Mega Aqua Food Park
-
‘‘పవనాలు’’ తుందుర్రు మీదుగా వీస్తాయా..?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ తుందుర్రు గ్రామం వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికీ పలుమార్లు హామీలు ఇచ్చినా ఇంతవరకూ ఆ గ్రామం వైపు పవన్ కల్యాణ్ తొంగి చూడలేదు. గతంలో పదిరోజుల పాటు భీమవరంలోనే మకాం వేసినా తుందుర్రు గ్రామానికి రాలేదు. వస్తానని చెప్పినా తర్వాత మొహం చాటేశారు. తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తుందుర్రు, జొన్నలగరువు, కంసాలబేతపూడి గ్రామస్థులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసు నిర్బంధం సందర్భంగా బాధితులు హైదరాబాద్ వెళ్లి కలిశారు. వారి బాధలు విన్న పవన్ కల్యాణ్ మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తర్వాత కూడా పలుసభల్లో బాధితులను పిలిపించుకుని మాట్లాడటం తప్ప ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదు. కనీసం బాధితుల పరామర్శకు కూడా రాలేదు. భీమవరం మండలం తుందుర్రులో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్కు నిర్మాణం పట్ల స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్య కోరల్లో చిక్కుతామని, తమ పొలాలకు, సంప్రదాయ వేట లాంటి ఉపాధి అవకాశాలకు నష్టం కలుగుతుందని పలు గ్రామా ల వారు గత నాలుగేళ్లుగా ఉద్యమాలు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభం నాటి నుంచి తుందుర్రు పరిసర ప్రాంతాల్లో పార్కు నిర్మాణం కుదరదంటూ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఈ ప్రాంతంలో వద్దని సుమారు 21 గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. నాలుగు వేల టన్నుల చేపలు, రొయ్యలు, పీతలు శుద్ధిచేసే సామర్జ్యంతో ఇది పని చేస్తుంది. దీనికోసం నిత్యం ఫ్యాక్టరీలో అమోనియం నిల్వలను భారీగా ఉంచాల్సి వస్తుంది. రసాయనాలతో కూడిన వ్యర్ధాలను గొంతేరు కాల్వలోకి వదులుతారు. దీనివల్ల నరసాపురం, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టుకు కాలుష్యం ముంపు ఉంటుందని ఆయా మండలాల వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నరసాపురం, భీమవరం, మొగల్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఉప్పుటేరును ఆధారం చేసుకుని అనేక మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. మత్స్య సంపద మనుగడకు ప్రమాదం ఉందని ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూడు గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టారు. ఆందోళనకారులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఫ్యాక్టరీలో పనులు చేస్తున్న వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారనే అభియోగంపై ఏడుగురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఫ్యాక్టరీ వద్ద జరిగిన గొడవలో, పోలీసులను కొట్టారనే అభియోగంపై 37 మందిపై 307 సెక్షన్ కింద కేసులు కట్టారు, ఇందులో ఇతరులు అని ఎఫ్ఐఆర్లో చేర్చారు. హత్యాయత్నం కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. రెండు నెలలపాటు జైలులో పెట్టారు. ఇప్పటికీ పలువురిపై కేసులు ఉన్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలోనైనా పవన్ కల్యాణ్ తమ గ్రామానికి వస్తారా అని బాధితులు ఎదురుచూస్తున్నారు. -
తుందురులో ఉద్రిక్తత
-
మత్స్యపురిలో ఉద్రిక్తత.. సెల్ టవర్ ఎక్కిన మహిళ
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని పలు మండలాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు పనులకు వ్యతిరేకంగా మరోమారు ప్రజలు ఆందోళనలు చేపట్టారు. గురువారం వీరవాసరం మండలం మత్స్యపురిలో ఆక్వాఫుడ్ పార్క్ పనులను వ్యతిరేకిస్తూ అరేటి సత్యవతి అనే మహిళ సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. సత్యవతి గతంలో తుందుర్రు ఆక్వాపార్కు వ్యతిరేక పోరాట కమిటీ తరపున ఉద్యమం చేసి ఐదు నెలల పాటు జైలుకు వెళ్లారు. కొప్పర్రులో సెల్ టవర్ ఎక్కిన మరో ఇద్దరు రైతులు భీమవరం : తుందుర్రు గ్రామంలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్వాఫుడ్ పార్కు కోసం వేస్తున్న పైప్ లైన్ పనులు నిలిపివేయాలంటూ ఇద్దరు రైతులు కొప్పర్రులో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. తుందుర్రు గ్రామస్థుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆక్వాఫుడ్ పార్క్ కోసం పైపులైన్ల నిర్మాణానికి అధికారులు యత్నించారు. పైపులైన్ల నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకుంటారనే నెపంతో గ్రామంలో భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. ఇళ్లలో నుంచి గ్రామస్తులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. -
పశ్చిమగోదావరిలో ఉద్రిక్తత..
-
పశ్చిమగోదావరిలో ఉద్రిక్తత..
సాక్షి, నరసాపురం : తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్‌పార్కును తరలించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు, ఉద్యమ నాయకులు చేస్తున్న దీక్ష సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.బేతపూడిలో ఉద్రిక్తత నెలకొంది. మెగా ఆక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ బాధితులు నాలుగు రోజులుగా ఆమరణ దీక్షలు కొనసాగిస్తుండగా బుధవారం తెల్లవారు జామున పోలీసులు దీక్షలను భగ్నం చేశారు. అయితే దీక్షలో కూర్చున్న జొన్నలగరువు గ్రామానికి చెందిన ఆనందకుమార్ కనిపించడంలేదు. దీక్ష భగ్నం చేసే సమయంలో అందరితోపాటు అతనిని పోలీసులు అరెస్టు చేశారని గ్రామస్తులంటున్నారు. తమ వద్ద అతను కనిపించకపోవడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది. అతని కోసం గాలింపు ప్రారంభించగా గ్రామంలోనూ కనిపించలేదు. ఆనంద కుమార్ ఆచూకీ లేకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత దీక్షలోని వారిని ఆస్పత్రికి తరలించకుండా పాలకొల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీక్షలోని వారితోపాటు మరికొందరు ఆందోళనకారులు మొత్తం 40మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలపై ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దీక్ష చేసిన ఎనిమిదిమందిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు వైద్యానికి నిరాకరిస్తున్నారు. కాగా, దీక్షను భగ్నం చేసే సమయంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరూ వీడియో, ఫొటోలు తీయకుండా అడ్డుకుని కొందరి వద్ద సెల్ఫోన్లు లాక్కున్నారు. -
మెగా ఆక్వాఫుడ్ 'కేంద్ర' పరిధిలోనిది కాదు
-
తుందుర్రులో టెన్షన్
తుందుర్రు: స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ పనులు కొనసాగిస్తోంది. సర్కారు సహకారంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ యంత్ర సామాగ్రి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణ ప్రదేశానికి తరలించారు. ఇవాళ కూడా కంటైనర్ల ద్వారా మరికొంత సామాగ్రి తరలించే అవకాశముందని తెలుస్తోంది. ఆక్వాఫుడ్ పార్క్‌ను నిలిపి వేయాలని గత నెలలో సీఎం చంద్రబాబును కలిసి బాధితులు కోరినా ఆయన పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాలతో ముందుస్తుగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమపై దాడి చేశారంటూ 14 మంది ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలచెరువులో 144 సెక్షన్ విధించి ఆంక్షలు పెట్టారు. బాధిత గ్రామాల్లోకి ఇతరులు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. పోలీసు బలగాలతో ఆక్వాఫుడ్ పార్క్‌ను ఎన్నిరోజులు నడుపుతారని ప్రశ్నించారు. దీన్ని తీర ప్రాంతాలకు తరలించాలన్న విజ్ఞప్తిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. -
ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళన
-
జన చైతన్య యాత్రకు వస్తే ఖబడ్డార్...
పశ్చిమగోదావరి : టీడీపీ జనచైతన్య యాత్రను అడ్డుకుంటామని తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు హెచ్చరించారు. శుక్రవారం గ్రామంలో జన చైతన్య యాత్రను నిర్వహించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తమ గ్రామానికి ఎమ్మెల్యే, టీడీపీ నేతలు రావొద్దని గ్రామ పెద్దలు తేల్చిచెప్పారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గ్రామంలోకి వస్తే అడ్డుకుంటామన్నారు. దీంతో తుందుర్రులో భారీగా పోలీసులు మోహరించారు. జన చైతన్య యాత్రను అడ్డుకుంటే పోలీసులు కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆక్వాపార్క్ తరలించేంత వరకు పోరాటమే
బాధితులకు అండదండలు అందిస్తామని జగన్ హామీ మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ని తరలించేంత వరకు పోరాటం ఆగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు. పోరాట కమిటీ నేతలు ఆరేటి సత్యవతి, ఆరేటి వాసు, ఎంపీటీసీ సత్యనారాయణల నేతృత్వంలో జైలు నుంచి బయటకి వచ్చిన అన్ని గ్రామాల పోరాట కమిటీ నేతలు, బాధితుల వెంట వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని, పార్టీ కో ఆర్డినేటర్లు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు కూడా ఉన్నారు. ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలిపినందుకు జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 45 రోజులు పాటు బెరుుల్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వం జగన్ పరామర్శించి వెళ్లిన వెంటనే బెరుుల్ ఇచ్చి విడుదల చేసిందని చెప్పారు.ఇప్పటికీ ఆక్వాఫుడ్ ప్యాక్టరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ ఫ్యాక్టరీ అక్కడ నుంచి తరలించేంతవరకు తమ పోరాటానికి అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఆక్వాపుడ్ పార్క్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి చివరివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే మరోసారి తుందుర్రుకు వస్తానని చెప్పారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. మతపరమైన హక్కుల పోరాటానికి మద్దతు నివ్వండి : భారత రాజ్యాంగంలోని 25, 26 అధికరణల కింద ముస్లింలకు లభించిన మతపరమైన హక్కుల పరిరక్షణకు తాము చేస్తున్న పోరాటానికి మద్దతు నివ్వాలని పలువురు ముస్లిం మైనారిటీల నేతలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్బాష నేతృత్వంలో ప్రతినిధి వర్గం బుధవారం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుంది. అనంతరం అంజాద్బాష మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ లాగే జగన్ కూడా ముస్లింలకు అండగా నిలవాలని తాము కోరినట్లు వివరించారు. తాము చెప్పింది సాంతం విన్న జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులు
హైదరాబాద్: తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు బుధవారం వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సత్యవతి నేతృత్వంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు.. తమ పోరాటానికి మద్దతు పలికినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా.. బాధితులకు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లి.. బలవంతంగా ఫుడ్‌పార్క్ నిర్మాణం చేపట్టవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా
-
తుందుర్రు చుట్టుపక్కల 144 సెక్షన్ ఎత్తేయాలి..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారులపై కూడా వెంటనే కేసులు ఎత్తివేయాలని ఆయన అన్నారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణగొదక్కాలని అనుకోవడం అవివేకమని ఆళ్ల నాని శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. తుందుర్రు గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మెగా ఆక్వా ఫుడ్ పార్కును తీర ప్రాంతానికి తరలించారని ఆళ్ల నాని సూచించారు. -
ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా
నరసాపురం(పశ్చిమ గోదావరి): తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఎం ధర్నా నిర్వహించింది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేత ముదునురి ప్రసాదరాజు పాల్గొన్నారు. -
తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్
-
తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఉద్యమకారులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఏడుగురికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్మాణంలో ఉన్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు 50 మీటర్ల దూరంలో ఉండాలని న్యాయస్థానం షరతు విధించింది. బెయిల్ రావడంతో తణుకు సబ్‌జైలులో ఉన్న ఆరేటి సత్యవతి శుక్రవారం సాయంత్రం విడుదల కానుండగా, కోర్టు ఉత్తర్వులు అందగానే మిగిలిన ఆరుగురు నరసాపురం సబ్ జైలు నుంచి విడుదల అవుతారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తణుకు సబ్ జైలులో సత్యవతిని పరామర్శించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉద్యమకారులకు వైఎస్ఆర్ సీపీ అండతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేతపై ఇవాళ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆరేటి సత్యవతి సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
తుందుర్రు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
కన్నతల్లిని చంపి పెంపుడు తల్లిని తెస్తారా?
-
కన్నతల్లిని చంపి పెంపుడు తల్లిని తెస్తారా?
► వరి పండకపోతే సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారా ► చంద్రబాబుపై మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితుల ఆగ్రహం ► బాధితులకు అండగా ఉంటామన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ► యుద్ధవాతావరణం సృష్టించి ఫ్యాక్టరీ కడుతున్నారని మండిపాటు ► వ్యతిరేకిస్తే హత్యాయత్నం కేసులు, రోజుల తరబడి జైల్లో పెట్టడమా ► ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు తరలిస్తే అంతా మద్దతిస్తామని వెల్లడి ► పైపులైను డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు హితవు ► ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లద్దు.. బలవంతంగా ఫ్యాక్టరీ వద్దు బేతపూడి కన్నతల్లిని చంపేసి పెంపుడు తల్లిని తీసుకొస్తామంటే ఎవరు ఊరుకుంటారని తుందుర్రు, బేతపూడి తదితర గ్రామాల ప్రజలు మండిపడ్డారు. ఈ గ్రామాలకు సమీపంలో నిర్మిస్తున్న మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఆక్రోశం వెలిబుచ్చారు. ఆక్వా ఫ్యాక్టరీ వల్ల పొలాలు నాశనం అవుతాయని అప్పుడు వరి పండకపోతే సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారా అని ప్రశ్నించారు. బాధితులకు తాము పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించేందుకు కోర్టుల్లో న్యాయపోరాటాలు కూడా చేస్తామన్నారు. మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించి, అనంతరం బేతపూడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మూడు పంచాయతీల నుంచి వంద మీటర్ల దూరం కూడా లేకముందే ఫ్యాక్టరీ కడుతున్నారు నేను అడిగేది ఒక్కటే.. ఫ్యాక్టరీ ఇక్కడే కడుతున్నందువల్ల మనకు జరిగే నష్టం ఏంటి, అది ఎందుకు జరుగుతోందని మీరే చెప్పండి ఈ సమావేశం నుంచి మనం చంద్రబాబు నాయుడికి మెసేజ్ ఇద్దాం ప్రాజెక్టు మొదలుపెట్టడానికి ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ప్రాజెక్టును వ్యతిరేకించినవాళ్ల మీద హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేసినప్పుడు ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆరంజ్ కేటగిరీలో ఉందని, ఇది కాలుష్య కారకమని చెబుతున్నారు మరోవైపు చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టు జీరో పొల్యూషన్ అని, దీని నుంచి కాలుష్యం రాదని అంటారు మరోవైపు సముద్రం వరకు పైపులైను కూడా వేస్తామని చెబుతారు కాలుష్యమే లేకపోతే మరి పైపులైను ఎందుకు వేస్తున్నారు? కాలుష్యం ఉందని మీకు తెలుసు కాబట్టే పైపులైను పేరుతో మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు ఎన్నో సందర్భాల్లో మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నింటినీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తామన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలన్నావు డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నావు ఇంటింటికీ జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని మభ్యపెట్టావు ఇప్పుడు పైపులైను వేస్తామని చెబుతున్నావు ఒక ప్రైవేటు సంస్థకు 20-25 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో పైపులైను ఎందుకు వేస్తున్నావు? అంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు వల్ల ఏ స్థాయిలో ముడుపులు అందుకుంటున్నారో తెలుస్తుంది ప్రజలను మోసం చేయడానికి పైపులైను పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారు చంద్రబాబు గారూ.. పైపులైను డ్రామాలు ఆపండి పది కిలోమీటర్ల దూరానికి మారిస్తే.. అక్కడ మనుషులు ఉండరు, సముద్రతీరం ఉంది. అక్కడ ప్రభుత్వ భూములే 350 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొంత ఈ ఫ్యాక్టరీకి కేటాయిస్తే సముద్రతీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు పైగా దానివల్ల ఇన్ని కిలోమీటర్లు పైపులైను వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు కాస్త కూస్తో వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే.. విపరీతమైన దుర్గంధం వస్తుంది. కాలువలు కలుషితం అయిపోవడం వల్ల చేను ఏదీ బతకదు, పొలాల మీద ఆధారపడిన కూలీలు కూడా బతికే పరిస్థితి ఉండదు ఇదే ఫ్యాక్టరీని ఇక్కడినుంచి కేవలం 10 కిలోమీటర్లు తరలిస్తే, అందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం నిజంగా ఫ్యాక్టరీ వస్తే కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి పర్వాలేదు గానీ, ఇక్కడైతే వీళ్ల పొట్ట మీద కొట్టినట్లు అవుతుంది ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే 50 ఏళ్ల వరకు దూరదృష్టితో చూడాలి ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఏ ఇబ్బంది ఉండకూడదని చూడాలి వీళ్ల లెక్కల ప్రకారం 15-20 కోట్ల పెట్టుబడులు పెట్టామంటున్నారు ఈ షెడ్లను ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకోవచ్చు మహా అయితే పునాది పనులకు పెట్టిన ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు ఫ్యాక్టరీ స్థలం మొత్తం పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్ధ వాతావరణం సృష్టించారు. ఊళ్లో 144 సెక్షన్ పెట్టారు యాజమాన్యాన్ని కోరుతున్నా.. ప్రజల అభీష్టం మేరకు దీన్ని ఇక్కడినుంచి తరలించండి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు, ఫ్యాక్టరీ పెడతామని భూములు కొనలేదు, వీటన్నింటి నేపథ్యంలో పెద్ద మనసుతో ఆలోచించి ఇక్కడి నుంచి తరలించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం నీకు నిజంగా ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలు ఒప్పుకోకపోయినా బలవంతంగా భూములు లాక్కుంటున్నావు మచిలీపట్నంలో 30 వేల ఎకరాలు బలవంతంగా లాక్కుంటున్నావు క్యాపిటల్ సిటీ అని పొలాలకు నిప్పు పెట్టించి మరీ లాక్కున్నావు భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం అని బలవంతంగా భూములు లాక్కుంటున్నావు ఈ కార్యక్రమాలను ఎవరైనా ఎదిరిస్తే.. మేం అభివృద్ధి నిరోధకులం అని ముద్ర వేస్తున్నావు ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని, వారి ఆమోదం తీసుకుని పనిచేయాలి అంతేతప్ప ఇలా నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు తగవు హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టులు, గ్రామాల్లో 144 సెక్షన్లు మానుకో రాష్ట్రం కోసం కొద్దో గొప్పో పనిచేయడం నేర్చుకో అని చెబుతున్నా కోర్టులకు వెళ్లి ఈ ఫ్యాక్టరీ మీద కేసులు వేసి ఇక్కడి బాధితులకు అండగా ఉంటాం చంద్రబాబు పాలన ఇక కేవలం రెండేళ్లు మాత్రమేనని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని కచ్చితంగా చెబుతున్నా అప్పుడు ప్రజల అభీష్టం మేరకు ఏం కావాలో అది మాత్రమే చేస్తాం అలా కాదని చేస్తే చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిసే రోజొస్తుంది, ఈ ఫ్యాక్టరీ కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది సీపీఎం మధు ఇక్కడకు వస్తే ఆయనను బలవంతంగా జైల్లో పెట్టారు ఆయన కోసం గ్రంధి శ్రీనివాస్ ధర్నా చేస్తే.. అప్పుడు వదిలిపెట్టారు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి, పోలీసులను ఉపయోగించి అణిచేస్తారు ఇలాగే అయితే ఈ ప్రభుత్వం ఎల్లకాలం సాగదని చెబుతున్నా ఆళ్ల నాని, గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు అందరూ మీతోపాటు ఉండి అండగా, తోడుగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్వా ఫ్యాక్టరీ బాధితులకు అండదండలు అందిస్తుంది. బాధితులు ఏమన్నారంటే.... పంటలు పండవు, కొబ్బరి చెట్లు ఉండవు కంపెనీ దాటితే మా ఊరు వస్తుంది. ఫ్యాక్టరీ ఇక్కడకు రావడం మాకు ఇష్టం లేదు. ఆ నీళ్లు మొత్తం కలుషితం అయిపోతాయి. గొంతేరు కాల్వ ఒక్కటే మాకు ఆధారం. ఫ్యాక్టరీ వస్తే దాంట్లో నీళ్లు బాగోవు. పంటలు పండవు, కొబ్బరిచెట్లు ఉండవు, చేపల చెరువులు కాయవు, చివరకు దుస్తులు ఉతుక్కోడానికి కూడా అవకాశం ఉండదు. తూములు పెడతామంటున్నారు.. అవి కూడా వద్దు. అసలు ఫ్యాక్టరీ కావాలా వద్దా అనే విషయం గురించి ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్న పాపాన పోలేదు. -ఐరావతి.. శేరాయిపాలెం అమ్మోనియం గ్యాస్ వస్తే ఊరు వదిలిపోవాలా? ఫ్యాక్టరీ కోసం భూమి కొంటున్నట్లు వాళ్లు చెప్పలేదు.. చేపల చెరువుల కోసం అని కొన్నారు. నేను ఎకరంన్నర కొన్నాను. పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లినవాళ్లు రైతులు కారు, సెంటు భూమి కూడా లేదని టీడీపీ నేతలు అన్నారు. నేను వెళ్లాను.. నా భూమి అమ్మాను. మోసపూరితంగా పొలాలు కొనుగోలు చేశారు. తర్వాత కూడా సంతకాలు ఫోర్జరీ చేసి ఫ్యాక్టరీ కోసం అని భూమి వినియోగాన్ని మార్చుకున్నారు. 20 గ్రామాల వాళ్లు కలిసి తీర్మానం చేసి కలెక్టర్‌కు ఇద్దామని వెళ్లినా.. మా దగ్గర కాగితాలు కూడా తీసుకోలేదు. ఐదు మండలాల పరిధిలో పంటనష్టం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అని కలెక్టర్ చెప్పారు. అంతేతప్ప బడాబాబుల కోసం పనిచేస్తున్నామని చెప్పలేదు. సముద్రం వరకు పైపులైను వేస్తే వ్యర్థాలు బయటకు వెళ్లచ్చు గానీ, గాల్లో వదిలే అమ్మోనియం గ్యాస్ మాత్రం మా గ్రామాల మీదుగా వెళ్తుంది. మేమంతా ఊళ్లు వదిలి వెళ్లిపోవాలా? ఇప్పుడు రోడ్లు వేయడానికే స్థలాలు లేవంటున్నారు.. మరి పైపులైను వేయడానికి స్థలాలు ఎక్కడినుంచి వస్తాయి? దీని వల్ల వరి పండకపోతే సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారా? కన్నతల్లిని చంపేసి పెంపుడు తల్లిని తీసుకొస్తామంటే ఎవరు మాత్రం ఒప్పుకొంటారు? -సముద్రాల వీరవెంకట సత్యవాణి, బేతపూడి చంద్రబాబు వైఖరికి నిరసన తెలుపుతున్నాం నాతో సహా అంతా చంద్రబాబు వైఖరికి నిరసన తెలుపుతున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. ప్రజలు ఇస్తేనే అధికారం వస్తుంది.. అందుకే నేను ప్రజల వెంటే ఉంటాను. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అని, మీ వల్ల ఏమీ అవ్వదని అన్నిరకాలుగా మాపై ఒత్తిడి తెచ్చారు. రెండున్నరేళ్లుగా అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. చివరకు సీపీఎం మధును ఆశ్రయిస్తే.. వాళ్లు మాకు అండగా నిలిచారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆళ్ల నాని తదితరులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించారు. బైండోవర్ చేశారు, హత్యాయత్నం కేసులు పెట్టారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. -సత్యనారాయణ, తుందుర్రు టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు మా భర్తను జైల్లో పెట్టారు మా భర్త మహేష్ ఫ్యాక్టరీ వద్దని ఆందోళనచేసినందుకు 40 రోజుల నాడు జైలుకు తీసుకెళ్లిపోయారు. బెయిల్ కూడా ఇవ్వకుండా హత్యాయత్నం కేసు పెట్టారు. ఇద్దరు పిల్లలతో నేను, మా అత్తగారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మమ్మల్ని కూడా జైల్లో పెడతామని బెదిరించారు. పిల్లలతో సహా తీసుకుపోతామన్నారు. మా ఊళ్లో కాకుండా ఇంకెక్కడికైనా ఈ ఫ్యాక్టరీ తరలించుకొమ్మనండి -కీర్తన వాళ్ల దగ్గరకే వెళ్లాలట ఆరేటి సత్యవతి, మేము అంతా కలిసి గ్రంధి శ్రీనివాస్ దగ్గరకు వెళ్లామని ఆమెను అరెస్టుచేసి హత్యాయత్నం కేసు పెట్టి జైల్లో పెట్టారు. మాకు ఏమైనా ఇబ్బందులు వస్తే టీడీపీవాళ్ల వద్దకే వెళ్లాలి తప్ప మరొకరి వద్దకు వెళ్తే ఇలా జైళ్లలో పెడుతున్నారు. సత్యవతి భర్తకు కేన్సర్. కొడుకును ఒక జైల్లో ఆమెను ఇంకోజైల్లో పెట్టారు. -లక్ష్మి -
సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్
తణుకు: ప్రజాభిప్రాయం సేకరించకుండా గ్రామాల మధ్య ఫ్యాకర్టీ నిర్మించడం దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ పెట్టవద్దంటూ నిరసన తెలిపిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి అమాయకుల్ని వేధించటం సరికాదని ఆయన అన్నారు. ఆక్వా బాధితులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్జైల్లో ఉన్న సత్యవతిని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవతి చేసిన తప్పంటేని, కాలుష్యాన్ని అరికట్టాలని కోరిన వారిపై హత్యాయత్నం కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే ఏడుగురిపై హత్యాయత్నం కేసులు పెట్టారని, గ్రామాల్లో భయాందోళనలు సృష్టించి గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గ్రామస్తులు వద్దని చెప్పినా గ్రామం మధ్యలో ఫ్యాక్టరీ పెట్టడం మొదటి తప్పని, అమాయాకులపై హత్యాయత్నం కేసులు పెట్టడం ఇంకో తప్పని, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడం నాలుగో తప్పని అన్నారు. ఇంతమంది ఉసురు పోసుకుని ఫ్యాక్టరీ పెట్టడం అవసరమా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వస్తుందని జనం చెబుతున్నా పట్టించుకోరా అని సూటిగా అడిగారు. ఇప్పటికే డెల్టా పేపర్ మిల్లుతో ప్రజలు ఇబ్బందులు పాలువుతున్నారని, ఇప్పుడు మళ్లీ ఆక్వా ఫ్యాక్టరీ పెడితే అదే పరిస్థితి వస్తుందని స్థానికులు బాధపడుతున్నారన్నారు. ప్రజల బాధ ప్రభుత్వానికి పట్టదా అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనకు కావాల్సిన వారికి మేలు చేసేందుకు ఎంతకైనా తెగిస్తోందన్నారు. పది కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టుకోండని జనం చెబుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. చంద్రబాబు ఓ వైపు ఈ ఫ్యాకర్టీతో కాలుష్యం ఉండదంటున్నారని, మరోవైపు పైప్‌లైన్ నిర్మిస్తామని చెబుతున్నారని, పైప్‌లైన్ వేయటానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఒకవేళ పైప్‌లైన్ లీకేజీ అయితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే సముద్ర తీరప్రాంతానికి ఫ్యాక్టరీని తరలించి ప్రజలకు మేలు చేయాలని అన్నారు. సముద్ర తీరప్రాంతంలో మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి 350 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోందని, ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి అక్కడే ఫ్యాక్టరీ పెడితే తాము కూడా సహకరిస్తామన్నారు. దీనివల్ల అందరికీ మంచి జరుగుతుందని, ప్రజల ఉసురుతో ప్రాజెక్టులు నిర్మించలనుకోవటం సరికాదన్నారు. కాగా ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో సత్యవతి ఒకరు. ఆమె ప్రస్తుతం తణుకు సబ్జైల్లో ఉన్నారు. ఉద్యమాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టిందనే ఆరోపణతో సత్యవతిపై కేసు బనాయించి.. జైలుకు పంపారు. ఆమె కుమారుడితోపాటు మరో ఆరుగురు నర్సాపురం సబ్జైల్లో ఉన్నారు. 36 రోజులుగా సత్యవతి జైలు జీవితం గడుపుతున్నారు. పోలీసులు సత్యవతిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసారు. -
సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్
-
ఆరేటి సత్యవతికి వైఎస్ జగన్ పరామర్శ
ఏలూరు: మెగా ఆక్వాఫుడ్కు వ్యతిరేకంగా పోరాడి 36 రోజులుగా తణుకు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో బుధవారం వైఎస్ జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు గ్రామానికి వెళ్లనున్నారు. ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కలుసుకుని ముఖాముఖీ మాట్లాడనున్నారు. -
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్
-
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్
గన్నవరం : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా బయల్దేరతారు. జిల్లాలో ప్రతిపాదిన మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఈవాళ భీమవరంలో పర్యటించనున్నారు. అలాగే తణుకు సబ్ జైల్లో ఉన్న ఆక్వా బాధితులను పరామర్శిస్తారు. గన్నవరంలో పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాకు పయనం అవుతారు. అక్కడ మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గన్నవరం విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ బయల్దేరి వెళతారు. -
అది ‘గుడ్’ పార్క్
- పారిశ్రామిక అభివృద్ధికే మెగా ఆక్వా ఫుడ్ పార్క్: సీఎం చంద్రబాబు - కాలుష్య కారకం కానే కాదు.. ప్రజలకు నచ్చజెప్పండన్న సీఎం సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక అభివృద్ధి కోసమే మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది కాలుష్యకారకం కాదని, కాలుష్యం కలిగించేదిగా ఉంటే అనుమతులిచ్చే పరిస్థితి తలెత్తదన్నారు. వ్యర్థాల్ని శుద్ధి చేసిన ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా సముద్రంలో కలిసేలా చేస్తామన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని స్వార్థశక్తులు అలజడి సృష్టించాలని ప్రయత్నించడం దారుణమన్నారు. దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ ప్రజలను కోరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌పై వ్యక్తమవుతున్న ప్రజాందోళన నేపథ్యంలో సీఎం ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, వేగంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ తప్పదనే విషయాన్ని ప్రజలకు నచ్చచెప్పాలని అధికారులకు సూచించారు. అపోహలు తొలగించేందుకు కమిటీ.. పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు అన్యాయం చేసే ప్రసక్తే లేదని, జిల్లా అభివృద్ధికి సర్వదా కట్టుబడి ఉంటామని సీఎం చెప్పారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఫుడ్ పార్క్‌పై అపోహలు తొలగించాలని కమిటీకి సూచించారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. కాగా, యనమర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్(సీఈటీపీ)ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో నీటిని శుద్ధి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. తరలింపు సాధ్యపడదు.. ఇదిలా ఉండగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను అక్కడినుంచి తరలించడం సాధ్యపడదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే పరిశ్రమ యాజమాన్యం రూ.25 కోట్ల వరకు ఖర్చు చేసినందున మరో ప్రాంతానికి తరలించడం కుదరదని వారు సీఎంతో చెప్పారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణపై నిబంధనలు ఉల్లంఘించినా, అలసత్వం ప్రదర్శించినా చర్యలకు వెనకాడవద్దని అధికారుల్ని ఆదేశించారు. -
'తుందుర్రులో నియంత పాలన'
ఏలూరు: తుందుర్రులో నియంత పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని లేని వాతావరణం తుందుర్రులో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలోపు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. మోషేన్ రాజు, వంకా రవీంద్ర, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కావూరు నివాస్, తలారి వెంకట్రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
19న తుందుర్రుకు వైఎస్ జగన్
-
19న తుందుర్రుకు వైఎస్ జగన్
మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులతో ముఖాముఖి సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19న పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు గ్రామానికి వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు. భీమవరం, మొగల్తూరు మండలాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని పేర్కొన్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న విషయం విదితమే. అయితే, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టింది. 35 రోజుల క్రితం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, 37 మందిపై హత్యయత్నం కేసులు నమోదు చేశారు. ఏడుగుర్ని జైళ్లకు పంపించారు. మరో 120 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి ఆక్వాపార్క్ బాధితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, 144 సెక్షన్ తొలగించి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరింది. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి తదితరుల నేతృత్వంలో బృందం ఇప్పటికే బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి విషయాలను వైఎస్ జగన్‌కు నివేదించింది. ఈ నేపథ్యంలో బాధితులను ప్రత్యక్షంగా కలిసి వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నట్లు ఆళ ్లనాని వివరించారు. -
'ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరు'
భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ధనవంతుల కోసమే పనిచేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ, చంద్రబాబు పేర్లు వేరు కానీ బుద్ధి మాత్రం ఒక్కటేనని పేర్కొన్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు మేకా శేషుబాబు మాట్లాడుతూ... చంద్రబాబు సర్కారు కార్పొరేట్ సంస్థలను పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. -
భయంతో బతకకూడదు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలేగానీ, భయంతో బతకకూడదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు బుధవారం పవన్ కళ్యాణ్ ను కలిశారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ వల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతాయని పవన్ కు బాధిత గ్రామాల ప్రజలు వివరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడతానని వారికి పవన్ హామీయిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల బాధలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. -
అభివృద్ధి పేరుతో అరాచకాలా?
భీమవరం: అభివృద్ధి పేరుతో చంద్రబాబు సర్కారు అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నేతలు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకుల బృందం ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా పార్థసారధి, వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ... ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై స్థానికులకు ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని, గ్రామస్తుల బనాయించిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువులో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు బయటకు వస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ప్రజలు తమ వద్ద వాపోయారని చెప్పారు. ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో వాస్తవ పరిస్థితులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. -
తుందుర్రులో వైఎస్సార్సీపీ బృందం పర్యటన
భీమవరం : తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నేతృత్వంలోని బృందం బుధవారం బాధిత గ్రామాల్లో పర్యటించింది. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో 144 సెక్షన్‌తో పాటు అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. వృద్ధులు, మహిళలపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంతో గ్రామాలు కాలుష్య బారిన పడుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్లుగా చంద్రబాబు సర్కార్ అణచివేత ధోరణితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫుడ్ పార్క్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చి...ధైర్యం చెప్పారు. బాధితులను పరామర్శించిన వారిలో నేతలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, వంకా రవీంద్రనాథ్, గుణ్ణం నాగరాజు, కవురు శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. -
'తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తివేయాలి'
భీమవరం : ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను నిర్మిస్తే ప్రజా ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుందుర్రు ఫుడ్‌పార్క్ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ...తుందుర్రులో వెంటనే 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతోనే పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పార్టీ ముఖ్యనేతలు వంకా రవీందర్, దండి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కొయ్యే మోషేన్‌రాజు, గున్నం నాగరాజు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్
-
సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. శనివారం భీమవరంలో జరిగిన పరిణామాలపై వైఎస్ జగన్ ఆరా తీశారు. మధుతో పాటు సీపీఎం కార్యకర్తలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన ఆక్షేపించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ సందర్శించేందుకు శనివారం భీమవరం వెళ్లిన మధుతో పాటు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆక్వాపార్క్ రగడ ) -
భీమవరంలో ఉద్రిక్తత...మధు అరెస్ట్
-
భీమవరంలో ఉద్రిక్తత...మధు అరెస్ట్
పశ్చిమ గోదావరి : భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను సందర్శించేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు శనివారం ఇక్కడకు చేరుకున్నారు. వన్‌టౌన్ పోలీసులు ఫుడ్‌పార్క్ వద్దకు చేరుకుని మధును అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గ్రంధి శ్రీనివాస్, కార్యకర్తలతో కలిసి స్టేషన్‌కు చేరుకున్నారు. సీపీఎం మధును విడుదల చేయకపోతే స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళన
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం తుందూరులో మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో ఏడు గ్రామాల ప్రజలు పాల్గొని...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫుడ్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తుగా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. -
వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళల నిరసన
-
ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధమే
మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై రాజకీయ, రైతు, మత్స్యకార నేతల అల్టిమేటం నరసాపురం అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధం తప్పదని రాజకీయ, రైతు, మత్స్యకార నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఆదివారం మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో భారీ బహిరంగ సభ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ దద్దరిల్లింది. సభ జరపడానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించినా.. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళనకారుల లక్ష్యం ముందు అవేమీ నిలబడలేదు. సభలో ఆక్వా ఫుడ్‌పార్కు పోరాటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, రైతు, మత్స్యకార సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. పార్కు నిర్మాణం విషయంలో ప్రభుత్వం నాటకాలాడుతోందని వారు విమర్శించారు. ఓవైపు తాత్కాలికంగా పనులు ఆపుతున్నామని చెబుతున్న సర్కారు.. మరోవైపు కలెక్టర్‌తో.. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులేమీ ఉండవని ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించడంపై వారు మండిపడ్డారు. ఫుడ్‌పార్కు పనులను శాశ్వతంగా నిలిపేయాలని డిమాండ్ చేశారు. సభకు అధికార పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఇక పనులు జరగవని చెప్పి వెళ్లిపోయారు. తమ మాటలు కూడా వినాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరుతున్నా.. వినకుండా ఎమ్మెల్యే వేదిక దిగిపోవడంపై మధు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు కాదు రాతపూర్వకంగా తెలియజేయాలని ఎమ్మెల్యేకు ఆయన సవాల్ విసిరారు. సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్.సత్యనారాయణరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెక్కంటి సుబ్బారావు, ఐద్వాజిల్లా కార్యదర్శి కమల, పాలంకి ప్రసాద్, బొమ్మిడి నాయకర్ తదితరులు మాట్లాడారు. ఇద్దరు పాశ్రామికవేత్తలకు కొమ్ముకాయడం కోసం, నాలుగు మండలాల ప్రజల జీవితాలను సర్కారు ఫణంగా పెడుతోందని వారు విమర్శించారు. సభకు మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బర్రె ప్రసాద్ అధ్యక్షత వహించారు. నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం, భీమవరం మండలాలకు చెందిన ప్రజలు, రైతులు, మత్స్యకారులు 3 వేల మందికిపైగా పాల్గొన్నారు. రాతపూర్వకంగా ఇవ్వాల్సిందే: మధు ఫుడ్‌పార్కు నిర్మాణం చేపట్టబోమని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ వచ్చేవరకూ ప్రజా పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. నాలుగు మండలాల ప్రజలు ఫుడ్‌పార్కు వల్ల కాలుష్యం పెరుగుతుందని, జీవనోపాధి కోల్పోతామని ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలికంగా పనులు ఆపేస్తామని, ఈ నిర్మాణం వల్ల నష్టమేమీ జరగదని మభ్యపెట్టేందుకు యత్నించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటన చేయాలి: కొత్తపల్లి గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు పేరుతో ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో నిర్మించనివ్వబోమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. సభలో కొత్తపల్లి ప్రాజెక్టు వల్ల గ్రామాలు ఎలా నష్టపోతాయో వివరించారు. ప్రాజెక్ట్‌ను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదన్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదు: మాజీమంత్రి మోపిదేవి అభివృద్ధి అనేది ప్రజల అంగీకారంతో జరగాలని, అధికారం ఉంది కదాని ప్రజలపై దౌర్జన్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. కంపెనీలో తమ జీవితాలు బుగ్గవుతాయని ప్రజలు మొత్తుకుంటున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పరిశ్రమలకు పచ్చని పొలాలు కావాలా: సీపీఐ రామకృష్ణ ముఖ్యమంత్రికి పరిశ్రమలు పెట్టడానికి, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని పంటలు పండే పచ్చని పొలాలు, విలువైన భూములే కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చవగ్గా భూములు దొరికే రాయలసీమలో ఎందుకు పరిశ్రమలు పెట్టడం లేదని ప్రశ్నించారు. -
రగిలిన తుందుర్రు
♦ భీమవరం మండలంలో ఆక్వాపార్క్ పనులపై ఆందోళన ♦ అడ్డుకునేందుకు వేలాదిగా తరలి వచ్చిన జనం ♦ లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం తీవ్రతరమైంది. జల, వాయు, భూ కాలుష్యాన్ని వెదజల్లే ఈ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ వివిధ గ్రామాల ప్రజలు శుక్రవారం ఫుడ్ పార్క్ నిర్మాణ ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగగా.. వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. లాఠీచార్జిలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పూర్వాపరాలివీ.. తుందుర్రు గ్రామంలో రూ.150 కోట్ల వ్యయంతో ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పేరిట ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పరిశ్రమలో రొయ్యల్ని ప్రాసెసింగ్ చేసేందుకోసం టన్నులకొద్దీ రసాయనాల్ని వినియోగించాల్సి ఉం డటంతో.. దానివల్ల భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని పలుగ్రామాల్లో జల, వాయు, భూకాలుష్యం ఏర్పడుతుం దని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఉద్యమం సాగుతోంది. సీపీఎం, సీపీఐసహా పలు పార్టీలతోపాటు వివిధ ప్రజా సంఘాలు దీనికి మద్దతు ప్రకటించాయి. అయితే ఉద్యమాలు కొనసాగుతున్నా పార్క్ నిర్మాణ పనులు యథాతథంగా సాగుతున్నాయి. తాత్కాలికంగా ఆందోళన విరమణ ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, డీఐజీ కె.హరిబాబులు ఆందోళనకారులు, పార్క్ యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. పార్క్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలిపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేయగా, తమకు అన్ని అనుమతులున్నాయని యాజమాన్య ప్రతినిధి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. దీంతో పోరాట కమిటీ ప్రతినిధులు, యాజమాన్య పెద్దలతో నరసాపురంలోని తన కార్యాలయంలో శనివారం చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తానని సబ్‌కలెక్టర్ దినేష్‌కుమార్ హామీ ఇచ్చి ఆందోళనకారుల్ని శాంతింప చేశారు. ఆందోళనకారులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పనుల్ని నిలిపివేస్తున్నట్టు పార్కు యాజమాన్యం తెలిపింది. ఆందోళనకారులపై విరిగిన లాఠీ ఈ నేపథ్యంలో పార్కు వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో తుందుర్రు, జొన్నలగరువు, పెదగరువు, కె.బేతపూడి, మత్య్సపురి, శేరేపాలెం తదితర గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ర్యాలీగా తుందుర్రు చేరుకున్నారు. పార్కు నిర్మించి తమ గ్రామాల్ని కాలుష్యంలో ముంచొద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పార్కు పనుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆందోళనకారులు వాటిని తొలగించి లోనికెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా ఐదుగురు గాయపడ్డారు. దారం గాంధీ అనే వ్యక్తికి తలపై తీవ్రగాయమైంది. పోతురాజు సూర్యకుమారి, తంపాకులు వెంకటల క్ష్మి, గూడపాటి శాంతికుమారి, తాడి సువార్త అనే మహిళలకూ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత రణరంగంగా మారింది.