పార్వతీపురం: విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు తోటపల్లి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్వాసితుల వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితుల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించక ముందే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముందు నిర్వాసితులు సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న నిర్వాసిత బాదితుల సంఘం రాష్ర్ట నాయకులు బంటుదాసు, సదానందంలను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి రానున్న సీఎం సమస్యలపై నిలదీస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ అరెస్ట్‌ల ప్రకియ ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.