ధర్మపోరాటం నిరసన కార్యక్రమంలో ఆపస్ జిల్లా నాయకులు
విజయనగరం, అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని ఆపస్ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘ధర్మపోరాటం’ పేరుతో చేపడుతున్న పోరాటంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసులు వెంటనే అమలు చేయాలని, ఎస్‌జీటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు.
11వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే తెప్పించుకొని మధ్యంతర భృతి 40 శాతం ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారుడు యూఏ నరసింహం, జిల్లా గౌరవ అధ్యక్షుడు బీఏ జగన్నాథం, జిల్లా అధ్యక్షుడు రామినాయుడు, ప్రధాన కార్యదర్శి వీఎస్‌వీఎస్ శాంతిమూర్తి, జిల్లా గౌరవ సలహాదారులు నరసింహం, కోశాధికారి ఆర్.రామినాయుడు, మహిళా విభాగం నాయకులు ఎ.కృష్ణవేణి, ఎ.శ్రీదేవి, పి.అపర్ణ, రమణ, భారతి, ప్రధానోపాధ్యాయులు ఎంఏ గుప్తా, నారాయణరావు, వీవీ శ్రీహరి, జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment