సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని పలు మండలాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు పనులకు వ్యతిరేకంగా మరోమారు ప్రజలు ఆందోళనలు చేపట్టారు. గురువారం వీరవాసరం మండలం మత్స్యపురిలో ఆక్వాఫుడ్ పార్క్ పనులను వ్యతిరేకిస్తూ అరేటి సత్యవతి అనే మహిళ సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. సత్యవతి గతంలో తుందుర్రు ఆక్వాపార్కు వ్యతిరేక పోరాట కమిటీ తరపున ఉద్యమం చేసి ఐదు నెలల పాటు జైలుకు వెళ్లారు.
కొప్పర్రులో సెల్ టవర్ ఎక్కిన మరో ఇద్దరు రైతులు
భీమవరం : తుందుర్రు గ్రామంలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్వాఫుడ్ పార్కు కోసం వేస్తున్న పైప్ లైన్ పనులు నిలిపివేయాలంటూ ఇద్దరు రైతులు కొప్పర్రులో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. తుందుర్రు గ్రామస్థుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆక్వాఫుడ్ పార్క్ కోసం పైపులైన్ల నిర్మాణానికి అధికారులు యత్నించారు. పైపులైన్ల నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకుంటారనే నెపంతో గ్రామంలో భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. ఇళ్లలో నుంచి గ్రామస్తులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment