భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ధనవంతుల కోసమే పనిచేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ, చంద్రబాబు పేర్లు వేరు కానీ బుద్ధి మాత్రం ఒక్కటేనని పేర్కొన్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ నాయకుడు మేకా శేషుబాబు మాట్లాడుతూ... చంద్రబాబు సర్కారు కార్పొరేట్ సంస్థలను పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
'ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరు'
Published Thu, Oct 13 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement