
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు.
మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్!
Comments
Please login to add a commentAdd a comment