Meka Seshu Babu
-
టీటీడీ బోర్డ్ మెంబర్ మేకా శేషుబాబుకు ఘన స్వాగతం
-
నాలుగేళ్లలో బీసీలకు బాబు ఏం చేశారు: మేకా
-
పేదల కడుపు కొట్టడం అన్యాయం : మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు
పాలకొల్లు అర్బన్ : చౌక డిపోల వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపుకొడుతోందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చౌకడిపోల ద్వారా 9 రకాల నిత్యావసర సరుకులను అందించారని గుర్తు చేశారు. మొన్నటివరకు బియ్యం, కిరోసిన్, పంచదార మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ నెల నుంచి కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. త్వరలో బియ్యం కూడా ఎత్తివేసి చౌకడిపోలను మూసేసే ప్రయత్నంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చౌక డిపోలను మూసేసే ప్రయత్నం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
'ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరు'
భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ధనవంతుల కోసమే పనిచేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ, చంద్రబాబు పేర్లు వేరు కానీ బుద్ధి మాత్రం ఒక్కటేనని పేర్కొన్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు మేకా శేషుబాబు మాట్లాడుతూ... చంద్రబాబు సర్కారు కార్పొరేట్ సంస్థలను పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. -
'ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి సిద్ధం'
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టీడీపీ - బీజేపీ రెండు నాల్కల ధోరణితో రాష్ట్రం అధోగతిపాలైందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై సెప్టెంబర్ 22వ తేదీన ఏలూరులో జరిగే వైఎస్ జగన్ యువభేరి సదస్సు విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
పాలకొల్లు సెంట్రల్ : ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చనందున ఆయనపై సెక్షన్-420 కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్లో సీఐ రజనీ కుమార్‌కు ఫిర్యాదు పత్రాలు అందజేశారు. హామీలను నెరవేర్చకుండా చంద్రబాబునాయుడు రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. -
'అవినీతి పరిపాలనకు చిరునామా చంద్రబాబు'
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రచార ఆర్భాటాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో మేకా శేషుబాబు విలేకరులతో మాట్లాడారు. అవినీతి పరిపాలనకు చంద్రబాబు చిరునామా అని ఆయన ధ్వజమెత్తారు. మోసపూరిత వాగ్దానాలు ఇస్తూ నిత్యం చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు స్వార్థ రాజకీయాలే కారణమని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు విమర్శించారు. -
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సాధ్యమే
ఆకివీడు/తాడేపల్లిగూడెం : తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నియోజకవర్గాల పెంపుపై చర్చలు జరుగుతున్నట్టు ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. పెంపు ఎలా జరుగుతుంది, ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి వంటి విషయాలపై చర్చసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగైదు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించింది. దీంతో జనాభా ప్రాతిపదికన విభజన జరుగుతుందా? లేక భౌగోళిక పరిస్థితులను బట్టి చేస్తారా? అనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే జిల్లాకు ఐదు కొత్త నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు మండలాలు కుకునూరు, వేలేరుపాడు జిల్లాలో కలిశాయి. దీంతో మొత్తం మండలాల సంఖ్య 48కి చేరింది. ఈ నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం రెండుగా చీలే అవకాశం ఉందనే వాదన వినబడుతోంది. గత విభజన లోపభూయిష్టం గతంలో 2009కి ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా జరిగిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. భౌగోళిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా చేశారనే ఆరోపణలు వచ్చాయి. భౌగోళికంగా పెద్ద మండలాలను, దూరంగా ఉన్న మండలాలను కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేశారనే వాదనలు వినిపించాయి. ఉండి, భీమవరం నియోజకవర్గాల కూర్పు ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఉండి నియోజకవర్గంలో భాగమైన పాలకోడేరు మండలం భౌగోళికంగా ఓ మూలన దూరంగా ఉంటుంది. అలాగే భీమవరం నియోజకవర్గంలో చేర్చిన వీరవాసరం మండలం, భీమవరం పట్టణానికి మధ్య మరో మండలం ఉంది. దానిని వేరే నియోజకవర్గంలో చేర్చడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలోనే మిగిలిన నియోజకవర్గాలూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ప్రజలు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత పునర్విభజన సమయంలో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా, ఆ సంఖ్యను 15కి కుందించారు. అప్పట్లో అత్తిలి, పెనుగొండ నియోజకవర్గాలు అంతర్ధానమయ్యాయి. ఈ నియోజకవర్గాల్లోని మండలాలను తణుకు, ఉంగుటూరు, ఆచంట నియోజకవర్గాల్లో కలిపారు. దీంతో సామాజిక బలాబలాల్లోనూ తేడాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా.. శాస్త్రీయంగా పునర్విభజన చేపట్టాలని రాజకీయవర్గాలతోపాటు ప్రజలు కోరుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. నియోజకవర్గాలు చిక్కే అవకాశం ! పునర్విభజన జరిగితే పాత నియోజకవర్గాలు చిక్కిపోతాయనే భావన వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం పరిధి తగ్గిపోతుందని, ఆ మండలంలోని డెల్టా ప్రాంత గ్రామాలు, పెంటపాడు మండలంలోని 13 గ్రామాలు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో కలిసి నియోజకవర్గంగా ఏర్పడవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలను విడదీసి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాలతోపాటు, తాడేపల్లిగూడెం మండలంలోని అడ్డరోడ్డుగా పేరున్న గ్రామాలను కలిపి ద్వారకాతిరుమల నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. గాలిపటం తోకల్లా నియోజకవర్గాల విభజన గాలి పటం తోకల్లా ఉండకూడదు. ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విభజన ప్రక్రియ చేయవద్దు. నియోజకవర్గానికి దగ్గరలోని గ్రామాలన్నింటినీ కలుపుకోవాలి. భౌగోళిక పరిస్థితులు ముఖ్యం. -మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి సాధ్యమే నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయవచ్చు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం 20 ఏళ్లకొకసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే రాష్ర్ట విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నియోజకవర్గాలను పెంచాలని కోరాయి. దీనికి కేంద్రం స్పందించి వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. పార్లమెంటు ఆమోదంతో ఎన్నికల కమిషన్ దానిని అమలు జరుపుతుంది. -యర్రా నారాయణస్వామి, రాజ్యసభ మాజీ సభ్యులు -
'గోదావరి డెల్టా ఎండిపోవడానికి చంద్రబాబే కారణం'
ఏలూరు : గోదావరి డెల్టా ఎండిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గ్రామాల్లోని పొలాలను వారిద్దరు పరిశీలించారు. అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు, మేకా శేషుబాబు మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలు ఎండిపోతాయన్న తాము ఆనాడు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం కారణంగానే గోదావరి జిల్లాల్లో సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రేపు పాలకొల్లులో రైతు గర్జన నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. -
సుజనాలాంటి నేతల జేబు నిండుతుంది
హైదరాబాద్ : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు స్పష్టం చేశారు. అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే కేంద్రమంత్రి సుజనాచౌదరిలాంటి నేతల జేబు నిండుతుందన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా ఏర్పాటు చేసిన రిలే దీక్షలో శేషుబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య గల తేడాను ఆయన వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద బుధవారం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రిలే నిరాహారదీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
లేఖ ఇచ్చి ఎందుకు సహకరించారు?
పాలకొల్లు: ప్రజలను మభ్య పెట్టేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకా శేషుబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడితే ప్రజలు హర్షించేవారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం శేషుబాబు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరి వల్ల విడిపోయిందో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాజకీయాల్లో తాను సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి ఎందుకు సహకరించారని ప్రశ్నించారు. -
'మూడు అబద్ధాలు, ఆరు మోసాలు'
-
'మూడు అబద్ధాలు, ఆరు మోసాలు'
ఏలూరు: చంద్రబాబు ఏడాది పాలన మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా సాగిందని వైఎస్సార్ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, పార్థసారధి విమర్శించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే విధానంగా చంద్రబాబు పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు ఏడాది పాలనకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. 5 ప్రధాన అంశాలపై వైఎస్ జగన్ సమరదీక్ష చేయనున్నారని వెల్లడించారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, బలవంతపు భూసేకరణకు నిరసనగా జగన్ దీక్ష చేస్తారని చెప్పారు. వైఎస్ జగన్ దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందేమో చూడాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, మేకా శేషుబాబు అన్నారు. విభజన వల్లే హామీలు నెరవేర్చలేకపోతున్నామని చంద్రబాబు చెప్పడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు. -
ప్రజల పక్షాన పోరాడుతున్నాం: ఆళ్ల నాని
పాలకొల్లు: అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని అన్నారు. ఎమ్మెల్సీ మేకాశేషుబాబు నివాసంలో బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారాన్నైనా వదులుకుంటా గానీ అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయనని ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆళ్ల నాని గుర్తు చేశారు. గ్రామస్థాయిలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేసి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. -
నామినేషన్ ఉపసంహరించుకున్న నాగబాబు
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుణ్ణం నాగబాబు వెనక్కు తగ్గారు. తన నామినేషన్ పసంహరించుకున్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకా శేషుబాబుకు మద్దతిస్తానని నాగబాబు ప్రకటించారు. నాగబాబు నిర్ణయం పట్ల వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి(బాబ్జీ) పట్టువీడలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్లో మాట్లాడినా ఆయన వెనక్కు తగ్గలేదు. పాలకొల్లు టీడీపీ టిక్కెట్ నిమ్మల రామానాయుడికి ఇవ్వడంతో బాబ్జీ రెబల్‌గా నామినేషన్ వేశారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకే నామినేషన్ వేసినట్టు బాబ్జీ తెలిపారు. -
కృష్ణంరాజు అవకాశవాది: వైఎస్సార్ సీపీ
-
కృష్ణంరాజు అవకాశవాది: వైఎస్సార్ సీపీ
హైదరాబాద్: స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు. రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నియోజవర్గంలో అసెంబ్లీ సమన్వయకర్తల ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వైఎస్సార్ సీపీ తెలిపింది. -
కావూరి వస్తున్నారని.. వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్నారంటే చాలు.. ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. సమైక్యాంధ్ర వాదులను ఆయన నానా మాటలు అంటున్నా సరే.. ముందస్తుగా వారి నుంచి ఆయనకు 'రక్షణ' కల్పిస్తోంది. ఆ మేరకు ముందుగానే పోలీసులకు ఆదేశాలు జారీచేసినట్లుంది. ఈ విషయం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మరోసారి రుజువైంది. పాలకొల్లులో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ మేకా శేషుబాబును, మరో 20 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి సంఘటన తర్వాత కావూరి ఎక్కడ పర్యటిస్తున్నా, ముందుగానే సమైక్యవాదులను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. -
`మద్యపాన నిషేధాన్ని తుంగలోకి తొక్కింది చంద్రబాబే`
పాలకొల్లు: మద్యపాన నిషేధాన్ని తుంగలోకి తొక్కి.. సంపూర్ణంగా అమలుచేసిందే చంద్రబాబు నాయడుని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకాశేషుబాబు వ్యాఖ్యానించారు. ఈ రోజు బెల్ట్ షాపులు నిషేధం కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అలా మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఘాటుగా విమర్శించారు. కాగా, గతంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తే.. చంద్రబాబు హయాంలో నిషేధం ఎత్తేసిన సంగతి తెలిసిందే. అంతేకాక, టీడీపీ అధికారంలోకొస్తే సరసమైన ధరలకే చంద్రబాబు మద్యాన్ని అందిస్తానన్నారు. ఇప్పుడు ఆయనే తనకు అధికారమిస్తే.. ‘బెల్టు’ షాపులను నిషేధిస్తానంటున్నారు. -
రాజకీయ లబ్ధి కోసం విభజన తగదు
పాలకొల్లు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజనకు పూనుకోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు ఆదివారం 95వ రోజుకు చేరాయి. దీక్షాపరులకు శేషుబాబు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దీపావళి పర్వాదినాన్న కూడా దీక్షలు నిర్వహించడం చూస్తుంటే సమైక్యాంధ్రపై సీమాంధ్రుల ఆకాంక్ష తెలుస్తుందన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టి ఉద్యమ తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియ ఆపకపోతే ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విభజనకు కారకులైనవారి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, యడ్ల తాతాజీ, ఎం.మైఖేల్‌రాజు, చీకట్ల వరహాలు, కె. రామచంద్రరావు, సీహెచ్ సత్తిబాబు, జె.లక్ష్మీనారాయణ, జి.రాంబాబు, మద్దా చంద్రకళ, బి.గంగాధరరావు, ఆర్.మీరయ్య, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
సమైక్య వాణిని వినిపించింది జగన్ ఒక్కరే: మేకా శేషుబాబు
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్లమెంట్లో ప్లకార్డు ప్రదర్శించి తన వాణిని వినిపించిన వ్యక్తి ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గుర్తుచేశారు. పాలకొల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం దీక్షలో పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. వీరికి సంఘీభావం తెలిపిన అనంతరం ఎమ్మెల్సీ శేషుబాబు మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సమైక్యాంధ్రకే కట్టుబడ్డారన్నారు. పస్తుతం రాష్ట్రం రావణ కాష్టంగా మారడానికి సమర్థవంతమైన నాయకుడు, ప్రతిపక్షం లేకపోవడమేనన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తామంటారని, షిండే తీర్మానం అక్కర్లేదని చెబుతారని, ఇలా అర్థంపర్థంలేని ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఎడారిగా మారిపోయి కరువుకాటకాలు తాండవిస్తాయని శేషుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి తనకున్న అధికారాన్ని ఉపయోగించి అసెంబ్లీని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ 2014 ఎన్నికల్లో రాహుల్‌ని ప్రధానిగా చూడాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర విభజనకు సిద్ధపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, పార్టీ పట్టణ కన్వీనర్ సంగినీడి సూరిబాబు, యడ్ల తాతాజీ, మండల కన్వీనర్ మైలాబత్తుల మైఖేల్‌రాజు, నడింపల్లి అన్నపూర్ణ, మద్దా చంద్రకళ, కమలా పీటర్సన్, మిడతాని సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.