | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన పోరాడుతున్నాం: ఆళ్ల నాని

Published Wed, Nov 26 2014 8:22 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ప్రజల పక్షాన పోరాడుతున్నాం: ఆళ్ల నాని - Sakshi

ప్రజల పక్షాన పోరాడుతున్నాం: ఆళ్ల నాని

పాలకొల్లు: అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని అన్నారు. ఎమ్మెల్సీ మేకాశేషుబాబు నివాసంలో బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అధికారాన్నైనా వదులుకుంటా గానీ అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయనని ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆళ్ల నాని గుర్తు చేశారు. గ్రామస్థాయిలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేసి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement