people protest
-
శ్రీకాకుళం జిల్లా గూడూరులో మురుగు నీటిలోకి దిగిన గ్రామస్తులు
-
యురేనియం తవ్వకాలపై ఆందోళనలు
-
యురేనియం వార్.. కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్! -
తిరుచానూరులో నారా లోకేష్ కు నిరసన సెగ
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టిన ప్రజలు
-
శ్రీలంక: ఐదు వారాల్లో రెండోసారి ఎమర్జెన్సీ విధింపు
కొలంబో: శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చింది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక గడ్డపై ఐదువారాల్లో రెండోసారి ఇది ఎమర్జెన్సీ ప్రకటించడం. ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. ఎవరినైనా నిర్బంధించేందుకు, అరెస్టు చేసేందుకు వీలుంటుంది. అధ్యక్షుడు గొటబయా Gotabaya Rajapaksa తక్షణం రాజీనామా చేయలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం గమనార్హం. మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్ చేస్తూ వేల మంది విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి ఉపక్రమించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఇంకోపక్క.. దేశంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్వహించిన సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు. చదవండి: అప్పుల కుప్ప .. అంతా రాజపక్సల మాయ! -
ఫార్మానే వద్దంటే.. రోడ్డెందుకు?
సాక్షి, యాచారం: ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, వైస్ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, నందివనపర్తి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, తహసీల్దార్ నాగయ్యలు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి వంద అడుగుల రోడ్డు కోసం ఇరువైపులా 60 ఎకరాల వ్యవసాయ భూమి కావాల్సి ఉంది. భూమిని సేకరించడానికి నింబంధనల ప్రకారం నోటిఫికేషన్లు ప్రకటించిన అధికారులు బుధవారం నందివనపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభంలో భూసేకరణ నింబంధనలను ఆర్డీఓ వెంకటాచారి రైతులకు వివరించారు. ఫార్మాసిటీ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఫార్మాను అడ్డుకోవద్దని సూచించారు. సభలో గందరగోళం ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతుండగానే రైతులు లేచి.. సార్ అసలు ఫార్మాసిటీ ఏర్పాటే వద్దని అంటుంటే.. రోడ్డు విస్తరణ ఎందుకు అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా వేదికపై కూర్చున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు లేచి ఫార్మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగానే రైతులంతా ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. కొంతమంది రైతులు అధికారులపై కుర్చీలు వేశారు. టెంటును కూల్చేశారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రైతులను, ఆందోళనకారులను పక్కకు తోసేశారు. కొంతమంది ఆందోళనకారులను, రైతులను అరెస్టు చేసి వాహనంలో యాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సభ వద్ద ఉన్న మరికొందరు రైతులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో అధికారులపై దాడులు చేయడానికి యత్నించగా అధికారులు అర్ధంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ సభను నిలిపేసి వెళ్లిపోయారు. కాగా, నింబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ సభను పూర్తి చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఇదేక్కడి దారుణం.. ఫార్మానే వద్దంటే.. అధికారులు బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ, పట్టా భూముల సేకరణకు జనరల్ అవార్డు పాస్‌చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. నందివనపర్తిలో రైతులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మాకు వ్యతిరేకంగా రైతుల్లో ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో సర్కారు బలవంతంగా భూసేకరణకు దిగడం అన్యాయమని మండిపడ్డారు. రైతులకు మద్దతుగా న్యాయస్థానాలను ఆశ్రయించి బలవంత భూసేకరణను అడ్డుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాను రద్దు చేసి రైతుల భూములను తిరిగి ఇస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్యయాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, బీజేపీ నాయకులు కొండూరి రామనాథం, గోగికార్ రమేష్, విజయకుమార్, నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ ముత్యాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలి’
సాక్షి, యాదాద్రి భువనగిరి: హాజీపూర్ వరస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారంతా ‘శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి’ అనే నినాదాలు చేస్తూ.. హాజీపూర్‌లో నిరసన చేపట్టారు. షాద్‌నగర్‌లో ‘దిశ’పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్నారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ విద్యార్థులను దారుణంగా అత్యాచారం, హత్య చేసిన చేసిన విషయం తెలిసిందే. షాద్‌నగర్ ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్లో మట్టు బెట్టిన ప్రభుత్వం.. హాజీపూర్ ఘటనను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడంలేదని ప్రశ్నించారు. దీంతో పాటు బొమ్మల రామారం పోలీసులను కలిసి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని కోరారు. ఈ నిరసనలో గ్రామస్తులు, బాధత కుటుంబ సభ్యులు, హాజీపూర్ గ్రామ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. సాక్షి, కొమురంభీం ఆసిఫాబాద్: చెంచు మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం, హత్య చేసిన నిందితులను కూడా ఎకౌంటర్ చెయ్యాలని ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. దీంతోపాటు జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌ను చేపట్టారు. టేకు లక్ష్మిబాయిని అత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని జైనూర్‌లో రాస్తారోకో చేశారు. అన్ని సంఘాల నాయకులు ర్యాలీ చేస్తూ.. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. జైనూర్లోని మార్కెట్లో కూడా బంద్‌ను నిర్వహించారు. -
సిక్కోలు శోకం
-
సిక్కోలు శోకం
-
రగులుతున్న సిక్కోలు : శ్రీకాకుళంలో ఉద్రిక్తత
-
రగులుతున్న సిక్కోలు : భగ్గుమన్న బాధితులు!
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో టిట్లీ తుఫాను బాధితులు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భగ్గుమంటున్నారు. టిట్లీ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయటంలేదని ఆగ్రహిస్తూ.. బాధితులు ఆందోళన బాటపట్టారు. ఉద్దానం, పాతపట్నం, కొత్తూరు, పలాస ప్రాంతాలకు చెందిన తుఫాను బాధితులు ఆదివారం ఉద్యమ బాట పట్టారు. తుఫానుతో ఛిన్నాభిన్నమైన తమ ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని, ఆహారం, తాగునీరు లేక తాము ఆకలితో అలమటిస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడని, అధికారులు కనీసం వరదనష్టాన్ని అంచనా వేయడానికి కూడా గ్రామాలకు రావడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. తుఫాన్‌తో తమ జీవితాలు అతలాకుతలం అయ్యాయని, తినడానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా లేవని, అధికారులు సైతం తమను పట్టించుకోవటం లేదని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొత్తూరు మండలంలోని జంక్షన్ వద్ద ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించిన ప్రజలు.. తహశీల్దార్‌ను నిర్బంధించటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు రోడ్డుపై భైఠాయించటంతో రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పాతపట్నంలో... తుఫాను బాధితులు ఆందోళనకు దిగడంతో పాతపట్నం ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టించిన బాధితులు.. తుఫాను విధ్వంసం సృష్టించి నాలుగు రోజులు అవుతున్నా.. తమ గ్రామాల్లో అధికారులు కనిపించడం లేదని, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు మంచినీరు, ఆహారం కల్పించాలని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేశారు. సున్నదేవి సెంటర్లో.. సున్నదేవి సెంటర్లోనూ తుఫాను బాధితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పలాస-మందస రహదారిపై బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో హైవేపై పెద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, తుఫానుతో అష్టకష్టాలు పడుతున్న తమను అధికారులు ఆదుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హరిపురంలో ఉద్రిక్తత
మందస : మండలంలోని హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన ఓ చిన్న సమస్య చివరకు గాలివానలా మారింది. హరిపురం, ఉద్దానంలోని కొన్ని గ్రామాలకు చెందిన ప్రజల మధ్య కొద్దిరోజులుగా నలుగుతున్న ఈ వివాదం మంగళవారం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పోలీసులు సమన్వయంతో వ్యవహరించి పరిస్థితులు చక్కదిద్దారు. హరిపురంలో ఉద్దానంవాసుల ధర్నా.. హరిపురం యువకులు ఉద్దానాన్ని తూలనాడారని, ముగ్గుర్ని అన్యాయంగా తీసుకెళ్లి దాడి చేశారంటూ ఉద్దానంలోని సుమారు 12 గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి హరిపురంలో మంగళవారం నిరసనకు దిగారు. ఓ వైపు హరిపురంలో బంద్ కొనసాగుతుండగానే.. మరోవైపు ఉద్దానానికి చెందిన వీరంతా నిరసన ప్రారంభించారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో ఎస్ఐ యర్ర రవికిరణ్ పోలీసులతో వచ్చి, పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాసరి తాతారావు, లబ్బ రుద్రయ్య, డొక్కరి దానయ్య, పులారి కూర్మారావు, పీతాంబరం, కారి ఈశ్వరరావు, సార దూర్వాసులు, బదకల జానకిరావుతో పాటు మరికొందరు గ్రామస్తులు హరిపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి పోలీసులు వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నంలో తోపులాట జరిగింది. అనంతరం వీరంతా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, మౌనం పాటించారు. అక్కడి నుంచి బాలిగాం-హరిపురం జంక్షన్ వద్దకు వచ్చి న్యాయం చేయాలని, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సమయంలోనే టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి వచ్చి శాంతింపజేసే ప్రయత్నించారు. హరిపురం గ్రామస్తుల ప్రత్యేక సమావేశం.. హరిపురం కమ్యూనిటీ హాల్లో గ్రామస్తులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రి తీరు సక్రమంగా లేదని, వైద్యం సరిగ్గా అందడంలేదని ఆరోపించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కచించుకోవాలని వక్తలు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. డాక్టర్ కామేశ్వరరావు హరిపురం ప్రజలకు సంతకాలు చేయననడం సబబుకాదని, వైద్యులు కచ్చితంగా ఆసుపత్రి సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఎవరితో శత్రుత్వం వద్దని హితవు పలికారు. సమావేశంలో కొట్ర రామారావు, మట్ట ఖగేశ్వరరావు, పుల్లా వాసుదేవు, కణగల జగ్గారావు, యెరుకోల సోమేశ్వరరావు, వారణాసి అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి: డీఎస్పీ కాశీబుగ్గ డీఎïస్పీ బి.ప్రసాదరావు, సోంపేట, కాశీబుగ్గ సీఐలు ఎన్.సన్యాసినాయుడు, వేణుగోపాలరావు, మందస, సోంపేట, బారువా, కాశీబుగ్గ ఎస్ఐలు, ఏఎస్ఐ, హెచ్‌సీలు, కానిస్టే బుల్స్ చేరుకుని ఉద్దానానికి చెందిన పలు గ్రామాల ప్రజలతో చర్చలు జరిపారు. ఏ ప్రాంతమైనా ఒక్కటేనని, అందరూ సమన్వయం పాటిం చాలని కోరారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరువర్గాల నుంచి కొంతమందిని ఎంపిక చేసి, వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరారు. డీఎస్పీ ప్రసాదరావు దౌత్యం ఫలించడంతో నిరసన చేస్తున్న ఉద్దానం ప్రజలు శాంతించారు. ఇరుపక్షాల ఫిర్యాదుల ఉపసంహరణ మందస మండలంలోని హరిపురంలో మంగళవారం జరిగిన వివాదం సద్దుమణిగింది. సోంపేట సీఐ ఎన్.సన్యాసినాయుడు, మందస ఎస్ఐ యర్ర రవికిరణ్‌లు సమయస్పూర్తిగా వ్యవహరించి ఇరువర్గాలను మందస పోలీసు స్టేషన్‌కు రప్పించి చర్చలు జరిపారు. హరిపురం నుంచి కొట్ర రామారావు, కణగల జగ్గారావు, కొట్ర వైకుంఠరావు, పుల్లా వాసుదేవు, ఆనల వెంకటరమణ తదితరులు, ఉద్దానం ప్రాంత గ్రామాల నుంచి ఎంపీపీ ప్రతినిధి దాసరి తాతారావు, డొక్కరి దానయ్య, లబ్బ రుద్రయ్య, పులారి కూర్మారావు, మామిడి కృష్ణారావు తదితరులు చర్చలకు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. దీంతో ఇరువర్గాలు పెట్టిన ఫిర్యాదులను ఉపసంహరించుకుని, ఇకపై అంతా కలసి మెలసి ఉంటామని హామీఇచ్చారు. -
డాంబర్ ప్లాంట్‌లో కార్మికుడి మృతి
సాక్షి, భూపాలపల్లి : గణపురం మండలం గాంధీనగర్‌లోని డాంబర్ ప్లాంట్(పటేల్ కన్స్ట్రక్షన్)లో మరెపల్లి సుధాకర్‌రెడ్డి(డ్రైవర్) అనే కార్మికుడి మృతి ఘర్షణకు దారి తీసింది. అతడు సోమవా రం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడని కంపెనీ యాజమాన్యం చెబుతుండగా.. కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. సుధాకర్ మృతి చెందిన విషయాన్ని సాయంత్రం వరకు తమకు తెలియనీయలేదని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే సాయంత్రం పెద్ద సంఖ్యలో చేరిన మృతుడి బంధువులు ఆగ్రహంలో ఘర్షణకు దిగారు. కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. విలేకరులపై దాడి విషయం తెలిసిన పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు సంఘటన వివరాలు సేకరించేందుకు వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సుధాకర్‌రెడ్డి బంధువులు పత్రికా ప్రతినిధులను కంపెనీకి చెందినవారనుకుని మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో విలేకరుల్లో కొంత మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. దాడి జరిగిన ప్రదేశంలో ములుగు సీఐ సాయిరమణతో పాటు గణపురం ఎస్సై ఫణి ఉన్నట్టు సమాచారం. వీరు ఉండగానే దాడి జరిగిందని స్థానికులు తెలిపారు. -
మృతదేహంతో నిరసన
సాలూరురూరల్ : మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు యజమాని ఇంటి ముందు నిరసన చేపట్టిన సంఘటన బుధవారం మామిడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మామిడిపల్లి గ్రామానికి చెందిన కర్రి భాస్కరరావు అదే గ్రామానికి చెందిన చిలుకూరి సత్తిబాబు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం శివరాంపురంలో దమ్ము చేపడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి భాస్కరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు మృతదేహంతో కలిసి సత్తిబాబు ఇంటి ముంద నిరసన చేపట్టారు. అయితే సాయంత్రం వరకూ సత్తిబాబు రాలేదు. రూరల్ ఎస్సై గణేష్, స్థానిక పెద్దల సూచనలు మేరకు బంధువులు నిరసన విరమించి భాస్కరరావు అంత్యక్రియలు నిర్వహించారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
విజయనగరం, అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని ఆపస్ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘ధర్మపోరాటం’ పేరుతో చేపడుతున్న పోరాటంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసులు వెంటనే అమలు చేయాలని, ఎస్జీటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. 11వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే తెప్పించుకొని మధ్యంతర భృతి 40 శాతం ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారుడు యూఏ నరసింహం, జిల్లా గౌరవ అధ్యక్షుడు బీఏ జగన్నాథం, జిల్లా అధ్యక్షుడు రామినాయుడు, ప్రధాన కార్యదర్శి వీఎస్‌వీఎస్ శాంతిమూర్తి, జిల్లా గౌరవ సలహాదారులు నరసింహం, కోశాధికారి ఆర్.రామినాయుడు, మహిళా విభాగం నాయకులు ఎ.కృష్ణవేణి, ఎ.శ్రీదేవి, పి.అపర్ణ, రమణ, భారతి, ప్రధానోపాధ్యాయులు ఎంఏ గుప్తా, నారాయణరావు, వీవీ శ్రీహరి, జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం ఇచ్చేదాకా పనులు జరగనివ్వం
గోపాల్పేట (వనపర్తి): రేవల్లి మండలంలోని బండరాయిపాకులలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏదుల గ్రామస్తులకు పరిహారం అందలేదని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ వనపర్తి జిల్లా అసెంబ్లీ ఇన్చార్జ్ మహేష్ మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి బ్యాలెన్సింగ్ ఏదుల రిజార్వాయర్ మునకకు గురవుతుందని, ఏదుల గ్రామంలో రిజర్వాయర్ పనులు గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నా ఇంత వరకు పరిహారం అందలేదన్నారు. గ్రామంలో ఇంకా 60 ఎకరాలకు పరిహారం రావాల్సి ఉందన్నారు. గ్రామంలో ఇళ్ల సర్వే చేసి దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆరోపించారు. ఇళ్ల సర్వే చేసినప్పుడు రేవల్లి తహసీల్దార్, వనపర్తి ఆర్డీఓలు 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పరిహారం చెల్లించే దాకా పనులు జరగనివ్వమని తెగేసి చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్, నాయకులు స్వామి, రాములు, మధు, హుస్సేన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
దళిత నాయకుడిపై దురుసు ప్రవర్తన
అమరచింత (కొత్తకోట) : స్వాతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకుని బుధవారం అమరచింత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వివిధ పార్టీల నాయకులు గ్రామాభివృద్ధిపై ఉపన్యసించారు. ఇందులో భాగంగానే బీఎల్ఎఫ్ మండల కన్వీనర్ తిమ్మోతి దళితవాడల అభివృద్ధి మరుగున పడిందని సభాముఖంగా సమస్యలు తెలియజేస్తుండ గా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మేర్వరాజు అడ్డుతగిలి తిమ్మోతి చేతిలోని మైకును లాక్కుని దురుసుగా ప్రవర్తించడంతో మున్సిపల్ ఆవరణ ఉద్రిక్తత చోటుచేసుకుంది. చేతిలోని మైకును లా క్కోవడం ఏమిటని దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మేర్వరాజుపై దాడికి యత్నించగా ఎస్ఐ రామస్వామి మున్సిపల్ కమిషనర్ పాండునాయక్ వివాదాన్ని సద్దుమణిగించే ప్ర యత్నం చేశారు. దీంతో దళిత సంఘాలు, రాజకీ య పార్టీల నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి మేర్వరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీసి తహసీల్దార్ పాం డునాయక్, ఎస్ఐ రామస్వామిలకు వినతిపత్రా లు అందజేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు రాజు, అయూభ్‌ఖాన్, గోపి, మహం కాళి విష్ణు, చింతలన్న, ఫయాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రోజులు దగ్గరపడ్డాయి.. మతతత్వాన్ని పెంచిపోషిస్తూ గోరక్ష పేరుతో దళితులపై దాడులు చేస్తున్న మతోన్మాద పార్టీలకు రో జులు దగ్గరపడ్డాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అమరచింత మీదుగా ధన్వాడకు వెళ్తున్న ఆమె స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దళిత నాయకుడి చేతిలోని మై కును బీజేపీ నాయకుడు లాక్కోవడం దారుణమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అణ గారిన కులాలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విస్మరిం చి న సీఎం కేసీఆర్ అధికార దాహంతో సంక్షేమ ప థకాల పేర్లు వల్లిస్తూ ప్రజలను మోసగిస్తున్నారన్నా రు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశంలో, రా ష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యడం తథ్యమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాష, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్‌ఖాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
బహిష్కరణ ఎత్తివేసే వరకు ఆందోళన
నిజామాబాద్, నాగారం : పరిపూర్ణనందస్వామి బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. సోమవారం నాలుగువైపుల నుంచి కలెక్టరేట్‌కు భారీ ఎత్తున కార్యకర్తలు, హిందుత్వవాదులు, హిందువాహిణి, భజరంగ్ దళ్, ఏబీవీపీ, సాధు పరిషత్, న్యాయవాదులు, మహిళ మోర్చ, బీజేపీ నాయకులు తరలివచ్చారు. ఒక్కసారిగా కలెక్టరేట్ గేట్లను ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అందరిని అడ్డుకున్నారు. అయిన కొంత మంది గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లిపోయారు. అక్కడే ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న వీహెచ్‌పీ నాయకులను, బీజేపీ నాయకులను, హిందుత్వ నాయకులను అరెస్టు చేసి పోలీసుల వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తాం.. హిందుసామాజాన్ని ధర్మాన్ని మార్గదర్శనం చేస్తున్న గురువులను నిర్భందించి బహిష్కరించడం సరికాదని నాయకులు అన్నారు. ఇకనైన ప్రభుత్వం పరిపూర్ణనంద స్వామి బహిష్కరణను రద్దు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్, ధన్పాల్ సూర్యనారాయణగుప్త, బస్వాలక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు, ప్రతినిధులు అరెస్టు అయ్యారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు గంగకిషన్, పిట్ల స్వామి, అల్జాపూర్ శ్రీనివాస్, యెండల సుధాకర్, న్యాలం రాజు, రోషన్‌బోరా, యశ్వంత్, లక్ష్మీనారాయణ, సురేష్ పాల్గొన్నారు. స్వామిపై బహిష్కరణ ఎత్తివేయాలి కామారెడ్డి క్రైం: పరిపూర్ణనందస్వామిపై విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందు పరిషత్, బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడారు. సర్వసంగ పరిత్యాగి అయిన పరిపూర్ణనందస్వామిపై నగర బహిష్కరణ విధించడం తగదన్నారు. ఆయనపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిపూర్ణనందస్వామిని హైదరాబాద్‌కు తిరిగి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ, వీహెచ్‌పీ నాయకులను 50 మందిని పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. నిరసనలో బీజేపీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతే క్రిష్ణాగౌడ్, మర్రి రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, నాయకులు నరేందర్, బాల్‌రాజ్, గంగారెడ్డి, వీహెచ్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): పరిపూర్ణానంద స్వామిపై ఉన్న నగర బహిష్కరణ ఎత్తేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అర్వింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ను బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. అర్వింద్ మా ట్లాడుతూ దేశంలో 80శాతానికిపైగా ఉన్న హిందువులపై ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్న కేసీఆర్‌ని హిందూ సమాజం బహిష్కరించే రోజుదగ్గర్లోనే ఉందన్నారు. రాజకీయపార్టీల్లో విలువలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు రా కుండా పాలన పాతబస్తీ నుంచే సాగుతోందన్నారు. రాజకీయ పార్టీలను మళ్లీ ఎన్నుకుం టే, ఈ రాష్ట్రం పాతబస్తీ కనుసగల మీద నడిచే పరిస్థితి వస్తుందన్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు పట్టుబడ్డారని, వీళ్లను పెంచి పోషించేది టీఆర్ఎస్, కాంగ్రెస్‌లాంటి పార్టీలేనని ఆరోపించారు. హిందూ సమాజం మేల్కొని జాగ్రత్త పడాలని, అందరికీ సమన్యాయం పంచే బీజేపీ వెంటనే నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కాన్పు చేసిన నర్సులు
కల్వకుర్తి టౌన్ : వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో చిన్నారికి పేగు చుట్టుకుని మృతి చెందిందింది. ఈ ఘటన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్ఐ రవి, బాధితురాలి భర్త రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండ లం ఫిరోజ్ నగర్ గ్రామపంచాయతీకి చెందిన మంగమ్మ కాన్పు కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం ఉదయం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు చేద్దాం.. అంతా సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు. అయితే, మంగమ్మ నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండడంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్లో సమాచారం ఇవ్వగా ఆయన బయలుదేరగా.. వచ్చేటప్పటికే బాబు చనిపోయాడు. ఈ విషయమై వైద్యుడు శివరాంను అడగగా.. మంగమ్మ పరిస్థితిని నర్సులు తనకు చెప్పగా.. సాధారణ ప్రసవం వీలు కాకపోతే సిజేరియన్ చేద్దామని ప్రయత్నించినా అప్పటికే బిడ్డ బయటకు రావడంతో చనిపోయాడని తెలిపారు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని అడిగితే.. సాధారణ కాన్పులు చేయొచ్చు కానీ క్లిష్ట పరిస్ధితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. కానీ ఈ విషయమై మంగమ్మ బంధువులు మాట్లాడుతూ కాన్పు పూర్తిగా నర్సులే చేశారని, పూర్తిగా బిడ్డ బయటకు వచ్చాకే వైద్యుడు చేరుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రవి చేరుకుని బాధితులతో మాట్లాడారు. -
స్వామీజీ బహిష్కరణపై నిరసనలు
కొత్తగూడెం అర్బన్: విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పరిపూర్ణానందస్వామిపై బహిష్కరణ వేటు ఎత్తి వేయాలని కోరుతూ బీజేపీ, బీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గణేష్ టెంపుల్ ఏరియా నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన సూపర్‌బజార్ మీదుగా బస్టాండ్ చేరుకుని కలెక్టరేట్ ముట్టడికి వెళ్లే సమయంలో పోలీసులు స్థానిక బస్టాండ్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద అడ్డగించి, అరెస్టు చేసి వ్యాన్‌లో ఎక్కించారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఇందులో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కింద పడ్డారు. అనంతరం పోలీసులు అరెస్టు చేసిన మిగిలిన ఆందోళనకారులను వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిపూర్ణానందస్వామిపై బహిష్కరణను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా కొన్ని టీవీ చానెల్స్‌లో హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వారి మనోభావాలను కించపరిచేలా అవహేళన చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేయడం సరైన పద్దతి కాదన్నారు. అటువంటి చానెల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ముట్టడి చేసే క్రమంలో పోలీసులు నాయకులు, కార్యకర్తలను కొట్టి, బలవంతంగా వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించడం సరికాదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులను వన్ టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించిన అనంతరం 50 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా సీతారామ్ నాయక్, శ్రీనివాసరావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు యేర్రా కామేష్, వీహెచ్‌పీ జిల్లా నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, భజరంగ్‌దళ్ నాయకులు బరిగంటి సురేష్, కుమార్, వినోద్‌రెడ్డి, లక్ష్మీ, సరోజ, ఆర్ఎస్ఎస్ నాయకులు రామచంద్రయ్య, రాజేశ్వరరావు, పార్థసారధి, ఏబీవీపీ నాయకులు నరేందర్ పాల్గొన్నారు. ఖమ్మం(కల్చరల్) : పరిపూర్ణనందస్వామిపై విధించిన నగర బహిష్కరణను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందు పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లిక అంజయ్య, ఉపాధ్యక్షుడు ఉన్నం వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ చేయటం ఎంత వరకు సమంజసమన్నారు. బహిష్కరణ ఎత్తివేయకుంటే ఆందోళనలు ఉ«ధృతం చేస్తా మని హెచ్చరించారు. తొలుత నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట, వాగ్వివాదం జరిగి ంది. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సన్నె ఉదయ్‌ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ, గల్లా సత్యనారాయణ తదితరులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రముఖ్ కొచ్చర్ల రమాదేవి, కోశాధికారి పసుమర్తి రవి, హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు పోతుల వీరచంద్రశేఖర్, మిక్కిలినేని సునీల్, శివసాయి చౌదరి, దేవేందర్, రుద్ర ప్రదీప్, వేల్పుల సుధాకర్, భుక్యా శ్రీను, జైపాల్‌రెడ్డి, ఉపేందర్, ఇంద్రఐక్య వేదిక కన్వీనర్ పిట్టల లక్ష్మీనారాయణ, ఏబీవీపీ సంఘటన యాత్రి మహిపాల్ పృథ్వీ,సాయి, గోపి పాల్గొన్నారు. -
పరమేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి
చిన్నకోడూరు(సిద్దిపేట) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పరమేశ్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు సోమవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనుల వద్ద ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర పరమేశ్(27) కూలి. ఈనెల 10వ తేదీ రాత్రి పనులు ముగించుకుని బైక్‌పై గంగాపూర్‌కు వెళ్తుండగా చంద్లాపూర్ శివారులో కల్వర్టు నిర్మాణ పనులు జరిగే చోట రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న గుంతలో పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణ పనుల్లో జాప్యం చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుడి బంధువులు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులు జరిగే వద్ద ఆందోళనకు దిగారు. ఏడాది పాటు గుంత తీసి.. నెమ్మదిగా పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. పనులు వేగంగా జరిగి ఉంటే పరమేశ్ ప్రమాదానికి గురయ్యేవాడు కాదని చెప్పారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగిన ఈ ప్రమాదం మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్సై అశోక్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినా ఫలితం లేదు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. -
వంచనపై గర్జన
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నిరుద్యోగులను వంచించిన సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాత జైలు రోడ్డులో భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువజన, విద్యార్థి విభాగాలు కదం తొక్కాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఓట్ల కోసం తప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును యువకులే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తారని హెచ్చరించారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 65 లక్షల మందికి పైగా ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే.. 10 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తాననడం ఎంత వరకు సబబు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పక్కాగా అమలు చేసిన ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు అధికారంలో వచ్చాక నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి కింద రూ.2వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.1000 అందిస్తామనడం చంద్రబాబు మాట మీద నిలబడడని చెప్పడానికి నిదర్శనమన్నారు. 2019లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక ఆంక్షలతో రూ.1000 నిరుద్యోగ భృతి అంటూ మరోమారు మోసం చేయడానికి రంగం సిద్ధం చేశారని ఆక్షేపించారు. విశాఖ పార్లమెంట్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు కోటి ఆశలతో తమ పిల్లలను అప్పులు చేసి చదివిస్తే నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలక్షేపం చేశారని ధ్వజమెత్తారు. సక్రమంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకుండా పేద విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ యువతకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అసలు లేనిది ఉన్నట్లుగా, చేయనవి చేసినట్లుగా ఊహించుకునే అల్జిమర్స్ వ్యాధి చంద్రబాబుకు, లోకేష్‌కు ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. రాలీ అనంతరం పార్టీ నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, జోగి నాయుడు(ఎస్.కోట), అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, జి.రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, పార్టీ నగర మహిళా అధ్యక్షురా లు గరికిన గౌరి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు శ్రీదేవి వర్మ, వారాది శ్రీదేవి, పీలా వెంకటలక్ష్మి, షబీరా బేగం, రాష్ట్రా యువజన విభాగం కార్యదర్శి ఆళ్ల శివగణేష్, జాన్‌వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, అనుబంధ సంఘాల అధ్యక్షులు బాకీ శ్యామ్‌కుమార్‌రెడ్డి, ఎం.డి.షరీఫ్, బర్కత్‌ఆలీ, బోని శివరామకృష్ణ, బోని దేవా, తిప్పల వంశీరెడ్డి, అరకు పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు టి.సురేష్‌కుమార్, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శులు బి.మోహన్, ఎం.సురేష్, ఎం.కల్యాణ్, ప్రభాకర్‌నాయుడు, ముర్రు వాణి, వార్డు అధ్యక్షులు జి.వెంకటరెడ్డి, పైడ రత్నాకర్, దుప్పలపూడి శ్రీను, అధిక సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
సాగునీటికోసం లడాయి
ఖిల్లాఘనపురం (వనపర్తి) : కల్వకుర్తి ఎత్తిపోతల ప థకం ప్రధాన కాల్వనుంచి ఖిల్లాఘనపురం బ్రాం చ్ కెనాల్ ద్వారా వస్తున్న సాగునీరు పలుగ్రామాల రైతుల మధ్య గొడవ పెట్టింది. ఇటీవలే మం డలంలోని పెద్దవాగు ద్వారా కృష్ణాజలాలు వస్తున్నాయి. ఈ నీరు నేరుగా మహ్మదుస్సేన్‌పల్లి, ని జాలపురం తదితర గ్రామాల వరకు వాగుద్వారా వెళతాయి. అయితే వెంకటాంపల్లి గ్రామ శివా రులో ఉన్న చెక్‌డ్యాంపై కమాలొద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఇటీవల సంచుల్లో ఇసుక నింపి కట్టగా వేశారు. ఆ నీటిని గ్రామానికి చెందిన వాతరాయ చెరువుకు పాటు కాల్వ ద్వారా తరలించారు. ఇది గమనించిన నిజాలాపురం గ్రామానికి చెందిన రైతులు చెక్‌డ్యాంపై ఉన్న సంచులను రెండు రోజుల క్రితం తొలిగించారు. ఇది తెలుసుకున్న కమాలొద్దీన్‌పూర్ రైతులు జేసీబీ సహాయంతో కట్టవేసి చెక్‌డ్యాంపై మళ్లీ సంచులు వేశారు. మంగళవారం అక్కడికి వచ్చిన మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు సంచులను తొలిగించడానికి వెళ్లడంతో కమాలొద్ధీన్‌పూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. సంచులు వేస్తేనే మా చెరువుకు నీళ్ళు వెళతాయని సంచులు తీయనీయమని పట్టుబట్టారు. సంచులు తీస్తేనే మా చెరువుకు నీరు వెళతాయని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు సంచులు తీసేందుకు యత్నించారు. నచ్చజెప్పిన పోలీసులు చెక్‌డ్యాం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ విజయ్‌కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరుగ్రామాల రైతులతో మాట్లాడి కొన్ని సంచులు తీయించారు. అయినా సాయంత్రం వరకు సంచులు తొలిగిస్తామని కమాలొద్దీన్‌పూర్ గ్రామ రైతులు, మళ్లీ అడ్డువేస్తారని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు చెక్‌డ్యాం దగ్గర కాపలా ఉన్నారు. ఇదిలాఉంటే మహ్మదుస్సేన్‌పల్లి చెరువుకు వెళ్తున్న నీటిని ముసాపేట మండలం నిజాలాపురం గ్రామానికి చెందిన రైతులు తరలించేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. ముసాపేట మండలానికి చెందిన ఎస్ఐ, తహసీల్దార్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. పెద్దవాగు వెంట రైతుల మధ్య ఎప్పుడు ఏం గొడవ చోటుచేసుకుంటుందోనని ఆయాగ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పోలీస్ వర్సెస్ పొలిటికల్
సాక్షి, భూపాలపల్లి : అధికార పార్టీకి ఎదురు తిరిగితే జిల్లా పోలీసులకు మిగిలేది బదిలీనే. చిన్న వివాదాలకు సైతం రాజకీయాలను ఆపాదించి అధికారులను సాగనపుంతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. మొన్న కాటారం, మహదేవపూర్ సీఐల బదిలీ మరవకముందే పోలీసు శాఖలో మరో బదిలీ చోటుచేసుకుంది. ములుగు డీఎస్పీని ట్రాన్స్ఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటు పోలీస్ శాఖలో, అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాలో పోలీసులకు అధికార పార్టీ నాయకులకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఏ సమస్యలోనైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఉం టే బాధితులకు న్యాయం జరగదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న సంఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. చిన్న పాటి భూ వివాదంలో ఏకంగా డీఎస్పీ స్థాయి వ్యక్తిని ఉన్నపళంగా బదిలీ చేశారం టే.. ఏమేరకు రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయో అర్థం అవుతోంది. ఇంతకు ముందు కాటారంలో సీఐగా పనిచేసిన శంకర్‌రెడ్డి బదిలీ విషయం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాటారం పరిధి లో ఇసుక, గుట్కా, బెల్ట్ షాపుల అక్రమ దందా పై ఉక్కుపాదం మోపారు. ఇసుక రవాణాలో ప్రతీరోజు ఏదో ఒకదగ్గర కేసు నమోదు అవు తుండడం ఇసుక వ్యాపారులకు కంటగింపుగా మారింది. దీంతో స్థానిక నాయకులు, ఇసుక వ్యాపారులు మంత్రి స్థాయిలో పైరవీలు నడిపి బదిలీ చేయించారని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఓ రోడ్డు ప్రమాదం సంఘటనకు సంబంధించి ప్రతిపక్ష నాయకులకు సపోర్టుగా ఉంటున్నారనే కారణంతో మహదేవపూర్ సీఐని బదిలీ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ఇదే వరుసలో ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డిని చేర్చారు. పోలీసు వృత్తికి రాజకీయాలు ఆపాదిస్తూ బదిలీ వేటు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గణపురం మండలం రవినగర్ భూవివాదంలో అధికార పార్టీ నాయకులపై చేయిచేకున్నారని ఆరోపిస్తూ ఆపార్టీ కార్యకర్తలు ధర్నా, రాస్తారో కో చేసిన విషయం తెలిసిందే. బాధితుల వివరాల ప్రకారం.. డీఎస్పీ రాఘవేంద్రారెడ్డి తమ కు న్యాయం చేయాలని చూశాడని, ఇది నచ్చకే అధికార పార్టీ నాయకులు డీఎస్పీపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారని మండిపడుతున్నారు. గతంలో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల సమయంలో అప్పటి ములుగు డీఎస్పీ, ప్రస్తుతం జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్న రాజ్మహేంద్ర నాయక్ బదిలీలోనూ రాజకీయ ప్రమేయం ఉందని ప్రజలు అంటున్నారు. ములుగులో డీఎస్పీ మార్క్.. ములుగు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించడానికి డీఎస్పీ కృషి చేశారు. ఇందుకోసం ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యాపారులు, ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలకు పోలీసులకు మధ్య ఎలాంటి తారతమ్య బేధాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రజాబంధం(కనెక్టివిటీ పోలీసింగ్) కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. జాకారం వైటీసీలో జరుగుతున్న కానిస్టేబుల్ ట్రైనింగ్ క్యాంపు పట్ల ప్రత్యేక శ్రద్ధవహిస్తూ యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఫలించని ప్రజల ఆందోళనలు.. ప్రతీసారి ప్రజ లు అధికారులు బదిలీలు ఆపాలని ధర్నా చేస్తున్నా పాలకులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. ములుగు డీఎస్పీ బదిలీని అపాలని సుమారు 2వేల మంది ప్రజలు ధర్నాకు దిగారు. అక్రమ బదిలీని నిపివేయాలని ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు రోడెక్కి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని చూసిన అధికారిని అన్యాయంగా బదిలీ చేశారని ఆందోళన చేశారు. గతంలో కాటారం సీఐ శంకర్‌రెడ్డికి మద్దతుగా ప్రజలు, వివిధ సంఘాల నేతలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. విపక్ష పార్టీల ఆధ్వర్యం లో ప్రజాసంఘాలు ఆందోళనలు చేశారు. ప్రజలు ఎంతగా ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించలేదు. సామాన్యుడికి భరోసా ఏదీ..? పోలీసులకే భరోసా కరువైంది. ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇటీవలి బదిలీల ఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బాధితులకు న్యాయం చేయాలని చూస్తున్నప్పటికీ పలు రాజకీ య ఒత్తిళ్ల కారణంగా పోలీసులు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజాయతీగా పనిచేస్తున్న పోలీస్ అధికారులకు ప్రభుత్వ ఇచ్చే బహుమతి బదిలీయేనా అని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. తమకు న్యాయం చేయాలనుకున్న అధికా రిని అకారణంగా బదిలీ చేస్తున్నారంటూ రోడ్లపైకి వస్తున్నారు. జిల్లాలో సమర్థవంతమైన ఎస్పీ ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతోనే ట్రాన్స్ఫర్లు అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎమ్మెల్యేకు చేదు అనుభవం
బంట్వారం, వికారాబాద్ : మండలంలోని తొర్మామిడిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంçగళవారం వచ్చిన ఎమ్మెల్యే సంజీవరావుకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే కారు దిగగానే గ్రామస్తులు అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు రసాభసగా సాగింది. ధారూరు సీఐ ఉపేందర్ జోక్యంతో కాస్త సద్దుమణిగింది. గతేడాది తొర్మామిడిలో అన్నాచెల్లెలు అనుకోని ఘటనలో బావిలో పడి మృతి చెందారు. అప్పట్లో ఎమ్మెల్యే సంజీవరావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గ్రామస్తుల డిమాండ్ మేరకు మృతుల కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాటిచ్చారు. కాని ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సంజీవరావును ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆయన ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విపిపించుకోలేదు. సభలోను అదే లొల్లి.. ఎట్టకేలకు పోలీసులు సభాస్థలికి ఎమ్మెల్యేను తీసుకువెళ్లారు. కాని అక్కడ మరింత గందరగోళం నెలకొంది. బాధిత కుటుంబానికి సహాయం చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రకటించేవరకు సభ జరుగనివ్వమంటూ రసాభస చేశారు. రూ.ఐదు లక్షలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. డీఎస్పీ శిరీష, ధారూరు, వికారాబాద్ సీఐలు ఉపేందర్, వెంకట్రామయ్య దగ్గరుండి పరిస్థితిని చక్కదిద్దారు. రూ.లక్ష సహాయం చేస్తా: ఎమ్మెల్యే తన వ్యక్తిగత సహాయం కింద బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేస్తానని ఎమ్మెల్యే సంజీవరావు ప్రకటించారు. అప్పట్లో మాట్టిచ్చినవన్నీ ప్రభుత్వపరంగా ఇప్పిస్తానని చెప్పారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని రాగానే ఆయనతో వివరంగా మాట్లాడుతానని తెలిపారు. అనంతరం ఆయన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, ఎంపీడీఓ కృష్ణకుమారి, స్థానిక సర్పంచ్ మొగులయ్య, పీఏసీఎస్ చైర్మన్ కే.లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పంది వెంటకయ్య, నాయకులు మల్లారెడ్డి, డాక్టర్ నర్సింలు, సంజీవరెడ్డి, బస్వాపూర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు శిలాఫలకం ధ్వంసం.. సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని కొందరు అధికార పార్టీ నాయకులే ధంసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌రెడ్డి తొర్మామిడి రావాల్సి ఉంది. కాని ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఎమ్మెల్యే సంజీవరావు హాజరైనప్పటికీ అనుకోని ఘటనతో ఆయన కొంత అసహనానికి గురయ్యారు. -
పల్లెల్లో తాగునీటి గోస
కొడంగల్ రూరల్ : మా ఊరిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదని మండల పరిధిలోని రావులపల్లి గ్రామస్తులు సోమవారం రోడ్డుపై భైఠాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయని వాపోయారు. పైప్‌లైన్ పగిలిపోయిన తర్వాత దాదాపు 15 రోజులుగా రోడ్డుపై ట్యాంకర్‌ను ఉంచి నీటి సరఫరా చేశారని, అయినా పూర్తి స్థాయిలో నీరు అందక ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల నుండి నీటి సరఫరా కాకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు, నాయకులకు తెలియజేసినా స్పందించపోవడంతో ధర్నాతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో నాలుగు చేతిపంపులు ఉన్నా వాటిలో రెండు చెడిపోవడంతో సుదూర ప్రాంతం నుండి నీటిని తెచ్చుకుంటున్నామని అన్నారు. గ్రామ శివారులో దౌల్తాబాద్ రోడ్‌లోని రైస్‌మిల్ సమీపంలో నీటిని తెచ్చుకుం టున్నామని, ద్విచక్రవాహనాలు, సైకిళ్లపై బిందెలను పెట్టుకొని నీటిని తెచ్చుకుంటున్నామని అన్నారు. సుదూర ప్రాంతం నుండి నీటి బిందెలను మోసుకొని రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని నినాదాలు చేశారు. రావులపల్లి గేటు సమీపంలో కొడంగల్– యాద్గిర్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విషయం తెలిసిన పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకొని సంబంధిత కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడించారు. మంగళవారం సాయంత్రం వరకు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలపడంతో నిరసన విరమించారు. -
మా కుమారుడిని చంపేశారు!
వీరఘట్టం/కాశీబుగ్గ/పాలకొండ రూరల్/టెక్కలి రూరల్: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న వుగిరి హర్షవర్ధన్ మృతిపై తల్లిదండ్రులు రామ్‌ప్రసాద్, నాగమణిలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. గురువారం పలాస ప్రభుత్వాస్పత్రిలో ఉన్న తమ కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కూడా మృతదేహాన్ని అప్పగించకపోవడం, నేరుగా పోలీసులే స్వగ్రామం వీరఘట్టం తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పలాస నుంచి నేరుగా టెక్కలిలోని కళాశాల వద్దకు వెళ్లి బైఠాయించారు. వీరిని లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పలాస ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పలాస ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తీరుపై బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం సూచనల మేరకే అంతా నడుచుకుంటున్నారని, మృతిపై పోలీసులకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బాధిత కుటుంబానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోస్టుమార్టం జరిగిన తర్వాత కూడా మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో లేకపోతే ఎందుకు చెప్పలేదు? పలాసలో గురువారం జరిగిన పరిణామాలు, కొందరు ప్రత్యక్ష సాక్షులు, రైల్వే ట్రాక్ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం హర్షవర్ధన్‌ది హత్యే అని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడిపై గిట్టనివారు హత్య చేసి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై ఉంచి, ఈ ఉదంతాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసు సిబ్బందిని నిలదీశారు. రెండు రోజులుగా హాస్టల్లో కుమారుడు లేకపోయినా తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని సిబ్బందిని నిలదీశారు. కుమారుడి మొబైల్ ఫోన్ నుంచి ఎవరో కావాలనే వాడి మిత్రులకు తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌ల ద్వారా పంపించారని ఆరోపించారు. తన కుమారుడి జేబులో నిత్యం పర్స్, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ ఉంటాయని, చనిపోయిన ప్రాంతంలో ఎటువంటి వస్తువులు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.ఇది ముమ్మాటీకీ పరువు హత్యేనని ఆరోపించారు. వీరఘట్టంలో ఉద్రిక్తత... హర్షవర్ధన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, పలాసలో పోలీసులు మృతుడి కుటుంబీకులపై వ్యవహరించిన తీరుపై వీరఘట్టంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తీసుకువచ్చిన హర్షవర్దన్ మృతదేహాన్ని ఊరి పొలిమేరల్లోనే పాలకొండ-పార్వతీపురం రహదారిపై అడ్డగించి రాస్తారోకో నిర్వహించారు. వీరఘట్టం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన తెలియజేస్తూ రహదారిని నిర్బంధించారు. మహిళలు, యువకులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొని కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్షవర్ధన్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. స్తంభించిన ట్రాఫిక్.. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో పాలకొండ-పార్వతీపురం రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం తెలుసుకున్న పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి, సీఐ సి.హెచ్.సూరినాయుడులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలను ఎస్పీ త్రివిక్రమవర్మకు తెలియజేశారు. అనంతరం ప్రయాణికుల ఇబ్బందులు గుర్తించి స్థానికులు ఆందోళన విరమించారు. శోకసంద్రమైన వీరఘట్టం.. హర్షవర్దన్ మృతదేహం స్వగ్రామం రావడం.. వచ్చిన వెంటనే సంఘీబావంగా గ్రామస్తులు ఆందోళన చేయడం..పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం.. ఇలా అనేక పరిణామాల మధ్య గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఆందోళనలతో వీరఘట్టం శోకసంద్రమైంది. చివరకు విషణ్ణ వదనాలతో హర్షవర్దన్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
తాగునీటి కోసం ధర్నా
కొడంగల్ రూరల్ వికారాబాద్ : ‘వారం రోజులుగా తాగునీటి కోసం అల్లాడుతున్నాం. కొన్నాళ్లు బోరు సమస్య, మరికొన్నాళ్లు విద్యుత్ సమస్యతో నీటి కటకట ఏర్పడింది. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో ధర్నాకు దిగాం.. ఓపిక నశించి రోడ్డెక్కాం’.. అంటూ బొంరాస్‌పేట మండలంలోని రేగడిమైలారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి ఇబ్బందులను తీర్చాలని కోరుతూ గురువారం బీజాపూర్– హైదరాబాద్ అంతర్రాష్ట్ర హైవేపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. రేగడిమైలారం పటేల్‌చెర్వు వద్ద ఉన్న తాగునీటి బోరుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వారమైంది. ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. దీంతో మండిపోయిన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినదించారు. వీరి నిరసనతో వాహనాల రాకపోకలు స్తంభించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించారు. ట్రాఫిక్ ఎస్ఐ మల్లారెడ్డి ట్రాన్స్‌కో ఏఈతో ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ సమస్య తీరుస్తా మని ఏఈ సాంబయ్య హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు. ట్రాన్స్‌కో ఏఈ సందర్శన తాగునీటి సమస్యకు విద్యుత్ సమస్య అంతరా యం ఏర్పడిన విషయంపై ట్రాన్స్‌కో ఏఈ సాం బయ్య పరిశీలించారు. ఎస్ఐ మల్లారెడ్డితో మాట్లా డి విద్యుత్ సమస్య నెలకొన్న కాలనీలో విద్యుత్ తీగలను సరి చేయించారు. కానీ ట్రాన్స్ ఫార్మర్ చెడిపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయించి విద్యుత్ సమస్య తీరుస్తామని ఏఈ హామీ ఇచ్చారు. స్నానాలకూ తిప్పలే తాగునీటి కోసం నేను నిత్యం నడవలేకపోతున్నా. రోడ్డు దాటి అవస్థలు పడుతుంటే ప్రజాప్రతినిధులు చూసి కూడా స్పందించడం లేదు. వృద్ధులు, చిన్నారులు నిత్యం అవస్థలు పడుతూ నీళ్లు తెచ్చుకుంటున్నాం. స్నానాలకు కూడా తిప్పలే ఉంది. తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలి. – ఆంజనేయులు, దివ్యాంగుడు, ఎస్సీకాలనీ వంటకు నీళ్ల కరువు తాగడానికి నీళ్లు లేక వానకాలంలోనూ ఇబ్బంది పడుతున్నాం. ఒక దిక్కు నీళ్ల కోసం, మరో దిక్కు రోడ్డు పనులు జరుగుతున్నాయి. బిందెడు నీళ్ల కోసం దూరంలో ఉన్న బోరు నుంచి తెచ్చుకుంటున్నాం. ఇట్లా ఎన్నిరోజులు అవస్థలు పడాలే. వంట చేసుకునేందుకు చెంబెడు నీళ్లు లేని పరిస్థితి. – సులోచన, బండమీది కాలనీ సమస్య పరిష్కరించాలి గ్రామంలో మిషన్ భగీరథ, రోడ్డు విస్తరణ పను లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో రోడ్డు కు ఇరువైపులా రాకపోకలు పెరిగి తాగునీటి పైపులైన్లు తెగాయి. తాగునీటి సమస్య ఏర్ప డింది. తాగునీటి బోర్లకు విద్యుత్ సరఫరా లైన్లు వేరేగా ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలి. – మొగులయ్య, రేగడిమైలారం -
ప్రసూతి ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆస్పత్రిలో ఆడశిశువు మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. శిశువుకు ఫిట్స్ రావడం వల్లే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ భార్య లకితకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. శుక్రవారం ఆమెకు వైద్యులు ప్రసవం చేయడంతో పాప పుట్టింది. కొద్దిగా పసిరికలు కనిపించడంతో ఎన్‌బీఎస్‌యూలోని బాక్సులో ఉంచారు. సోమవారం ఉదయం నుంచి ఫిట్స్ రావడంతో పిల్లల వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని, పాప ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. మధ్యాహ్నం వరకు పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. ఈక్రమంలో మూడు రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్న పాప ఆకస్మాత్తుగా ఎలా చనిపోతుందంటూ బాధిత కుటుంబీకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రిలో కాసేపులో ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీసీహెచ్ఎస్ డాక్టర్ బోర్కర్ సురేశ్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రజినీ అక్కడికి చేరుకున్నారు. వారితోనూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తల్లి లకితకు ఇవ్వాల్సిన యాంటీ–డీ ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్లే ఇది జరిగిందని పేర్కొన్నారు. వైద్యులు దీన్ని కొట్టిపారేస్తూ.. ఆ ఇంజక్షన్‌కు శిశువు మృతికి సంబంధం లేదని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఫిట్స్ వచ్చి చనిపోయిందని వివరించారు. అనంతర శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. -
స్టాఫ్‌నర్సు కళావతిపై చర్యలు తీసుకోవాలి
తల్లాడ : స్టాఫ్‌నర్సు కళావతిని సస్పెండ్ చేయాలని, శిశువు మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లాడ పీహెచ్సీ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మార్తిని పద్మ డెలివరీ అయిన తర్వాత శిశువు మృతి చెందటంతో ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. వారికి రైతు సంఘం, కుర్నవల్లి గ్రామస్తులు మద్దతు తెలిపారు. శిశువు కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి లేకుండా డెలివరీ చేసిన స్టాఫ్ నర్సు కళావతిని సస్పెండ్ చేయాలన్నారు. 24 గంటలు డాక్టరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే డాక్టరు ఉండి వెళ్లటం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. అనంతరం డిప్యూ టీ డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డాక్టర్లు వి. రాజ్‌కుమార్, కె.శ్రీనులతో చర్చించారు. 24 గంటలు ఆస్పత్రిలో వైద్యులు ఉండేలా నివేదిక పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గుంటుపల్లి వెంకటయ్య, తమ్మిశెట్టి శ్రీను, చల్లా నాగేశ్వరరావు, గంటల వెంకటాచారి, ఐనాల రామలింగేశ్వరరావు, కందికొండ నర్సిరెడ్డి, దగ్గుల ముత్తారెడి, జక్కుల రాములు, నెర్సుల తిరుపతిరావు, ఎల్లమ్మ, సావి త్రి పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
దోమకొండ : మండలంలోని సంగమేశ్వర్ గ్రామంలోగల గుడ్‌ఫ్రూట్ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం షెడ్డును కూల్చివేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మండలకేంద్రంలో ఆదివారం కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు ధర్నా చేశారు. మొదట సంగమేశ్వర్ గ్రామంలో వారు ధర్నా చేశారు. అక్కడి నుంచి దోమకొండకు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. తమకు న్యాయం చేయలంటూ నినాదాలు చేశారు. కావాలనే ప్రార్థన మందిరం షెడ్డును కూల్చివేశారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కూల్చివేతలో గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు పాత్ర ఉందని, వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి అక్కడి నుంచి తిరిగి సంగమేశ్వర్ గ్రామ మూలమలపు వద్దకు చేరారు. రోడ్డుపై బైఠాయించి «ధర్నా చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని కోరినా పొలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దోమకొండతోపాటు సంగమేశ్వర్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన క్రిస్టియన్ సంఘాల వారు ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు. సాయంత్రం వరకు కొనసాగిన «ధర్నా పోలీస్ అధికారులు వారిని సముదాయించడంతో విరమించారు. ప్రార్థన మందిరానికి సంబంధించిన షెడ్డు కూల్చివేయడంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని న్యాయం చేస్తామని పోలీసులు వివరించారు. భారీ పోలీస్ బందోబస్తు.. ధర్నా సందర్బంగా ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. కామారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, భిక్కనూరు సీఐ కోటేశ్వర్రావ్, మాచారెడ్డి ఎస్ఐ కృష్టమూర్తి, రాజంపేట ఎస్ఐ రవిగౌడ్, భిక్కనూరు ఎస్ఐ రాజుగౌడ్, దోమకొండ ఎస్ఐ నరేందర్‌తో పాటు సిబ్బంది గొడవలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. కాగా కూల్చివేతకు సంబంధించి సంగమేశ్వర్ గ్రామానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ నరేందర్ తెలిపారు. -
న్యాయం చేయాలని రాస్తారోకో
అడ్డగూడూరు (తుంగతుర్తి) : వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన శ్రీరాముల ఉమ కుమార్తెకు నాయ్యం చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ బంధువులు గురువారం పాటిమట్ల ఎక్స్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. మండల పరిధిలోని చిర్రగూడూరు గ్రామంలో బుధవారం ఉదయం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలో శ్రీరాములు ఉమ(29), కూతురు అశ్విత (8 నెలలు) మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. మృతదేహాలకు గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం చిర్రగూడురుకు తీసుకొస్తున్న సమయంలో పాటిమట్ల ఎక్స్‌రోడ్డు వద్ద ఉమ బంధువులు అబ్లులెన్స్‌ను అడ్డుకున్నారు. ఉమ కూతురు మిల్కీకి నాయ్యం చేయాలని.. ఆమె పేరును రూ.5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, తండ్రి అశోక్ పేరున ఉన్న భూమిని మిల్కీ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లకు ఒప్పుకునే వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై రెండు గంటలపాటు భీష్మించారు. ఈ సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఏసీపీ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను విచారించి.. నాయ్యం జరిగేలా చేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. వివాహేతర సంబంధం వల్లే నా కూతురిని కోల్పోయా.. నా అల్లుడు అశోక్‌కు అదే గ్రామానికి చెందిన వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తరచూ నా కూతురుతో గోడవపడేవాడు. దీనిపై పెద్దమనుషుల్లో పెట్టి పలుమార్లు హెచ్చరించినా వినలేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుండనే.. అశోక్ నా కూతురిని హతమార్చాడు. అని ఆవేదన వ్యక్తం చేసింది. - ఉమ తల్లి చంద్రమ్మ -
70 కుటుంబాల ఆవేదన వినిపించదా?
పోలాకి : స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వివక్ష తగ్గ లేదని ఉర్జాం గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తంచేశారు. వివక్ష రూపాంతరం చెందిందే తప్ప అంతరించిపోలేదని మండిపడ్డారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉర్జాంలో దాదాపు 70 దళిత కుటుంబాల ఆవేదన అధికారులకు, నాయకులకు వినిపించటంలేదా? అని ప్రశ్నించారు. కులవివిక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఉర్జాం దళితులు బుధవారం కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రం వద్ద ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. తమ దళితవాడలో తాగునీటి కష్టాలు తెలిసేలా, వినతులు, విన్నపాలు వినలేని పాలకులు, అధికారులకు వినిపించేలా మహిళలు ఖాళీ బిందెలతో ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, మేళాలతో మండలకేంద్రంలో ర్యాలీగా వెళ్లి ప్రత్యేకాధికారి దామోదరరావుకు తమగోడు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించడంలో వివక్ష చూపుతున్నారని, ఇచ్చిన మాటను అధికారులు నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, సమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తాము కనీసం మంచినీటికి కూడా నోచుకోలేకపోతున్నామని, ఉప్పు నీళ్లు తాగుతున్నామని గ్రామానికి చెందిన మహిళ కె.లక్ష్మి వాపోయింది. మౌలిక వసతుల అభివృద్ధికి అడ్డుకుంటున్నారని, మృతదేహాలు దహనంచేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దళిత సంఘం నాయకుడు జె.గన్నయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తామూ ఈ గ్రామంలోనే పుట్టామని అలాంటప్పుడు వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఉర్జాంలో జరుగుతున్నది కులవివక్షే అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ అన్నారు. పౌరహక్కుల దినం సందర్భంగా గ్రామంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. -
‘శ్రీరాం చిట్స్’కు తాళం
జనగామ: రుణం చెల్లించిన తర్వాత ఇంటి పత్రాలు ఇవ్వడం లేదని ఆగ్రహిస్తూ బాధిత కుటుంబం శ్రీరాం చిట్‌ఫండ్ కార్యాలయానికి తాళం వేసి, ఆందోళన చేసిన సంఘటన సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. తమ కుటుంబానికి జరిగిన నష్టానికి అందులో పనిచేస్తున్న ముగ్గరు బాధ్యత వహించాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దీంతో చిట్‌ఫండ్ ప్రతినిధులతో బాధితుల తరఫున వచ్చినవారు కొద్దిసేపు వాగ్వాదం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు పుల్లోజు కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడారు. తన వ్యాపారాభివృద్ధి కోసం శ్రీ రాం చిట్‌ఫండ్‌లో ఇంటి డాక్యుమెంట్లు పెట్టి రూ.10 లక్షల అప్పు తీసుకున్నానని తెలిపాడు. రూ.7,25,875 చెల్లించిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదని చెప్పాడు. పూర్తిస్థాయిలో కట్టలేక పోయానన్నారు. ఫైనాన్స్ కంపెనీ ఒత్తిడితో రూ.11 లక్షలకు వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని, ప్రైవేట్‌లో అప్పు తీసుకువచ్చి చెల్లించామన్నారు. అప్పు చెల్లించిన తర్వాత కూడా తన ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వడం లేదన్నారు. అప్పు చెల్లించేటప్పుడు మూడు రోజుల్లో పత్రాలు ఇస్తామని చెప్పి, ఏడు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని వివరించాడు. మరో వ్యక్తికి జమానతు ఉన్నానని చెబుతూ బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఐటీ షూరిటీ మాత్రమే ఉన్నానని, అతడు రుణం తీసుకుని ఆరు ఏళ్లు గడిచినా ఒక్కసారి కూడా తనకు నోటీసులు పంపించలేదని తెలిపాడు. ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోతే మా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని, మమ్మల్ని మోసం చేసిన సిబ్బంది విద్యాసాగర్, శ్రీనివాస్, సంపత్ జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ విషయమై చిట్ ఫండ్ మేనేజర్ సంతోష్ విలేకరులతో మాట్లాడుతూ పుల్లోజు కృష్ణమూర్తి తమ వద్ద తీసుకున్న రుణం తీర్చాడని, మరో వ్యక్తికి జమానతు ఉండడంతోనే డాక్యుమెంట్లు ఇవ్వలేదన్నాడు. తనకు నోటీసులు కూడా పంపించామని తెలిపాడు. -
దద్దరిల్లిన కలెక్టరేట్...
విజయనగరం పూల్‌బాగ్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేటీకరణ చేయవద్దని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఎండీఎం యూనియన్ జిల్లా కార్యదర్శి బి. సుధారాణి మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేస్తే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనుకోవడం తగదన్నారు. బిల్లులు ఇవ్వకపోయినా 15 ఏళ్లుగా అనేక కష్టానష్టాలకోర్చి పథకాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే పథకాన్ని ప్రవేటీకరించే ఆలోచనను విరమించుకోవడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు కనీసవేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మెనూ చార్జీలు పెంచడం.. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, తదతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. రెచ్చిపోయిన పోలీసులు మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పది నుంచి 12 గంటల వరకు కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. అయినప్పటికీ అధికారులు రాకపోయేసరికి రాస్తారోకో చేపట్టేందుకు సిద్ధపడ్డారు. అప్పటికే ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఒక్కసారికి వారిపై విరుచుకుపడ్డారు. అధికారులు వస్తే సమస్యలు చెప్పుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నా పోలీసులు వినకుండా మహిళలు, నాయకులను ఈడ్చుకుంటూ డెంకాడ, గంట్యాడ పోలీస్స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, నాయకులు ఎన్వై నాయుడు, ఎ. జగన్మోహన్రావు,సీహెచ్ జగన్, బి.సూర్యనారాయణ, పి. అప్పారావు, ఎం. రమణ, తదితర 69 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రభుత్వం తీరు సరికాదు డెంకాడ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు అన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నాయకులు, నిర్వాహకులను పోలీసులు డెంకాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, టీవై నాయుడు, కార్యదర్శి ఎ.జగన్మోహన్, బి.సుధారాణి, మధ్యాహ్న భోజన పథకం సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు తులసి, వరలక్ష్మి, శాంతకుమారి తదితరులు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పజెప్పరాదన్నారు. వర్కర్లు, హెల్పర్లకు నెలకు ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రతినెలా ఐదో తేదో లోగా బిల్లులు, వేతనాలు చెల్లించాలన్నారు. ఒక్కో విద్యార్థికి మెనూ చార్జీ పది రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యమాన్ని ఆపలేదన్నారు. -
రాష్ట్ర గీతంలో మార్పు
భువనేశ్వర్: రాష్ట్ర గీతమైన వందే ఉత్కళ జనని గీతంలో ఉత్కళ బదులుగా ఒడిశా అని సవరించాలని రాష్ట్ర కార్మిక, విద్యుత్ శాఖ మంత్రి సుశాంత సింగ్ మంగళవారం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో రాష్ట్రంలో నిరసనల వెల్లువ అకస్మాత్తుగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ కోరాలంటూ ఆందోళన ప్రారంభమైంది. అమ్మె ఒడియా సంస్థ వందే ఉత్కళ జనని గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని ఇటీవల ఉద్యమించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టింది. త్వరలో ఈ నేపథ్యంలో తుది నిర్ణయం వెలువడనుంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమ ఒడిశాకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక, విద్యుత్ శాఖ మంత్రి సుశాంత సింగ్ గీతంలో సవరణకు ప్రతిపాదించి మంత్రి ప్రాంతీయ వివక్ష ప్రేరేపిస్తున్నారని అమ్మె ఒడియా సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. జాతీయ గీతంలో రాష్ట్రాన్ని ఉత్కళగా ఉచ్ఛరించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రాంతీయ పార్టీ ప్రతినిధి కావడంతో ప్రాంతీయ వివక్షను ప్రదర్శిస్తున్నట్లు ఎద్దేవా చేసింది. మంత్రి ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంగళవారం స్థానిక మాస్టర్ క్యాంటీన్ ఛక్ ప్రాంతంలో అమ్మె ఒడియా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. మంత్రి బేషరతుగా తన ప్రతిపాదనల పట్ల క్షమాపణ కోరాలని ఈ వర్గం పట్టుబడుతోంది. మంత్రి వ్యాఖ్యలు నాలుగున్నర కోట్ల రాష్ట్ర ప్రజానీకం మనోగతాలకు కష్టం కలిగించాయని అమ్మె ఒడియా సంస్థ సమన్వయకర్త నిరాకర్ సాహు ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఆమోదం కోసం ప్రతిపాదన: మంత్రి రాష్ట్ర గీతంగా ప్రకటించనున్న వందే ఉత్కళ జనని గీతంలో ఉత్కళ బదులుగా ఒడిశా అని సవరిస్తే సార్వత్రిక ఆమోదం, ప్రాచుర్యం లభిస్తుందని రాష్ట్ర కార్మిక, విద్యుత్ శాఖ మంత్రి సుశాంత సింగ్ తెలిపారు. ఈ గీతం పురాతనమైనది. పశ్చిమ ఒడిశా ప్రాంతంలో కోశల రాజ్యం కోసం ఉద్యమిస్తున్న వర్గాల మనోగతం దృష్ట్యా ఈ ప్రతిపాదన చేసినట్లు మంత్రి వివరించారు. పశ్చిమ ఒడిశా ప్రతినిధిగా ప్రాంతీయుల మనోభావాల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం కర్తవ్యంగా భావించి వందే ఉత్కళ జనని బదులుగా వందే ఒడిశా జననిగా సవరించేందుకు ప్రతిపాదించినట్లు ప్రకటించారు. ఇలా అయితే సర్వత్రా ప్రాచుర్యం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అభిప్రాయం, కార్యాచరణకు సంబంధించి తనకు ఎటువంటి అవగాహన లేనట్లు మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ ఒడిశా ప్రాంతీయుల అభిప్రాయం ప్రకారం ఉత్కళ పదానికి భావం భిన్నంగా ఉన్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వీరి అభిప్రాయం ప్రకారం సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిర్ణయం ఖరారు : బీజేడీ అధికార ప్రతినిధి వందే ఉత్కళ జనని రాష్ట్ర గీతం ప్రతిపాదనపట్ల ప్రభుత్వ నిర్ణయం ఖరారైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తి భావ వ్యక్తీకరణకు రాజ్యాంగపరంగా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ప్రతిపాదనలో పొరపాటు లేనట్లు బిజూ జనతా దళ్ అధికార ప్రతినిధి ప్రతాప్ కేశరి దేవ్ సర్ది చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, ప్రాంతాల ప్రజా ప్రతినిధుల సంప్రదింపుల మేరకు రాష్ట్ర అసెంబ్లీలో వందే ఉత్కళ జనని రాష్ట్ర గీతం ప్రతిపాదనపట్ల తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రతాప్ కేశరి దేవ్ వివరించారు. ఈ నిర్ణయం వాస్తవ కార్యాచరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపడుతుందని వివరించారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే కార్మికుడి మృతి
షాద్‌నగర్‌టౌన్: ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ల్యంతోనే కార్మికుడు వెంకటేష్ మృతి చెందాడని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. షాద్‌నగర్ ఆర్టీసీ బస్ డిపోలో పని చేస్తున్న కార్మికుడు హైదరాబాద్‌లోని హకీంపేటలోని ఆర్టీసీ గ్యారేజీలో రెండు బస్సుల మధ్య నలిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు మంగళవారం షాద్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన వెంకటేష్ (30) ఐటీఐ పూర్తి చేసి గత కొంత కాలంగా షాద్‌నగర్ ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే కాలం చెల్లిన బస్సును రిపేర్ నిమిత్తం ఆర్టీసీ వారు హైదరాబాద్‌లోని హకీంపేటకు పంపాచారు. బస్సు డ్రైవర్‌తో పాటుగా డీజిల్ మెకానిక్ వెంకటేష్ కూడ హకీంపేటకు వెళ్లాడు. అయితే అక్కడ రెండు బస్సులు ఒకదాని వెంట మరొకటి నిలబడ్డాయి. ఓ బస్సును రివర్స్ తీసే క్రమంలో బస్సు వెనక నిలబడి ఉన్న వెంకటేష్ ప్రమాదవశాత్తు రెండు బస్సుల మధ్య చిక్కుకొని నలిగిపోయాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నష్టపరిహారం చెల్లించాలి... కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీయం, బీఎల్ఎఫ్ నాయకులతో పాటుగా వివిధ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. వెంకటేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని కార్మికుడిని బస్సు మరమ్మతులకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో కారణంగా వెంకటేష్ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడు వెంకటేష్ కుటుంబానికి పరిహారం అందజేస్తామని టీఆర్టీసీ డీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నాయకులు దంగు శ్రీనివాస్‌యాదవ్, శివశంకర్‌గౌడ్, ఎన్.రాజు, బుద్దుల జంగయ్య, నాగరాజు, ఈశ్వర్ నాయక్, అల్వాల దర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీ సేవకు ‘బదిలీ’ బహుమానం!
సాక్షి, భూపాలపల్లి : పని చేసిన 11 నెలల్లోనే ఆయన తన మార్క్ చూపించారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీల ఆట కట్టించారు. పల్లెల్లో విచ్ఛలవిడిగా వెలసిన బెల్ట్‌షాపుల బెల్ట్ తీశారు. కొందరు పెద్దమనుషులు చేసే సెటిల్మెంట్లను కట్టడి చేశారు. అక్కమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న కాటారం సీఐ శంకర్‌రెడ్డి అనతికాలంలోనే బదిలీని బహుమతిగా అందుకున్నారు. దీని వెనక ఇసుకాసురుల లాబీయింగో.. అధిక పార్టీ నేతల ఒత్తిడో బలంగా పని చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒత్తిళ్లతోనే బదిలీ ? జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు అనంతరం సీఐ శంకర్‌రెడ్డి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తించారు. ఆయన పనితీరును గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కీలకమైన కాటారం సర్కిల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ సాఫీగా పని చేస్తున్న క్రమంలోనే హఠాత్తుగా జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కి తిరిగి బదిలీ చేశారు. అయితే సీఐ బదిలీ వెనుక ఇసుకాసురుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక లోడ్‌తో వెళ్లే ఇసుక లారీలను అరికట్టడం, అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించడం మూలంగానే కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పోలీసు ఉన్నతాధికారులపై రాష్ట్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఐ బదిలీని రద్దు చేయాలని, ఇక్కడే కొనసాగించాలంటూ పలు ప్రజాసంఘాల నాయకులు స్వయంగా కాటారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడం, టీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చడంతో అనుమానాలు బలపడుతున్నాయి. వందలాది కేసులు.. అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా కాటారం డివిజన్లో జరిగే అనేక అక్రమ కార్యకలాపాలను సదరు సీఐ నిరోధించారనే పేరుంది. గుట్కా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, బెల్ట్‌షాపులు, క్యాట్ ఫిష్ రవాణాను ఆశించిన స్థాయిలో నివారించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. క్యాట్‌ఫిష్‌లను తరలిస్తున్న 7 వాహనాలు, అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 10 వాహనాలు, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 20 లారీలు, 150 ఓవర్‌లోడ్ ఇసుక లారీలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. 25 మంది గుడుంబా తయారీ, విక్రయదారులు, 40 మంది బెల్టుషాపు నిర్వాహకులపై కేసులు పెట్టారు. 20 మంది గుట్కా విక్రయదారుల పట్టివేతతోపాటు ఏకంగా 20 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. గురువారం సైతం అధిక లోడ్‌తో వెళ్తున్న 36 ఇసుక లారీలను పట్టుకొని కేసు నమోదు చేనినట్లు తెలిసింది. విధి నిర్వహణతో కచ్చితంగా ఉండే పోలీసు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడంపై పోలీసుశాఖలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు భరోసా.. కాటారం ఠాణాకు వచ్చిన పంచాయతీలన్ని పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలోని మామిడి చెట్టు కింద కొందరు పెద్ద మనుషులు సెటిల్మెంట్లు చేస్తారనే ఆరోపణలు ఉండేవి. కాగా శంకర్‌రెడ్డి విధుల్లో చేరిన అనంతరం ఈ పంచాయతీలకు చెక్ పెట్టడంతో సామన్య ప్రజలు సైతం పెద్ద మనుషులను ఆశ్రయించకుండా నేరుగా స్టేషన్‌కు వచ్చేదని స్థానికులు తెలుపుతున్నారు. -
తుందురులో ఉద్రిక్తత
-
మత్స్యపురిలో ఉద్రిక్తత.. సెల్ టవర్ ఎక్కిన మహిళ
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని పలు మండలాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు పనులకు వ్యతిరేకంగా మరోమారు ప్రజలు ఆందోళనలు చేపట్టారు. గురువారం వీరవాసరం మండలం మత్స్యపురిలో ఆక్వాఫుడ్ పార్క్ పనులను వ్యతిరేకిస్తూ అరేటి సత్యవతి అనే మహిళ సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. సత్యవతి గతంలో తుందుర్రు ఆక్వాపార్కు వ్యతిరేక పోరాట కమిటీ తరపున ఉద్యమం చేసి ఐదు నెలల పాటు జైలుకు వెళ్లారు. కొప్పర్రులో సెల్ టవర్ ఎక్కిన మరో ఇద్దరు రైతులు భీమవరం : తుందుర్రు గ్రామంలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్వాఫుడ్ పార్కు కోసం వేస్తున్న పైప్ లైన్ పనులు నిలిపివేయాలంటూ ఇద్దరు రైతులు కొప్పర్రులో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. తుందుర్రు గ్రామస్థుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆక్వాఫుడ్ పార్క్ కోసం పైపులైన్ల నిర్మాణానికి అధికారులు యత్నించారు. పైపులైన్ల నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకుంటారనే నెపంతో గ్రామంలో భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. ఇళ్లలో నుంచి గ్రామస్తులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. -
వైద్యం వికటించి యువతి మృతి
గజ్వేల్‌రూరల్ : ఓ యువతి అబార్షాన్ కోసం గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రాగా అధిక రక్తస్రావంతో మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరగ్గా... బుధవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. వైద్యాధికారులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ పట్టణంలోని పద్మసాయి ఆసుపత్రిలో మంగళవారం రాత్రి సమయంలో రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన ఓ యువతి(22) అబార్షన్‌కోసం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చింది. చికిత్స అందిస్తున్న క్రమంలో యువతికి అధిక రక్తస్రావం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా... మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. యువతి మృతి చెందిన విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో బలరాం ఆధ్వర్యంలోని వైద్యబృందం గజ్వేల్‌కు చేరుకొని ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కరుణసాయి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ డీఎఅండ్‌హెచ్‌వో బలరాం ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఐఎంఏ శాఖ సభ్యులు పద్మసాయి ఆసుపత్రికి చేరుకొని వైద్యాధికారులను నిలదీశారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ఆసుపత్రులు కొనసాగుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లుగా గతంలోనే వైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. -
పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ధర్నా
హైదరాబాద్ : వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని, ఫలితాల వెల్లడికి అడ్డుగా ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని పశు సంవర్థక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.గణేష్ రెడ్డి ప్రసంగించారు. వెటర్నరీ అసిస్టెంట్ నియామకాల పరీక్ష రాసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఫలితాల ప్రస్తావన లేకుండా పోయిందని ఆరోపించారు. కోర్సులు పూర్తి చేసుకుని నోటిఫికేషన్ కోసం పదేళ్లుగా వేచి చూశామని అన్నారు. అలాంటి సందర్భంగా కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకుని పరీక్షలు రాసిన అభ్యర్థులందరూ అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి.ప్రణయ్ భరత్, దివాకర్, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీను, పి.మహేందర్, అనిల్, ఎం.చక్రవర్తి, తెలంగాణ డాక్టర్ల సంఘం అధ్యక్షులు కె.శ్రీధర్ పాల్గొన్నారు. -
పక్కింటి వారి వేధింపులు భరించలేక..
కరీమాబాద్ : నగరంలోని రంగశాయిపేట కాపువాడలో ఓ హమాలీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కూతురు స్వర్ణలత, భార్య రమలతో పాటు మిల్స్‌కాలనీ ఎస్సై రాజన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రంగశాయిపేట కాపువాడలో ఉంటున్న హమాలీ కార్మికుడు మద్ది రాజయ్య(53) ఇంటి పక్కనే ఉన్న మోసం శ్రీలత, నాగరాజు తమ ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని రాజయ్యకు 2008 అమ్మారని, కాగా, ఆ స్థలాన్ని రాజయ్య తన అల్లుడు కొండ కుమార్‌కు ఇవ్వగా అతను ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకుని రాజయ్యతో పాటు అతని భార్య రమలను అందులోనే ఉంచి తాను హైదరాబాద్‌లో ఉంటున్నాడని వివరించారు. ఈ క్రమంలో ఆ స్థలం అసలు రాజయ్యకు తాము అమ్మలేదని, ఆ స్థలం తమదేనని ఇంటిపక్కనే ఉన్న మోసం శ్రీలత, నాగరాజు తరుచూ రాజయ్యను వేధిస్తుండడంతో పాటు పలుమార్లు పెద్ద మనుషుల మద్య, మిల్స్‌కాలనీ పోలీస్టేషన్ వద్ద కూడా పంచాయతీ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాజయ్య మృతికి కారణమైన మోసం శ్రీలత, నాగరాజుల ఇంటిముందు కొద్దిసేపు నిరసన తెలిపి తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్పొరేటర్ కేడల పద్మాజనార్ధన్, నాయకులు కొప్పుల శ్రీనివాస్, కొంతం మోహన్ తదితరులు సంఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అశ్రునయనాల మధ్య స్వప్న అంత్యక్రియలు
గన్నేరువరం(మానకొండూర్) : వరకట్న వేదింపులకు బలైన మండలంలోని గుండ్లపల్లికి చెందిన కట్కూరి స్వప్న అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. భార్య చనిపోయిన చూసేందుకు భర్త రాకపోవడంతో మృతురాలి తండ్రి, కూతురే చితికి నిప్పుపెట్టారు. స్వప్న మృతికి కారకులైన వారిని శిక్షించే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే, గ్రామస్తుల హామీతో మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంత్యక్రియలతో సద్దుమణిగాయి. ఈనెల 31న మృతి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కట్కూరి స్వప్న ఈనెల 31న ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీపాల్‌రెడ్డి, అత్తామామ అరుణ–అంజిరెడ్డి వేదింపులతోనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి కుటుంబసభ్యులు అత్తవారింటి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు ఆస్తిని మృతురాలు కూతుళ్లు విస్మయ, విన్నత్న పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అంగీకరించిన అత్తారింటి వారు అనంతరం పరారవడంతో ఆందోళన ఉధృతం చేశారు. గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై రాస్తారోకో సైతం చేశారు. ఇలా ఐదు రోజులుగా హైడ్రామాల మధ్య స్వప్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. మృతురాలి కుటుంబానికి గ్రామస్తులు, వివిధ పార్టీలు, సంఘాల నుంచి మద్దతు పెరిగింది. ఎమ్మెల్యే, గ్రామస్తుల హామీతో.. నాలుగో రోజు ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. పిల్లలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, దహనసంస్కారాలు నిర్వహించాలని సూచించారు. ఐదోరోజు సోమవారం గ్రామస్తులు కలిసి దహనసంస్కారాలు నిర్వహించాలని సర్పంచ్ చాడ కృష్ణామోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కోరారు. ఎలాంటి పరిస్థితుల్లోనైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటామని ఒప్పంద హామీ ఇచ్చారు. దీంతో స్వప్న అంత్యక్రియలకు కుటుంబసభ్యులు అంగీకరించారు. నిప్పుపెట్టిన తండ్రి, కూతురు ఐదు రోజులు శవంతో ఆందోళన చేసిన కుటుంబసభ్యులు అశ్రునయనాల మధ్య స్వప్న మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించారు. భార్య మృతి చెందిన కనికరం లేకుండా భర్త పరారీలో ఉండడంతో మృతురాలు తండ్రి వెంకటప్రకాశ్, పెద్ద కూతురు విస్మయతో కలిసి నిప్పుపెట్టారు. స్వప్న చితికి నిప్పుపెడుతున్న తండ్రి, కూతురు పోలీసుల వైఫల్యమే : డాక్టర్ నగేశ్ పోలీసుల వైఫల్యంతోనే నిందితులు తప్పించుకున్నారని, వారిని వెంటనే అరెస్ట్ చేసి మృతురాలు కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ డిమాండ్ చేశారు. గుండ్లపల్లిలో భర్త ఇంటి వద్ద శవంతో ధర్నా చేస్తున్న స్వప్న కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సమంజసంకాదన్నారు. న్యాయం దక్కే వరకు అండగా ఉంటామని మృతురాలి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్‌వర్మ, జిల్లా కార్యదర్శి డీటీ సుధాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచమల్ల నర్సయ్య, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకటి అనిల్ ఉన్నారు. -
పెట్రో ధరల పెంపుపై సర్వత్రా నిరసన
నిజామాబాద్ సిటీ : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రభారం పడుతోందని డీసీసీ అధ్యక్షుడు తాహెర్ అన్నారు. శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఆటోను తాడుతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ చమురు సంస్థలు ఇష్టానుసారంగా ధరలు పెంచటంతో వాహనదారులపై తీవ్ర భారం పడుతోందన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ మాట్లాడుతూ యూపీఏ హయంలో 140 డాలర్లుకు లభించే బ్యారల్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండేవని, ప్రస్తుతం 80 డాలర్లకే బ్యారల్ ఉన్న ఆల్ టైం ధరలు ఉన్నాయన్నారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిగి బతుకు భారంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డి, యూత్ నాయకులు నాగరాజు, కిషోర్, రాథోడ్, బిన్ని, ఆకుల మహేందర్, మధుకర్, విజయ్, నరేందర్, దత్తాద్రి, చింటు, అదర్స్, మున్నా, ఏఎల్ రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. వర్నిలో ఆటోలను లాగుతూ.. వర్ని(బాన్సువాడ): రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోకు తాడు కట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్ని క్రాసింగ్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ హరిబాబుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా వర్నిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్లం సాయరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో డీజిల్ ధరలను నియంత్రించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రంజ్యానాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గంగా ప్రసాద్, ఎస్‌ఎన్‌పురం టౌన్ అధ్యక్షుడు ప్రశాంత్ పటేల్, విండో మాజీ డై రక్టర్ సురేష్ బాబా, మండల నాయకులు మో స్రా లక్ష్మణ్, గైని గోపి, మల్లికార్జునప్పా, నాగేశ్వర్రావ్, సలీం, ఖాసీం, ఆటో యూనియన్ నాయకు లు ఫెరోజ్, ఆజాం తదితరులు పాల్గొన్నారు. ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో.. వర్ని మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పెట్రో ధరల పెంపుపై ఆటో కార్మికుల నిరసన తెలిపారు. ప్రతి రోజు ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్ కార్యాలయానికి తహసీల్దార్ హరిబాబుకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ట్రాలీ ఆటో యూనియన్ సంఘం అధ్యక్షుడు కె శ్రీనివాస్, ఉపాద్యాక్షుడు మారుతి, మాణిక్యం, బాబుమియా, సాయిలు, కృష్ణ, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్యెల్యే బాబూమోహన్‌కు నిరసన సెగ
రేగోడ్(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు కార్యక్రమంలో అందోల్ ఎమ్యెల్యే పి.బాబూమోహన్‌కు నిరసన సెగ తగిలింది. కారును అడ్డుకుని బాబూమోహన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు ఎమ్యెల్యే తన కారులోనే ఉండిపోయారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని సిందోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రైతుబంధు కార్యక్రమంలో భాగంగా సిందోల్ గ్రామంలో ఆదివారం రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందోల్ ఎమ్యెల్యే పి.బాబూమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకోగానే గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు ఎమ్యెల్యే కారును అడ్డుకున్నారు. కారుముందు ఉండి బాబూమోహన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లుగా రోడ్డును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నిరసన కారుల తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యంతో ఎమ్యెల్యే కారు చెక్కుల పంపిణీ కార్యక్రమం వద్దకు కదిలింది. ఎవడ్రా ఫొటోలు తీసేది.. నిరసన కారులు పక్కకు వెళ్లిన అనంతరం కారులో నుంచి కిందకి దిగుతున్న తనను విలేఖరులు ఫొటోలు తీస్తుండటాన్ని గమనించిన బాబూమోహన్‌కు ఎవడ్రా ఫొటోలు తీసేదంటూ విలేఖరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. మేము విలేఖరులం.. మీ వార్తలు కవర్ చేయడానికే వచ్చాం. మాకు స్వేచ్ఛ ఉంది.. వద్దంటే వెళ్లిపోతామంటూ బాబూమోహన్‌తో విలేఖరులు తెలిపారు. -
కార్మికుడి మృతిపై అనుమానాలెన్నో..
లక్కవరపుకోట : మండలంలోని గేదులవానిపాలెం గ్రామానికి చెందిన గేదుల వెంకటరావు (42) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామస్తులందరూ గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. వెంకటరావు శ్రీరాంపురం గ్రామ సమీపంలో గల స్టీల్ ఎక్సే్ఛంజ్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం కర్మాగారంలో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా పడిపోయాడు. దీంతో కర్మాగార ప్రతినిధులు స్పందించి ప్రథమ చికిత్స అందించి విశాఖపట్నం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సాధారణ మరణమే అయితే మృతుడి తల వెనుక భాగంలో దెబ్బ ఎందుకు తగిలిందని బంధువులు, కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. వెంకటరావు మృతి వెనుక ఏదో తతంగం జరిగి ఉంటుందని కుటంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగిన బంధువులు ఇదిలా ఉంటే వెంకటరావు మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గేదులవానిపాలెం, వేచలపువానిపాలెం, గనివాడ గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కర్మాగారం గేటు వద్దకు చేరకుని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని బంధువులు స్పష్టం చేశారు. ఇందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన డీఎస్పీ పరిహారం అందజేయాలని కోరుతూ మృతుని కుటుంబీకులు, ఎంపీపీ కొల్లు రమణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావు, గేదులవానిపాలెం, గనివాడ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు గేదుల నర్శినాయుడు, మల్లు నాయుడు, గేదుల శాంత, తదితరులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న విజయనగరం డీఎస్పీ ఏవీ రమణ, ఎస్.కోట సీఐ వై. రవి రంగలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్యం ఇచ్చిన పరిహారం తీసుకోవాలని...లేనిపక్షంలో కేసు పెట్టుకోవచ్చని మృతుని కుటుంబ సభ్యులకు డీఎస్పీ వివరించారు. అనంతరం మరోసారి ఆందోళనకారులు, యాజమాన్యం చర్చించగా, ఆరు లక్షల రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు. -
మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం
-
తాగు, సాగునీరివ్వాలని ధర్నా
అనంతపురం అర్బన్: తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు తాగు, సాగు నీరివ్వాలని అక్కడి గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. ఈ క్రమంలో తాడిపత్రి పరిధిలోని మండలాలకు చెందిన రైతులు, ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత 50 ఏళ్లగా తమ ప్రాంతాలకు మొదటి విడతలో నీరు ఇవ్వడం లేదన్నారు. రెండో విడతలో అరకొరగా ఇస్తుండటంతో చివరగా ఉన్న చెరువులకు నీరు చేరడం లేదన్నారు. దీంతో తాగు, సాగు నీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ సారైనా తమకు ముందుగా నీటిని ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటేశ్వర్లు, మల్లికార్జున, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ బయట ప్రజల నిరసన
-
ప్రాణాలు పోయిన పోరటం అపేదిలేదు
-
ఖాళీ బిందెలతో ధర్నా
నెల్లూరు(అర్బన్): తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం 26వ డివిజçన్ కమిటీ ఆధ్వర్యంలో బుజబుజనెల్లూరు వాసులు గురువారం ఖాళీ బిందెలతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్, సీపీఎం రూరల్ నియోజకవర్గ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడారు. 20 రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అçప్పట్లో తాము చేసిన కృషితో కేంద్ర ప్రభుత్వం రూ.1.05 కోట్లతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించిందని చెప్పారు. కార్పొరేషన్లో తమ ప్రాంతం విలీనమయ్యాక సమస్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్‌కు ఉన్న నిధుల్లో కొంత ఖర్చు చేసి మోటార్ మరమ్మతులను చేపట్టాలని విన్నవించారు. తాగునీటిని వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. శాఖ కార్యదర్శి కొండా ప్రసాద్, నాయకులు బాబు, రమణయ్య, దశయ్య, రవి, బాలయ్య, వెంకటేశ్వర్లు, తిరుపాలు, ఐద్వా నాయకులు జబీనా, పద్మావతి, లావణ్య, లక్ష్మి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
అట్టుడికిన ఇనుగుర్తి... టవర్ దిగని యువకులు
వరంగల్ :వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే తప్ప టవర్ దిగేది లేదంటూ యువకులు పట్టుబట్టారు. ఇప్పటికి దాదాపు 22 గంటలుగా ఐదుగురు యువకులు టవర్ మీదే ఉండిపోయారు. అధికారులు నేరుగా ప్రకటన చేస్తేనే తాము కిందికి దిగి వస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇనుగుర్తి బంద్ పాటించారు. వివిధ ప్రాంతాల్లోని సెల్ టవర్, వాటర్ ట్యాంకులపైకి మండల సాధన సమితి సభ్యులతోపాటు యువకులు ఎక్కి ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నూతన మండలాల ప్రకటనలో ఎక్కడా ఇనుగుర్తి ప్రస్తావన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం హామీ ఇచ్చారని... ఇనుగుర్తి మండలం వస్తుందని... ఇన్నాళ్లు వేచి ఉన్నామని... ఇప్పుడు తమ ఆశ నిరాశ అయిందని వారు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టినందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామస్తులు దహనం చేశారు. అయితే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు తాము దిగేది లేదని... సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులు భీష్మించుకున్నారు. దీంతో వారు సెల్ టవర్ ఎక్కి 22 గంటలు అయినా కిందకి దిగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు. -
కడపలో భారీ వర్షం
కడప : గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కడప నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్కే నగర్, ఏఎస్ఆర్ నగర్, బుడగజంగాల కాలనీ, మృత్యుంజయ కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సదరు ప్రాంతాల్లో ఇళన్నీ నీట మునిగాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం కనీసం పరామర్శించిన పాపాన పోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా వర్షపు నీటిలో కాలనీ వాసులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. -
దేవుని విగ్రహాలు ధ్వంసం
కరీంనగర్: ఆలయంలోకి చొరబడిన దుండగులు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని సీతారామ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని గత రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
కొబ్బరి చెట్టుతో 'వాలెంటైన్స్ డే'
రాష్ట్రంలో పరిరక్షించాల్సిన వృక్షజాతి జాబితా నుంచి కొబ్బరిచెట్టును గోవా ప్రభుత్వం గత నెలలో తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీని ఈసారి 'కోకోనట్ వాలెంటైన్'గా వినూత్నంగా జరుపుకోవాలని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గోవా ప్రజలు నిర్ణయించారు. పరిరక్షణ చెట్ల జాబితా నుంచి కొబ్బరిచెట్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కూడా జనవరి 14వ తేదీ కావడం గమనార్హం. గోవా వాసులకు కొబ్బరిచెట్లంటే ప్రాణం. వాటిని వారు కల్పవృక్షాలుగా, సాంస్కృతిక సంపదగా పరిగణిస్తారు. అత్యవసరమై ఓ కొబ్బరి చెట్టును కొట్టివేయాలంటే అనుమతి కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉన్నా వారెన్నడూ బాధ పడలేదు. ఇప్పుడు ఇష్టానుసారం కొబ్బరిచెట్లను కొట్టివేసేందుకు ప్రభుత్వం అనుమతించడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 'ప్రజల్ సఖార్దాండే ఆఫ్ గోవా హెరిటేజ్ యాక్షన్ గ్రూప్' లాంటి సంస్థల పిలుపు మేరకు ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ చెట్ల పట్ల తమకున్న ప్రేమాభిమానాలు చాటాలనుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచే 'కోకోనట్ వాలెంటైన్' ఆందోళన కార్యక్రమం ప్రారంభమై ఫిబ్రవరి 14వ తేదీన ముగుస్తుంది. ఈ వారం రోజులు పిల్లలు, పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు కొబ్బరి చెట్ల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తూ వాటివద్ద ఫొటోలు దిగుతారు. వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కామెంట్లు షేర్ చేసుకుంటారు. -
తోటపల్లి నిర్వాసితుల ఆందోళన, అరెస్టు
పార్వతీపురం: విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు తోటపల్లి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్వాసితుల వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితుల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించక ముందే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందు నిర్వాసితులు సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న నిర్వాసిత బాదితుల సంఘం రాష్ర్ట నాయకులు బంటుదాసు, సదానందంలను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి రానున్న సీఎం సమస్యలపై నిలదీస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ అరెస్ట్‌ల ప్రకియ ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
మల్లయ్యకొండ జోలికొస్తే ఖబడ్దార్
-
అధినేతల ధోరణే అసలు సమస్య..
కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరించడం వ ల్లే ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది. పదవులు, హోదాలు పొంద డంతోనే పని పూర్తికాదు. అది ఆరంభం మాత్రమే. ఆ తర్వా త ఆ వ్యక్తి తన పాలనకు అను గుణంగా తన చుట్టూ వున్న వ్యవస్థను, విధివిధానాలను దశ, దిశను రూపొందించుకో వాలి. అవి పాలన అవసరా లకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. ఎవరైనా మొదటి దశలోనే తను అనుకున్నవన్నీ సాధించలేరు. అతనికి ఇచ్చే స్వేచ్ఛపైనా, ప్రభుత్వం అందించే సహకారంపైనా, అతను ఏ మేరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు అనే అంశాలపైన అతని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఉదా హరణకు ఒక వైస్‌చాన్సలర్‌కి ఆ పదవి యిస్తే అదొక ఉద్యోగంలా వెనువెంటనే ఫైళ్ళు తిరగేసి యూనివర్సిటీ బాధ్యతలు నిర్వర్తిస్తానంటే కుదరదు. ఎందుకంటే ఆ వీసీ గానీ మరే హోదాలో ఉన్న వ్యక్తి అయినాగానీ తనకి ఉన్న సదుపాయాల్లో ఆర్థిక వనరుల్లో తను ఏమేం చేయ గలడు. ఇంకా ప్రభుత్వ సహకారం ఏ మేరకు అవసరం, ప్రభుత్వం ఆ వీసీని పూర్తి స్వేచ్ఛగా పని చేయనిస్తోందా లేదా? లాంటి సవాలక్ష ప్రశ్నలు అతని పనిపైన ప్రభా వం చూపుతాయి. ఈ అన్ని ప్రశ్నలకూ అతనికి సాను కూల సమాధానాలు దొరికినప్పుడే ఆ యూనివర్సిటీ బాధ్యతలను అతను సక్రమంగా నెరవేర్చడం సాధ్యం అవుతుంది. అలాగే ఒక ప్రధాని కూడా గెలవడంతోనే సరిపోదు. తన ఎజెండాని ప్రజలతో ఒప్పించగలగాలి. దానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రజల అంగీకారం లేకుండా ఏకపక్షంగా తన ఎజెండాని అమలు చేసిన కొందరు ప్రధానులు నాయకులుగా గెలిచినా పాలకులుగా ఓడిపోతారు. మన దేశ ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కు మొదట పాలనానుభవం లేదు. ఆయన రాజకీయ ఉద్యమ నాయకుడు మాత్రమే. దేశంలో మతప్రాతిపది కపై తలెత్తే పరిణామాలు సరిదిద్దుకోకపోతే దేశం విచ్ఛి న్నం అవుతుంది. ప్రజల ఎజెండాను తీసుకొని తనకు, ప్రజలకు మధ్య వారధిని ఏర్పాటు చేసుకోవాలి. ఐక్యత, సమైక్యత పట్ల సరియైన దృక్పథం అలవర్చుకోవాలి. అందుకే నెహ్రూ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన ఎజెండాను ప్రజలతో అంగీకరింప జేసుకున్నాడు. ఆ రోజుల్లో దేశ సమైక్యతే ప్రధానమైన ఎజెండా అయింది. దేశంలోని అన్ని ప్రాంతాలను ఒక గొడుగు కిందికి తేవ డంలో ఆయన సఫలీకృతం అయ్యారు. అనేక మతాలు, జాతులు, భాషలు ఉన్న ఈ ప్రాంతంలో ఒకలౌకికవాద పాలనను అందించడం అంత సులువేమీ కాదు. అయితే నెహ్రూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచ రణను రూపొందించుకున్నారు. ఆర్థికాభివృద్ధికి ప్రజల కు అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రణాళికా సంఘా న్ని ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ రష్యా అనుభ వం ఆయనకు ఒక స్ఫూర్తిగా తోడ్పడింది. అయితే ఈ రోజు దేశ నాయకత్వానికి అటువంటి దృక్పథం కొరవడింది. మతతత్వం, కుల అణచివేత, మహిళలపై దౌర్జన్యాలు, దేశ సమగ్రత ప్రధాన సమస్య లుగా మారాయి. దేశంలో ఇటీవల మైనారిటీ మత సంస్థలపై పెరిగిన దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి. చాలా దేశాలు భారతదేశ వైఖరిని బహిరంగంగానే తప్పు పడుతున్నాయి. దేశంలో పదికోట్ల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళు అభద్రతా భావానికి లోనయ్యేటట్టు ప్రభుత్వాధి నేతలు ప్రవర్తించడం ప్రమాదకర ధోరణి. మైనారిటీ లను విశ్వాసంలోకి తీసుకొని రక్షణ కల్పించాల్సిన బాధ్య త మెజారిటీ ప్రజలది, ప్రభుత్వాలది. అయితే కొంత మంది మైనారిటీలు మతతత్వంతో వ్యవహరిస్తున్నారని వాదిస్తుంటారు. అయితే మైనారిటీ మతతత్వం కన్నా మెజారిటీ మతతత్వం అత్యంత ప్రమాదకరమైనది. ఈ దేశంలో కుల వివక్ష, పీడన ఎక్కడ చూసినా కనపడుతోంది. దళితులపై, ఆదివాసీలపై సాగుతున్న అత్యాచారాలు ఇందుకు ఉదాహరణ. అలాగే మహిళల కు రక్షణ కరువైంది. స్త్రీలపై పెరుగుతున్న గృహహింస కుటుంబాల విచ్ఛిన్నానికి దారితీస్తోంది. కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరిం చడం వల్ల ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది. అందుకే పాలకులు ప్రజల ఎజెండాను విస్మరించకుండా, ప్రజల ఎజెండానే పాలకుల కార్యక్రమంగా మలచుకొని పాలన సాగిం చాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు నడిపే వాళ్ళు ప్రజాపాలకులు అవుతారు. - చుక్కా రామయ్య, వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త -
గుంటూరు జిల్లా జన్మభూమిలో గందరగోళం
-
విజయవాడ మిన్సిపల్ ఆఫీసు ముట్టడి